హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనపై స్పందించిన ప్రభాస్!
హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంపై సినీ నటుడు ప్రభాస్ స్పందించారు.
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంపై సినీ నటుడు ప్రభాస్ స్పందించారు. విద్యార్ధులు ప్రమాదానికి గురయ్యారనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ప్రభాస్ పోస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభాస్ సంతాపం తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టింది. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ అప్పటివరకు ఉల్లాసంగా ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది.