నీ చేతుల్లో మ్యాజిక్‌ ఉంది.. నీ ప్రేమకు ఫిదా: మృణాల్‌ ఠాకూర్‌ | Mrunal Thakur to Lochan Thakur, You Are my Forever Soulmate | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ సోదరి గురించి తెలుసా? ఈమెను అందంగా..

Published Sat, Oct 5 2024 4:38 PM | Last Updated on Sat, Oct 5 2024 4:45 PM

Mrunal Thakur to Lochan Thakur, You Are my Forever Soulmate

సీతారామం సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది మృణాల్‌ ఠాకూర్‌. అటు సినిమాల్లో ఇటు బయట ఎంతో అందంగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె సోదరి లోచన్‌ ఠాకూర్‌. ఈమె మేకప్‌ ఆర్టిస్ట్‌. మృణాల్‌ మొదటి సినిమా నుంచే కాదు తన చిన్నప్పటినుంచి ఆమెను అందంగా ముస్తాబు చేస్తూనే ఉంది.

నా సోదరివి మాత్రమే కాదు!
లోచన్‌ బర్త్‌డే సందర్భంగా మృణాల్‌ తన సోదరితో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. నన్ను మీరాబాయిగా, చిన్ని కృష్ణుడిగా, రాజస్తానీ డ్యాన్సర్‌గా ఎప్పుడూ ఏదో ఒక గెటప్‌లో రెడీ చేస్తూ వచ్చావు. అంతేనా.. సూపర్‌ 30, హాయ్‌ నాన్న చిత్రాల్లోనూ మ్యాజిక్‌ సృష్టించావు. నీ క్రియేటివిటీకి, ఓపికకు, ప్రేమకు సర్వదా కృతజ్ఞురాలిని. నువ్వు లేకుండా నేను ఏం చేయగలనని? నువ్వు నా సోదరివి మాత్రమే కాదు సోల్‌మేట్‌ కూడా!

నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా..
నాకు అండగా నిలబడ్డందుకు థాంక్యూ. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మేకప్‌ను నీ వృత్తిగా ఎంచుకున్నావు.. ఈ వృత్తి ద్వారా ఎంతోమంది కళ్లలో ఆనందాన్ని నింపుతున్నావు. ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది. ఇంత మంచి సిస్టర్‌ను ఇచ్చినందుకు థాంక్యూ అమ్మా అని రాసుకొచ్చింది.

 

 

చదవండి: నిశ్చితార్థం అప్పటినుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement