Prem Kumar Dumal
-
హిమాచల్ సీఎం అభ్యర్థిపై బీజేపీకి తలనొప్పి!
సాక్షి, షిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలనే విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం విషయమై అక్కడికి వెళ్లిన పరిశీలన బృందానికి పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. బీజేపీ తరుపున సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పరిశీలకులుగా వచ్చిన నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ ఇతర నేతలు ప్రత్యేకంగా సమావేశం కాగా ఆ కమిటీ సమావేశ భవనం బయటే బీజేపీ సభ్యులు ప్రేమ్ కుమార్ దుమాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. 'ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని చేయాలే తప్ప ఎలాంటి లాబీయింగ్ జరగొద్దు' అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ దుమాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొత్తగా ఎవరిని పెట్టాలనే విషయంపై చర్చ జరుగుతోంది. మరోపక్క, కేంద్రమంద్రి జేపీ నడ్డా పేరును సీఎంగా ప్రకటిస్తారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. -
హిమాచల్ లో కాంగ్రెస్‌ను అదే దెబ్బతీసింది..
సాక్షి, సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపించి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను చేజిక్కించుకుంది. 68 స్ధానాలు కలిగిన హిమాచల్ ప్రదేశ్‌లో హాఫ్‌వే మార్క్‌ను దాటిన బీజేపీ 40 స్ధానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ కేవలం 22 స్ధానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇతరులు 5 చోట్ల విజయం సాధించనున్నారు. వీరభద్రసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చింది. హిమాచల్ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమల్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లింది. ధుమల్ బీజేపీ నేతృత్వంలో1998 నుంచి 2003 వరకూ, తిరిగి 2008 నుంచి 2012 వరకూ రెండు సార్లు హిమాచల్ సీఎంగా వ్యవహరించారు. సీఎం వీరభద్రసింగ్ అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటుడటంతో అవినీతి ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిని ప్రచార సభల్లో ఎండగట్టారు. పేదలకు ఉద్దేశించిన రూ 57,000 కోట్లను వీరభద్రసింగ్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణలు గుప్పించారు. -
ఆయన మోదీ స్నేహితుడే..!
షిమ్లా: ఇటీవలికాలంలో జరిగిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, అందుకు భిన్నంగా కమలదళం హిమాచల్ ప్రదేశ్‌లో వ్యూహాన్ని మార్చింది. 73 ఏళ్ల సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ ధుమాల్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దిగింది. బీజేపీ ఇలా వ్యూహాన్ని మార్చుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడేనని భావిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నేతృత్వంలో హిమాచల్ ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్.. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి జంకుతోందని విమర్శల వర్షం గుప్పించింది. ఎప్పటిలాగే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను నమ్ముకొని.. ఆయన అభివృద్ధి అజెండాతో హిమాచల్‌లో బీజేపీ పోటీ చేస్తున్నదని, కానీ, ఇక్కడ స్థానికంగా సమస్యలు, పరిస్థితులు వేరు అని కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రేమ్‌కుమార్ ధూమల్ పేరు తెరపైకి వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ప్రధాని మోదీ, సీఎం అభ్యర్థి ధూమల్ మంచి జాన్‌జిగ్రీ దోస్తులు. ప్రధాని మోదీ సాంకేతికంగా పార్టీకి బాస్ అయినప్పటికీ, ఆయనతో తన స్నేహం ఏమాత్రం చెక్కుచెదరలేదని, తమ మధ్య ఎంతోకాలంగా స్నేహబంధం ఉందని ధూమల్ గుర్తుచేసుకుంటున్నారు. మోదీతో దిగిన 20 ఏళ్ల కిందటి పాత ఫొటోలను మీడియాతో పంచుకున్న ఆయన.. తమ స్నేహబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా 1998, మార్చి 24న దిగిన ఫొటో గురించి ఆయన ఇలా వివరించారు. ‘ఇది ఎంతో గొప్ప సంవత్సరం. అప్పుడు మోదీ హిమాచల్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్గా ఉన్నారు. నేను సీఎం అభ్యర్థిగా పోటీ చేశాను. మా బృందం ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఇది మా ఇద్దరికీ కొత్త అనుభవం. మా బృందం నిజానికి అద్భుతాలు చేసింది. ఈ విజయం తర్వాతే గుజరాత్ సీఎంగా మోదీ తొలిసారి ఎన్నికయ్యారు’ అని ధూమల్ గుర్తుచేసుకున్నారు. గురువారం జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం మూడురోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్రమోదీ ఏడు ర్యాలీల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌పై ప్రధాని మోదీ చూపుతున్న మక్కువకు ఇది నిదర్శనమని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. 20 ఏళ్ల క్రితం మోదీ-ధూమల్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో.. -
హిమాచల్ ప్రదేశ్‌లో మొదలైన పోలింగ్
సాక్షి, సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తిరిగి విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా ఓటేసిన అనంతరం ఆయన ట్విటర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. హిమాచల్ ప్రజలు తమ పాలనపై సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందని ఆయన అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ కూడా పోలింగ్ మొదలైన తొలి గంటలోనే తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉండగా హిమాచల్ ఎన్నికల్లో ఈ దఫా తిరిగి అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రజలు అభివృద్ధి పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు.. ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, ఎలాగైనా పవర్లోకి రావాలనీ బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇరు పార్టీలు మొత్తం 68 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాయి. హిమాచల్ ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు. కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 68 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం 337 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోదఫా తమ భవిష్యత్‌ను పరీక్షించుకుంటున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. సీపీఎం 14, సీపీఐ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్నికల సంఘం 7,525 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50.25 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం అభ్యర్థుల్లో అందరి చూపు ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, బీజేపీ నేత పీకే ధుమాల్ మీదే ఉంది. ఎన్నికలు ముగిసిన 40 రోజుల తరువాత అంటే డిసెంబర్ 18న ఫలితాలు వెలువడతాయి. సీఎం వీరభద్ర సింగ్ అవినీతిపై బీజేపీ తీవ్ర ప్రచారం చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీపై ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు సభల్లో పాల్గొనగా, ప్రధాని నరేంద్ర మోదీ రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయిల్స్‌ను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఎన్నికల భధ్రత కోసం 17,850 మంది రాష్ట్ర పోలీసులను, 65 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 36 సీట్లు సాధించగా బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందింది. Confident of getting majority in the election, the next Government too will be of Congress: Virbhadra Singh #HimachalPradesh pic.twitter.com/eQhwLq50ld — ANI (@ANI) 9 November 2017 Hamirpur: BJP's chief ministerial candidate Prem Kumar Dhumal and BJP MP from Hamirpur Anurag Thakur cast their votes. #HimachalPradeshElections pic.twitter.com/pNxe6IzYu0 — ANI (@ANI) 9 November 2017 मैं समस्त हिमाचलवासियों से अपील करता हूँ कि देवभूमि हिमाचल के मान और प्रतिष्ठा को पुनः स्थापित कर प्रदेश का चहुंमुखी विकास करने वाली सरकार बनाने के लिए मतदान अवश्य करें। pic.twitter.com/bJURArTfkF — Amit Shah (@AmitShah) 9 November 2017 -
'హిమాచల్ ఘటనలో ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోదు'
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ దుర్గటనపై హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ దుమాల్ స్పందించారు. సాక్షి టెలివిజన్ రిపోర్టర్ తో మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనలో ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోదు అని దుమాల్ అన్నారు. 26 మంది విద్యార్ధుల ప్రాణాల్ని బలిగొన్న ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, హెచ్చరిక బోర్డులు, సైరన్ మోగించలేదని విద్యార్థులు అంటున్నారని దుమాల్ అన్నారు. విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులకు మృత్యువాత పడటం చాలా దురదృష్టకరమని దుమాల్ అన్నారు.