
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయి, వలసలతో చిక్కి శల్యమైన టీ–టీడీపీని కాపాడుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌తో దోస్తీకి సిద్ధమని ఆయన సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు నాయుడు బుధవారం తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏ పార్టీతో కలిసి వెళ్తామనేది అప్పటికప్పుడు నిర్ణయం ఉంటుందని, టీటీడీపీ విలీనమంటూ ఎవరు మాట్లాడవద్దని సూచించారు. అందరితో చర్చించి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ టీడీపీతో బీజేపీ పొత్తు వద్దనుకుందని, పార్టీని కాపాడుకోవాలంటే పొత్తు అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు. పనిలో పనిగా చంద్రబాబు ...కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment