my home lands
-
రియల్టీ కుబేరులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) అధినేత మంగళ్ ప్రభాత్ లోధా నిలిచారు. ఈయన సంపద విలువ రూ.31,960 కోట్లు. దేశంలోని రియల్టీ కుబేరుల్లో లోధా వరుసగా రెండు సార్లు అగ్రస్థానంలో నిలిచినట్లు ‘హురున్– గ్రోహే’ సంస్థలు ఇండియాపై సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. లోధా ప్రస్తుతం బీజేపీ ముంబై శాఖ అధ్యక్షుడు కూడా. గతేడాదితో పోలిస్తే లోధా కుటుంబ సంపద 18 శాతం వృద్ధి చెందింది. 100 మందితో కూడిన ఈ జాబితాలో మిగతా 99 మంది రియల్టీ టైకూన్స్ సంపదలో లోధా కుటుంబ సంపద వాటా 12 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలియజేసింది. 100 మంది సంపద 2,77,080 కోట్లు.. దేశంలో అగ్రస్థానంలో ఉన్న 100 మంది రియల్టీ టైకూన్స్ సంపద విలువ రూ.2,77,080 కోట్లుగా అంచనా. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి చెందినట్లు ‘హురున్– గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్– 2019’ నివేదిక తెలియజేసింది. ఈ వంద మంది జాబితాలో 37 మంది ముంబైవాసులే. ఢిల్లీలో 19 మంది, బెంగళూరులో 19 మంది ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తల సగటు వయసు 59 ఏళ్లు. ఆరుగురు మాత్రం 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు. ముగ్గురు 80 ఏళ్లు పైబడిన వారు. 8 మంది మహిళలకు చోటు.. ఈ జాబితాలో తొలిసారి 8 మంది మహిళలకు స్థానం దక్కింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ స్మిత వీ స్రిశ్న మహిళల్లో టాప్‌లో ఉండగా.. మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.3,560 కోట్లు. తర్వాతి స్థానాల్లో డీఎల్ఎఫ్కు(కమర్షియల్) చెందిన రేణుక తల్వార్(సంపద రూ.2,590 కోట్లు) పాయ్ సింగ్ (రూ.2,370 కోట్లు), ఎమ్మార్ ఈజీఎఫ్ ల్యాండ్ శిల్పా గుప్తా (రూ.730 కోట్లు), సూపర్‌టెక్ సంగీత అరోరా (రూ.410 కోట్లు), గోపాలన్ ఎంటర్ప్రైజెస్ ఎం వసంత కుమారీ (రూ.310 కోట్లు), వాటికా కమర్షియల్ విభాగం కాంచన భల్లా (రూ.300 కోట్లు) నిలిచారు. మై హోమ్.. యంగ్ టైకూన్స్ దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన్స్గా హైద రాబాద్లోని మై హోమ్ గ్రూప్‌నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్‌రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయ స్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్... వృద్ధ రియల్టీ టైకూన్‌గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ.3,670 కోట్లు. రామురావు, శ్యామ్‌రావు -
చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని సస్పెండ్ చేశారు
హైదరాబాద్:చిన్న చిన్న కారణాలతో అసెంబ్లీ చట్టాలు ఉల్లంఘించి టీడీపీ సభ్యల్ని సస్పెండ్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను సభలో ఉంటే వారి బండారం బయడపడుతుందనే బయటకు పంపారని మండిపడ్డారు. మై హోంకు ప్రత్నామ్నాయ భూ కేటాయింపులపై రూల్ 43ప్రకారం స్పీకర్ కు నోటీసులు ఇచ్చానని, భూ బదాయింపులపై సంపూర్ణ సమాచారంతో అన్ని పార్టీలకు నివేదికలు ఇచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ సంస్థకు కేటాయించిన ఎకరం రూ. 18 కోట్ల విలువ చేసే భూములను నిబంధనలకు విరుద్ధంగా మైం హోం కొనుగోలు చేసిందని ఈ సందర్భంగా రేవంత్ తెలిపారు. అదే రేటుకు ఎకరా రూ. 50 కోట్ల విలువ చేసే రోడ్డుపై ఉన్న భూములను మైం హోంకు ఇస్తాననడం ఎంతవరకూ న్యాయమని రేవంత్ ప్రశ్నించారు. అనుమతులు లేవని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు కూల్చినట్లు ఈ అంశంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నారు. మై హోం భూ కేటాయింపులపై హౌస్ కమిటీ వేయాలని.. ఆ కమిలీలో నాకు స్థానం కల్పించాలన్నారు. భూ బదాలాంపుల్లో ప్రభుత్వ ఖజనాకు రూ.100 కోట్ల నష్టం జరిగిందన్నారు. -
మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి
-
మెట్రో వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మెట్రో వివాదం, మై హోం భూముల కేటాయింపుల అంశాన్ని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారంపై ఆయన సుమారు 50 పేజీల సమగ్ర నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను శాసనసభ స్పీకర్‌తో పాటు, శాసన సభ్యులకు.. రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. దీనిపై సభలో చర్చ జరగాలని ఆయన పట్టుబడుతున్నారు. చర్చ సందర్భంగా తనను సభలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అంశాన్ని తెలంగాణ టీడీపీ సభ్యులు సోమవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే అప్రజాస్వామికంగా దాడికి ఉసిగొల్పడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వంలోని లోపాలు ఎత్తిచూపితే రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించటం విచారకరమన్నారు. దీనిపై విచారణ జరిపి సభ్యులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.