Himachal Pradesh Tragedy
-
దైవ రహస్యం
-
బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో మరొకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. బియాస్ నదిలోని పాండో రిజర్వాయర్‌లో మృతదేహన్ని ఎన్డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అయితే లభ్యమైన మృతదేహం శివప్రసాద్ వర్మ మృతదేహంగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహన్ని హైదరాబాద్‌కు తరలించనున్నట్టు సమాచారం. -
మరో మృతదేహం లభ్యం
బియాస్ నదిలో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో మరొకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. బియాస్ నదిలోని పండో డ్యాం బ్యాక్ వాటర్‌లో తేలిన ఆ మృతదేహం పి.వెంకట దుర్గా తరుణ్‌గా గుర్తించారు. అక్కడే దొరికిన మరో మృతదేహం స్థానికుడిదిగా తేలింది. అదేప్రాంతంలో మూడో మృతదేహం కనిపించింది. అయితే గజ ఈతగాళ్లు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలు దొరికాయని, మిగతా 15 మృతదేహాలకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. బియాస్ నది వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి బుధవారం అక్కడినుంచే ‘సాక్షి’తో మాట్లాడుతూ 11వ రోజు గాలింపు వివరాలు తెలిపారు. ఆయన చెప్పిన మేరకు... ఉదయం ఆరు గంటల నుంచి దాదాపు 200 బోట్లతో 600 మంది ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్తోపాటు తెలంగాణకు చెందిన పోలీసు గజ ఈతగాళ్లు విస్తారంగా గాలింపు చర్యలను చేపట్టారు. పండో డ్యాం బ్యాక్ వాటర్‌లో రెండు మృతదేహాలు తేలడాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నారు. మరో మృతదేహాన్ని అందుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్వాధీనం చేసుకున్న రెండు మృతదేహాలను ఒడ్డుకు తీసుకురాగా అందులో ఒకటి గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి వెంకట దుర్గా తరుణ్‌గా అక్కడున్న కాలేజీ ఫ్యాకల్టీ గుర్తించారు. మరో మృతదేహం స్థానికుడిదిగా మండి పోలీసులు తేల్చారు. దీంతో పోస్టుమార్టం పూర్తయ్యాక తరుణ్ మృతదేహాన్ని రోడ్డుమార్గం ద్వారా ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తరలించారు. అక్కడినుంచి గురువారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. చివరి మృతదేహం దొరికేంతవరకు తాను, రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ సెక్రటరీ లవ్ అగర్వాల్, అదనపు డీజీ రాజీవ్ త్రివేది, గ్రేహౌండ్స్ ఎస్పీ కార్తికేయ, ఇతర పోలీసులు ఇక్కడే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. కుప్పకూలిన తరుణ్ తల్లిదండ్రులు బియాస్ ఘటనలో తమ కుమారుడు వెంకటదుర్గ తరుణ్ మృతిచెందాడని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుంటూరు జిల్లా పిడపర్తిపాలెంకు చెందిన తరుణ్ తల్లిదండ్రులు సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు చందానగర్‌లోని టెల్కట్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. తరుణ్ రెండవ కుమారుడు. కాగా, సీఎం కేసీఆర్‌ను డీజీపీ అనురాగ్ శర్మ బుధవారం కలిసి బియాస్ నదిలో గాలింపు చర్యలపై వివరాలను వెల్లడించారు. -
మరో రెండు మృతదేహాలు లభ్యం
-
బియాస్లో మరో రెండు మృతదేహాలు లభ్యం
మండి : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల్లో బుధవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటన జరిగి 11 రోజుల తర్వాత పండో రిజర్వాయర్ దగ్గర ఈ మృతదేహాలు బయటపడ్డాయి. గత రాత్రి నుంచి పండో రిజర్వాయర్ వద్ద భారీ వర్షం పడటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బయటపడిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు ఎవరిదన్నది గుర్తించాల్సి ఉంది. కాగా ఇప్పటివరకూ పది మృతదేహాలు లభ్యం అయ్యాయి. విహార యాత్రకు వెళ్లిన వీఎన్నార్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను హిమాచల్ ప్రదేశ్ అధికారులు హైదరాబాద్ పంపనున్నారు. -
ఎక్కడైనా డ్యాం గేట్లు ఎలా తీస్తారు?
-
హైదరాబాద్ చేరుకున్న నాయిని!
హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. జూన్ 8 తేదిన హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో వీఎన్ఆర్ ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన ఘటనలో సహాయ సహాకార కార్యక్రమంలో పాల్గొనేందుకు నాయిని హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన విషాదంలో గల్లంతైన, మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు గత వారం రోజులుగా నాయిని హిమాచల్ ప్రదేశ్ లో ఉండి కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ చేరుకున్న నాయని మీడియాతో మాట్లాడుతూ.. హిమాచల్ ప్రభుత్వం సహయం అందించింది. మరో 10 రోజులు గాలింపు చర్యలు చేపడతాం అని అన్నారు. -
బియాస్ కన్నీరు !
-
'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
-
'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
హిమాచల్ : వీఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం తీరును తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తప్పుపట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో ప్రమాదానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్ధుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే కార్యక్రమాన్ని మండిలో నాయిని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. హిమాచల్ లోని ఘటనాస్థలానికి విద్యార్థుల తల్లిదండ్రులను పంపేందుకు విమానం ఎందుకు ఏర్పాటు చేయలేదని కాలేజీ యాజమాన్యాన్ని నాయిని ప్రశ్నించారు. అయితే నాయిని ప్రశ్నకు కాలేజీ యాజమాన్యం పొంతనలేని వివరణ ఇచ్చింది. కాలేజి యాజమాన్యం వివరణపై నాయిని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా నాయిని అక్కడే ఉండి సహాయ సహకార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. గతవారం విజ్ఞాన యాత్రకు వెళ్లిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. -
హిమాచల్ విషాదాన్ని ముందే ఊహించారా..?
-
గ్రహం.. ఆగ్రహం..
-
రేపట్నుంచి గాలింపు చర్యలు ముమ్మరం: రాజీవ్ త్రివేది
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధుల వెలికితీతకు శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది స్పష్టం చేశారు. 3 కి.మీ వరకు అణువణువూ గాలిస్తామన్నారు. గాలింపు కోసం ప్రాజెక్ట్‌లో నీరు ఆపేసిన వెంటనే రంగంలోకి దిగుతామని ఆయన తెలిపారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం, బండరాళ్లు ఉండటంతో గాలింపు కష్టంగా ఉందని రాజీవ్ త్రివేది మీడియాకు వివరణ ఇచ్చారు. గతంలో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల స్వయంగా రంగంలోకి దిగానని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా?
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది. ఉగాది పండగ పంచాంగ శ్రవణంలో విద్యార్ధులకు జల ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్కుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే బియాస్ నదిలో విద్యార్ధుల గల్లంతు కావడంతో జోస్యంపై కొంత నమ్మకం కలిగినప్పటికీ.. మూఢాచారాలను, జ్యోతిష్కులను నమ్మవద్దని జనవిజ్క్షాన వేదిక ప్రజలను హెచ్చరిస్తోంది. -
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా:
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది. ఉగాది పండగ పంచాంగ శ్రవణంలో విద్యార్ధులకు జల ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్కుడు మునుగు రామలింగేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే బియాస్ నదిలో విద్యార్ధుల గల్లంతు కావడంతో జోస్యంపై కొంత నమ్మకం కలిగినప్పటికి.. మూఢాచారాలను, జ్యోతిష్కులను నమ్మవద్దని జనవిజ్క్షాన వేదిక ప్రజలను హెచ్చరిస్తోంది. -
విషాదానికి ముందు దాకా ఇలా..
-
వీఎన్ఆర్ విద్యార్ధుల చివరి భోజనం వీడియో లభ్యం
మండి: వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లైంతైన విషాదానికి ముందు ఓ హోటల్ భోజనం చేసిన వీడియో మీడియాకు చేరింది. వీఎన్ఆర్ కాలేజీ విద్యార్థులు ఘటనాస్థలం తలోట్కు10 కి.మీ ముందు ఆశాదీప్ హోటల్లో భోజనం చేశారు. విద్యార్ధులందరూ ఆనందంతో కలిసి చేసిన ఆఖరి భోజనం సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆఖరి భోజనం సమయంలో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. ఆతర్వాత విద్యార్ధులందరూ బియాస్ నదిలో ఉత్సాహంతో ఫోటోలు దిగుతుండగా వరదలు ఆకస్మిక వారి జీవితాలను కబలించాయి. ద్యార్ధుల చివరి భోజనం వీడియో అందర్ని హృదయాలను కలిచివేసింది. -
వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యానికి పూర్వ విద్యార్ధుల బాసట
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు ఘటనపై యాజమాన్యానికి విఎన్ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు బాసటగా నిలిచారు. బియాస్ నదిలో ప్రమాదానికి, యాజమాన్యం ఎలాంటి సంబంధం లేదని విద్యార్ధులు తెలిపారు. ఈ దుర్ఘటనలో కాలేజి యాజమాన్య తప్పిదంలేదని పూర్వ విద్యార్ధులు మీడియాకు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తామని పూర్వ విద్యార్ధులు ముందుకు వచ్చారు. మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని విఎన్ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు అన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాపై కాలేజి యాజమాన్యం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. -
పారామిలిటరీ బలగాల సహాయం కావాలి: నాయిని
మండి( హిమాచల్ ప్రదేశ్): హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన వీఎన్ఆర్ విజ్క్షాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను వెతికేందుకు పారామిలిటరీ బలగాల సహాయం అందించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కోరారు. సహాయ సహకార చర్యలపై రాజ్‌నాథ్‌తో నాయిని నర్సింహరెడ్డి ఫోన్ సంభాషించారు. విద్యార్థులను వెతికేందుకు పారామిలిటరీ బలగాలు దించాలని కోరిన నాయిని ప్రతిపాదనకు హోం మంత్రి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి తక్షణం చర్యలు తీసుకుంటానన్న రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. -
'హిమాచల్' మృతులకు ఏపీ కేబినెట్ సంతాపం!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం విశాఖలో జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో చనిపోయిన వీఎన్ఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. బెల్టు షాపుల రద్దు, రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. రుణమాఫీ సహా 5 సంతకాల అమలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వయోపరిమితి పెంపులో ఎదురయ్యే అభ్యంతరాలపై, సమస్యలపై కేబినెట్ సమావేశం చర్చించింది. గుంటూరు సమీపంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించారు. -
హిమాచల్ మృతులకు ఏపీ కెబినెట్ నివాళి
-
తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవు: టి.టీడీపీ
హైదరాబాద్: హిమాచల్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సరైన సహకారం అందించాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రమణ, తీగల కృష్ణారెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని.. పకడ్బందీగా చర్యలు తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజీవ్ శర్మకు సూచించారు. ఇప్పటికీ విద్యార్థుల ఆచూకీ తెలవక పోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొని ఉందని టీడీపీ నేతలు అన్నారు. -
అసలు ఆరోజు ఏం జరిగిందంటే..
-
మా ప్రాణాలు పోయినా బాగుండేది: వీఎన్ఆర్
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో విద్యార్థులవి కాకుండా మా ప్రాణాలు పోతే బాగుండేదని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని విఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన మమ్మల్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని యాజమాన్యం అన్నారు. ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. డ్యాం అధికారుల తప్పిదంవల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్ సీఎం ఒప్పుకున్నారని మీడియాకు యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థుల మృతదేహాలను ఇంటికి చేర్చే బాధ్యత మాదేనని, పవర్ హౌస్‌ను చూడటానికి వెళ్లిన మా విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని యాజమాన్యం తెలిపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సహయక చర్యలకు విఘాతం కలుగుతోందని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు. -
'హిమాచల్ ఘటనలో ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోదు'
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ దుర్గటనపై హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ దుమాల్ స్పందించారు. సాక్షి టెలివిజన్ రిపోర్టర్ తో మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనలో ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోదు అని దుమాల్ అన్నారు. 26 మంది విద్యార్ధుల ప్రాణాల్ని బలిగొన్న ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, హెచ్చరిక బోర్డులు, సైరన్ మోగించలేదని విద్యార్థులు అంటున్నారని దుమాల్ అన్నారు. విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులకు మృత్యువాత పడటం చాలా దురదృష్టకరమని దుమాల్ అన్నారు. -
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనపై స్పందించిన ప్రభాస్!
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంపై సినీ నటుడు ప్రభాస్ స్పందించారు. విద్యార్ధులు ప్రమాదానికి గురయ్యారనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ప్రభాస్ పోస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభాస్ సంతాపం తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టింది. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ అప్పటివరకు ఉల్లాసంగా ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. Very sad to hear about d tragedy.My prayers with all the families of HYDstudents,who lost their lives in Himachal- #Prabhas— Prabhas (@Prabhas_Team) June 9, 2014