Bigg Boss Inaya Sultana Love Proposal To Sohel Ryan - Sakshi
Sakshi News home page

Inaya Proposal To Sohel: 'ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా'.. ఇనయా రొమాంటిక్‌ ప్రపోజల్‌

Dec 27 2022 2:05 PM | Updated on Dec 27 2022 3:45 PM

Bigg Boss Inaya Sultana Love Proposal To Sohel Ryan - Sakshi

బిగ్‌బాస్‌ షోలో లేడీ టైగర్‌గా పాపులర్‌ అయిన కంటెస్టెంట్‌ ఇనాయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్‌ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్‌ అయిన ఇనయా సివంగిలా బయటకు వచ్చింది. బిగ్‌బాస్‌తో బోలెడం పాపులారిటీని దక్కించుకుంది. ఇక తాజాగా మరోసారి ఇనాయా పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సోహైల్‌ తన క్రష్‌ అని ఎన్నోసార్లు చెప్పిన ఇనాయా ఇప్పుడు ఏకంగా అతడికి ప్రపోజ్‌ చేసేసింది.

రెడ్‌ డ్రెస్‌లో గులాబీ చేతిలో పట్టుకొని మోకాళ్లపై కూర్చొని మరీ సోహైల్‌కు తన ప్రేమను వ్యక్తపరిచింది. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా అంటూ రొమాంటిక్‌గా ప్రపోజ్‌ చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోనే చెబుదాం అనుకున్నా నువ్వు అంటే నాకు పిచ్చి. ఇప్పుడు చెబుతున్నా ఐ లవ్‌యూ అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి హౌస్‌లో ఆర్జే సూర్య అంటే ఇష్టమన్నావ్‌ కదా మరి ఇప్పుడేంటి? అని కామెంట్స్‌​ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement