'మామ, అల్లుడు ఏం సాధించుకు వచ్చారు?' | telangana tdp leader errabelli dayakara rao slams kcr, harish rao | Sakshi
Sakshi News home page

'మామ, అల్లుడు ఏం సాధించుకు వచ్చారు?'

Published Tue, Feb 24 2015 10:35 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

'మామ, అల్లుడు ఏం సాధించుకు వచ్చారు?' - Sakshi

'మామ, అల్లుడు ఏం సాధించుకు వచ్చారు?'

కరీంనగర్ : తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులకు ఆపార్టీ పెద్దపీట వేస్తుంటే... తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించటం లేదని  ఆయన సూటిగా అడిగారు. టీడీపీ నుంచి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్...శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన మంగళవారమిక్కడ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందిపెడితే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్యాయాలు జరిగితే అడిగేందుకు తెలంగాణ టీడీపీ సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎడారిగా మారుతుంటే మామ, అల్లుడు మహారాష్ట్రకు వెళ్లి ఏం సాధించుకు వచ్చారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలను టీడీపీ సహించదని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను ప్రెస్ అకాడమీ చెర్మన్ అల్లం నారాయణ లాంటి ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించరని ఎర్రబెల్లి అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement