రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా నుంచి అలా పాటలు రిలీజ్ చేయగానే ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్యే రా మచ్చా మచ్చా పాట విడుదలవగా దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన రీల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇలా రీల్స్, షార్ట్స్ చేయడానికి కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు చిత్రయూనిట్ డబ్బు చెల్లించిందంటూ ఓ ప్రచారం జరుగుతోంది.
రీల్‌కు రూ.10 వేలు?
ఈ వ్యవహారంపై బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్‌సే స్పందించాడు. ఆ ప్రచారం నిజమేనంటూ తాను చాటింగ్ చేసినట్లు వైరలవుతున్న ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఇది ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆ స్క్రీన్‌షాట్‌లో ఏముందంటే.. రీల్ చేయడానికి రూ.10,000 ఇస్తున్నారు కదా? అని ఓ నెటిజన్ అడిగాడు. అందుకు మెహబూబ్.. అవును, రీల్స్ చేయమని రూ.80 వేలు పంపారు. ట్యాగ్స్ కూడా వాళ్లే ఇచ్చారు అని రిప్లై ఇచ్చినట్లుగా ఉంది.
ఎడిటింగ్‌లో టాలెంట్ బానే ఉంది
'నేనే స్వయంగా రిప్లై ఇచ్చినట్లు బాగానే ఎడిట్ చేశారు. చాలా టాలెంట్ ఉంది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు' అని క్లారిటీ ఇచ్చాడు. స్క్రీన్ రికార్డింగ్ వీడియో కూడా పెడితే నిజంగా ఆ చాట్ ఎవరు చేశారన్న నిజం బయటకు వస్తుందన్నాడు. మెహబూబ్ బిగ్‌బాస్ 8వ సీజన్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
సినిమా..
గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, ఎస్‌జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్‌కు విడుదల కానుంది.
చదవండి: మృణాల్ ఠాకూర్ సోదరి గురించి తెలుసా? ఈమెను అందంగా..
Comments
Please login to add a commentAdd a comment