హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంత అయిన విద్యార్థుల గాలింపు కోసం లార్జీ డ్యాం నీటి విడుదలను పూర్తిగా నిలిపి వేయనున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి మూడు గంటలపాటు నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
నదిలోని నీటి పారుదలను పూర్తిగా నిలిపివేసి విద్యార్థుల గాలింపుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. కాగా గల్లంతు అయిన విద్యార్థుల గాలింపు కోసం 600 మంది సహాయక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకూ 8 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.