supraja
-
కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు
-
World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి!
తాబేలు నడకల గురించి తక్కువ చేసి నవ్వుకునే కాలం కాదు ఇది. ప్రమాదం అంచున ఉన్న తాబేలు జాతి గురించి సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. చెన్నైకి చెందిన సుప్రజ నుంచి లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వరకు ఎంతోమంది నారీమణులు తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్నారు..చుట్టుపక్కల చూడరా...ముంబైకి చెందిన మోడల్ సౌందర్య గార్గ్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమీపంలోని చెత్తకుప్పలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కదలడం చూసి ఆ బ్యాగును ఓపెన్ చేసింది. అందులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే ల్యాబ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన వాలంటీర్ సూచనలతో తాబేలును ఇంటికి తీసుకెళ్లి నీటిలో పెట్టింది. ఆ తరువాత ఆ తాబేలునుపాస్–రెస్క్యూ టీమ్‌కు అప్పగించింది.‘నేను–నా పని అని మాత్రమే... అని కాకుండా చుట్టుపక్కల కూడా తొంగి చూడాలి. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని ఆరోజు సౌందర్య అనుకొని ఉంటే, తాబేలే కదా వదిలేద్దాం అనే నిర్లక్ష్యంలో ఉండి ఉంటే ఒక జీవి బతికేది కాదు’ అంటుంది యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిషా సుబ్రమణ్యియన్. దిల్లీలో మార్నింగ్ వాక్కు వెళుతున్న ఒక మహిళ రోడ్డుపై తాబేలును గమనించి రక్షించింది. దీని తాలూకు వీడియో వైరల్ కావడమే కాదు నీటిలో ఉండాల్సిన తాబేళ్లు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నాయి? వాటిని రక్షించడానికి ఏంచేయాలి?’ అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.ఆ విషాదంలో నుంచే..కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త డా.జేన్ గుడాల్పై వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీని చూసింది చెన్నైకి చెందిన సుప్రజ ధరణి. ‘ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది’ అనే మాట ఆమెకు బాగా నచ్చడమే కాదు ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించింది.సుప్రజఒకరోజు పెరియ నీలంకరై బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సుప్రజ ఒడ్డున కనిపిస్తున్న తాబేలు దగ్గరికి వెళ్లింది. అది చని΄ోయి ఉంది. దాని శరీరంపై పదునైన తీగలతో కోతలు కోశారు. ఈ దృశ్యం తనని చాలా బాధ పెట్టింది. ఒక రకంగా చె΄్పాలంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ తనని వెంటాడింది.ఈ నేపథ్యంలోనే తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. పుస్తకాలు చదవడం, మత్స్యకారులతో మాట్లాడం ద్వారా తాబేళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత ట్రీ ఫౌండేషన్ (ట్రస్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్)కు శ్రీకారం చుట్టింది. తాబేళ్ల సంరక్షణ విషయంలో చేసిన కృషికి గుర్తింపుగా డిస్నీ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ అవార్డ్, సీ వరల్డ్‌లాంటి ఎన్నో అవార్డ్లు అందుకుంది సుప్రజ.విజ్జీ–ది టర్టిల్ గర్ల్..భారతదేశ మొట్టమొదటి మహిళా హెర్పెటాలజిస్ట్, టర్టిల్ ఫీల్డ్ బయోలజిస్ట్గా గుర్తింపు పొందింది జె.విజయ. చిన్న వయసులోనే చని΄ోయింది. అయితే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేసింది. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ పక్కన ఉన్న టర్టిల్పాండ్ దగ్గర ఆమె స్మారక చిహ్నం ఉంది. మద్రాస్ స్నేక్పార్క్లోకి వాలంటీర్‌గా అడుగుపెట్టింది విజయ.విజయఅప్పుడు ఆమె మద్రాస్‌లోని ఎతిరాజ్ కాలేజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. స్నేక్పార్క్లో రకరకాల తాబేళ్లను వేరు వేరు వ్యక్తులకు అప్పగించేవారు. అలా విజ్జీకి మంచినీటి తాబేళ్లను అప్పగించారు. అక్కడితో మొదలైన తాబేళ్లతో చెలిమి ఎంతో దూరం వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్కత్తా వరకు తాబేళ్లకు ఎదురవుతున్న ముప్పు, సంరక్షణ గురించి ఎంతో పరిశోధన చేసింది. తాను తెలుసుకున్న వాటిని అక్షరబద్ధం చేసింది.అరుణోదయం..ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వేలాది తాబేళ్లను రక్షించింది. తాబేళ్ల జీవితం, వాటిప్రాధాన్యత, సంరక్షణ గురించి ఎన్నో విద్యాలయాల్లో విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించింది. తాబేళ్ల సంరక్షకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణిమ సింగ్ తన బాటలో ఎంతోమందిని నడిపిస్తోంది.గ్రీన్ టర్టిల్స్.. మీరు పచ్చగా బతకాలిఆకుపచ్చ తాబేళ్లు (చెలోనియా మైడాస్) ప్రమాదం అంచున అంతరించి΄ోయే జాతుల జాబితాలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవుల్లో ఆకుపచ్చ తాబేళ్లపై గతంలో జరిగిన పరిశోధనలను పీహెచ్డీ స్టూడెంట్ నుపుల్ కాలే మరింత ముందుకు తీసుకువెళుతోంది. సముద్రపు గడ్డి మైదానాలు తగ్గడంలాంటివి గ్రీన్ టర్టిల్స్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తన పరిశోధనలో తెలుసుకుంది.నుపుల్ కాలే‘సముద్ర తాబేళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటుంది కాలే. యూనివర్శిటీలో ఒకరోజు ‘గ్రీన్ టర్టిల్స్ గురించి పనిచేయడంపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు లెక్చరర్. ‘ఉంది’ అని చెప్పింది. ఆ తరువాత గ్రీన్ టర్టిల్స్కు సంబంధించి శ్రీలంకలో ఫీల్డ్‌వర్క్ చేసింది.‘గూడు కట్టుకోవడానికి ఒక గ్రీన్ టర్టిల్ బీర్‌లోకి వచ్చిన దృశ్యం తొలిసారిగా చూశాను. ఆ దృశ్యం చెక్కుచెదరకుండా ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది’ అంటుంది కాలే.ఇవి చదవండి: ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు! -
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
బెస్ట్ లేడీ పోలీస్.. దుర్మార్గులను చీల్చి చెండాడిన ఏఎస్పీ సుప్రజ
ఆమె ఓ నమ్మకం.. ఆమెపై అచంచలమైన విశ్వాసం.. కేసు టేకప్ చేశారంటే బాధితులకు సాంత్వన దొరికినట్లే.. నిందితుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తినట్లే. నిందితులు ఎక్కడ దాక్కున్నా వెదికి పట్టుకుని, వారికి శిక్ష పడేవరకు విశ్రమించరని అంటారు.. ఆమే గుంటూరు ఏఎస్పీ సుప్రజ. బాధితుల పక్షాన నిలిచి, వారి కన్నీళ్లు తుడిచి, న్యాయం చేయడమే కాకుండా సిబ్బందికి అన్నివిషయాల్లో చోదోడు వాదోడుగా ఉంటూ ‘సుప్రజ’ల పోలీస్‌గా పేరు గడించారు. గుంటూరు: ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం.. సిబ్బంది కష్టసుఖాల్లో వారికి అండగా నిలుస్తారు.. అడ్మినిస్ట్రేషన్ లో ఆమె పెట్టింది పేరు.. కేసు విచారణ చేపడితే.. నిందితులకు శిక్షపడే వరకు విశ్రమించరు. అవినీతి మచ్చ లేకుండా.. మూడేళ్ల పాటు జిల్లా ప్రజలకు ఎన్నో సేవలందించిన గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.సుప్రజ అటు అధికారులు.. సిబ్బంది.. ఇటు ప్రజల నుంచి ఎన్నో మన్ననలు పొందారు. జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా ఉన్న సుప్రజను ఏసీబీకి బదిలీ చేస్తూ.. బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు ఈస్ట్, వెస్ట్, ట్రాఫిక్ డీఎస్పీగా పనిచేయటంతో పాటు, ఏఎస్పీగా ఆమె సమర్ధవంతగా విధులు నిర్వర్తించారు. అనేక కేసుల్లో విచారణాధికారిగా బాధితుల పక్షాన నిలిచి, నిందితులకు జైలు శిక్షలు పడేలా కృషి చేశారు. 2020లో కోవిడ్ సమయంలో గుంటూరు జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా కె.సుప్రజ బాధ్యతలు స్వీకరించారు. కరోనా కల్లోల సమయంలో సిబ్బందికి రావాల్సిన పలు నగదు అంశాల్లో ఆమె కీలకంగా వ్యవహరించి అవి వారికి చెందేలా చూశారు. గుంటూరు జిల్లా రూరల్, అర్బన్ విభజన అంశంలో కీలక పాత్ర పోషించారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తిస్థాయిలో దృష్టి సారించి, మన్ననలు పొందారు. అనేక కేసుల్లో విశేష ప్రతిభ.. జిల్లా అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు అనేక కేసుల్లో విచారణాధికారిగా ఉన్న ఏఎస్పీ సుప్రజ నిందితులకు శిక్షలు పడటంలో ఎంతో పట్టుదలతో ముందుకు సాగారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో నేపాల్‌కు చెందిన ఒక కుటుంబం స్వెట్టర్లు అమ్ముకునేందుకు గుంటూరుకు వచ్చిన సమయంలో వారి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కుటుంబం స్థానిక వ్యక్తులకు భయపడి ఇక్కడ నుంచి నేపాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సుప్రజ, ఇక్కడి సిబ్బందిని నేపాల్‌కు పంపి, వారిని తిరిగి ఇక్కడకు పిలిపించి కేసు నమోదు చేయటంతో పాటు, నిందితుడి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ► లాలాపేట పీఎస్ పరిధిలో ఒక వృద్ధుడు చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ఆమె కేసును నడిపించారు. ► రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మేడికొండూరు బాలిక కిడ్నాప్, రేప్ కేసులో నెలల తరబడి పని చేసి స్వయంగా రంగంలోకి దిగిన ఏఎస్పీ 82 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వెస్ట్ డీఎస్పీగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ కేసులో పురోగతి సాధించటంతో అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా, కేసు నిర్వహణ, చార్జిటు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించటంతో పాటు, ఆమెను అభినందించింది. మూడేళ్లు ఒక ఎత్తు.. ఆ మూడు నెలలు ఒక ఎత్తు మూడేళ్ల పాటు గుంటూరు అడ్మిన్ ఏఎస్పీగా పనిచేసిన సుప్రజ.. ఒక మూడు నెలల పాటు గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆ సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు ఆదేశాలతో ఆమె చేపట్టిన అడ్మిని్రస్టేషన్ అద్భుతమనే చెప్పాలి. జిల్లాలో ఉన్న 1600 రౌడీషీటర్లుకు సంబంధించి, ఆధిపత్య పోరు, నేరాలు జరుగుతున్న సమయంలో స్వయంగా ప్రతి స్టేషన్‌కు వెళ్లిన ఆమె రౌడీషీటర్లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 8 మంది రౌడీషీటర్లును జిల్లా బహిష్కరణ చేసి, వారిపై పీడీ యాక్టును ప్రయోగించిన ఘనత ఏఎస్పీ సుప్రజదే. వారిలో 1250కిపైగా బైండోవర్ చేసి వెన్నులో వణుకు పుట్టించారు. రాత్రి పది గంటలకల్లా దుకాణాలను మూసి వేయించడంతో పాటు, విజుబుల్ పోలీసింగ్ నిర్వహించి, అర్ధరాత్రి ప్రయాణాలు చేసే ఎంతోమందికి ధైర్యాన్ని కలి్పంచారు. కేవలం ఆ మూడు నెలల వ్యవధిలో 3వేల మందికిపైగా బహిరంగ మద్యపానానికి పాల్పడుతున్న మందుబాబులను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నో అవార్డులు... ప్రశంసలు విధి నిర్వహిణలో విశేష ప్రతిభ కనబరిచి.. అవినీతి మచ్చలేని అధికారిగా ఏఎస్పీ సుప్రజ మంచిపేరు సంపాదించుకున్నారు. నేపాల్ చిన్నారి రేప్ కేసు ఘటనలో స్వయంగా నేపాల్ ప్రభుత్వ ప్రతినిధులు గుంటూరు వచ్చి ఆమెను సత్కరించటంతో పాటు, అక్కడ ఆమెకు ప్రకటించిన అవార్డును అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ది బెస్ట్ ఇన్విస్టిగేషన్’ అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలకు సంబంధించి చేపట్టిన కేసుల్లో విశేష ప్రతిభ చూపిన ఆమె ఆరుగురికి యావజ్జీవ శిక్షలు పడేందుకు పాటుపడ్డారు. అనేక అవార్డులు చేపట్టి.. విధి నిర్వహణలో ఎలా ఉండాలో చేసి చూపించారు. అందుకే ‘అడ్మిన్ మేడం.. అందరి మనిíÙ’గా పేరు తెచ్చుకున్నారు. -
వేటాడి.. వెంటాడి..
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): పన్నెండేళ్ల బాలికకు తీరని అన్యాయం.. కొంతమంది మోసగాళ్ల చేతికి చిక్కి వ్యభిచార కూపంలో మగ్గిపోయింది.. ఆఖరుకు ఎలాగో తప్పించుకుని ఒక మహిళా అధికారి వద్దకు చేరుకుంది. బాలిక పట్ల మృగాళ్లు వ్యవహరించిన తీరు.. పలువురు మహిళలు చేయించిన అఘాయిత్యాలను చూసిన ఆ అధికారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎలాగైనా సరే నిందితులకు శిక్షలు పడేదాక విశ్రమించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో చూపిన ప్రతిభకు గాను గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కొర్లకుంట సుప్రజకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ హోం మినిస్టర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్’ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన కేసు విచారణ బాధ్యతలను అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న ప్రస్తుత ఏఎస్పీ కె.సుప్రజకు అప్పగించారు. అన్నీ తానై ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వయంగా విచారణ జరిపారు. తన నాలుగు నెలల పసిబిడ్డను తీసుకుని.. ఆఖరుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనంలోనే ఆ చిన్నారికి ఊయల కట్టి వెళ్లిన పరిస్థితులున్నాయి. కేసులో వ్యభిచారం చేయించిన నిర్వాహకులు, వ్యభిచారానికి పాల్పడిన 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందాక సైతం ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజతోనే విచారణ చేయించాలని కోర్టు ఆదేశించటంతో పాటు, కేసులో భారీ పురోగతి సాధించిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఈ కేసులో సుమారు 500 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. మరో బాలికకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న పట్టుదలతో ఉన్నతాధికారుల సహకారంతో విచారణ చేసినట్టు ఏఎస్పీ సుప్రజ చెప్పారు. -
గీతా.. సుబ్రహ్మణ్యం 3 టీజర్
-
చెరసాలలోకి మృగాలు.. ఏపీ అధికారిణిపై హైకోర్టు ప్రశంసలు
ఇంకా పూర్తిగా ఊహ కూడా తెలియని వయస్సు.. సరదాగా తోటి స్నేహితులతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాల్సిన చిన్నారిని 12 ఏళ్ల ప్రాయంలోనే మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించారు ఆ కిరాతకులు.. అంగట్లో వస్తువులా ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక విక్రయానికి తెగబడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తిప్పుతూ వ్యభిచారం చేయించారు. ఈ వేధింపులు తాళలేక నరరూప రాక్షసుల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. కేసును సీరియస్‌గా తీసుకున్న అప్పటి డీఎస్పీ, ప్రస్తుత అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.సుప్రజ ఈ చిన్నారికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో అపర కాళికలా మారారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేసులో ఎంత పెద్దవారు ఉన్నా పోలీసులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పది నెలల కాలంలో 79 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్కొక్కరికి 90 రోజుల నుంచి 120 రోజులపాటు రిమాండ్ విధించేలా చర్యలు చేపట్టారు. దీనిపై సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్‌ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. నిందితులందరికీ శిక్ష పడటం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరును హైకోర్టు సైతం ప్రశంసించింది. ఆదిశక్తిలా ఉరికిన ఏఎస్పీ సుప్రజ వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుల నుంచి తప్పించుకున్న బాలిక మేడికొండూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారి తనను తీసుకువెళ్లిన ప్రాంతాలన్నీ చెప్పినా అప్పటి స్టేషన్ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ కేసును అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ, ప్రస్తుత గుంటూరు జిల్లా ఏఎస్పీ కె.సుప్రజకు ఉన్నతాధికారులు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసు మూలాల్లోకి వెళ్లారు. ఆదిశక్తి అవతారంలా ముందుకురికారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి, బాలిక చెప్పిన ప్రాంతాలన్నింటిలోనూ నిఘా ఏర్పాటు చేసి వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజ చేతే విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించటంతోపాటు, కేసు ఛేదనలో ప్రతిభ చాటిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఒక కేసు.. 80 మంది దోషులు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలిక తల్లికి కోవిడ్ వచ్చి ఆస్పత్రిలో ఉన్న తరుణంలో తండ్రితో స్వర్ణ అనే మహిళ పరిచయం చేసుకుని బాలికను తనతో పంపిస్తే ఆమె బాగోగులు చూసుకుంటానని మాయమాటలు చెప్పింది. ఆ తర్వాత ఆమె మరొకరికి బాలికను విక్రయించింది. ఇలా బాలికను ఒకరి తర్వాత మరొకరు విక్రయిస్తూ చేతులు మార్చారు. వ్యభిచార కూపంలోకి దింపారు. తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో సుమారు 47 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల చేతుల్లో ఆ పసిమొగ్గ వాడిపోయింది. ఆఖరికి రాజస్థాన్–పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి తప్పించుకున్న పాప ఎలాగో మేడికొండూరు చేరి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో 80 మంది నిందితులుగా తేలారు. ఇప్పటికే 79 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు మాత్రం లండన్‌లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీస్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అతను ఎప్పుడు ఇండియాకి వచ్చినా అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయంతో కొంత ఉపశమనం సమాజంలో కొందరు మానవమృగాల్లా వ్యవహరిస్తున్నారు. చిన్నారులపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇది ఎంతో బాధాకరం. వికృత చేష్టలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. కిరాతకులకు శిక్షలు వేయించినప్పుడు బాధిత చిన్నారులకు కొంతైనా న్యాయం చేయగలిగామన్న సంతోషం కలుగుతుంది. మేడికొండూరు కేసులోనూ సుమారు 10 నెలలు కష్టపడి చార్జిïÙటు దాఖలు చేశాం. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తాం. – కె.సుప్రజ అడిషనల్ ఎస్పీ, గుంటూరు జిల్లా పసిపాపలకు న్యాయం చేసి.. సుప్రజ ఈస్ట్ డీఎస్పీగా పనిచేసిన సమయంలో కొత్తపేటలో ఐదేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితులు నేపాల్‌లో ఉంటే వారిని రప్పించి అరెస్టు చేయడంతోపాటు ప్రధాన నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. లాలాపేటలో రెండేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడినప్పుడు కూడా విచారణ చేపట్టి అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. -
Disha Bill: సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది. అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు. బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి. సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది. ∙∙∙ అది నేపాల్ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు. కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్ వేయగలిగారు. మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్‌కి వెళ్లబోతున్న టీసీఎస్ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు. ∙∙∙ ఆ బిల్లు దిశగా దర్యాప్తు గుంటూరు, దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్‌గా పని చేస్తున్నాం. నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్‌కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ. దిశ బస్సులు పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్స్టేషన్లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు. కొన్నింటికి ఆధారాలుండవు! చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్ ఆటిట్యూడ్ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. – సుప్రజ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్చార్జ్, వెస్ట్ సబ్ డివిజన్, దిశ పోలీస్ స్టేషన్,గుంటూరు – వాకా మంజులారెడ్డి -
వాసాలమర్రి బిడ్డ సుప్రజను డాక్టర్ చదివిస్తా..: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: వాసాలమర్రి సభలో సీఎం కేసీఆర్ మరో హామీ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన బాలికను ఎంబీబీఎస్ చదివిస్తానని ప్రకటించారు. వాసాలమర్రికి చెందిన నర్సింహులు, రాణి దంపతుల కూతురు సుప్రజను విషయమై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సహపంక్తి భోజనం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఊరిలోని ప్రభుత్వ బడిలో పదో తరగతి పాసయ్యానని, డాక్టర్ కావాలని ఉందని చెప్పింది. అంత చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. అమ్మాయి తండ్రి తమకు అర ఎకరం మాత్రమే పొలం ఉందని, తల్లి హైదరాబాద్‌లో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తుందని చెప్పారు. చదువుకునేందుకు ప్రభుత్వ స్కీంలు ఉన్నాయి. కొందరికి తెలియదు. అయినా ఆమెను నేను చదివిస్తా. ఊర్లో ఇంకా ఇలాంటి వారు ఎందరున్నా వారందరినీ చదివించాలి’’ అని కేసీఆర్ సూచించారు. -
పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి? రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్‌మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ► ట్రైనింగ్ సమయంలోని ఫిజికల్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా? అవును. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్‌లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది. ► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది? జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి. ► లాక్డౌన్ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్మెంట్లో గొప్పగా చెబుతుంటారు! (నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్ఎస్ ప్రేమ్‌కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం. డీజీపి గౌతమ్ సవాంగ్ నుండి పిసిఆర్ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
రూ.350కే కరోనా పరీక్షలు!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పరీక్ష నిర్ధారణకు ఇకపై రోజులు, గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. అనుమానం ఉన్న వ్యక్తులు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే పరీక్షలు చేయించుకుని ఫలితాలను తెలుసుకోవచ్చు. తద్వారా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువమందికి పరీక్షలను చేసే నిర్ధారణ కిట్ తయారీలో తెలుగింటి శాస్త్రవేత్తల ప్రయత్నం ఫలించింది. త్వరలోనే పేటెంట్ (పీటీఓ) రాకతో వీరి కష్టానికి, పరిశోధనకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు రానుంది. ఈ బృందం సభ్యుల్లో గాలివీడు మండలం నూలివీడుకు చెందిన అమ్మాయి ఉండడం రాష్ట్రానికే గర్వకారణం. రాయచోటి :వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం నూలివీడుకు చెందిన పట్టా వెంకటరమణారెడ్డి (హిందీ ఉపాధ్యాయుడు), వెంకటేశ్వరమ్మ కుమార్తె సుప్రజ కరోనా నిర్ధారణ కిట్ రూపొందిన సభ్యుల బృందంలో ఒకరు. హైదరాబాద్‌లో ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరిశోధక బృందంలో ‘‘మెదడు పని తీరు’’పై పరిశోధనలో ఈమె సభ్యురాలు. పదో తరగతి వరకు నూలివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి వరకు విద్యను కొనసాగించారు. పది ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఐఐటీ హైదరాబాద్‌లో చదువుతూ ఆసక్తి ఉన్న ‘‘మెదడు పని తీరు’’పై పరిశోధన రంగంలో రాణిస్తున్నారు. రూ.350కే కరోనా నిర్ధారణ కిట్.. తాము సాధించిన ఫలితాలకు ప్రభుత్వ సహకారం లభిస్తే కరోనా వ్యాధి నిర్ధారణ కిట్‌ను రూ.550 కంటే తక్కువ ఖర్చుతోనే అంటే రూ.350కే తయారు చేయవచ్చని సుప్రజా చెబుతోంది. ఈ విషయంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం సభ్యులతో కలిసి నిర్ణయించామన్నారు. కరోనా వైరస్ గుర్తింపు పరీక్షా కిట్ తయారీపై ఫోన్ ద్వారా ‘‘సాక్షి’తో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆమె మాటల్లోనే... ‘‘ఏ రంగంలో ఉన్నా పరిశోధనల ఫలితాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ క్రమంలో మా ఫ్రొఫెసర్ డాక్టర్ శివగోవింద్‌సింగ్, సీనియర్ సూర్యస్నాత త్రిపాఠీలతో కలిసి చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనపెట్టలేకపోయినా వైరస్‌ను అనతి కాలంలోనే గుర్తిస్తే మరొకరికి అంటకుండా నివారించవచ్చన్నదే ధ్యేయం. ఈ కిట్ ద్వారా 20 నిమిషాల్లోనే వైరస్ నిర్ధారణ అవుతుంది. మా ల్యాబ్ క్లినికల్ ట్రయిల్స్ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించింది. పేటెంట్(పీటీఓ) కోసం దరఖాస్తు చేశాం. త్వరలోనే పేటెంట్ హక్కు కూడా వస్తుందన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం వ్యాధి నిర్ధారణకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తున్నాం. తొలుత ఈ విధానంలో పరీక్షా ఫలితాల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోంది. ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర పద్ధతులు ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే కిట్‌ను అభివృద్ధి చేశాం. ఈ కిట్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.2400గా నిర్ణయించి పరీక్షలు చేస్తోంది. ప్రభుత్వాలు తగినంత పరికరాలను ఉపయోగించి కిట్ల తయారీపై దృష్టి సారిస్తే ఖర్చు లేకుండా తక్కువ సమయంలోనే ఈ కిట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చని’’ ఆమె అభిపారయపడ్డారు. -
డబ్స్మాష్ వల్ల ఏం జరిగింది?
పవన్‌కృష్ణ. సుప్రజ హీరో హీరోయిన్లుగా ‘జబర్ధస్త్’ ఫేమ్ గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డబ్స్మాష్’. సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మించారు. కేశవ్ దేపూర్ దర్శకుడు. నేడు ‘డబ్స్మాష్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నటి స్పందన మాట్లాడుతూ– ‘‘నేను చేసిన టిక్ టాక్ వీడియో చూసి ఈ చిత్రంలో చాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. సుబ్రమణ్యం మాట్లాడుతూ– ‘‘మా దర్శకునికి సినిమాపై ఉన్న తపన చూసి నమ్మకంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘బెస్ట్ టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చేశాను. దాదాపు 20 నిమిషాలపాటు వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉంటుంది. స్టూడెంట్స్ చేసే డబ్స్మాష్ వల్ల ఏం జరిగింది? అనేది మా సినిమా కథ’’ అన్నారు కేశవ్. గెటప్ శ్రీను, పవన్‌కృష్ణ సహనిర్మాత గజేంద్ర దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
హ్యాపీడేస్‌లాంటి సినిమా
తమకు నచ్చిన ప్రముఖులను అనుకరిస్తూ సొంతంగా వీడియోలను తయారు చేయటాన్ని ‘డబ్స్మాష్ ’అంటారు. ఇప్పుడు ఆ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం తెలుగు చిత్ర పరిశ్రమలోని లెజెండ్స్‌పై తీసిన పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర ప్రసాద్, రామ సత్యనారాయణలు విడుదల చేశారు. చిత్రనిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మా అన్నయ్య నటించినందుకు హ్యాపీగా ఉంది. ‘హ్యాపీడేస్’ తరహాలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా లెజెండ్స్‌పై మా సినిమాలో పాట ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.’’ అన్నారు దర్శకుడు కేశవ్ దేవర్. ‘‘ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను’’ అన్నారు పవన్. ‘‘మా చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు హీరోయిన్ సుప్రజ. -
పేదింటి ఆణిముత్యం
నీట్లో పేదింటి విద్యార్థిని సత్తా చాటింది. ఎంబీబీఎస్‌లో పీజీ(ఎండీ జనరల్ మెడిషన్) సీటు సాధించింది. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించి పదిమందికి ఆదర్శంగా నిలిచిన విద్యార్థిని సుప్రజ ఆశయం.. కుటుంబ నేపథ్యంపై ప్రత్యేక కథనం. కోవెలకుంట్ల: కోవెలకుంట్లకు చెందిన ఓబుళపు సూర్యనారాయణరెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గౌండ వృత్తి నిర్వíßహించుకుంటూ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పెద్దకుమార్తె సుప్రజ పదవ తరగతి వరకు పెండేకంటి పబ్లిక్ పాఠశాలలో, విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుని 2011వ సంవత్సరంలో ఎంసెట్‌లో ర్యాంకు సాధించి రాయచూర్‌లోని నవోదయ మెడికల్ కళాశాలలో ఎంబీసీబీఎస్ పూర్తి చేసింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్పరీక్షలో 5వేలు ర్యాంకు పొంది బెంగుళూరులోని వైదేహి మెడికల్ కళాశాలలో పీజీ సీటు దక్కించుకుంది. చిన్నకుమార్తె ఇందిర ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని నీట్లో ప్రతిభ కనబరిచి జనరల్ మెడిషన్ సీటు సాధించడంతో ఆ విద్యార్థినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోటరీక్లబ్ మాజీ అధ్యక్షులు బాలాంజనేయరెడ్డి, మోహనమూర్తి, సుబ్బయ్య, శివ, తదితరులు ఆ విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు సేవచేయాలన్న తపన: సుప్రజ పేదల కష్టాలను చాలా దగ్గరగా చూశాను. పూట గడవటమే కష్టంగా ఉన్న పేద కుటుంబాల్లోని వ్యక్తులు జబ్బు పడితే వైద్యం చేయించుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి ఈ స్థాయికి చేరాను. బెంగుళూరులో పీజీ కోర్సు పూర్తి అయ్యాక డాక్టర్‌గా స్థిరపడి పేద ప్రజలకు సేవ చేయాలన్నదే నా ముందున్న లక్ష్యం. -
అత్యాచార యత్నం.. ఆత్మహత్య
వైఎస్సార్ కడప: ఓ యువకుడు బలవంతం చేయడంతో అవమానం తట్టుకోలేక యువతి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన జిల్లాలోని ఆదినిమ్మాయపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 24వ తేదీన ఆదినిమ్మాయపల్లెకు చెందిన సుప్రజ(20) అనే యువతి ఇంట్లో ఉండగా ఎవరూ లేని సమయంలో మిట్టపల్లెకు చెందిన పాశం భాస్కర్ బాబు అనే యువకుడు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అయితే అప్పటి నుండి అవమాన భారంతో కుమిలిపోతున్న యువతి బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా, యువతి మృతికి కారణమైన నిందితుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇది లైబ్రరీలాంటి సినిమా
‘‘కొత్తవారందరూ కలిసి చేసిన ఈ సినిమాను సపోర్టు చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ బాగుంటే ఏ కొత్త సినిమాకైనా నా వంతు సపోర్ట్ చేస్తా’’ అని ‘దిల్’ రాజు అన్నారు. విశ్వక్సేన్, సుప్రజ , శ్వేత హీరో హీరోయిన్లుగా యాకుబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెళ్లిపోమాకే’. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ విహారి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు సతీష్ వేగేశ్న విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మన పక్కింటి అమ్మాయిలు, అబ్బాయిలు, సహోద్యోగు లు ఉన్నట్టే ఈ కథలోని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలను ప్రొత్సహిస్తే మంచి కథనాలతో మరిన్ని సినిమాలు వస్తాయి. రాబోయే సినిమాలకు ఈ సినిమా లైబ్రరీలా ఉంటుంది’’అన్నారు. ‘‘దిల్’ రాజుకు కథ నచ్చడంతో మూడేళ్ల కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం’’ అని యాకూబ్ అలీ అన్నారు. ‘‘ఏఆర్ రెహమాన్ దగ్గర పనిచేశా. ఈ చిత్రానికి క్లాసికల్ టచ్ ఉన్న వెస్ట్రన్ మ్యూజిక్ అందించా’’ అని ప్రశాంత్ విహారి చెప్పారు. -
చందానగర్‌లో విషాదఛాయలు
ఆస్ట్రేలియాలో మృతి చెందిన సుప్రజ 27న గృహప్రవేశానికి రావాల్సి ఉండగానే దారుణం చందానగర్: ఆస్ట్రేలియాలో సుప్రజ అనే మహిళ బిడ్డతో సహా అనుమానాస్పదస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్న చందానగర్ రాజేందర్రెడ్డినగర్ కాలనీలో శుక్రవారం విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్ జిల్లా ఆర్డినెస్ ఫ్యాక్టరీ రిటైర్డ్ ఉద్యోగి మంగిడి శంకరయ్య తన కుమార్తె సుప్రజకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన శ్రీనివాస్‌తో 2009లో వివాహం చేశాడు. వీరికి ఐదేళ్ల కుమార్తె సహస్ర, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. సాప్ట్వేర్ ఉద్యోగాల నిమిత్తం ఏడాదిన్నర క్రితం వారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు.నాలుగు నెలల క్రితం బాబు జన్మించడంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర అక్కడికి వెళ్లి నెల రోజుల క్రితమే తిరిగి వచ్చారు. కాగా శంకరయ్య ఇటీవలే రాజేందర్రెడ్డినగర్లో కొత్తగా ఇళ్లు కట్టుకోవడంతో ఈ నెల 27న గృహా ప్రవేశానికి వారిరువు రావాల్సి ఉందని అంతలోనే దారుణం జరిగిందని తల్లిదండ్రులు బోరునా విలపించారు. తమ సమీప బంధువైన అల్లుడు శ్రీనివాస్ చాలా సౌమ్యుడని శంకరయ్య తెలిపారు. కాగా మృతి విషయంపై సమచారం అందడంతో శ్రీనివాస్ తండ్రి గంగాధర్ హుటాహుటిన ఆస్ట్రేలియాకు తరలివెళ్లారు. వారు శుక్రవారం రాత్రి ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉందని, ఆ తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని బంధువులు పేర్కొన్నారు. అన్యోన్యంగా ఉండేవారు: తండ్రి శంకరయ్య తన ఇద్దరు కుమార్తెలని, అల్లుళ్ల్లు ఇద్దరూ మంచివారని, వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి తండ్రి శంకరయ్య తెలిపారు. తమ గృహ ప్రవేశానికి ఈ నెల 27న బయలుదేరాల్సి ఉందని అంతలోనే ఘోరం చోటు చేసుకుందన్నారు. అక్కడ ఏం జరిగిందో తమకు తెలియదని తమ వియ్యంకుడు గంగాధర్ అక్కడికి చేరుకున్న తర్వాతే అసలు విషయం తెలుస్తోందన్నారు. పూర్తి సహకారం: కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి సుప్రజ తల్లిదండ్రులను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పరామర్శించారు. సుప్రజ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకుచ్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సుప్రజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ మృతి
-
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ మృతి
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమారుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రజకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన వ్యక్తితో 2006లో వివాహమైంది. ఏడాది క్రితం సుప్రజ ఆస్ట్రేలియా వెళ్లింది. దంపతులు ఇద్దరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు (ఆరు నెలలు) ఉన్నాడు. రెండు రోజుల క్రితం సుప్రజ, ఆమె కుమారుడు మృతి చెందారు. ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
సుప్రజను భర్తే హత్య చేశాడు?
మృతదేహంతో ఎస్పీ బంగ్లా ఎదుట ఆందోళన నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ (క్రైమ్) : పాణ్యం సుప్రజ అలియాస్ కరుణమాలను భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుప్రజను హత్య చేసిన భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని గురువారం మృతదేహంతో ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే సుప్రజ భర్త పూర్ణప్రసాద్‌ను కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట కుంకుంపూడికి చెందిన ప్రసాద్ కుమార్తె సుప్రజకు అదే గ్రామానికి చెందిన పాణ్యం పూర్ణప్రసాద్ (చిట్టమూరు కానిస్టేబుల్, ప్రస్తుతం రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నాడు)తో 2013 నవంబర్ 9న వివాహమైంది. ఆ సమయంలో సుప్రజ తల్లిదండ్రులు పూర్ణప్రసాద్‌కు కట్నం కింద రూ. 1.5 లక్షల నగదు, 20 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వివాహానంతరం పూర్ణప్రసాద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించ సాగారు. తన తల్లిదండ్రులకు అంతస్తోమత లేదని చెప్పడంతో మరింతగా వేధించడం ప్రారంభించారు. ఈ విషయమై పలుమార్లు తల్లిదండ్రుల వద్ద వాపోయింది. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని పూర్ణచంద్రరావు వచ్చి పుట్టింటిలో ఉన్న భార్యను తన ఇంటికి తీసుకువచ్చాడు. బుధవారం సుప్రజ మృతి చెందిన విషయం తెలిసిందే. సుప్రజ ఆత్మహత్య చేసుకుని చనిపోయే అంత పిరికిది కాదని.. భర్త, అత్త సుగుణమ్మలే ఆమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తల్లిదండ్రులు వెంకటాచలం ఎస్ఐ రహమతుల్లాకు ఫిర్యాదు చేశారు. ఆమె మెడపై కూడా ఉరేసుకున్న గాయాలు లేవని, సుప్రజను కొట్టిచంపారని వాపోయారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే సుప్రజ భర్త పూర్ణప్రసాద్, అతని తల్లి సుగుణమ్మ ఆస్పత్రికి రావడంతో మృతురాలి బంధువులు వారిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వారిద్దరిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్పీ బంగ్లా ఎదుట ఉద్రిక్తత సుప్రజ భర్త పూర్ణప్రసాద్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు కేసు నీరుగారుస్తున్నారని, స్టేషన్లో అతనికి రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తూ పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో ఎస్పీ బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లా గేటు వద్ద మృతదేహాన్ని ఉంచి వెంటనే న్యాయం చేయాలని నినదించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్పీ బంగ్లా ఎదుట ఆందోళన విషయం తెలుసుకున్న నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, వీఎస్ రాంబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు వై. జయరామసుబ్బారెడ్డి, జి. శ్రీనివాసరావు, నాలుగు, ఆరో నగర ఇన్స్పెక్టర్లు జి. రామారావు, జి. మంగారావు బంగ్లా వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇప్పటికే పూర్ణప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
అనుమానాస్పదస్థితిలో యువతి మృతి
ప్రియుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని వచ్చిన కొద్దిసేపటికే ఘటన ఉప్పల్,న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ఈస్ట్ కళ్యాణ్‌పురికి చెందిన ఉప్పలయ్య కుమార్తె సుప్రజ(20), అదే ప్రాంతంలో ఉంటున్న ఉషాకిరణ్ ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించడంతో కొద్ది రోజులుగా కలిసి తిరుగుతున్నారు. ఆదివారం ప్రియుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు సుప్రజ తన స్నేహితులతో కలిసి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. మధ్యాహ్నం 1.30కి ప్రియుడు ఉషాకిరణ్, స్నేహితులు అలేఖ్య, నితిన్‌రెడ్డి.. సుప్రజను కారులో ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. సుప్రజ తనకు ఒంట్లో బాగోలేదని ఇంట్లో వారికి చెప్పింది. ఆమె నీరసంగా ఉండటం గమనించి కుటుంబసభ్యులు నిమ్మరసం తాగించారు. కొద్దిసేపటికి సుప్రజ అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు రామంతాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందింది. సుప్రజ మృతికి ఆమె తల్లిదండ్రులే కారణమని ప్రియుడు ఉషాకిరణ్ ఆరోపించడంతో ఆసుపత్రి వద్ద ఇరువురి బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురి బంధువులతో పాటు ఉషాకిరణ్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కాగా, తన కుమార్తె మృతిపై విచారణ జరిపించాలని సుప్రజ తల్లి వరలక్ష్మి పోలీసులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.