TDP Telangana Committee
-
సొంత గూటికి 'ఎల్లో కాంగ్రెస్'! తన మనుషులు మళ్లీ టీడీపీలో చేరేలా బాబు ప్లాన్!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మహాకూటమి పేరుతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నిండా ముంచి.. ఆ తర్వాత ముందస్తు వ్యూహంతో అదే కాంగ్రెస్ పార్టీలోకి తన మనుషుల్ని పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి కాంగ్రెస్‌ను వంచించే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఆ రాష్ట్రంలోని అన్ని పక్షాలను తనతో కలుపుకొని ప్రయత్నించాలనే వ్యూహంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పావుగా వాడుకునేందుకు పక్కా స్కెచ్ వేశారని తెలుస్తోంది. బాబు వ్యూహం ప్రకారమే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన మనుషులు (టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారు) సమయానుకూలంగా సొంత గూటికి చేరుకుంటారనేది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అలా చేరిన నేతలతో కూడిన టీటీడీపీతో జత కడితే తమకు ప్రయోజనం కలుగుతుందనే భావన తెలంగాణ బీజేపీలో కలిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్‌కు సన్నాహకంగానే టీపీసీసీలో కమిటీల చిచ్చు రేగిన అనంతరం..కొందరు కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారని, ఆ తర్వాత వ్యవహారమంతా బాబు కనుసన్నల్లోనే నడుస్తోందని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ తలనొప్పి నుంచి ఆ పార్టీ అధిష్టానం బయటపడక ముందే ఖమ్మం వేదికగా ‘షో’ చేసి, పాతకాపులను రప్పించి, బీజేపీని బుట్టలో వేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి ప్రయత్నించాలనేది బాబు తాజా వ్యూహం అని ఆ వర్గాలు తేటతెల్లం చేస్తున్నాయి. నేను చెబుతా .. మీరు రెడీగా ఉండండి టీపీసీసీ కమిటీల ఏర్పాటు చిచ్చు రేగక ముందు నుంచే ఈ ఆలోచనలో ఉన్న బాబు.. తాజా పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణలో నిమగ్నమయ్యారు. మూడు రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని టీడీపీ పాతకాపులు కొందరికి ఆయనే స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ‘తెలంగాణలో మళ్లీ మనం క్రియాశీలమవుదాం.. బీజేపీతో కలిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పినప్పుడు మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండండి..’ అని చెబుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీని చీల్చడం ద్వారా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తానని, అందుకు ప్రతిఫలంగా ఏపీలో తనతో జట్టు కట్టాలనేది బీజేపీ ముందు ఆయన ఉంచిన క్విడ్‌ప్రోకో ప్రతిపాదనగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు బీజేపీని ఒప్పించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం. వైఎస్సార్సీపీ ఓడించలేమని తేలడంతో.. ప్రజాసంక్షేమ పాలనతో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారం నుంచి దింపేసి తాను మళ్లీ సీఎం సీటు ఎక్కాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేసినా, జనసేనతో జట్టు కట్టినా ప్రయోజనం లేదని, వైఎస్సార్సీపీని ఓడించలేమని ఆయన చేయించుకున్న సర్వేల్లోనే తేలడంతో, బీజేపీని కూడా కలుపుకొంటే ప్రయోజనం ఉండొచ్చనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీని బుట్టలో వేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఆయన కుతంత్రాలకు తెరతీశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో తన సామాజిక వర్గ ప్రభావం ఉన్న చోట్ల బలప్రదర్శన చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని కొందరిని తన పార్టీలో చేర్చుకుని, వారి రాకతో తెలంగాణలో టీడీపీ బలంగా ఉందనే భావన కలిగించి, అనంతరం బీజేపీతో జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. ఆ విధంగా తెలంగాణ ఎన్నికల్లో తమ ద్వారా ప్రయోజనం కలుగుతున్నందున, ఏపీలోనూ తమతో కలిసి వచ్చేలా బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించే వ్యూహాన్ని బాబు అమలు చేస్తున్నట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఇదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాత్ర ఏంటనేది అగమ్యగోచరంగా మారనుంది. పాత టీడీపీ నేతలను మళ్లీ సొంతగూటికి రమ్మంటూ చంద్రబాబు ఫోన్లు చేస్తున్న వ్యవహారం రేవంత్‌కు తెలిసే జరుగుతోందా? తెలియకుండా జరుగుతోందా? ఒకవేళ తెలిస్తే ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది? రేవంత్‌ను ఆటలో అరటిపండులాగా, కూరలో కరివేపాకు లాగా చంద్రబాబు వాడుకున్నట్టేనా? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీ నేతలకు బలప్రదర్శన బాధ్యతలు? తెలంగాణలో తనకు ఇంకా బలముందని ప్రచారం చేసుకునేందుకు ఖమ్మం వేదికగా బుధవారం చంద్రబాబు పెద్ద ‘షో’(బలప్రదర్శన)నే చేయబోతున్నారు. ఇందుకోసం బీజేపీలోని తన మనుషులను రంగంలోకి దించారు. ఇక్కడి బహిరంగ సభ ఏర్పాట్లను పేరుకు స్థానిక టీడీపీ నేతలు చేస్తున్నా, తెరవెనుక మాత్రం బీజేపీ ముసుగు వేసుకున్న బాబు మనుషులే నడిపిస్తున్నారు. తెలంగాణ టీడీపీలో కీలకంగా ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న అదే సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ.. ఈ ఇద్దరి సమన్వయంతో తన సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలిద్దరు (ఒకరు బీజేపీ, మరొకరు టీడీపీ) ఖమ్మం షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖమ్మం షో కోసం రాష్ట్రంలోని తన సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తల నుంచి కోట్ల రూపాయల చందాలు వసూలు చేశారనే చర్చ కూడా ఖమ్మం టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. బహిరంగ సభకు ముందు వేల సంఖ్యలో కార్లు, ఆటోలు, మోటార్‌బైక్‌లతో ర్యాలీ నిర్వహించడం ద్వారా, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టడం ద్వారా ఖమ్మంలో టీడీపీ గట్టి పట్టు ఉందని అంతా భావించేలా బాబు అండ్ కో అన్ని ప్రయత్నాలూ చేస్తుండడం గమనార్హం. చదవండి: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్... మరో చార్జిషీట్లోనూ ఎమ్మెల్సీ కవిత -
విశ్లేషణలన్నీ ఊహాత్మకం.. ఫలితాలు వాస్తవికం
సాక్షి, అమరావతి: ఇప్పుడు చేసే విశ్లేషణలన్నీ ఊహాత్మకమని, రాబోయే ఎన్నికల ఫలితాలు వాస్తవికమని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పారు. ఎవరు బాగా పనిచేశారు.. ఎవరు బాగా పనిచేయలేదు.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారనే సమాచారంతో సమగ్ర నివేదికలు పంపాలని వారికి సూచించారు. టీడీపీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రలు, ఇతర పార్టీ బాధ్యులతో గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బూత్, ఏరియా, నియోజకవర్గం వారీగా మూడు దశలుగా నివేదికలు పంపాలని, ఓటింగ్ పెరగడానికి దారితీసిన అంశాలు వివరించాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాల్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు, సర్వేలు ఎప్పటికప్పుడు ప్రతి దశలోనూ ఉపయోగపడ్డాయన్నారు. సీబీఎన్ ఆర్మీ బాగా పనిచేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది ఆర్మీగా పనిచేశారని తెలిపారు. తన జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇంత పోరాటాన్ని ఎదుర్కోలేదన్నారు. అక్కడక్కడా కొందరు నాయకులు డ్రామాలాడారని, ఒకరిని మరొకరు విమర్శించుకోవడం సరికాదన్నారు. కష్టాలు తెలుగుదేశం పార్టీకి కొత్తకాదని, మోదీ దుర్మార్గాల మధ్య ఈ ఎన్నిక ప్రజల సహనానికి పరీక్షని, ఎన్నికల్లో ధన ప్రవాహానికి మొదటి ముద్దాయి మోదీయేనని చెప్పారు. ప్రతి ఎన్నికలో 80 శాతం ఓటింగ్ టీడీపీకే రావాలని, కులాల వారీగా రాష్ట్రంలో ఓటింగ్ చీలకూడదని, ఈ ఎన్నికల్లో ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలలో టీడీపీకే ఆదరణ ఉందని, ఇంకా యువతరాన్ని టీడీపీ వైపు మరింతగా ఆకట్టుకోవాల్సి ఉందన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉంటామని.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1 నుంచి లోక్‌సభ స్థానాల సమీక్ష మే ఒకటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకూ 17(సి) నివేదికలు 19 వేలు వచ్చాయని, మిగిలిన నివేదికలను కూడా వెంటనే పంపించాలని చెప్పారు. 17(సి) ఈవీఎంతో పాటు ఉంటుందని, 17(ఏ) రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ఉంటుందని, కౌంటింగ్ పూర్తయ్యేవరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని, పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఓట్లలో తేడాలున్నాయని, పోలైన ఓట్లలో పార్లమెంటుకు, అసెంబ్లీకి తేడాలున్నాయని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కౌంటింగ్‌పై అవగాహన ఉండాలన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక పర్యటనల ద్వారా అక్కడి పార్టీలు, ప్రజలను చైతన్య పరిచానని, ఈవీఎంలపై అవగాహన పెంచామని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచేలా చైతన్యపరిచామన్నారు. త్వరలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ పర్యటిస్తానని తెలిపారు. -
ఎన్నికల ప్రచారం.. షురూ !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రం ప్రభుత్వం దాదాపు 9 నెలల ముందుగానే రద్దు కావడం.. ఆ వెనువెంటనే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఆయా ప్రతిపక్ష పార్టీల తరఫున ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయకున్నా.. అపుడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రచారం పోటా పోటీగా మొదలైంది. టీఆర్ఎస్ కోదాడ, హుజూర్‌నగర్‌లో తప్ప మిగిలిన పది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, ఇతర పార్టీలన్నీ ఇంకా పొత్తులపై ఎటూ నిర్ణయించుకోలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. చివరకు కాంగ్రెస్ సైతం అభ్యర్థుల విషయంలో ఉలుకూ పలుకూ లేకుండానే ఉంది. మరోవైపు సీపీఐ, టీడీపీ, బీజేపీ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీలు తాము పోటీ చేయబోయే స్థానాలపై కానీ, అభ్యర్థుల విషయంగా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు రోజుల కిందటే ప్రచారం మొదలుపెట్టారు. కొన్నింటిని మినహాయిస్తే, మెజారీటీ నియోజకవర్గాల్లో ప్రచారం షురూ అయ్యింది. దేవాలయాల్లో పూజలతో ప్రచారానికి శ్రీకారం టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కానీ కోదాడ, హుజూర్‌నగర్‌లో ఎలాంటి కదలికా లేదు. అసమ్మతి గళాలు ఎక్కువగా వినిపిస్తున్న మిర్యాలగూడలోనూ చడీ చప్పుడు లేదు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య ఇప్పటికే పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టారు. దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్ధి రమవాత్ రవ్రీందకుమార్ శుక్రవారమే చింతపల్లి సాయిబాబా దేవాయలంలో పూజలు చేసి బైక్ ర్యాలీతో ప్రచారంలోకి దిగారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో మునిగిపోయాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం అంథోల్ మైసమ్మ గుడిలో అపద్దర్మ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పూజలు చేశారు. కాంగ్రెస్ తరఫున తానే బరిలోకి దిగుతున్నానని ప్రకటించిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెండు రోజులుగా ఆయా మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థులు పూజలతో ప్రచారంలోకి దిగారు. తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ శనివారం అర్వపల్లి దేవాలయంలో పూజలు చేసి రెండు మండలాల్లో ప్రచారం చేశారు. అపద్దర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శనివారం జిల్లా సరిహద్దులోని అంథోల్ మైసమ్మ గుడిలో పూజలు చేశాక, సూర్యాపేట చేరుకుని ప్రచార ఢంకా మోగించారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్రచారంలో దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం రెండు రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా టికెట్ ప్రకటించకున్నా, పార్టీ ఇన్చార్జిగా ఉన్న చిరుమర్తి లింగయ్య సైతం శుక్రవారమే ప్రచారంలోకి దిగారు. నల్లగొండ నియోజకర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారమే దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి కనగల్ మండలంలోప్రచారం మొదలు పెట్టారు. శనివారం తిప్పర్తి మండలంలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి శనివారం హైదరాబాద్ రోడ్‌లోని మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. పార్టీలో ఉన్న సీనియర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఆయన ప్రచార రథం జిల్లా కేంద్రంలో వీధుల్లో ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రచార రథం సైతం నల్లగొండలో రోడ్లపైకి ఎక్కింది. మంచి రోజులు, ముహూర్త బలం, సెంటిమెంటు ఉన్న దేవాలయాలు చూసుకుని పూజలతో ప్రచారం మొదలు పెట్టారు. -
టీడీపీ నేతల టీటీ‘ఢీ’!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీలో టీటీడీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) సభ్యుని హోదా కోసం ఆ పార్టీ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజుల్లో పూర్తిస్థాయి బోర్డును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీటీడీపీ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు టీటీడీ సభ్యునిగా పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని, అయితే చివరి క్షణంలో కొందరు అడ్డుపడ్డారన్న చర్చ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నర్సారెడ్డి జంప్ కావడంతో.. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని టీటీడీ సభ్యులుగా అప్పట్లో నియమించారు. దీంతో టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రాతినిధ్యం రెండుగా ఖరారైంది. తాజాగా టీటీడీ పాలకమండలి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి సండ్ర వెంకటవీరయ్యకు మళ్లీ బెర్తు ఖరారనే చర్చ పార్టీలో జరుగుతోంది. వివాదాస్పదుడు కాకపోవడం, పార్టీ పక్షాన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయనకు మరో అవకాశం వస్తుందని అంటున్నారు. మరో సభ్యుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన స్థానంలో టీటీడీ ప్రాతినిధ్యం కోసం తెలంగాణ టీడీపీ నేతలు తీవ్రప ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధినేత ప్రసన్నం కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసుకుంటున్నారు. పెద్దిరెడ్డి, నర్సిరెడ్డి తీవ్ర యత్నాలు అరికెల నర్సారెడ్డి స్థానంలో తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర నేతలు పోటీ పడుతున్నారు. అందులో కరీంనగర్ జిల్లా నాయకుడు పెద్దిరెడ్డి, నల్లగొండ నేత నన్నూరి నర్సిరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసినట్టు సమాచారం. ముందుగా నర్సిరెడ్డి వెళ్లి చంద్రబాబును కలిసి మాట్లాడి ఓకే చెప్పించుకున్నారని, ఆ తర్వాత పెద్దిరెడ్డి వెళ్లి తనకు కావాల్సిందేనని పట్టుబట్టారనే చర్చ ట్రస్ట్ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మద్దతు ఉందని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా తనకు టీటీడీ ప్రాతినిధ్యం ఇవ్వాలని పెద్దిరెడ్డి అడుగుతున్నారు. ఇక నర్సిరెడ్డికి అవకాశం ఇవ్వాల్సిందేనని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు కోరుతున్నారు. అరవింద్‌తోపాటు మరొకరు కూడా.. మరో సీనియర్ నేత అరవింద్‌కుమార్ గౌడ్ పేరు కూడా టీటీడీ సభ్యుని కోసం ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన అరవింద్‌కు ఇంతవరకు ఎక్కడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అరవింద్‌కు బీసీ కోటాలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వాలని కొందరు పట్టుపడుతున్నట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురిలో ఓ నేతకు క్రైస్తవ మిషనరీలతో సంబంధాలున్నాయని, ఆయనకెలా సభ్యత్వం ఇస్తారని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే చైర్మన్‌గా నియమించిన వ్యక్తి విషయంలోనే ఇలాంటి ఆరోపణలున్నాయని, తనకు ఆ నిబంధన ఎందుకు అడ్డంకిగా మారుతుందని ఆ నేత తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొత్తకోట దయాకర్‌రెడ్డి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఆయన పార్టీ మారతారనే సంకేతాల నేపథ్యంలో టీటీడీ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఆయనతోపాటు ఆయన సతీమణిని, మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను కాపాడుకోవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారో.. ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే! -
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు సంకేతాలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయి, వలసలతో చిక్కి శల్యమైన టీ–టీడీపీని కాపాడుకునేందుకు అధికార టీఆర్ఎస్తో దోస్తీకి సిద్ధమని ఆయన సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు బుధవారం తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏ పార్టీతో కలిసి వెళ్తామనేది అప్పటికప్పుడు నిర్ణయం ఉంటుందని, టీటీడీపీ విలీనమంటూ ఎవరు మాట్లాడవద్దని సూచించారు. అందరితో చర్చించి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ టీడీపీతో బీజేపీ పొత్తు వద్దనుకుందని, పార్టీని కాపాడుకోవాలంటే పొత్తు అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు. పనిలో పనిగా చంద్రబాబు ...కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విమర్శలు గుప్పించారు. -
మోత్కుపల్లిపై ‘సండ్ర’ నిప్పులు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ పనైపోయిందని వ్యాఖ్యానించిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరోక్షంగా మండిపడ్డారు. కొంత మంది స్వార్ధపరుల కోసమో, పదవుల కోసమో, అవకాశవాదుల కోసమో టీడీపీని స్థాపించలేదని అన్నారు. కొంతమంది నాయకులు అవకాశం కోసం పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృతనిశ్చయంతో ఉండటమే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందని, పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిదని సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎమ్మెల్యే వీరయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని మోత్కుపల్లి బ్లాక్మెయిల్ చేస్తున్నారని వీరయ్య పరోక్షంగా పేర్కొనడంతో టీటీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడినట్టయింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించలేదు. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని నారా లోకేశ్ ప్రకటించారు. -
టీడీపీకి మరో షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నాయకులు వరుసగా సైకిల్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి లాంటి అగ్రనేతలు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కూడా టీడీపీని వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిరువురు మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. టీఆర్ఎస్లో చేరాలని వీరిని సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డి పార్టీ మారనున్నారని సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని గతంలో ప్రచారం జరిగింది. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరలేదని, టీఆర్ఎస్లోకి రమ్మని ఆహ్వానిస్తే ఆలోచిస్తానని ఆమె అప్పుడు చెప్పారు. ఏ పార్టీలో చేరినా, తన కుమారుడి వెంట ఉంటానని ఉమా మాధవరెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. -
‘అలా అయితే రేవంత్‌తోనే ఫ్లయిట్ ఎక్కేదాన్ని’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని అందరికీ తెలుసునని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఉమ మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఉమ మాధవరెడ్డి...‘ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డికి స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చు. నాతో ఎవరు మాట్లాడకుండానే కాంగ్రెస్‌లో ఎలా చేరతా. హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తోనే ఫ్లైట్ ఎక్కేదాన్ని. టీఆర్ఎస్లో చేరాలని గతంలో ఆహ్వానించారు. మళ్లీ ఆలోచిస్తే పునరాలోచిస్తా.’ అని తెలిపారు. కాగా ఉమ మాధవరెడ్డి టీడీపీని వీడనున్నట్టు గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మరోసారి ఆమె హస్తం చేయి అందుకుంటారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆ వార్తలను ఉమ మాధవరెడ్డి ఖండించారు కూడా. అయితే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డితో ఆమె చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ కొన్ని కారణాల వల్ల కొందరు పార్టీ మారారు. ఆ ఫిరాయింపుల గురించి నేను మాట్లాడను. చెప్పి చేసేది రాజకీయం కాదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. కుటుంబసభ్యుల కన్నా కార్యకర్తలనే ఎక్కువగా ప్రేమిస్తా. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడాలి. ఇక నుంచి తెలంగాణలో పార్టీ కోసం వీలైనంత సమయం కేటాయిస్తా. త్వరలోనే అన్ని కమిటీలను భర్తీ చేస్తాను. బీజేపీతో పొత్తు సందిగ్దంగా ఉంది. అయినా పర్వలేదు. ఎలాంటి వ్యవహారాలతో ముందుకు వెళ్లాలో నేను చూసుకుంటా. టీడీపీ నేతలు సమరం చేయాల్సిన అవసరం లేదు. సమస్యలపై పోరాడితే చాలు’ అని వ్యాఖ్యలు చేశారు. కాగా ఇటీవలే రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని తన నివాసంలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. రేవంత్‌కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్ కండువాలు కప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్ సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు సీతక్క, వేంనరేందర్ రెడ్డి(వరంగల్), సిహెచ్. విజయ రమణరావు(పెద్దపల్లి), అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు(బోథ్), పటేల్ రమేష్ రెడ్డి, దొమ్మటి సాంబయ్య, తోటకూర జానయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హరిప్రియ నాయక్, బల్య నాయక్, రాజారాం యాదవ్, ముగ్గురు ఓయూ జాక్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో తన మద్దతుదారులతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ టీడీపీ నాయకులు -
ఆయనతో కలిసి రేవంత్ కుట్ర పన్నాడు
-
ఆయనతో కలిసి రేవంత్ కుట్ర పన్నాడు..
సాక్షి, హైదరాబాద్ : పార్టీని వీడిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ టీడీపీని విచ్ఛిన్నం చేయడానికి రేవంత్ కుట్ర పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్.రమణ ఆదివారమిక్కడ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ...‘ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కర్‌రావు తరహాలో రేవంత్ కూడా పార్టీని దెబ్బతీయాలని చూశారు. నాడు ఇందిరా గాంధీతో కలిసి నాదెండ్ల టీడీపీని విచ్ఛిన్నం చేయాలని చూశారో, నేడు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో కలిసి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న సమయంలో చేసే ఆరోపణలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా భావాలకు దగ్గరగా ఉండేవారితో పొత్తు ఉంటుంది. రేవంత్‌కు పార్టీ సముచిత స్థానం ఇచ్చింది. అయితే ఆయన అది నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి పార్టీని వీడుతూ పెట్టుకున్నది కన్నీళ్లు కాదు..మొసలి కన్నీరు. ఇక నేను రేవంత్‌రెడ్డిని సోదరుడిలా భావించి ప్రోత్సహించాను. అవకాశవాద రాజకీయాలకు రేవంత్ రెడ్డి పరాకాష్టగా నిలిచాడు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీకి నిలబెడతాం. మా భావాలకు దగ్గరగా ఉండేవారితో పొత్తు ఉంటుంది.’ అని అన్నారు. రేవంత్‌పై ఎల్.రమణ సంచలన ఆరోపణలు -
రేవంత్‌తో పాటు టీ.టీడీపీని వీడేదెవ్వరు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్... రాబోయే ఎన్నికల్లోగా టీ.టీడీపీని ఖాళీ చేయించేందుకు భారీ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ టీడీపీ ఓటు బ్యాంక్‌పై కన్నేసిన హస్తం పార్టీ...రేవంత్ రెడ్డి ద్వారా పలువురు నేతలను పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి వచ్చేలా మంతనాలు సాగిస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా నేతలతో చర్చలు జరుపుతోంది. వీలైనంత ఎక్కువమంది టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచనగా కనిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సైకిల్ దిగి, హస్తానికి చేయందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోంది. అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న టీ. టీడీపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్న రేవంత్, ఇవాళ వేం నరేందర్ రెడ్డి రాజీనామాలు చేయగా, తాజాగా పటేల్ రమేష్ రెడ్డి, బెల్లయ్య నాయక్, రాజారాం యాదవ్ కూడా రాజీనామాలు చేశారు. అదే బాటలో మరికొందరు టీడీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 31న రేవంత్‌తో పాటుగా మరో 30మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఓటుకు కోట్లు కేసు అనంతరం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శ వినిపిస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో టీడీపీ దెబ్బతినడానికి చంద్రబాబు తీరే కారణమని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
బెజవాడకు తెలంగాణ టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ : తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్‌రెడ్డి పంచాయితీ విజయవాడకు చేరింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు తెలంగాణ టీడీ నేతలు శనివారం ఉదయం నగరాదనికి చేరుకున్నారు. ఈ సమావేశంలో రేవంత్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది. నిన్న హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరోతో సమావేశమైన చంద్రబాబు ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేవంత్ సహా పలువురు తెలంగాణ తెలుగు దేశం నేతలు విజయవాడకు వెళ్లారు. 11 గంటలకు చంద్రబాబుతో భేటీ కానున్నారు. -
కేసీఆర్ పెట్టే భోజనానికి వెళ్లను
-
కేసీఆర్ పెట్టే భోజనానికి వెళ్లను
హైదరాబాద్: గోల్కొండ హోటల్లో కేసీఆర్ పెట్టే భోజనానికి తాను వెళ్లదలుచుకోలేదని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఉదయం టీడీపీ ఆఫీసులో ఉండి సాయంత్రం కేసీఆర్‌ను కలిసేవాళ్లకు తాను జవాబు చెప్పనని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా కేసీఆర్‌పైనే అని తెలిపారు. చంద్రబాబు లేనప్పుడు తనను ఎందుకు పదవుల నుంచి తొలగించారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను స్టార్ హోటల్లో చర్చించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని, దాన్ని వదిలించేందుకు రకరకాల మందులు కొడతామని వ్యాఖ్యానించారు. కాగా, గోల్కొండ హోటల్లో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు. ఎల్. రమణ, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, రామచంద్రరావు భేటీలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. -
అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యాలు
-
అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చే సమయంలో.. అసెంబ్లీ లోపలకి వెళుతున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వగా, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సంపత్ ఏకంగా రేవంత్‌ను ఆలింగనం చేసుకున్నారు. కాగా రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. -
టీటీడీపీ పొలిట్‌బ్యూరో అత్యవసర భేటీ
హైదరాబాద్: టీడీపీలో రేవంత్‌రెడ్డి రేపిన కలకలం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. రేవంత్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ నాయకులను కలిసిన రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఆయన షోకాజ్ నోటీసు ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్ గౌడ్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. షోకాజ్ నోటీసు అవసరం లేదని, తనపై వచ్చిన ఆరోపణలను రేవంత్ ఖండిచారని ఇతర నాయకులు వాదించినట్టు సమాచారం. అయితే రేవంత్ ఖండనలో స్పష్టత లేదని, షోకాజ్ నోటీసు ఇస్తేనే కేడర్‌కు సానుకూల సంకేతాలు వెళతాయని మోత్కుపల్లి పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను రేవంత్‌రెడ్డి స్పష్టంగా ఖండించలేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. పొలిట్‌బ్యూరో భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ నాయకులు టీడీపీలోనే కొనసాగుతామని ప్రకటన చేయాలని సూచించారు. పార్టీ మారే విషయంపై రేవంత్‌రెడ్డి నుంచి నిర్దిష్టమైన ప్రకటన రాలేదన్నారు. తమ పార్టీ నాయకులను రేవంత్‌రెడ్డి కలిశారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు. పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్న వారి పేర్లు ఫైనల్ చేశామని, ఈ జాబితాను చంద్రబాబుకు పంపిస్తామని తెలిపారు. -
తెలంగాణ టీడీపీకి కొత్త కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీ టీడీపీ)కి కొత్త రాష్ట్ర కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధ్యక్షునిగా ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని నియమించారు. అలాగే కేంద్ర కమిటీలో రాష్ట్రానికి చెందిన గరికపాటి మోహన్‌రావు (వరంగల్), ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (ఖమ్మం), ఇ.పెద్దిరెడ్డి (కరీంనగర్), బక్కని నర్సింహులు (మహబూబ్‌నగర్), కొత్తకోట దయాకర్‌రెడ్డి (మహబూబ్‌నగర్)లకు చోటు దక్కింది. మొత్తం 17 మందితో ఏర్పాటు చేసిన పార్టీ పొలిట్‌బ్యూరోలో తెలంగాణకు చెందిన ఏడుగురు నేతలకు చోటు దక్కింది. టి.దేవేందర్ గౌడ్ (రంగారెడ్డి), ఎలిమినేటి ఉమామాధవరెడ్డి (నల్లగొండ), మోత్కుపల్లి నర్సింహులు (నల్లగొండ), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (వరంగల్), ధనసరి అనసూయ అలియాస్ సీతక్క (వరంగల్)లను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. కాగా, టీ టీడీపీ తెలంగాణ కమిటీలో ఉపాధ్యక్షులుగా పది మంది, ప్రధాన కార్యదర్శులుగా ఎనిమిది మంది, అధికార ప్రతినిధులుగా పదకొండు మంది, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా 34 మంది, కార్యదర్శులుగా 45మందిని నియమించారు. అలాగే ఓ కోశాధికారి, ఓ మీడియా కమిటీ కార్యదర్శి, ఓ పబ్లిసిటీ సెక్రటరీని నియమించారు. మొత్తం 114 మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని, 105 మందితో ఏపీ రాష్ట్ర కమిటీని నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి కళావెంకట్రావును ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో చంద్రబాబుతోపాటు ఏపీకి చెందిన అశోక్‌గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కావలి ప్రతిభా భారతి, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. -
కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారు
-
కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారు: చంద్రబాబు
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ చైతన్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ టీడీపీ మహానాడులో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ వచ్చాకే తెలంగాణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. తెలంగాణలో ప్రతీ కార్యకర్త కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన ముహుర్త బలం వల్ల మనం ఎవ్వరికీ భయపడటంలేదని, తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడేవరకూ పోరాడతామని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా ప్రజల కోసమే పని చేస్తోందని, తెలుగువారికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. -
చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం అమరావతిలో సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలు.. ఎన్నికల పొత్తులు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ అనుసరిస్తోన్న వైఖరిపై భేటీలో పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాగా... తెలంగాణలో మరోలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు ఒకే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ వైఖరిపై స్పష్టత తీసుకోవాలని చంద్రబాబును కోరారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరహా ఇబ్బందులు సహజమేనని ఆయన సర్దిచెప్పినట్లు సమాచారం. ఏ పార్టీకాపార్టీ బలపడాలనే ప్రయత్నం చేయడం సహజ పరిణామమని పేర్కొన్నారు. ఆ పార్టీ హైకమాండ్‌తో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున్న ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా నేతలకు సూచించారు. నియోజకవర్గాల పెంపు త్వరలో జరగనుందన్న చంద్రబాబు తెలిపారు. మహానాడులో చర్చించాల్సిన అంశంపై తెలంగాణ స్థాయిలో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 24వ తేదీన తెలంగాణ ప్రతినిధుల సభను తలపెట్టారు. ఈ సభకు రావాల్సిందిగా చంద్రబాబును నేతలు ఆహ్వానించారు. -
రేవంత్.. ఓ బుడ్డర్ఖాన్!
మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్ - అడ్డగోలుగా మాట్లాడితే తరిమికొడతరు - రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడం అదృష్టం - మోదీ, కేసీఆర్ పనితీరుపై చర్చిద్దాం - బీజేపీ నాయకులకు నారుుని సవాల్ సాక్షి, సిరిసిల్ల: టీడీపీ నేత రేవంత్‌రెడ్డి..ఓ బుడ్డర్ఖాన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో ఐటీఐ భవన నిర్మాణానికి, సర్ధాపూర్లో 17వ బెటాలియన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ’రేవంత్‌రెడ్డి అని.. ఓ బుడ్డర్ఖాన్ ఉన్నడు.. అడ్డగోలుగా మాట్లాడుతున్నడు.. కేసీఆర్‌ను తిట్టే స్తోమత నీకు లేదు.. నువ్వో.. బచ్చావి.. ఇదే హెచ్చరిక చేస్తున్నా.. నిన్ను మహిళలే తరిమి తరిమి కొడుతరు’ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీకి అడ్రస్ లేకుండా పోరుుందని, ఉన్న ఒకరిద్దరితో అయ్యేదేమీలేదన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారన్నారు. కేసీఆర్ సీఎం కావడం రాష్ట్రానికి అదృష్టమన్నారు. ఇన్నేళ్లుగా ఇంటింటికీ నీళ్లు అందించాలనే కనీస ఆలోచన ప్రతిపక్షాలు కూడా చేయలేదన్నారు. ఈ డిసెంబర్ నాటికి నల్లగొండ, జనగామ జిల్లాల్లో మూడు వేల ఇండ్లకు, వచ్చే ఏడాది వరకు తెలంగాణ మొత్తానికి నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎవరేం చేశారో చర్చపెట్టాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు నాయకుడు లేడని, సీపీఎంకు తెలంగాణలో అడ్రస్ లేదన్నారు. ఐటీలో కేటీఆర్ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాడన్నారు. చైనా, రష్యా, ఆస్ట్రేలి యా దేశాలు తెలంగాణలో పరిశ్రమలు పెడతా మంటూ కేటీఆర్ వెంటపడుతున్నాయని చెప్పారు. దేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అని సర్వేలు తేల్చాయన్నారు. కేటీఆర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసిస్తూ, సన్మానం చేసిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో హైదరా బాద్‌కు ఇన్చార్జ్గా కేటీఆర్ రావడంతోనే రికార్డు విజయం సొంతం చేసుకున్నా మన్నారు. విద్యకు కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నా రని చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. కోటి ఎకరాలకు సాగునీరు.. ఇంటింటికీ తాగునీరు: మంత్రి కేటీఆర్ కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికీ తాగునీరు అందివ్వడం సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అనే విధంగా తెలంగాణ మారాలనేది ముఖ్యమంత్రి కల అన్నారు. వడ్డీలేని రుణాల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందని, త్వరలో అవి బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయన్నారు. డబ్బులు చేతుల్లోకి ఎప్పుడొస్తాయో తాము చెప్పలేమని, అది ప్రధాని మోదీ చేతిలో ఉందని చమత్కరించారు. 4 లక్షల మంది బీడీ కార్మికులు నెలకు రూ.40 కోట్లు పింఛన్ ఇచ్చి అండగా నిలిచింది కేసీఆరేనన్నారు. టీడీపీ హయాంలో ఒకరి చనిపోతేనే మరొకరికి పింఛన్ వచ్చే దుస్థితి ఉండేదని, కాంగ్రెస్ ఇచ్చిన రూ.200 కనీసం మందుబిళ్లలకు కూడా సరిపోయేది కాదన్నారు. తాము వాటిని ఐదింతలు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 29 లక్షల మందికి రూ.800 కోట్లు ఇస్తే, తాము 38 లక్షల మందికి రూ.4500 కోట్లు పింఛన్ కింద చెల్లిస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యంపై నియం త్రణ ఎత్తివేసి, ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ మనుమడు, మనుమరాలు తినే సన్నబియ్యాన్ని హాస్టల్ విద్యార్థులకు పెడుతున్నామని, ఇది సీఎం మానవీయతకు నిదర్శనమని పేర్కొ న్నారు. 2018 చివరినాటికి ఇంటింటికి నీళ్లు ఇవ్వక పోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న సీఎం కేసీఆర్అన్నారు. 5400 పాఠ శాలల్లో 3354 పాఠశాలల్లో డిజిటల్ బోధనలు ప్రారంభమ య్యాయన్నారు. ఓ వైపు ప్రజల కోసం ఇన్ని కార్యక్రమాలు చేపడు తుంటే, మరిచిపోరుున పార్టీలు, జెండాలు పట్టుకొని యాత్రలకు బయలుదేరాయని ఎద్దేవా చేశారు. రైతులను పట్టుకొని ఎంత కష్టమొచ్చిదంటూ ఏడుస్తున్నారని, సంక్రాంతికి రెండు నెలలు ముందే గంగిరెద్దోళ్లు వచ్చారని రైతులు ఆగమైతున్నారన్నారు. అలాంటి ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
అప్పీలుకు వెళ్తామనడం దారుణం
జీఓ 123పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: జీవో 123ను హైకోర్టు రద్దు చేస్తే దానిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం దారుణమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టు 16సార్లు మొట్టికాయలు వేసిందని, అయినా వారికి సిగ్గు రావడంలేదన్నారు. రమణ నేతృత్వంలో టీటీడీపీ బృందం శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యింది. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో నియంతృత్వంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు రమణ ఫిర్యాదు చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం-2013 అమలుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. ఎంసెట్-2 లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బృందంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులున్నారు. -
టీడీపీని వీడే ప్రసక్తే లేదు: ఎల్.రమణ
కరీంనగర్: తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తన గురించి అనవసరంగా మాట్లాడితే ఊరుకోను' అని హెచ్చరించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవే తన బిడ్డలకు ఇచ్చానట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకులు అలా ఇవ్వగలరా? అంటూ ఎల్. రమణ సూటిగా ప్రశ్నించారు. -
తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయంపై వివాదం
హైదరాబాద్: తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయంపై వివాదం నెలకొంది. తమకు నోటీసు ఇవ్వకుండానే కార్యాలయాన్ని ఇతరులకు కేటాయించటంపై తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పద్ధతి లేకుండా వ్యవహరించారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. హక్కులను కాపాడాల్సిన స్పీకరే ఇలా చేయడం తగదని ఆయన అన్నారు. స్పీకర్ ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని, తాము ఖాళీ చేయకుండానే గదులను ఇతరులకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారంపై తాము కోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఆయన కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. కాగా టీడీఎల్పీ కార్యాలయంను స్పీకర్ ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీకి కేటాయించిన విషయం తెలిసిందే. -
టీ.టీడీపీ నేతలు తెలంగాణ ద్రోహులు
► ఆంధ్రా నేతలకు వత్తాసు పలుకుతారా ► తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు ► టీటీడీపీ నేతలపై మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి ఫైర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేతలు వత్తాసు పలకడం ద్వారా తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డారని, వారు ప్రజలను ఏ విధం గా మభ్యపెట్టినా నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారె డ్డి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఆం ధ్రా టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేత లు వత్తాసు పలకడం ద్వారా తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డారని అన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీచైర్మన్ భాస్కర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల పక్షాన నిలబడలేక పోలీసు రక్షణతో తిరిగిన నేతలు నేడు రైతుల కోసం ఉద్యమాలంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో రెండేళ్లలో తెలంగాణలో అనూహ్య రీతిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు వంటి పథకా లు తెలంగాణ పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయని ఈ పథకాలను బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రశంసిస్తుంటే ఇక్కడి టీడీపీ నేతలు విమర్శిస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని అన్నారు. ఆర్డీఎస్ గురించి ఉద్యమాలు చేస్తామన్న నాయకులు తెలంగాణ ఉద్య మ సమయంలో పోలీసు రక్షణతో తిరిగారని, ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాలంటున్నారని ఆయ న విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ సంబరా లు అంబరాన్నంటేలా చేస్తామని, అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఓర్వలేకనే పరువు తీస్తున్నారు మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు సన్యాసులు రాష్ట్రం పరువు తీసేలా అవాకులు చవాకులు పేలుతున్నారని వారిని ప్రజలు క్షమించరన్నారు. జిల్లా వెనుకబాటుతనానికి కాంగ్రెస్, టీడీపీ పాలకులు అనుసరించిన విధానాలే కారణమని జిల్లాకు ఒక్క మంచి పని చేయలేని నేతలు నీతులు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ను ప్రజలు ప్రతి ఎన్నికలో తిరస్కరిస్తున్నా ఇంకా రాజకీయ ఉనికి కోసం పాకులాడుతూ అధికార పార్టీకి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కొల్లాపూర్ జెడ్పీటీసీ హన్మంతునాయక్, సురేందర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముఖం చాటేస్తున్న ‘చంద్రబాబు’
తెలుగుదేశం పార్టీలో తెలంగాణ తమ్ముళ్ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఏ క్షణాన ‘ఓటుకు కోట్లు’ కేసు రచ్చ రచ్చ అయ్యిందో.. అప్పటి నుంచి అధినేత చంద్రబాబు నాయుడు తీరు పూర్తిగా మారిపోయిందని వీరు మథనపడుతున్నారు. మొదటి నుంచీ పార్టీలో తెలంగాణ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యమే ఉండేదట. అధినేత వద్ద తమకున్న ‘వెయిట్’ చూసుకుని మురిసిపోయిన నేతలు ఇప్పుడు తెల్లమొహాలు వేస్తున్నారట. ఓటుకు కోట్లు కేసుతో పార్టీ పరువు బజార్నపడడమే కాకుండా, ఏకంగా పార్టీ అధ్యక్షుడినైనా తన పేరు తెరపైకి రావడంతో జాతీయ స్థాయిలోనూ ఇమేజీ డామేజీ అయ్యిందని చంద్రబాబు కినుక వహించారట. ఇక అప్పటి నుంచి తెలంగాణ టీడీపీ నేతలతో ఎడమొహం.. పెడమొహంగానే ఉంటున్నారట. హైదరాబాద్‌లో ఉండడానికి అధినేత జంకడంతో ప్రతీసారి ఆయనను కలవడానికి, భేటీలు జరపడానికి విజయవాడకు వెళుతున్నారు. అయితే గతంలో మాదిరిగా తెలంగాణ నేతలకు రెడ్‌కార్పెట్ స్వాగతం లేకపోగా, ఎందుకొచ్చార్రా బాబూ అన్నట్లుగా ముఖం చాటేస్తున్నారట చంద్రబాబు. ‘ఏదన్నా కష్ట సుఖం చెప్పుకుందామని మా నేతను కలవాలంటే తల ప్రాణం తోకకు వస్తోంది. ఇంతకు ముందులా రీసీవింగ్ లేదు. లేని సీటు కోసం ప్రయత్నించి పరువు తీశారన్న కోపం ఉన్నట్టుంది. విజయవాడకు పోయిన ప్రతిసారీ ఆయన అపాయింట్‌మెంటేమీ దొరకడం లేదు. బిజీగా .. ఉన్నా, మళ్లీ రండన్న సమాధానం షరా మామూలైపోయింది..’ అని టీ టీడీపీ నేత ఒకరు అసలు విషయం బయటపెట్టారు. హైదరాబాద్‌లో ఉండడానికి చంద్రబాబే కాదు ఆ .. చినబాబు కూడా జంకుతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని టీడీపీలో ఒకటే గుసగుసలు ..! -
పార్టీ బతకాలా ... పదవి ఇవ్వండి
తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు కొత్త పాఠం ఒంటబట్టించుకున్నారు. తమ పనులు చక్కబెట్టుకోవడానికి అధినేత చంద్రబాబుకు ఏ మంత్రం వేయాలో ప్రావీణ్యం సంపాదించారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒకరి వెనుక ఒకరు టీఆర్ఎస్ బాట పట్టడంతో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీలే మిగిలారు. తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే తమకు అధికార పదవులు కావాల్సిందేనని కొత్త మెలిక పెడుతున్నారు. ఏపీలో అధికారంలో ఉండడంతో అక్కడ కూడా పదవులు కావాలనే అత్యాశకు పోతున్న నాయకులు కొందరు నేరుగా అధినేత ముందే కోరికల చిట్టా విప్పుతున్నారు. జాతీయ పార్టీ హోదా కొనసాగాలంటే తెలంగాణలో పార్టీ దుకాణం మూస్తే కుదరదన్న అవగాహనతో ఉన్న ఏపీ టీడీపీ పెద్దలు అవునన లేక, కాదనలేక మిన్నకుండి పోతున్నారు. ‘ఒక నాయకుడేమో ఏకంగా గవర్నర్ పదవి కోరుకుంటుంటే, మరో నాయకుడు రాజ్యసభ సభ్యత్వం కావాలంటుంటే, ఇంకో నేత టీటీడీ బోర్డు పదవి మాకివ్వరా అంటున్నారు. చివరకు ఏపీ ప్రభుత్వంలో ఒకటీ రెండు నామినేటెడ్ పదవులకూ గాలం వేస్తున్నారు. ఇదయ్యేదా.. పోయ్యేదా.. ఆశకు అంతుండక్కర్లేదా..’ అని పార్టీ నేత ఒకరు కుండబద్దలు కొట్టారు. వీరి గొంతెమ్మ కోర్కెలు వింటున్న పార్టీ అగ్రనేతలకు దిమ్మతిరిగి పోతోందట. మరంతే.. పదువుల్లేకుండా పార్టీని ఎలా కాపాడుతాం అంటూ కొత్త సూత్రీకరణ చేస్తున్నారట. పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులున్న వారే గోడదూకిన చేదు అనుభవాల నేపథ్యంలో .. ఎన్నికల్లో ఓడిపోయిన వీరి కోసం ఏపీ నేతలను త్యాగం చేయమంటారా? నిజంగానే తెలంగాణ తమ్ముళ్లకు పదవీ యోగం పడుతుందా... అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.. -
‘టీడీపీ విలీనం రాజ్యాంగ విరుద్ధం’
మంచిర్యాల సిటీ : తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టుగా రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసుధనాచారి ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీని విలీనం చేయాలంటే గ్రామ కమిటీ నుంచి మొదలుకొని రాష్ట్ర కమిటీ వరకు తీర్మానం చేయాలని.. తర్వాతనే అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రాజ్యాంగంలోని 73,74 ఆర్టికల్ ప్రకారం ఏ పార్టీ నుంచి గెలుపొందితే ఆ పార్టీ సభ్యుడిగానే కొనసాగాలని ఉందన్నారు. సమావేశంలో తూర్పు జిల్లా కోశాధికారి గోపతి మల్లేష్, మేరడికొండ శ్రీనివాస్, రాజారాం, వెంకటేశ్వర్లు, పుట్ట మధు, గౌస్ ఉన్నారు. -
ఏపీ సీఎంతో టీ-టీడీపీ నేతల భేటీ
విజయవాడ: విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు, రాములు, తెలంగాణ టీడీపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ పలువురు నేతలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీన వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు చర్చించనున్నారు. -
టీడీపీ చిన్నాభిన్నం!
వరుస దెబ్బలతో ఉనికి కోల్పోయే స్థితిలో తెలుగుదేశం పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇక మిగిలేదెందరో? మంచి ఆఫర్ వస్తే వెళ్లేందుకు సిద్ధమంటున్న ‘మిగిలిన’ వాళ్లు నియోజకవర్గాల ఇన్చార్జులు సైతం గులాబీ గూటికే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యతిరేకించిన పార్టీగా ముద్రపడిన టీడీపీ... 2014 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినగా, ఇటీవలి పరిణామాలతో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 సీట్లు గెలుచుకున్న టీడీపీకి.. ‘గ్రేటర్’ ఎన్నికల తరువాత అందులో మూడోవంతు సభ్యులు కూడా మిగలకపోవడం గమనార్హం. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏడాదిన్నర కాలంలో ఒక్కొక్కరుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉంటూ ఏడాదిన్నర కాలంగా టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలసి టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. దాని నుంచి తేరుకోకముందే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో... గురువారం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా... మరికొందరు మాత్రం తెలంగాణలో పార్టీ వినాశనానికి నేతలే కారణమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి హాజరై టీడీపీ భవిష్యత్తు గురించి ఉపన్యాసం ఇచ్చిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి... సమావేశం అనంతరం నేరుగా మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలతో భేటీ అయి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఖమ్మంతో మొదలు సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండు సీట్లకు పరిమితమైంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ముందుగా ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టిన గులాబీ పెద్దలు... తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో అక్కడి జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సహా గంపగుత్తగా టీఆర్ఎస్లో కలిపేయడంతో టీడీపీ పతనం మొదలైంది. తరువాత గ్రేటర్‌పై దృష్టి పెట్టిన అధికార పార్టీ... టీడీపీలో బలమైన నేతలుగా పేరున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డిలకు వలవేసింది. అనంతరం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్నలతో పాటు తాజాగా వివేకానంద గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి కూడా అధికారపార్టీలో బాటపట్టడంతో టీడీపీ శ్రేణులు తెల్లబోయాయి. ఆఫర్ వస్తే రేవంత్ మినహా అందరూ.. టీడీపీలో ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారిలో అరికపూడి గాంధీ పార్టీ మారడం లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది. మిగతా వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరే అవకాశముంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీసీ ఉద్యమాల్లో బిజీ అయి.. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అక్కడి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఈ పరిస్థితుల్లో బీసీల అంశంపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే అధికార పార్టీలో చేరేందుకు అభ్యంతరం ఉండదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇక టీడీపీ హైదరాబాద్ అధ్యక్షుడిగా, గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఆరోపణలు ఎదుర్కొన్న మాగంటి గోపీనాథ్ కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చే ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు గ్రేటర్ సహా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల ఇన్చార్జులుగా ఉన్న వారు కూడా టీఆర్ఎస్లోకి క్యూ కట్టారు. -
లక్షల్లో సొమ్ము చేతులు మారాయి: కృష్ణయాదవ్
హైదరాబాద్ : ఓవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తరుముకొస్తుంటే తెలంగాణ టీడీపీకి మరో గట్టి షాకే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఆకర్ష్‌కు కొంతమంది నేతలు వెళ్లిపోగా, మిగిలినవారు అసంతృప్తితో ఆ పార్టీకి దూరం అవుతున్నారు. తాజాగా సొంతపార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రేటర్ ఉపాధ్యక్ష పదవికి కృష్ణయాదవ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ పార్టీలో బడుగు, బలహీన వర్గాలవారికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గ్రేటర్ టికెట్ల కేటాయింపులో లక్షల రూపాయిలు చేతులు మారాయని ఆరోపించారు. పార్టీని కొందరు నాయకులు గుప్పెట్లో పెట్టుకుంటున్నారని, కొందరి వ్యవహార శైలి వల్ల పార్టీ నాశనం అవుతోందని కృష్ణయాదవ్ ధ్వజమెత్తారు. -
గ్రేటర్లో తెలంగాణ టీడీపీకి షాక్
హైదరాబాద్ : గ్రేటర్లో తెలంగాణ టీడీపీకి షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి మాజీ మంత్రి కృష్ణయాదవ్ శుక్రవారం రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల సమయంలో కృష్ణయాదవ్ రాజీనామా ఆ పార్టీలో గుబులు రేపుతోంది. కాగా పాతబస్తీకి చెందిన కృష్ణయాదవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు విద్యార్థి నాయకుని నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విప్‌గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నకిలీ స్టాంపుల కుంభకోణంలో 2003లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే కృష్ణయాదవ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు అధ్యక్షుడి అనుమతితో పార్టీలో చేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరడంతో గ్రేటర్ అధ్యక్షుడిగా కృష్ణయాదవ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు గ్రేటర్ అధ్యక్ష పదవి వరించింది. దీంతో అప్పటి నుంచి కృష్ణయాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. చివరకు గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తనను పట్టించుకోకపోవడంతో ఆయన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. -
బాబు తీరుపై ‘తమ్ముళ్ల’ అసంతృప్తి
గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంతో కంగుతిన్న టీటీడీపీ నేతలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా వదిలేసుకున్నారేమోనని తెలంగాణ టీడీపీ నేతలు ఆం దోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై చంద్రబాబు కనీస విమర్శలు కూడా చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ‘ఓటుకు కోట్లు’ కేసు భయమే కారణమని భావిస్తున్నారు. అసలు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో బాబు నేరుగా మాట్లాడిన ఆడి యో టేపులు బహిర్గతం కావడం, ఏసీబీ తమ చార్జిషీటులోనూ చంద్రబాబు పేరు ప్రస్తావించి న నేపథ్యంలో... కేసీఆర్‌తో సఖ్యత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్నారు. మంగళవారం నిజాం కళాశాల మైదానంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగించిన తీరు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోందని పేర్కొంటున్నారు. ఇలాగైతే ఎలా..? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావడానికి తొలుత విముఖత చూపి, పార్టీ నేతల ఒత్తిడి మేరకు బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు ముక్తసరి ప్రసంగం చేయడం వారికి ఏ మాత్రం మింగుడు పడడంలేదు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపలేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి పార్టీని ముందుకు నడిపించడం ఎలా సాధ్యమని టీడీపీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పుడు మా ముందు గ్రేటర్ ఎన్నికలున్నా యి. ఇప్పటికిప్పుడు మా వైఖరి మార్చుకోవడానికి అనువైన ప్లాట్‌ఫాం దొరకాలి కదా. మా నిర్ణయం ఏదైనా గ్రేటర్ ఎన్నికల తరువాతే’ అని తెలంగాణ టీడీపీలో సీనియర్ నేత ఒకరు చెప్పారు. తెలంగాణలో టీడీపీ కోసం రక్తం ధారపోసిన కుటుంబాలున్నాయని, చంద్రబాబు వారిని తీసుకెళ్లి సీఎం కేసీఆర్‌కు బలిపెడతారనుకోవడం లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో దోస్తీ కడుతున్న బాబుకు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలే అంటున్నారు. దానికి తోడు టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ అధినాయకత్వం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని, మంగళవారంనాటి సభలో నమస్కారం అం టూ ఆయన ముక్తసరిగా మాట్లాడటానికి ఇదే కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘మేమేమో నిత్యం కేసీఆర్‌తో, టీఆర్ఎస్తో గొడవ పడాలి. పార్టీ అధినేత మాత్రం సఖ్యత తో ఉంటారు. ఇదెలా సాధ్యం? పార్టీ కేడర్ మమ్మల్ని ఎలా విశ్వసిస్తుంది’ అని ఎర్రబెల్లి సన్నిహితులవద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు-కేసీఆర్ కలసిపోయినప్పుడు మనిద్దరి మధ్య విభేదాలు ఎందుకంటూ ఎర్రబెల్లి, రేవంత్ సరదా వ్యాఖ్యలు కూడా చేసుకున్నారని ఓ ఎమ్మెల్యే చెప్పారు. నేతల్లో నిస్పృహ పార్టీ అధినేత చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదని గ్రహించిన మాజీ కార్పొరేటర్లు అనేక మంది గతవారం రోజులుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన ఏడుగురు మాజీ కార్పొరేటర్లు టీడీపీని వీడారు. ఇక చంద్రబాబు వైఖరి స్పష్టమైన తరువాత మిగిలిన వారు కూడా పార్టీలో కొనసాగుతారనుకోవడం లేదని పార్టీ నేతలు అంటున్నారు. పోటీ చేయడానికి ముందుకు వస్తున్నవారు కూడా తక్కువేనని... కొన్ని డివిజన్లలో మినహా టికెట్లకు పెద్దగా డిమాండ్ లేదని జీహెచ్ఎంసీ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ‘బాబు ఎంత బలవంతంమీద ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారో ఆయన ప్రసం గం చూస్తేనే అర్థమవుతుంది. ఇదేమీ మా కేడర్‌కు పనికొచ్చేదిగా లేదు. పైగా పార్టీలో ఉండడం ఎందుకన్న ఆలోచన కలిగించేలా ఉంది’ అని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తామేదో చేశామని గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం లేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు చంద్రబాబు ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వానికి సంబంధమేలేని ఔటర్ రింగ్‌రోడ్డు కూడా తమ ఖాతాలో వేసుకోవడంపైనా టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి. ‘ఓటుకు కోట్లు’ కేసు కోసమే బాబు కేసీఆర్‌తో సంధి కుదుర్చుకున్నారన్న ఆరోపణలకు ఆయన ప్రసంగం అద్దం పట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీలో అంతర్మథనం తరచూ సీఎం కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తున్న బీజేపీ నేతలు చంద్రబాబు వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టినవారంతా బాబు ప్రసంగంతో కంగుతిన్నారు. ‘‘ఆయన ప్రసంగం ఇలా ఉంటుందనుకోలేదు. వేదిక మీద ఉన్న మాకే ఏం చేయాలో పాలుపోలేదు. టీడీపీ కార్యకర్తలకు కూడా మింగుడు పడలేదు. దీని ప్రభావం మా పార్టీపై పడుతుందేమో’’ అని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు లేకుంటే బాగుండనేదాకా తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అయితే బుధవారం ఉదయం ఓ టీవీ చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. 15 నిమిషాల్లోనే ముగిసిన ప్రసంగం.. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినా, చివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయినా సరే చంద్రబాబు గంటకు తక్కువ కాకుండా మాట్లాడతారు. ఇక బహిరంగ సభల్లో అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై, ప్రతిపక్షంలో ఉంటే అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం ఆయన నైజం. టీడీపీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో ‘మైకాసురుడు’గా పిలుచుకునే చంద్రబాబు... మంగళవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలో 15 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించడం చూసి వేదిక మీద ఉన్న టీడీపీ, బీజేపీ నేతలే ఆశ్చర్యపోయారు. ఈ 15 నిమిషాల ప్రసంగంలోనూ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గానీ, సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని గానీ పల్లెత్తు మాట అనకపోవడం చూసి విస్తుపోయారు. తాము అధికారంలో ఉన్న ఏపీలో ఏవిషయంలోనూ ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయానికి విలువ ఇవ్వకపోగా, అదే పనిగా ఎదురుదాడికి దిగడమే అలవాటు చేసుకున్న చంద్రబాబు... తెలంగాణలో అధికారపక్షాన్ని మాటమాత్రంగానైనా విమర్శించలేదు. దీనికి ‘ఓటుకు కోట్లు’ కేసు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు ఆర్నెల్ల కింద హైదరాబాద్‌లో ఏపీ పోలీసు స్టేషన్ పెడతామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఆ తరువాత సీఎం కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేనంతగా మారిపోయారు. -
టీ.తెలుగు తమ్ముళ్లకు పవన్ కల్యాణ్ ఝలక్!
హైదరాబాద్: తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం పవన్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ కూటమి తరఫున ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరగా, అందుకు పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కాగా 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తరపున పవన్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన తెలుగు తమ్ముళ్లకు పవన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిరాశ పడినట్లు సమాచారం. -
శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి
-
శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి
తిరుమల శ్రీవారిని కొడంగల్ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత రేవంత్ రెడ్డి దర్శంచుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి గెలుపు ఖాయం అన్న ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తన బినామీలతో కలిసి నిర్వహించిన సర్వేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. రిజర్వేషన్లు రాకముందే చేసిన సర్వే ప్రమాణికత ఎంతో అందరికి తెలుసని ఎద్దేవ చేశారు. -
బదనాం కాకుండా టీటీడీపీ తంటాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికపై తెలంగాణ టీడీపీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కమలం నుంచి బరిలోకి దిగిన ఎన్ఆర్ఐ డాక్టర్ దేవయ్య విజయం కోసం తెలంగాణ తమ్ముళ్లు కసర త్తు చేస్తున్నారు. తమ వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన సూచన మేరకు టీ టీడీపీ నాయకులు వ్యూహరచనలో మునిగిపోయారు. అయితే, గత ఎన్నికల అనుభవం చేదుగా ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరకాల, పాలకుర్తిలో టీడీపీ గెలిచింది. కానీ, వరంగల్ లోక్‌సభ స్థానంలో ఉమ్మడి అభ్యర్థి (బీజేపీ) మూడో స్థానంలో నిలిచినా, కనీసం డిపాజిట్ దక్కలేదు. టీడీపీ శ్రద్ధపెట్టకపోవడంతోనే ఇలా జరిగిందని అప్పుడు బీజేపీ మండిపడింది. ఈనేపథ్యంలో మిత్రపక్షం నుంచి మాట రాకుండా చూసుకుంటున్నామని టీడీపీ నేత ఒకరు చెప్పారు. ఉప ఎన్నిక కోసమే సర్వసభ్య భేటీ! ప్రధానంగా ఉప ఎన్నికలపై చర్చించేందుకే శనివారం టీటీడీపీ రాష్ట్ర కమిటీ సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కమిటీ ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. దీంతో కొత్త కమిటీతో భేటీ అయ్యేందుకు, అదే సమయంలో ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశం జరుపుతున్నారని అంటున్నారు. -
ఎర్రబెల్లి, రేవంత్ లకు చంద్రబాబు క్లాస్!
విజయవాడ: తెలంగాణ నేతల వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీనియర్ నాయకుల మధ్య విభేదాలపై సీరియస్ గా స్పందించినట్టు సమాచారం. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ టీడీపీ ముఖ్య నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విభేదాలు వీడి ముఖ్య నేతలు కలిసికట్టుగా పనిచేయాలని క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గుండు సుధారాణి పార్టీ వీడటంపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. అయితే సుధారాణి పార్టీని వీడినా నష్టం లేదని చంద్రబాబుతో టి. టీడీపీ నేతలు చెప్పినట్టు సమాచారం. వరంగల్ ఉప ఎన్నికపై ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎర్రబెల్లి, రేవంత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో దూషించుకున్నారు. 'నా జోలికొస్తే రూంలేసి కొడ్తా..' అంటూ ఎర్రబెల్లిపై రేవంత్‌రెడ్డి విరుచుకుపడడంతో పార్టీ నేతలు అవాక్కయ్యారు. -
టి.టీడీపీలో కిరికిరి!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి తెలంగాణ టీడీపీలో కిరికిరి మొదలైంది. ఈ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయ్యింది. ఈ నెలాఖరులోగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న సమాచారంతో టీటీడీపీలో రాజకీయం ఊపందుకుంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఈ స్థానంలో తనకు పోటీ చే సే అవకాశం ఇవ్వాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తున్నారని తెలిసింది. ఎంపీగా గెలిస్తే, అత్యంత సీనియర్ అయిన మోత్కుపల్లికి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కొచ్చని అంచనాలూ వేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినా, ఆ పదవులు ఏపీ నుంచే ఉన్నాయి. ప్రస్తుతం ఒక మంత్రి తీరు వివాదాస్పదంగా ఉందని, ఆయనను తొలిగిస్తే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడి వారికి అవకాశం దక్కొచ్చన్న అంచనాలో ఉన్నారు. ఈ అంచనాతోనే వరంగల్ కోసం పట్టుబడుతున్నారని అంటున్నారు. టీడీపీ తరఫున మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తారని ఊదరగొట్టినా.. ఇంత వరకు అతీగతీ లేదు. దీంతో ఉప ఎన్నికలను అవకాశంగా భావిస్తున్న ఆయన తనకే చాన్స్ ఇవ్వాలని కొందరు నేతల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. సీనియర్లకు.. అడ్డంకులు! తెలంగాణ టీడీపీలో తక్కువ కాలంలో పెద్ద స్థాయికి చేరుకున్న కొందరు నాయకులు సీనియర్లకు మోకాలడ్డుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ కమిటీల నియామకాల్లో సీనియర్లకు ప్రాధాన్యం లభించలేదు. పార్టీలో జూనియర్ అయిన రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్‌లో మోత్కుపల్లి వంటి సీనియర్లకు అవకాశం దక్కకుండా కొందరు జూనియర్లు కుయుక్తులు పన్నుతున్నారని అంటున్నారు. సీనియర్లకు అవకాశం కల్పిస్తే తమ ప్రాధాన్యం ఎక్కడ తగ్గిపోతుందోనన్న ముందుచూపుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు. వరంగల్ ఎంపీ స్థానాన్ని బీజేపీకే వదిలేద్దామని, ఇవ్వాళ కాకపోయినా, రేపైనా సనత్‌నగర్‌కు ఉపఎన్నిక తప్పదని, అక్కడే పోటీ చేద్దామని కొందరు ప్రతిపాదిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు తమకు సరైన అభ్యర్థి లేడని, వరంగల్ స్థానాన్ని టీడీపీకి వదిలేసి, సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక జరిగితే తాము పోటీ చేస్తామని బీజేపీ కొత్త ప్రతిపాదన చేసిందని సమాచారం. ఒక దశలో వరంగల్ కోసం ఇరు పార్టీలూ పట్టుదలగా ఉన్నప్పుడు, సర్వే చేయించి ఎవరికి ఎక్కువ మద్దతుంటే ఆ పార్టీ బరిలోకి దిగాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ప్రతిపాదించినట్లు వినికిడి. పోటీపై ఇప్పటికీ ఇరు పార్టీల మధ్య స్పష్టత రాకున్నా, బీజేపీ, టీడీపీల్లో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. -
టీడీపీలో అసంతృప్తి సెగలు
-
'వాళ్లు బతకడానికే భయపడుతున్నారు'
-
చంద్రబాబుతో టీ. టీడీపీ ముఖ్యనేతల భేటీ
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ సారధి కోసం 'మొబైల్' సర్వే ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సారధ్యం వహించగలిగిన నాయకుడెవరంటూ ఆ పార్టీ సెల్ ఫోన్లలో వెతుకులాడుతోంది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది -
తెలంగాణ టీడీపీలో మొదలైన యుద్దం
-
టీడీపీలో ఆట మొదలైంది
ఇంతకూ రేవంత్‌కు ఏ పదవి! సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో ఆట మొదలైంది. పార్టీలో కీలకమైన పదవుల కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఒకింత ఆలస్యంగానైనా, పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ, తెలంగాణల్లో రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టడంతో పదవి కోసం లాబీయింగ్ ఊపందుకుంది. ఈ వారాంతంలోగా పార్టీ పదవుల భర్తీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆశపడుతున్నారు. కాగా, తెలంగాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అప్పటికప్పుడు ఏపీ కమిటీలో ఉన్న నేతలతోనే తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించారు. మాజీ మంత్రి ఎల్.రమణ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏర్పాటైన ఆ కమిటీ పదవీ కాలం మహానాడుతోనే ముగిసింది. కమిటీ కొత్త అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవులు ఎవరికి దక్కుతాయో ఇప్పటి దాకా సస్పెన్స్‌గానే ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి కొత్త అధ్యక్షుడు, ఇతర పదవుల భర్తీపై పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్లు తెలియగానే తెలంగాణ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు పడిపోయారు. మొదటి నుంచీ అధ్యక్ష పదవిపై కన్నేసిన, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌పై బయట ఉన్న ఆయనపై ఉన్న షరతులను కూడా కోర్టు ఎత్తివేయడంతో ఇక, ఏ ఇబ్బందీ ఉండదన్న అభిప్రాయానికి వచ్చారని, తెలంగాణలో పార్టీకి తన అవసరమే ఎక్కువ ఉందని ఆయన సన్నిహితుల వద్ద కూడా అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మాట ఎత్తితే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న రేవంత్.. తనను తాను రాష్ట్ర స్థాయి నేతగా రుజువు చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఓ సారి అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ వెనకబడిన వర్గాల కోటాలో ఈసారీ తనకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు టీ టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ పదవినీ ఆశిస్తున్నారు. ఆయన తొలి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సారి తనకు అవకాశం వస్తుందో రాదో అన్న బెంగ ఆయనలో ఉంది. అయినా, చివరి దాకా అధినేతను మెప్పించి పదవి పొందే ప్రయత్నమే చేస్తున్నారని చెబుతున్నారు. వర్గ సమీకరణలు కుదరక, ఒక వేళ రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఎర్రబెల్లి, రేవంత్ మధ్య ఆధిపత్య పోరు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల దూకుడుగా ఉండే రేవంత్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇబ్బందులు పడ్డారన్న సానుభూతి పార్టీ అగ్ర నాయకత్వంలో ఉందని, ఇది ఒక రకంగా రేవంత్‌కు లాభించే అంశమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఎల్.రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌ల మధ్యే అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుని పదవులు దోబూచులాడుతున్నాయని పేర్కొంటున్నారు. వీరిలో అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? అది పార్టీలో ఎలాంటి అంతర్గత పోరాటానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
టీడీపీ ఆందోళనలకు నేతల వ్యతిరేకత
- జిల్లాల్లో సమావేశాలకు చుక్కెదురు - 3వ తేదీన ధర్నాల నిర్వహణా ప్రశ్నార్థకం! సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు చేయాలని భావిస్తున్న తెలంగాణ టీడీపీకి సొంత పార్టీ నుంచే మద్దతు కరువవుతోంది. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ ముఖ్యనేతలు మాత్రమే ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ర్టవ్యాప్తంగా కార్యరూపంలో ఆందోళనలు చేపట్టింది చాలా తక్కువ. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్ సమస్యపై వరంగల్‌లో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకరోజు దీక్ష చేపట్టారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. వీటికి అంతగా స్పందన కన్పించలేదు. ప్రాజెక్టులపై పర్యటనలు చేసినా, ముగ్గురు నలుగురు నాయకులకే అది పరిమితమైంది. ఒకరకంగా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసింది శూన్యం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ముఖ్య నాయకులు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులోభాగంగానే ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని టీటీడీపీ నిర్ణయించింది. పార్టీ మహిళా అనుబంధ సంఘం ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో ఈనెల 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, వీటిని విజయవంతం చేసేందుకు ఆయా జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన సమావేశాలకు స్పందన కరువైంది. మరోవైపు ఆయా జిల్లాల్లో స్థానిక నాయకత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ సమావేశాలపై ప్రభావం చూపిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్య నాయకులు, అనుంబంధ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశాలే అంతంత మాత్రంగా జరగడంతో పెద్దఎత్తున నిర్వహించాలని భావిస్తున్న ధర్నాల పరిస్థితి ఏమిటన్న సంశయం కొందరు నేతల్లో వ్యక్తం అవుతోంది. అత్యధిక జిల్లాల్లో ఈ సమావేశాలు నామమాత్రంగా జరిగాయని సమాచారం. మీటింగ్‌కు ఎమ్మెల్యేల డుమ్మా ! చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా గురువారం తలపెట్టిన ధర్నా గురించి చర్చించేందుకు హైదరాబాద్ కమిటీ జరిపిన సమావేశానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు గైర్హాజరైనట్లు తెలిసింది. నగర కమిటీ అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణయాదవ్ ను మార్చాలని హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమణలకూ ఈ విషయాన్ని తేల్చిచెప్పారని సమాచారం. దీంతో కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వీరంతా డుమ్మా కొట్టారు. ఆయనను మార్చేదాకా ఏ కార్యక్రమంలో పాల్గొనబోమని నాయకత్వానికి తేల్చి చెప్పారు. కీలకంగా భావిస్తున్న గ్రేటర్లో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా ఎలా ధర్నా నిర్వహించాలో, ఎలా విజయవంతం చేయాలో అర్థంకాక ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు. -
తెలంగాణలో టీటీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో వివిధ పథకాల కింద పెండింగ్‌లోని ఇళ్ల నిర్మాణాలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పరిశీలన చేయనున్నారు. కాగా, ఇప్పటివరకూ డబ్బులు కట్టినా ఇళ్లు మంజూరు కానివారు, ఇల్లు పూర్తైనా బిల్లులు రానివారితో వారు మాట్లాడనున్నారు. -
అలక పాన్పులు ... సిద్ధం చేయండి !
తెలంగాణ టీడీపీకి కాలం కలసి వస్తున్నట్లు లేదు. చివరకు సంస్థాగతంగా కూడా ఆ పార్టీ నేతలకు తలబొప్పి కడుతోంది. మహానాడు ముగిసినా, ఇప్పటికీ పార్టీ పదవులకు దిక్కూమొక్కూ లేదు. వారంలోగా కొత్త అధ్యక్షుడు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలని అధినేత ‘చంద్రం’ తేల్చారు. ఇంకేం, ఎవరికి వారు ఊహల ఊయలల్లో తేలిపోవడం మొదలు పెట్టారు. ఏ పదవి ఎవరికి ఖరారైపోయిందన్న సమాచారం అందుకున్న టీ టీడీపీలోని ఓ కీలక నేత అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఎలాగూ రాదని గట్టిగా నమ్ముతున్న ఆ నాయకుడు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టన్నా దక్కక పోతుందా అని ఆశపడ్డారు. సదరు నేతపై ఇప్పటికే ‘టీఆర్ఎస్ కోవర్టు’ అన్న ముద్ర ఉందాయే. దీంతో ఆయనకు ఆ పదవీ రాదని అంతా చెవులు కొరుక్కోక ముందే.. వర్కింగ్ ప్రెసిడెంట్ మంచివాళ్లకు ఇస్తే నాకే అభ్యంతరం లేదంటూ ముందు నుంచే నసగడం మొదలుపెట్టారు. అలా అంటున్నారంటే, అధినేత వద్ద మళ్లీ ఏదో టెండరు పెడతారని, లేదంటే అలక పాన్పు ఎక్కుతారని ‘తమ్ముళ్లు’ గుసగుసలు పోతున్నారు. అలక బూని సొంత పార్టీ అధ్యక్షుడ్ని బ్లాక్మెయిల్ చేసే నేతల సంఖ్య ఎక్కువగానే ఉందని, వీరందరికీ ఓ పది అలక పాన్పులు సిద్ధం చేయాల్సిందేనని చమత్కరిస్తున్నారు...!! -
టీడీపీ నేతల కోసం జూపల్లి ఎదురుచూపు
హైదరాబాద్ : భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఈ మేరకు టీడీపీ నేతల కోసం వేచి ఉన్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులోఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని, ఈ తేదీలు, సమయం అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి సిద్ధంగా ఉంటామని జూపల్లి పేర్కొన్నారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
తర్వాత ఎవరి వంతో..!
* ఓటుకు కోట్లు కేసులో టీటీడీపీ నేతల్లో గుబులు * సండ్ర అరెస్ట్‌తో నాయకుల బెంబేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను చూసి బెంబేలెత్తుతున్నారు. తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్టు చేయడం, కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఈ కేసుతో సంబంధాలు ఉన్న నేతలంతా తమ వంతు కూడా వస్తుందా అన్న భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో గడిపి షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని ఏసీబీ అరెస్టు చేసి విచారించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో తేలిపోయింది. సండ్రను ఏసీబీ విచారిస్తే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్‌రెడ్డిని ఇప్పటికే 2 పర్యాయాలు విచారించిన ఏసీబీ మరోసారి విచారణకు పిలవనుంది. ఆయనను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో టీడీపీలోని మరికొందరు నాయకులు ఆందోళనలో పడిపోయారు. తమ అభ్యర్థి గెలుపునకు అవసరమైన 2 ఓట్లకే పరిమితం కాకుండా, ప్రభుత్వాన్ని అస్థిర పరిచే వ్యూహంతో పెద్దఎత్తున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధపడిందన్న సమాచారం బయటకు పొక్కిన సంగతి తెలిసిందే. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల టీడీపీ నాయకులు కొందరు టచ్‌లోకి వెళ్లారని, కొందరికి డబ్బులు కూడా ముట్టాయని చెబుతున్నారు. ఇదే సమయంలో స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడడంతో మిగిలిన వారంతా జాగ్రత్త పడినా.. టీడీపీ నాయకులు పన్నిన వ్యూహంపై ప్రభుత్వం ఆగ్రహంగానే ఉందని, ఈ కేసుతో పరోక్ష సంబంధం ఉన్న వారినీ ఉపేక్షించరన్న వార్తలతో టీటీడీపీ నేతలకు వెన్నులో చలి మొదలైంది. సండ్ర తర్వాత వేం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేస్తారని, ఇక ఆ తర్వాత వంతు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. -
రాష్ట్రపతిని కలిసిన టీటీడీపీ నేతలు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల, పెద్దిరెడ్డి, మల్లారెడ్డి ప్రణబ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలోని పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ప్రణబ్‌కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో ప్రతిపక్షపార్టీలు ఉండకూడదనే కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. దాంతో ప్రణబ్ తామ ఇచ్చిన వినతిపత్రంపై సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో యాదగిరి గుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రమైన యాదాద్రిని రాష్ట్రపతి ప్రణబ్ ఆదివారం దర్శించుకున్న సంగతి తెలిసిందే. -
బాబు దబాయింపులకు భయపడం: హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు సెక్షన్ 8 అం టూ ఏపీ సీఎం చంద్రబాబు చేసే దబాయిం పులకు భయపడేదిలేదని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. చంద్రబాబు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటామన్నా, హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలంటున్నా.. తెలంగాణ టీడీపీ నేతలు రమణ, ఎర్రబెల్లి ఎందుకు నోరుమెదపటం లేదని ప్రశ్నించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌పై చం ద్రబాబు ఆటలు సాగనివ్వబోమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10 వేల కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలి పారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి పాల్గొన్నారు. -
'కూకట్ పల్లి ఎమ్మెల్యేపైనా వేటు వేయండి'
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని తెలంగాణ టీడీపీ నాయకులు కోరారు. శుక్రవారం టి.టీడీపీ నాయకులను స్పీకర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గతంలో చాలాసార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోరినట్టు చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈనెల 30లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో స్పీకర్ ను కలిసినట్టు వెల్లడించారు. ప్రోటోకాల్ విషయంలో అధికార పార్టీ నేతలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని స్పీకర్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రత్యేక దేశంగా భావిస్తున్నారని, రాజీనామా వర్తించదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. -
టీన్యూస్‌కు నోటీసులతో టీ.టీడీపీకి నష్టం!
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల కేసు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో టీ న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలంగాణలో పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు చంద్రబాబు వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం చంద్రబాబుతో సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, గరికపాటి మోహన్రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణలో ఏపీ ప్రభుత్వం, పోలీసులు జోక్యం వల్ల తమ మనుగడ కష్టమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఆంధ్ర పార్టీగా ముద్రపడ్డ టీడీపీ...రేవంత్ వ్యవహారంతో ఇబ్బందుల్లో పడిందని, ఇప్పుడు నేరుగా టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇవ్వడం వల్ల తెలంగాణలో చంద్రబాబు జోక్యం పెరిగిందనే ప్రచారం ఎక్కువవుతుందని, దాంతో సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ నేతలు టీడీపీని మరింత దెబ్బ కొడతారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోకుండా జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయిన నేపథ్యంలో ఎదురుదాడితోనే టీఆర్ఎస్ను దెబ్బకొట్టొచ్చని చెప్పినట్లు సమాచారం. టేపులు టీ న్యూస్‌కు ఎలా వచ్చాయో చెప్పాలని మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నించాలని బాబు ఆదేశించారని తెలిసింది. ఇక్కడ నష్టం జరిగినా ఏపీలో మేలు జరిగేలా వ్యవహరిస్తే కొద్దిరోజుల్లో సమస్య మరుగున పడుతుందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశానంతరం ఎర్రబెల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీవీ9, ఏబీఎన్ చానల్స్‌ను తెలంగాణలో మూసేసినప్పుడు లేని బాధ సీఎం సొంత చానల్‌కు నోటీసులు ఇస్తే వచ్చిందా అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసారాలు చేశారనే నోటీసులు ఇచ్చారని చెప్పారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్కు లేదన్నారు. -
టీ న్యూస్‌కు నోటీసులు ఉపసంహరించుకోండి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. టీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. నోటీసులు ఉపసంహరించుకోకపోతే జర్నలిస్టులతో తమకు ఇబ్బందులు ఎదురు అవుతాయని వారు చంద్రబాబుకు తెలిపారు. చంద్రబాబుతో ఈరోజు ఉదయం గరికపాటి రామ్మోహన్రావు, వేం నరేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా నిన్న అర్థరాత్రి టీ న్యూస్ ఛానల్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. -
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
-
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. శనివారం ఉదయం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఓటుకు కోట్లు సంబంధించి తాజా పరిణామాలను చర్చిస్తున్నట్టు సమాచారం. మొన్న ఏసీబీ విచారణకు హాజరయిన వేం నరేందర్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, వరుసగా తలెత్తుతున్న ఇబ్బందులు, భవిష్యత్ వ్యూహాలపై చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్ రెడ్డితో పాటు గరికపాటి రాంమ్మోహన్రావు, ఎర్రబెల్లి దయాకరరావు, కంభంపాటి తదితరులు చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు. -
8 జిల్లాలకు టీడీపీ అధ్యక్షుల నియామకం
హైదరాబాద్, వరంగల్‌పై పీటముడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం దాదాపుగా పూర్తయ్యింది. హైదరాబాద్, వరంగల్ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అవి మినహా మిగతా జిల్లాల అధ్యక్షుల పేర్లను ఆదివారం ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజించి తూర్పు, పశ్చిమలకు ఇద్దరు అధ్యక్షులను ప్రకటించారు. ఆదివారం చంద్రబాబు నివాసంలో తెలంగాణ నేతలు సమావేశమై ఏకాభిప్రాయం వ్యక్తమైన 8 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించాలని ఎన్నికల కన్వీనర్ ఇ. పెద్దిరెడ్డికి సూచించారు. హైదరాబాద్‌లో బీసీ వర్గానికి చెందిన కృష్ణయాదవ్ స్థానంలో మాగంటి గోపీనాథ్‌ను నియమిస్తే విమర్శలు వెల్లువెత్తుతాయోమోనన్న అనుమానాన్ని బాబు వ్యక్తం చేయగా, ఎమ్మల్యే సాయన్న అలాంటిదేమీ ఉండదని బాబుకు వివరించినట్లు సమాచారం. టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా వెలమ సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హన్మంతరావును నియమించినప్పుడు, కమ్మ వర్గానికి చెందిన గోపీనాథ్‌ను నియమించడం వల్ల ఎలాంటి సమస్య రాదని స్పష్టం చేసినట్లు సమాచారం. దాంతో ఓసారి కృష్ణయాదవ్‌తో మాట్లాడి గోపీనాథ్ పేరు ప్రకటించమని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. వరంగల్‌లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కలలో ఒకరికి అధ్యక్ష పదవి ఇప్పించాలని ఎర్రబెల్లి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. వారు అయిష్టంగా ఉండడంతో గండ్ర సత్యనారాయణను నియమించే అవకాశం ఉంది. టీడీపీ జిల్లాల అధ్యక్షులు వీరే.. ఆదిలాబాద్ తూర్పు: బోడ జనార్దన్, ఆదిలాబాద్ పశ్చిమ: లోలం శ్యాంసుందర్, నిజామాబాద్: అరికెల నర్సారెడ్డి, కరీంనగర్: సి.హెచ్. విజయరమణారావు, మెదక్: శశికళ యాదవరెడ్డి, రంగారెడ్డి: ప్రకాశ్ గౌడ్, మహబూబ్‌నగర్: బక్కని నర్సింహులు, నల్లగొండ: బిల్యా నాయక్, ఖమ్మం: తుళ్లూరి బ్రహ్మయ్య. ముమ్మరంగా మహానాడు ఏర్పాట్లు టీడీపీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు జరిగే మహానాడుకు గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణం సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాల్లోని 30 వేల మంది ప్రతినిధులను దృష్టిలో ఉంచుకొని సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా చంద్రబాబు, ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదిక కు మూడు వైపులా 100 టన్నుల సామర్థ్యంగల ఏసీలను ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. వందేమాతరం శ్రీనివాస్, రాఘవేంద్రరావు వీటిని పర్యవేక్షించనున్నారు. -
చంద్రబాబు వద్దకు
జిల్లా అధ్యక్షుల ఎన్నికల రగడ హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. సోమవారం హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉన్నా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ బాధ్యతను పార్టీ అధినేత చంద్రబాబుకే అప్పగిం చారు. ఆదివారం జరగాల్సిన నల్లగొండ అధ్యక్షుని ఎంపిక కూడా ఏకాభిప్రాయం లేక వాయిదా పడింది. హైదరాబాద్ లో ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్‌తోపాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోటీ పడుతుండగా మెజారిటీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, సీనియర్లు గోపీనాథ్‌నే నియమించాలని అభిప్రాయపడ్డారు. కానీ పార్టీ అధిష్టానం కృష్ణయాదవ్‌ను మార్చే విషయంలో సందిగ్ధంగా ఉంది. టీఆర్ఎస్లో చేరిన తలసానికి పోటీగా కృష్ణయాదవ్‌ను నియమించి 4 నెలలు కూడా కాలేదని, అప్పుడే మారిస్తే తప్పుడు సంకేతం పోతుందని భావిస్తోంది. మెదక్‌లో అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డితోపాటు బట్టి జగపతి, పట్నం మాణిక్యం, నరోత్తం పోటీ నెలకొంది. వరంగల్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కలలో ఒకరికి అప్పగించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రయత్నిస్తుండగా వారు అందుకు ఒప్పుకోవట్లేదు. భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణరావు ఆసక్తి చూపుతున్నా ఎర్రబెల్లికి ఇష్టం లేదని సమాచారం. -
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అంబేడ్కర్ జయంతి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంగళవారం అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సామాజిక న్యాయం కోసం తపించిన మహానేత అంబేడ్కర్ అని వారు కొనియాడారు. దళిత, వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. అనంతరం వారు ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, పార్టీ నేతలు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, సారంగపాణి, నైషదం సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
'కేసీఆర్ భూమి మీదకు వస్తారు'
హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. మంగళవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ఈసీ ప్రధాన కమిషనర్ ను కలవనున్నామని చెప్పారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారమిక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఫిరాయింపులపై స్పీకర్, మండలి చైర్మన్, గవర్నర్ లకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని వాపోయారు. హైకోర్టు నోటీసులు ఇచ్చినా లాభం లేకపోయిందని వాపోయారు. తలసాని సహా పార్టీ మారిన వారి విషయాన్ని రాష్ట్రపతికి వివరిస్తామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తే గాల్లో విహరిస్తున్న కేసీఆర్ భూమి మీదకు వస్తారని అన్నారు. చంద్రబాబును శిఖండి అనడం కేటీఆర్ స్థాయికి తగదన్నారు. ఫిరాయింపుల చర్యల విషయంలోస్పీకర్, ఛైర్మన్, గవర్నర్ లపై రాష్ట్రపతి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంపై హైకోర్టు నోటీసులు ఇచ్చినా కూడా లాభం లేకుండా పోయిందన్నారు. 43 శాతం ఫిట్ మెంట్ అని ప్రకటించిన ప్రభుత్వం.. తొమ్మిది నెలల బకాయిల విషయంలో ఉద్యోగులకు అన్యాయం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. రూ.1100 కోట్ల బకాయిలను బాండ్ల ద్వారా 5 ఏళ్లలో చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. -
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. వాస్తవానికి సోమవారమే ఢిల్లీ వెళ్లాలనుకున్న నాయకులకు హస్తినలో రాష్ట్రపతి అనుమతులు లభించకపోవడంతో ఒకరోజు వాయిదా పడినట్టు సమాచారం. -
వేటుపై లేటు!
-
'హరీశ్ రావు నడిపిస్తున్నారు...'
-
'హరీశ్ రావు నడిపిస్తున్నారు...'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో తమ సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్య తీసుకోవాలంటూ టీ.టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు...తెలంగాణ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఆ భేటీ అనంతరం ఎర్రబెల్లి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగింపు, శాసన మండలిలో ఎమ్మెల్సీల విలీన ప్రకటన, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.... అప్రజాస్వామికమన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నాలుగు సీడీలు ఉంటే వాటిలో ఒక సీడీని కటింగ్ చేసి చూపించారని ఎర్రబెల్లి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను కొట్టిన దృశ్యాలున్న సీడీనీ మాయం చేశారని ఆయన అన్నారు. ఆ నాలుగు సీడీలను గవర్నర్ పరిశీలించాలని తాము కోరామన్నారు. అసెంబ్లీని నడిపిస్తున్నది స్పీకర్ కాదని,శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. తమను సభ నుంచి సస్పెండ్ చేసిన రోజు స్పీకర్ తమకు మైక్ ఇచ్చి క్షమాపణ చెప్పాలని అడగలేదన్నారు. హరీశ్ రావే ...దయాకరరావుకి మైక్ ఇవ్వండి..క్షమాపణ చెప్పాలని ఆదేశించారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తు చేశారు. సభా నాయకుడి డైరెక్షన్లో స్పీకర్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. జాతీయ గీతాన్ని అవమానించినట్లు అయితే క్షమాపణలు కోరమని స్పీకర్ కోరాలని అన్నారు. అయితే స్పీకర్ కంటే ముందే హరీశ్ రావే డిమాండ్ చేశారన్నారు. ఈ విషయంపై గవర్నర్ జోక్యం చేసుకోకపోతే రాష్ట్రపతిని కలవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మండలిలో టీడీపీని విలీనం చేస్తున్నట్టు చెప్పిన బులెటిన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఎర్రబెల్లి చేశారు. మంత్రుల అవినీతి బట్టబయలు చేస్తామనే తమపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. -
'సస్పెన్షన్ ఎత్తివేసేలా చొరవ తీసుకోండి'
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో శుక్రవారం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి తమను సస్పెన్షన్ చేయటాన్ని వారు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి సభలోకి అనుమతించేలా చొరవ తీసుకోవాలని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసేందుకు అసెంబ్లీ నుంచి ఛలో రాజ్‌భవన్‌కు వెళ్లారు. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయ్యేవరకూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. -
క్షమాపణలు చెబుతాం.. అనుమతించండి
రెండోరోజూ కొనసాగిన టీ-టీడీపీ ఎమ్మెల్యేల నిరసన సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాము జాతీయగీతాన్ని అవమానించినట్లుగా భావిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, తమను సభకు అనుమతించాలని టీ-టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండోరోజు బుధవారం కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపించారు. తమనుసభ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నం, అరెస్టు కాగా, అంతకుముందు టీ-టీడీపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎర్రబెల్లి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలంతా శాసనసభ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరగా, రవీంద్రభారతి వద్దకు చేరుకోగానే పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. అరెస్టయిన వారిలో జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గాంధీ, రాజేందర్ రెడ్డి, ఎం. కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద ఉన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వారిని విడుదల చేశారు. -
'మామ, అల్లుడు ఏం సాధించుకు వచ్చారు?'
కరీంనగర్ : తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులకు ఆపార్టీ పెద్దపీట వేస్తుంటే... తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించటం లేదని ఆయన సూటిగా అడిగారు. టీడీపీ నుంచి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్...శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన మంగళవారమిక్కడ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందిపెడితే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్యాయాలు జరిగితే అడిగేందుకు తెలంగాణ టీడీపీ సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎడారిగా మారుతుంటే మామ, అల్లుడు మహారాష్ట్రకు వెళ్లి ఏం సాధించుకు వచ్చారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలను టీడీపీ సహించదని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను ప్రెస్ అకాడమీ చెర్మన్ అల్లం నారాయణ లాంటి ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించరని ఎర్రబెల్లి అన్నారు. -
తొమ్మిది నెలల్లో ఒరగబెట్టిందేమీ లేదు
- విద్యార్థులను తొక్కిపెడుతున్న సర్కార్ - రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శ - తూప్రాన్‌లో టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం తూప్రాన్: తెలంగాణ కోసం ఉద్యమిం చిన విద్యార్థులను టీఆర్ఎస్ సర్కార్ తొక్కేస్తోందని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావొస్తున్నా చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. కరువుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి తీరిక లేని సీఎం కేసీఆర్ దుబాయ్, ముంబై, సింగాపూర్లకు తిరుగుతున్నారని చెప్పారు. తండ్రి తర్వాత కుమారుడు కేటీఆర్ సైతం టూర్లు తిరుగుతూ.. సినిమా హీరోయిన్లతో క్యాట్‌వాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ పార్టీ స్పష్టంగా ఉందని తెలింగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభల్లో తీర్మానం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. మార్చి 3న అధినేత చంద్రబాబు కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఇదిలావుంటే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు టీడీపీ నేతలకు వినతి పత్రం అందజేశారు. ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.20 వేల కు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీటీసీ సభ్యుడు ఎక్కల్‌దేవ్ వెంకటేశ్‌యాదవ్ వినతి పత్రం సమర్పించారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి, నాయకులు ఏకే గంగాధర్, బట్టి జగపతి, బక్కి వెంకటయ్య, నరోత్తం, జైపాల్, నాయకులు కిష్టారెడ్డి, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు. -
పార్టీని మీరే కాపాడాలి..
చంద్రబాబుకు టీడీపీ తెలంగాణ నేతల వేడుకోలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జిల్లాల వారీగా ఖాళీ అవుతున్న నేపథ్యంలో పార్టీని కాపాడాల్సిన బాధ్యతను నేతలు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకే వదిలేశారు. ఏరోజు ఏ నాయకుడు టీడీపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకుంటాడో తెలియని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారు. తెలంగాణలో పార్టీని కాపాడాలంటే ఇక్కడి పది జిల్లాల మీద కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. సమైక్యవాదులుగా పేరు పొంది... కేసీఆర్‌ను బహిరంగంగా తిట్టిన నాయకులను కూడా టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రులను చేస్తూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇలా తెలంగాణలో తెలుగుదేశం ఉండదనే సంకేతాలను పంపిస్తుండడంతో టీడీపీ ఖాళీ అవుతోందని చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. కొందరు నాయకులు పోయినా ప్రజల్లో ఇంకా టీడీపీ మీద అభిమానం ఉందని, కేసీఆర్ మైండ్‌గేమ్‌కు లొంగవద్దని నేతలకు చంద్ర బాబు సూచించారు. పదిరోజులకోసారి తెలంగాణలోని ఒక్కో జిల్లాలో పర్యటిస్తానని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారిలో ధైర్యాన్ని నింపుతానని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వరంగల్ నుంచి ఈ పర్యటన ప్రారంభించే అవకాశం ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య చంద్రబాబుతో జరిగిన ఈ సమావేశానికి హాజరు కాలేదు. టీఆర్ఎస్లోకి టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సహా విద్యార్థి, యువ నేతలు టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద వారు సమావేశమయ్యారు. చంద్రబాబు విధానాలకు నిరసనగా పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించారు. -
ఆ ఓటమి పార్టీది కాదు: టీ టీడీపీ
సాక్షి, హైదరాబాద్: ‘కంటోన్మెంట్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగినవి కావు. అధికార పార్టీ వార్డుకు ఇద్దరేసి మంత్రులను దింపి అధికార దుర్వినియోగం చేసింది. ఈ ఫలితాలు పార్టీకి సంబంధించినవి కావనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలి’ అని టీడీపీ తెలంగాణ నేతలు సమర్థించుకున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు, ఎన్టీఆర్ వర్ధంతి గురించి చర్చించేందుకు ఎల్.రమణ అధ్యక్షతన శుక్రవారం ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని వీడనున్న గ్రేటర్ నాయకులు, ఇతర జిల్లాల నేతల గురించి చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
'అవి' కేసీఆర్ హత్యలే
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అన్నీ సీఎం కేసీఆర్ చేసిన హత్యలేనని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వైఖరిపై వారు మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ తెప్పిస్తామన్న గతంలో కేసీఆర్ చెప్పి... మాట తప్పారని వారు విమర్శించారు. అందువ్లలే రైతుల ఆత్మహత్యలు జరిగాయిని విమర్శించారు. కరెంట్ లేక పంటలు ఎండిపోవడం, లేదా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి, మోత్కుపల్లి వివరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో రాష్ట్రంలో 325 మంది రైతులు చనిపోయినట్లు జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని... కాని ఆ సంఖ్యను కేసీఆర్ 69కి కుదించారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. లక్షన్నర నష్టపరిహారం అందించారన్నారు. కేసీఆర్ సర్కార్ కనీసం ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి, మోత్కుపల్లి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో పార్టీలు బుధవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సర్వశిక్ష అభియాన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, ఎన్హెచ్ఆర్సీ నోటీసు అంశంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఐకేపీ, అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై వైఎస్ఆర్ సీపీ, సిరిపూర్ కాగజ్ నగర్, వరంగల్ బిల్డ్ పరిశ్రమ మూసివేతపై సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. -
టీటీడీపీ నేతలు రాష్ట్ర ద్రోహులు: హరీశ్‌రావు
అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నవారిని ఆదుకోరా ఎన్టీఆర్ చరిత్రలో చంద్రబాబు వెన్నుపోటుకో పేజీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా గోరంతలను కొండంతలుగా ప్రచారం చేస్తూ టీటీడీపీ నేతలు రాష్ట్ర ద్రోహానికి పాల్పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంపా గోవర్ధన్, చింతా ప్రభాకర్, బాలరాజుతో కలసి అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను భూతద్దంలో చూపించారు. తెలంగాణలో ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ. 50 వేల చొప్పున టీడీపీ నేతలు ఇచ్చిండ్రు. అనంతపురంలో రోజుకు ముగ్గురు రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అనంతపురంలో మృత్యుఘోష టీడీపీకి వినిపించదా? వారిని ఎందుకు పట్టించుకోరు? అనంతపురం రైతులకు ప్రభుత్వం తరఫున, పార్టీ తరపున పరిహారం ఎందుకివ్వరు? తెలంగాణలో శవరాజకీయాలు చేయడానికే నష్టపరిహారం ఇస్తున్నరా? కరెంటు చార్జీలపై ప్రశ్నిస్తే రైతులను కాల్చిచంపిన చరిత్ర టీడీపీది. శవాల పేరుతో రాజకీయాలు తప్ప రైతులపై ఆ పార్టీకి ప్రేమలేదు’ అని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్టీఆర్ పేరును తెలంగాణలోని విమానాశ్రయానికి పెట్టాలని కొట్లాడటం పెద్దమోసమన్నారు. గొడ్డుకన్నా ఘోరం, గాడ్సేకన్నా హీనం అని చంద్రబాబును ఎన్టీఆర్ స్వయంగా తిట్టిన విషయం ఓసారి గుర్తుతెచ్చుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు అదే ఎన్టీఆర్ పేరును పెట్టాలని అడగడం రాజకీయ దిగజారుడుతనం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే సీమాంధ్రలో పాఠ్యాంశంగా చేర్చాలని సవాల్ చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరిస్తే చంద్రబాబు వెన్నుపోటు గురించి ఒక పేజీ ఉంటుందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సభ ముందుకు డీఎల్ఎఫ్ ఫైలు.. శాసనసభ ముందు డీఎల్ఎఫ్కు సంబంధించిన ఒరిజినల్ నోట్‌ఫైల్స్ పెట్టినట్టుగా హరీశ్‌రావు తెలిపారు. ఇలాంటి పారదర్శకమైన ప్రభుత్వం ఇప్పటిదాకా ఎక్కడా లేదన్నారు. గతంలో విద్యుత్ పీపీఏలకు సంబంధించిన ఫైలును సభ ముందు పెట్టాలని అడిగితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సభను వాయిదా వేసుకుని పారిపోయాడని ఎద్దేవా చేశారు. -
మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి
-
మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మెట్రో వివాదం, మై హోం భూముల కేటాయింపుల అంశాన్ని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారంపై ఆయన సుమారు 50 పేజీల సమగ్ర నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను శాసనసభ స్పీకర్‌తో పాటు, శాసన సభ్యులకు.. రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. దీనిపై సభలో చర్చ జరగాలని ఆయన పట్టుబడుతున్నారు. చర్చ సందర్భంగా తనను సభలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అంశాన్ని తెలంగాణ టీడీపీ సభ్యులు సోమవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే అప్రజాస్వామికంగా దాడికి ఉసిగొల్పడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వంలోని లోపాలు ఎత్తిచూపితే రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించటం విచారకరమన్నారు. దీనిపై విచారణ జరిపి సభ్యులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. -
‘టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రా ఏజెంట్లు’
నాగర్‌కర్నూల్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రా ఏజెంట్లుగా, చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని ఆయన ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర వహించాల్సిన తెలంగాణ టీడీపీ నేతలు ఆంధ్రా నాయకుల తాబేదార్లుగా పనిచేస్తున్నారని, ప్రజలు చెప్పులతో కొట్టి తెలంగాణ నుంచి తరిమివేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే మాకు అవకాశం వస్తుందని కొన్ని పార్టీలు గుంటకాడి నక్కల్లా కాచుక్కూర్చున్నారని, ఆ కల నెరవేరబోదన్నారు. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు, చెరువులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి వారికీ అందిస్తామని, అర్హులై ఉండి రాని వారు తనను సంప్రదిస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. -
తెలంగాణ కార్యకర్తలకు అండగా ఉంటా: సుజనా
విశాఖపట్నం: తెలంగాణలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. సెంటిమెంట్ వల్లే తెలంగాణలో టీడీపీలో ఓడిపోయిందన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీయిచ్చారు. తెలంగాణ నాయకుల కోసం కార్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పారు. సుజనా చౌదరిని ఆయన నివాసంలో శుక్రవారం టీడీపీ నాయకులు సన్మానించారు. తెలంగాణలో కార్యకర్తలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణలో అసమర్థ సీఎం ఉన్నందువల్లే కరెంట్ కష్టాలు వచ్చాయని విమర్శించారు. -
సీఎం హిట్లర్‌కన్నా హీనం
* విపక్షాల గొంతు నొక్కేస్తున్నారు: ఎర్రబెల్లి * సభ కేసీఆర్ కుటుంబ అసెంబ్లీగా మారిపోయిందని విమర్శ * రేవంత్ వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం * టీ సర్కార్ తప్పులు బయటపడతాయనే టీడీపీ సభ్యుల సస్పెన్షన్ * ప్రభుత్వంపై, స్పీకర్‌పై త్వరలో అవిశ్వాసం పెడతామని వెల్లడి హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె తప్పును విపక్షం ప్రశ్నిస్తే.. అధికారపక్షం ఎదురుదాడికి దిగడం సరికాదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ వద్ద ఆందోళన చేసి, అరెస్టైన అనంతరం గోషామహల్ పోలీస్‌స్టేషన్ వద్ద ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత సమగ్ర సర్వేలో రెండుచోట్ల తన పేరు నమోదు చేసుకున్నారని తమ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలను సైతం స్పీకర్‌కు సమర్పించామని, ఆ వ్యాఖ్యలు తప్పని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ కేసీఆర్ కుటుంబ అసెంబ్లీగా మారిందని... విపక్షాలు ఏ శాఖకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తినా... కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావులే సమాధానాలు చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని.. టీఆర్ఎస్కు ఎందుకు ఓటేశామా? అని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హిట్లర్ కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే అధికారపక్షం నోరునొక్కేస్తోందని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ సీఎం హయాంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని మండిపడ్డారు. సర్వేలో కేసీఆర్ కుమార్తె రెండుచోట్ల పేరు నమోదు చేసుకుందని పేర్కొంటే... మహిళల హక్కులను కాలరాస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేశారని విమర్శించారు. మరి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగినా మంత్రులు, ఎమ్మెల్యేలు పెదవి విప్పలేదేమని ప్రశ్నించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ ఎమ్మెల్యేలను వారం పాటు సస్పెండ్ చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. అసెంబ్లీలో ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు విధానాలు, అవినీతి బయటపడుతుందన్న భయంతోనే అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. దీనిపై శుక్రవారం గవర్నర్‌ను కలిసి విన్నవిస్తామని.. రుజువు కోసం అసెంబ్లీ సమావేశాల వీడియో క్లిప్పింగ్‌లను ఆయనకు సమర్పిస్తామని పేర్కొన్నారు. -
వారు ఏపీ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలా?: కేటీఆర్
టీడీపీ సభ్యులపై కేటీఆర్ విసుర్లు సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీకి ఆంగ్లో ఇండియన్స్‌ను నామినేట్ చేసిన తరహాలో ఆంధ్రప్రదేశ్ కొందరిని నామినేట్ చేసినట్టుంది. వారే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు. సభలో వారి తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది’ అని మంత్రి తారకరామారావు చేసిన వ్యాఖ్య సభలో కాసేపు దుమారం లేపింది. టీఆర్ఎస్ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ ప్రసంగిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు కరెంటు రాకుండా చేస్తున్నారని ఈశ్వర్ ఆరోపిస్తున్నపుడు టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయనకు, టీడీపీ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని, దేశం సభ్యులకు కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ కరెంటు కష్టాలకు సంబంధించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేం దుకు నిన్న సభలో చేసిన తీర్మానంలోని మాటలనే ఈశ్వర్ ఉటంకించారు. అందులో వివాదమేమీ లేదు. ఆ తీర్మానానికి టీడీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. వారి తీరు చూస్తుంటే ఆంగ్లోఇండియన్లను అసెంబ్లీకి నామినేట్ చేసిన తరహాలో ఆంధ్రప్రదేశ్ వీరిని నామినేట్ చేసిందేమోననిపిస్తోంది’ అన్నారు. -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టీటీడీపీ ధర్నా
హైదరాబాద్ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ తెలంగాణ టీడీపీ సోమవారం గన్‌పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కారే కారణమని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. కరెంట్ కోతలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కార్ సహకరించకపోవటం వల్లే సీసీఐ, పత్తిని కొనుగోలు చేయలేకపోతోందన్నారు. మొక్కజొన్నలను కొనుగోలు చేయటంలో మార్క్‌ఫెడ్ విఫలం అయ్యిందని ఎర్రబెల్లి విమర్శించారు. వరికి కూడా మద్దతు ధర లభించటం లేదన్నారు. మార్కెట్ యార్డ్‌లో రైతుల కష్టాలను పరిష్కరించటంలో మంత్రి హరీష్ రావు విఫలమయ్యారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎకరానికి రూ.30వేలు చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. విపక్షాలు నిరసనలతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు రైతుల ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం చర్చిద్దామని స్పీకర్ సూచించినా విపక్ష సభ్యులు పట్టువీడలేదు. తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు తమ పట్టువీడలేదు. దాంతో సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినా విపక్షాలు నిరసన కొనసాగించారు. దాంతో స్పీకర్ సభను మరోసారి పదినిముషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగారు. దాంతో సభకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఒక్క రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు ప్రతిపాదించగా స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం ప్రారంభమైన సభలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. బడ్జెట్‌పై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాట్లాడిన తర్వాత స్పీకర్ మధుసుదనా చారి సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు. -
గన్‌పార్క్ వద్ద టీ.టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపనాథ్, అర్కే గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, రాజేందర్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులు హాజరైయ్యారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారంను బర్త్‌రఫ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అవి రైతుల ఆత్మహత్యలు కాదు.. సర్కారీ హత్యలేనని టీ టీడీపీ నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందిగా టీటీడీపీ నేతలు తెలంగాణ సర్కార్ ను డిమాండ్ చేశారు. -
గన్‌పార్క్ వద్ద టీ.టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా
-
సభలో నిలదీస్తాం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ టీడీపి నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఇప్పటివరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమావేశాలు నిర్వహించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ** -
ముందు చంద్రబాబును నిలదీయండి: కేటీఆర్
టీ టీడీపీ నేతలకు కేటీఆర్ హితవు సాక్షి, న్యూఢిల్లీ : శ్రీశైలం నుంచి విద్యుత్ రాకుండా అడ్డుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడనీ, ముందుగా మీ నేతను నిలదీయండని తెలంగాణ ఐటీ మంత్రి కె. తారకరామారావు టీ-టీడీపీ నేతలను కోరారు. అత్యుత్తమ మౌలిక వసతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు ‘ఇండియా టుడే’ అందజేసిన అవార్డును మంత్రి కేటీఆర్ శుక్రవారం స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడంలేదని, రైతాంగాన్ని ఆదుకోవాలని టీటీడీపీ నేతల బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయమై ప్రస్తావించగా.. ‘తెలంగాణను అంధకారంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్న చంద్రబాబును నిలదీసి, అనంతరం ఢిల్లీకి వచ్చి విజ్ఞప్తిచేస్తే అర్థం ఉంటుందని టీటీడీపీ నేతలకు సూచిస్తున్నా’ అని అన్నారు. వెంకయ్య, రవిశంకర్ ప్రసాద్‌లకు వినతులు: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, ఐటీ, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలిసి తెలంగాణలో ఐటీ, పట్టణాభివృద్ధికి కేంద్రం సహకరించాలని వినతి పత్రాలను అందచేసినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరానన్నారు. -
'టీటీడీపీ నేతలు చిల్లరవేషాలు మానుకోవాలి'
న్యూఢిల్లీ: కృష్ణపట్నం, లోయర్ సీలేరులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎందుకివ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ... విద్యుత్ విషయంలో టీటీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చి విజ్ఞప్తి చేయకుండా... చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. ఇకనైనా చిల్లర వేషాలు మానుకోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా ఇప్పించాలని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రవిచంద్ర ప్రసాద్‌లకు కలసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే తెలంగాణకు సహకరించాలని కూడా కోరినట్లు... అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కరెంట్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా జవాబు చెప్పలేదని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఏపీ ప్రభుత్వం నుంచి ఏ తప్పూ జరగలేదు:ఎర్రబెల్లి
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం నిర్వహించాలని టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులతోపాటు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నాయకులు గురువారం ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.దీనిలో భాగంగానే ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి తప్పూ జరగలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒకవేళ ఆ ప్రభుత్వం నుంచి పొరపాట్లు జరిగి ఉంటే ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. అలా చేస్తే తామే ఏపీ సర్కారును నిలదీస్తామన్నారు. కరెంటు, రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నివేదక అందలేదని కేంద్ర మంత్రులు తెలిపినట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపి రైతులను ఆదుకోవాలని తెలిపారు. -
నేడు ఢిల్లీకి టీటీడీపీ ప్రతినిధి బృందం
హైదరాబాద్: గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతల ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో రైతుల సమస్యలను హస్తిన పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు 15 రోజులుగా చేస్తున్న ప్రయత్నం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ల ఖ రారుతో ఫలించినట్లయింది. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ గురువారం సాయంత్రం వరకు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ‘సాక్షి’కి తెలిపారు. రమణ, టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులతోపాటు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నాయకులు గురువారం ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించి కేంద్ర సహకారం కోరాలని నిర్ణయించారు. -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించరా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎల్.రమణ, ఎర్రబెల్లి హైదరాబాద్: వర్షాభావం ఒకవైపు, కరెంటు కోత మరోవైపుతో అష్టకష్టాలు పడి రైతులు పండించిన కొద్దిపాటి పంటకైనా ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేకపోతోందని, సీసీఐ, మార్క్‌ఫెడ్‌ల ద్వారా పత్తి, మొక్కజొన్న, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తానని కరపత్రాలు పంచిన మంత్రి హరీష్‌రావుకు వాస్తవ పరిస్థితి తెలియడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. బుధవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల కరెంటు, సాగునీరు లేక అధిక శాతం పంటలు ఎండిపోయాయని, మిగిలిన పంటలను అమ్ముకుందామన్నా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని వారు విమర్శించారు. పేదల తరఫున ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెడలు వంచైనా అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు ఇప్పిస్తామని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి అన్నారు. పింఛన్ల కోత, రేషన్‌కార్డుల ఏరివేతను నిరసిస్తూ జూబ్లీహిల్స్ నియోజక వర్గం టీడీపీ బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఖైరతాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. -
ఇరు రాష్ట్రాల సీఎంలను పిలిచి కరెంట్ సమస్య పరిష్కరించండి
గవర్నర్‌కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల వినతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరెంట్ సంక్షోభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థతే కారణమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. విద్యుత్ ఇవ్వకుండా పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకు కూడా ముందుకు రావడం లేదని విమర్శించారు. శుక్రవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, సండ్ర వెంకటవీరయ్య, గాంధీ, కృష్ణారావు, నేతలు మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎం.ఎన్. శ్రీనివాస్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగం కరెంటు సమస్యతో సతమతమవుతున్నదని, పల్లెల్లో వ్యవసాయానికి మూడు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చే సినట్టు తెలిపారు. విద్యుత్ ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, సర్కార్ తన చేతగాని తనాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేసే ప్రయత్నం చేస్తూ దాడులకు దిగుతున్నదని వారు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని వారు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మూడేళ్లయినా కరెంటు రాదని ఒప్పుకున్నారని విమర్శించారు. కరెంట్ కష్టాలకు కారణమైన కేసీఆర్ చంద్రబాబుపై ఆ నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి కరెంటు సమస్య పరిష్కరించాలని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని గవర్నర్‌ను కోరినట్టు వివరించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి రెచ్చగొట్టడం వల్లనే నల్లగొండలో టీడీపీ ఆఫీసుపై దాడిచేశారని, జగదీశ్వర్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దగ్గరుండి దాడులు చేయించిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, టీడీపీ నేతలను హత్య చేయించేందుకు టీఆర్ఎస్ నేతలు వెనుకాడడం లేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కారును ఎండగట్టండి టీ టీడీపీ నేతలతో బాబు తెలంగాణలో ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే విద్యుత్ సమస్య తీవ్రమైందని.. దీనికి కేసీఆరే పూర్తిగా బాధ్యుడని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ ప్రభుత్వ పాలన సాగుతుందని, తెలంగాణకు అన్యాయం చేసే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణ నేతలతో చంద్రబాబు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల గురించి ఈ సందర్భంగా నేతలతో చర్చించారు. వర్షాలు లేవని తెలిసి కూడా రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేయకపోవడం వల్లే తెలంగాణలో సంక్షో భం తీవ్రరూపం దాల్చిందని బాబు టీటీడీపీ నేతలకు చెప్పారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి పేరుతో రాజకీయం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం టీడీపీ నేతలపై ఉందని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్పై తెలంగాణ టీడీపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ దాడిపై వారు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని వారు ఆరోపించారు. ఈ అంశంతో పాటు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని, ఇరు రాష్ట్రాల సీఎంలను సమావేశపరిచి విద్యుత్‌తో పాటు నీటి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ టీడీపీ నేతలు... గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ముందు విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సూచించారు. దాడులతో సమస్యలు పరిష్కారం కావని మోత్కుపల్లి అన్నారు. -
రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... యాత్రల పేరిట కాంగ్రెస్, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీ.టీడీపీ నేతలు బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే భవిష్యత్తులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు. -
రైతులకు అండగా ఉండేందుకే బస్సు యాత్ర
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల బస్సు యాత్ర శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయం నుంచి ఈ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ మాట్లాడుతూ వ్యవసాయానికి కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేదన్నారు. రైతులకు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీసేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. -
బాబుకు భారీ షాక్
-
చంద్రబాబును కలిసిన తెలంగాణ టీడీపీ నేతలు
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు గురువారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఏపీ సచివాలయంలో కలిశారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో వీరంతా బాబును కలిసి తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. కాగా తెలంగాణలో రైతులకు అండగా ఉన్నామనే విశ్వాసం కలిగించేలా బస్సు యాత్ర నిర్వహించాలని చంద్రబాబు ఆపార్టీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే బస్సు యాత్రకు ముందే ...ఆ పార్టీ నేతలు కారు యాత్రతో ఆ పార్టీకి ఝలక్ ఇవ్వటం విశేషం. -
10, 11, 12 తేదీల్లో టీటీడీపీ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ ఈ నెల 10, 11, 12 తేదీల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఇ.పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు, చాడ సురేష్‌రెడ్డి, బిల్యానాయక్ తెలిపారు. మంగళవారమిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారులో చలనం లేదని ధ్వజమెత్తారు. రైతులకు అండగా నిలిచేందుకు 10న నల్లగొండ జిల్లా, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్లో చేర్చుకోవడమే పాలన అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అనాలోచిత విధానాల వల్లనే రైతులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ జిల్లా పాలకుర్తిలో విమర్శించారు. ప్రతిపక్షాలపై అనవసర విమ ర్శలు మానుకోవాలన్నారు. మార్క్‌ఫెడ్, సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. -
ద్రోహులమంటూ యాత్ర చేస్తారా?
తెలుగుదేశం పార్టీ నేతలకు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేతలపై టీఆర్ఎస్ మంత్రులు, నేతలు మండిపడ్డారు. మంగళవా రం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల బస్సు యాత్రపై కస్సుబుస్సు అయ్యారు. తెలంగాణ ద్రోహులం, చంద్రబాబుకు తాబేదారులమంటూ బస్సుయాత్ర చేస్తారా అని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘కరెంటు చార్జీలను తగ్గించాలని అడిగితే.. ప్రజల్ని పిట్టలను కాల్చినట్టుగా చంపి, బ్యాంకు లోన్లు తీసుకున్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టించిన చంద్రబాబు చరి త్రను యాత్రలో మీరు వివరిస్తారా’ అని నిల దీశారు. తెలంగాణలో కరెంటు కొరతకు చంద్రబాబు, కాంగ్రెస్ కారణమని విమర్శించారు. రేవంత్‌ను బజారుకీడుస్తాం.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతిని బయటపెట్టి, బజారుకీడుస్తామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ కొరత, ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాల గురించి చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదన్నారు. ప్రతిపక్షాలవి అర్థంలేని విమర్శలు వరంగల్: కాంగ్రెస్, టీడీపీ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణకు విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు. తెలంగాణలో టీడీపీ ఉంటే.. విద్యుత్ ఇవ్వు కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉంటే, తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. యూనిట్‌కు రూ.14 ఖర్చుచేసైనా కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. ఎర్రబెల్లిని టీఆర్ఎస్లోకి రానివ్వం వరంగల్: టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయా కర్రావును టీఆర్ఎస్లోకి రానివ్వబోమని ఆ పార్టీ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. మంగళ వారం ఇక్కడ జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న పార్టీలు ఎటూ పాలుపోక విమర్శలు చేస్తున్నాయన్నారు. -
బాబుతో టీటీడీపీ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. సోమవారం సచివాలయం ఎల్ బ్లాకు ఎనిమిదో అంతస్తులోని చంద్రబాబు కార్యాలయంలో 45 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. టీటీడీపీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలపై ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే అంశాలపై చంద్రబాబు అసలు ప్రస్తావించనే లేద ని, ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా ఎలా వ్యవహరించాలనే విషయంపైనే చర్చించామని ఆర్.కృష్ణయ్య మీడియాకు వెల్లడించారు. బీసీల సమస్యలపై పోరాటమే తనకు ప్రాధాన్యత అం శమని, చంద్రబాబుకు ఇదే విషయాన్ని చెప్పానన్నారు. రాష్ట్రం విడిపోతే కరెంటు సమస్య వస్తుందని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆనాడే చెప్పారని, అయితే, తాను సీఎం కాగానే కరెంటు సమస్య పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడేం చేయలేకపోతున్నారని విమర్శించారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సీఎం, మంత్రుల్ని కలిస్తే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాదని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారానికి టీడీపీ ఎమ్మెల్యేలంతా బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. -
కేసీఆర్‌కు చేతగాకే బాబుపై విమర్శలు: వివేక్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు చేతగాకే చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ సమస్యకు కారణమైన కాంగ్రెస్‌ను వదిలేసి టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేయటం సరికాదని వివేక్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడరని ఆయన స్పష్టం చేశారు. కాగా రాత్రి ఏడు గంటలకు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు మరోసారి భేటీ కానున్నారు. టీ.టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో పాటు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. అలాగే టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. -
తమ్ముళ్లకు 'మైండ్ మసాజ్'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో 'ఆ ఆనందం' మూడు నాళ్ల ముచ్చటగా మారింది. ఓ వైపు రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు, మరోవైపు జారుకుంటున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహారంతో బాబుగారికి కునుకు కరువైంది. టీఆర్ఎస్ ఆకర్షణ మంత్రంలో పడి తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు ఒక్కొరుగా కారు ఎక్కేస్తున్నారు. దీంతో ఆ రెండు కళ్ల సిద్దాంతకర్తకు ఏటు వైపు చూడాలో అర్థం కాక తెగ సతమతమైపోతున్నాడు. రాజధాని ఏర్పాటుపై ఓ కమిటీ వేసి ఆ సంగతి మంత్రి వర్గానికి అప్ప చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ తెలంగాణలో తెలుగు తమ్ముళ్ల గోడ దూకూళ్లను అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పటికే 30 ఏళ్లుగా తనతో పార్టీతో అనుబంధం ఉన్న తుమ్మల చటుక్కున కారు ఎక్కెశారు. దీంతో సదరు జిల్లాలో సైకిల్ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదంలో పడింది. వరంగల్ జిల్లాకు చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి కూడా రేపోమాపో కారు ఎక్కేస్తారంటూ ప్రచారం జరిగింది. తాను అసలు తెలంగాణ సీఎం కేసీఆర్‌నే కలవలేదని సదరు తమ్ముడు చెప్పాడు. దీంతో అర్థరాత్రి కేసీఆర్‌ను కలసిన ఎర్రబెల్లి అంటూ మీడియా రచ్చరచ్చ చేయడంతో సదరు తమ్ముడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌ను కలిసిన మాట వాస్తవమే కానీ అర్థరాత్రి కాదు సాయంత్రం అంటూ చెప్పిన తప్పును మీడియా సాక్షిగా కరెక్ట్ చేసుకున్నారు. అలాగే సనత్‌నగర్ ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.శ్రీనివాసయాదవ్ పార్టీ సమావేశాలకే హాజరుకావడం లేదు. దీంతో ఆయన మానసికంగా ఎప్పుడో కారు ఎక్కేశారని ఇప్పటికే తమ్ముళ్లు చెవ్వుల్లో చెప్పుకుంటున్నారు. అదికాక గ్రేటర్ ఎన్నికలు ఆగమేఘాలపై దూసుకు వస్తున్నాయి. దీంతో ఇక ఉపేక్షిస్తే తెలంగాణలో కారు దెబ్బకు సైకిల్ నుజ్జునుజ్జుకాక తప్పదని భావించిన చంద్రబాబు రంగంలోకి దిగి తమ్ముళ్లను బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. అందులోభాగంగా గులాబీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో బాబు మంగళవారం భేటీ అయ్యారు. పార్టీలో మాంచీ ప్రాధాన్యమున్న పోస్ట్ అప్పగిస్తామంటూ బాబు తీగలకు భరోసా కూడా ఇచ్చారు. కానీ కారు ఎక్కెందుకు తీగల ఉన్నట్లు సమాచారం. కార్యకర్తులు, అభిమానులతో మాట్లాడి చెబుతానని అన్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లకు ప్రతిరోజు కౌన్సిలింగ్ ఇస్తూ... మీకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికలే కాదు... 2019 నాటికి తెలంగాణలో టీడీపీ అధికారంలోకి తీసుకురావాలి... తీసుకువద్దాం అంటూ తమ్ముళ్ల మైండ్ మసాజ్ చేస్తున్నారు. కానీ బాబుగారి కలలను తమ్ముళ్లు నిజం చేస్తారో లేదో కాలమే చెప్పాలి. కాదు కాదు పచ్చ తమ్ముళ్లే చెప్పాలి. -
తక్షణమే అసెంబ్లీని సమావేశపరచండి
హైదరాబాద్ : అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం గవర్నర్‌ను కలిశారు. భేటీ అనంతరం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ తమ విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. అక్రమ భూ బదలాయింపులు కూడా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. రైతాంగ, విద్యుత్, విద్యార్థి, సంక్షేమ సమస్యలతో తెలంగాణ ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఎల్ రమణ అన్నారు. మెట్రో అలైన్మెంట్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఆటంకంగా మారిందన్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాలే వేదిక అన్నారు. అఖిలపక్ష భేటీలోనే అన్ని నిర్ణయాలన్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఎల్ రమణ ఆరోపించారు. వెంటే అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. -
రాజకీయ కక్షలను ఎదుర్కొందాం!
-
టిడిపి ఎమ్మెల్యేలకు బెదిరింపులు:బాబుకు మొర!
హైదరాబాద్: తమకు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద మొరపెట్టుకున్నారు. తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. వారి భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. పార్టీ మారాలంటూ తమపై ఒత్తిడి ఎక్కువైందని వారు తమ నేతకు తెలిపారు. స్వయంగా మంత్రులే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరకపోతే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని వారు తమగోడు వెళ్లబోసుకున్నారు. దేనికీ భయపడవలసిన అవసరంలేదని వారికి చంద్రబాబు అభయం ఇచ్చారు. రాజకీయ వేధింపులను రాజకీయాలతోనే ఎదుర్కొందామన్నారు. ఏపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటాయని వారికి చెప్పారు. మెట్రో విషయంలో వెనక్కి తగ్గవలసిన అవసరంలేదన్నారు. ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లండని వారికి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ** -
సైకిల్ కంటే షి'కారే' బాగుంటది
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన టీఆర్ఎస్ అందులో సఫలీకృతమైంది. అంతేకాకుండా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మెజార్టీ సాధించి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడితో ఆగకుండా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలను మట్టికరిపించి 'కారు' ఒక్కటే 'షికారు' చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ఆకర్షణ మంత్రాన్ని మొదలు పెట్టింది. ఆ దిశగా కారు హైస్పీడ్‌తో దూసుకుపోతుంది. మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎక్కించుకున్న కారు.... అదే వేగంతో ఖమ్మం జిల్లాలో ప్రవేశించింది. ఆ జిల్లాలో పచ్చ పార్టీ ముఖ్యనేత అయిన తుమ్మల ఆయన అనుచరగణంతో సైకిల్‌ను 'కిల్' చేయించి మరీ కారు ఎక్కించుకుంది. అక్కడితో ఆగకుండా రెట్టించిన ఉత్సాహంతో కారు ముందుకు దూసుకుపోయి... ఆ పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. సైకిళ్లు దిగి వస్తే మంత్రి పదవి ఇచ్చి కారులో షికారు చేయిస్తానంటూ ఆ పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్లను ఊరించారు. దీంతో జిల్లాలోని టీడీపీకి చెందిన ఎర్రబెల్లితోపాటు పలువురు ముఖ్యనాయకులంతా కారు ఎక్కెందుకు రంగం సిద్దమైందని సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కారు తన ఆకర్షణ మంత్రంతో తనవైపునకు తిప్పుకుంది. దసరా పండగ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. సదరు ఎమ్ఎల్ఏలంతా ఆ వేదికగా కారులో షికారు చేయనున్నారు. కారు మొదలుపెట్టిన ఆకర్షణ మంత్రంతో సైకిల్, కాంగ్రెస్ పార్టీలు కంగారుపడిపోతున్నాయి. కారు దెబ్బకు ఇప్పటికే ఐదు జిల్లాలలో సైకిల్, హస్తం గల్లంతయాయి. కారు తర్వాత ఏ జిల్లాలో ప్రవేశిస్తుందోనని పచ్చ పార్టీ నాయకులతోపాటు హస్తం పార్టీ నాయకులు తెగ ఠారెత్తిపోతున్నారు. -
మెట్రో నుంచి ఎల్ అండ్ టీని తప్పించేందుకు కుట్ర
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజులు ఆదివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పదే పదే అబద్దాలు చెప్పి... వాటిని నిజాలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే మెట్రో రైలు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఎల్ అండ్ టీ సంస్థకి ఆంధ్ర రాజధానిని ఎరవేసి... ఇక్కడి మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థను తప్పించి ఆంధ్ర రాజధానికి పంపించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు విక్రయించిన భూములపై చర్చకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిలాంటి నాయకుల వల్లే తెలంగాణలో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజు అన్నారు. -
చంద్రబాబుతో భేటికి సీనియర్ నేతల డుమ్మా
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ప్రారంభమైంది. ఈ భేటీకి ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస యాదవ్, రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. తెలంగాణ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సీనియర్ నాయకులు ఈ భేటికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తలసాని శ్రీనివాస యాదవ్ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రావణమాసంలో ఆయన పార్టీ మారే అవకాశముందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. -
తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవు: టి.టీడీపీ
హైదరాబాద్: హిమాచల్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సరైన సహకారం అందించాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రమణ, తీగల కృష్ణారెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని.. పకడ్బందీగా చర్యలు తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజీవ్ శర్మకు సూచించారు. ఇప్పటికీ విద్యార్థుల ఆచూకీ తెలవక పోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొని ఉందని టీడీపీ నేతలు అన్నారు. -
టీ టీడీఎల్పీ నేత ఎంపిక బాధ్యత బాబుకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అప్పగించారు. టీడీఎల్పీ నేతను, ఇతర సభ్యులను బాబు శనివారం ప్రకటిస్తారు. ఈ విషయమై శుక్రవారం రాత్రి బాబు నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం ఇవ్వాలని బాబు భావించినా బీసీ నినాదంతో తెలంగాణలో ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో అసెంబ్లీ లో పార్టీకి సారథ్యం వహించే బాధ్యతను బీసీ నాయకుడికే అప్పగించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. దాంతో ఆ వర్గం నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరు చర్చకు వచ్చినట్టు సమాచారం. బీసీ ముఖ్యమంత్రిగా ఆర్.కృష్ణయ్య పేరును ప్రచారంలోకి తీసుకొచ్చినా అధికార టీఆర్ఎస్ బలంగా ఉండడంతో ఆ పార్టీని ఎదుర్కోగల బీసీ నేతను ఎంపిక చేస్తేనే మేలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు తలసాని వైపు మొగ్గారంటున్నారు. మొదటి నుంచీ టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను వ్యతిరేకించే నేతగా తలసాని ముద్రపడిన నేపథ్యంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చినందున నగర నేత అయిన ఆయనకే టీడీఎల్పీ బాధ్యతలివ్వాలని అత్యధికులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇతర సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా బీసీకి టీడీఎల్పీ పదవి ఇవ్వదలిస్తే తలసానికే ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. ఎర్రబెల్లికి ఇస్తే ఉత్తర తెలంగాణలో టీడీపీకి పునరుత్తేజం వస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమైనా సామాజిక వర్గం ఆయనకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఆయన కూడా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడతానని చెప్పారంటున్నారు. -
రెబెల్స్‌ను ఏం చేద్దాం?
టీ-టీడీపీ ఎన్నికల కమిటీలో చర్చ పోటీకే సై అంటున్న తిరుగుబాటు నేతలు పార్టీ స్థానాల్లో బుజ్జగింపులకు యత్నాలు బీజేపీ సీట్లలో వేచి చూసే ధోరణి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థుల్లో ఎక్కువ మంది పోటీలో నిలి చేందుకే మొగ్గు చూపుతుండటంతో ఆ పార్టీ ముఖ్యులు దీనిపై దృష్టిపెట్టారు. సొంతంగా పోటీ చేస్తున్న స్థానాల్లోని రెబెల్స్‌ను బుజ్జగించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మిత్ర పక్షం బీజేపీ పోటీ చేస్తున్న సీట్లలో నామినేషన్ వేసిన టీడీపీ నేతల విషయంలో మాత్రం వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు టీ-టీడీపీ ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది. కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, బీసీ నేత ఆర్. కృష్ణయ్య, మండ వ వెంకటేశ్వర్రావు తదితరులు ఇందులో పాల్గొని తాజా సమస్యలపై చర్చించారు. ప్రత్యేకించి మిత్రపక్షం బరిలో ఉన్న ఖైరతాబాద్, మల్కాజిగిరి, మలక్‌పేట, గద్వాల, నల్గొండ, నకిరేక ల్, వికారాబాద్, పరిగి, షాద్‌నగర్, నిర్మల్, మంచి ర్యాల, చెన్నూరు, నిజామాబాద్ తదితర నియోజకవర్గాల్లో టీడీపీ రెబెల్స్ జాబితాను పరిశీలించింది. టీడీపీ స్థానాల్లో నామినేషన్ వేసిన బీజేపీ నేతలపైనా టీడీపీ దృష్టి సారించింది. ఆయా స్థానాల్లో బీజేపీ తమ వారిని విరమింపజేస్తే ఒక రకంగా, లేదంటే మరో రకంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. పొత్తులో టీడీపీకి దక్కిన సూర్యాపేట, పటాన్చెరు, నారాయణపేట, మక్తల్ వంటి చోట్ల బీజేపీ నుంచి బలమైన నాయకులు రెబెల్స్‌గా నిలిచారు. తాము కచ్చితంగా పోటీ చేస్తామని వారు చెబుతున్నారు. అలాంటి వారిని అనధికారికంగా ప్రోత్సహించాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పోటీ చేస్తున్న ఖైరతాబాద్‌లో రెబెల్‌గా రంగంలో దిగిన తెలుగు యువత నాయకుడు దీపక్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. తాను పోటీలో ఉండాలనే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీడీపీ సీట్లలో రెబెల్స్‌కు బుజ్జగింపులు ఇక టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేసిన సొంత పార్టీ వారి విషయంలో మాత్రం పార్టీ ముఖ్యులు వెంటనే స్పందించారు. వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సీట్లలో వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు వదిలేసి, సొంత స్థానాల్లోని తిరుగుబాటు నేతలను బరి నుంచి తప్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఎల్బీనగర్లో ఆర్. కృష్ణయ్యపై పోటీకి దిగిన పార్టీ నేత ఎస్.వి. కృష్ణప్రసాద్ మొండికేస్తుండగా, మక్తల్, నారాయణపేటల్లోనూ కొండయ్య, రతంగ్ పాండురెడ్డి రెబెల్స్‌గా పోటీలో నిలవాలనే యోచనతో ఉన్నారు. పటాన్చెరు, సంగారెడ్డిలలో కూడా ఇదే పరిస్థితి. దేవరకద్రలో సీతా దయాకర్‌రెడ్డిపై పోటీలో ఉన్న ఎగ్గె మల్లేశంను బుజ్జగించడానికి ఆర్.కృష్ణయ్య ప్రయత్నించినట్లు సమాచారం. శేరిలింగంపల్లి నుంచి బరిలో నిలిచిన రెబల్ మొవ్వ సత్యనారాయణ, సికింద్రాబాద్‌లో పి.ఎల్. శ్రీనివాస్, మల్కాజిగిరిలో వీకే మహేశ్‌లతో పాటు మేడ్చల్‌లోని ముగ్గురు రెబెల్స్‌లో ఒకరు పోటీ చేసి తీరతామని భీష్మించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎలాగైనా వారిని ఒప్పించేందుకు టీడీపీ ముఖ్యులు యత్నిస్తున్నారు. శుక్రవారం చంద్రబాబుతోనూ మాట్లాడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. -
ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా: ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, న్యూస్‌లైన్: ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా.. కానీ అవకాశం రాలేదని, పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా... ఇక్కడి ప్రజల ఆశీస్సులతో గెలుస్తానని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో పలు గ్రామాల్లో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య ర్థులను గెలిపించాలని మంగళవారం ఆయన ప్రచా రం నిర్వహించారు. తాను వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున పలు ప్రాంతాల నుంచి పోటీ చేయమని కోరుతున్నారని, అయినా పాలకుర్తి నుంచే పోటీ చేస్తున్నానని అన్నారు. -
టి.టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల
హైదరాబాద్ :భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదరటంతో తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ సోమవారం విడుదల చేసింది.27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేశారు. బాన్సువాడ -బద్యానాయక్, రాజేంద్రనగర్-ప్రకాశ్ గౌడ్ సనత్ నగర్-తలసాని శ్రీనివాస్ యాదవ్ కూకట్పల్లి - మాధవరం కృష్ణారావు బాల్కొండ-మల్లికార్జున్ రెడ్డి పెద్దపల్లి-విజయ రమణారావు ములుగు-సీతక్క పరకాల-చల్లా ధర్మారెడ్డి బోధన్-ప్రకాష్ రెడ్డి, మహేశ్వరం-తీగల కృష్ణారెడ్డి మంథని-కర్రి నాగయ్య మానకొండూరు-సత్యనారాయణ సూర్యాపేట-పటేల్ రమేష్ రెడ్డి నర్సంపేట-రేవూరి ప్రకాష్ రెడ్డి భువనగిరి- ఉమా మాధవరెడ్డి మిర్యాలగూడ-బంటు వెంకటేశ్వర్లు తాండూరు-ఎం నరేష్ గజ్వేల్-ప్రతాప్ రెడ్డి ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి నారాయణ్ ఖేడ్-విజయపాల్‌రెడ్డి అచ్చంపేట- రాములు చాంద్రాయణగుట్ట-ప్రకాష్ ముదిరాజ్ హుజూర్ నగర్- వంగాల స్వామిగౌడ్ జగిత్యాల-ఎల్ రమణ మహబూబాబాద్-బాలు చౌహాన్ దేవరకొండ-బిల్యా నాయక్ జహీరాబాద్-నరోత్తం తెలంగాణ టీడీపీ లోక్‌సభ అభ్యర్ధుల జాబితా ఆదిలాబాద్ -రమేష్ రాథోడ్ జహీరాబాద్ -మదన్ మోహన్ రావు మహబూబాబాద్- బానోత్ మోహన్ లాల్ -
బీజేపీతో పొత్తుంటేనే నయం
టీ-టీడీపీ ఎన్నికల కమిటీ తొలి భేటీలో చర్చ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి సాగితేనే సానుకూల ఫలితాలు వస్తాయని టీ-టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లను ఎదుర్కొనాలంటే బీజేపీతో పాటు లోక్‌సత్తా మద్దతు కూడా అవసరమని వారు నిర్ణయానికొచ్చారు. టీ-టీడీపీ ఎన్నికల కమిటీ గురువారం ఎన్టీఆర్ భవన్లో తొలిసారి భేటీ అయింది. కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన భేటీలో.. తెలంగాణలో పార్టీ వ్యూహం, పొత్తులపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఇప్పటికీ సమైక్యవాదిగానే చూస్తున్నారని, ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుంటేనే కొన్ని సీట్లు సాధించవచ్చని మెజారిటీ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. పొత్తులు అవసరం లేదంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. టీడీపీని విమర్శించడాన్ని కమిటీ సభ్యులు తప్పుబట్టారు. ‘ఢిల్లీ స్థాయిలో పొత్తులకు ఆమోదం లభించింది. ఆయనేదో అన్నీ తానేనని అనుకుంటున్నాడు. ఎక్కువ సీట్లు తీసుకునేందుకే ఈ డ్రామాలు’ అని కమిటీలోని ఓ నాయకుడు ధ్వజమెత్తినట్లు తెలిసింది. బీజేపీ, లోక్‌సత్తాతో పొత్తు వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీకి ప్రయోజనముంటుందని ఎన్నికల కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు. బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్యను సీఎంగా ప్రచారం చేయడం వల్ల పార్టీ శ్రేణుల్లో వ్యతిరేక భావం కలుగుతుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. బీసీల పార్టీగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, కేసీఆర్‌పై విమర్శలు పెంచాలని తీర్మానించినట్లు సమాచారం. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుతో చర్చించి మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భావసారూప్య పార్టీలతో పొత్తు: రమణ భావసారూప్యమున్న పార్టీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు రమణ వెల్లడించారు. ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ పాత్రపై విస్తృతంగా ప్రచారం చేస్తూ... కాంగ్రెస్, టీఆర్ఎస్ల కుట్రను ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీ టీడీపీనేనని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు దాన్ని వెనక్కు తీసుకోలేదని ఎర్రబెల్లి గుర్తు చేశారు. -
టీ-టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా రమణ
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి కన్వీనర్‌గా మోత్కుపల్లి ‘రావుల’ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక కమిటీలంటూ కొద్దిరోజులుగా ఊరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు సోమవారం రెండు కమిటీలను ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల కమిటీని, ఎన్నికల మేనిఫెస్టో కమిటీలను ఆయన ఏర్పాటు చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ముఖ్య నాయకులందరికీ స్థానం లభించేలా ఎన్నికల కమిటీలో కొత్త కొత్త పోస్టులను సృష్టించారు. తెలంగాణ ఎన్నికల కమిటీలో అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, కన్వీనర్ అంటూ మూడు పేర్లతో ఒకే స్థాయి పోస్టులను ముగ్గురు నాయకులకు అప్పగించడం విశేషం. మూడు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో వీటిని భర్తీ చేశారు. సీనియర్ నేత, ఎంపీ టి.దేవేందర్‌గౌడ్‌కు సలహాదారు అనే కొత్త పదవిని అప్పగించారు. ఇక మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు పార్టీ తెలంగాణ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావించినప్పటికీ, ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. దీంతో ఈ కమిటీని ప్రకటించలేదు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల ప్రణాళికను కూడా బాబు విడుదల చేశారు. కాగా పదేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే బీజేపీ బలంలో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ: అధ్యక్షుడుగా ఎల్. రమణ(కరీంనగర్), వర్కింగ్ ప్రెసిడెంట్: ఎర్రబెల్లి దయాకర్ రావు(వరంగల్), కన్వీనర్: మోత్కుపల్లి నర్సింహులు(నల్లగొండ), సలహాదారుడు: టి. దేవేందర్‌గౌడ్(రంగారెడ్డి), ప్రధాన కార్యదర్శులు: రమేష్ రాథోడ్(ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్(హైదరాబాద్), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (వరంగల్), నామా నాగేశ్వర్రావు(ఖమ్మం), సభ్యులు: మండవ వెంకటేశ్వర్రావు (నిజామాబాద్), టి. ప్రకాశ్‌గౌడ్(రంగారెడ్డి), అలీ మస్కతి (హైదరాబాద్), పి. రాములు (మహబూబ్‌నగర్), ఏలేటి అన్నపూర్ణమ్మ (నిజామాబాద్), రేవంత్‌రెడ్డి(మహబూబ్‌నగర్), యెగ్గె మల్లేశం(రంగారెడ్డి), రావులపాటి సీతారామారావు(ఖమ్మం). తెలంగాణ మేనిఫెస్టో కమిటీ: కన్వీనర్: రావుల చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు: తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, ఉమా మాధవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, అరవింద్‌కుమార్ గౌడ్, వేం నరేందర్‌రెడ్డి, అల్లాడి రాజ్‌కుమార్, సయ్యద్ యూసఫ్ అలీ, ఇ.పెద్దిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, చిలివేరు కాశీనాథ్, సఫన్‌దేవ్, జి. సాయన్న. అయితే, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు నామమాత్రమైనవేనని నేతలు అభిప్రాయపడుతున్నారు. -
'టీటీడీపీ నాయకులు ఆడోమగో తేల్చుకోవాలి'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నాయకులు తము ఆడో, మగో తేల్చుకోవాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదని, ఆపార్టీలో కొనసాగితే ఎటూ కానివారిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతిని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ‘సామాజిక తెలంగాణ’ అనే మాటను ఉచ్చరించే అర్హత కూడా లేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కోరినట్లు తెలిపారు. జులై 30న సీడబ్ల్యుసీ నిర్ణయం వెలువడిన తరువాత కిరణ్ తీసుకున్న వివక్షపూరిత నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని గవ ర్నర్‌ను కలిసి కోరినట్లు చెప్పారు. బదిలీలు, అభివృద్ధి కార్యక్రమాలు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఇతర పాలసీ నిర్ణయాలన్నింటి వెనుక సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయనపై కూడా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని సీలేరు 450 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును, పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రకు కేటాయించడం అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ సీఎంగా కొనసాగిన కిరణ్‌కుమార్ రెడ్డి మాట తప్పినట్లు కేసీఆర్ విలీనం విషయంలో మాట తప్పరని ఆయన భరోసా వ్యక్తం చేశారు. విలీనం కాకపోతే ఘర్షణలతో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
తెలంగాణాలో ఖాళీ, సీమాంధ్రలో రగిలిపోతున్న క్యాడర్
-
అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసం ఎవరు పెట్టినా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల వైఎస్సార్ సీపీ నేత బాలశౌరితో కలిసి మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘అవిశ్వాసంపై ఒక్క సభ్యుడు నోటీసు ఇచ్చినా సరిపోతుంది. గత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అధికార పార్టీలోనే అసంతృప్తి ఉందని దేశ, రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయడానికి మా మద్దతు తెలుపుతూ వరుసగా ఏడు రోజులు వారితో పాటే నోటీసులిచ్చాం. అయితే, అవిశ్వాసాన్ని సభలో ప్రవేశపెట్టడానికి50 మంది సభ్యుల మద్దతు సేకరించడంలో విఫలమయ్యారు. మద్దతు సేకరించకుండా ఇప్పుడు కూడా నోటీసు ఇచ్చినా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పారు. టీడీపీ అధినేత జాతీయ పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారో ఆయనే చెప్పాలని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ గురించి, ఆంధ్ర నేతలు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారని, దానికి వారే జవాబు చెప్పాలని అన్నారు. -
ఏపి భవన్లో కిరణ్‌కు తెలంగాణ సెగ
-
ఏపి భవన్లో కిరణ్‌కు తెలంగాణ సెగ
ఏపీ భవన్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బుధవారం తెలంగాణ సెగ తగిలింది. ముఖ్యమంత్రి తెలంగాణ బిల్లును అడ్డుకోవదంటూ టిటిడిపి నేతలు ఏపీ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలతో ఏపీ భవన్లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు న్యూఢిల్లీ చేరింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఇరు ప్రాంతాల నేతలు న్యూఢిల్లీ చేరి తమ తమ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఏపీ భవన్లో టీ.టీడీపీ నేతల ఆందోళన
న్యూఢిల్లీ : తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం ఉదయం ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వారు నినాదాలు చేశారు. పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని టి.టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా లోక్ సభలో అవిశ్వాసం పెట్టాలని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మరోవైపు మరోవైపు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఏపీ భవన్ చేరుకుంటున్నారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి 21 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. -
'విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తామని చెప్పారా ?'
మెదక్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విభజన బిల్లు రాష్ట్ర శాసన సభకు వచ్చిన నాటినుంచి అటు తెలంగాణలోనూ, ఇటు సీమాంధ్రలోనూ విభజనపై చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత హరీష్‌రావు తెలంగాణ టీడీపీ నేతల వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను విమర్శించడం మానేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును నిలదీయండని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ టీడీపీ నాయకులకు చెప్పారా ? అని హరీష్ రావు ఘాటుగా ప్రశ్నించారు. -
టీ. టీడీపీ ఎమ్మెల్యేలు 'జంపింగ్ రాగం'
రాష్ట్ర విభజనపై రెండు కళ్ల సిద్దాంతం, కొబ్బర చిప్పల సూత్రమంటూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముఖ చిత్రం పూర్తిగా మారే అవకశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలోని పలు జిల్లాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మరోపార్టీలోకి జంప్ చేసేందుకు జంపింగ్ జపాంగ్ రాగాన్ని అలపిస్తున్నారని గుసగుసలు పుట్టుకొస్తున్నాయి. అందుకు వరంగల్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు ముందు వరుసలో ఉన్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అవి పూర్తి నిరాధారాలని వరంగల్ జిల్లా టీడీపీ నేతలు కొట్టిపారేశారు. అయితే తాను ప్రస్తుతం టీడీపీలోనే ఉంటానని, అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలపై నిర్ణయం తీసుకుంటానంటూ ఎర్రబెల్లి పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టారు. మరో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాత్రం తెలంగాణలో అత్యంత బలమైన పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అంటూ బల్లగుద్ది మరి చెప్పారు. అయితే తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, అన్నపూర్ణమ్మ, నగేష్‌లు మరో పార్టీలోకి వలసపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. -
జీవోఎంకు నివేదిక ఇవ్వం: రేవూరి ప్రకాష్ రెడ్డి
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడే సమస్యలపై ఇరుప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీఓఎం) విధి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ ఫోరం సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ.... జీవోఎంకు నివేదిక ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే అందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లదే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.