తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవు: టి.టీడీపీ
Published Wed, Jun 11 2014 9:02 PM | Last Updated on Sat, Aug 11 2018 4:50 PM
హైదరాబాద్: హిమాచల్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సరైన సహకారం అందించాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రమణ, తీగల కృష్ణారెడ్డి కలిశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని.. పకడ్బందీగా చర్యలు తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజీవ్ శర్మకు సూచించారు. ఇప్పటికీ విద్యార్థుల ఆచూకీ తెలవక పోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొని ఉందని టీడీపీ నేతలు అన్నారు.
Advertisement
Advertisement