మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి | Revanth Reddy again wants KCR to debate metro land row, my home lands | Sakshi
Sakshi News home page

మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి

Published Mon, Nov 17 2014 11:42 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి - Sakshi

మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : మెట్రో వివాదం, మై హోం భూముల కేటాయింపుల అంశాన్ని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారంపై ఆయన సుమారు 50 పేజీల సమగ్ర నివేదికను తయారు చేశారు.  ఆ నివేదికను శాసనసభ స్పీకర్తో పాటు, శాసన సభ్యులకు..  రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. దీనిపై సభలో చర్చ జరగాలని ఆయన పట్టుబడుతున్నారు. చర్చ సందర్భంగా తనను సభలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అంశాన్ని తెలంగాణ టీడీపీ సభ్యులు సోమవారం స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే అప్రజాస్వామికంగా దాడికి ఉసిగొల్పడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వంలోని లోపాలు ఎత్తిచూపితే రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించటం విచారకరమన్నారు. దీనిపై విచారణ జరిపి సభ్యులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా స్పీకర్కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement