'కూకట్ పల్లి ఎమ్మెల్యేపైనా వేటు వేయండి' | telangana tdp leaders demand disqualify kukatpally mla | Sakshi
Sakshi News home page

'కూకట్ పల్లి ఎమ్మెల్యేపైనా వేటు వేయండి'

Published Fri, Jun 26 2015 2:56 PM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

మాధవరం కృష్ణారావు(ఫైల్) - Sakshi

మాధవరం కృష్ణారావు(ఫైల్)

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని తెలంగాణ టీడీపీ నాయకులు కోరారు. శుక్రవారం టి.టీడీపీ నాయకులను స్పీకర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గతంలో చాలాసార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోరినట్టు చెప్పారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈనెల 30లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో స్పీకర్ ను కలిసినట్టు వెల్లడించారు. ప్రోటోకాల్ విషయంలో అధికార పార్టీ నేతలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని స్పీకర్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రత్యేక దేశంగా భావిస్తున్నారని,  రాజీనామా వర్తించదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement