తెలంగాణ టీడీపీ నేతలు గురువారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఏపీ సచివాలయంలో కలిశారు.
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు గురువారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఏపీ సచివాలయంలో కలిశారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో వీరంతా బాబును కలిసి తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. కాగా తెలంగాణలో రైతులకు అండగా ఉన్నామనే విశ్వాసం కలిగించేలా బస్సు యాత్ర నిర్వహించాలని చంద్రబాబు ఆపార్టీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే బస్సు యాత్రకు ముందే ...ఆ పార్టీ నేతలు కారు యాత్రతో ఆ పార్టీకి ఝలక్ ఇవ్వటం విశేషం.