ఆస్పత్రిలో చేరిన 'బిగ్‌బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా! | Bigg Boss Telugu Priyanka Singh Hospitalised | Sakshi
Sakshi News home page

Bigg Boss Priyanka Singh: ప్రాణాల మీదకు తెచ్చుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఏమైందంటే?

Published Tue, Feb 20 2024 6:54 PM | Last Updated on Tue, Feb 20 2024 7:07 PM

Bigg Boss Telugu Priyanka Singh Hospitalised - Sakshi

బిగ్‌బాస్ తెలుగు షో వల్ల చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఐదో సీజన్‌లో పాల్గొన్న ఈ ట్రాన్స్ బ్యూటీ.. పలు షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాను ఇప్పుడు ఆస్పత్రి పాలైనట్లు చెప్పుకొచ్చింది. ఒక్క తప్పు వల్లే ఇలా జరిగిందని బోరుమంది. అసలు తనకు ఏం జరిగింది? ఎందుకు అనారోగ్యానికి గురయ్యాననే విషయాల్ని వీడియోగా రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి)

ప్రియాంకకు ఏం చెప్పింది?
'ప్రస్తుతం నేను ఓ ఛానెల్‌లో డ్యాన్స్ షో చేస్తున్నారు. దానికోసం ప్రాక్టీస్ కూడా అవుతోంది. అయితే ఓ రోజు ప్రాక్టీస్ తర్వాత ఎందుకో బాడీ సహకరించలేదు. చాలా డీహైడ్రేట్ అయిపోయాను. 20 రోజులుగా వరసగా డ్యాన్స్ ప్రాక్టీసు చేయడం వల్ల ఒళ్లు నొప్పులు వచ్చాయి. దీంతో డాక్టర్‌ని సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్, మెడిసన్ తీసుకున్నాను. వీటి వల్ల లివర్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యేంత పరిస్థితి వచ్చింది. యాంటీ బయోటిక్ లాంటి మందులు వాడటం వల్లే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను'

'ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే.. డాక్టర్ సలహా తీసుకోకుండా నాలా ఎలాంటి మందులు వాడొద్దు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాసరే డాక్టర్ దగ్గరికి వెళ్లండి. వాళ్ల సలహా, సూచనలతో మెడిసన్ వాడి ఆరోగ్యం సరిచేసుకోండి. నేను సొంతంగా ఇలా మందుల వాడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాను. పెయిన్ కిల్లర్స్ అయితే నా లివర్‌పై చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల డ్యాన్స్ కూడా నా బదులు వేరొకరు చేయాల్సి వచ్చింది' అని ప్రియాంక తన వీడియోలో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement