Bigg Boss 5 Telugu Day 2 Highlights: Jaswanth Jessie, Hamida Cat Issue Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu:బిగ్‌బాస్‌ ఇంట్లో పిల్లి లొల్లి.. జెస్సీ కంటతడి

Published Tue, Sep 7 2021 1:19 PM | Last Updated on Tue, Sep 7 2021 4:40 PM

Bigg Boss 5 Telugu: Cat Issue In Bigg Boss House - Sakshi

బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్ర‌వ‌ర్సీలు.. ఒక‌రినొక‌రు అరుచుకోవ‌డం.అయితే ప్ర‌తీసారి సీజ‌న్ మొద‌లైన త‌ర్వాత క‌నీసం వారం రోజుల త‌ర్వాత ఈ చిచ్చు మొద‌లవుతుంది. కానీ ఐదో సీజన్‌లో మాత్రం రెండు రోజుల‌కే ర‌చ్చ మొద‌లైపోయింది. నామినేషన్‌ ప్రక్రియలో జెస్సీ, హమిదా మధ్య పిల్లి లొల్లి మొదలైంది. ఇంతకీ మ్యాటర్‌ ఏంటంటే.. లోబో గురకతో విసిగెత్తిపోయిన జెస్సీ, హహీదా, శ్వేతా వర్మ.. గార్డెన్‌ ఏరియాలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు.
(చదవండి: బిగ్‌బాస్‌: తొలి వారం నామినేషన్‌లో ఆరుగురు, లిస్ట్‌ ఇదే!)

ఈ సందర్భంగా హమీదా తన పెంపుడు పిల్లి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. సాధారణంగా పిల్లులు మ్యావ్‌ అని అరుస్తాయి. కానీ తన పిల్లి మాత్రం మా.. అమ్మా అని పిలిస్తాయాని చెప్పింది. వాటికి చిన్నప్పటి నుంచి బయట ప్రపంచం తెలియకుండా ‘అమ్మా’అనే మాటలను ప్రాక్టీస్‌ చేయించానని, అందుకే అవి అలా పిలుస్తాయని చెప్పింది. అది విని జెస్పీ షాకయ్యాడు. అంతేకాదు తన వద్ద కుక్క కూడా ఉందని హమీదా చెప్పగా... కుక్కలు ఏమంటాయ్‌? డాడీ అని పిలుస్తాయా?అని సరదాగా అన్నాడు.

ఆ మాటలకు హర్ట్‌ అయినా హమీదా.. ఈ విషయాన్ని మిగతా ఇంటి సభ్యులతో పంచుకుంది. దీంతో జెస్సీ ఫైర్‌ అయ్యాడు. నేను సరదాగా అన్నానని, అయినా అక్కడే నేను సారీ కూడా చెప్పాను. మళ్లీ ఎందుకు ఆ విషాయాన్ని ప్రస్తావిస్తున్నావని కోపగించాడు. దీని కారణంగానే హమీదాతో పాటు  విశ్వ, యానీ మాస్టార్‌ అతడిని ఎలిమినేషన్‌కి నామినేట్‌ చేశారు. ఆ సమయంలో జెస్సీ ఎమోషనల్‌కు గురయ్యాడు. ఇలా మొత్తానికి పిల్లి లొల్లి వల్ల జెస్సీ ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యాడు. ఇక హమిదా పిల్లి వ్యాఖ్యలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఉన్నారు. మరి వీరిలో ఎమినేట్‌ అవుతారో తెలియాలంటే వీకెండ్‌ వరకు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement