Bigg Boss 4 Fame Mehaboob Dil Se Proposed To Swetha Naidu: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మెహబూబ్ గతేడాది బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలె 'గుంటూరు మిర్చి' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించాడు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్ శ్వేత నాయుడుకు ప్రపోజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెహబూబ్ ఎక్కువగా శ్వేత నాయుడుతోనే రీల్స్ అప్‌లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు.
'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అంటూ తన మనసులో మాటను రివీల్ చేశాడు. దీంతో శ్వేత సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ ఇది రియల్ వీడియోనా లేక యూట్యూబ్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment