ఇది లైబ్రరీలాంటి సినిమా | Dil Raju presents Yakub Ali's Vellipomake | Sakshi
Sakshi News home page

ఇది లైబ్రరీలాంటి సినిమా

Published Sun, Feb 26 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

ఇది లైబ్రరీలాంటి సినిమా

ఇది లైబ్రరీలాంటి సినిమా

‘‘కొత్తవారందరూ కలిసి చేసిన ఈ సినిమాను సపోర్టు చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ బాగుంటే ఏ కొత్త సినిమాకైనా నా వంతు సపోర్ట్‌ చేస్తా’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు. విశ్వక్‌సేన్, సుప్రజ , శ్వేత హీరో హీరోయిన్లుగా యాకుబ్‌ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెళ్లిపోమాకే’. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ప్రశాంత్‌ విహారి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను  దర్శకుడు సతీష్‌ వేగేశ్న  విడుదల చేశారు. 

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘మన పక్కింటి అమ్మాయిలు, అబ్బాయిలు, సహోద్యోగు లు ఉన్నట్టే ఈ కథలోని క్యారెక్టరైజేషన్స్‌ ఉంటాయి. ఇలాంటి సినిమాలను ప్రొత్సహిస్తే మంచి కథనాలతో మరిన్ని సినిమాలు వస్తాయి. రాబోయే సినిమాలకు ఈ సినిమా లైబ్రరీలా ఉంటుంది’’అన్నారు.  ‘‘దిల్‌’ రాజుకు కథ నచ్చడంతో మూడేళ్ల కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం’’ అని  యాకూబ్‌ అలీ అన్నారు. ‘‘ఏఆర్‌ రెహమాన్‌ దగ్గర పనిచేశా. ఈ చిత్రానికి క్లాసికల్‌ టచ్‌ ఉన్న వెస్ట్రన్‌ మ్యూజిక్‌  అందించా’’ అని ప్రశాంత్‌ విహారి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement