అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి | Mysura reddy get bifurcation bill | Sakshi
Sakshi News home page

అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి

Published Thu, Feb 6 2014 2:15 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి - Sakshi

అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి

వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి
 సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసం ఎవరు పెట్టినా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత  ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల వైఎస్సార్ సీపీ నేత బాలశౌరితో కలిసి మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘అవిశ్వాసంపై ఒక్క సభ్యుడు నోటీసు ఇచ్చినా సరిపోతుంది. గత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
 
 అధికార పార్టీలోనే అసంతృప్తి ఉందని దేశ, రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయడానికి మా మద్దతు తెలుపుతూ వరుసగా ఏడు రోజులు వారితో పాటే నోటీసులిచ్చాం. అయితే, అవిశ్వాసాన్ని సభలో ప్రవేశపెట్టడానికి50 మంది సభ్యుల మద్దతు సేకరించడంలో విఫలమయ్యారు. మద్దతు సేకరించకుండా ఇప్పుడు కూడా నోటీసు ఇచ్చినా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పారు. టీడీపీ అధినేత జాతీయ పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారో ఆయనే చెప్పాలని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ గురించి, ఆంధ్ర నేతలు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారని, దానికి వారే జవాబు చెప్పాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement