హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. ఆదివారం ఉదయం మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 17 మృతదేహాలను బయటకు తీశారు. మరో ఏడుగురి ఆచూకీ గుర్తించాల్సివుంది.
ఆదివారం దొరికిన మృతదేహాల్లో వరంగల్ జిల్లాకు చెందిన పరమేశ్వర్, హైదరాబాద్ నల్లకుంటకు చెందిన రుత్విక్‌లుగా గుర్తించారు. మరో రెండు మృతదేహాలను గుర్చించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో గల్లంతయిన సంగతి తెలిసిందే.
ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారు.
దాసరి శ్రీనిధి, కాసర్ల రిషిత రెడ్డి, రిథిమ పాపాని, కల్లూరి శ్రీహర్ష, సందీప్ బస్వరాజ్, జగదీష్ ముదిరాజ్, అఖిల్-మిట్టపల్లి, ఎం.విష్ణువర్ధన్, కిరణ్ కుమార్
దొరికిన మృతదేహాలు :
1. గంపల ఐశ్యర్య
2. ఆకుల విజేత
3 భానోతు రాంబాబు
4.లక్ష్మీగాయత్రి
5. దేవాశిష్ బోస్
6. షాబేర్ హుస్సేన్
7. టి.ఉపేందర్
8.అరవింద్ కుమార్
9.పి.వెంకట దుర్గ తరుణ్
10.అశీష్ ముంతా,
11.మాచర్ల అఖిల్
12.శివప్రకాశ్ వర్మ
13.మహెన్ సాయిరాజ్
14.పరమేష్
15. రినేని రిత్విక్