'హిమాచల్ ఘటనలో ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోదు'
Published Mon, Jun 9 2014 5:08 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ దుర్గటనపై హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ దుమాల్ స్పందించారు. సాక్షి టెలివిజన్ రిపోర్టర్ తో మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనలో ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోదు అని దుమాల్ అన్నారు.
26 మంది విద్యార్ధుల ప్రాణాల్ని బలిగొన్న ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ యంత్రాంగంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, హెచ్చరిక బోర్డులు, సైరన్ మోగించలేదని విద్యార్థులు అంటున్నారని దుమాల్ అన్నారు. విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులకు మృత్యువాత పడటం చాలా దురదృష్టకరమని దుమాల్ అన్నారు.
Advertisement
Advertisement