బిగ్‌బాస్‌ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్‌ | Bigg Boss 5 Telugu: Ravi, Lobo And Shweta Hit Jackpot In Captaincy Contender Task | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్‌

Published Wed, Oct 13 2021 12:50 AM | Last Updated on Wed, Oct 13 2021 1:09 PM

Bigg Boss 5 Telugu: Ravi, Lobo And Shweta Hit Jackpot In Captaincy Contender Task - Sakshi

Bigg Boss Telugu, Episode 38 Highlights : నిన్నటి నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్‌ హౌస్‌ అంతా గంభీరంగా మారిపోగా..నేడు ఆ గొడవల నుంచి బయటకు వచ్చి కాస్త రిలాక్స్‌ అయ్యేందుకు ప్రయత్నించారు ఇంటి సభ్యులు. ఇంతలోనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చి మళ్లీ హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొల్పాడు బిగ్‌బాస్‌. ఈ పోటీలో భాగంగా ఇంటి సభ్యులంతా మళ్లీ టీమ్‌లుగా విడిపోయారు. గేమ్‌ కోసం ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. యానీ మాస్టర్‌ అయితే ఆవేశంతో ఊగిపోయారు. సిరి చిన్నబోయింది.. రవి, లోబో, శ్వేతలో ఆనందంతో చిందులేశారు. ఇంకా బిగ్‌బాస్‌ హౌస్‌లో నేడు ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్‌లో చదివేద్దాం. 

సోమవారం జరిగిన నామినేషన్‌ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులంతా గుసగుసలు మొదలు పెట్టారు. యాక్టర్స్‌ అంటూ శ్రీరామ్‌ నోరు జారడంపై సిరి, షణ్ముఖ్‌, జెస్సీ మరోసారి సీరియస్‌ అయ్యారు. ఇక షణ్నూ అయితే గత వారం నామినేషన్‌ ప్రక్రియను ఇంకా మర్చిపోవడం లేదు. . సీక్రెట్ నామినేషన్స్ అంటే 8 మంది నామినేట్ చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్స్ అంటే ఇద్దరే నామినేట్ చేశారు అని ఇంటి సభ్యులందరిపై అసహనం వ్యక్తం చేశాడు. ప్రియ ఏమో సన్నీ గురించి ప్రియాంక దగ్గర చెబుతూ.. ‘ప్రతి వారం నామినేట్‌ చేస్తానని అంటున్నాడు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడా? మానస్‌ని హెల్ప్‌ చేయమని తనే పంపానని చెప్పాడు.. సన్నీ చెబితేనే మాసన్‌ వింటాడా? ఆయనకు ఏం చేయాలిపిస్తే అదే చేస్తాడుగా’అంటూ సన్నీ మాటలకు కౌంటర్‌ ఇచ్చింది. మరోవైపు మాస్టర్‌ని ఎందుకు నామినేట్‌ చేశావని విశ్వని శ్రీరామ్‌ అడిగాడు. తను ప్రతిసారి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ని నామినేట్‌ చేస్తాననడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్‌ చేశానని విశ్వ చెప్పుకొచ్చాడు. 


మన రాజుకు బుర్రలేదు : షణ్నూ

నామినేషన్స్‌లో జరిగిన రచ్చపై త్రిమూర్తులు జెస్సీ, సిరి, షణ్ముఖ్‌ చర్చ పెట్టారు.  లోబోని సన్నీ వెనుకేసుకొస్తున్నాడని జశ్వంత్‌ చెప్పగా.. మన రాజుకు బుర్రలేదని, ఉంటే ఆ టాస్క్‌ మనమే గెలిచేవామని షణ్ముఖ్‌ చెప్పాడు. ఐన్‌స్టీన్‌ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్‌ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి  జెస్సీ, సిరి పగలబడి నవ్వారు.

చర్రితలోనే ఫస్ట్‌ టైమ్‌ ఇలాంటి బ్రేకప్‌!
సోమవారం జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో శ్రీరామ్‌, కాజల్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇకపై తనను సిస్టర్‌ అని పిలవొద్దని శ్రీరామ్‌కు చెప్పింది కాజల్‌.నేడు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. బెడ్‌రూమ్‌లో ఉన్న కాజల్‌ దగ్గరకు శ్రీరామ్‌ వెళ్లగా.. ‘బ్రేకప్‌ బ్రో.. చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బ్రేకప్‌ ఫస్ట్‌ టైమ్‌ కదా’అంటూ నవ్వుతూ చెప్పింది. దాన్ని కామెడీగానే స్వీకరించి శ్రీరామ్‌.. అవునవును అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. 

‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్‌ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్‌ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు.
బ్లూ టీమ్‌లో సభ్యులు: మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌
ఎల్లో టీమ్‌ సభ్యులు   షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ
రెడ్‌ టీమ్‌ సభ్యులు : విశ్వ, శ్రీరామ్‌, ప్రియ
గ్రీన్‌ టీమ్‌ సభ్యులు : రవి, లోబో, శ్వేత

సిరి, కాజల్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌, సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్. రెడ్ అండ్ గ్రీన్ టీంకి మేనేజర్స్‌గా సిరిని.. బ్లూ, ఎల్లో టీంకి కాజల్‌కి మేనేజర్స్‌గా నియమించారు. వీళ్లే బొమ్మల నాణ్యతని తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా చూస్తారు. కెప్టెన్సీ పోటీ దారులు అవ్వాలంటే.. ప్రతి టీమ్‌  ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్‌ ఏరియాలో ఉన్న కన్వేయర్‌ బెల్ట్‌పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్‌ వస్తుంది. వాటిని తీసుకొని బొమ్మలను తయారు చేయాల్సి ఉంటుంది. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే బొమ్మల్లో కాటన్ సరిగా పెట్టకపోవడంతో.. ఇదో పత్తేపారం.. బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ మానస్ పంచ్ వేశాడు

యానీ మాస్టర్‌ ఉగ్రరూపం.. సిరిపై చిందులు
ఈ టాస్క్‌లో భాగంగా  యానీ మాస్టర్‌, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. సంచాలకులుగా ఉన్నవారు బొమ్మల కౌంటింగ్‌ సరిగా చేయాలని, బజర్‌ మోగిన తర్వాత బొమ్మలను తెస్తే నేను యాక్సెప్ట్ చేయను.. గొడవ చేస్తాని యానీ మాస్టర్‌ అనగా..  'మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం' అంటూ సిరి చెప్పింది. దీంతో యానీ మాస్టర్‌ ఉగ్రరూపం దాల్చింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. దీంతో బాగా హర్ట్‌ అయిన సిరి.. గేమ్‌ ఫేర్‌గా అడినప్పటికీ.. నేను ఒక టీమ్‌(షణ్ను ఉన్న ఎల్లో టీమ్‌)కే సపోర్ట్‌ చేస్తున్నానని అంటున్నారు.. ఇకపై అలానే ఆడుతాను. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను’అని సిరి అనగా.. గేమ్‌కి రెస్పెక్ట్‌ ఇచ్చి జన్యూన్‌గా ఆడాలని షణ్ముఖ్‌ సర్థి చెప్పాడు.

రవి టీమ్‌కి జాక్‌పాట్‌
ఇక ఈ టాస్క్‌లో గ్రీన్‌ టీమ్‌ సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్‌ పవర్ లభించింది. స్పెషల్ బొమ్మ రావడంతో దాని ద్వారా వేరే టీం దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇక రేపటి ఎపిసోడ్‌లో యానీ మాస్టర్‌, శ్వేతల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. లాస్ట్‌ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ యానీ మాస్టర్‌ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement