Bala showry
-
పేదల కోసం పరితపించిన వ్యక్తి వంగవీటి రంగా: ఎంపీ బాలశౌరి
-
అసత్య ఆరోపణలు చేశారు: బాలశౌరి
-
మహిళలకు పెద్ద పీఠ వేసిన నాయకుడు సీఎం జగన్
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్ద పీఠ వేసిన నాయకుడని ఎంపీ బాలశౌరి అన్నారు. 50 శాతం మహిళలకు పదవులు దక్కుతున్నాయంటే సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన చట్టం ద్వారానేనని పేర్కొన్నారు. గతంలో ఎక్కడైనా మార్కెట్ యార్డు చైర్మన్లుగా 12 మంది మహిళలు ఉన్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాద యాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరుస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టిన పులిచింతల ప్రాజెక్టుకు వైఎస్ జగన్ సీఎం అయ్యాక 45 టీఎంసీల నీరు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం ఏడు సంవత్సరాలు రబీకి నీరు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రెండో పంటకు నీరు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్‌దేనన్నారు. ముఖ్యమంత్రి జగన్ మచిలీపట్నం పోర్టుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నామని అన్నారు. సీఎం జగన్ పాలనలో వారికి పెద్దపీఠ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీఠ వేశారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో 19 మార్కెట్ యార్డులు ఉంటే ఈ రోజు 22 ఉన్నాయన్నారు. 11 మార్కెట్ యార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చైర్మన్లుగా పదవులు దక్కాయన్నారు. అక్కా చెల్లెళ్ల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 50శాతం రిజర్వేషన్లు చట్టం చేశారని తెలిపారు. -
ఏపీ సెంట్రల్ వర్సిటీకి రూ.450 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి మొదటి విడతగా రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2018–19లో రూ.10 కోట్లు, 2019–20కి రూ.13 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఆరు కోర్సులు ప్రారంభించినట్టు తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు రహదారులను అత్యంత ప్రాధాన్యత గల రహదారుల కేటగిరీలో చేర్చి, త్వరితగతిన అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ కాకినాడ ఎంపీ వంగా గీత కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభలో జాతీయ రహదారుల శాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. రహదారుల నిర్మాణం విషయంలో ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాలని కోరారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం తెలపాలని విన్నవించారు. 400 కి.మీ. పొడవైన అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే మంజూరైనా.. ఇంకా డీపీఆర్ పూర్తవలేదన్నారు. భూసేకరణ కూడా జరగలేదని, పనులు మొదలుపెట్టలేదని సభ దృష్టికి తెచ్చారు. గుంటూరు–వినుకొండ, కడప–గిద్దలూరు, అనంతపురం–బుగ్గ, కర్నూలు–ఆత్మకూరు, ఆత్మకూరు–దోర్నాల తదితర ఆరు రహదారులను అత్యంత ప్రాధాన్యత గల రహదారులుగా గుర్తించాలని కోరారు. అలాగే జాతీయ రహదారులకు అనుబంధ రహదారులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఎన్‌హెచ్–16కు అనుబంధంగా కాకినాడ–యాంకరేజ్ పోర్టు–ఉప్పాడ బీచ్ రహదారి, కుంభాభిషేకం ఆలయం–ఫిషింగ్ హార్బర్ మధ్య ఫ్లైఓవర్, తదితర రహదారులను నిర్మించి స్థానికుల ఇక్కట్లను తొలగించాలని విన్నవించారు. డ్రైవర్ల సంక్షేమం దృష్ట్యా హైవేల్లో ఆస్పత్రులు ఏర్పాటుచేయాలన్నారు. కాకినాడ–రాజమండ్రి మధ్య ఆరు లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని కోరారు. ఎన్ఐఏను మరింత బలోపేతం చేయండి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో సిబ్బందిని పెంచి మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. లోక్‌సభలో ఎన్ఐఏ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. దేశంలో మానవ అక్రమ రవాణా పెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు పూర్తి స్థాయిలో దీన్ని సమగ్ర దర్యాప్తు చేయలేకపోతున్నాయని వివరించారు. అలాగే.. బేడ, బుడగ, జంగం కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలని కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మంత్రికి ఒక వినతిపత్రం ఇచ్చారు. -
పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
మచిలీపట్నం: పోలవరం ప్రాజెక్టుకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది వైఎస్ కలగా చెప్పారు. రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దీనిని చేపట్టారని గుర్తు చేశారు. వైఎస్‌పై ఉన్న నమ్మకంతోనే రైతులు స్వచ్ఛందంగా తమ భూములిచ్చారని గుర్తుచేశారు. పోలవరం కాలువల నిర్మాణం కోసం అప్పట్లోనే రూ.ఆరు వేల కోట్లను ఖర్చు చేశారని, కృష్ణా డెల్టా ప్రజలు వైఎస్ సంకల్పానికి పరవశించి ఎంతో నమ్మకంతో భూములిచ్చినట్లు తెలిపారు. పోలవరం నిర్మాణ రథసారథిగా ప్రజానీకం వైఎస్‌ను గుర్తుంచుకుంటోందని.. అందుకనే ఆ ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు చేసిందేంలేదన్నారు. అడుగడుగునా చంద్రబాబు మోసం ప్రతి సోమవారం ప్రాజెక్టు సందర్శన అంటూ చంద్రబాబు కేంద్రం ఇచ్చే నిధులను దుబారా చేశారే తప్ప, దానిని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఆయనకు లేదన్నారు. గేట్లు వేయడాన్నే ప్రాజెక్టు పూర్తి చేసినట్టుగా మోసపూరిత ప్రసంగాలు చేసి రైతులను వంచించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినా.. ప్రధానికి వంగి వంగి దండాలు పెట్టి.. దాన్ని లాక్కుని తానే కడుతున్నట్టుగా హంగామా చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. చంద్రబాబు చిత్తశుద్ధిపై ప్రజలకు నమ్మకం లేకనే చిత్తుగా ఓడించారని తెలిపారు. మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న వైఎస్ జగన్ వాటికి తనదైన శైలిలో పరిష్కారం చూపుతారనే నమ్మకం అందరిలోనూ ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు దేవుడు వైఎస్‌ను పుట్టించారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆయన తనయుడైన వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా పంపారని చెప్పారు. సీఎంగా వైఎస్ జగన్.. తిరిగి రాజన్న పాలనాకాలం నాటి స్వర్ణయుగాన్ని తీసుకొస్తారని బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే జగన్ రావాల్సిందే’
సాక్షి, మచిలీపట్నం : బందరు పోర్టు త్వరితగతిన పూర్తి కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం లభించాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావల్సిందేనని జనమంతా భావిస్తున్నారని వైఎస్ఆర్సీపి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మచిలీపట్నంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని తో కలిసి పలు వార్డుల్లో రోడ్ షో తో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, పారిశుద్ధ్య లోపంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చంద్రబాబు నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తోస్తారని, డబ్బులు పంచి ఓట్లను కొనుగోలు చేసి రాజకీయంగా లబ్ధి పొందిన తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోలీసుల ద్వారా ఓటర్లకు డబ్బులు పంచి లబ్ది పొందేందుకే ఇంటలిజెన్స్ డిజి వెంకటేశ్వరరావు బదిలీని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా గట్టి గుణపాఠం చెప్పేందుకు కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు ను పూర్తి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కృష్ణాడెల్టాకు రెండు పంటలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. -
‘బందరు సెంటిమెంట్ మరోసారి రుజువు కాబోతుంది’
సాక్షి, మచిలీపట్నం: బందరు సెంటిమెంట్ మరోసారి రుజువు కాబోతుందని మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్ని నాని అన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో రెండు పంటలకు సాగునీరు రావాలన్న, నిరుద్యోగులందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నట్టు తెలిపారు. సోమవారం రోజున వైఎస్సార్ సీపీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాని నామినేషన్ దాఖలు చేశారు. తొలుత బాలశౌరి, నాని సుల్తాన్‌నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో బందర్ రోడ్లన్ని జనసంద్రంగా మారాయి. బందరులో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇక్కడ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని నాని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన జనమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు, నరేంద్ర మోదీతో జతకట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం
-
చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఓటమి తప్పదు
-
‘గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు మాదే’
సాక్షి, గుడివాడ: రాష్ట్రంలో దివాళకోరు రాజకీయాలను ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్సీపీ మచిలీపట్నం నియోజకవర్గం సమన్వకర్త బాల శౌరి విమర్శించారు. గురువారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు వంచనకు, ధర్మానికి మధ్య జరుగనున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఓటమి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు గుడివాడలో పోటీ చేసినా విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అందుకే టీడీపీ ఎంపీలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మనస్ఫూర్తిగా పోరాడితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా సాధించి తీరుతుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు.. కోస్టల్ కారిడార్ నిర్మాణం చేపడతామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. కృష్ణా డెల్టాకు రెండు పంటలకు నీరందిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబుది టికెట్లు అమ్ముకునే సంస్కృతి అని ఆరోపించారు. -
అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసం ఎవరు పెట్టినా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల వైఎస్సార్ సీపీ నేత బాలశౌరితో కలిసి మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘అవిశ్వాసంపై ఒక్క సభ్యుడు నోటీసు ఇచ్చినా సరిపోతుంది. గత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అధికార పార్టీలోనే అసంతృప్తి ఉందని దేశ, రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయడానికి మా మద్దతు తెలుపుతూ వరుసగా ఏడు రోజులు వారితో పాటే నోటీసులిచ్చాం. అయితే, అవిశ్వాసాన్ని సభలో ప్రవేశపెట్టడానికి50 మంది సభ్యుల మద్దతు సేకరించడంలో విఫలమయ్యారు. మద్దతు సేకరించకుండా ఇప్పుడు కూడా నోటీసు ఇచ్చినా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పారు. టీడీపీ అధినేత జాతీయ పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారో ఆయనే చెప్పాలని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ గురించి, ఆంధ్ర నేతలు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారని, దానికి వారే జవాబు చెప్పాలని అన్నారు.