మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నేను పార్టీ మారను: మాజీ మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలవుతు న్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన రైతుభరోసా హామీని ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం అమలు చేయడం లే దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగం గొంతుకోయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ, ఈ పాటికే రైతుబంధు డబ్బులు పడా ల్సి ఉందని, రైతుభరోసా పేరు చెప్పి రైతులను మో సం చేస్తున్నారని విమర్శించారు.
రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారని, అయితే అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని, సీజన్ అయిపోయాక రైతు భరో సా ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదని నిల దీశారు. కేసీఆర్ హయాంలో 68.90 లక్షల మందికి 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చినట్లు చెప్పారు.
మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని, రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలని అన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడి యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, డిసెంబర్ 9న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కేబినెట్లో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు.
Comments
Please login to add a commentAdd a comment