తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చే సమయంలో.. అసెంబ్లీ లోపలకి వెళుతున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు.