ఎన్నాళ్లీ వేదన? | Concern in the sandeep parents | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ వేదన?

Published Fri, Jun 13 2014 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

ఎన్నాళ్లీ వేదన? - Sakshi

ఎన్నాళ్లీ వేదన?

ఇంకా లభ్యం కాని సందీప్ ఆచూకీ
 
మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో నీటి ప్రవాహానికి గల్లంతైన సందీప్ తిరిగి వస్తాడని కుటుంబీకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగి 6 రోజులు గడిచినా విద్యార్థి జాడ తెలియరాకపోవడంతో సందీప్ స్వగ్రామం గౌడవెల్లిలో విషాదం అలుముకుంది. అతడి కోసం తల్లిదండ్రులు వీరేష్, విజయలతో పాటు కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సందీప్ జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. తన ఇంటికి కనీసం అధికారులు వచ్చి వివరాలు కూడా తెలుసుకోవడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్, సందీప్ తండ్రి వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement