
చంద్రబాబుతో భేటికి సీనియర్ నేతల డుమ్మా
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ప్రారంభమైంది. ఈ భేటీకి ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస యాదవ్, రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. తెలంగాణ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే సీనియర్ నాయకులు ఈ భేటికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తలసాని శ్రీనివాస యాదవ్ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రావణమాసంలో ఆయన పార్టీ మారే అవకాశముందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.