vijaya
-
అఖిల ప్రియా ఓవర్ యాక్షన్ పై మామ స్ట్రాంగ్ రియాక్షన్...
-
ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయభారతి కన్నుమూత
సనత్‌నగర్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి, పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా మాతృమూర్తి డాక్టర్ విజయభారతి (83) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె, సనత్‌నగర్ రెనోవా నీలిమ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో ఆమె జన్మించారు. తెలుగు రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె ఎంఏ తెలుగు లిటరేచర్, అనంతరం పీహెచ్డీ చేశారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలను రచించారు. ముఖ్యంగా ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రలను తన పుస్తకాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా కూడా వ్యవహరించారు. 2005లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డులు ఆమెకు దక్కాయి. విజయభారతి పారి్థవదేహాన్ని ఆదివారం గాంధీ మెడికల్ కళాశాలకు అందించనున్నారు. ప్రముఖుల సంతాపం: ప్రముఖ రచయిత్రి, ఐఏఎస్ అధికారి బొజ్జా రాహుల్ తల్లి డాక్టర్ విజయభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించడంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వంటి రచనలు వెలువరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సాహితీరంగానికి ఆమె చేసిన సేవలు అపారమైనవని పేర్కొ న్నారు. రాహుల్ బొజ్జాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. విజయభారతి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయభారతి మరణంపై సెంటర్ ఫర్ దళిత్ స్టూడెంట్ (సీడీఎస్) చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్కృష్ణ సంతాపం ప్రకటించారు. -
అటు ఒక పీకే..ఇటు ఒక పీకే..బాబూ సరిపోయిందా?
-
World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి!
తాబేలు నడకల గురించి తక్కువ చేసి నవ్వుకునే కాలం కాదు ఇది. ప్రమాదం అంచున ఉన్న తాబేలు జాతి గురించి సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. చెన్నైకి చెందిన సుప్రజ నుంచి లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వరకు ఎంతోమంది నారీమణులు తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్నారు..చుట్టుపక్కల చూడరా...ముంబైకి చెందిన మోడల్ సౌందర్య గార్గ్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమీపంలోని చెత్తకుప్పలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కదలడం చూసి ఆ బ్యాగును ఓపెన్ చేసింది. అందులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే ల్యాబ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన వాలంటీర్ సూచనలతో తాబేలును ఇంటికి తీసుకెళ్లి నీటిలో పెట్టింది. ఆ తరువాత ఆ తాబేలునుపాస్–రెస్క్యూ టీమ్‌కు అప్పగించింది.‘నేను–నా పని అని మాత్రమే... అని కాకుండా చుట్టుపక్కల కూడా తొంగి చూడాలి. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని ఆరోజు సౌందర్య అనుకొని ఉంటే, తాబేలే కదా వదిలేద్దాం అనే నిర్లక్ష్యంలో ఉండి ఉంటే ఒక జీవి బతికేది కాదు’ అంటుంది యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిషా సుబ్రమణ్యియన్. దిల్లీలో మార్నింగ్ వాక్కు వెళుతున్న ఒక మహిళ రోడ్డుపై తాబేలును గమనించి రక్షించింది. దీని తాలూకు వీడియో వైరల్ కావడమే కాదు నీటిలో ఉండాల్సిన తాబేళ్లు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నాయి? వాటిని రక్షించడానికి ఏంచేయాలి?’ అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.ఆ విషాదంలో నుంచే..కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త డా.జేన్ గుడాల్పై వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీని చూసింది చెన్నైకి చెందిన సుప్రజ ధరణి. ‘ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది’ అనే మాట ఆమెకు బాగా నచ్చడమే కాదు ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించింది.సుప్రజఒకరోజు పెరియ నీలంకరై బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సుప్రజ ఒడ్డున కనిపిస్తున్న తాబేలు దగ్గరికి వెళ్లింది. అది చని΄ోయి ఉంది. దాని శరీరంపై పదునైన తీగలతో కోతలు కోశారు. ఈ దృశ్యం తనని చాలా బాధ పెట్టింది. ఒక రకంగా చె΄్పాలంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ తనని వెంటాడింది.ఈ నేపథ్యంలోనే తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. పుస్తకాలు చదవడం, మత్స్యకారులతో మాట్లాడం ద్వారా తాబేళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత ట్రీ ఫౌండేషన్ (ట్రస్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్)కు శ్రీకారం చుట్టింది. తాబేళ్ల సంరక్షణ విషయంలో చేసిన కృషికి గుర్తింపుగా డిస్నీ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ అవార్డ్, సీ వరల్డ్‌లాంటి ఎన్నో అవార్డ్లు అందుకుంది సుప్రజ.విజ్జీ–ది టర్టిల్ గర్ల్..భారతదేశ మొట్టమొదటి మహిళా హెర్పెటాలజిస్ట్, టర్టిల్ ఫీల్డ్ బయోలజిస్ట్గా గుర్తింపు పొందింది జె.విజయ. చిన్న వయసులోనే చని΄ోయింది. అయితే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేసింది. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ పక్కన ఉన్న టర్టిల్పాండ్ దగ్గర ఆమె స్మారక చిహ్నం ఉంది. మద్రాస్ స్నేక్పార్క్లోకి వాలంటీర్‌గా అడుగుపెట్టింది విజయ.విజయఅప్పుడు ఆమె మద్రాస్‌లోని ఎతిరాజ్ కాలేజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. స్నేక్పార్క్లో రకరకాల తాబేళ్లను వేరు వేరు వ్యక్తులకు అప్పగించేవారు. అలా విజ్జీకి మంచినీటి తాబేళ్లను అప్పగించారు. అక్కడితో మొదలైన తాబేళ్లతో చెలిమి ఎంతో దూరం వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్కత్తా వరకు తాబేళ్లకు ఎదురవుతున్న ముప్పు, సంరక్షణ గురించి ఎంతో పరిశోధన చేసింది. తాను తెలుసుకున్న వాటిని అక్షరబద్ధం చేసింది.అరుణోదయం..ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వేలాది తాబేళ్లను రక్షించింది. తాబేళ్ల జీవితం, వాటిప్రాధాన్యత, సంరక్షణ గురించి ఎన్నో విద్యాలయాల్లో విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించింది. తాబేళ్ల సంరక్షకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణిమ సింగ్ తన బాటలో ఎంతోమందిని నడిపిస్తోంది.గ్రీన్ టర్టిల్స్.. మీరు పచ్చగా బతకాలిఆకుపచ్చ తాబేళ్లు (చెలోనియా మైడాస్) ప్రమాదం అంచున అంతరించి΄ోయే జాతుల జాబితాలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవుల్లో ఆకుపచ్చ తాబేళ్లపై గతంలో జరిగిన పరిశోధనలను పీహెచ్డీ స్టూడెంట్ నుపుల్ కాలే మరింత ముందుకు తీసుకువెళుతోంది. సముద్రపు గడ్డి మైదానాలు తగ్గడంలాంటివి గ్రీన్ టర్టిల్స్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తన పరిశోధనలో తెలుసుకుంది.నుపుల్ కాలే‘సముద్ర తాబేళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటుంది కాలే. యూనివర్శిటీలో ఒకరోజు ‘గ్రీన్ టర్టిల్స్ గురించి పనిచేయడంపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు లెక్చరర్. ‘ఉంది’ అని చెప్పింది. ఆ తరువాత గ్రీన్ టర్టిల్స్కు సంబంధించి శ్రీలంకలో ఫీల్డ్‌వర్క్ చేసింది.‘గూడు కట్టుకోవడానికి ఒక గ్రీన్ టర్టిల్ బీర్‌లోకి వచ్చిన దృశ్యం తొలిసారిగా చూశాను. ఆ దృశ్యం చెక్కుచెదరకుండా ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది’ అంటుంది కాలే.ఇవి చదవండి: ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు! -
పురందేశ్వరి వ్యాఖ్యలపై జర్నలిస్ట్ విజయబాబు విశ్లేషణ
-
Telangana: రేపట్నుంచి బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర
-
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు. న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు. -
ఈ సర్పంచ్ వెరీ స్పెషల్
రాజకీయాన్ని సంపాదనకు మార్గం అనుకునే ప్రస్తుత రోజుల్లో ఓ సర్పంచ్ తీరు ఆదర్శంగా నిలిచింది. సరైన రోడ్డు సదుపాయం లేక గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన ఆమె తన సొంత నిధులతో వంతెన నిర్మించారు. నాతవరం మండలంలోని వైబీ అగ్రహారం ఊరగెడ్డపై సర్పంచ్ కోసూరి విజయ నిర్మించిన వంతెన గ్రామస్తుల వెతలను తొలగించింది. వారి మన్ననలు పొందేలా చేసింది. అనకాపల్లి: మండలంలోని వైబీ అగ్రహారం పంచాయతీకి దశాబ్దాలుగా సరైన రోడ్డు సదుపాయం లేదు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనే లేదు. ఈ పంచాయతీ మొదటి నుంచీ టీడీపీకి కంచుకోట. టీడీపీ మండల అధ్యక్షుడే ఈ గ్రామానికి 15 ఏళ్లుగా సర్పంచ్. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పంచాయతీని ఈసారి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆశీస్సులతో కోసూరి విజయ గెలిచారు. ఇంతటి నమ్మకాన్నిచ్చిన పంచాయతీ ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోయే మంచి పని చేయాలని సర్పంచ్ విజయ, ఆమె భర్త బుజ్జి నిర్ణయించుకున్నారు. 5 కి.మీ. దూరం తగ్గింది దీంతో గ్రామానికి అనుకుని ఉన్న ఊరగెడ్డపై వంతెన నిర్మిస్తే మండల కేంద్రానికి వెళ్లే దూరం 5 కి.మీ. తగ్గనుండటంతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ సొంత నిధులు రూ.3.40 లక్షలు వెచ్చించి వంతెనతోపాటు, అనుసంధాన రోడ్డును పూర్తి చేశారు. వంతెన అందుబాటులోకి రావడంతో మండల కేంద్రానికి వెళ్లే దూరం, సమయం తగ్గడంతోపాటు, ఈ ప్రాంతంలో సుమారుగా 500 ఎకరాల భూముల్లో రైతుల పండించే వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఇపుడు ఒకటిన్నర కి.మీ. ప్రయాణిస్తే పంట ఉత్పత్తుల్ని గమ్యస్థానానికి చేరవేయొచ్చు. మరోవైపు నాయుడుపాలెం, మన్యపురట్ల, లింగంపేట, మండల కేంద్రం నాతవరానికి దగ్గర దారి ఏర్పడింది. పెరిగిన భూముల ధరలు వంతెన నిర్మాణంతో చుట్టు పక్కల వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు మార్గం సుగమం కావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత భూముల ధరలు పెరిగిపోయాయి. నేరుగా పంట పొలాల్లోకి వాహనాలు పోయే మార్గం ఏర్పాటయింది. సర్పంచ్ తన సొంత నిధులతో నిర్మించిన వంతెనను ఆర్భాటాలకు తావులేకుండా వార్డు సభ్యులు, గ్రామపెద్దలతోనే ప్రారంభించి, రాకపోకలు సాగించడం గమనార్హం. దీనిపై సర్పంచ్ విజయ సాక్షితో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రచారం వద్దని, గ్రామస్తుల హృదయాల్లో తాము చేసిన మంచి నిలిచిపోతే చాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అఽందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
లవ్ యూ బామ్మా
85 సంవత్సరాల వయసులో కంటెంట్ క్రియేటర్‌గా మారింది విజయ నిశ్చల్. ఫ్రెంచ్ ఫ్రై, సమోస. గులాబ్ జామూన్, పొటాటో బాల్స్...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్ ద్వారా నేర్పుతుంది నిశ్చల్. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్‌కు 8.41 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా నిశ్చల్ బామ్మ చేసిన ‘ఎగ్‌లెస్ కేక్’ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ‘ఎగ్‌లెస్ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్‌ను చూసి ఫ్రెండ్స్ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనబడుతున్నాయి. -
పల్లె గుండెల్లో విజయ వీచిక
పల్లె జనాలను కుటుంబ సభ్యుల్లా వరసలు పెట్టి ఆప్యాయంగా పిలవడం, అక్కడి ఆడపడుచులతో తోబుట్టువులా కలిసిపోవడం, ఊరి కష్టసుఖాలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించడం, రాత్రి అదే పల్లెలో నిద్రపోవడం, ఉదయం లేచి మళ్లీ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీయడం.. క్షేత్రస్థాయిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేసి చూపిస్తున్న కార్యక్రమాలివి. అధినేత ఆదేశాల మేరకు గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీ పతాకాన్ని జనం గుండెల్లో ప్రతిష్టిస్తున్నారామె. సంక్షేమ సమాచారం చేరవేస్తూనే.. సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. పల్లె నిద్ర, రచ్చబండ పేరుతో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆమెలోని నిఖార్సయిన రాజకీయ నాయకురాలికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బాబాయ్ బాగున్నావా..? అవ్వా ఆరోగ్యం ఎలా ఉంది..? పిల్లలూ బడికెళ్లి చదువుకుంటున్నారా..? అమ్మా.. పింఛన్ అందుతోందా..? జిల్లా ప్రథమ పౌరురాలు సాధారణ పల్లెవాసులతో మాట కలుపుతున్న పద్ధతి ఇది. జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేపడుతున్న పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమంలో ఇలాంటి ఆప్యాయమైన పలకరింపులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంతవరకు ఏ మహిళా నేత చేపట్టని ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలను అందుకుంటోంది. పేరు ఒకలా తీరు మరోలా కాకుండా పల్లె నిద్ర అంటే అచ్చంగా అదే పల్లెలో నిద్రిస్తూ.. రచ్చబండపై ముఖాముఖి మాట్లాడుతూ ఆమె ఆదర్శప్రాయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రథమ పౌరురాలు పిరియా విజయ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన హోదాని పక్కన పెట్టి ఒక సాధారణ మహిళగా గ్రామస్తులతో కలిసిపోతున్నారు. సొంత మనిషిగా మెలిగి లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. గ్రామస్తులతో ముఖాముఖీ తర్వాత రాత్రి బస చేసి గ్రామాల పరిస్థితులను చూస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉండి అక్కడి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమస్యలు తెలుసుకుని, సంక్షేమాలను వివరించి వారితో మమేకమవుతున్నారు. కార్యక్రమం జరుగుతోందిలా.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీ నుంచి సోంపేట మండలం ఉప్పలాం సచివాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అమలు చేయడం ప్రారంభించారు. ►సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సంబంధిత గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించినవి తెలియజేస్తూ, వారికి ఇంకేం కావాలో తెలుసుకొనే ప్రయత్నం చేసి, వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపిస్తున్నారు. ►రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామస్తులు, మహిళలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకొని, వాటిని అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ►తర్వాత ఆ గ్రామస్తులతోనే రాత్రి భోజనం చేసి, అక్కడే పల్లెనిద్ర చేస్తున్నారు. ►మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచి, మహిళలతో టీ తాగుతూ వారితో రచ్చబండపై సమావేశమవుతున్నారు. ►గ్రామంలో అందుబాటులో ఉన్న టిఫిన్ చేసి మళ్లీ ఉదయం 7 గంటలకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, మిగతా ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్, గ్రామస్తులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముందురోజు మిగిలిపోయిన గడపలను తిరిగేలా మరుసటి రోజు ఉదయం 11గంటల వరకు నిర్వహిస్తున్నారు. 9 గ్రామాల్లో పల్లెనిద్ర, రచ్చబండ.. ► ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీన సోంపేట మండలం ఉప్పలాం గ్రామంలో ప్రారంభించిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను ఇప్పటి వరకు 9 చోట్ల నిర్వహించారు. ►నియోజకవర్గంలోని ఉప్పలాం, బట్టిగళ్లూరు, గొల్లవూరు, శాసనాం, మామిడిపల్లి–1, మామిడిపల్లి–2, ఇచ్ఛాపురం మండలం డొంకూరు, అరకభద్ర గ్రామాలు, కవిటి మండలం భైరిపురం గ్రామాల్లో చేపట్టారు. వేలాది గడపలను సందర్శించారు. వందలాది సమస్యలను స్వీకరించారు. ► సోంపేట మండలం ఉప్పలాంలో 110, గొల్లవూరులో 20, టి.శాసనం పంచాయతీలో 10, మామిడిపల్లి పంచాయతీలో 30, కవిటి మండలం బైరీపురంలో 20, ఇచ్ఛాపురం మండలం టి.బరంపురంలో 10, అరకభద్రలో 10, డొంకూరులో 10 వినతులను స్వీకరించారు. ►వచ్చిన అర్జీల్లో చాలా వరకు హౌసింగ్, రేషన్‌కార్డు, డ్రైనేజీ తాగునీటి, రోడ్లు తదితరమైనవి ఉన్నాయి. ఇవన్నీ వెంటనే పరిష్కరించదగ్గ వినతులే కావడంతో అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతున్నారు. పరిష్కారాలను చూపుతూ ప్రజలతో మమేకమవుతున్నారు పిరియా విజయ. -
'ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం'..! రెండ్రోజులుగా.. బిక్కు బిక్కుమంటూ..
కరీంనగర్: ‘ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం’ అని చెప్పి ఓ మహిళను వదిలేసి వెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐబీ రోడ్డులో చోటు చేసుకుంది. సదరు మహిళ రెండు రోజులుగా దిక్కుమొక్కు లేక చలిలో..వానలో వాటర్ ట్యాంక్ కింద ఉండి తనవాళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఆమె దీనస్థితి అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం కొందరు ఆటోలో వచ్చి ఐబీ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గర అనారోగ్యంతో ఉన్న మహిళ(45)ను వదిలేసి వెళ్లారు. అదే ఏరియాలో ఉండే మైనార్టీ యూత్ యువకులు అబుబకర్, షోయబ్ రెండు రోజులుగా వాటర్ ట్యాంక్ కింద ఉన్న మహిళను గుర్తించి ప్రశ్నించగా తనను రెండు రోజుల క్రితం తమవాళ్లు ఆటోలో తెచ్చి ఇక్కడ వదిలేశారని చెప్పింది. దీంతో ఆమె అనారోగ్య పరిస్థితిని గుర్తించిన యువకులు.. వెంటనే వార్డు కౌన్సిలర్ పేర్ల సత్యంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన వార్డు కౌన్సిలర్ సత్యం.. సోమవారం రాత్రి అక్కడికి వచ్చి అనారోగ్యంతో పడిఉన్న మహిళ వివరాలు తెలుసుకున్నారు. తన పేరు మిర్యాల లక్ష్మి అని, తనది నిజామాబాద్ జిల్లా అని, తమవాళ్లు తనను ఇక్కడ వదిలేసి వెళ్లారని అస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కాగా ఆమె చేయిపై విజయ అని పచ్చబొట్టు ఉందని కౌన్సిలర్ పేర్ల సత్యం చెప్పారు. అనారోగ్యంతో ఉన్నసదరు మహిళను యూత్ ప్రతినిధులు అబుబకర్, షోయబ్‌తో కలిసి కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ సరైన సమాధానాలు చెప్పకపోగా ఆమె కాలుకు తీవ్రమైన గాయంతో పుండు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు.. ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కళ్లెదుటే భర్త, కన్నకూతురు, తోడబుట్టిన తమ్ముడు చనిపోతే..
విషాదం నుంచి మొదలై.. కళ్లెదుటే భర్త, కన్నకూతురు, తోడబుట్టిన తమ్ముడు చనిపోతే.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అచేతనంగా పడి ఉంటే.. ఎవరైనా ఏం చేస్తారు? జీవితాంతం ఆ విషాద ఘటనను గుర్తు చేసుకుని జీవశ్చవంలా మారిపోతారు. గుండెల్ని పిండేసే ఆ ఘటన తలచుకుంటేనే హృదయం ద్రవించిపోతోంది. మరీ. కళ్లారా చూసి ఆ ఘోరాన్ని భరించాలంటే ఆ బాధ వర్ణనాతీతం. కానీ సరిగ్గా అటువంటి విషాద సంఘటనే ఆమె జీవితంలో చోటు చేసుకుంది. కానీ అందరిలా విధి రాత, తలరాత అనుకుంటూ ఆమె కుమిలిపోతూ కూర్చోలేదు. బతికి ఉన్న కొడుకులో భర్త, కూతురు, తమ్ముడిని చూసుకుంటూ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. తండ్రి ఇచ్చిన మనోధైర్యంతో విజయతీరాలకు చేరారు టెకీ విజయగౌరి. బాధను దిగి మింగి ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ఉన్నత చదువులు చదివి పీహెచ్డీ పూర్తి చేసింది. ప్రస్తుతం రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె జీవన పోరాటాన్ని ఆమె మాటల్లోనే విందాం.. కుటుంబ నేపథ్యం.. మాది విశాఖపట్నం గాజువాక. నాన్న కృష్ణారావు డాక్ యార్డ్‌లో ఉద్యోగి. అమ్మ లక్ష్మీ గృహిణి, కుటుంబ, ఆర్థిక కట్టుబాట్ల కారణంగా ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేశారు. 1992లో సూర్యప్రకాష్‌తో వివాహమైంది. భర్త ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఇద్దరు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతోంది. చదువుపై ఉన్న శ్రద్ధతో ఆయన సహకారంతో 2000లో దూరవిద్యలో ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. 2002లో హిందీ బీఈడీలో సీటు వచ్చినప్పటికీ వదులుకోవాల్సి వచ్చింది. ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశాను. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా విషాదం. సంకాంత్రి పండుగ వేళ 2003 జనవరి 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త, కూతురు, తమ్ముడు చనిపోయారు. నేను, ఆరేళ్ల మా బాబు కోమాలోకి వెళ్లాం. అయితే మా అత్తింటి వారు నా భర్త, పాప మృతదేహాలు మా పుట్టింటి వద్దే వదిలివెళ్లిపోయారు. అప్పటి నుంచి మా పుట్టింట్లోనే అమ్మా నాన్న వద్దే ఉంటున్నాను. 2004లో కారుణ్య నియామకం.. నా భర్త ఉపాధ్యాయుడు కావడంతో కారుణ్య నియామకాల్లో 2004 ఏప్రిల్ 3న సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి గ్రామంలో పోస్టింగ్. అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కంటే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగానికి జీతం ఎక్కువ కావడం, కారుణ్య నియామకం కింద టీచర్‌గా పోస్టింగ్ ఇవ్వడం సరికాదని, దీనికి సంబంధించి సెప్టెంబర్ 2002 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, తెలుసుకోకుండా పోస్టింగ్ ఇచ్చారని సరెండర్ చేశారు. దీంతో మళ్లీ ఒంటరి పోరాటం ప్రారంభం అయ్యింది. పిల్లాడి చదువు, ఇంటిపోషణ చూసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. నవంబర్, 2005లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. నాన్న ఇచ్చిన ధైర్యంతో ఉద్యోగం చేస్తూనే పట్టు వదలకుండా చదువు కొనసాగించాను. పీహెచ్డీ చేయాలనే అభిరుచి, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంగ్లిషు అభివృద్ధి చేసి, సేవ చేయాలనే ఆలోచనతో ఎంఏ ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత కృష్ణా యూనివర్సిటీలో పీహెచ్‌డీలో జాయిన్ అయ్యాను. 2023 మార్చి 29న డాక్టరేట్ పొందాను. ఎందరో ప్రోత్సాహం.. నా జీవిత ప్రయాణంలో విజయనగరం నుంచి రాజ్‌భవన్ వరకు ఎందరో వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రత్యేకంగా డాక్టర్ ఎన్.అప్పారావు, డాక్టర్ మోహన్‌రావు, సీహెచ్ ప్రసాదరావు, ఎం. కోటేశ్వరరావుకు ధన్యవాదాలు. నా కొడుకు శశిధర్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. మా నాన్నకు డాక్టరేట్ అంకితమిస్తున్నా. నాన్న ఇచ్చిన ధైర్యంతో.. ఒంటరిగా ఉంటే పిచ్చిదానివి అయిపోతావు. నీ కొడుకు కోసమైనా నీవు అన్ని మరిచిపోయి బతికి ఉండాలి. మామూలు మనిషివి కావాలంటూ నాన్న వెన్నుతట్టారు. గుండె ధైర్యం నింపారు. మళ్లీ చదువు బాట పట్టించారు. 2003లో గురజాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీకాకుళంలో బీఎడ్ జాయిన్ చేశారు. ఇక ప్రతిరోజు తెల్లవారు జామున నాలుగంటలకు నిద్ర లేచి బస్సులో గాజువాక నుంచి శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామం వెళ్లడం.. రావడం. ఇంటికి రాగానే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న కొడుకు. ఓ వైపు పిల్లాడికి చదువు చెప్పుకుంటూ నేను చదువుకుంటూ బీఎడ్ డిస్టింక్షన్లో పాసయ్యాను. -
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
యాపిల్ డేస్ సేల్: ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు విజయ్ సేల్స్ స్టోర్స్, ఆన్లైన్ వెబ్సైట్ ఆపిల్ డేస్ సేల్ కొనసాగనుంది. ఈసేల్‌లో యాపిల్ ఐఫోన్13, 14, ఎంఐ మ్యాక్బుక్ఎయిర్ (M1 MacBook Air) తదితర యాపిల్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ,డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ కారర్డ్స్కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా పొందవచ్చు. అలాగే నో కాస్ట్ EMI స్కీమ్ కూడాఉంది. దీంతోపాటు మొత్తం కొనుగోలుపై 0.75శాతం MyVS లాయల్టీ రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తుందిజ వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో విస్తరించి ఉన్న కంపెనీకి చెందిన 125+ స్టోర్లలోఈ సేల్ యాక్టివ్‌గా ఉంటుంది. కంపెనీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆఫర్లను పొందవచ్చు. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) రూ. 69,900విలువైన ఐఫోన్ 13 ప్రత్యేక డీల్ ధర రూ. 61,490. హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా రూ. 2వేలు తగ్గింపు. మొత్తంగా రూ. 59,490కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ) ఐఫోన్ 14 ప్లస్ ఆఫర్ ధర రూ. 80,490 కాగా, వెనిలా ఐఫోన్ 14 రూ. 70,990కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్‌లు వరుసగా రూ. 1,20,990 , రూ. 1,31,490కి అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ , డెబిట్ కార్డ్‌ల ద్వారా ఐఫోన్ 14 సిరీస్‌పై రూ. 4వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం. (ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!) యాపిల్ ఎంఐ మ్యాక్ బుక్ ఎయిర్ రూ. 82,900కి అందుబాటులో ఉంటుంది. మిగిలిన ల్యాప్‌టాప్‌లపై కస్టమర్లు రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇంకా ఐప్యాడ్స్ , ఎయిర్‌పాడ్స్, వాచెస్‌పై తగ్గింపుధరలను ప్రకటించింది. -
Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే!
ఆమె రోజుకు ఆరు గంటలు పని చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? నిజమే. ఆమె వయసు డెబ్బయ్. ఇదీ ఆమె ప్రత్యేకత. తన కోసమే కాదు... సమాజానికీ పనిచేస్తారు. ‘సృజనాత్మకత మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇష్టమైన పని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ విలువైనదే... సద్వినియోగం చేసుకోవాలి’ అంటూన్న విజయాగుప్తా పరిచయం. ఇది స్క్రీన్ ఎరా. టీవీ స్క్రీన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్. ఇరవై నాలుగ్గంటల్లో పద్నాలుగు గంటలు స్క్రీన్‌తోనే గడిపేస్తున్నారు. స్క్రీన్ మీద పని చేయాల్సిన ఉద్యోగులకు తప్పదు. మరి ఖాళీగా ఉంటూ సమయం ఎలా గడపాలో తెలియక స్క్రీన్‌కి అంకితమయ్యే వాళ్లు మాత్రం తప్పనిసరిగా తమ ఇరవై నాలుగ్గంటలనూ ఒకసారి విశ్లేషించుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్, హిమాయత్ నగర్‌కు చెందిన విజయాగుప్తా కోట్రికె. తనకిష్టమైన వ్యాపకం కోసం ఇంట్లో ఒక గదిని వర్క్ స్టేషన్‌గా మార్చుకున్నారామె. ఎనిమిదేళ్ల వయసులో గ్రీటింగ్ కార్డు తయారు చేసిన సృజనాత్మకమైన ఆమె విజయ ప్రస్థానం ఇది. జీవితం ఇచ్చిన గిఫ్ట్ ‘‘మా నాన్న ఉద్యోగ రీత్యా నేను పుట్టినప్పుడు చెన్నైలో ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలతో మొత్తం ఏడుగురం. ఇంట్లో ఎవరూ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పెళ్లి పత్రికల వెనుక ఖాళీ పేజీ మీద బొమ్మలు గీసి, పత్రిక మీద ఉండే కొన్ని బొమ్మలను కత్తిరించి అతికించి సొంతంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశాను. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో విరామం వచ్చింది. పిల్లలు పెద్దయ్యి, నాక్కొంత విరామం వచ్చేటప్పటికి యాభై ఏళ్లు నిండాయి. అప్పుడు అనుకోకుండా ఒక వరలక్ష్మీవ్రతంలో వాళ్లిచ్చిన రిటర్న్ గిప్టులు చూసినప్పుడు నాలోని సృజనాత్మక కోణం నిద్రలేచింది. ఆ సందర్భం... జీవితం నాకిచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు రెండు వందలకు పైగా క్రియేటివ్ పీస్‌లను తయారు చేస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్లకు వెళ్లడం అలవాటు. కొన్నా కొనకపోయినా సరే... ఎగ్జిబిషన్లకు వెళ్లేదాన్ని. ఏ ప్రాంతం ఏ హస్తకళలకు ప్రసిద్ధి అనేది అవగతమైంది. అలా ఉదయ్పూర్కెళ్లి అక్కడి కళాకారుల పనితీరును తెలుసుకున్నాను. నేను బీఏ హిందీ లిటరేచర్ స్టూడెంట్‌ని కావడంతో భాష సమస్య రాలేదు. మావారి సలహాతో నేను చేస్తున్న పనిని రిజిస్టర్ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్లకు పని చేసివ్వడంతోపాటు పని నేర్చుకుంటామని వచ్చే మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాను. ఇదీ రొటీన్! ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల వేడి నీటిని తాగుతాను. అరగంట వాకింగ్, మరో అరగంట డాక్టర్ సూచించిన ఎక్సర్సైజ్లు. ఎనిమిదింటికి కాఫీ లేదా టీ, ఓ గంట సేపు ఫోన్లో మెసేజ్ లు చెక్ చేసుకుని నా క్లయింట్ల నుంచి ఆర్డర్లు, ఇతర సందేహాలకు రిప్లయ్ ఇస్తాను. పదిగంటలకు వంట, పూజ పూర్తి చేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. రెండు గంటలు విశ్రాంతి. మధ్యాహ్న భోజనం తర్వాత మా వారు బయటకు వెళ్లినప్పటి నుంచి నా గదిలో పని మొదలు పెడితే ఏడు గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం. కొద్దిసేపు టీవీలో వార్తా విశేషాలు, గేమ్ షోలు కొద్దిసేపు టీవీ చూడడం పది గంటలకు నిద్ర. వారంలో మూడు రోజులు మా వాసవీ మహిళా సంఘం కార్యకలాపాలతో ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటాను. హడావుడిగా పరుగులు ఉండవు, కానీ పనిలో ఉంటాను. మా అబ్బాయి, అమ్మాయి కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు మా ఇంటికి వచ్చే ముందు ‘రేపు నీ పనులేంటమ్మా? మేము ఎప్పుడు రావచ్చు’ అని అడుగుతారు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వాళ్ల పిల్లల చదువులతో బిజీగా ఉంటారు. పిల్లలు మన కోసం టైమ్ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ వయసులో తరచూ నిరాశ ఎదురవుతుంటుంది. అందుకే నా టైమ్‌ని సహాయం అవసరమైన బాలికల చదువు, ఉపాధి కల్పనలో నిమగ్నం చేసుకుంటాను. లాభనష్టాల్లేకుండా నడిచే బాలికల హాస్టల్ నిర్వహణ, మహిళా సంఘం కార్యకలాపాలు సంయుక్తంగా చూసుకుంటాం. సహాయం అవసరమై వచ్చిన వాళ్లకు హాస్టల్లో వసతి ఇచ్చి, మహిళా సంఘం తరఫున స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. ఉడాన్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లోనూ మెంబర్ని. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తిగా అందనప్పుడు మా సంస్థ నుంచి వాళ్ల పిల్లల చదువు కోసం స్కూల్ ఫీజులు చెల్లిస్తాం. ఇదే మంచి సమయం! నా వయసు మహిళలకు నేను చెప్పగలిగిందొక్కటే... విశ్రాంత జీవితం శాపం కాదు, ఇది ఒక వరం. పిల్లలు మన మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చూసుకోవాలని కోరుకోకూడదు. ఎవరికి వాళ్లు తమకంటూ ఒక వ్యాపకాన్ని వృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, పూజలు, సత్సంగాలు, ఆలయాల సందర్శనం... ఏదైనా కావచ్చు. మనిషికి సోషల్ లైఫ్ ఉండాలి. ఇంటినుంచి బయటకు వస్తే పరిచయాలు పెరుగుతాయి. భావ సారూప్యం కలిగిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో ప్రతిరోజూ సంతోషకరంగానే గడుస్తుంది’’ అన్నారు విజయా గుప్తా కోట్రికె. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
‘నిత్యానంద కైలాస’ను పరిగణించం: ఐరాస
జెనీవా: భారత్‌లో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన నిత్యానంద స్వామి నెలకొల్పినట్లు చెబుతున్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)’ దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులు జెనీవాలో గత నెల 24న ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక చర్చాగోష్టిలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఐరాస గుర్తించని దేశం తరఫు వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఎలా భాగస్వాములయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఐరాస స్పష్టతనిచ్చింది. ‘యూఎస్‌కే ప్రతినిధులు వాస్తవానికి ఒక దేశం తరఫున ఆ చర్చలో పాల్గొనలేదు. కేవలం ఒక స్వచ్ఛంద సంస్థగా వాళ్లు వచ్చి మాట్లాడారు. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు’ అని ఐరాస బుధవారం స్పష్టంచేసింది. ‘ జెనీవా చర్చాగోష్ఠిలో ముందస్తు అనుమతితో ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. పలు సమస్యలు, ఇతివృత్తాలపై వెలువడే భిన్నాభిప్రాయాలతో కూడిన ముసాయిదా అది. ఐరాసలో కైలాస దేశ శాశ్వత మహిళా రాయబారిగా చెప్పుకున్న విజయప్రియ నిత్యానంద అభిప్రాయాలను పట్టించుకోబోం’ అని జెనీవాలోని ఐరాస మానవహక్కుల హై కమిషనర్ చెప్పారు. -
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
భారత్‌పై ఎలాన్ మస్క్ స్వీట్ రివెంజ్!
మూవీ క్లైమాక్స్‌ను తలపించిన బిలియనీర్ ఎలాన్ మస్క్..ట్విట్టర్ కొనుగోలు అంశం ఎట్టకేలకు ముగిసింది. కోర్టు ఇచ్చిన గడువు లోపే భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన మస్క్..భారత్‌పై రివెంజ్ తీర్చుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి ట్విట్టర్‌లోని తాజా పరిణమాలు. బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ మస్క్‌కు అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రకారమే మస్క్ 44 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు) మైక్రో బ్లాగింగ్ సంస్థను దక్కించుకున్నారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్,లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ సహా మరికొంత మంది టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను మస్క్ తొలగించారు. మస్క్ బాస్ అయితే ట్విట్టర్లో తొలగింపులు ఉంటాయంటూ ముందు నుంచి వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ భారతీయుడైన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని ఫైర్ చేయడం చర్చాంశనీయంగా మారింది. ఈ తరుణంలో మస్క్ భారత్‌పై రివెంజ్ తీర్చుకున్నారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా గతంలో భారత్ విషయంలో మస్క్‌కు ఎదురైన చేదు అనుభవాల్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఎలాన్ మస్క్ తన టెస్లా కార్లను ఇక్కడ అమ్మకాలు జరిగేలా ఏడాది పాటు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చలు జరుగుతున్న సమయంలో దేశీయంగా టెస్లా షోరూంలు, స్వరీస్ సెంటర్ల కోసం స్థలాల్ని వెతికారు. అయితే చైనాలో తయారైన టెస్లా కార్లను భారత్‌లో దిగుమతి చేసి విక్రయిస్తామని, దిగుమతి సుంకాల్ని తగ్గించాలని ప్రతిపాదించారు. మస్క్ ప్రతిపాదనల్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించింది. తొలత తమ కార్లను ఇక్కడ అమ్మడానికి, సర్వీస్ చేయడానికి అనుమతిస్తే భారత్‌లో ఎలక్ట్రిక్ వెహిక్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామని మస్క్ తెగేసి చెప్పారు. ఆ తర్వాత శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల్ని ప్రపంచ వ్యాప్తంగా 32దేశాల్లో అందిస్తున్నారు. ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ అనువైన దేశంగా భావించి.. గతేడాది ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సేవల కంటే ముందు బుక్సింగ్ ప్రారంభించింది. లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న మస్క్ ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేయడంతో మస్క్‌కు భంగపాటు ఎదురైంది. అందుకే మస్క్ ట్విట్టర్ కొనుగోలతో ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్,లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెలను ఫైర్ చేశారని, అలా మస్క్ భారత్‌పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
ఏసీబీ వలలో ఎంపీడీవో
పి.గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కె.ఆర్.విజయ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ మంజూరు కోసం మండల పరిషత్ నుంచి 10 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మండలంలోని రాజులపాలెంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.1.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించాలని పంచాయతీలో నిర్ణయించారు. ఎంపీ లాడ్స్ మంజూరుకు ముందుగా గ్రామ పంచాయతీ నుంచి 10 శాతం, మండల పరిషత్ నుంచి 10 శాతం సొమ్ము మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంది. మండల పరిషత్ మ్యాచింగ్ గ్రాంటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉప సర్పంచ్ ఎన్.విజయలక్ష్మి ఇటీవల ఎంపీడీవో విజయను కోరారు. అనుమతి ఇచ్చేందుకు ఎంపీడీవో రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈ నెల 6న విజయలక్ష్మి ఎంపీడీవోకు రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము కూడా ఇవ్వాలని ఎంపీడీవో ఒత్తిడి చేయడంతో ఉప సర్పంచ్ తమను ఆశ్రయించినట్టు ఏసీబీ ఏఎస్పీ సీహెచ్ సౌజన్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయలక్ష్మి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో విజయను పట్టుకున్నట్టు చెప్పారు. తమ పరీక్షల్లో ఎంపీడీవో నగదు తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. ఎంపీడీవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అరెస్టు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో సీఐలు వి.పుల్లారావు, బి.శ్రీనివాస్, వై.సతీ‹Ù, ఎస్ఐ ఎస్.విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
తెలుగు క్లాసిక్స్: విజయా వారి వేసవి
పిల్లలకు సెలవులు. ఈసారి ‘విజయా’ వారి వేసవి చూపించండి. అంటే? విజయ సంస్థ తీసిన సినిమాలు చూపించడమే. ఉపాయంతో మాంత్రికుణ్ణి హతమార్చే తోటరాముణ్ణి ‘పాతాళ భైరవి’లో, రాజ్యం లేకపోయినా శౌర్యానికి ఢోకా ఉండకూడదని చెప్పే అభిమన్యుడిని ‘మాయాబజార్’లో, లౌక్యం ఉంటే పనులు సాధ్యమవుతాయని చూపే ఎంటి.రావు, మేరీలను ‘మిస్సమ్మ’లో, గట్టిగా సంకల్పిస్తే ఏ కోరికైనా నెరవేర్చుకోవచ్చనే రాకుమారుడు ప్రతాప్‌ను ‘జగదేక వీరుని కథ’లో పరిచయం చేయడమే. పిల్లలకు ఈ సినిమాలు వినోదం మాత్రమే ఇవ్వవు... జీవన సూత్రాలను చెబుతాయి. తెలుగు మాట, పలుకు నేర్పుతాయి. ఇంకేటి... టివి ముందు కూచోబెట్టండి. ‘సాహసం సేయరా ఢింబకా’ అంటాడు నేపాళ మాంత్రికుడు ‘పాతాళ భైరవి’లో. సాహసం చేయకుండా ఉట్టినే కూచోడానికి కాదు పుట్టింది. చదువులోనో, ఉద్యోగంలోనో, బతుకులోనో ఏదో ఒక సందర్భంలో సాహసం చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. రాకుమారి కూడా. కాని సాహసం చేసే దారిలో ఎన్నో అడ్డంకులుంటాయి. మనల్ని కాటేసే పాములుంటాయి. వాటి తల అణచాలి. ‘దేవికి సాష్టాంగ దండ ప్రమాణం సేయరా’ అంటాడు మాంత్రికుడు రాకుమారుడితో. సాష్టాంగపడితే తల నరకాలని అతడి దుష్టపన్నాగం. కాని దేవి సలహా వల్ల రాకుమారుడు ఆ మాంత్రికుణ్ణే సాష్టాంగపడటం ఎలాగో చూపమని చెప్పి అదే అదనుగా ఆ దుర్మార్గుడి తల నరుకుతాడు. ఇదంతా పిల్లలకు పాఠమే. ‘పాతాళ భైరవి’ చూస్తే వారికి సమయస్ఫూర్తి వస్తుంది. ప్రమాదం నుంచి బయటపడటం తెలుస్తుంది. మొదట కష్టాలు ఎదురైనా గట్టిగా కష్టపడితే విజయం వరిస్తుందని కూడా తెలుస్తుంది. తెలుగులో మాత్రమే కనిపించే ముచ్చటైన జానపద చిత్రం ఇది. ‘జగదేక వీరుని కథ’లో అర్ధరాత్రి అడవిలో నిదురిస్తుంటాడు రాకుమారుడు ఎన్.టి.ఆర్. తోడు రేలంగి. రెండు దెయ్యాలు వీరిని ఆటపట్టించడానికి బయలుదేరుతాయి. ఆ అరుపులు ఈ అరుపులు అరిచి రేలంగిని భయభ్రాంతం చేస్తాయి. కాని రాకుమారుడు భయపడతాడా? వాటి పిలకపట్టి సీసాలో బంధిస్తాడు. మూడు కోర్కెలు నెరవేరిస్తేనే వదులుతానంటాడు. వాటినే వాహనంగా చేసుకుని తాను వెళ్లాల్సిన చోటుకు వెళతాడు. దెయ్యాలు భూతాలు మనం భయపడే వరకే. మనం ధైర్యంగా ఉంటే వాటి పని అంతే. ఇదే సినిమాలో మూర్ఖపురాజు రాజనాల ఉంటాడు. అతడు రాకుమారుణ్ణి మంటల్లో తోద్దామనుకుంటే రాకుమారుడే తెలివిగా అతణ్ణి మంటల పాలు చేస్తాడు. పిల్లలకు ‘జగదేక వీరుని కథ’ మంచి కాలక్షేపం. క్లయిమాక్స్‌లో ఒకే రామారావు ఐదుగురిలా మారి పాడే ‘శివశంకరి’ పాట వాళ్లు ఇప్పుడూ ఎంజాయ్ చేస్తారు. మిస్సమ్మలో డిటెక్టివ్ ఏఎన్ఆర్ చాలా చురుగ్గా ఉంటాడు. చిన్నప్పుడు తప్పిపోయిన సావిత్రిని వెతికే పని అతనిదే. అతను వెతుకున్నది సావిత్రినే అన్నది మొదటి రీలులోనే తెలిసిపోతుంది. పిల్లలు కూడా నాగేశ్వరరావుతో పాటు సావిత్రిని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చూస్తుంటారు. బతుకు బాదరబందీ కోసం ఎన్.టి.ఆర్, సావిత్రిలు ఆడే దొంగ నాటకాల వంటివి అవసరమే అన్నది తెలుసుకుంటారు. స్త్రీలతో ఎంత చక్కగా వ్యవహరించాలో కూడా. ఈ సినిమాలో ఎన్టిఆర్ సావిత్రితో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. బతకనేర్చిన రేలంగి కూడా వాళ్లు తెలుసుకోదగ్గ మోడలే. ఇక ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ జస్టిస్’ అంటూ తిరిగే అసలు సిసలు కేటుగాడు రమణారెడ్డిని కూడా వాళ్లు గమనిస్తారు. కొందరికి ముక్కు మీద కోపం వున్నా వారి మనసు మంచిది అని సావిత్రిని చూసి అర్థం చేసుకుంటారు. వెన్నెలను చూసి ‘రావోయి చందమామ’ అని పాడటం కూడా. ఇక ‘మాయాబజార్’లో పిల్లలకు నచ్చనిది ఏది? కృష్ణుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, శకుని... అందరూ వారి అభిమాన పాత్రలే. బాణం కొట్టి మెట్లు కట్టడం, ప్రియదర్శినిలో నచ్చిన మనుషులతో వీడియో కాల్, మనుషులు డబ్బుంటే ఒక లాగా డబ్బు లేనప్పుడు ఒకలాగ వ్యవహరిస్తారని చెప్పే రేవతి (ఛాయాదేవి) పాత్ర, అన్నింటినీ చక్రం తిప్పే శ్రీకృష్ణుడు, అమాయకంగా ఉండి అసాధ్యుడిగా మారే ఘటోత్కచుడు... అతని మాయలు... పొగడ్తలతో బతికిపోయే శర్మ, శాస్త్రులు, నోరు తిరగని రాక్షస శిష్యులు, తమాషా గురువు చిన్నమయ్య... ఈ వేసవిలో పిల్లలు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడాల్సిన సినిమాలు. ఈ సినిమాలలో మూడిటికి కె.వి.రెడ్డి, ఒకదానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. అన్నింటిని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. పింగళి నాగేంద్రరావు కొత్త కొత్త మాటలు కనిపెట్టడం నేర్పుతారు. ఆహ్లాదం ఇచ్చే వినోదం ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపుతాయి. పిల్లలకు తప్పక చూపించండి. -
జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురైంది. అనంతపురం జిల్లా పుట్టులు మండలం యెల్లుట్ల గ్రామ పరిధిలో బైరైటీస్ లీజు దరఖాస్తును తిరస్కరిస్తూ గనుల శాఖ డైరెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ జేసీ విజయ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మైనింగ్ కార్యకలాపాల నిమిత్తం అటవీ భూమిని విస్తృతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టేజ్ 1, 2 పర్మిట్లు జారీ చేసిన తరువాత అటవీ భూముల పరిరక్షణ పేరుతో అనుమతుల రద్దుకు వీల్లేదన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. స్టేజ్ 1, 2 పర్మిట్ల జారీకి అనుమతులిచ్చినా మైనింగ్ లీజు అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. అటవీయేతర ప్రాంతంలో బైరైటీస్ లభ్యత ఉంది కాబట్టి గనుల శాఖ డైరెక్టర్ ఈ అనుమతులు రద్దు చేశారని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్ మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ప్రకృతి సంపదను పొదుపుగా వినియోగించుకోవాలని, సహజ సంపదను భావి తరాలకు అందచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అటవీ భూమిలో బైరైటీస్ తవ్వకాల నిమిత్తం జేసీ విజయ 2017లో దరఖాస్తు చేసుకోగా తిరస్కరిస్తూ 2019 డిసెంబర్ 3న గనుల శాఖ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నష్టం వాటిల్లిందని లీజు కోరలేరు.. మైనింగ్ లీజుల కోసం దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందుతున్నాయని, వీటిని అనుమతించడం వల్ల అటవీ ప్రాంతం తరిగిపోయి పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఒక ఖనిజం లభ్యత రాష్ట్రంలో ఎక్కడా లేనప్పుడు, ఉన్న ఖనిజం లభ్యత అయిపోయినప్పుడు మాత్రమే అటవీ ప్రాంతంలో మైనింగ్ దరఖాస్తును అనుమతించాలని అటవీ సంరక్షణ చట్ట నిబంధనలు చెబుతున్నాయని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కడప, మార్కాపురం ప్రాంతాల్లో నాలుగు లక్షల టన్నుల బైరైటీస్ నిల్వలు ఉన్నాయన్న ఏజీ వాదనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. అటవీకరణ నిమిత్తం తాను రూ.50 లక్షలు ఖర్చు చేశానని, అనుమతులు రద్దు చేయడం వల్ల తనకు నష్టం కలిగిందని జేసీ విజయ నివేదించడంతో చట్టపరమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు. నష్టం కలిగిందన్న కారణంతో మైనింగ్ లీజు కోరజాలరని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. -
భర్త మందలించాడని.. పిల్లలతో సహా అదృశ్యం
మీర్‌పేట : భర్త మందలించాడని ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన నేనావత్ శ్రీను నగరానికి వలసవచ్చారు. నందనవనం వాంబేకాలనీలో భార్య విజయ (35), పిల్లలు నిఖిల్ (16), వైశాలి (13), మహేష్‌లాల్ (11)లతో కలిసి నివాసం ఉంటున్నారు. శ్రీను విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల విజయ తరచూ ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన శ్రీను ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన విజయ ఈ నెల 2న ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన శ్రీను బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యల బాహాబాహీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు సవతి భార్యల పోరులో భర్త అంత్యక్రియల వ్యవహారం ప్రహసనంగా మారింది. భర్త శవం తనకే సొంతమంటూ ఇద్దరు భార్యలు పోట్లాడుకుని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కిన ఉదంతం తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీలో సెక్యూరిటీ పని చేస్తున్న సెంథిల్ కుమార్ (44), విజయ దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయి అదే వర్సిటీలో పనిచేస్తున్న మహేశ్వరి అనే మహిళను సెంథిల్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వర్సిటీ క్వార్టర్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. అయితే బుధవారం రాత్రి సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంథిల్ కుమార్ గుండెపోటుకు గురై స్పృహతప్పి పడిపోయాడు. సహచర ఉద్యోగులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న రెండో భార్య మహేశ్వరి.. భర్త అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బంధువుల సహాయంతో ఇంటికి చేర్చింది. ఈ సమాచారం అందుకున్న మొదటి భార్య విజయ అక్కడికి వెళ్లగా.. విడాకులు ఇచ్చిన నీకు భర్త మరణంతో సంబంధం ఏమిటని మహేశ్వరి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో బంధువులు చేసేది లేక పోలీసులకు సమాచారం ఇవ్వగా సెంథిల్‌కుమార్ మృతదేహాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేయగా ఫలించకపోవడంతో పోలీసులు.. విద్యుత్ శ్మశానవాటికలో విజయ కుమార్తె తన తండ్రికి అంత్యక్రియలు చేయవచ్చని తీర్మానం చేశారు. దీంతో సెంథిల్‌కుమార్, ఇద్దరు భార్యలు, బంధువుల సమక్షంలో అంతిమ సంస్కారాలు గురువారం పూర్తయ్యాయి. -
ప్రజాసేవలో ‘విజయ’ను చూస్తున్నా: ఎమ్మెల్యే చందర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాధారణ సింగరేణి బొగ్గు కార్మికుడి కొడుకు.. పీజీ చదివినా ఉద్యోగం లేని జీవితం.. వెరసి ఆర్థిక ఇబ్బందులు.. అదే సమయంలో మేన మరదలితో వివాహం.. ఆ వివాహంతో దొరికిన తోడు కష్టసుఖాల్లో ఆలంబనగా నిలిచింది. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఆటో నడిపినా... కేబుల్ టీవీ ఆపరేటర్‌గా నిలదొక్కుకున్నా... చివరికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమకారుడిగా... కార్పొరేటర్‌గా గెలిచినా... ఆ తాళి కట్టిన తోడే కష్టసుఖాల్లో నీడగా నిలిచింది. ఆమె కోరుకంటి విజయ. రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ సతీమణి. రాజకీయంగా ఎదిగిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినా వెంట ఉండి ధైర్యం చెప్పిన ఆమె... తీరా ఎమ్మెల్యేగా గెలిచే సమయంలో క్యాన్సర్ బారిన పడి అనంత లోకాలకేగింది. ఆమె లేని లోటును ప్రజలకు సేవ చేయడం ద్వారా తీర్చుకుంటున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో ‘సాక్షి’ పర్సనల్ టైం ఇంటర్వ్యూ... సాక్షి: మాతృదినోత్సవం రోజు అమ్మలను సన్మానించే కార్యక్రమం చేపడుతున్నారట. ఎప్పటి నుంచి? చందర్: సింగరేణి ఏరియాలో నేను చాలా మందిని చూశాను. పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవించకపోవడాన్ని. అమ్మ మీద ప్రేమ, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో మాతృ దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం సింగరేణి స్టేడియంలో వేదిక ఏర్పాటు చేసి 2018 మంది తల్లులకు వారి పిల్లలతో పాదపూజ, సన్మానం చేయించే కార్యక్రమం చేపట్టాను. ఈ సంవత్సరం కూడా ఆదివారం(12వ తేదీ) స్టేడియంలో 2019 మంది మాతృమూర్తులకు సన్మానం చేయిస్తున్నాను. సన్మానం చేసిన వారికి వెండి నాణెం బహుమానంగా ఇస్తున్నాను. సాక్షి: ఎమ్మెల్యే కావాలనే కోరిక పదేళ్ల తరువాత తీరింది. పార్టీ టికెట్టు ఇవ్వకున్నా... వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. పదవి కోసం వచ్చిన పట్టుదలా? చందర్: చిన్నప్పటి నుంచి అనుకున్నది సాధించాలనే పట్టుదల నాకుంది. చదువులో గానీ, జీవన పోరాటంలో గానీ అదే పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాను. ఎమ్మెల్యే విషయంలో సైతం రెండుసార్లు దక్కకుండా పోయిన పదవిని ప్రజల ఆశీస్సులతోనే సాధించాను. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. రెండోసారి 2014లో పార్టీ టికెట్టు ఇవ్వకపోతే సింహం గుర్తు మీద పోటీ చేసి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడాను. ఈసారి కూడా నాకు టికెట్టు ఇవ్వలేదు. దాంతో ఎలాగైనా గెలిచి, టీఆర్ఎస్లో చేరాలనే మరోసారి ‘సింహం’ గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించాను. నా పట్టుదలతోపాటు నా భార్య దివంగత విజయ ప్రోత్సాహం నా విజయాలకు కారణం. సాక్షి: ఎన్నికల సమయంలో విజయమ్మ మరణం మీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసిందా? చందర్: విజయ నాలో సగం. నాకు సర్వస్వం. నా కష్టసుఖాల్లో వెన్నంటి ఉంది. ఆమెకు క్యాన్సర్ అనే విషయం 2016 జనవరిలో తెలిసింది. అప్పటి నుంచి హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నాను. కోలుకుంటుందనే భావించాను. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో ఆమె మాకు దూరమైంది. సరిగ్గా నా ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన సంఘటన. నేను చాలా కుంగిపోయాను. ప్రచారానికి కూడా వెళ్లలేదు. ప్రజలు, నా స్నేహితులు, బంధువులు నా వెంట నిలిచారు. నన్ను గెలిపించుకున్నారు. నేను ఎమ్మెల్యే కావాలని కలలు కన్న ఆమె తీరా నేను గెలిచేనాటికి లేకుండా పోవడం విధి ఆడిన నాటకం. సాక్షి: సింగరేణి కార్మికుడి కొడుకుగా మీ చిన్ననాటి జీవితం ఎలా సాగింది? చందర్: మా నాన్న మల్లయ్య జూలపల్లి దగ్గర్లోని తులసిపల్లె నుంచి సింగరేణి జనరల్ మజ్దూర్ కార్మికుడిగా గోదావరిఖని వచ్చాడు. నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఇక్కడే పెరిగాను. డిగ్రీ, పీజీ గోదావరిఖనిలోనే. మా నాన్న సంపాదన కుటుంబపోషణకే సరిపోయేది. మా అక్క, చెల్లెళ్ల పెళ్లిళ్లు జరపడమే కష్టంగా గడిచిన పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవి. పీజీ అయ్యాక మేన మరదలు విజయతో పెళ్లయింది. ఉద్యోగం లేకపోవడంతో మూడు నెలలు గోదావరిఖనిలో ఆటో నడిపాను. తరువాత కేబుల్ టీవీ రంగంలోకి దిగాను. దాంతో ఆర్థిక కష్టాలు గట్టెక్కాయి. అదే సమయంలో పాపులర్ టీవీ పేరుతో లోకల్ టీవీ ఛానెల్‌ను కూడా నిర్వహించాను. సాక్షి: ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. మళ్లీ మూడోసారి పోటీ చేసి గెలిచారు. ఆర్థికంగా చేయూత ఇచ్చిందెవరు? చందర్: కేబుల్ టీవీ ఆపరేటర్‌గా సంపాదించిన డబ్బులు నా రాజకీయ ఖర్చులకు సరిపోయేవి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి నా మిత్రులు నాకు అన్ని రకాల సహకరించారు. అయినా అప్పులయ్యాయి. 2009లో ఓడిపోయిన తరువాత గౌతం నగర్లో ఇల్లు ఆమ్మేశాను. నాకు ఖర్చులకు అవసరమైతే నా భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిచ్చేది. కష్ట నష్టాలు ఎదురైనా నా భార్య తోడు ఉంది. ఈసారి ఎన్నికల్లో సాధారణ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా ప్రత్యర్థి కోట్లు కుమ్మరించాడు. అయినా రామగుండం ప్రజల అభిమానం, ఆశీస్సులతో ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. సాక్షి: ఎమ్మెల్యే అయినా... గోదావరిఖని తిలక్‌నగర్‌లోని ఇరుకు సందుల్లోని చిన్న ఇంట్లోనే ఉంటున్నారు? ఎన్టీపీసీ, సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయి కదా? చందర్: నేను పుట్టి పెరిగిన ఇల్లు అది. బస్తీవాళ్లు, చుట్టుపక్కల వాళ్లతో ఉన్న బంధాలు ఇక్కడి నుంచి వెళ్లనివ్వవు. కులమతాలకు అతీతంగా వావి వరుసలతో పిలుచుకుంటాం. ఈ ఇంటితో, ప్రాంతంతో ఉన్న అనుబంధంతోనే నేనెక్కడికి వెళ్లను. ఎన్టీపీసీ, సింగరేణి క్వార్టర్స్‌కు వెళితే ప్రజలతో దూరం పెరుగుతుంది. ఇంట్లో, క్యాంపు కార్యాలయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. సాక్షి: కేబుల్ ఆపరేటర్‌గా డబ్బులు సంపాదిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? చందర్: నేను రాజకీయాల్లోకి రావడానికి ఇనిస్పిరేషన్ మంత్రి కొప్పుల ఈశ్వర్. నాకు తోబుట్టువు వంటి వారు. 1994 ప్రాంతంలో ఆయన టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలతో, కార్మికులతో ఆయనకున్న సంబంధాలు చూసి స్ఫూర్తి పొందా. నేను ఆయన వెంటే టీడీపీలో చేరి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా. కార్మికుల హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో ఈశ్వరన్నతో కలిసి పనిచేశా. ఆయన 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట ఉన్నా. 2004లో టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఆయనతోపాటు టీఆర్ఎస్లో చేరా. టీఆర్ఎస్లో తెలంగాణ కోసం ఉద్యమ నాయకుడిగా ఈశ్వరన్న స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా. 45 రోజులు జైలుకు వెళ్లిన. నా మీద పీడీ యాక్ట్ కూడా పెట్టారు. పోలీసులకు దొరకలేదనుకోండి. సాక్షి: ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన తరువాత మీకెలా ఉంది? చందర్: సింహం గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశా. 2014లో కూడా నా గుర్తు అదే. గెలిచిన తరువాత యువనేత కేటీఆర్‌ను కలిసి పార్టీలో చేరా. కేసీఆర్ నాయకత్వం అంటే నాకిష్టం. ఆయన నేతృత్వంలో పనిచేయడం నాగ్గావాలి. కేటీఆర్ సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మాలాంటి యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ నాకు ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఏ పదవుల కోసమో టీఆర్ఎస్లో చేరలేదు. టీఆర్ఎస్ అంటే నాకు రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీ. సాక్షి: మీ పిల్లలేం చేస్తున్నారు? చందర్: మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఉజ్వల బయో టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2015 డిసెంబర్లో పెళ్లయింది. కొడుకు మణిదీప్, మైనింగ్ డిప్లొమా చదివాడు. వాళ్ల అమ్మ చనిపోయిన తరువాత నా కూతురు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అల్లుడు చాలా మంచోడు. ఇంజనీర్. ప్రస్తుతం నా దగ్గరే ఉంటున్నారు. అమ్మ నాన్న కూడా నాతోనే ఉంటారు. నా భార్య పేరిట విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. మహిళా సాధికారికత, శిక్షణ కోసం కార్యక్రమాలు చేపడుతున్నా. -
నాటి డ్రాపవుట్... నేటి డాక్టరమ్మ!
చదువుకు దూరమై మేకలు, గొర్లు కాసింది... డ్రాపవుట్స్ జాబితాలో చేరింది. నాలుగేళ్ల తరవాతమళ్లీ బడిబాట పట్టింది. పట్టుదలతో చదివి ‘డాక్టర్ విజయ’ గా నిలబడింది. గిరిజన తండాకే గర్వకారణంగా నిలిచింది. చదువు మానేసి మేకల వెంట తిరిగిన విజయ ఇప్పుడు డాక్టరమ్మ అయ్యింది. ఇదేమిటి.. చదువు మానేసిన విద్యార్థిని డాక్టర్ ఎలా అయ్యిందనుకుంటున్నారా? అవును నిజమే, చదువు మానేసి నాలుగేళ్లపాటు మేకలను కాసింది. అయితే ఓ ఉపాధ్యాయుడి చొరవతో తిరిగి బడిబాట పట్టిన విజయ ఇప్పుడు మెడలో స్టెతస్కోప్‌తో కనిపిస్తోంది. చదువుపై ఆసక్తి, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రులు అందించిన సహకారంతో ఆమె డాక్టర్‌గా ఇప్పుడు ఆ తండాలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లంపేట తండాకు చెందిన మాలోత్ గన్యా, చంద్రవ్వ దంపతుల కూతురు ‘విజయ’ గాథ ఇది. తల్లిదండ్రులకే కాదు తండా వాసులందరికీ గర్వకారణంగా నిలిచింది. విజయ మూడోతరగతి చదువుతున్న సమయంలో ఆమెతో పాటు ఆమె చెల్లెలు జ్యోతిని తల్లిదండ్రులు చదువు మాన్పించారు. వ్యవసాయ పనుల్లో ఉండే తల్లిదండ్రులు ఆడపిల్లలిద్దరినీ మేకలను మేపడానికి పంపించేవారు. అక్కాచెల్లెల్లిద్దరూ నాలుగేళ్లపాటు మేకల వెంటే తిరిగారు. అడవి, మేకలు, ఇల్లే వాళ్లకు లోకమైంది. ఆ ఊరి బడికి కొత్తగా వచ్చిన టి.శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు డ్రాపవుట్ల గురించి ఇల్లిల్లూ తిరుగుతూ వాళ్లింటికి చేరాడు. చదువుకోవలసిన వయసులో మేకల వెంట తిప్పడం సరికాదని, చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆయన మాట మేరకు... విజయ తల్లిదండ్రులు పిల్లలిద్దరినీ బడికి పంపించారు. కొన్నిరోజులకే చిన్నపాప తిరిగి చదువు మానేసింది. కాని పెద్దమ్మాయి విజయ మాత్రం అలాగే కంటిన్యూ అయ్యింది. చదువు మీద విజయకు ఉన్న శ్రద్ధతో నాలుగేళ్లు చదువుకు దూరమైనా తనతో కలిసి చదువుకున్న స్నేహితులతో కలిసి వారి తరగతిలోనే చేరింది. రెగ్యులర్ విద్యార్థులతో చదువులో ఓ రకంగా పోటీ పడింది. విజయలో ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. గ్రామంలో ఏడోతరగతి వరకు మాత్రమే ఉండేది. ఏడోతరగతి పూర్తి చేసిన విజయ ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చేరింది. రోజూ అందరితో కలిసి సైకిల్‌పై వెళ్లేది. రాను, పోను పది కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ చదువు కొనసాగించింది. పదో తరగతిలో ద్వితీయ శ్రేణిలో పాసైన విజయకు డాక్టర్ కావాలన్న ఆసక్తి ఏర్పడింది. 15 కిలోమీటర్ల దూరాన ఉన్న రామారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూపులో చేరింది. ఇంటర్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అయితే మెడిసిన్‌లో సీటు సంపాదించాలంటే అప్పుడు ఉన్న పోటీని తట్టుకోలేని పరిస్థితి ఉంది. విజయ బంధువు అయిన స్థానిక ఆర్ఎంపీ హీరామన్ సలహా మేరకు బీయూఎంఎస్‌లో చేరింది. బీయూఎంఎస్ చదవాలంటే ఉర్దూ చదవడం, రాయడం రావాలి. ఇందుకోసం హైదరాబాద్‌కు వెళ్లిన విజయ రెండు నెలలపాటు ఉర్దూను అభ్యసించింది. పట్టుదలతో ఉర్దూ చదివి, బీయూఎంఎస్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై కర్నూల్లోని అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించింది. బీయూఎంఎస్ పూర్తి చేసిన విజయ ఇప్పుడు పీజీపై దృష్టి సారించింది. పీజీ ప్రవేశపరీక్షలో ఎలాగైనా సీటు సంపాదించాలన్న పట్టుదలతో కష్టపడుతోంది. గ్రామీణ ప్రజలకు సేవలందిస్తా... మధ్యలో చదువు మానేసి నాల్గేళ్లు మేకల వెంట, పొలాల వెంట తిరిగిన నేను డాక్టర్‌ను అయ్యానంటే శ్రీనివాస్‌సార్ పుణ్యమే. ఆ రోజు నన్ను బడికి పంపమని మా ఇంటికి వచ్చి అమ్మా,నాన్నలకు సార్ నచ్చజెప్పడం వల్లే నేను బడికి వెళ్లగలిగాను. చదువుమీద ఆసక్తి పెరిగిన సందర్భంలో సార్లందరూ ప్రోత్సహించారు. ఎల్లంపేటలో ఏడోతరగతి కాగానే మళ్లీ చదువుకు ఎక్కడ దూరమైతానో అనిపించింది. కాని చదవాలన్న సంకల్పంతో రోజూ సైకిల్‌పై అన్నారం వెళ్లి పదోతరగతి దాకా చదివాను. ఇంటర్ రామారెడ్డిలో పూర్తి చేసిన. అప్పుడు మా బంధువు హీరామన్ బీయూఎంఎస్‌కు సంబంధించి ఎంట్రెన్స్ రాయమని సలహా ఇవ్వడంతో ఉర్దూ నేర్చుకున్నాను. మూడునెలల కోర్సు రెండు నెలల్లో పూర్తి చేసి ఎంట్రెన్స్ రాసి కర్నూల్లోని యునానీ కాలేజీలో సీటు సంపాదించాను. నా ముందు ఉన్న లక్ష్యం పీజీ. ఎలాగైనా పీజీ చేయాలని పట్టుదలతో ఉన్నాను. యునానీతోపాటు అల్లోపతి వైద్యం కూడా నేర్చుకుంటున్నాను. రాబోయే రోజుల్లో డాక్టర్‌గా గ్రామీణ ప్రజలకు వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తా. మా అమ్మ, నాన్నలతోపాటు కుటుంబ సభ్యులంతా నా కోసం ఎంతో కష్టపడ్డారు. నేను అది ఎప్పటికీ మరచిపోను. అమ్మానాన్నల రుణం తీర్చుకుంటాను. మా తండా ప్రజలందరికీ అండగా ఉంటాను. – డాక్టర్ మాలోత్ విజయ, ఎల్లంపేట తండా గర్వంగా ఉంది! నేను ఉద్యోగరీత్యా ఎల్లంపేట వెళ్లినపుడు డ్రాపవుట్ల గురించి ఇంటింటికీ తిరిగేవాళ్లం. నాతోపాటు మిగతా ఉపాధ్యాయులు కూడా అందరం కలిసి తండాలు తిరిగి డ్రాపవుట్లను బడిబాట పట్టించాం. అందులో విజయ ఒకరు. ఆమెలో చదవాలన్న కాంక్షను గమనించి ప్రోత్సహించాం. ఆమె ఇప్పుడు డాక్టర్ అయ్యిందంటే ఎంతో గర్వంగా ఉంది. – టి.శ్రీనివాస్, ఉపాధ్యాయుడు మస్తు సంతోషమైతుంది ఆడపిల్లలకు సదువు ఎందుకని మ్యాకలకాడికి పంపిస్తుంటిమి. ఒక దినం శ్రీనివాస్ సారు వచ్చి పిల్లల్ని బడికి పంపుమని ఒక్కటే తీర్గ చెప్పిండు. అడగంగా అడగంగా నాలుగేండ్ల తరువాత బడికి తోలిచ్చినం. ఊళ్లె చదువు అయిపోయినంక సైకిల్ మీద బిడ్డ అన్నారంకు పోయింది. తరువాత రామారెడ్డిల చదివింది. డాక్టర్ కోర్సు చదువుతానంటే మాకైతే ఏం తెలువదు. ఎన్నో కష్టాలు పడ్డం. ఆమెకు అయ్యే ఖర్సులకు తండ్లాడి మరీ పైసలు పంపిస్తుంటిమి. డాక్టరమ్మ అయ్యిందంటే మస్తు సంతోషంగ ఉన్నది. సర్కారు ఉద్యోగం వస్తే మంచిగుండు. లగ్గం చేద్దామనుకుంటున్నం. – మాలోత్ గన్యా, చంద్రవ్వ(విజయ తల్లిదండ్రులు) – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి