తాబేలు నడకల గురించి తక్కువ చేసి నవ్వుకునే కాలం కాదు ఇది. ప్రమాదం అంచున ఉన్న తాబేలు జాతి గురించి సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. చెన్నైకి చెందిన సుప్రజ నుంచి లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వరకు ఎంతోమంది నారీమణులు తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్నారు..
చుట్టుపక్కల చూడరా...
ముంబైకి చెందిన మోడల్ సౌందర్య గార్గ్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమీపంలోని చెత్తకుప్పలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కదలడం చూసి ఆ బ్యాగును ఓపెన్ చేసింది. అందులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే ల్యాబ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన వాలంటీర్ సూచనలతో తాబేలును ఇంటికి తీసుకెళ్లి నీటిలో పెట్టింది. ఆ తరువాత ఆ తాబేలునుపాస్–రెస్క్యూ టీమ్‌కు అప్పగించింది.
‘నేను–నా పని అని మాత్రమే... అని కాకుండా చుట్టుపక్కల కూడా తొంగి చూడాలి. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని ఆరోజు సౌందర్య అనుకొని ఉంటే, తాబేలే కదా వదిలేద్దాం అనే నిర్లక్ష్యంలో ఉండి ఉంటే ఒక జీవి బతికేది కాదు’ అంటుంది యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిషా సుబ్రమణ్యియన్. దిల్లీలో మార్నింగ్ వాక్‌కు వెళుతున్న ఒక మహిళ రోడ్డుపై తాబేలును గమనించి రక్షించింది. దీని తాలూకు వీడియో వైరల్ కావడమే కాదు నీటిలో ఉండాల్సిన తాబేళ్లు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నాయి? వాటిని రక్షించడానికి ఏంచేయాలి?’ అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.
ఆ విషాదంలో నుంచే..
కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త డా.జేన్ గుడాల్‌పై వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీని చూసింది చెన్నైకి చెందిన సుప్రజ ధరణి. ‘ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది’ అనే మాట ఆమెకు బాగా నచ్చడమే కాదు ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించింది.
సుప్రజ
ఒకరోజు పెరియ నీలంకరై బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సుప్రజ ఒడ్డున కనిపిస్తున్న తాబేలు దగ్గరికి వెళ్లింది. అది చని΄ోయి ఉంది. దాని శరీరంపై పదునైన తీగలతో కోతలు కోశారు. ఈ దృశ్యం తనని చాలా బాధ పెట్టింది. ఒక రకంగా చె΄్పాలంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ తనని వెంటాడింది.
ఈ నేపథ్యంలోనే తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. పుస్తకాలు చదవడం, మత్స్యకారులతో మాట్లాడం ద్వారా తాబేళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత ట్రీ ఫౌండేషన్ (ట్రస్ట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్)కు శ్రీకారం చుట్టింది. తాబేళ్ల సంరక్షణ విషయంలో చేసిన కృషికి గుర్తింపుగా డిస్నీ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ అవార్డ్, సీ వరల్డ్‌లాంటి ఎన్నో అవార్డ్‌లు అందుకుంది సుప్రజ.
విజ్జీ–ది టర్టిల్ గర్ల్..
భారతదేశ మొట్టమొదటి మహిళా హెర్పెటాలజిస్ట్, టర్టిల్ ఫీల్డ్ బయోలజిస్ట్‌గా గుర్తింపు పొందింది జె.విజయ. చిన్న వయసులోనే చని΄ోయింది. అయితే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేసింది. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ పక్కన ఉన్న టర్టిల్‌పాండ్ దగ్గర ఆమె స్మారక చిహ్నం ఉంది. మద్రాస్ స్నేక్‌పార్క్‌లోకి వాలంటీర్‌గా అడుగుపెట్టింది విజయ.
విజయ
అప్పుడు ఆమె మద్రాస్‌లోని ఎతిరాజ్ కాలేజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. స్నేక్‌పార్క్‌లో రకరకాల తాబేళ్లను వేరు వేరు వ్యక్తులకు అప్పగించేవారు. అలా విజ్జీకి మంచినీటి తాబేళ్లను అప్పగించారు. అక్కడితో మొదలైన తాబేళ్లతో చెలిమి ఎంతో దూరం వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా వరకు తాబేళ్లకు ఎదురవుతున్న ముప్పు, సంరక్షణ గురించి ఎంతో పరిశోధన చేసింది. తాను తెలుసుకున్న వాటిని అక్షరబద్ధం చేసింది.
అరుణోదయం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వేలాది తాబేళ్లను రక్షించింది. తాబేళ్ల జీవితం, వాటిప్రాధాన్యత, సంరక్షణ గురించి ఎన్నో విద్యాలయాల్లో విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించింది. తాబేళ్ల సంరక్షకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణిమ సింగ్ తన బాటలో ఎంతోమందిని నడిపిస్తోంది.
గ్రీన్ టర్టిల్స్.. మీరు పచ్చగా బతకాలి
ఆకుపచ్చ తాబేళ్లు (చెలోనియా మైడాస్) ప్రమాదం అంచున అంతరించి΄ోయే జాతుల జాబితాలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవుల్లో ఆకుపచ్చ తాబేళ్లపై గతంలో జరిగిన పరిశోధనలను పీహెచ్‌డీ స్టూడెంట్ నుపుల్ కాలే మరింత ముందుకు తీసుకువెళుతోంది. సముద్రపు గడ్డి మైదానాలు తగ్గడంలాంటివి గ్రీన్ టర్టిల్స్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తన పరిశోధనలో తెలుసుకుంది.
నుపుల్ కాలే
‘సముద్ర తాబేళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటుంది కాలే. యూనివర్శిటీలో ఒకరోజు ‘గ్రీన్ టర్టిల్స్ గురించి పనిచేయడంపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు లెక్చరర్. ‘ఉంది’ అని చెప్పింది. ఆ తరువాత గ్రీన్ టర్టిల్స్‌కు సంబంధించి శ్రీలంకలో ఫీల్డ్‌వర్క్ చేసింది.‘గూడు కట్టుకోవడానికి ఒక గ్రీన్ టర్టిల్ బీర్‌లోకి వచ్చిన దృశ్యం తొలిసారిగా చూశాను. ఆ దృశ్యం చెక్కుచెదరకుండా ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది’ అంటుంది కాలే.
ఇవి చదవండి: ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు!
Comments
Please login to add a commentAdd a comment