
బిగ్‌బాస్ ఇంట్లో ఆరోవారం గొడవల వారంగా మారింది. నామినేషన్ ప్రక్రియలో మొదలైన గొడవలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ అనే నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. అందులో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతలకు స్పెషల్ ఫవర్ లభించింది. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు.
ఈ స్పెషల్ ఆఫరే బిగ్‌బాస్ ఇంట్లో పెద్ద గొడవకు దారి తీసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. రవి టీమ్ సభ్యులు తమ స్పెషల్ పవర్‌ను ఉపయోగించి యానీ మాస్టర్ టీమ్ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో యానీ మాస్టర్ మరో ప్లాన్ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది.దీంతో బాగా హర్ట్ అయిన యానీ.. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది. మరి యానీ అంతలా ఫైర్ అవడానికి కారణం ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment