Beas river
-
ట్రెండింగ్ వీడియో.. వరదల్లో బస్సు
మనాలి: ప్రకృతి విపత్తుకు ఎంతటివారైనా తలవంచాల్సిందే. అందుకు తాజా రుజువు ఈ వీడియో. నది ఒడ్డున నిలిపివుంచిన ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు వరద ప్రవాహం ఉధృతికి కాగితం పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఆదివారం చోటు చేసుకుంది. బియాస్ నది ఒడ్డున నిలిపివుంచిన బస్సు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. వరద ముప్పు గురించి ముందే హెచ్చరించినా బస్సు సిబ్బంది పెడచెవిన పెట్టారని స్థానికులు వెల్లడించారు. కాగా, శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో హిమాచల్ వాసులు కష్టాలు పడుతున్నారు. బియాస్ నదికి భారీగా వరద పోటెత్తడంతో భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల పాలకులు సూచించారు. -
వరదల్లో కొట్టుకుపోయిన బస్సు
-
బియాస్ నదిలో భారీగా చేపల మృత్యువాత
-
బియాస్ నదిలో ఘోరం
ధర్మశాల, హిమాచల్‌ప్రదేశ్ : బియాస్ నదిలో జీవజాలం భారీగా మృత్యువాత పడింది. నీటి కాలుష్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. నది పరివాహక ప్రాంతంలోని ఓ చక్కెర ఫ్యాక్టరీ నుంచి విడుదలైన రసాయనాలు నీటిలో కలవడం వల్ల ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. గురుదాస్ పూర్ జిల్లాలోని కిరి అఫ్‌గనా గ్రామానికి చేరువలో గల చధా షుగర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి విడుదలైన రసాయనాలు బియాస్ నదిలో నీటిలో కలిశాయి. దీనిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం ప్రమాదవశాత్తు రసాయనాలు నీటిలో కలిశాయని పేర్కొంది. నది పరివాహక ప్రాంతంలో నివసించే వారు నీరు ఎరుపు రంగులోకి మారడం చూసి షాక్‌కు గురయ్యారు. వేల సంఖ్యలో చేపలు, జలచరాలు మరణించి తేలుతూ ఒడ్డుకు కొట్టుకురావడాన్ని గమనించి అధికారులకు సమాచారం చేరవేశారు. ముఖ్యంగా అమృతసర్, తరణ్, కపుర్తలా జిల్లాల్లో జలచరాలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. షుగర్ ఫ్యాక్టరీలో మొలాసిస్ తయారుచేసే బాయిలర్ పేలుడు వల్ల రసాయనాలు నది నీటిలో కలిసినట్లు అమృతసర్ డిప్యూటీ కమిషనర్ కమల్‌దీప్ సింగ్ సంఘా వెల్లడించారు. రసాయనాల కలయికతో నీటిలో కరిగే ఆక్సిజన్ శాతం తగ్గిపోయి జలచరాలు మరణించాయని పేర్కొన్నారు. నదిలో కలుషితమైన నీటిని తొలగించేంతవరకూ ప్రజలు నీటిని వినియోగించొచ్చదని కోరారు. -
'బియాస్'లో మరో విషాదం
నదిలో కారు పడి 8 మంది దుర్మరణం మండి: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా ఆట్ ప్రాంతంలో కారు అదుపుతప్పి బియాస్ నదిలో పడి న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, మరో వ్యక్తితో కలిసి మాణికరన్ నుంచి తిరిగి వస్తుండగా వారి కారును వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. దీంతో వారి టాటా నానో కారు దొర్లుకుంటూ వెళ్లి బియాస్ నదిలో పడడంతో అందరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని మండి ఎస్పీ ప్రేమ్ కుమార్ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన కుటుంబంలోని వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. మిగతా ఏడుగురి కోసం వెతుకుతున్నారు. -
ఇది తీరని కడుపుకోత..
‘బియాస్’ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన వైదేహి అనాథ ఆశ్రమంలో వర్ధంతి సభ రెండేళ్లయినా నివేదిక సమర్పించని కమిటీ సిటీబ్యూరో/సైదాబాద్: ‘చేతికి అందొచ్చిన మా పిల్లలు.. చేదోడువాదోడుగా ఉంటారనుకుంటే.. తిరిగి రాని లోకాలకు వెళ్లి పుట్టెడు శోకం మిగిల్చారు. ఈ అనాథ పిల్లల్లో మా పిల్లలను చూసుకుని బాధను దిగమింగుకుంటున్నాం. ఇంజినీరింగ్ చదివి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో లోకం విడిచి వెళ్లిపోయారు. పిల్లలే లోకంగా జీవిస్తున్న మాకు ఆ దేవుడు కడుపుకోత మిగిల్చాడు’.. 2014 జూన్ 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన 24 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన ఇది. ఈ ఘోర దుర్ఘటన జరిగి బుధవారానికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మృతుల తల్లిదండ్రులు సైదాబాద్‌లోని వైదేహి అనాథ ఆశ్రమ విద్యార్థులకు వారు బహుమతులు, దుస్తులు పంపిణీ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు యూవీ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బియాస్ బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ, ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి, కె. కృష్ణారెడ్డి, సూర్యకుమార్, పద్మ, అనంతలక్ష్మి, వీరన్న, కళావతి, మిట్టపల్లి సంజయ్, మాచర్ల సుదర్శన్, ఎం. రవివర్మ, రామ్మోహన్, సుధ, వైదేహి ఆశ్రమ నిర్వాహకులు ప్రకాశరావు, రాములు, మల్లికార్జున్, విద్వాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగితాలపైనే శైలజా రామయ్యర్ కమిటీ.. బియాస్ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ డిసెంబరు 2014 వరకు విచారణ చేసి దుర్ఘటనకు గల కారణాలు, స్టడీటూర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ ఘటన జరిగి రెండేళ్లు పూర్తయినా నివేదిక సమర్పించకపోవడం గమనార్హం. అసలు ఈ కమిటీ మనుగడలో ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కమిటీ.. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కసారి మినహా మరోదఫా పలకరించలేదు. అయితే ఈ దుర్ఘటనకు బాధ్యులు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల, లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు లోగడ ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు వీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం నుంచి రావాల్సిన పరిహారం మినహా తెలంగాణ , ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు, లార్జీ డ్యామ్ అధికారులు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం దశలవారీగా అందడం గుడ్డిలో మెల్ల. ప్రస్తుతం వీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం తమ వాటా పరిహారం చెల్లించేందుకు సుప్రీంకోర్టులో డబ్బులు డిపాజిట్ చేసినట్టు తెలిసింది. బాధను పంచుకోడానికేవచ్చాం.. బియాస్ దుర్ఘటన జరిగి రెండేళ్లవుతున్నా ఇంకా మరచిపోలేకపోతున్నాం. మా పిల్లలు ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నారు. అసలు సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి తప్పిదం ఉందనే కోణాల్లో దర్యాప్తు చేయలేదు. - రాధాకృష్ణ మళ్లీ జరక్కుండా చూడాలి.. రెండో వర్ధంతిని ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకుంటే బాధను పంచుకునే వారుండరనే ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడి విద్యార్థుల్లో మా పిల్లలను చూసుకుంటున్నాం. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి. నష్టపరిహారం కోసం ప్రాధేయపడ్డం లేదు. దేశంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటన జరగకూడదనే మా పోరాటం. - వెంకట్‌రెడ్డి ఏ తల్లికీ ఇంత కష్టం రాకూడదు ఈ కడుపుకోత ఏ తల్లికీరాకూడదు. విహారయాత్రకు తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యానికి విద్యార్థులను క్షేమంగా తీసుకురావల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఈ రోజు మాకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారు. 24 మంది విద్యార్థులు మరణించినా.. ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. - పద్మ ఇది మానవతప్పిదమే.. మానవతప్పిదం వల్లే బియాస్ దుర్ఘటన జరిగింది. నీళ్లను నదిలోకి వదిలే ముందు నలుగురు సిబ్బంది నది మొత్తం పర్యవేక్షించాలి. ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదలడానికి లేదు. గేట్లు ఎత్తినవారిది, తీసుకెళ్లిన వారిది తప్పే. కానీ అందరు తప్పుకోడానికే ప్రయత్నిస్తున్నారు. - బీవీ సుబ్బారావు, ఏపీ ఇరిగేషన్‌శాఖ ఎస్ఈ -
తర్పణ
కథ ‘‘హృదయ విదారకమైన దుర్ఘటన! నిశ్చేష్టుడయ్యాడు! కానిదెవరు చెప్పు. కాలేదు అంటే మనసు లేనట్లే! మనిషి కానట్లే! వాడే కోలుకుంటాడు. మృత ప్రాణాల్ని విద్యావస్తువులుగా చూసినవాడు. యింకో రెండేళ్లలో డాక్టర్ దినకర్ అవుతాడు. నీ ఆలోచనకు దూరమైన దాన్నేదో చిత్రించుకుని కలవరపడకు.’’ సుమరశ్మి మనసులో ప్రశాంతత చేకూరడానికి ముందుగా ఆ మాటలు అన్నాడు భర్త భేషజంతో ఉదయార్క. ‘‘కాలేజీకి వెళ్లడం లేదు. ముఖంలో తేజస్సు మారింది. పరిస్థితి చేయి దాటకుండా చూడండి. మీ తెలివితో నా నోరు ఇప్పుడు మాత్రం మూసేయకండి’’ వేదనలో కూడా భర్త నైజానికి ఓ చురక వేసి, ఉపశమనంగా భర్త భుజాన్ని తలతో నిమిరింది సుమరశ్మి. భార్య పరిశీలనే తనూ గమనించాడు కొడుకులో. సంగతేంటని కొడుకునే అడగొచ్చు. కొడుకుతో స్నేహితుడిలా మాట్లాడిన సందర్భాలున్నాయి. పూర్తి స్నేహ వాతావరణానికి మానసిక అసౌకర్యం తావివ్వలేదు. దినకర్ కూడా గీతదాటి చనువు తీసుకోలేదు. జనన సున్నితత్వాలను ఇద్దరూ గౌరవించారు, సహజ ప్రేమ పలచబడకుండా. ఆలోచన, ఆచరణ, లక్ష్యంపై దృష్టి వంటి అంశాల్లో దినకర్ ఓ సంపూర్ణతకు చేరాడనే తృప్తి తనకు ఎప్పుడో కలిగింది, జన్మనిచ్చినందుకు సాఫల్యతగా! ‘‘అదీగాక వాడి మనసుకేమన్నా గాయమైందా?’’ ఆలోచన ఆపి అన్నాడు. ‘‘అవకాశం లేదండీ. తీర్థ విషయంలో వాడి ఇష్టాన్నే సమ్మతించాం. తీర్థ తండ్రి మనల్ని అవమానించిన సంఘటనని మీరే చిరునవ్వుతో తుడి చేశారు...’’ ఓ పద్ధతిలో మాట్లాడుతున్నానో లేదో అని క్షణ మౌనాన్ని ఆశ్రయించింది సుమరశ్మి. ‘‘అప్పుడు కుంభకోణం బడి మంటల్లో చిన్నపిల్లలు బూడిదయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాడి కళ్లు వాడే తుడుచుకున్నాడు. చదువుపై ఏకాగ్రతను సడలనివ్వలేదు. అంతకుముందు, ఆ తర్వాత! ఎన్ని ఘోరాలు వినలేదు మనం, ఏవో ఎక్కడో జరిగాయి అని ఎప్పుడూ అనుకోలేదు. వాడి అనుభవంలో వాడే ఎన్నో చూశాడు. నీ అభిమాన నటి సౌందర్య జీవితం అలా ముగిసిపోయినప్పుడు వాడే కదా నిన్ను ఓదార్చింది. అంతగా మనసెదిగినవాడు ఈ విషాదానికి అంత తీవ్రమైన ఉద్వేగానికి ఎందుకు లోనయ్యాడో అర్థం కావట్లేదు. అవునూ, వాడి గురించి స్నేహితులేమంటున్నారు...’’ శూన్యంలో దినకర్ స్నేహితుల పలకరింపులు ఊహిస్తూ ఆగిపోయాడు ఉదయార్క. స్నేహం మాట వచ్చేసరికి - ‘‘అదే! ఓ విధంగా ఆ జలహంతకితో చేయి కలిపిందేమోనండి. చావు పరుగులెత్తుతూ మీద పడబోతున్నా వాళ్లకు చూపు లేకుండా చేసింది, స్నేహం ఇచ్చిన మూర్ఖ ధైర్యం, ఆ క్షణంలో! దానికి ముందు, బస్సులో ఆ స్నేహం ఆనందాల్ని చూడండి, ఆ పాటల్ని చూడండి, ఆ కేరింతల్ని చూడండి’’ అంటూ సెల్లులో వీడియో నొక్కింది. పెల్లుబికి వస్తున్న కన్నీళ్లను అసంకల్పితంగా కూడా ఆపడానికి ప్రయత్నించకుండా, సంస్కారానికి రవంత కూడా మచ్చ పడకుండా - తనే తట్టుకోలేకపోతున్నది... ఆ కన్నతల్లులు, తండ్రులు ఎలా ఉన్నారో అని తలుచుకుని విలపిస్తూ. ఉచ్ఛ్వాస, నిశ్వాసలతో తప్ప శరీరంలో ఏ కదలికలు లేని మానసిక స్థితిలో ఉన్నట్లుగా ఉన్నాడు దినకర్. స్నేహితులొచ్చి బయటికి తీసుకెళ్లారు. వాళ్లూ కాబోయే డాక్టర్లే. ఏ విషయాన్ని ప్రస్తావించినా నిస్పందనగా ఉన్నాడు. దినకర్ మనసుని మాటగా మార్చడానికి వాళ్లు మాటలు వెతుకుతున్నారు. దినకర్ కోసం వస్తున్న తీర్థ దార్లో వాళ్లని చూసి కారాపింది. తీర్థ పలకరించినప్పుడు దినకర్ని నిశితంగా చూశారు స్నేహితులు. దినకర్ ప్రవర్తనపై తమకు సరైన అవగాహన కలగాలనే ఉద్దేశంతో. ‘‘తీర్థా! వాడికి జన జీవన వేగాన్ని చూపించి నోరు పెగిలేట్లు చేయి. మనిషికీ జంతువుకీ మాటే తేడా అన్నారు. మాట పోతే వీడేమవుతాడో. ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ని వెనక్కు తిప్పి రాయాల్సి వస్తుందేమో’’ అన్నాడో స్నేహితుడు నవ్వుతూ, నవ్వుని ఆశిస్తూ. తీర్థ కూడా నవ్వింది. దినకర్ ముఖంలో ఏ కణమూ చలించలేదు. లిప్తపాటు కలవరపడింది తీర్థ. తీర్థ పక్కన దినకర్ని ఓ బొమ్మలా కూర్చోబెట్టారు స్నేహితులు. సముద్రపు ఒడ్డు. అంతా అణుమయమని సందేశాన్నిస్తున్నది సైకతం! వెన్నెల వెలుగులలో మెరిసిపోతూ ఎగిసిపడుతున్న అలల్ని చూస్తున్నారు. ‘‘మూడు వంతుల నీళ్లతో గుండ్రంగా అనంత విశ్వ శూన్యంలో భూమి ఎలా ఉంటున్నదో ఇప్పటికే నాకు అంతుపట్టని అద్భుతమే దినకర్’’ అంది తీర్థ. సముద్రపు హోరులో కూడా నిశ్శబ్దాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని వినిపిస్తున్నట్లు ఉన్నాడు దినకర్. ‘‘దినకర్! నీ ప్రేమ నీడలో నడుస్తున్నాను నేను. బతుకుతున్నాను నేను. ఏమైంది నీకు. దినకర్! విజ్ఞత ఉన్నచోటే పరిస్థితి ఇలా ఉంటే లేని చోట మాటేంటి?’’ ‘‘..................’’ ‘‘నీవిలా అయ్యావంటే ఎవరూ నమ్మట్లేదు. నమ్మాల్సివస్తే మిగిలేది నవ్వే. నవ్వుల పాలవుతావు దినకర్.’’ ‘‘..................’’ ‘‘నీ సంగతి చెబితే మా నాన్న ఏమన్నాడో తెలుసా? ఇంత సున్నితమైన మనసున్నవాడు రేపు కార్పొరేట్ ఆసుపత్రిలో ఏం పని చేస్తాడో అని!’’ ‘‘..................’’ ‘‘అది డబ్బెక్కువై మనసు రాయైన మనిషి మాటనుకో!’’ ‘‘..................’’ ‘‘ఇటువంటి సంఘటనల్లో నువు రోజంతా మౌనంగా, నిరాహారంగా ఆత్మల శాంతి కోరేవాడివి. ఇప్పుడూ అదే అనుకున్నా, కానీ ఇదేంటి?’’ ‘‘..................’’ ‘‘మానవాళి గుండె కన్నీటితో తడిసింది! అరెరే! పూర్ణ, ఆనంద్‌లు సాక్షాత్కరించిన విజయానందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించకుండానే తెలుగు కంటిలో శోకధారలు! ఆ కంట ఆ నీరు, ఈ కంట ఈ నీరు, ముక్కంటి హిమాచల ప్రదేశంలోనే! తన నెత్తిమీద కాలు పెట్టారన్న కోపం అనుకోడానికి వీల్లేదు, తనే భుజం మీదకి ఎత్తుకున్నాడు! మరి ఇదేంటో, శివ లయ లీల!’’ ‘‘..................’’ ‘‘మారణ హోమంలో మనిషి దేవుడితో పోటీ పడుతున్నాడు, యుగాలుగా. అది నీవన్న మాటే!’’ ‘‘..................’’ ‘‘ఈ వీడియో మా ప్రత్యేకం అంటూ ఆయిల్ మార్కులు వేసుకుంటున్నారు కొందరు, అదేంటో. ఏ గుర్తింపు కోసమో!’’ ‘‘..................’’ ‘‘ప్రకృతి విలయాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రమాదాలు, తుఫాను బీభత్సాలు... ఎన్నో. ఎన్నో. మనిషి జీవితం ఎంత అల్పమో చెబుతున్నా అహంభావాలు, అహంకారాలు, స్వార్థ చింతనలు సమసిపోవడం లేదు.’’ ‘‘..................’’ ‘‘బియాస్ నదీ తీరంలో సుందర దృశ్యాలు మనమెంతో ఆస్వాదించాం, ఆనందించాం. గులకరాళ్లను పలకరిస్తూ, పరవళ్లు తొక్కే ఆ నీళ్లలో మనం ఆడుకున్నాం. ఆ నీళ్లు చల్లుకున్నాం.’’ ‘‘..................’’ ‘‘ఆల్బర్ట్ స్కీవిట్జర్ డాక్టర్ వృత్తిని త్యాగం చేసి ఫిలాసఫర్ అయ్యాడు అంటుంటావు. ఒకవేళ నువ్విలా అయినా నేను నీ దాన్నే దినకర్!’’ ‘‘..................’’ ఓడిపోతున్నానేమో అని భయం కలిగింది తీర్థ మనసులో! గెలుపు ఓటములేంటి! దినకర్ని కాపాడుకోవాలి! కాపాడుకోవడమేంటి నా పిచ్చిగాని, తనకు తనే సమన్వయ పడింది, రేపు ఇలాగే ఎందుకుంటుంది అన్న ఆలోచనతో. అంతులేని కాలగమనంలో రేపు అనే ఆశతో కోట్లాది హృదయాలు కాలం గడుపుతున్నాయి. దినకర్‌కి ఇష్టమైన ఓ పుస్తకాన్ని గుర్తు చేయాలనుకుంది. ‘‘బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ - తెలుగులో వచ్చింది చూశావా?’’ ‘‘..................’’ ‘‘సరే! సమయానికి మించి ఉండలేం కదా, వెళ్దాం’’ అంటూ లేచింది. దినకర్ కూడా లేచి నించున్నాడు. దినకర్ వీపు మీద ఇసుకను దులిపింది. కారులో కూర్చోబోతుంటే - ‘‘ఇంకా శవాల కోసం గాలిస్తూనే ఉన్నారట!’’ పక్కనే వెళ్లే ఎవరో మాటలు వినిపించాయి. కారు కదిలింది. ‘‘ఆ పిల్లలకు అమ్మా, నాన్నలు ఉన్నారు అనే విషయం గుర్తుండుంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదేమో దినకర్’’ అంది, అప్పటికప్పుడు అనిపించిన భావంగా. ఏకీభావంగా ఔనంటున్న ముఖ ప్రకటనను ప్రస్ఫుటంగా చూసింది దినకర్ కదలికలో! ఆ కదలికతో తీర్థ మనసు కుదుటపడింది. *** ఈసారి దినకర్ పుట్టినరోజు ఎప్పటిలా జరిగేట్లు లేదు. అదే మాట స్నేహితులతో చెప్పి ఇంటికి వచ్చింది తీర్థ. టీవీ పెట్టే ఉంది. ఎవరూ చూడటం లేదు, చూసి తట్టుకోలేక! గ్యాస్ లీక్ ప్రమాదం! మంటలలో అంటుకుపోయిన తల్లీ పిల్ల! బూడిదైన దేహాలు! బొగ్గయిన కొబ్బరి తోటలు!... నీరలా..! నిప్పిలా..! విషాదాలు విషాదాల్లో కొట్టుకుపోవాల్సిందేనా! కన్నీళ్లెండిన కళ్లను - పంచభూతాలు పగబట్టి ఒక్కటై ఒకేసారి విరుచుకుపడినా ఏం చేస్తాయిలే... ‘‘అమ్మా...!!!’’ -
మరో బి(భ)యాస్
-
కడచూపూ కరువాయే..
♦ అశ్రునయనాలతో శ్రీనిధి అంత్యక్రియలు ♦ కన్నీటిసంద్రమైన రేకుర్తి కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి రాజిరెడ్డి-అనంతలక్ష్మి దంపతుల రెండో కూతురు శ్రీనిధి(19) హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. విజ్ఞానయాత్రలో భాగంగా కళాశాల విద్యార్థులతో కలిసి గతనెల 3న శ్రీనిధి వెళ్లింది. 8న హిమాచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో శ్రీనిధి కూడా ఉందనే సమాచారంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. ఆమె అచూకీ కోసం తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. బియాస్ నది ఒడ్డున కూతురు అచూకీ కోసం పదిరోజులపాటు పడిగాపులు పడ్డప్పటికీ ఫలితం లేకపోవడంతో గతనెల 20న రేకుర్తికి తిరిగి వచ్చాడు.శ్రీనిధి జ్ఞాపకాలతో కాలం గడుపుతున్న కుటుంసభ్యులకు ఆదివా రం బియాస్ నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో శ్రీనిధి మృతదేహం లభించినట్టు సమాచారం అందింది. దీంతో వారిలో దు:ఖం మిన్నంటింది. ప్రత్యేక విమానంలో మృతదేహం తరలింపు శ్రీనిధి మృతదేహానికి ఆదివారం మండి జిల్లాలో పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీస్ అధికారులు ప్రత్యేక విమానంలో సోమవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపించారు. శ్రీనిధి మృతదేహం కోసం హైదరాబాద్‌కు ఆమె మేనమామ లింగారెడ్డి, డెప్యూటీ తహశీల్దార్ లింబాద్రి, ఆర్ఐ ఖాజా వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన శ్రీనిధి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని సాయంత్రం 4.45 గంటలకు రేకుర్తికి చేరుకున్నారు. కన్నీటి సంద్రమైన రేకుర్తి శ్రీనిధి మృతదేహమున్న శవపేటికను అంబులెన్స్ నుంచి కిందకు దించడంతోనే తల్లిదండ్రులు అనంతలక్ష్మి, రాజిరెడ్డి, సోదరి శ్రీతేజ, కుటుంబసభ్యులు బోరున విలపించారు. శ్రీనిధి శవపేటికపైపడి రోదించడం చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శ్రీనిధి శవపేటికను తిరిగి అంబులెన్స్‌లో చేర్చి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శవపేటికలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో దుర్వాసన వెలువడింది. చివరిసారిగా శ్రీనిధి ముఖం చూడాలనే తల్లిదండ్రుల కోర్కే మేరకు మృతదేహానికి చుట్టిన కవర్లను బంధువులు విప్పేందుకు ప్రయత్నించగా, దుర్వాసన రావడంతో వెనుకడుగేశారు. శ్రీనిధిని చివరిసారి చూస్తానంటూ తల్లి అనంతలక్ష్మి, అక్క శ్రీతేజ రోదించిన తీరు పలువురి హృదయాలను కలచివేసింది. చివరకు హిందూ సాంప్రదాయరీతిలో అంతిమసంస్కారాలు నిర్వహించిన అనంతరం కుమార్తె చితికి తండ్రి రాజిరెడ్డి నిప్పంటించారు. శ్రీనిధి మృతదేహానికి జిల్లా జడ్జి నాగమారుతిశర్మ, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్, సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్, ఎంపీటీసీ సభ్యులు శేఖర్, నాగరాణి, బాలయ్యతో పాటు స్థానిక నాయకులు నివాళులర్పించారు. -
‘రిషిత’ ఇంట విషాదఛాయలు
జగద్గిరిగుట్ట(బాచుపల్లి), నల్లకుంట: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రిషితారెడ్డి ఇంట ఆదివారం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహం ఆదివారం లభించినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో నగరానికి చెందిన 16 మందిలో ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక నల్లకుంటకు చెందిన శ్రీహర్ష ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన 42 రోజుల తరువాత రిషితారెడ్డి మృతదేహం లభ్యమైందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మరణ వార్త తెలియడంతో కుప్పకూలిపోయారు. అమ్మానాన్నల కుటుంబాల తరఫున.. రిషితారెడ్డి అమ్మ తరఫున, ఇటు నాన్న బంధువుల్లో ఒకే ఒక ఆడపడుచు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఖ: సాగరంలో మునిగిపోయారు. అంత్యక్రియలకుఏర్పాట్లు రిషిత అంత్యక్రియలను బాచుపల్లి గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు, బాచుపల్లి పంచాయతీ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఎదురుచూపులే.. ఇక కల్లూరి శ్రీహర్ష (19) ఆచూకి నేటికి తెలియరాలేదు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మ కుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో ఉండే అడ్వకేట్ కేఆర్‌కేబీ.ప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు కల్లూరి శ్రీహర్ష (19) గత నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆదివారం మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం కాగా గల్లంతైన వారిలో నల్లకుంటకు చెందిన శ్రీ హర్ష జాడ నేటికి తెలియరాలేరు. -
బియాస్ నదిలో లభించిన శ్రీనిధి ఆచూకీ
కన్నీటి నిరీక్షణకు తెర - 42 రోజులుగా దు:ఖసాగరంలో తల్లిదండ్రులు - నేడు రేకుర్తికి మృతదేహం కరీంనగర్ రూరల్ : కన్నకూతురు మృతదేహాన్ని కడసారి చూడాలనే ఆ తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడింది. 42 రోజుల సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం ఆదివారం బియాస్ నదిలో కూతురు మృతదేహం లభించిందనే సమాచారంతో ఇన్నాళ్లూ దిగమింగిన దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం రేకుర్తికి తీసుకరావడానికి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద ఉధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 24 మంది విద్యార్థులు నదిలో గల్లంతు కావడంతో శ్రీనిధి అచూకీ కోసం ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. కూతురు ఆచూకీ కోసం నది ఒడ్డున పదిరోజులపాటు పడిగాపులు కాశాడు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి కొద్ది రోజులపాటు అక్కడే ఉండి గా లింపును పర్యవేక్షించారు. మంచుకొండలు కరిగి నదిలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చే పట్టగా గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో 21 మృతదేహాలు లభించా యి. ఒక్కొక్క మృతదేహం బయటపడుతున్న కొద్దీ అది తమ కూతురుదేమోననే ఆతృతతో వెళ్లి చూడడం... ఆమెది కాదని తెలిసి నది ఒడ్డున విషాదవదనంతో ఎదురుచూపులు చూడడం రాజిరెడ్డికి నిత్యకృత్యమైంది. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు ప్రకటి ంచింది. గల్లంతైన విద్యార్థుల పేరిట డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కూతురు ఆచూకీపై రాజిరెడ్డి ఆశ లు వదులుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరినీ అక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజిరెడ్డి గత నెల 20న స్వగ్రామం రేకుర్తికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి శ్రీనిధి జ్ఞాపకాలతో ఆమె మృతదేహం ఆచూకీ కోసం రాజిరెడ్డి కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం బియాస్‌నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో లభించిన రెండు మృతదేహాల్లో ఒకటి శ్రీనిధిగా గుర్తించినట్లు అధికారులు ప్రకటించడంతో తల్లిదండ్రులు రాజిరెడ్డి, అనంతలక్ష్మి, అక్క తేజతోపాటు బంధువుల్లో దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. శ్రీనిధి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని సోమవారం హిమాచల్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించడానికి అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి రాజిరెడ్డి సమీప బంధువులతో కలిసి సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మృతదేహం రేకుర్తికి వచ్చే అవకాశముంది. -
బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం
ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆదివారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. గత కొన్ని రోజులు క్రితం బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. తాజా గాలింపు చర్యల్లో విద్యార్థిని శ్రీనిధి మృతదేహం లభించింది. ఈ ఘటన జరిగిన 42 రోజుల తర్వాత మరో మృతదేహం బయటపడటం గమనార్హం. గత నెల 8 వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయారు. నదీ జలాల్లో ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడింది. తేరుకునే లోపే దాదాపు 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. -
బియాస్ నదిలో గల్లంతైన ప్రహ్లాదుడు మృతి
రుద్రవరం: ఒక్కగానొక్క కుమారుడు నదిలో గల్లంతయ్యాడని తెలిసి ఆ వృద్ధ తల్లిదండ్రుల గుండె పగిలింది. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడం రోజురోజుకూ కుంగదీసింది. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడనే ఆశ.. ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకంతో ఎదురుచూస్తున్న వారికి చేదు వార్త అందనే అందింది. ఏదైతే జరగకూడదని అనుకున్నారో ఆ ఘోరం చెవినపడింది. చేతికందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి మండల పరిధిలోని ఆలమూరుకు చెందిన ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొర్రె పెద్దనాగిశెట్టి, లక్ష్మీనర్సమ్మలకు ఇరువురు కుమార్తెలు, కుమారుడు ప్రహ్లాదుడు(24) సంతానం. ఇతను గత నెల 5న హిమాచల్‌ప్రదేశ్‌లోని దండి జిల్లాలో ఉన్న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రకు వరుసకు మామ అయిన మురళి టూర్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. అక్కడ ఓ చిరుద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరగా ఉండాలని వెళ్లిన ప్రహ్లాదుడుని ఆయన తన వెంటతీసుకెళ్లాడు. నది వద్ద విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా సమీపంలోని లార్జి డ్యాం నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో వారిని అప్రమత్తం చేయబోయి ప్రహ్లాదుడు కూడా కొట్టుకుపోయాడు. గాలింపు చర్యల్లో భాగంగా బియాస్ నదిలో అతని మృతదేహం లభించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని రుద్రవరం తహశీల్దార్ వెంకటేశ్వర్లు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రహ్లాదుడు చిరుద్యోగం చూసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లి మృత్యువాత పడిన ఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదం నింపింది. ఇప్పటికే అనారోగ్యంతో మంచంపట్టిన మృతుని తల్లిదండ్రులు ఈ విషాద వార్తతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం బుధవారం ఉదయం గ్రామానికి చెరనుండటంతో కడసారి చూపునకు వారు గుండెలు చిక్కబట్టుకుని ఎదురుచూస్తున్నారు. -
‘బియాస్’ బాధితులకు న్యాయం చేయాలి
జగద్గిరిగుట్ట: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీఎస్ఎఫ్, టీవీఎస్, ఏఎంఎస్ఏ సంఘాల విద్యార్థి నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు స్టాలిన్, గౌతమ్, వీరబాబు, వెంకట్, భాస్కర్లు మాట్లాడుతూ 2012లో పులి చింతల ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లినపుడు జరిగిన ప్రమాదంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై ఉంటే బియాస్ నది సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. విద్యార్థులను స్టడీ టూర్ పేరిట తీసుకువెళ్లి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. 24 మంది ప్రాణాలు పోవడానికి కారకులైన కాలేజీ యాజమాన్యంపై పోలీసులు స్పందించి వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్, డీన్‌తో వాగ్వాదం విద్యార్థులు ధర్నా చేస్తున్నా యాజమాన్యం దిగి రాకపోవడంతో విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి రక్షణగా పోలీసులు రావడం సిగ్గు చేటుగా ఉందని వారు ఆరోపించారు. పోలీసుల జోక్యంతో ప్రిన్సిపాల్ సీడీ నాయుడు, డీన్ రవీంద్రబాబు విద్యార్థులతో మాట్లాడడానికి వచ్చారు. బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం చేయడానికి జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు వారిని నిలదీశారు. సరైన సమాధానం లభించకపోవడంతో విద్యార్థి నాయకులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు విద్యార్థి నాయకులను శాంతింపజేశారు. విలపించిన ఈశ్వర్రావు.. 2012లో పులి చింతల ప్రమాదంలో మృతి చెందిన మోహన్ తండ్రి ఈశ్వర్రావు తన కుమారుడు లేని జీవితం వ్యర్థంగా మారిందని కన్నీరు మున్నీరయ్యారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పిన కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ సీడీ నాయుడు, డీన్ రవీంద్రబాబు లు మాట్లాడే సమయంలో ఈశ్వర్రావు ఆవేదనకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్థి నాయకులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. -
శోకసంద్రమైన గౌడవెల్లి
మేడ్చల్: విద్యార్థి సందీప్ అంత్యక్రియలు బుధవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. బియాస్ నదిలో గల్లంతై మృతిచెందిన విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి బస్వరాజ్ సందీప్‌యాదవ్ అంత్యక్రియలు స్వగ్రామం మేడ్చల్ మండలం గౌడవెల్లిలో నిర్వహించారు. సందీప్ ఆచూకీ మంగళవారం బియాస్ నదిలో లభ్యం కావడంతో మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం అధికారులు గౌడవెల్ల్లికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్ మృతదేహాన్ని హిమాచల్‌ప్రదేశ్ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. అక్కడి నుంచి మేడ్చల్ తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి అంబులెన్స్‌లో గౌడవెల్ల్లికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సందీప్ మృతదేహాన్ని గౌడవెల్లి సమీపంలోని సూతారిగూడ ఔటర్ రింగ్‌రోడ్డు జంక్ష న్ నుంచి విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థులు, స్థానిక విద్యార్థులు గౌడవెల్లి వరకు బైక్ ర్యాలీతో తీసుకొచ్చారు. చివరి చూపు కరువైంది నాయనా.. సందీప్ మృతదేహం అంబులెన్స్‌లో గౌడవెల్లి రాగానే స్థానికులు బోరున విలపించారు. విద్యార్థి చివరిచూపు కూడా లేకుండా మృతదేహం పూర్తిగా కుళ్లి పోవడంతో చెక్కపెట్టెల బాక్సులో తీసుకొచ్చారు. ‘నాయనా నీ చివరి చూపు కూడా కరువైంది’ అంటూ మృతుడి బంధువులు, స్థానికులు రోదించారు. కుప్పకూలిన తల్లిదండ్రులు.. సందీప్ మృతదేహం ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు విజయ, వీరేష్లు కుప్పకూలిపోయారు. ‘మమ్మల్ని వదిలిపెట్టి పోయావా నాయనా..’ అంటూ వారు గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. వందలాది మంది విద్యార్థులు, స్ధానిక నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, మేడ్చల్ న్యాయవాదులు సందీప్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. విజ్ఞాన్ జ్యోతి కళాశాలపై చర్యలు తీసుకోవాలి: గద్దర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే 23 మంది మృతిచెందారని ప్రజాగాయకుడు గద్దర్ మండిపడ్డారు. బస్వరాజ్ సందీప్ అంత్యక్రియల్లో ఆయన అతడి తల్లితండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విజ్ఞాన్ జ్యోతి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బియాస్ నదిలో మృతిచెందిన విద్యార్థుల జ్ఞాపకార ్థం విజ్ఞాన్ కళాశాలలో స్థూపం ఏర్పాటు చేయాలన్నారు. -
అడియాసలు
మేడ్చల్: నదిలో గల్లంతైన తమ కుమారుడు ఎక్కడో బతికే ఉండొచ్చని భావించారు ఆ తల్లిదండ్రులు. కొడుకు వస్తాడని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వారికి గుండెకోతే మిగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన మేడ్చల్ మండలం గౌడవెల్లి విద్యార్థి బస్వరాజు సందీప్‌యాదవ్(20) మృతదేహం మంగళవారం లభ్యమైంది. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కుమారుడు వస్తాడని వేయికళ్లతో ఎదురుచూసిన వారికి చివరికి దుఃఖమే మిగిలింది. మంగళవారం ఉదయం 8 గం టల సమయంలో బియాస్ నది అడుగుభాగంలో మంచుగడ్డల మధ్య ఓ మృతదేహం అధికారులకు కనిపిం చింది. అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర అధికారులు, విజ్ఞాన్ జ్యోతి కళాశాల యాజమాన్యం మృతుడు సందీప్‌యాదవ్ అయి ఉండొచ్చని అనుమానించారు. దీంతో అతడి తండ్రి బస్వరాజ్ వీరేష్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, బూట్లు, చేతికి ఉన్న ఉంగరం ఫొటోలను అధికారులు ఎంఎంఎస్ ద్వారా వీరేష్ సెల్‌ఫోన్‌కు పంపించారు. ఉంగరం ద్వారా మృతుడు సందీప్ అని తల్లిదండ్రులు, కుటుంబీకులు గుర్తించారు. శోకసంద్రంలో సందీప్ కుటుంబం మంగళవారం సందీప్ మృతి సమాచారం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు బస్వరాజ్ వీరేష్, విజయ ఇంట్లోనే కుప్పకూలిపోయారు. ‘వస్తావనుకున్న నాయక.. మమ్మల్ని విడిచిపెట్టి పోయావా.. నాన్న..’ అని ఆమె రోదించిన తీరు హృదయ విదారకం. సందీప్ తండ్రి వీరేష్ ఒంటరిగా తనలో తానే కులిమిపోయాడు. ‘ఎలాగైనా బతికి వస్తావనుకున్నాను రా..’ అని ఆయన గుండెలుబాదుకున్నాడు. సందీప్ ఇద్దరు సోదరి, ఇతర కుటుంబసభ్యుల రోదనలతో గౌడవెళ్లి శోకసంద్రంలో మునిగిపోయింది. సందీప్ మృతి సమాచారం తెలుసుకున్న గౌడవెళ్లి గ్రామస్తులు పెద్దఎత్తున అతడి ఇంటికి చేరుకొని కుటుంబీకులను ఓదార్చారు. కాగా విజ్ఞాన్ జ్యోతి కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం మృతదేహం గౌడవెళ్లికి.. సందీప్ మృతదేహాన్ని బుధవారం గౌడవెళ్లికి తరలిస్తామని అధికారులు సమాచారం ఇచ్చినట్లు సందీప్ తండ్రి వీరేష్ తెలిపారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి అక్కడి నుండి విమానం లో ఢీల్లీకి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు తీసుకొస్తారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మృతదేహాన్ని గౌడవెళ్లికి తీసుకొస్తామని అధికారులు తెలిపినట్లు వీరేశ్ పేర్కొన్నారు. -
బియాస్లో సందీప్ యాదవ్ మృతదేహం
హైదరాబాద్ : బియాస్ నదిలో మంగళవారం ఉదయం మరో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సందీప్ యాదవ్‌గా గుర్తించారు. ఇప్పటి వరకూ 21 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. గల్లంతు అయిన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సందీప్ యాదవ్‌ది రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి. బియాస్ నది గాలింపులో సందీప్ మృతదేహం లభ్యమైనట్లు ఘటన స్థలం వద్ద ఉన్న కళాశాల ఫోన్‌ద్వారా సమాచారం సందీప్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ కుమారుడు సజీవంగా తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న అతని తల్లిదండ్రులు ఈ వార్త వినటంతో విషాదంలో మునిగిపోయారు. -
కడుపుకోతేమిగిలింది
బోధన్: కన్నవారికి కడుపుకోతే మిగిలింది. తమ కొడుకు వస్తాడని 22రోజులుగా ఎదురుచూస్తున్న వారి ఆశలు ఆడియాశలయ్యాయి. బియాస్‌నదిలో మరో మృతదేహం లభ్యమైంది.. అది బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా గుర్తించామని హిమాచల్‌ప్రదేశ్ నుంచి వార్త రాగానే.. ఆ కుటుంబం కుప్పకూలింది. ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించింది. ప్రమాదం జరిగినప్పటి నుంచే ఏకధాటిగా ఏడుస్తున్నా.. తమ బిడ్డ ఎలాగైన బతికి వస్తాడని కోటిఆశలతో ఉన్న ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. ‘నాన్నా.. నేను విహారయాత్రకు వెళ్తున్నాను.. అని చెప్పి వెళ్లిన నా కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మమ్మల్ని ఇలా వదిలేసి పోతాడనుకోలేదు.’ అంటూ వెంకటేశ్వర్‌రెడ్డి దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. బియాస్ నదిలో కొడుకు గల్లంతైన విషయం తెలిసినప్పటి నుంచి తల్లి రమాదేవి మంచం పట్టింది. ఇప్పడింకా కోలుకోలేని స్థితిలో ఉంది. తమ బిడ్డ మధుర జ్ఞాపకాలను తలచుకుంటూ కుమిలిపోతున్న వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ నేపథ్యం బోధన్ మండలలోని సాలంపాడ్‌కు చెందిన మేడం వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు , ఇదే మండలంలోని అమ్దాపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌లో స్థిరపడ్డారు. వెంకటేశ్వర్ రెడ్డి బార్య రమాదేవీ దంపతులకు ఇద్దరు సంతానం. కుతూరు అనూష, కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. అనూష్ హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఇంజనీరు. విష్ణువర్ధన్ రెడ్డి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ( ఎలక్ట్రానిక్ ఇస్ట్రుమెంట్షన్ ఇంజనీరింగ్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇరువురు బిడ్డలు ఉన్నత చదువుల్లో రాణిస్తుంటే వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబం ఎంతో ఆనందంతో ఉన్నారు. విహార యాత్రకు ముందు.. విష్ణువర్ధన్ రెడ్డి బిటెక్ వార్షిక పరీక్షలో జూన్ 1న పూర్తికాగా, 3న కళాశాల విద్యార్థులో విహార యాత్రకు వెళ్లాడు. ఏ నెలల మొదటి వారంలో నాన్నమ్మ ఆదిలక్ష్మికి బాగ లేదంటే బోధన్ వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉండి వెళ్లాడు. ఆ తర్వాత వార్షిక పరీక్షలుండటం ఉన్నాయని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు . హైదరాబాద్‌లో ఉండి పోయాడు. జూన్ 3న కళాశాల విద్యార్థులతో విహార యాత్రకు వెళ్లి బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఇదే సమయంలో విష్ణు తల్లీదండ్రులు వెంకటేశ్వర్‌రెడ్డి భర్య రమాదేవితో కలిసి విశాఖపట్నంలోని బావమరిది శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. జూన్ 8న శుభకార్యం ఉండగా, అదే రోజు బియాస్ నదిలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని విమానంలో హిమాచల్‌ప్రదేశ్ చేరుకున్నారు. వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి, వారి స్నేహితులు రాజశేఖర్ కూడా అక్కడి వెళ్లారు. ఐదురోజుల పాటు అక్కడే ఉండి విష్ణు ఆచూకీ కోసం దుఖాన్ని దిగమింగుకుని నిరీక్షించారు. కానీ విష్ణు ఆచూకీ తెలియకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గల్లంతైన రోజు నుంచి విష్ణు తల్లి రమాదేవి నిద్రాహారాలు మాని మంచం పట్టింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. 22 రోజులకు లభ్యమైన మృతదేహం విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ చదువుతున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిపై గల లార్జీడ్యాం వద్ద ఈనెల 8న ఫొటోలు దిగుతుండగా, ఆ డ్యాం గేట్ల ఎత్తివేయడంతో నీటి ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉన్నాడు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 20 మంది విద్యార్థుల మృత దేహాలను వెలికితీశారు. మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. 22 రోజులకు సోమవారం బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. బియాస్ నది గాలింపులో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు ఘటన స్థలం వద్ద ఉన్న కళాశాల ప్రతినిధి ప్రణయ్‌రెడ్డి విష్ణు చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. విష్ణు మృత దేహాన్ని మండి జిల్లా కేంద్రంలో పోస్టు మార్టం నిర్వహించి హైదరాబాద్‌కు తరలించేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తి అవుతుందని సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి స్వగ్రామమైన సాలంపాడ్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు నిర్ణయించారు. -
బియాస్లో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం
-
బియాస్లో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం
హైదరాబాద్ : హిమాచల్ ప్రసాద్ బియాస్ నదిలో సోమవారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన మేడం విష్ణువర్థన్ రెడ్డిగా గుర్తించారు. అతని మృతదేహాన్ని హైదరాబాద్ తరలించనున్నారు. ఇప్పటివరకూ బియాస్ నదిలో 20 మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకా గల్లంతు అయిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరి సగం చెరి సగం చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది. జూన్ 8వ విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
జగదీష్‌కు కన్నీటి వీడ్కోలు
రహమత్‌నగర్: బియాస్ నదిలో గల్లంతైన జగదీష్ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం రహమత్‌నగర్‌కు చేరుకోగా, సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, జగదీష్ మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా బోరుమని విలపించారు. రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అంబులెన్సులో జగదీష్ భౌతిక కాయాన్ని రహమత్‌నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న అతడి ఇంటికి తీసుకొచ్చారు. పదహారు రోజులుగా కడసారి చూపు కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న అతడి తల్లి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. పలువురు ప్రముఖులు జగదీష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్యెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మురళీగౌడ్, ఎంఐఎం నాయకుడు నవీన్ యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ ప్రపుళ్లరెడ్డి, కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ భవాని శంకర్, బీజేపీ నగర ప్రచార కార్యదర్శి కొలన్ సత్యనారాయణ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ సాగర్, నరసింహ, సత్యనారాయణ, పీఎల్ ప్రకాశం, వైఎస్సార్ సీపీ నాయకుడు షేక్ షమీమ్, జేఎల్ మేరి, ఎమ్మార్పీఎస్ నాయకుడు అరుణ్ హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సందర్శన చివరి క్షణంలో వాయిదా పడింది. సాయంత్రం ఈఎస్ఐ శ్మశానవాటికలో జగదీష్ అంత్యక్రియలు జరిగాయి. -
బియాస్లో విగత జీవిగా జగదీష్
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గురువారం మరో మృతదేహం లభ్యమైంది. లభ్యమైన మృతదేహాన్ని హైదరాబాద్‌కు చెందిన జగదీశ్దిగా గుర్తించారు. దాంతో ఇప్పటివరకూ 19 మృతదేహాలు బటయపడ్డాయి. కాగా జగదీష్ ముదిరాజ్ (20) మృతదేహం లభ్యం కావటంతో అతని ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్లోని బంగారు మైసమ్మ బస్తీలో జగదీష్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. తండ్రి మల్లేష్ కొకొకోలా కంపెనీలో పని చేస్తున్నారు. జగదీష్ రెండో కుమారుడు. క్షేమంగా వస్తాడనుకున్న తమ కుమారుడు విగతజీవిగా మారటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బియాస్ నదిలో 24మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంత అయిన విషయం తెలిసిందే. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
'బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించండి'
-
బియాస్ నదిలో రిథిమ మృతదేహం లభ్యం
హిమాచల్ ప్రదేశ్: బియాస్ నది దుర్ఘటనలో చనిపోయిన మరో విధ్యార్ధి మృతదేహం బుధవారం లభ్యమైంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని రిథిమ మృతదేహంగా గుర్తించారు. బియాస్ నది దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు దొరకాల్సి ఉంది. మిగితా విద్యార్ధుల మృత దేహాల కోసం వెతుకులాట కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఆకస్మికంగా నీటి ప్రవాహం పెరగడంతో జూన్ 8వ తేది ఆదివారం విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్ధులు గల్లైంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లైంతనవారిలో 18 మంది విద్యార్ధుల మృతదేహాలు లభ్యమవ్వగా, ఇంకా 6 మృతదేహాలు దొరకాల్సి ఉంది. Follow @sakshinews -
'బియాస్ నది బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించండి'
హైదరాబాద్: బియాస్ నది దుర్ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రభుత్వాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఆకస్మికంగా నీటి ప్రవాహం పెరగడంతో జూన్ 8వ తేది ఆదివారం విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్ధులు గల్లైంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లైంతనవారిలో 17 మంది విద్యార్ధుల మృతదేహాలు లభ్యమవ్వగా, ఇంకా 7 మృతదేహాలు దొరకాల్సి ఉంది. -
ఖమ్మం చేరుకున్న కిరణ్ మృతదేహం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదినీటి ప్రవాహంలో ఈ నెల 8వ తేది ఆదివారం కొట్టుకుపోయిన ఎం.కిరణ్ కుమార్ మృతదేహం ఖమ్మం చేరుకుంది. మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ తీసుకు వచ్చారు. ఇక్కడ నుంచి సాయంత్రానికి ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో ఉన్న స్వగృహానికి తరలించారు. కిరణ్ మృతదేహానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు బోనోత్ మదన్‌లాల్, పువ్వాడ అజయ్ కుమార్‌లు నివాళులర్పించారు. చేతికి అందివచ్చిన కొడుకు దుర్మరణం చెందడంతో కిరణ్ తల్లి పద్మావతి, తండ్రి వెంకటరమణ బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడు బతికి ఉండే అవకాశం లేదని, కడసారి చూపు కోసం కిరణ్ తండ్రి వెంకటరమణ, మేనమామ నరసింహారావు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. తండ్రి తిరిగి వచ్చారు. నరసింహారావు మాత్రం అక్కడ ఉండి కిరణ్ కోసం ఎదురు చూడసాగారు. ఆదివారం మధ్యాహ్నం కిరణ్ మృతదేహం నదిలో లభించింది. మృతదేహం దొరికిన సమయంలో దుస్తులను చూసిన నరసింహారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని ఇది తన మేనల్లుడి మృతదేహమేనని రోదిస్తూ ధ్రువీకరించారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన నరసింహారావు హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో నివాసం ఉంటున్నారు. కిరణ్ ఆయన వద్దనే ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బియాస్ నదినీటి ప్రవాహంలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు లార్జి డ్యామ్‌లో దిగిన సమయంలో గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహ ఉధృతికి విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఇంకా ఏడు మృతదేహాలు కనిపించలేదు. బియాస్ నదిలో గల్లంతయినవారు: 1.దాసరి శ్రీనిధి 2.కాసర్ల రిషిత రెడ్డి 3. గంపల ఐశ్యర్య 4. లక్ష్మీగాయత్రి 5.ఆకుల విజేత 6. రిథిమ పాపాని 7.కల్లూరి శ్రీహర్ష 8. దేవాశిష్ బోస్ 9. బైరినేని రిత్విక్ 10. ఆషిష్ మంత 11.సందీప్ బస్వరాజ్ 12.అరవింద్ 13.పరమేష్ 14. జగదీష్ ముదిరాజ్ 15. అఖిల్-మిట్టపల్లి 16. ఉపేందర్ 17.అఖిల్-మాచర్ల 18.భానోతు రాంబాబు 19. శివప్రకాష్ వర్మ 20. ఎం.విష్ణువర్ధన్ 21.సాయిరాజ్ 22.సాబేర్ హుస్సేన్ 23. కిరణ్ కుమార్ 24. పి.వెంకట దుర్గ తరుణ్ ఇప్పటివరకు దొరికిన మృతదేహాలు: 1. గంపల ఐశ్యర్య 2. ఆకుల విజేత 3 భానోతు రాంబాబు 4.లక్ష్మీగాయత్రి 5. దేవాశిష్ బోస్ 6. షాబేర్ హుస్సేన్ 7. టి.ఉపేందర్ 8.అరవింద్ కుమార్ 9.పి.వెంకట దుర్గ తరుణ్ 10.అశీష్ ముంతా, 11.మాచర్ల అఖిల్ 12.శివప్రకాశ్ వర్మ 13.మహెన్ సాయిరాజ్ 14.పరమేష్ 15. రినేని రిత్విక్ 16.ఎం.కిరణ్ కుమార్ 17.మిట్టపల్లి అఖిల్ -
15 రోజులు..17 మృతదేహాలు
-
కడుపుకోత...
బియాస్ నదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం - మిన్నంటిన తల్లిదండ్రుల రోదన - వరంగల్ గిర్మాజీపేట, నర్సంపేటలో విషాదఛాయలు - నేడు హైదరాబాద్‌కు మృతదేహాలు - జిల్లాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి ఉంటారనే ఆశతో ఉన్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. 14 రోజుల నుంచి కుమారుల రాక కోసం ఎదురుచూస్తున్న వారికి కడుపుకోతే మిగిలింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియూస్ నదిలో గల్లంతైన నర్సంపేటకు చెందిన చిందం పరమేశ్వర్, వరంగల్ నగరంలోని 21వ డివిజన్ గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యూరుు. విద్యార్థులు కానరాని లోకాలకు పోయారని టీవీల ద్వారా తెలుసుకున్న వారి కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. కడుపుకోత మిగిల్చి.. కానరాని లోకాలకు.. - బియాస్ నదిలో లభ్యమైన పరమేశ్వర్, అఖిల్ మృతదేహాలు - శోకసంద్రంలో కుటుంబ సభ్యులు - గిర్మాజీపేట, నర్సంపేటలో విషాద ఛాయలు ఆ తల్లిదండ్రులు ఏది జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగింది. ఎక్కడో ఒకచోట తమ కుమారులు బతికి ఉండే ఉంటారని.. క్షేమంగా రావాలని వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా బియాస్ నదిలో లభ్యమయ్యారు. కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చి వెళ్లారు. నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయని పిడుగులాంటి వార్త తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా బోరున విలపించారు. అయ్యో కన్నా.. అఖిల్ వరంగల్ చౌరస్తా : వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు మౌనిక హన్మకొండలోని అల్లూరి ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ చేస్తుండగా, అఖిల్(23) హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్(ఈఐఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. 1995 జూన్ 12న పుట్టిన అఖిల్ ఈనెల 3న ఇండస్ట్రీయల్ టూర్లో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లాడు. ఈనెల 8న సాయంత్రం అక్కడి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆ రోజు నుంచి అతడి రాక కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. నాలుగు గంటల మిస్టరీ బియాస్ నదిలో గాలిస్తున్న రెస్క్యూటీమ్‌కు ఆదివారం ఒక్కరోజే నాలుగు మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఒకరు నర్సంపేటకు చెందిన పరమేశ్వర్‌గా, మరో ఇద్దరు హైదరాబాద్, ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. సాయంత్రం కనుగొన్న విద్యార్థి మృతదేహం ఏ మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతదేహం ఎవరిదనే సందేహాలు వెలువడ్డాయి. దీంతో అక్కడ గాలింపు చర్యల్లో నిమిగ్నమైన రాష్ట్రానికి చెందిన అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది అఖిల్ పెద్దనాన్న సంజీవరావు, అక్క మౌనికతో ఫోన్లో మాట్లాడారు. అఖిల్ ఒంటిపై ఉన్న గుర్తులు, దుస్తులు, ఇతర వివరాల కోసం ఆరా తీశారు. అఖిల్ చేతి మణికట్టుకు ఉన్న దీపావళి కేదారి వ్రతం, ఆంజనేయ స్వామి దారాలతో గుర్తించగలిగారు. చివరికి ఈ చేదువార్తను రాత్రి 7.55 గంటలకు అఖిల్ కుటుంబ సభ్యులకు తెలిపారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కొడుకు కోసం పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడి స్వగృహానికి చేరుకున్నారు. అఖిల్ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి అఖిల్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశాలున్నట్లు బంధువులు తెలిపారు. కాగా జిల్లా యంత్రాంగం నుంచి అఖిల్ కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పరమేశా.. అప్పుడే నా కొడుకును తీసుకెళ్లావా.. నర్సంపేట : ఓ పరమేశా.. నీ పేరు పెట్టుకుంటే నా కొడుకు నిండు నూరేళ్లు జీవిస్తాడనుకున్నా.. ప్రమాదం జరిగి 14 రోజులైనా నా కొడుకు బతికి వస్తాడనుకున్నా.. నీ పేరు పెట్టుకున్న కొడుకును నీ వద్దకే తీసుకెళ్లి నాకు కడుపుకోత మిగిల్చావా తండ్రీ.. అన్ని దేవతలకూ మొక్కుకున్నా ఏ దేవునికీ నా మొరముట్టలేదా నాయనా.. మమ్మీ టాటా అని చెప్పుకుంటూ పోతివి కదరా కొడుకా.. అంటూ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన చిందం పరమేశ్వర్ తల్లి ఉమ రోదనలు మిన్నుముట్టాయి. పరమేశ్వర్ మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైన విషయం టీవీ వార్తల్లో వస్తుండగా చూసి కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. నర్సంపేట పట్టణానికి చెందిన చిందం వీరన్న-ఉమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరిలో చిన్నవాడు పరమేశ్వర్(24) బియాస్ నదిలో గల్లంతైన విషయం విధితమే. ప్రమాదం జరిగిన నాటి నుంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు పరమేశ్వర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మొక్కని దేవుడు లేడు. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని భావించారు. చివరికి వారి ఆశలు నిరాశలయ్యాయి. మృతదేహం లభించిన విషయంతో తెలియడంతో చుట్టుపక్కల ప్రజలు పరమేశ్వర్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. నేడు మృతదేహం తరలింపు పరమేశ్వర్ మృతదేహం బియాస్ నదిలో గల్లంతైన ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. మండీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని సోమవారం ఉదయం 6.30 గంట లకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు.. అక్క డి నుంచి నర్సంపేట తహసీల్దార్ సూర్యనారాయణ, ఆర్ఐ రాజు నర్సంపేటకు తీసుకురానున్నట్లు ఆర్డీఓ అరుణకుమారి తెలిపారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నేలరాలిన సరస్వతీ పుత్రుడు పరమేశ్వర్ చిన్ననాటి నుంచీ చదువులో ముందుండేవాడని, పాలిటెక్నిక్ కోర్సు చేస్తుండగానే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం కాల్‌లెటర్ వచ్చినా ఉన్నత స్థాయికి చేరోకోవాలనే లక్ష్యంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడని అతని సోదరుడు ప్రశాంత్ తెలిపాడు. పరమేశ్వర్ 1 నుంచి 5వ తరగతి వరకు పట్టణంలోని అరవింద పాఠశాల, 6 నుంచి 7 వరకు గీతాంజలి స్కూల్, 8 నుంచి టెన్త్ వరకు మహబూబాబాద్‌లోని మహర్షి పాఠశాలలో చదువుకున్నాడు. టెన్త్‌లో 500 పైచీలుకు మార్కులు సాధించాడు. తర్వాత హైదరాబాద్ ఈస్టు మారేడుపల్లి పాలిటెక్నిక్‌లో మూడున్నర సంవత్సరాలు అభ్యసించా డు. ఈ క్రమంలో థౌసెండ్ మిలియన్ కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చినా వదులుకుని ఈసెట్ కోచింగ్‌కు వెళ్లి రాష్ట్రం లో 8వ ర్యాంక్ సాధించాడు. వీఎన్ఆర్ కళాశాలలో ఇన్సుమెంటేషన్ గ్రూపులో సీటు రావడంతో రెండేళ్లు పూర్తి చేశాడు. -
శోకమే మిగిలింది
ఖమ్మం క్రైం: గత 15 రోజులుగా తీవ్ర ఆవేదనతో నిరీక్షిస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరికి శోకమే మిగిలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈనెల 8న గల్లంతైన ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. కుమారుడి మృతదేహం లభించిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా తిరిగిరాని లోకాలకు చేరాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. కిరణ్‌కుమార్ గల్లంతైన నాటినుంచి తమ కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని వారు ఆశగా ఎదురుచూశారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఇక తమ కుమారుడు బతికే అవకాశం లేదని, కనీసం కడసారి చూపు అయినా దక్కుతుందో లేదోనని ఆవేదనకు గురయ్యారు. కిరణ్ గల్లంతయ్యాడని తెలుసుకున్న వెంటనే తల్లి పద్మావతి హైదరాబాద్‌లోని బంధువుల వద్దకు వెళ్లగా, తండ్రి వెంకటరమణ హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. గాలింపు చర్యలు జరుగుతున్న బియాస్ నది వద్దే ఉంటూ కొడుకు ఆచూకీ కోసం ఎదురు చూశారు. రోజులు గడుస్తున్నా జాడ తెలియకపోవడంతో ఆయనతోపాటు మిగితా విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. కిరణ్ మేనమామ నరసింహారావు మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండి ఎదురు చూడసాగారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం మృతదేహం లభ్యంకావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు. నేడు ఖమ్మంలో అంత్యక్రియలు... కిరణ్‌కుమార్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఖమ్మంలో నిర్వహించనున్నారు. మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొస్తారు. అక్కడినుంచి సాయంత్రానికి ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో ఉన్న స్వగృహానికి తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. దుస్తులు చూసి గుర్తుపట్టిన మేనమామ.. బియాస్ నదిలో ఆదివారం మధ్యాహ్నం కిరణ్ మృతదేహం లభించింది. అయితే కిరణ్‌కుమార్ మేనమామ నరసింహారావు బియాస్ నది వద్దనే ఉంటూ ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మృతదేహం దొరికిన సమయంలో దుస్తులను చూసిన నరసింహారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని ఇది తన మేనల్లుడి మృతదేహమేనని రోదిస్తూ ధ్రువీకరించారు. తనకు ఎంతో ఇష్టమైన మేనల్లుడు ఇలా విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన నరసింహారావు హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో నివాసం ఉంటున్నారు. కిరణ్ ఆయన వద్దనే ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. -
15 రోజులు..17 మంది
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో నగర విద్యార్థులు గల్లంతై ఆదివారానికి 15రోజులు పూర్తయ్యింది. ఈ ఘటన నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు కదా..తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడి సర్కారు సాయంతో ఇంకా మృతదేహాల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 17 మృతదేహాలు లభ్యంకాగా..ఇంకా 8మంది దొరకాల్సి ఉంది. పక్కాప్రణాళికతో మృతదేహాల కోసం జరుగుతున్న గాలింపు సత్ఫలితాలను ఇస్తోంది. మొదటివారం గాలింపులో కేవలం ఆరు మృతదేహాలే లభ్యంకావడంతో మిగ తా బాధితులు ఆశలు వదులుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం అత్యాధునిక పరికారాలతో గాలింపు చర్యలు చేపట్టడంతో గడిచిన మూడురోజుల్లోనే వరుసగా మృతదేహాలు లభ్యమవుతుండడంతో బాధితుల్లో ఆశమొదలైంది. తమవారి కడచూపు చూసుకునే భాగ్యం కోసం వారు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆదివారం గాలింపుచర్యల్లో నాలుగు మృతదేహాలు లభ్యమైనట్లు అక్కడి అధికారులు మన రాష్ట్రప్రభుత్వానికి సమాచారమందించారు. అందులో నల్లకుంటకు చెందిన రామ్మోహన్రావు కుమారుడు బైరినేని రిత్విక్ మృతదేహం ఉంది. పోస్టుమార్టం అనంతరం సోమవారం రిత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం అక్కడినుంచి నల్లకుంటలోని నివాసానికి చేరుకోనుంది. ఈవిషయం తెలియగానే నల్లకుంటలోని రిత్విక్ ఇంటికి భారీసంఖ్యలో స్నేహితులు,బంధువులు, బస్తీవాసులు చేరుకోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి. వారి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సోమవారం సాయంత్రం రిత్విక్ అంత్యక్రియలు జరగనున్నాయి. నగరానికి చెందిన మరో నలుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యంకావాల్సి ఉంది. -
బియాస్ నదిలో మరో మృతదేహం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. ఆదివారం ఉదయం మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 17 మృతదేహాలను బయటకు తీశారు. మరో ఏడుగురి ఆచూకీ గుర్తించాల్సివుంది. ఆదివారం దొరికిన మృతదేహాల్లో వరంగల్ జిల్లాకు చెందిన పరమేశ్వర్, హైదరాబాద్ నల్లకుంటకు చెందిన రుత్విక్లుగా గుర్తించారు. మరో రెండు మృతదేహాలను గుర్చించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో గల్లంతయిన సంగతి తెలిసిందే. ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారు. దాసరి శ్రీనిధి, కాసర్ల రిషిత రెడ్డి, రిథిమ పాపాని, కల్లూరి శ్రీహర్ష, సందీప్ బస్వరాజ్, జగదీష్ ముదిరాజ్, అఖిల్-మిట్టపల్లి, ఎం.విష్ణువర్ధన్, కిరణ్ కుమార్ దొరికిన మృతదేహాలు : 1. గంపల ఐశ్యర్య 2. ఆకుల విజేత 3 భానోతు రాంబాబు 4.లక్ష్మీగాయత్రి 5. దేవాశిష్ బోస్ 6. షాబేర్ హుస్సేన్ 7. టి.ఉపేందర్ 8.అరవింద్ కుమార్ 9.పి.వెంకట దుర్గ తరుణ్ 10.అశీష్ ముంతా, 11.మాచర్ల అఖిల్ 12.శివప్రకాశ్ వర్మ 13.మహెన్ సాయిరాజ్ 14.పరమేష్ 15. రినేని రిత్విక్ -
బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా సహాయ బృందాలు ఆదివారం రెండు మృతదేహాలను వెలికితీశాయి. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన రిత్విక్, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పరమేష్‌గా గుర్తించారు. దాంతో ఇప్పటివరకు 15 మృతదేహాలు లభ్యమైనాయి. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఆ క్రమంలో ఈ నెల 8వ తేదీన 24 మంది విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. -
త్రుటిలో తప్పిన మరో ‘బియాస్’
జార్ఖండ్‌లో వెల్లువ మధ్య 8 గంటలు సిమెంట్ దిమ్మెపెకైక్కి ప్రాణాలు కాపాడుకున్న 10 మంది పిల్లలు డ్యామ్ గేటు ఎత్తివేయడంతో పెరిగిన నీటిమట్టం బొకారో (జార్ఖండ్): హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీ ప్రవాహంలో ఇటీవల 24 మంది తెలుగు విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటన లాంటిది జార్ఖండ్‌లో తృటిలో తప్పిపోయింది. జార్ఖండ్‌లోని దామోదర నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన 10 మంది బాలురు,.. డ్యామ్ గేటు ఎత్తివేయడంతో పెరిగిన ప్రవాహం మధ్య దాదాపు 8 గంటలకుపైగా చిక్కుకుపోయినా ఎట్టకేలకు ప్రాణాలు దక్కించుకున్నారు. వారు నదిలో ఉండగానే, ఎగువనున్న తేనూఘాట్ డ్యామ్ స్లూయిస్ గేట్ ఎత్తివేయడంతో అకస్మాత్తుగా నీరు వెల్లువెత్తింది. దీనితో వారంతా, ప్రాణభయంతో చంద్రాపురా థర్మల్ విద్యుత్కేంద్రానికి చెందిన ఎత్తై సిమెంట్ దిమ్మెపైకి చేరుకున్నారు. ప్రవాహంమధ్య సిమెంట్ దిమ్మెపైనే ఎనిమిది గంటలకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ తర్వాత వారిని పోలీసులు రక్షించారు. జార్ఖండ్‌లోని బొకారో జిల్లా పచౌరా గ్రామంవద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11-30 వరకూ (పోలీసులువచ్చి కాపాడేవరకూ) వారు ప్రవాహం మధ్యనే చిక్కుకుపోయారని, వారంతా 16ఏళ్లలోపు వయసువారేనని బొకారో డిప్యూటీ కమిషనర్ ఉమాశంకర్ సింగ్ తెలిపారు. ‘బియాస్’ నివేదికపై చర్యలు: వీర భద్ర సింగ్ సిమ్లా(హిమాచల్‌ప్రదేశ్): బియాస్ నదిలో తెలుగు విద్యార్థుల గల్లంతు దుర్ఘటనపై మండి డివిజనల్ కమిషనర్ సమర్పించిన దర్యాప్తు నివేదికను తదుపరి చర్యల కోసం ప్రధాన కార్యదర్శికి పంపినట్లు శనివారం హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ వెల్లడించారు. దర్యాప్తు నివేదికకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని, నదిలో గల్లంతైన అందరి మృతదే హాలు దొరికేదాకా అన్వేషణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. జూన్ 8న బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు, ఓ టూర్ ఆపరేటర్ మునిగిన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు మండి డివిజనల్ కమిషనర్ దర్యాప్తు నివేదిక సమర్పించారు. కాగా, ఇరాక్‌లో అపహరణకు గురైన హిమాచల్ వాసులను రక్షించేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వీరభద్రసింగ్ విలేకరులకు తెలిపారు. -
తనయుడి చూపు కోసం ఆ తండ్రి....
రుద్రవరం: తనయుడి చూపు కోసం ఆ తండ్రి తపిస్తున్నాడు. తన కుమారుడు సజీవంగా తిరిగివస్తాడో లేదోననే ఆందోళనతో మంచం పట్టాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే. వీరితోపాటు కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ కుమారుడు ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు. తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయ చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ.. నాగిశెట్టి కుటుంబాన్ని పోషించుకొనేవాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం వెన్నునొప్పి రావడంతో ఆపరేషన్ చేయించుకొనేందుకు, అలాగే కుమారుని చదువు కోసం రూ. 2 లక్షల మేర అప్పు చేశాడు. ప్రస్తుతం ఆలమూరు సిండికేట్ బ్యాంక్‌లో రూ. 80 వేలు, వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 1.20 లక్షల అప్పు ఉంది. ఈయన కుమారుడు ప్రహ్లాదుడు ఆర్థిక సమస్యలతో ఎంబీఏ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాదులో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి (ప్రహ్లాదుడి సమీప బంధువు.. మామ అవుతాడు)ని ఆశ్రయించాడు. ట్రావెల్ బస్సుతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. కుమారుడు గల్లంతైన విషయం ఒకవైపు.. అప్పుల బాధ మరో వైపు బాధిస్తుండడంతో పెద్ద నాగిశెట్టి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మంచం దిగలేని స్థితిలో ఉన్నాడు. భార్య వృద్ధురాలు కావడంతో ఆయన ఆలనాపాలనా కుమార్తె లక్ష్మీదేవి చూస్తోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఒక విద్యార్థి శవం లభ్యమైనట్లు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆమె చెప్పారు. గల్లంతైన 24 మంది విద్యార్థులతోపాటు టూర్ కో ఆపరేటర్‌గా ప్రహ్లాదుడి పేరు నమోదు చేశారన్నారు. కంటికి రెప్పలా కాపాడే కుమారుడు లేనప్పుడు తమకు ఈ జీవితం ఎందుకని.. ఉన్న పొలం అమ్మి అప్పులు చెల్లించి విషం తీసుకుంటామని ప్రహ్లాదుడి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. ప్రహ్లాదుడి బంధువులు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిని కలిసి, తల్లిదండ్రుల ఆవేదనను వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కలెక్టర్‌కు ఫైల్ రూపంలో అందించారు. వెంటనే కలెక్టర్.. నంద్యాల ఆర్డీఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వీరికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. -
కట్టలు తెగిన కన్నీళ్లు
చైతన్యపురి,మియాపూర్, చిలకలగూడ: ‘చిన్నప్పట్నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం..టూర్‌కెళ్లొస్తానని వెళ్లిన కొడుకు కనీసం ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా నిర్జీవంగా వచ్చాడు. ఇలాంటి దుఖం పగవారికి కూడా రావొద్దు’ అని హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతై మృతిచెందిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గురువారం లభించిన మాచర్ల అఖిల్, ఆశీష్మంథా, శివప్రకాశ్వర్మల మృతదేహాలు శుక్రవారం అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకరాగా.. అక్కడ్నుంచి వారి కుటుంబసభ్యులు ఇళ్లకు తరలించారు. వచ్చీరాగానే కుమారుల మృతదేహాలు చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు భోరు న విలపిం చారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. పలువురు రాజకీయప్రముఖులు, కార్పొరేటర్లు, ప్రజాసంఘాల నాయకులు, తోటి స్నేహితులు తరలివచ్చి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం బంధుమిత్రులు, స్నేహితులు, కాలనీవాసుల అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాచర్ల అఖిల్ దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన మాచర్ల అఖిల్ మృతదేహాన్ని చూసి అఖిల్ తల్లిదండ్రులు సుదర్శన్, సబిత, సోదరుడు విశాల్, బంధువులు పెద్దపెట్టున రోదించారు. కనీసం ముఖం కూడా కనిపించని స్థితిలో ఉండడంతో తట్టుకోలేకపోయారు. ‘అక్కడికెందుకు పోయావురా’ అంటూ తల్లి ఏడవడం అందరిని కలిచివేసింది. శివప్రకాశ్ వర్మ మియాపూర్‌లోని బ్లోసమ్ అపార్ట్మెంట్ కు చెందిన శివప్రకాశ్‌వర్మ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రవివర్మ, సుబ్బలక్ష్మి, సోదరుడు ధీరజ్వర్మ, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. స్టడీటూర్‌కు వెళ్లిన తమ కుమారుడు మరో రెండేళ్లలో చేతికందివస్తాడనుకున్నాం కానీ, ఇలా అర్థాంతరంగా తనువుచాలించి నిర్జీవంగా వస్తాడని అనుకోలేదని తల్లి సుబ్బలక్ష్మి రోదన అందరి హృదయాలను కదిలించింది. అనంతరం బంధువులు, స్నేహితులు అశ్రునయనాల మధ్య ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అశీష్ మంథా బియాస్ నది దుర్ఘటనలో గల్లంతై మృతిచెందిన అశీష్ మం థా మృతదేహాన్ని చిలకలగూడ శ్రీనివాసనగర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు.చలాకీగా టాటా చెబుతూ వెళ్లిన కన్నకొడుకు విగతజీవిగా రావడంతో తల్లి సత్యవాణి కన్నీటిపర్యంతమయ్యారు. ఉబ్బిపోయిన మృతదేహాన్ని చూసి మరింత కడుపుకోతకు గురవుతారని భావించిన బంధువులు బాక్స్‌ను విప్పలేదు. దీంతో ‘కడసారి చూపుకు కూడా నోచుకోలేదా నాయనా’ అంటూ రోదించిన తల్లి సత్యవాణిని ఆపడం ఎవరితరం కాలేదు. భర్త పోయిన విషాదం నుంచి తేరుకోకముందే తనయుడు అశీష్ ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తల్లి సత్యవాణి..నేనెందుకు బతకాలి అంటూ బిగ్గరగా ఏడ్చింది. అనంతరం అశీష్ మృతదేహానికి బన్సీలాల్‌పేట శ్మశానవాటిలో అంత్యక్రియలు నిర్వహించారు. -
హైదరాబాద్‌కు విద్యార్థుల మృతదేహాలు
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్ మంథా, అఖిల్‌ల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మొత్తం 12 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శివప్రకాశ్ వర్మది కూకట్పల్లికాగా, ఆశిష్ మంథా సికింద్రాబాద్, అఖిల్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందినవారు. -
చివరిచూపూ దక్కలేదు
అణువణువూ గాలించినా... బియాస్లో ఓడి వెనుతిరిగినశ్రీనిధి తండ్రి నా బిడ్డ ఏదంటూ తల్లి ఆక్రందన కరీంనగర్ రూరల్ : జలప్రవాహానికి బలైన కన్నబిడ్డ జాడకోసం... కళ్లల్లో వత్తులు వేసుకుని దాసరి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి చూసిన ఎదురుచూపులు ఫలించలేదు. బిడ్డను కడసారి చూపయినా చూసుకుందామనుకున్న ఆశ నెరవేరలేదు. హృదయపొరల్లో నిక్షిప్తమైన ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బియాస్ నది వద్ద పదిరోజులుగా పడిగాపులు గాసినా బిడ్డ జాడ తెలియకపోవడంతో... గుండెలనిండా ఉన్న బాధను గొంతులో దిగమింగుకుని రిక్తహస్తాలతో గురువారం ఇల్లు చేరారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8న గల్లంతయిన కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు. సంఘటన జరిగిన మరునాడే ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. పది రోజులుగా కూతురు ఆచూకీ కోసం అక్కడే పడిగాపులు కాశారు. ఒక్కొక్క మృతదేహం బయటపడుతుంటే... తమ కూతురుదేమోనని ఆత్రుత గా... ఆందోళనగా వెళ్లి చూస్తూ... కాదని నిర్ధారించుకుంటూ నరకయాతన అనుభవించారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బియాస్ నది వద్ద రాజిరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు. 24 మంది గల్లంతు కాగా పది రోజులపాటు రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా గురువారం వరకు 14 మృ తదేహాలు లభ్యమయ్యాయి. గాలింపు కష్టమని అక్కడి ప్రభుత్వం భావించి విద్యార్థుల పేరిట ఈ నెల 17న డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రకటించడంతో... ఇక ఆశలు వదులుకు న్న రాజిరెడ్డి అక్కడినుంచి భారంగా బయలుదేరారు. కూతు రు కోసం వెళ్లిన ఆయన గురువారం వేకువజామున పుట్టెడు దుఃఖంతో రిక్తహస్తాలతో ఇల్లు చేరారు. ఆయన రాకతో ఆ ఇల్లు కన్నీటి సంద్రమే అయ్యింది. నా బిడ్డ ఏదంటూ శ్రీనిధ/ తల్లి ఆయనను ప్రశ్నించేసరికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజిరెడ్డిని ‘సాక్షి’ ఓదార్చుతూ... పలకరించగా అంతవరకు కట్టలు కట్టుకున్న కన్నీరు ఓ ప్రవాహమే అయింది. గుండెల నిండా ఉన్న బాధను పంచుకోవాల నే ఆరాటమున్నా... కళ్లల్లో తిరుగుతున్న నీళ్ల సుడులతో ఆయ న గొంతు పెగలలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న శ్రీనిధి నదీ ప్రవాహంలో తరలిరాని దూరాలకు వెళ్తుందని అనుకోలేదని, అణువణువూ గాలించినా... ఎక్కడా జాడ కనిపించలేదని... ఆయన విలపిస్తూ తెలిపారు. శ్రీనిధి జాడ తెలుస్తుంద నే ఆశ రోజురోజుకూ సన్నగిల్లుతున్నప్పటికీ కనీసం నిర్జీవ దేహమైనా లభిస్తుందనే ఆశతో బుధవారం రాత్రంతా ఢిల్లీలో వేచిచూశానని విలపించారు. గురువారం గాలింపులో మూడు మృతదేహాలు లభించడంతో నా బిడ్డ జాడ కూడా దొరుకుతుందనే ఆశ కలుగుతోందని గద్గరస్వరంతో చెప్పారు. -
మరో మూడు మృతదేహాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్‌మంథా, అఖిల్‌ల మృతదేహాలు దొరికాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మృతదేహాల కోసం గాలింపు ముమ్మరం చేశారు. శివప్రకాశ్ వర్మది కూకట్పల్లి, ఆశిష్ మంథా సికింద్రాబాద్, అఖిల్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. వీరి మృతదేహాలు శుక్రవారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటాయని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రవాణామంత్రి మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ రాజీవ్ త్రివేదిలు ‘సాక్షి’కి తెలిపారు. -
అదే వేదన ఆతృత
మియాపూర్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది వరద ప్రమాదంలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల వేదన అంతాఇంతా కాదు. ఘటన జరిగి 12 రోజులు దాటినా ఇంకా కొన్ని మృతదేహాలు లభ్యంకాకపోవడంతో వారి సంబంధీకులు తల్లడిల్లిపోతున్నారు. రిస్క్యూటీమ్, భారత రక్షకదళం, ఐటీబీపీ సంయుక్తంగా చేస్తున్న యత్నాలు ఫలించి గురువారం ఒక మృతదేహం లభ్యమైంది. అది నగరానికి చెందిన శివప్రకాశ్వర్మదిగా గుర్తించి వెంటనే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. 12 రోజులుగా మృతదేహం లభించకపోవడంతో తమ కుమారుడు ఎక్కడోచోట క్షేమంగా ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు.. నిర్జీవంగా దొరకడంతో కన్నీరుమున్నీరయ్యారు. బాచుపల్లిలోని కాలేజీ నుంచి స్టడీటూర్కెళ్లిన తమ కుమారుడు అర్ధాంతరంగా ఇలా వస్తాడని అనుకోలేదని, చేతికంది వస్తాడని భావించిన తమకు గర్భశోకం మిగిల్చాడని తల్లిదండ్రులు గుండెల విసేలా రోదిస్తున్నారు. నేడు మృతదేహం తరలింపు హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో లభ్యమైన శివప్రకాశ్‌వర్మ మృతదేహాన్ని శుక్రవారం హెచ్ఎంటీ స్వర్ణపురికాలనీలోని బ్లోసమ్ అపార్ట్‌మెంట్‌కు తీసుకరానున్నారు. విషయం తెలుసుకున్న వీరి సంబంధీకులు అపార్ట్‌మెంట్‌కు తరలివస్తున్నారు. మాచర్ల అఖిల్ మృతదేహం కూడా.. చైతన్యపురి: బియాస్ నదిలో గల్లంతైన దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన మాచర్ల అఖిల్ మృతదేహం గురువారం లభ్యమైంది. అఖిల్ మృతదేహం లభ్యమైందని అధికారుల నుంచి ఫోన్ రావటంతో తల్లిదండ్రులు సుదర్శన్, సవితలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి అఖిల్ పార్థీవ దేహం చేరుకుంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. -
అఖిల్ మృతదేహం లభ్యం
చౌటుప్పల్ :బియాస్ నదిలో 12రోజుల క్రితం గల్లంతైన మాచర్ల అఖిల్(20) మృతదేహం గురువారం లభ్యమైంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రా మానికి చెందిన మాచర్ల అఖిల్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్టడీ టూ ర్లో భాగంగా ఈ నెల 3న హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బియాస్ నదిలో గల్లంతైన అఖిల్ మృతదేహం కో సం 12రోజులుగా రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలిస్తూనే ఉన్నా రు. గాలింపు చర్యల్లో భాగంగా గురువారం అఖిల్ మృతదేహం లభ్యమైంది. అఖిల్ గల్లంతైన విషయం తెలియగానే, తల్లిదండ్రులు మాచర్ల సుదర్శన్, సబిత దంపతులు హిమాచల్‌ప్రదేశ్ కు తరలివెళ్లారు. ఇప్పటి వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు. కొడుకు కడసారి చూపు దక్కుతుందా, లేదా అన్న ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. గాలిం పు చర్యల్లో భాగంగా మృతదేహం లభ్యం కావడం తో, కడసారి కొడుకును చూసుకొని గుండెలవిసేలా రోదించారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రత్యేక విమానంలో మృతదేహం హైదరాబాద్‌కు చేరనుం ది. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించనున్నారు. అఖిల్ గల్లంతవడంతో కొయ్యలగూడెంలో విషాదం నెలకొంది. -
కన్నా.. వెళ్లిపోయావా
చందానగర్ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది ప్రమాదంలో గల్లంతై మృతి చెందిన వెంకట్దుర్గ తరుణ్ మృతదేహాన్ని గురువారం చందానగర్‌లోని టెల్‌కట్స్ అపార్టుమెంట్‌కు తీసుకొచ్చారు. కన్నకొడుకు విగతజీవిగా రావడం చూసి తల్లిదండ్రులు సుబ్బారావు, విజయలక్ష్మీలు ఒక్కసారిగా బోరున విలపించారు. స్టడీటూర్కెళ్లి..ఇలా వస్తావనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. తొమ్మిదేళ్లుగా వారు నివాసముంటున్న టెల్‌కట్స్ అపార్ట్‌మెంట్‌కు పరిసర ప్రాంతాల ప్రజలు, బంధువులు, స్నేహితులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా మునగాల మండలం పెద్దపర్తిపాలెంకు తరలించారు. -
బియస్ నదిలో మరో మృతదేహం లభ్యం
-
రేపు హైదరాబాద్‌కు తరుణ్ మృతదేహం
మండి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థులలో ఈరోజు ఒక విద్యార్థి మృతదేహం లభించింది. ఆ మృతదేహం వెంకట దుర్గా తరుణ్దిగా గుర్తించారు. పండో రిజర్వాయర్ వద్ద రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వాటిలో ఒకటి ఇంజనీరింగ్ విద్యార్థి తరుణ్దిగా కాగా, మరొకటి స్థానికుడిదిగా గుర్తించారు. తరుణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. రోడ్డు మార్గంలో మృతదేహాన్ని ఢిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ తరలిస్తారు. తరుణ్ మృతదేహం రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఈ నెల 8వ తేది ఆదివారం 24 మంది విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు లార్జి డ్యామ్‌లో దిగిన సమయంలో గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహ ఉధృతికి విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇంతకు ముందు 8 మృతదేహాలు దొరికాయి. ఈ రోజు దొరికి మృతదేహంతో మొత్తం 9 దొరికాయి. ఇంకా 15 మృతదేహాలు లభ్యం కావలసి ఉంది. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తునే ఉన్నారు. గల్లంతయినవారు: 1.దాసరి శ్రీనిధి 2.కాసర్ల రిషిత రెడ్డి 3. గంపల ఐశ్యర్య 4. లక్ష్మీగాయత్రి 5.ఆకుల విజేత 6. రిథిమ పాపాని 7.కల్లూరి శ్రీహర్ష 8. దేవాశిష్ బోస్ 9. బైరినేని రిత్విక్ 10. ఆషిష్ మంత 11.సందీప్ బస్వరాజ్ 12.అరవింద్ 13.పరమేష్ 14. జగదీష్ ముదిరాజ్ 15. అఖిల్-మిట్టపల్లి 16. ఉపేందర్ 17.అఖిల్-మాచర్ల 18.భానోతు రాంబాబు 19. శివప్రకాష్ వర్మ 20. ఎం.విష్ణువర్ధన్ 21.సాయిరాజ్ 22.సాబేర్ హుస్సేన్ 23. కిరణ్ కుమార్ 24. పి.వెంకట దుర్గ తరుణ్ దొరికిన మృతదేహాలు : 1. గంపల ఐశ్యర్య 2. ఆకుల విజేత 3 భానోతు రాంబాబు 4.లక్ష్మీగాయత్రి 5. దేవాశిష్ బోస్ 6. షాబేర్ హుస్సేన్ 7. టి.ఉపేందర్ 8.అరవింద్ కుమార్ 9.పి.వెంకట దుర్గ తరుణ్ -
మరో రెండు మృతదేహాలు లభ్యం
-
'నీళ్లు విడిచిన రోజు సైరన్ పని చేయలేదు'
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఘటనకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో అనుభవం లేని సిబ్బందిని విహార యాత్రకు పంపంటం వల్లే విద్యార్థులు నదిలోకి దిగారన్నారు. సంఘటన జరిగిన రోజు లార్జి డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో సైరన్ పని చేయలేదని మహేందర్ రెడ్డి తెలిపారు. సైరన్ పనిచేసి ఉంటే విద్యార్థులు అప్రమత్తంగా ఉండేవారన్నారు. 11వ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్వస్థలాలకు వెళ్లారని, ఉత్తరాఖండ్ బాధితుల మాదిరిగా వారికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగిందన్నారు. విద్యార్థులు గల్లంతై పదకొండు రోజులు గడిచినా ఇంకా 17మంది ఆచూకీ దొరకలేదు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక దుఖంతో వెనుదిరిగారు. మరోవైపు ఎన్డీఆర్ఎస్ సిబ్బందితో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి మహేందర్ రెడ్డి, లవ్ అగర్వాల్, కార్తికేయ శర్మ తదితరులు హిమాచల్ ప్రదేశ్‌లో విద్యార్థుల గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
‘విజ్ఞానజ్యోతి’ పై చర్య తీసుకోండి
కేసు నమోదుకు సైబరాబాద్ పోలీసుల కసరత్తు! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఇటీవల స్టడీటూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మృత్యువాత పడినట్లే.. రెండేళ్ల క్రితం (2012లో) స్టడీటూర్ సందర్భంలోనూ అదే కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పులిచింతల ప్రాజెక్టులో నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే యాజమాన్య నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసుంటే ఇప్పుడీ 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేదికాదని భావించిన ‘పులిచింతల’ ఘటన బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. 2012లో 53 మంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం స్టడీ టూర్‌కు తీసుకెళ్లింది. వారిలో అజయ్, మోహన్‌కుమార్ విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో తగిన సహాయం అందిస్తామని అప్పట్లో కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. అయితే తర్వాత వారు తరబడి తిరిగినా చిల్లిగవ్వ కాదు కదా కనీసం మృతుడి సోదరికి కళాశాలలో సీటు కూడా యాజమాన్యం ఇవ్వలేదు. ఇదిలాఉండగా, ఈ నెల 3న అదే కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు స్టడీ టూర్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు. వారిలో 24 మంది బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అజయ్, మోహన్‌కుమార్‌ల తండ్రులు కె.ప్రహ్లాదరావు, ఈశ్వరరావు స్పందించారు. మంగళవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పులిచింతల ఘటనలో విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలపై కేసు నమోదు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. -
బియాస్.. జాడేది?
స్కానర్కూ అందని విద్యార్థుల ఆచూకీ ఫలితమివ్వని పదోరోజు సెర్చింగ్ గాలింపు చర్యల్లో తెలంగాణ పోలీస్ బృందం పర్యవేక్షిస్తున్న ఇక్కడి డీజీపీ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం చేపట్టిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నావికా దళానికి చెందిన అత్యాధునిక పరికరం సైడ్ స్కాన్ సోనార్‌ను వినియోగిస్తున్నారు. లార్జీ డ్యామ్-పండో డ్యామ్‌ల మధ్య ఉన్న ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ స్పెషల్ పోలీసు అదనపు డీజీ రాజీవ్ త్రివేది, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ కార్తికేయ నేతృత్వంలోని 15 మంది తెలంగాణ రాష్ట్ర పోలీసు వాటర్ స్పోర్ట్స్ టీమ్ సిబ్బంది స్థానిక అధికారుల సాయంతో జల్లెడపట్టారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సైతం మంగళవారం అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. లార్జీ డ్యామ్‌కు ఎగువన ఆదివారం భారీ వర్షం కురవడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లార్జీ డ్యామ్ నుంచి దిగువకు వస్తున్న నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిపోవడం, బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఆపరేషన్ జరగట్లేదని రాజీవ్ త్రివేది ‘సాక్షి’కి తెలిపారు. - సాక్షి, హైదరాబాద్. -
'డ్యాం సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం'
-
హైదరాబాద్ చేరుకున్న నాయిని!
హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. జూన్ 8 తేదిన హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో వీఎన్ఆర్ ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన ఘటనలో సహాయ సహాకార కార్యక్రమంలో పాల్గొనేందుకు నాయిని హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన విషాదంలో గల్లంతైన, మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు గత వారం రోజులుగా నాయిని హిమాచల్ ప్రదేశ్ లో ఉండి కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ చేరుకున్న నాయని మీడియాతో మాట్లాడుతూ.. హిమాచల్ ప్రభుత్వం సహయం అందించింది. మరో 10 రోజులు గాలింపు చర్యలు చేపడతాం అని అన్నారు. -
'గుణపాఠం నేర్చుకున్నాం'
హైదరాబాద్: గల్లంతైన విద్యార్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల బీమా పరిహారం మూడు నెలల్లో తల్లిదండ్రులకు అందిస్తామని విఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ సెక్రటరి డిఎన్ రావు చెప్పారు. విద్యార్ధులు చెల్లించిన ఫీజును తిరిగి ఇస్తామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నట్లు తెలిపారు. టూర్లో ఉన్న మరో 600 మంది విద్యార్థులను వెనక్కి రప్పించినట్లు రావు చెప్పారు. ఇదిలా ఉండగా, బియాస్ నదిలో అత్యాధునిక పరికరాలతో వెతికినా మృతదేహాలు ఇంకా దొరకలేదు. మొత్తం 24మంది గల్లంతు కాగా, కేవలం ఎనిమిది మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగతావారి జాడ తెలియలేదు. గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో చివరి చూపుకూడా దక్కలేదని వారి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లార్జీ డ్యాంకు దిగున 7 కిలోమీటర్ల వరకూ గాలింపు పూర్తయింది. మరో 9 కిలోమీటర్లమేర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్న బిడ్డల కడచూపు కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. -
'తల్లిదండ్రులకు మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లు'
-
అకస్మాత్తుగా నదిలో నీరు పెరగడంతోనే...
మండి : బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లను అందచేసింది. అకస్మాత్తుగా నదిలో నీరు పెరగటం వల్లే విద్యార్థులు కొట్టుకుపోయారని హిమాచల్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీలను అందచేసింది. మృతదేహాలు లభ్యమైతే హైదరాబాద్‌కు తరలిస్తామని హిమాచల్ ప్రభుత్వ అధికారులు...విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. గత పదిరోజులుగా జరిగిన గాలింపు చర్యల్లో తమ పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. విద్యార్థుల గల్లంతుపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్నారు. కాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముమ్మర గాలింపులు బియాస్‌నదిలో గల్లంతైన విద్యార్థుల మతదేహాలను వెలికితీయడంలో విఫలమయ్యాయి. భారీ స్థాయిలో గాలింపు చర్యలు జరిగినప్పటికీ ఒక్క మతదేహం కూడా బయటపడలేదు. సైడ్ సోనార్ పరికరాలు, మానవ రహిత విమానాలు ఉపయోగించినా, నీటి విడుదలను పూర్తిగా ఆపివేసి సంఘటనాస్థలంలో గజ ఈతగాళ్లు విస్తతంగా గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. 24మంది గల్లంతు కాగా కేవలం ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతావారి జాడ తెలియలేదు. గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో వారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది. -
'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
-
'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
హిమాచల్ : వీఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం తీరును తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తప్పుపట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో ప్రమాదానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్ధుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే కార్యక్రమాన్ని మండిలో నాయిని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. హిమాచల్ లోని ఘటనాస్థలానికి విద్యార్థుల తల్లిదండ్రులను పంపేందుకు విమానం ఎందుకు ఏర్పాటు చేయలేదని కాలేజీ యాజమాన్యాన్ని నాయిని ప్రశ్నించారు. అయితే నాయిని ప్రశ్నకు కాలేజీ యాజమాన్యం పొంతనలేని వివరణ ఇచ్చింది. కాలేజి యాజమాన్యం వివరణపై నాయిని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా నాయిని అక్కడే ఉండి సహాయ సహకార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. గతవారం విజ్ఞాన యాత్రకు వెళ్లిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. -
మా పరమేశ్వర్ జాడేది..?
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు నర్సంపేట : ఏడు రోజులు గడిచారు.. వూ పరమేశ్వర్ జాడ తెలియుట్లేదు.. తిరిగొత్తాడనే ఆశ ఉంది.. టీవీల ముందు కూసోని ఎదురు చూస్తున్నం.. ఈ వూటలు నర్సంపేటలోని చిందం పరమేశ్వర్ కుటుంబ సభ్యులవి. హివూచల్‌ప్రదేశ్‌లోని బియూస్ నదీ ప్రవాహంలో కొట్టుకుపోరు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నర్సంపేట పట్టణానికి చెందిన చిందం పరమేశ్వర్ ఉన్న విషయం తెలిసిందే. అతడి కోసం తల్లిదండ్రులు వీరన్న-ఉవు, అక్క ప్రియూంక, అన్న ప్రశాంత్ కన్నీరువుున్నీరుగా రోదిస్తున్నారు. పరమేశ్వర్ జాడ తెలుసుకోవడానికి సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లివచ్చాడు. అయినా జాడతెలియలేదు. పరమేశ్వర్ క్షేవుంగా ఇంటికి రావాలని అతడి ప్రాణమిత్రులు, బంధువులు, పలు సంఘాల బాధ్యులు ఇష్టదైవాలను వేడు కుంటూ సంఘీభావం తెలుపుతున్నారు. క్షణమొక యుగం కన్న బిడ్డల కోసం ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. హిమచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన అఖిల్ ఉన్నాడు. సంఘటన జరిగి ఏడు రోజులు గడిచానా వారి ఆచూకీ దొరక్కపోవడంతో ఇంటిల్లిపాది ముద్దకూడ ముట్టడంలేదు. కంటిమీద కునుకులేదు. ఏడ్చి ఏడ్చి కళ్లల్లోనే నీరు ఇంకిపోతోంది. క్షణమొక యుగంగా గడుపుతున్నారు. వరంగల్ : హిమచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైనా ఇంజినీరింగ్ విద్యార్థి అఖిల్ కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన అఖిల్ ఈనెల 3న రాత్రి స్వగృహం నుంచి విజ్ఞాన యాత్రకు బయలు దేరిన అతను తిరిగి ఈనెల 15న రాత్రికి ఇంటికి తిరిగొస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకును ఉన్నత చదువులు చదివించి గొప్ప హోదా లో చూడాలని ఆ తల్లిదండ్రుల ఎన్నో కలలు కన్నారు. ఎన్ని ఇబ్బందులుపడినా కొడుకుకు కష్టమంటే తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ చది విస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు నేడు (ఆది వారం) తిరిగి రావాలసి ఉంది. ఈనెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీ ప్రవాహం లో తోటి విద్యార్థులతోపాటు అఖిల్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న నాటి నుంచి తల్లిదండ్రులు మిట్టపల్లి సంజయ్-సునీత, అక్క మౌనిక నిద్రహారాలు మాని అఖిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అతడిని గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. చిన్న విషయమైనా జాగ్రత్త తీసుకునే తన కుమారుడు వరదముంపు నుంచి బయట పడలేకపోయాడని తండ్రి సంజయ్ కొడుకును తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. ‘కొడుకు ఇవ్వాల(15న) ఇంటికి వస్తానని చెప్పిండు.. తప్పకుంట వస్తడు’ అని విలపిస్తున్న తల్లి సునీతను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు. కనీస సమాచారం ఇవ్వని అధికార యంత్రాంగం హిమచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన గిర్మాజీపేటకు చెం దిన అఖిల్ యోగ క్షేమాలను ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయడంలో జిల్లా అధికార యం త్రాంగం విఫలమైంది. బియాస్ నదిలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విషయాలను ఎప్పటికప్పడు తెలుసుకుంటూ పురోగతిని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉండగా ఇంత వరకు ఎవరూ అఖిల్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చిన దాఖ లాలు లేవు. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
నేటి నుంచి ‘సోనార్’ గాలింపు
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 16 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ కోసం శనివారం ఏడో రోజు నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక ఈత నిపుణులు, మరో 450 మంది పనివారు రోజంతా గాలించినా లాభం లేకపోయింది. ప్రమాద స్థలి నుంచి మూడు కిలోమీటర్ల మేరకు నదిలో నీటిమట్టాన్ని గంట పాటు కనీస స్థాయికి తగ్గించి వెదికినా ఒక్క మృతదేహం కూడా లభించలేదు. దాంతో ఐదు రోజులుగా ఘటనా స్థలి వద్దే పడిగాపులు కాస్తూ, తమ పిల్లల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మనోవేదనకు అంతులేకుండా పోయింది. ఆదివారం నుంచి అత్యాధునిక సోనార్ (సైట్ స్కాన్ రాడార్) పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. అప్పటికీ ఫలితం లేకపోతే మృతదేహాల కోసం పండో డ్యామ్ గేట్లు ఎత్తేయడం, లేక మరో వారం పది రోజుల్లో వాటంతట అవే పైకి తేలేదాకా ఎదురు చూడటం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చంటున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన మండి జిల్లాలోనే కొద్ది రోజులుగా మకాం వేసిన తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం స్థానిక ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విహారయాత్రకు వెళ్లిన 24 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ జూన్ 8న లార్జి డ్యామ్ నుంచి హఠాత్తుగా వచ్చి పడ్డ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిందే. గురువారం దాకా 8 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం మానవరహిత విమానాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయింది. -
ఆధునిక పరిజ్ఞానంతో గాలింపు
గల్లంతైన విద్యార్థుల ఆచూకీకి కృషి ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి బేగంపేట: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన నగర విద్యార్థుల ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పడుతున్నట్లు ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లార్జి డ్యామ్ కింది భాగంలోని మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఇక ఎలాంటి మృతదేహం ఉండే అవకాశం లేదని తమ సంస్థ నిపుణులు తేల్చిచెప్పినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం నుంచిప్రారంభించే సెర్చింగ్ ఆపరేషన్‌లో నౌకాదళానికి చెందిన అత్యాధునిక సైడ్ స్కాన్ సోనార్, జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన లాడర్ అనే మరో స్కానింగ్ యంత్రం సాయంతో నది అడుగు భాగంలో జల్లెడ పట్టనున్నట్లు పేర్కొన్నారు. మెత్తం ఆపరేషన్‌లో తమ ఎన్డీఎంఏ టీమ్‌తో సహా మెత్తం 700 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. లార్జి డ్యామ్ కింద నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండో డ్యామ్ వరకు జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. తీవ్ర వాతవరణ ప్రతికూలతల మధ్య విద్యార్థుల ఆచూకీ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వేదనను తాము అర్థం చేసుకుంటామని అయితే ప్రకృతి సహకరించక పోవడంతో తీవ్ర ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు బృందం తిరుగు పయనం హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా లార్జి డ్యామ్ వద్ద బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల గాలింపు చర్యల్లో పాలుపంచుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం నేడు తిరుగుపయనమైంది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే స్పందించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సహాయక చర్యల కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించిన విషయం తెలిసిందే. బాలనగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ నేతృత్వంలో వెళ్లిన పేట్‌బషీరాబాద్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు, దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బృందం ఘటనా స్థలంలో వారం రోజుల పాటు బాధిత విద్యార్థి కుటుంబాలకు ధైర్యం చెబుతూ సహాయ చర్యల్లో పాలు పంచుకున్నారు. విద్యార్థుల మృతదేహాలు వెలికి తీయడంలో అక్కడి అధికారులు, సిబ్బందికి తోడుగా నిలిచారు. వెలికి తీసిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం లోను, మృతదేహాలు హైదరాబాద్‌కు తరలించడంలో సహకరించారు. గ ల్లం తైన 24 మంది విద్యార్థుల్లో కేవలం 8 మంది విద్యార్థుల మృతదేహాలు మాత్రమే బయటపడగా.. ఇంకా 16 మంది ఆచూకీ కానరాలేదు. మృతదేహాలు వెలికి తీసేందుకు ఇంకా ఆధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం భావించింది. దీంతో వారం రోజు నుంచి అక్కడే విధినిర్వహణలో నిమగ్నమైన సైబరాబాద్ పోలీసులు ఆదివారం తిరిగి రానున్నారు. మృతదేహాలు ఆలస్యంగా లభించే అవకాశాలు ఉన్నాయని బాలనగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ పేర్కొన్నారు. -
బియాస్ నదిలో ఫలించని అన్వేషణ
సిమ్లా: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలు శనివారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రోజంతా గాలించినా ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. నదిలో 450 మంది జవాన్లతో ప్రతి అంగుళం గాలించామని మండి కలెక్టర్ దేవేష్ కుమార్ చెప్పారు. లార్జీ డ్యామ్ దిగువన నదిలో మూడు కిలో మీటర్ల వరకు ఆపరేషన్ జరిగినట్టు చెప్పారు. ఆదివారం కూడా ఆపరేషన్ కొనసాగించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. పాండో డ్యామ్‌కు ఎగువన తొమ్మిది కిలో మీటర్ల పరిధిలో మరోసారి గాలిస్తామని చెప్పారు. అత్యాధునిక స్కైట్ స్కానర్ రప్పిస్తున్నామని, శవాలు బురదలో ఉన్నా గుర్తించేందుకు వీలవుతుందని తెలిపారు. మూడో ప్రత్యామ్నాయంగా సోమవారం పాండో డ్యామ్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయించి గాలింపు చర్యలు చేపడుతామని కలెక్టర్ చెప్పారు. హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీయగా, మిగిలిన వారీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. -
హిమాచల్ బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ ప్రమాద బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో తెలంగాణ అమర వీరుల సంస్మరణార్థం స్థూపం నిర్మాణం చేపట్టనున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం రోజున జిల్లాల్లో కూడా అమరవీరులకు నివాళి కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళుల తర్వాతనే రాష్ట్ర అవతరణ వేడుకలుంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం సభలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ అమరవీరుల సంతాప తీర్మానాలను అసెంబ్లీ ఆమోదించింది. -
ఉదయం 6 గంటల నుంచే గాలింపు చర్యలు
-
ఉదయం 6 గంటల నుంచే గాలింపు చర్యలు
మండి : హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధుల గాలింపు కార్యక్రమం ఏడో రోజు కూడా ముమ్మరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా మూడు డ్యాంలలోని నీటి విడుదలను నిలిపివేసి విద్యార్ధుల కోసం వెతుకుతున్నారు. ఆర్మీ, ఎస్ఎస్పీ, ఐటీజీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. 800మంది నిపుణులతో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. 30 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. మండీలోని మూడు డ్యామ్‌ల పరిధిలో నీటి ప్రవాహాన్ని క్రమక్రమంగా తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమాదానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి అంగుళం వెతకాలని అధికారులు నిర్ణయించారు. గాలింపు చర్యలను హిమాచల్ మంత్రి అనీత్ శర్మ, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇలా వుండగా ఈ ప్రమాదం హిమాచల్ ప్రదేశ్ సర్కారులో విప్లవాత్మక మార్కులకు నాంది పలికింది. నదీ తీర ప్రాంతాల్లో... హెచ్చరిక బోర్డులు వెలుస్తున్నాయి. నదికి దగ్గరగా వున్న ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
కన్నీటి వీడ్కోలు..
పాల్వంచ : అంతా ఓ పీడకలలా జరిగిపోయింది.. ఎంతో సంతోషంగా విజ్ఞాన యాత్రకు వెళ్లిన తల్లాడ ఉపేందర్ నిర్జీవంగా ఇంటికి చేరాడు. గత ఆదివారం హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతయిన 25 మంది విద్యార్థులలో ఉపేందర్ కూడా ఉండటంతో అతడి జాడ కోసం నాటినుం చి ఆ కుటుంబసభ్యులు ఆవేదనతో ఎదురుచూశారు. చివరకు గురువారం మృతదేహం లభ్యం కావడంతో అక్కడే ఉన్న తండ్రి, ఇక్కడ ఇంటి వద్ద ఉన్న తల్లి, తమ్ముడు ఇతర కుటుం బసభ్యులు బోరున విలపించారు. శుక్రవారం సాయంత్రం ఉపేందర్ మృతదేహం స్వగ్రామమైన గట్టాయిగూడెం(పాల్వంచ) చేరడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది. ‘బాబూ.. ఎప్పుడూ ఎంతో సంతోషంగా అమ్మను చూడాలని వస్తా వు.. ఒక్కసారి చూడరా..’ అంటూ తల్లి శ్రీదేవి విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. తండ్రి శ్రీనివాస్, తమ్ముడు మహేష్, నానమ్మ సువర్ణ, ఇతర బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇంటికి చేరిన మృతదేహం... గురువారం ఉదయం బియాస్ నదిలో లభించిన మృతదేహం ఉపేందర్‌దేనని కొడుకు జాడ కోసం అక్కడే వేచి చూస్తున్న తండ్రి శ్రీనివాస్ గుర్తుపట్టారు. సాయంత్రం అక్కడి నుంచి మండి మీదుగా ఢిల్లీ వరకు రోడ్డు మార్గాన తీసుకొచ్చా రు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీకి చేరుకోగానే ప్రత్యేక జెట్ విమానంలో 11.30 గం ట లకు హైదరాబాద్ తీసుకొచ్చారు. మృతదేహాన్ని అధికారికంగా స్వీకరించేందుకు అప్పటికే అక్కడ ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, తహశీల్దార్ సమ్మిరెడ్డి భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండ్రి శ్రీనివాస్‌ను ఓదార్చారు. అనంతరం తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో సాయంత్రం 6.30 గంటలకు పాల్వంచకు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అందజేశారు. భారీగా తరలివచ్చిన స్థానికులు .. బియాస్ నదిలో గల్లంతయిన వారిలో పాల్వం చకు చెందిన ఉపేందర్ ఉండటం స్థానికంగా చర్చంశనీయంగా మారింది. శుక్రవారం సాయంత్రం ఉపేందర్ మృతదేహం వస్తుందని తెలుసుకున్న స్థానికులు వందలాది మంది మధ్యాహ్నం నుంచే శ్రీనివాస్ ఇంటికి చేరుకుని వేచి చేశారు. అయితే ఉపేందర్ చనిపోయి ఐదు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. దీంతో అధికారులు ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా భద్రపరచి ఇక్కడి తరలించారు. మృతదేహాన్ని చూసే అదృష్టం కూడా లేదని కుటుంబసభ్యులు విలపించారు. మృతదేహానికి పలువురి నివాళి... ఉపేందర్ మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకులు వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తహశీల్దార్ సమ్మిరెడ్డి, టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని), సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదర్చారు. ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబసభ్యులతో పాటు భారీగా తరలివచ్చిన బంధువులు, స్థానికుల రోదనల నడుమ పాండురంగాపురం రోడ్‌లోని హిందూ శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు. -
మా అదృష్టం ఇంతేనేమో..
బియాస్ నది వద్ద నుంచి తిరిగొచ్చిన వెంకటేశ్వరరెడ్డి బోధన్ టౌన్ : ‘‘జరిగిన దానికి ఎవరినీ నిందించ ను. మా అదృష్టం ఇంతే అనుకుంటా’’ అంటూ వేదన నిండిన హృదయంతో విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నా రు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థు ల్లో జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. సమాచారం తెలియగానే ఆయన తండ్రి వెంకటేశ్వరరెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. శుక్రవారం వరకు విష్ణు ఆచూకీ తెలియలేదు. వెంకటేశ్వరరెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి శుక్రవారం స్వగ్రామం బోధన్‌కు తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న బంధువుల వారి ఇంటికి వచ్చి ఓదార్చారు. గల్లంతైన విద్యార్థులు తమ పిల్లలే అన్నట్లుగా రెస్క్యూ టీం గాలింపు చర్యలు నిర్వహిస్తోందని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణం గా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. భార్య రమాదేవి, కూతురు అనూష ఎలా ఉన్నారో అన్న ఆందోళనతో వచ్చానని, రెండు రోజులుండి మళ్లీ సంఘటన స్థలానికి వెళ్తానని పేర్కొన్నారు. కొవ్వత్తులతో నివాళి బోధన్ టౌన్ : ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన్‌కు చెందిన ప్రజాసేవ యువసేన సభ్యులు నివాళులు అర్పించారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు వేములపల్లి బుజ్జి మాట్లాడుతూ పర్యాటక స్థలాల్లో సూచిక బోర్డులు, ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో యువసేన సభ్యులు ప్రకాశ్, రమణ, బాపురెడ్డి, అనిల్, ప్రసాద్, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ వేదన?
ఇంకా లభ్యం కాని సందీప్ ఆచూకీ మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో నీటి ప్రవాహానికి గల్లంతైన సందీప్ తిరిగి వస్తాడని కుటుంబీకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగి 6 రోజులు గడిచినా విద్యార్థి జాడ తెలియరాకపోవడంతో సందీప్ స్వగ్రామం గౌడవెల్లిలో విషాదం అలుముకుంది. అతడి కోసం తల్లిదండ్రులు వీరేష్, విజయలతో పాటు కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సందీప్ జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. తన ఇంటికి కనీసం అధికారులు వచ్చి వివరాలు కూడా తెలుసుకోవడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్, సందీప్ తండ్రి వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
రేపట్నుంచి గాలింపు చర్యలు ముమ్మరం: రాజీవ్ త్రివేది
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధుల వెలికితీతకు శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది స్పష్టం చేశారు. 3 కి.మీ వరకు అణువణువూ గాలిస్తామన్నారు. గాలింపు కోసం ప్రాజెక్ట్‌లో నీరు ఆపేసిన వెంటనే రంగంలోకి దిగుతామని ఆయన తెలిపారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం, బండరాళ్లు ఉండటంతో గాలింపు కష్టంగా ఉందని రాజీవ్ త్రివేది మీడియాకు వివరణ ఇచ్చారు. గతంలో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల స్వయంగా రంగంలోకి దిగానని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా:
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది. ఉగాది పండగ పంచాంగ శ్రవణంలో విద్యార్ధులకు జల ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్కుడు మునుగు రామలింగేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే బియాస్ నదిలో విద్యార్ధుల గల్లంతు కావడంతో జోస్యంపై కొంత నమ్మకం కలిగినప్పటికి.. మూఢాచారాలను, జ్యోతిష్కులను నమ్మవద్దని జనవిజ్క్షాన వేదిక ప్రజలను హెచ్చరిస్తోంది. -
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా?
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది. ఉగాది పండగ పంచాంగ శ్రవణంలో విద్యార్ధులకు జల ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్కుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే బియాస్ నదిలో విద్యార్ధుల గల్లంతు కావడంతో జోస్యంపై కొంత నమ్మకం కలిగినప్పటికీ.. మూఢాచారాలను, జ్యోతిష్కులను నమ్మవద్దని జనవిజ్క్షాన వేదిక ప్రజలను హెచ్చరిస్తోంది. -
విషాదానికి ముందు దాకా ఇలా..
-
వీఎన్ఆర్ విద్యార్ధుల చివరి భోజనం వీడియో లభ్యం
మండి: వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లైంతైన విషాదానికి ముందు ఓ హోటల్ భోజనం చేసిన వీడియో మీడియాకు చేరింది. వీఎన్ఆర్ కాలేజీ విద్యార్థులు ఘటనాస్థలం తలోట్కు10 కి.మీ ముందు ఆశాదీప్ హోటల్లో భోజనం చేశారు. విద్యార్ధులందరూ ఆనందంతో కలిసి చేసిన ఆఖరి భోజనం సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆఖరి భోజనం సమయంలో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. ఆతర్వాత విద్యార్ధులందరూ బియాస్ నదిలో ఉత్సాహంతో ఫోటోలు దిగుతుండగా వరదలు ఆకస్మిక వారి జీవితాలను కబలించాయి. ద్యార్ధుల చివరి భోజనం వీడియో అందర్ని హృదయాలను కలిచివేసింది. -
లార్జీ డ్యాం నీటి విడుదల నిలిపివేత!
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంత అయిన విద్యార్థుల గాలింపు కోసం లార్జీ డ్యాం నీటి విడుదలను పూర్తిగా నిలిపి వేయనున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి మూడు గంటలపాటు నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నదిలోని నీటి పారుదలను పూర్తిగా నిలిపివేసి విద్యార్థుల గాలింపుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. కాగా గల్లంతు అయిన విద్యార్థుల గాలింపు కోసం 600 మంది సహాయక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకూ 8 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
ఆరోరోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు
మండి : తలచుకుంటేనే కన్నీళ్లు వచ్చే ఘటన. చేతికి వచ్చిన బిడ్డలు బియాస్ నదిలో కలిస్తే..ఏడవటం తప్ప ఏం చేయలేని స్థితి. ఈ దుర్ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్న ఇప్పటి వరకూ ఎనిమిది మృతదేహాలే దొరికాయి. గల్లంతు అయిన మరో 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనలో మొత్తం 24 మంది విద్యార్థులు గల్లంతు అయిన విషయం తెలిసిందే. ఇంకా పదహారుమంది విద్యార్థులతోపాటు టూర్ మేనేజర్ ప్రహ్లాద్ ఆచూకీ తెలియాల్సి ఉంది. గజ ఈతగాళ్లతోపాటు అదనపు బలగాలు కూడా తరలిరావడంతో గాలింపు చర్యలు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఉపేందర్ మృతదేహాలు ఈరోజు హైదరాబాద్ రానున్నాయి. -
దుఃఖాన్ని దిగమింగి..
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన జిల్లాకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి ఆచూకీ నాలుగు రోజులు గడిచినా లభించలేదు. దీంతో ఆయన తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి నిరాశతో స్వగ్రామానికి పయనమయ్యారు. బోధన్ : నాలుగు రోజుల నిరీక్షణ ఫలించలేదు. బియాస్ నదిలో గల్లంతైన కుమారుడి ఆచూకీ లభించలేదు. నిరాశతో ఆ తండ్రి సంఘటన స్థలంనుంచి వెనుదిరిగారు. పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని స్వగ్రామానికి పయనమయ్యారు. హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి తోటి విద్యార్థులతో ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. విష్ణు బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతానికి చెందినవారు. కుమారుడి ఆచూకీ కోసం తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడే ఉండి ఆచూకీ లభిస్తుందేమోనని వేచి చూశారు. వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీనివాస్‌రెడ్డి, ఆయన స్నేహితుడు రాజశేఖర్ మాత్రం అక్కడే ఉన్నారు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి, సోదరి బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతంలోని స్వగృహంలో ఉన్న విష్ణు తల్లి రమాదేవి, సోదరి అనుష, అమ్మమ్మ కోటమ్మ, నానమ్మ ఆదిలక్ష్మి, ఇతర బంధువులు అతడి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నారు. వివరాలు తెలియకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంధువులు, స్నేహితులు వారిని ఓదారుస్తున్నారు. -
చివరిచూపు దక్కేనా..
రుద్రవరం : కుటుంబ భారంమోస్తూ అన్ని విధాలుగా అండగా ఉండే తమ కుమారుడు ప్రహ్లాదుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై చివరి చూపుకు కూడా నోచుకోలేక పోతున్నామని ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ, అక్కా చెల్లెళ్లు నాగలక్ష్మి,లక్ష్మిదేవిలు కన్నీరుమున్నీరు అయ్యారు. దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం గ్రామంలోని బాధితుడికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించింది. ఈ సందర్భంగా వారు తమ బాధ్యను వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న టూర్ ప్లాన్‌లో మామ మురళిని కలిశాడు. విద్యార్థులు తక్కువగా హాజరు కావడంతో తోడుగా ఉంటాడని మామ తనను తీసుకెళ్లాడన్న విషయం ప్రహ్లాదుడు ఈ నెల ఒకటో తేదీ ఢిల్లీ నుంచి ఫోన్లో తమకు సమాచారం అందించాడని కుటుంబసభ్యులు తెలిపాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది సమీపంలో రోడ్డుపై బస్సు వద్ద మామ మురళితో ప్రహ్లాదుడు ఉండగా విద్యార్థులు నదిలో ఆడుకుంటూ, ఫొటోలు దిగుతున్నారని నదిలో నీటి ప్రవాహం పెరగడంతో సమాచారం తెలియజేసేందుకు వెళ్లి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుక పోయి గల్లంతు అయ్యాడని తల్లిదండ్రులు వివరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: భూమా అఖిల ప్రియ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నాన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పమన్నాడని తెలిపింది. బాధితుడి బంధువులు, గ్రామస్తులతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ రుద్రవరం మండల ఇన్చార్జి పత్తి సత్యనారాయణ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రహ్లాదుడు గల్లంతైన విషయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి నాన్న భూమా నాగిరెడ్డి తీసుకెళ్లాడన్నారు. భాదితుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం సరిపోదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వత్తిడి పెంచి సాయం పెంచేలా కృషి చేస్తాడని చెప్పింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రూ.1.50 లక్షల తక్షణ ఆర్థికసాయం ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన రూ.5లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించే ఆర్థికసాయం భాదిత కుటుంబానికి అందేటట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీవీ రామిరెడ్డి, బంగారు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ వెళ్లిపోయావా...
పాల్వంచ: ఐదురోజులుగా కొడుకు ఆచూకీ కోసం నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్న ఆ తల్లికి దుర్వార్త చేరనే చేరింది. చదువుకోడానికని ఎంతో ఆనందంగా వెళ్లిన బిడ్డ శవమై వస్తున్నాడని తెలిసి కుప్పకూలిపోయింది. నవ్వుతూ తుళ్లుతూ తనతోపాటు తిరిగిన అన్న ఇక లేడని తెలిసిన ఆతమ్ముడు రోదిస్తున్న తీరు అంతాఇంతా కాదు. చిన్నప్పటి నుంచి గారాలుపోయిన మనవడు ఇక తనకు కనపడడని తెలిసిన నానమ్మ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీప్రమాదంలో గల్లంతయిన పాల్వంచ విద్యార్థి తల్లాడ ఉపేందర్ ఇంటివద్ద గురువారం పరిస్థితి ఇది. ఉపేందర్ నదిలో గల్లంతయ్యాడని తెలిసిన వెంటనే తండ్రి శ్రీనివాస్ సంఘటనాస్థలానికి వెళ్లి అక్కడే ఉన్నారు. పాల్వంచ గట్టాయిగూడెంలోని ఇంటివద్ద తల్లి శ్రీదేవి, నాన మ్మ సువర్ణ, తమ్ముడు మహేష్ ఉన్నారు. ఐదురోజులుగా వారు టీవీకే అతుక్కుపోయారు. ఏ క్షణానయిన ఉపేందర్ ఆచూకీ తెలుస్తుందని ఎదురుచూస్తున్నారు. ఓ వృుతదేహం లభ్యమయిందని, అది ఉపేందర్‌దేనని గురువారం వార్తలు రావడంతో వారిలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇంకా ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న ఆశ నీరుగారిపోవడంతో వారు రోదిస్తున్న తీరు స్థానికుల కంట తడిపెట్టించింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడనుకున్నామని, కానీ ఇలా అర్ధంతరంగా వదిలివెళ్లిపోతాడనుకోలేదని వారు విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. కాగా, వరద ఉధృతిలో డ్యాం నుంచి చాలా దూరం వరకు కొట్టుకుపోయి బండరాళ్ల కింద మట్టిలో కూరుకు పోయిన ఉపేందర్ వృుతదేహాన్ని గజ ఈతగాళ్లు కనిపెట్టారు. కంటిమీద కునుకు లేకుండా అక్కడే ఎదురు చేస్తున్న తండ్రి శ్రీనివాస్ కుమారుని వృుతదేహాన్ని గుర్తించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. లార్జీ డ్యాంకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో నీటి అడుగుభాగాన ఉన్న వృుతదేహాన్ని వెలికి తీశారని విలపిస్తూ చెప్పారు. సాయంత్రం 6 గంటలకు మండి నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గాన బయలు దేరామని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వస్తామని, హైదరాబాద్ నుంచి పాల్వంచకు రోడ్డు మార్గాన వస్తామని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి గాని శనివారం ఉదయానికి గాని చేరుకునే అవకాశం ఉందని అన్నారు. -
మరో 2 మృతదేహాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్ దుర్ఘటనకు బలైన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో మరో ఇద్దరి మృతదేహాలు గురువారం లభించాయి. మృతులను ఖమ్మం జిల్లాకు చెందిన తల్లాడ ఉపేందర్, హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన గూమూరు అరవింద్ కుమార్‌గా ఘటనా స్థలి వద్ద ఉన్న వారి కుటుంబీకులు గుర్తించారు. మృతదేహాలు బియాస్ నదిలో లార్జి డ్యామ్‌కు దిగువన ప్రమాద స్థలికి కిలోమీటర్ దూరంలోనే లభించాయి. బండరాళ్ల కింద బురదలో కూరుకుపోవడంతో వాటిని వెలికితీయడం చాలా కష్టమైందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, గ్రేహౌండ్స్ ఎస్పీ కార్తికేయ ‘సాక్షి’కి తెలిపారు. మృతదేహాలను ఢిల్లీ తరలించామని, వారి కుటుంబసభ్యులతో పాటు శుక్రవారం మధ్యాహ్నానికల్లా విమానంలో హైదరాబాద్ పంపుతామని వివరించారు. హైదరాబాద్‌కు చెందిన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల విహార యాత్ర గత ఆదివారం సాయంత్రం పెను విషాదంగా మారడం, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో లార్జి డ్యామ్ నుంచి చెప్పాపెట్టకుండా నీటిని విడుదల చేయడంతో... దిగువన ఫొటోలు తీసుకుంటున్న 24 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ నదిలో కొట్టుకుపోవడం తెలిసిందే. ఇప్పటిదాకా ఎనిమిది మంది మృతదేహాలు లభించగా మరో 17 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. వారికోసం వందలాది మంది నేవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు అధునాతన పద్ధతుల్లో గాలిస్తున్నారు. గురువారం 15 మంది నేవీ డైవర్లు వారికి తోడయ్యారు. వాతావరణం కూడా కాస్త తెరిపినివ్వడంతో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గురువారం దొరికిన రెండు మృతదేహాలూ ప్రమాద స్థలికి అతి సమీపంలోనే బండరాళ్ల కింద చిక్కుకున్న నేపథ్యంలో మిగతా వారి కోసం కూడా అక్కడే గాలిస్తున్నారు. ఎంత లోతు నీటిలోనైనా వస్తువులను కనిపెట్టగలిగే అత్యంత శక్తిమంతమైన కెమెరాలను ఉపయోగిస్తున్నారు. బురదలో కూరుకుపోయిన వస్తువుల జాడను కూడా ఇవి పసిగట్టగలవు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. బండరాళ్లు, విపరీతమైన బురద కారణంగా గల్లంతైన వారి ఆచూకీ తీయడం కష్టతరంగా మారిందన్నారు. ‘‘నీళ్ల లోపల దూరం వరకు చూడటం అసాధ్యంగా మారింది. కేవలం చుట్టూ తడిమి, చేత్తో తాకి మాత్రమే శరీరాలను గుర్తించాల్సి వస్తోంది’’ అని చెప్పారు. మానవరహిత విమానాన్ని కూడా రంగంలోకి దించామన్నారు. మరోవైపు విద్యార్థులను వెదికేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ఈత నిపుణుల బృందం శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లనుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. కన్నపేగు కన్నీరుమున్నీరు పాల్వంచ: బియాస్ నదిలో గల్లంతైన ఖమ్మం జిల్లా పాల్వంచ గట్టాయిగూడానికి చెందిన తల్లాడ ఉపేందర్ చివరికి విగతజీవిగా కన్పించడంతో అతని తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. గురువారం గాలింపులో దొరికిన రెండు మృతదేహాల్లో ఒకటి ఉపేందర్‌దేనని టీవీల్లో వచ్చిన వార్తలు చూసి అతని తల్లి శ్రీదేవి, నాన మ్మ సువర్ణ, త మ్ముడు మహేశ్ కుప్పకూలి గుండెలవిసేలా రోదించారు. కుమారుని ఆచూకీ కోసం రెండు రోజులుగా ఘటనాస్థలి వద్దే పడిగాపులు పడుతున్న తండ్రి శ్రీనివాస్‌ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ‘పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడనుకున్నాం. విహార యాత్రకని వెళ్లి కానరాని లోకాలకు చేరుకున్నాడు’ అంటూ కంటతడి పెట్టారు. కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తమవంటి వారెందరికో కడుపు కోత మిగిలిందంటూ ఆక్రోశించారు. -
అరవింద్ ఇకలేడు..సందీప్ జాడ లేదు!
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన శంషాబాద్ వాసి అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారన్న వార్త విని అతడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అరవింద్‌కు ఈత వచ్చని, ఎలాగైనా బయటపడి ఉంటాడని భావించిన అతడి స్నేహితులకు నిరాశే మిగిలింది. ఇక అదే వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన గౌడవెల్లి వాసి సందీప్ జాడ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా బతికి వస్తాడంటూ ఆశతో ఉన్నారు. శంషాబాద్: ‘ఆయువు తీరిందారా.. పండు.. క్షేమంగా తిరిగి వస్తావనుకున్నం బిడ్డా, మంచిగ సదువుకునేటోడివి.. నీ మీదే గంపెడాశలు పెట్టుకున్నం.. నువ్వేమో తనువు చాలించినవ్..’ అంటూ బియాస్ నదిలో కొట్టుకుపోయి కానరానిలోకాలకు తరలివెళ్లిన విద్యార్థి అరవింద్ తాత, నాయనమ్మలు కన్నీంటి పర్యంతమవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన అరవింద్ మృతదేహాన్ని గురువారం రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. టీవీల్లో ఈ వార్త చూసిన అరవింద్ తాత, నాయనమ్మ ఈశ్వరప్ప, భద్రమ్మలతోపాటు శంషాబాద్‌లోని అతడి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అరవింద్ శంషాబాద్ పట్టణ వాసులైన వినోద్, శశిలత దంపతుల మొదటి కుమారుడు. ఒకటో తరగతి నుంచి పది వరకు శంషాబాద్‌లోని బాలయేసు (సెయింట్ ఇన్ఫాంట్ జీసస్) పాఠశాలలో చదివాడు. అనంతరం శశిలత పిల్లల చదువు కోసం వనస్థలిపురంలోని పుట్టింటికి వెళ్లింది. వినోద్ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అరవింద్ చురుకైన విద్యార్థిఅని అతడితో చదువులో ఎవరూ పోటీపడలేకపోయారని అతడి స్నేహితులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అరవింద్‌కు ఈత రావడంతో బతుకుతాడని ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. నా మనవడిని నెలరోజుల కిందజూసిన.. నా మనవడు అరవింద్ నెలరోజుల కింద శంషాబాద్‌కు వచ్చిండు. మమ్మల్ని పలకరించి పోయిండు. నదిలో కొట్టుకుపోయిండని తెలిసినప్పటి నుంచి వాడు బతికే వస్తడని అనుకున్నం. వాడు మంచిగ తిరిగిరావాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్న. నా పండుకు అప్పుడే ఆయువు తీరిందా.. అయ్యో.. దేవుడా ఎంతపని చేస్తివి! - భద్రమ్మ, అరవింద్ నాయనమ్మ టూర్‌కు పోతనని చెప్పిండు.. ఈ నెల ఒకటో తేదీన నాకు ఫోన్‌చేసి టూర్‌కు పోతున్ననని చెప్పిండు. అరవింద్ నేను బాల్య స్నేహితులం. వాడు చదువులో ఎప్పుడు ఫస్టే, వాడికి ఈత కూడా వచ్చు. క్షేమంగా తిరిగి వస్తాడని అనుకున్నం. అరవింద్, నేను, హరిబాబు, అక్షయ్‌యాదవ్, రాజేష్, మణిసాయి, సందీప్, అజయ్ మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్. అరవింద్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నం. - నవీన్, అరవింద్ స్నేహితుడు ఐదు రోజులైనా జాడలేని సందీప్ ఆందోళనలో కుటుంబసభ్యులు మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం నీటి ప్రవాహానికి గల్లంతైన సందీప్ జాడ గురువారం వరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం స్వగ్రామం గౌడవెల్లిలో కుటుంబీకులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా సందీప్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం సందీప్ గల్లంతైన నాటి నుంచి తల్లిదండ్రులు వీరేష్, విజయలు నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నారు. కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నా కొడుకు జాడ కనిపెట్టండి.. ప్రభుత్వం ఎలాగైనా తన కొడుకు సందీప్ జాడ కనిపెట్టాలని తండ్రి వీరేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలాంటి బాధ పగవారికి కూడా రాకూడదన్నారు. సందీప్ ఆచూకీ కోసం కుటుంబం మొత్తం నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ బాధను అర్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. గర్భశోకం సాక్షి, హైదరాబాద్: అదే వేదన.. తీరని రోదనతో కన్నపేగులు తల్లడిల్లుతున్నాయి. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం నగరంలోని వారి తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. తమ వారి కోసం ఐదు రోజులుగా రోదిస్తూ.. కళ్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. నగరవాసులకు కన్నీళ్లు మిగిల్చిన లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గురువారం మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు బండరాళ్ల కింద లభ్యమయ్యాయి. నగరంలో వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటాయని పోలీసులు తెలిపారు. మరోపక్క సాబేర్ మృతదేహం గురువారం శేరిలింగంపల్లి గుల్మొహర్ కాలనీలోని నివాసానికి చేరగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. పుట్టినరోజుకూ కానరాని ఆచూకీ గల్లంతయిన విద్యార్థుల్లో దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన అఖిల్ కూడా ఉన్నాడు. గురువారం అఖిల్ పుట్టినరోజు కావడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం బంధువులు, స్థానికుల తరం కాలేదు. పుట్టినరోజుకు తమ బాబు క్షేమంగా తిరిగొస్తాడనుకున్న ఆశలు అడియాసలు కావడంతో కన్నవారు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. 8 మంది మృతదేహాలు లభ్యం గల్లంతయిన 24 మందిలో ఇప్పటివరకు 8 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీలకు చెందిన సుమారు 600 మంది సుశిక్షితులైన సిబ్బంది లార్జీ నుంచి మండో డ్యామ్ పరిసరాల్లో సుమారు 15 కిలోమీటర్ల మేర జల్లెడ పడుతున్నారు. భారీ వర్షాలు, మంచు ప్రభావంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని అక్కడే మకాం వేసిన నగర పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు. -
'వారి కుటుంబాలకు అండగా ఉంటాం'
-
ఏరియల్ వెహికల్ ద్వారా గాలింపు: మర్రి
మండి : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి గురువారమిక్కడ తెలిపారు. సహాయక చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ అయిదో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. జాతీయ సముద్ర పరిశోధనా సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని, సిబ్బంది వెళ్లలేని ప్రదేశాల్లో ఏరియల్ వెహికల్ గాలింపు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. శబ్ద తరంగాలతో నీటిలో ఉన్న మృతదేహాలను కనిపెడుతుందని మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల మృతదేహాల కోసం ఇంకా సమయం పడుతోందని ఆయన అన్నారు. కాగా ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. గల్లంతు అయిన మరో 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
అరవింద్ మృతదేహం లభ్యం
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లో గల్లంతైన హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అరవింద్ కుమార్ మృతదేహం లభ్యమైంది. సహాయక సిబ్బంది గురువారం ఉదయం మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. అరవింద్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారుడి మరణవార్తతో అతని తల్లి శశిలత రోదన వర్ణనాతీతంగా ఉంది. తన కుమారుడు ఇంకా సజీవంగా తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న ఆమెకు అరవింద్ మృతదేహం లభ్యం కావటంతో కోలుకోలేని విషాదంలో మునిగిపోయారు. అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్న విషయం తెలిసిందే. అతని మృతదేహం లభ్యం కావటంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు గల్లంతు అయిన 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. -
ఆ మృతదేహం ఉపేందర్దే....
పాల్వంచ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయిన విద్యార్థి తల్లాడ ఉపేందర్ మృతదేహాన్ని వెలికి తీశారు. గాలింపు చర్యల్లో భాగంగా సిబ్బంది గురువారం రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఉపేందర్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులు గుర్తించారు. విహార యాత్రకు వెళ్లిన కుమారుడు చివరికి విగత జీవిగా మారటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా విలపించారు. కాగా ఉపేందర్ తండ్రి తల్లాడ శ్రీనివాస్ స్థానికంగా కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. చిన్నకొడుకు మహేష్ వరంగల్‌లో చదువుతుండగా పెద్ద కొడుకు ఉపేందర్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈలో ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానిక కృష్ణగౌతమి పాఠశాలలో చదివిన ఉపేందర్.... తోటి విద్యార్థులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు చదువులో ప్రతిభ కనబరుస్తు ఉండేవాడని ఆ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ తెలిపారు. ఉపేందర్ హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ వద్ద గల జెఎన్టియు కళాశాలలో డిప్లొమో చదివాడని, ఈసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలలో సీటు లభించిందని పిన్ని పద్మ తెలిపింది. ఇలా చదువులో మొదటి నుంచి ప్రతిభ కనబరుస్తున్న ఉపేందర్ ప్రమాదబారిన పడడంతో అతను చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్లో, తోటి స్నేహితుల్లోనూ విషాదం అలముకుంది.