ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు ప్రముఖుల హాజరు | CM Revanth Reddy Attends Reception Of Lok Sabha Speaker Om Birla's Daughter In Delhi, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు ప్రముఖుల హాజరు

Published Tue, Nov 26 2024 8:19 AM | Last Updated on Tue, Nov 26 2024 9:53 AM

 CM Revanth Reddy attends reception of Om Birla's daughter in Delhi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓంబిర్లా కుమార్తె అంజలీ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త అనీష్‌ రజనీల వివాహం ఈనెల 12న జరగ్గా సోమవారం ఢిల్లీలో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

దీనికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్‌ ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు. 

అలాగే ఏపీ నుంచి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్‌ కొయ్యె మోషేన్‌ రాజు, వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, ప్రసాద్, బాలశౌరి, ఉదయ్‌ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement