singireddy niranjan reddy
-
రాజ్యాంగ పాలనా.. రాచరికమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యాంగ పాలనకు బదులుగా రాచరిక పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ పారీ్టకి చెందిన పలువురు మాజీ మంత్రులు విమర్శించారు. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో రైతులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు చేసిన తిరుగుబాటును కుట్రగా పేర్కొంటూ.. రైతులు, విపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ డీకే అరుణను లగచర్లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి మాత్రం 200 వాహనాల్లో తిరిగే స్వేచ్ఛను ఇచ్చారన్నారు. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్లో మాట్లాడారనే విషయాన్ని నేరంగా చూపుతూ పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామన్నా రు. రైతులపై కేసులను ఉపసంహరించుకోవాలని, అవసరమైతే బీఆర్ఎస్ మూకుమ్మడి జైల్ భరోకు పిలుపునిస్తుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు.అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాని రేవంత్‌ను బీఆర్ఎస్ నిలదీస్తుండటంతో అరెస్టులతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. లగచర్ల ఘటనలో కట్టు కథలు చెప్తూ.. బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దాడులను ప్రోత్సహించడం బీఆర్ఎస్ విధానం కాదని, అధికారులు గ్రామాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డిపై నమ్మకం లేనందునే కొడంగల్ ప్రజలు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని ఎంపీ సురేశ్ రెడ్డి అన్నారు. -
రైతులను నట్టేట ముంచుతున్న రేవంత్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలవుతు న్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన రైతుభరోసా హామీని ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం అమలు చేయడం లే దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగం గొంతుకోయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ, ఈ పాటికే రైతుబంధు డబ్బులు పడా ల్సి ఉందని, రైతుభరోసా పేరు చెప్పి రైతులను మో సం చేస్తున్నారని విమర్శించారు.రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారని, అయితే అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని, సీజన్ అయిపోయాక రైతు భరో సా ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదని నిల దీశారు. కేసీఆర్ హయాంలో 68.90 లక్షల మందికి 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చినట్లు చెప్పారు.మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని, రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలని అన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడి యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, డిసెంబర్ 9న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కేబినెట్లో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. -
ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలను శిష్యుడు రేవంత్‌రెడ్డి పాటిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు కర్రపెత్తనం ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్నటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్ది కీలకపాత్ర అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా సలహాదారుగా నియమించుకున్నారని ఆయన ప్రశ్నించారు.అధికారిగా ఆయన పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రలోని కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంతో ఆయనది కీలకపాత్ర అని అన్నారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ పై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
-
రుణమాఫీలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఘనత ముఖ్యమంత్రిదే..! దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు. ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు. -
ప్రజలకు ‘విజయ’ మరింత చేరువ కావాలి
రాజేంద్రనగర్ (హైదరాబాద్): నాణ్యతా ప్ర మాణాలతో కూడిన విజయ వంటనూనెలను ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించనున్న విజయ వంటనూనెల మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ కర్మాగారం నిర్మాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తు తం శివరాంపల్లిలోని ప్యాకింగ్ కేంద్రం మూడు షిఫ్ట్‌లలో నడుస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3.8 ఎకరాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకు కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్ పద్ధతిలో ప్యాకింగ్ స్టేషన్‌ను నిర్మించి ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ సంస్థకు స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా రు. రూ.25 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన విజయ హైదరాబాద్ మెగా ప్యాకింగ్ కేంద్రం, కీసర తాగునీరు కర్మాగారాలను జనవరి 2024లోపు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఎండీ, డైరెక్టర్ సురేందర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది మొదటి నుంచీ ద్రోహపూరిత పాత్రనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల కాంగ్రెస్ మొదటి నుంచీ ద్రోహపూరిత పాత్రనే పోషించిందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణను నిర్లక్ష్యమే చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అనేది ప్రజల హక్కు తప్ప కాంగ్రెస్ ఇచ్చుడు, తీసుకునుడు అనే వాదన అర్థరహితమన్నారు. శనివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు తెలంగాణ అంటే ఎప్పుడూ పట్టదని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. చరిత్రను అర్థం చేసుకోని అజ్ఞానులే కేసీఆర్‌ను బషీర్‌బాగ్ కాల్పులకు కారణమంటారని, తెలంగాణ మలి ఉద్యమానికి కరెంటు, వ్యవసాయ రంగ సమస్యలే కారణమని చెప్పారు. బషీర్‌బాగ్ కాల్పుల తర్వాత కేసీఆర్ రాసిన లేఖనే తెలంగాణ ఉద్యమానికి మలుపని పేర్కొన్నారు. గత తొమిదేళ్లలో కరెంటు పోయి దెబ్బతిన్న రంగం ఏమీలేదన్నారు. 15 నిమి షాలో, అరగంటో కరెంటు పోతే 24 గంటల కరెంటు లేన ట్టా అని ప్రశ్నించారు. కొన్ని సాంకేతిక కారణాల తో కరెంటు పోతే లాగ్ బుక్కులు అంటూ రాజకీయం చేస్తున్నారని, అజ్ఞానులే కరెంటు కొనుగోలుపై ఆరోపణలు చేస్తారన్నారు. రేవంత్ ముందే బయటపెట్టారు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వొద్దు అనే కాంగ్రెస్ హైకమాండ్ విధానాన్ని రేవంత్ ముందే బయటపెట్టారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గతంలో కూ డా రేవంత్ ఓటుకు నోటు కేసులో తొందర పడి చంద్రబాబును తట్టా బుట్టా సర్దుకుని వెళ్లేలా చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పేటెంట్ అని, ఉచిత విద్యుత్‌కు కాదని ఎద్దేవా చేశారు. కోమటి రెడ్డి గతంలో అనేక సవాళ్లు విసిరి పారిపోయారని, అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవ సరం లేదన్నారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో చంద్రబాబు అభిమానులు పెట్టిన మీటింగ్‌లో రేవంత్.. చంద్రబాబు ఎజెండానే మాట్లాడారని ఆరోపించారు. కరెంటు కొనుగోలు ఎలా జరుగుతుందో తెలియని అజ్ఞాని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమానికి భూమిక కరెంటే అని తెలియక బెదిరింపులకు దిగుతున్నారన్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం
-
మంత్రి నిరంజన్‌రెడ్డికి షాక్.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహితులుగా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితోపాటు మరో 11 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపసర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్ఎస్ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూడా ఆత్మగౌరవాన్ని పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నిరంజన్‌రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డికి నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. -
ఆర్గానిక్ ఆలోచన భేష్ !
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు తన కుమారుడి వివాహాన్ని ప్లాస్టిక్‌కు దూరంగా, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల వంటలతో జరిపించారు. ఈ విషయమై ‘ఆదర్శ రైతు ఇంట.. ఆర్గానిక్ పెళ్లంట’శీర్షికన ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతు రామారావుకు సోమవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్గానిక్ పెళ్లి చేయటం అభినందనీయమని చెబుతూ వధూవరులు కిరణ్, ఉదయశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు కోయచెలకలోని ఆర్గానిక్ క్షేత్రాన్ని సందర్శిస్తానని, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన కిరణ్ స్వయంగా ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. -
రైతు సేవలకే మొదటి ప్రాధాన్యం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెటింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని శాఖ అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం డైరీ, కేలండర్‌ను తన కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో పెరిగిన పంటల విస్తీర్ణం, ఉత్పత్తితో మార్కెటింగ్ ఉద్యోగులపై బాధ్యత పెరిగిందని తెలిపారు. పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీ బాయి, అడిషన ల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, టీఎన్జీవోస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఫసియొద్దీన్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కేలండర్ ఆవిష్కరణ వ్యవసాయశాఖ రూపొందించిన నూతన సంవత్సర కేలండర్‌ను మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సోమవారం నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
మన్సూరాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) వజ్రోత్సవాలను సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతగల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్య త ఉపాధ్యాయులపై ఉందని, విలువలతో కూడిన విద్య అందించడంలో కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల్లో కోతలతో కొంత మేర ఇబ్బందులు తలెత్తుతున్నాయని... అందుకే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల చెల్లింపులో కాస్త జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. చదువులపై భారీగా ఖర్చు... రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యారంగానికి కేటాయించిన నిధులతోపాటు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటాయిస్తున్న నిధుల వివరాలను గణాంకాలతో ఆయన వివరించారు. విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు బడ్జెట్లో 10 శాతానికి పైగానే ఉంటున్నాయని తెలిపారు. కేజీ టు పీజీ విద్యను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదట అటవీ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటిసారిగా 43 శాతం, తరువాత 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దేశంలో అత్యధికంగా జీతాలు పొందుతున్న ఉద్యోగులంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని, అందులో ఉపాధ్యాయులే అత్యధికంగా ఉన్నారన్నారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తొలి నుంచీ ప్రభుత్వానికి అండగా ఉపాధ్యాయులు: మంత్రి సబిత ఉపాధ్యాయులు మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఎస్టీయూటీఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు ఎన్ని సమస్యలున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యలపై పోరాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల, ప్రమోషన్లు, బదిలీల విషయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు నూతన విద్యావ్యవస్థ ఏర్పాటుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వజ్రోత్సవ సావనీర్‌ను, డైరీని, వజ్రోత్సవ సీడీని, తెలంగాణ జాతిరత్నాలు పుస్తకాన్ని, నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్య క్షుడు సదానందగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావు, నరేంద్రారెడ్డి, బ్రహ్మచారి, నాగేశ్వర్రావు, ఏపీ సంఘం అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, తిమ్మన్న, కమలారెడ్డి, కరుణాకర్, శ్రీధర్, సుధాకర్, మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆగ్రోస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయసింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆగ్రోస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన కు ఆగ్రోస్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తిప్పన విజయసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, గ్యాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: రాబోయే ఐదేళ్లలో తెలంగా ణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఆయిల్ పామ్‌తో పాటు వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయాబీన్ తదితర నూనె గింజల సాగును ప్రోత్సహించడం ద్వారా వంట నూనెల తయారీకి అవసరమైన ముడి సరుకు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వంట నూనెల దిగు మతిని తగ్గించడంతో పాటు దేశీయంగా వంట నూనెల త యారీని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళిక లు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో శుక్రవారం ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అసోసియేషన్ (ఐవీపీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే సదస్సు లో తొలి రోజు సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పది వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఫుడ్ ప్రాసె సింగ్ జోన్లలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులతో వచ్చే వారికి ఇతర రాష్ట్రాల తో పోలిస్తే మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వివి ధ రంగాల్లో సాధించిన విజయాలను వివరించడంతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 40 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుతో అటవీ విస్తీర్ణం తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయని, కానీ రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో పచ్చదనం విస్తీర్ణం 24 శాతం నుంచి 31.77 శాతానికి పెరిగిందని కేటీఆర్ వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగును పెంచుతాం: మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రపంచంలోని 800 కోట్ల జనాభాలో భారత్, చైనాది సింహభాగం కాగా, ఏటా ప్రపంచ జనాభాకు 220 మిలియన్ టన్నుల నూనె గింజలు అవసరమవుతున్నాయని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. భారత్‌లో నూనె గింజల వినియోగం ఏటా 20 నుంచి 22 మిలియన్ టన్నులు కాగా, వనరులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా నూనె గింజల ఉత్పత్తి 50 శాతం కూడా లేదన్నారు. రూ.99 వేల కోట్లకు పైగా వెచ్చించి విదేశాల నుంచి వంట నూనె గింజలు దిగుమతి చేసుకుంటుండగా ఇందులో పామాయిల్ 65 శాతం ఉందని తెలిపారు. దేశంలో వేరు శన గ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమలు, ఆయి ల్ పామ్ సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్, ప్రతినిధులు బన్సల్, గుప్తాతో పాటు మలేసియా, థాయ్‌లాండ్, యూరోప్, యూకే ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
చిరుధాన్యాలకు మరింత ప్రాధాన్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చిరుధాన్యాల సాగుకు మరింత ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో పోషక విలువలు అధికంగా అందించగల వీటిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన నాలుగో నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, వీటిలో చిరుధాన్యాల విస్తీర్ణం కొంచెం తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యానికి పోషకాలను అందించే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా వీటిని అన్నివర్గాల వారికి అందివ్వగలిగితే డిమాండ్ పెరిగి ఎక్కువమంది రైతులు సాగు చేపట్టే అవకాశం ఉందని వివరించారు. చిరుధాన్యాల సాగుకు అత్యంత ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం కాగలదని సీనియర్ ఐఏఎస్ అధికారి, నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ సీఈవో డాక్టర్ అశోక్ దళవాయి అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం 28 కోట్ల టన్నుల ధాన్యాలు పండుతుండగా, ఇందులో కనీసం మూడోవంతు చిరుధాన్యాలు ఉండేలా చేయగలిగితే భవిష్యత్తు అవసరాలను అందుకోగలమని చెప్పారు. కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభాఠాకూర్, ఐకార్ అడిషనల్ డీజీ డాక్టర్ ఆర్.కె.సింగ్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రత్నావతి, ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ సీఈవో డాక్టర్ దయాకర్‌రావు, సమున్నతి సంస్థ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అదనపు కమీషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న చిరుధాన్య ఉత్పత్తులు... నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్ 4.0 సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉత్కర్ ఫుడ్స్ అనే బెంగళూరు కంపెనీ చిరుధాన్యాలతో చేసిన వడియాలకు ఆయుర్వేద మూలికలైన శతావరి, నన్నారి (ఇండియన్ సార్స్ పరిల్లా)లను జోడించింది. నన్నారి కీళ్లనొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. శతావరి విషయానికొస్తే ఇది హార్మోన్ల సమతౌల్యానికి, మెనోపాజ్ సమస్యల పరిష్కారానికి అక్కరకొస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. మిబిల్స్ మురుకులు, మిక్స్చర్, లడ్డూలు, గోల్డెన్ మిల్లెట్స్, క్వికీలు నూడుల్స్, పాస్తాలను సిద్ధం చేసి అమ్ముతున్నాయి. వైస్ మామా చిరుధాన్యాలకు పండ్లు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్లు జోడిస్తోంది. -
‘కేసీఆర్ పాలన నేటి, రేపటి తరానికి వరం’
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. కాగా, ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి విక్టోరియా ఇంఛార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇక, మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన సందర్భంగా.. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు, పేదలు రెండు కళ్లుగా భావిస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్. దేశంలో కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు.. నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని అన్నారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. దేశంలో మత రాజకీయంతో విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు, అన్ని మతాల ప్రజలు సర్వతోముఖభివృద్ధి తో సంతోషంగా ఉన్నారని , నేటి కేసీఆర్ పథకాలు, సంస్కరణలు ప్రస్తుత, రేపటి తరాలకు వరం అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జై కేసీఆర్ , జై తెలంగాణ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సభ్యులు విశ్వామిత్ర, సతీష్, వినయ్ సన్నీ, ప్రవీణ్ లేదెళ్ల, విక్రమ్ కందుల, ఉదయ్, సాయి యాదవ్, వేణు నాన, రాకేష్ , సాయి గుప్తా, సందీప్ నాయక్, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
నానో యూరియాతో వ్యవసాయ రంగంలో విప్లవం: మంత్రి నిరంజన్‌రెడ్డి
ఏజీవర్సిటీ: వ్యవసాయరంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలోని ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటి సారిగా యారియాను ద్రవరూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిదని, ఇది దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎరువులు–రసాయనాల వాడకం–నానో యూరియా వినియోగం అవశ్యకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా గురించి రైతులకు వివరించారు. భారతీయుడైన రమేశ్ రాలియా దీనిని కనుగొన్నారని, 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను ప్రయోగించి.. ఫలితాలను పరిశీలించాక మార్కెట్ల్లో విడుదల చేశారని చెప్పారు. దీని వల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని, దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నానో యూరియా వల్ల రవాణా ఖర్చులు తగ్గి, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతుల భారం తప్పుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హన్మంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, మార్కెఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆసియాలోనే పెద్ద మార్కెట్
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రుల నివాస సముదాయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 178 ఎకరాల్లో కోహెడ మార్కెట్‌ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. 41.57 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 45 ఎకరాల్లో రహదారుల నిర్మాణం, 24.44 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్ లే ఔట్, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎస్టిమేట్లకు వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్గావ్)కు టెండర్ అప్పగించామన్నారు. నమూనా లే ఔట్లపై కంపెనీతో పలుమార్లు చర్చలు జరిపామని, సోమవారం రెండు లే ఔట్లను పరిశీలించి, మార్పులు చేర్పులకు ఆదేశించినట్లు తెలిపారు. సీఎం పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రముఖ మార్కెట్లైన ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబై), రాజ్ కోట్, బరుదా (గుజరాత్) మార్కెట్లను సందర్శించి లేఔట్ల నమూనా తయారు చేశామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం, త్వరలో ఆర్ఆర్ఆర్ రానున్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుందని ఆయన తెలిపారు. -
కాళేశ్వరానికి మీ సర్టిఫికెట్ అక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలవనరుల విభాగం నిపుణులే ఇంజనీరింగ్ అద్భుతంగా కొనియాడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్, బీజేపీ నాయకుల సర్టిఫికెట్ అక్కరలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు నీళ్లుతాగి, పంటలు పండించుకుని.. లబ్ధిపొందిన ప్రజలే కాళేశ్వరానికి సర్టిఫికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎక్కడో నీటి లభ్యతలేని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ చేసి మేడిగడ్డకు మార్చారని చెప్పారు. అక్కడే ఇప్పుడు చూస్తున్న అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్.. కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించడాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ఇంత దుర్మార్గంగా ఈర్ష్యను ప్రదర్శించేవారు ఎవరూ ఉండరని, కాంగ్రెస్, బీజేపీ నేతల అక్కసుకు అవధులు లేవని మండిపడ్డారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడటం వారి తీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఎన్నడూ లేని వరద.. గోదావరికి ఎన్నడూ లేని రీతిలో వరదలు పోటెత్తడం వల్లనే ప్రాజెక్టులన్నీ నిండాయని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం కాళేశ్వరం వద్ద వరద నీటి మట్టం 103.5 మీటర్లు ఉంటే దానిని హెచ్చరికగా పరిగణిస్తారని, 104.75 మీటర్ల మట్టం వద్ద ప్రవహిస్తే డేంజర్ లెవెల్ దాటినట్లని తెలిపారు. 1986లో కాళేశ్వరం వద్ద నమోదు అయిన అత్యధిక వరద మట్టం 107.05 మీటర్లు కావడంతో, ఆ ఎత్తును దృష్టిలో పెట్టుకొనే పంప్ హౌస్‌లు నిర్మించారన్నారు. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 14వ తేదీన కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 108.19 మీటర్లు నమోదు అయిందని వివరించారు. గతంలో శ్రీశైలానికి 25 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కర్నూలునగరం మునిగిందని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు తేడా తెలియకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం 1998లో, 2009లో మునిగిందని, కల్వకుర్తి ఎత్తిపోతల రెండు సార్లు మునిగిందని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన జూరాల ప్రాజెక్టులో నీటిలభ్యత కేవలం ఆరు టీఎంసీలే కాబట్టి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో చేపట్టినట్లు తెలిపారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇచ్చిందని, రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని పార్లమెంటులో డిమాండ్ చేయాలన్నారు. -
తొలి రోజు రూ.586 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలి రోజు రూ.586.65 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సొమ్ము 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. మొదటిరోజు 11.73 లక్షల ఎకరాలకు సాయం అందినట్లు వెల్లడించారు. దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కాగితాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ‘జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు ఉండవా ? రాష్ట్రానికో విధానం ఉంటుందా ?’ అని ప్రశ్నించారు. అధికార కాంక్ష తప్ప కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం మీద ప్రేమ లేదని, ఆ పార్టీల పిల్లిమొగ్గలను ప్రజలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే చూశారని అన్నారు. -
నేటి నుంచి ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్లో 68.10 లక్షలమంది రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందడానికి అర్హులని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మంగళవారం(నేడు) నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మొదటిరోజు ఎకరా వరకు భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు 586.65 కోట్లు జమ చేస్తామని పేర్కొంది. 1,50,43,606 ఎకరాలకు చెందిన రైతులకు రైతుబంధు సొమ్ము అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అందుకోసం రూ.7,521.80 కోట్లు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బండి సంజయ్.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయి
సాక్షి, హైదరాబాద్: రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలం గాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు. ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దు తిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదని విమర్శించారు. చదవండి👉🏼 ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు! బండి సంజయ్‌కు చేతనైతే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ+50 ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. హైదరాబాద్ కార్పొరే టర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ అభివృద్ధి కోసం పావలా అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. చదవండి👉🏼 అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం -
గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి
గన్‌ఫౌండ్రీ/కవాడిగూడ(హైదరాబాద్): సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కుల, మత పిచ్చితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నటువంటి వారికి సురవరం జీవితం ఓ సమాధానమన్నారు. ఆయన లాంటి వ్యక్తిత్వమున్న నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, సురవరం ప్రతాప్‌రెడ్డి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అందజేసింది. పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, రచయిత ఈమణి శివనాగిరెడ్డి, డాక్టర్ సింకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్.శేషశాస్త్రి, జె.చెన్నయ్యకు రూ.లక్ష చెక్కుతో పాటు స్మారక పురస్కారాలను ప్రదానం చేసింది. ప్రజల పక్షాన నిలిచిన సురవరం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మం త్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. శనివారం సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలి
సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులు, గొర్రె, మేక మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్పాదకతను పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్‌ను తట్టుకోగలమని పేర్కొన్నారు. చైనాలో ఎకరాకు వంద క్వింటాళ్లు పండిస్తే, మనదేశంలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించగలుగుతున్నామన్నారు. మాంసమైనా, వ్యవసాయ ఉత్పత్తులైనా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడగలుగుతామని స్పష్టం చేశారు. శనివారం చెంగిచెర్లలోని మాంసోత్పత్తి జాతీయ పరిశోధన కేంద్రంను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి సందర్శించి అక్కడ మొక్కనాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..దేశంలో 7.5కోట్ల గొర్రెలుంటే తెలంగాణలోనే 2కోట్ల గొర్రెలున్నాయని, దేశ సగటు తలసరి మాంసం వినియోగం 6 కేజీలని, తెలంగాణ సగటు తలసరి వినియోగం 23 కేజీలుగా ఉందని తెలిపారు. ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలు ఉందని, ఇది 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయని మంత్రి అన్నారు. మంత్రితో పాటు మాంసోత్పత్తిపై జాతీయ పరిశోధన కేంద్రం సంచాలకుడు ఎస్బీ బుద్దే, ప్రిన్సిపల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. -
ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన తెల్వదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) గురించి కనీస అవగాహన లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన తెల్వదు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు.. రిజర్వాయర్లు తెల్వవు.. కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం లేదు.. ఆయన బండి సంజయ్ కాదు.. బంగి సంజయ్..’ అని విమర్శలు గుప్పించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు చేపట్టే పనులు, నిధుల సమీకరణపై వివరాలు వెల్లడించడంతో పాటు ఆరు నెలల్లో ఎలా పనులు పూర్తి చేస్తారో కాగితం రాసివ్వాలని సవాలు చేశారు. గద్వాలలో జరిగిన బహిరంగసభలో ఆర్డీఎస్ ఆయకట్టుకు సంబం ధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. టీఆర్ఎస్ హయాంలో ‘తుమ్మిళ్ల’ బండి సంజయ్, బీజేపీ కర్ణాటక కో–ఇన్చార్జి డీకే అరుణ ఇద్దరూ కలిసి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు అంటే 87,500 ఎకరాలకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తుంగభద్రపై 1946లో మొదలై 1956లో పూర్తయిన ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ఎన్నడూ 20 వేల ఎకరాలకు మించలేదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003లో కేసీఆర్ పాదయాత్ర చేశారని, ఫలితంగా 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటైందన్నారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు సాగు నీరు అందించడం లేదని కమిటీ నివేదిక ఇచ్చినా ఉమ్మడి పాలకులు స్పందించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. 50 వేల ఎకరాలకు సాగునీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ–డిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్ మీద సంపూర్ణ సమీక్ష నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు. 2017లో జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.780 కోట్లతో చేపట్టి ప్రభుత్వం కేవలం పదినెలల్లో పూర్తి చేసిందని వెల్లడించారు. ఆర్డీఎస్ కాల్వ కింద సాగునీరందని 50 వేల ఎకరాలకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తున్నామని.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని చెప్పారు. పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలి.. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హంద్రీనీవా నీళ్లకు హారతి పట్టిన డీకే అరుణను పక్కనపెట్టుకుని, బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. -
ప్రతిగింజా కొంటామని కిషన్‌రెడ్డి చెప్పలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజా కొనిపించే బాధ్యత నాది అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పింది నిజంకాదా? వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. కొనిపించే బాధ్యత నాది. అన్నది గుర్తు లేదా? రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్ చెప్పింది వాస్తవం కాదా? ఆ తర్వాత రా రైస్.. బాయిల్డ్ రైస్ పేరుతో రాజకీయం చేసింది నిజం కాదా? ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా’ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు పలు ప్రశ్నలతో కూడిన ప్రకటన విడుదల చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పుడైనా నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను రూ.1,200 కోట్లతో పునర్నిర్మించినట్లుగా కనీసం రూ.500 కోట్లు కేంద్రం ద్వారా తీసుకొచ్చి జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తామని వాగ్దానం చేసే దమ్ముందా? అని మంత్రి సవాల్ విసిరారు. -
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు విముఖత చూపుతున్న కేంద్రం మెడలు వంచేందుకు ఉగాది తర్వాత ఉగ్ర రూపం చూపుతామని రాష్ట్ర మంత్రుల బృందం హెచ్చరించింది. ఈ అంశంపై ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖకు నెలాఖరులోగా జవాబు రాకపోతే కేంద్రంపై తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రుల బృందం శుక్రవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తమపట్ల వ్యవహరించిన తీరు, కేంద్రం మెడలు వంచేందుకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను శనివారంవారు వెల్లడించారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, తెలంగాణను అవమానించి అవహేళన చేసిన ఎందరో నేతలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చరిత్ర పుట ల్లో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను అవమానించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. బీజేపీకి కౌరవులు, రావణాసురుడి గతే: నిరంజన్‌రెడ్డి మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులకు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడికి దక్కిన ఫలితమే తెలంగాణ ప్రజలను అవమానించిన బీజేపీకి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆరు దశాబ్దాల అన్యాయాల చేదు జ్ఞాపకాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణలో ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట కేంద్రం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తనదంటూ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రోజుకోమాట మారుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తన మెదడుకు తాళం వేసుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గతంలో కేంద్ర విధానాలను తప్పుబట్టిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం ప్రధాని హోదాలో అవే తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. బియ్యం నిల్వల నిర్వహణ, ఎగుమతుల్లో కేంద్రానికి విధానమంటూ లేదని, రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత వరకు రాష్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారి మెదడుకు, నాలుకకు లింకులేదు: ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలుపై 16 లేఖలు రాసినా స్పందించకపోగా ఈ అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు తెలంగాణ ప్రతినిధులు హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పడాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ వ్యాఖ్యలతో గుండెల నిండా బాధనిపించిందని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ‘మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి’అని తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకుల నాలుకకు, మెదడుకు లింకు తెగిపోయిందని దుయ్యబట్టారు. సంజయ్ మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని.. అందుకు సహకరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉగాది వరకు కేంద్రానికి నిరసన తెలుపుతామని, ఆ తర్వా త నూకెవరో, పొట్టు ఎవరో తేలుస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని కేంద్రం భావిస్తే అది శునకానందమే అవుతుందని హెచ్చరించారు. -
కిషన్‌రెడ్డిపై మంత్రి నిరంజన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను అవమానించిన వారు ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం లేదు. పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిది. కేంద్రం లేకి మాటలు మాట్లాడుతోంది. రా రైస్, బాయిల్డ్ రైస్ అని కన్ఫ్యూజ్ చేయడం తప్ప కేంద్రం ఏం చేస్తుంది. మేము వడ్లు ఇస్తం.. ఏం చేసుకుంటారనేది కేంద్రం ఇష్టం. తెలంగాణ రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు..?. ఆయనకు రైతుల కష్టాలు పట్టవా. మేము ఇన్నిసార్లు పీయూష్ గోయల్‌ను కలిస్తే ఒక్కసారి అయినా కిషన్‌రెడ్డి వచ్చాడా..?. కేంద్రం మార్గాలు వెతకాలి. కాలానుగుణంగా మార్పులు రావాలి. ఇథనాల్ ప్రొడక్షన్ 2025 నాటికి 20 శాతం పెంచుతామన్నారు. ఇప్పటి వరకూ 5శాతం దాటలేదు. గోదాములు ఖాళీ లేవంటున్న కేంద్రం... ఎందుకు ఖాళీ చేయడం లేదు. ప్రజలకు బియ్యాన్ని పంచరెందుకు?. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు లేవు. 28, 29న సార్వత్రిక సమ్మె చేస్తాం. ఉగాది తర్వాత ఉదృతమైన ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయింది. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయం. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని' మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. చదవండి: (ఆర్ఆర్ఆర్ తొలి గెజిట్‌కు గ్రీన్‌సిగ్నల్.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు) -
27న రాష్ట్రస్థాయి సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27న వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి, సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు,ను నిర్వహిస్తున్నట్లు గాంధీ సంస్థల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని పంటలను ప్రోత్సహిస్తూ వస్తున్నామన్నారు. -
విద్యార్థులు వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలి
మేడ్చల్ రూరల్: విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మాత్రమే వెళ్లకుండా అగ్రికల్చర్ రంగంపై వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మైస మ్మగూడలోని మల్లారెడ్డి యూ నివర్సిటీలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాల సక్సెస్ మీట్ కార్యక్రమా ల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అగ్రికల్చర్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపే వెళ్లకుండా అగ్రికల్చర్ సంబంధిత కోర్సులు చేయాలని సూచించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలోని కూడా అనేక మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి గ్రూప్స్ డైరెక్టర్ శాలినీ రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు. -
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కావున ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రైతుబంధు.. టాప్‌లో ఏ జిల్లా అంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు యాసంగి రైతుబంధు సొమ్ము అందింది. మొత్తం 1.48 కోట్ల ఎకరాలకు చెందిన రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లు జమయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ. 601,74,12,080 నిధులు అందాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని సూచించారు. పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
విజన్ కావాలి విజన్!
కేంద్ర పభుత్వ పెద్దలకు వాగ్దానాలు చేయడం తప్ప వాటిని నిలుపుకోవడం తెలియదని గత ఏడేళ్లుగా వారి పాలన చూస్తే అర్థమవుతుంది. 2016, ఫిబ్రవరి 28న దేశ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తాం అని ప్రధానమంత్రి ప్రకటించారు. కానీ రైతుల ఆదాయం ఏమాత్రం పెరగలేదు. ఎరువులపై సబ్సిడీని ఎత్తివేసి వాటి ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది కేంద్రం. ఇలా కేంద్రం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం... సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ... ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, మద్దతు ధరను రైతులకు అందిస్తూ సరైన దార్శనికతతో ముందుకు సాగుతోంది. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక సాగుభూమి కలిగి ఉన్నది భారతదేశం. కానీ వ్యవసాయ ఉత్పత్తులలో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 60 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధార పడి ఉన్న దేశం మనది. ముందుచూపు ఉన్న ఏ పాలకుడైనా దేశంలో వ్యవసాయరంగ బలోపేతానికి కృషి చేస్తారు. కానీ మన పాలకులకు ఆ స్పృహ లోపించిందని భావించడంలో తప్పులేదు. అందుకే ఈ దేశ రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశపాలకులు వ్యవసాయానికి ప్రోత్సాహం అందించకపోగా ఆ దిశగా కృషిచేస్తున్న రాష్ట్రాలకు వెన్నుదన్నుగా కూడా నిలవడం లేదు. కేంద్ర సహాయ నిరాకరణను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, గోదావరి నది మీద ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకం– కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేసి సాగునీరు అందుబాటు లోకి తెచ్చింది. 45 లక్షల ఎకరాలకు సాగునీటికి ఢోకా లేకుండా చేసింది. కృష్ణా నది మీద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం. 70 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా లలో 12 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందనుంది. కేంద్రం నుంచి నిధులు అందకపోయినా... తెలంగాణ ప్రభుత్వమే సొంత నిధులతో ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలోనే కాదు... అసలు కేంద్ర ప్రభు త్వానికి ఏ విషయంలోనూ ఒక స్పష్టమైన జాతీయ విధానం లేదని పిస్తుంది. 2016, ఫిబ్రవరి 28న దేశ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతుల ఆదాయం రెట్టింపునకు ఎలాంటి విధా నాలను అనుసరించాలి, సాగు విషయంలో, పంటల కొనుగోళ్ల విష యంలో ఎలాంటి ప్రోత్సాహకాలు అందివ్వాలి, వ్యవసాయ పరిక రాలు, యంత్రాలకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వాలి లాంటి వాటిపై కేంద్రా నికి కార్యాచరణ లేదు. రైతుల ఆదాయం రెట్టింపునకు సంబంధించి 2018 సెప్టెంబరులో ‘డబులింగ్ ఫార్మర్స్ ఇన్‌కం కమిటీ’ (డీఎఫ్ఐసీ) నివేదిక ఇస్తుందని ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత డీఎఫ్ఐసీ రిపోర్టు ఇచ్చింది. దానిని యథావిధిగా పట్టించుకోకుండా పక్కనబెట్టారు. 2020లో ఇదే కమిటీ గ్రామీణ రైతుల ఆదాయాన్ని పరిశీలించి 2014లో రైతుల ఆదాయం ఏడాదికి రూ.70 వేలు ఉందని, 2020 నాటికి అది స్వల్పంగా తగ్గిందనీ, ద్రవ్యోల్బణం పెరిగిన మాదిరిగా రైతుల ఆదాయం పెరగలేదనీ నివేదిక ఇచ్చింది. వ్యవసాయ గ్రాస్ వ్యాల్యూ అడిషన్ యూపీఏ ప్రభుత్వంలో 4.6 శాతం ఉంటే, మోదీ ప్రభుత్వంలో అది ఎన్నడూ 3.3 శాతానికి మించలేదు. కేంద్రం చెప్పిన డబులింగ్ ఫార్మర్స్ ఇన్‌కం లెక్కల ప్రకారం 2016 నుంచి ఏడాదికి 14 శాతం చొప్పున రైతుల ఆదాయం పెరిగితే తప్ప రైతుల ఆదాయం రెట్టింపు అవ్వదు. కానీ ఎన్నడూ 3.3 శాతానికి మించకపోవడం గమ నార్హం. ఆయా రాష్ట్రాలలో వివిధ పంటల సాగుకు ఆయా ప్రాంతాన్ని బట్టి సాగు ఖర్చులు ఉంటాయి. కానీ దేశం మొత్తం అన్ని పంటలకూ ఒకే రకమైన మద్దతు ధర ఇవ్వడం అశాస్త్రీయమే. ఇదే కమిటీ లెక్కల ప్రకారం 2002లో రైతులకు వచ్చిన ఆదాయం, 2022లో రైతులకు వస్తున్న ఆదాయం ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే సమానంగా ఉంది. దీన్నిబట్టి కేంద్రం రైతుల ఆదాయం రెట్టింపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలి పోతున్నది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో విఫలమైన కేంద్రం హడావిడిగా నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి మద్దతు ధరకు మంగళం పాడి, రైతు ఎక్కడయినా పంటలు అమ్ముకోవచ్చు అని ప్రకటించి, మార్కెట్ యార్డులను ఎత్తేసి, అసలు రైతులు ఎవరికీ మొరపెట్టుకునే పరిస్థితి లేకుండా చేయాలని ప్రయత్నించింది. రైతులు సంఘటితంగా 15 నెలల పాటు చారిత్రాత్మక ఆందోళనలు చేయడంతో తిరిగి నల్లచట్టాలను రద్దు చేసుకున్నారు. సాక్షాత్తు ప్రధాని దేశ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పి వేడుకున్నారు. ఎరువులు, బీమా సౌకర్యం... ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాలు దిగుమతి చేసు కుంటున్నది భారత్. దిగుమతి సుంకం భారం రైతుల మీద వేయ డంతో పాటు ఎరువులపై సబ్సిడీ ఎత్తేసి రైతుల నడ్డి విరుస్తున్నది. గత ఏడేళ్లలో ఎరువుల ధరలు విపరీతంగా పెంచింది. 28:28:0 ఎరువు ధర రూ. 1,275 నుండి రూ. 1,900, ఎంఓపి (పొటాష్) రూ. 850 నుండి రూ.1,700కి పెరగగా... 14.35.14 ఎరువు ఏకంగా రూ.1,000 పెరిగి రూ. 2,000కి చేరింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం స్పందిం చడం లేదు. దీంతో రైతులకు కూలీల కొరత కొనసాగుతూనే ఉంది. రైట్ ఫర్ ఫుడ్ అనే ప్రాథమిక హక్కును కేంద్రం ఎఫ్‌సీఐ చేతిలో పెట్టింది. దశాబ్దాలుగా కేంద్రం ఆధీనంలోని ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా పంటలను సేకరిస్తూ ఉంది. కానీ మోదీ హయాంలో ఎఫ్‌సీఐ నిర్వీ ర్యమవుతోంది. అది ధాన్యం సేకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెడు తోంది. రాష్ట్రాలు కొన్న తర్వాత తీరికగా ఆ సంస్థ వాటిదగ్గర కొనుగోలు చేస్తోంది. దేశంలో 51 రకాల పంటలు పండుతుండగా కేవలం 23 రకాల పంటలకే కేంద్రం మద్దతుధర ప్రకటిస్తుంది. ప్రకటించిన ధరలకు మొత్తం కొనుగోళ్లు ఉండవు. దిగుబడులు పెంచేందుకు నిరంతరం నూతన వంగడాలను సృష్టించి రైతులకు అందించాలి. ఇది కేంద్ర ప్రభుత్వ (ఐసీఏఆర్) విధి. కానీ కేంద్రం నూతన వంగడాల సృష్టికి కృషి చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీమా విషయంలోనూ అంతే. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధాన ఉద్దేశం పంటల నష్టాలు తలెత్తితే బీమా ద్వారా ఆర్థిక చేయూత అందించడం. ఈ పథకంలో రైతులు చెల్లించే ప్రీమియం ఎక్కువ. రైతులకు దక్కేది తక్కువ. రైతు కేంద్రంగా బీమా వర్తించదు. ఒక ప్రాంతం మొత్తంలో వేసిన పంటలో కనీసం 40% పైగా దెబ్బతిని ఉండాలి. అందుకే మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు ఈ పథకం నుంచి వైదొలగాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం అమలులో లేదు. కేంద్ర ప్రభుత్వ నూతన ప్రతిపాదిత కరెంట్ చట్టాలతో ఈ పథకం అమ లుకు ఇబ్బందులు ఏర్పడతాయి. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని, సబ్సిడీలు ఎత్తేయాలని ఇందులో పేర్కొన్నారు. ఈ విధంగా సాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మద్దతుధర, మార్కెటింగ్ వసతులు... ఏ విషయంలోనూ రైతు, వ్యవసాయ అనుకూల నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. పైగా కేంద్ర అసంబద్ధ విధానాలు, నిర్ణ యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల రైతులు వ్యవసాయం చేయటం దుర్లభంగా మారుతున్నది. పెట్టుబడులు గణ నీయంగా పెరిగిపోవడం, ఆదాయం ఆ మేరకు పెరగకపోవటం మూలంగా సాగు ఏ మాత్రం లాభసాటి కానిదిగా భావిస్తున్నారు రైతులు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కేంద్రం పాత్ర ఏ మాత్రం లేక పోయినా కేసీఆర్ ఒక దార్శనిక దృష్టితో సాగును లాభసాటి చేసేం దుకు 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత సాగు నీరు, ఎదురు పెట్టు బడి (రైతుబంధు) నియంత్రణతో ఎరువులు–విత్తనాల సరఫరా చేస్తూ అన్నదాతల ఆత్మస్థైర్యం పెంచుతున్నారు. ఇదే సమయంలో కేంద్రం రైతాంగ సాగు వ్యతిరేక విధానాలు దేశాన్ని ‘అన్నమో రామ చంద్రా’ అనేలా చేస్తాయేమో అనే ఆందోళన సర్వత్రా కన్పిస్తున్నది. వ్యాసకర్త: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు, తెలంగాణ -
4వరోజు రూ.1144.64 కోట్ల రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు నిధులు విడుదలలో భాగంగా నాలుగో రోజు 6,75, 824 మంది రైతుల ఖాతాల్లో రూ.1144.64 కోట్లు జమ అయ్యాయని వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 52,71,091 మంది రైతుల ఖాతాల్లో రూ.4246.86 కోట్ల రైతుబంధు నిధులు జమ అయ్యాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మరో 17.31 లక్షల మందికి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రెండోరోజు రూ.1255.42 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఒక్కరోజే 17,31,127 మంది రైతులకు సాయం అందించామన్నారు. మంగళ, బుధవారాల్లో మొత్తంగా 35,43,783 మంది రైతుల ఖాతాల్లో రూ.1799.99 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడులు పెరగడంతో పలు రంగాలకు ఉపాధి లభించిందన్నారు. -
‘కేంద్రంలో కత్తులు.. రాష్ట్రంలో వలపు బాణాలు’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కత్తులు దూసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో మాత్రం వలపు బాణాలు విసురుకుంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో బీజేపీలో కలపడం ఖాయమని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైస్ మిల్లులతో ఒప్పందం ఉన్నవారు, సొంతంగా అమ్మకం, విత్తనాల కోసం.. వరి సాగు చేసుకోవచ్చని రైతులకు చెప్పాం. కానీ ఎర్రవల్లిలో వరి చూపించి ఏదో ప్రపంచం మునిగిపోయినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంబోధించడం సరికాదు. రేవంత్‌రెడ్డికి భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకుంటే ఎవరు వద్దన్నారు’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. ‘రైతుల కోసం తెలంగాణ చేస్తున్న ఖర్చులో యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవీ సగం కూడా ఖర్చు చేయడం లేదు. రైతు సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోంది’అని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్న సమయంలో బండి సంజయ్ దీక్షలు హాస్యాస్పదమని అన్నారు. గతంలో కాంగ్రెస్‌కు టీడీపీని అమ్మివేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్‌ను అమ్మే ప్రయత్నంలో ఉన్నారని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. -
ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం సాగిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలతో కూడిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడేళ్ల మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశంలోని ఏ రంగం కూడా బలపడింది లేదని, వ్యవసాయ రంగంపై కేంద్ర నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఏ పథకంలోనూ అణా పైసా కేంద్ర ప్రభుత్వానిది లేదని చెప్పారు. ‘కాళేశ్వరం’ప్రాజెక్టును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నిధులతో నిర్మించుకున్నదని కేంద్రమంత్రే పార్లమెంటులో వెల్లడించారని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై పార్లమెంట్ లోపలా, బయటా టీఆర్ఎస్ ఎంపీలు పోరాడినా వారి ఆందోళనల పట్ల కేంద్రం అమానుషంగా, అమర్యాదకరంగా మాట్లాడిందని విమర్శించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రులు చెప్పిన అబద్దాలపై నిలదీసేందుకు మంత్రుల బృందం శనివారం ఢిల్లీకి వెళుతుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయిందని, మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. గతంలో వానాకాలం పంటనంతా కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు. ఎఫ్‌సీఐ, గోదాంలు, రైళ్లు కేంద్రం అధీనంలోనే ఉన్నాయని.. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకెళ్లకుండా రాష్ట్రం పంపలేదని చెప్పడం అవగాహనా రాహిత్యమని వెల్లడించారు. వ్యవసాయాధికారులు రైతుబంధు విషయంలో చేసిన సూచనను సీఎం కేసీఆర్ తిరస్కరించారన్నారు. శాసనసభ సాక్షిగా రైతుబంధును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని కేసీఆర్ చెప్పారని తెలిపారు. తెలంగాణ రైతులు పరిస్థితిని అర్ధం చేసుకుని ఆరుతడి పంటలు వేస్తున్నారని వివరించారు. వేరుశనగ, పప్పు శనగ 5 లక్షల ఎకరాల చొప్పన సాగయిందని.. మినుములు, పెసలు, ఆవాలు, నువ్వులు, మక్కలు కూడా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్ రెడ్డి, ఎంపీ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంపై పోరు ఆగదు: మంత్రి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, కేంద్రంతో పోరు కొనసాగుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏ రాష్ట్రంలోనైనా ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి బాధ్యతలు ఎఫ్‌సీఐ చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం మాత్రమే అందిస్తాయి. రాష్ట్రంలో యాసంగిలో ఉప్పుడు బియ్యమే పండుతాయని కేంద్రానికి తెలిసినా భవిష్యత్తులో పచ్చి బియ్యమే తీసుకుంటామని అడ్డగోలుగా వాదిస్తోంది’అని విమర్శించారు. కంది సాగును 20 లక్షల ఎకరాలకు పెంచుతాం వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారని.. తెలంగాణ రైతుల కోసం పార్లమెంటులో, బయట పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమేనని నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్రం విధానాలు గమనించే పంటల మార్పిడి వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, కేసీఆర్ పిలుపు మేరకు ఈసారి 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని చెప్పారు. దీన్ని భవిష్యత్ లో 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదని వెల్లడించారు. -
కన్నడ హీరో కొత్త సినిమా, అండగా కేజీయఫ్ టీమ్!
రామ్ గౌడ, ప్రియాపాల్ జంటగా నూతన చిత్రం ప్రారంభమైంది. వి.జె సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీఆర్ ప్రొడక్షన్ పతాకంపై రవి సాగర్ నిర్మిస్తున్నాడు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హీరోహీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా రవి సాగర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ....నువ్వు గొప్పగా కల కనకపోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు అన్న డైలాగ్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ ఒక్క డైలాగ్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పకనే చెప్తుందన్నారు. చిత్ర నిర్మాత సి.రవి సాగర్ మాట్లాడుతూ.. 'నేను గత కొంత కాలంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను, ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో సి.ఆర్ అనే ఒక బ్రాండ్‌తో విషం లేనటువంటి మంచి ఆహారాన్ని సమాజానికి అందిస్తూ అదే పంథాలో ఇప్పుడు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉదేశంతో మీ ముందుకు వస్తున్నాను. పిల్లల్ని మనం హాస్టల్లో జాయిన్ చేస్తూ వారికి మనం మంచి విద్యని మాత్రమే ఇస్తున్నాము. కానీ ఎడ్యుకేషన్ తో పాటు చాలా మిస్ అవుతున్నారు, వారు మిస్సయిన ప్రభావం కొంతకాలం తర్వాత అది ఓల్డ్ ఏజ్ హోంగా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనే కంటెంట్ మీద దర్శకుడు వి జె సాగర్ అద్భుతమైన కథ రాసుకున్నారు' అని తెలిపాడు. దర్శకుడు వి.జె సాగర్ మాట్లాడుతూ.. 'నేను దర్శకత్వ శాఖలో 'తొలిప్రేమ' కరుణాకర్, రసూల్ ఎల్లోర్ దగ్గర పని చేశాను. తర్వాత కొన్ని యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు. ఆ ప్రేమ మిస్ అయితే పెద్దయిన తర్వాత ఎలా తయారవుతారు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాము. కన్నడలో హీరోగా చేసిన రామ్ గౌడ మా సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కేజియఫ్కు సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్ వారే ఈ సినిమాకు పనిచేస్తున్నారు' అన్నారు. -
యాసంగి వరిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి సాగుచేస్తే, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో, లేదో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దొంగదీక్షలు చేసే బీజేపీ రాష్ట్ర నాయకులు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని, కేంద్ర పెద్దలను ఒప్పించాలని సవాల్ చేశారు. పంజాబ్‌లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించడంతోపాటు కొనుగోలు బాధ్యత కూడా కేంద్రానిదేనని అన్నారు. కేంద్రప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించి మిన్నకుండి పోతోందని, తెలంగాణ ప్రభుత్వమే రైతుల సంక్షేమం దృష్ట్యా నష్టాన్ని భరించి కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. పంట వచ్చిన ప్రతిసారి ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐని అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి వ్యవసాయానికి గొడ్డలిపెట్టులా ఉందని విమర్శించారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుంటే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు రాజకీయలబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వరి పంట వేస్తే రైతుబంధు, రైతుబీమా నిలిపివేస్తారని చేస్తున్న ప్రచారం నిరాధారమైనదని, సీఎం కేసీఆర్ బతికున్నంత కాలం ఈ పథకాలు కొనసాగుతాయన్నారు. షర్మిలను అమ్మ అనే పిలిచాను: మంత్రి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పట్ల చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘నేను ఎవరి పేరిటా ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు. చివరన అమ్మా అని కూడా అన్నాను‘ అని మంత్రి వివరించారు. అయి నా తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్న ట్టు తెలిపారు. ‘షర్మిల నా కుమార్తె కంటే పెద్దది.. నా సోదరి కంటే చిన్నది’ అని పేర్కొన్నారు. తన తండ్రి సమకాలికుడైన సీఎం కేసీఆర్‌ను షర్మిల ఏకవచనంతో సంబోధించడం సంస్కారమేనా అని ప్రశ్నించారు. -
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం: మంత్రి సింగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కంపెనీల లాబీయింగ్ కారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా మనిషికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2017 నుంచి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని చెప్పారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుడు గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2017–18 నుంచి 2019–20 వరకు రాష్ట్రంలో 29,200 ఎకరాల విస్తీర్ణం కలిగిన 584 క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2021–22 సంవత్సరానికి గాను జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 750 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రతిపాదించామన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు బడ్జెట్లో రూ. 7,201.57 కోట్లు కేటాయించగా, రూ. 2,598.19 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన, శిక్షణ కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. సవరించిన పేస్కేళ్ల అమలు: మంత్రి సబిత యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా ఆగినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జనవరి 2016 నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి సవరించిన యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం 2019లోనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 3,350 మంది సిబ్బందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా వారికి ఇచ్చేందుకు సర్కార్‌ను గ్రాంట్ అడిగినట్లు వివరించారు. అంతకుముందు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి 3,000 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి జీవో ఇచ్చినప్పటికీ అమలు కాలేదని వివరించారు. కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చి ఏడాదైనా అమలు కాలేదని, కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి 10 శాతం పన్నును ఆదాయపన్ను శాఖ వసూలు చేయడాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు అకాడమీ స్కాంలో నిధుల రికవరీ చేయాలి: ఎంఎస్ ప్రభాకర్ తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లను తస్కరించిన స్కాంలో నిందితులను అరెస్టు చేయడమే కాకుండా నిధులను రికవరీ చేయాలని సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ కోరారు. అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. అందుకు మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ నిందితుల నుంచి నిధులను రికవరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. గిరిజన తెగలకు... ఆదిలాబాద్‌లో గిరిజన తెగల్లో ఒకటైన మన్నెవర్లను కొలవర్లుగా మార్చారని, అయితే మన్నెవర్లుగా ఉన్నప్పుడు వారికి లభించిన లబ్ధి ఇప్పుడు అందడం లేదని సభ్యుడు పురాణం సతీష్ సభ దృష్టికి తెచ్చారు. 55 వేల మంది మన్నెవర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సైనిక సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టి.జీవన్‌రెడ్డి కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, దసరా సెలవుల్లో బడులను సంస్కరించాలని ఆయన సూచించారు. -
వరి ఏ గ్రేడ్‌కు మద్దతు ధర రూ.1,960
సాక్షి, హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులు పంటలకు మద్దతు ధర పొందాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వివిధ రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించారు. ఇవి తక్షణం అందుబాటులోకి వస్తాయన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో పంటల మద్దతు ధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. రైతులు పంట ఉత్పత్తులను శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. వారి సౌకర్యార్థం మార్కెట్ యార్డుల్లో క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని చెప్పారు. వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇచ్చిన తాజా నివేదికనే దీనికి సాక్ష్యమన్నారు. పంటల ఉత్పత్తిలో ఏటా తెలంగాణ రికార్డులు తిరగరాస్తోందని, రైతు రెక్కల కష్టానికి తగిన ఫలితం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పత్తిలో తేమ 8 నుండి 12 శాతం ఉండాలని, తేమ 6–7 శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ కూడా ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడెక్కడ ఏ పంటలు వేయాలి?
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికపై ప్రభుత్వ కసరత్తు మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ ఏయే పంటలు వేయాలనే దానిపై వ్యవసాయ అధికారులతో గురువారం హాకాభవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయా లనే దానిపై మంత్రి ప్రధానంగా చర్చించారు. ఎంత విస్తీర్ణంలో వేయాలి? మార్కెట్లో పంట ల డిమాండ్ ఎలా ఉంది అనే దానిపై వ్యవసాయనిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో మంత్రి ఆరా తీశారు. ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌కు ఇచ్చే తుది నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్రావు, ఉపకులపతి ప్రవీణ్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
విద్యుత్ సంస్కరణలతో రైతులపై భారం
శాలిగౌరారం/ మోత్కూరు/చిట్యాల/ నార్కట్‌పల్లి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ సంస్కరణలు రైతులకు భారంగా మారనున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఒప్పంద వ్యవసాయవిధానం అమలుకు అవకాశం కల్పించిందని, రైతులు కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్లనున్నారని దీంతో వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మోత్కూరు మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా దమ్ముంటే అటువంటి పథకాలు అమలు చేయాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ అధీనంలోని 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు యాత్రలు చేస్తున్నాయని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. శాలిగౌరారం వెళ్తూ మార్గమధ్యంలో చిట్యాలలో రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించి అక్కడ పండించిన వంకాయలను మంత్రి కొనుగోలు చేశారు. నార్కట్‌పల్లిలోని ఓ ఎడ్ల బండిని చూసి.. చాలా రోజుల తర్వాత చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు చర్ల: మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు, పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ రక్షణదళ గార్డు ముసికి బుద్రి అలియాస్ బీఆర్ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఎదుట లొంగిపోయింది. ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా రాంపురంవాసి, గొత్తికోయ తెగకు చెందిన ముసికి బుద్రి ఆరేళ్లుగా పార్టీలో పని చేస్తోంది. ఆమె భర్త ముసికి సోమడాల్ అలియాస్ సోమనార్ కూడా ఊసూరు ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు నెలల వయసు ఉన్న బాబు ఉన్నాడు. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో బుద్రి పోలీసులకు లొంగిపోయింది. -
నాలుగు రోజుల్లో 61,752 మంది రైతుల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: నాలుగో రోజు రుణమాఫీ కింద 10,958 మంది రైతుల ఖాతాల్లో రూ.39.40 కోట్లు బదిలీ అయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 61,752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ అయిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిందని, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఊహించని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. సమయం : ‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది -
దక్షిణ తెలంగాణలో ప్లాంటు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: భూసార పరిరక్షణలో నానో యూరియా కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ కలోల్‌లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణ నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని, ఈ దిశగా ఇఫ్కో యోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, నానో యూరియా వినియోగంతో భూసార పరిరక్షణతో పాటు తక్కువ వినియోగంతో అధిక దిగుబడులు సాధించే వీలుందన్నారు. మంత్రితో పాటు జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ ఉన్నతాధికారి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేశ్ రాలియా తదితరులున్నారు. విస్తృతంగా వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు రాష్ట్రంలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ దిశగా అధ్యయనం కోసం అత్యధిక పరిశ్రమలు ఉన్న గుజరాత్లో పర్యటించి పరిశ్రమలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శనివారం గుజరాత్‌లోని సబర్‌కాంఠ జిల్లాలో పరిశ్రమలను బృందం సందర్శించింది. ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీఎం కె.చంద్రశేఖరరావు సూచనల మేరకు జిల్లాల వారీగా పంట ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్రానికి నానో యూరియా
సాక్షి, హైదరాబాద్: నానో యూరియా.. ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న ఘన యూరియాకు ప్రత్యామ్నాయం. తక్కువ ఖర్చు, పర్యావరణ హితం, మంచి దిగుబడి దీని ప్రత్యేకత. భారతీయ రైతాంగ స్వీయ ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ఆవిష్కరించిన ఈ నానో యూరియా అతి త్వరలో రాష్ట్రానికి చేరనుంది. గుజరాత్‌లోని కలోల్ నుంచి రాష్ట్రానికి బయల్దేరే నానో యూరియా ట్రక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆన్లైన్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు. నానో ప్రత్యేకతలివే ♦నానో టెక్నాలజీతో రూపొందించిన నానో యూరియాతో ప్రభుత్వాలపై సబ్సిడీ, రవాణా భారాలు తగ్గుతాయి. ♦ప్రస్తుతం ఒక బస్తాపై రూ.800 నుంచి రూ.1000 వరకు ప్రభుత్వం రాయితీ భారాన్ని మోస్తోంది. రూ.240కే లభించే 500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ♦ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ పొందింది. ♦ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత నానో యూరియాను రెండుసార్లు పిచికారీ చేయాలి. మామూలు యూరియా సమర్థత 30 శాతమైతే దీని సమర్థత 80 శాతమని ఇఫ్కో చెబుతోంది. -
హమాలీ పనికి మించిన ఉపాధి ఏముంది?: మంత్రి నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్: ‘కొనుగోలు కేంద్రాల కాడ సగటున 100 మందికి పనివస్తుంది. వానాకాలం, యాసంగిలో రెండున్నర నెలలు ఎవరి పనులు వారు చేసుకుంటూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేసుకునే వెసులుబాటు తెలంగాణలో గ్రామగ్రామాన వచి్చంది. ఇంతకు మించిన ఉపాధి ఏముంది? ఉపాధి అంటే ఇది. సదువుకుంటే సర్కారీ నౌకరి వస్తది.. అయితే, సదువుకున్న అందరికీ సర్కారీ నౌకరి రాదు’అని నిరుద్యోగులను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ‘దిశ’సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉండి ఉద్యోగాలను తొలగించి, ప్రైవేట్‌పరం చేస్తున్న పారీ్టలు ఇక్కడ ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు చర్చ చేయకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలంటే వీలుపడుతుందా అని ప్రశ్నించారు. మీడియా వక్రీకరించింది: నిరంజన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌లో తాను మాట్లాడిన మాటలను మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచింది. ఉద్యోగం అంటేనే ఉపాధి. అది కలి్పంచడం ప్రభుత్వ విధి’ అని తానన్న వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నానన్నట్టుగా ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి తెలిపారు. -
చేతులు ఎత్తేసిన తెలంగాణ మంత్రులు
బోథ్: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని, డిమాండ్ లేదనే మొక్కజొన్న పంట వేయవద్దని తెలిపామని, కానీ ప్రత్యామ్నాయ పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, కొనడం కష్టమేనని, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు స్పష్టం చేశారు. జొన్నపంటను కొనుగోలు చేయాలని మంత్రులకు ఫోన్ చేసిన రైతులతో అన్న మాటలివి. పంట కొంటామనలేదు.. టీ– శాట్ ఛానల్లో సోమవారం సాయంత్రం సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఫోన్ చేసిన రైతులకు పలు సూచనలు చేశారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన భీమ గోవింద రాజు టి శాట్ ఛానల్‌కి ఫోన్ చేయగా.. మంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వేయవద్దని చెప్పిందని.. ప్రత్యామ్నాయంగా జొన్నపంట వేశామని, ప్రభుత్వం కొనాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటను వేయాలని మాత్రమే చెప్పామని అన్నారు. ఆ పంటను ప్రభుత్వం కొంటుందని ఎక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు. మా చేతిలో ఏమీ లేదు: మంత్రి ఐకేరెడ్డి మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన పసుల చంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంగళవారం జొన్న పంట కొనుగోలు చేయాలని ఫోన్లో విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. జొన్న పంటను కొనుగోలు చేయడం మా చేతుల్లో లేదని, బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసిందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను మాత్రమే వేయాలని రైతుకు సూచించారు. తమ జిల్లాలో 50వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని, ప్రభుత్వం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. జొన్న పంట వేయమని ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. మంత్రులు పంట కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘రాష్ట్రంలోనే మేడ్చల్ అగ్ర పథంలో కొనసాగుతుంది’
సాక్షి, మేడ్చల్ : రైతులు అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలనే లక్ష్యంతో అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్‌పేట్ మండల కేంద్రంలో వ్యవసాయదారుల సేవ సహకార సంఘం నిర్మించిన భవనాన్ని భవనాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వెయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గిడ్డంగులను రెండు కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. దీంతోపాటు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ మాట్లాడుతూ.. శామీర్‌పేట్ వ్యవసాయదారుల సేవ సహకార సంఘం ఇతర సహకార సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులకు అవసరమైన గిడ్డంగులను నాబార్డు నుంచి రుణం పొంది తమ సహకార సంఘం అద్వర్యంలోనే రెండు గిడంగులు నిర్మించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. శామీర్‌పేట్ వ్యవసాయదారుల సేవ సహకార సంఘం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చైర్మన్ ముధాకర్ రెడ్డిని మంత్రి ప్రశంసించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించటంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలోనే అగ్ర పథంలో కొనసాగుతుందని మంత్రి అన్నారు. ముడుచింతలపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణానికి సహాయం చేసిన ముగ్గురు దాతలను మంత్రి అభినందించారు. చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం! అందుకే ఖమ్మం వచ్చా: యాంకర్ ప్రదీప్ -
కదం తొక్కిన పాలమూరు సర్పంచ్‌లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా సర్పంచ్‌లు నిరసనబాట పట్టారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు, రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న నూతన ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఉపాధిహామీ పథకం పనుల బిల్లులు, జనాభా ప్రాతిపదికన డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు, గ్రామ పంచాయతీలకు వీధిదీపాల నిర్వహణ తదితర డిమాండ్లు ఆమోదించాలని నినదించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని వైట్‌హౌస్‌లో అధికారులు ఏర్పాటు చేసిన సర్పంచ్ల అవగాహనాసదస్సును బహిష్కరించారు. ఉదయం జిల్లా నలుమూలల నుంచి భారీర్యాలీలుగా వైట్‌హౌస్‌కు చేరుకున్న సర్పంచ్‌లు లోపలికి వెళ్లకుండా అరగంటపాటు బయట ఆందోళనకు దిగారు. అప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సభాప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బయటికి వచ్చి సర్పంచ్‌లను సముదాయించే ప్రయత్నం చేశారు. సర్పంచ్‌లు చివరికి లోపలికి వచ్చి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల తీరుపై మంత్రులు దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు నా మాట వినకపోతే వెళ్లిపోతా. పరిస్థితి ఇలా ఉంటుం దనుకుంటే అధికారులతోనే సమీక్ష పెట్టుకునేవాళ్లం. పాలమూరు నుంచే సదస్సులు ప్రారంభించాలనుకున్నాం. మీరిలా చేయడం నన్ను బాధించింది’అని ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ నడుమ సర్పంచ్ల సదస్సు పూర్తయింది. ఇప్పటికిప్పుడే మార్పు అసాధ్యం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు ఇప్పటికిప్పుడే అసాధ్యమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘మీ గౌరవవేతనం మంజూరుకు ఉపసర్పంచ్ సంతకం తప్పనిసరి. కొంతమంది ఉపసర్పంచ్లు సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో చర్చించి నేరుగా అవి మీ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఉపసర్పంచులు వారంరోజుల్లో సంతకం చేయకుంటే వారి చెక్‌పవర్‌ను రద్దు చేసి ఆ అధికారం మీకు నమ్మకస్తుడైన వార్డ్‌మెంబర్‌కు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. అందుకూ ఓ పద్ధతి ఉంది. మీరు ముందుగా అధికారులకు పిటిషన్ ఇవ్వాలి. ఒకవేళ అధికారులూ స్పందించకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. సర్పంచ్‌లను సముదాయిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
మీ స్థాయెంత.. మీ లెక్కెంత..?
సాక్షి, నిర్మల్ : ‘పన్నులు కట్టేది ప్రజలు.. పదవులు ఇచ్చేది ప్రజలు. ఢిల్లీకి చేరే డబ్బు ట్రంప్, జిన్‌పింగ్‌ది కాదు. రాష్ట్రాల నుంచి ప్రజలు చెల్లించే పన్నులే. నిధులు తీసుకోవడం రాష్ట్రాల హక్కు. కేంద్రం ఒక్క పార్టీ జాగీరా..! నిధులిస్తున్నం ఫొటోలు పెట్టండని దబాయించడమేంది. కేంద్రంతో బాగుపడిన ఒక్క స్కీం కూడా లేదు. ఓ వైపు రాష్ట్రం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తుంటే.. కేంద్రం కొత్త చట్టాలతో తిరోగమనం పట్టిస్తోంది. రాష్ట్రంలో మీరు చేస్తున్నది ప్రజాస్వామ్యమా..? దాదాగిరా..? సీఎంను, మంత్రులను ఏకవచనంతో పిలుస్తారా..? మీ స్థాయి ఎంత..? లెక్కెంత..?’ అంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. నిర్మల్ జిల్లాలోని రూరల్ మండలం చిట్యాల, ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామాల్లో అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కో–ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి శనివారం రైతు వేదికలను ప్రారంభించారు. వ్యవసాయం పెరిగితేనే పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు పెరుగుతాయని, పల్లెల్లో సాగు బాగుంటేనే పట్టణాల్లో వెలుగులు ఉంటాయని, రైతు సమస్యలకు ఆధునిక పరిష్కారాలు చూపుతూ.. రైతువేదికలను ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతామని తెలిపారు. చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రి హరీశ్ వేదికల ద్వారా రైతుల ఇంటికే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారకాలు డోర్‌డెలివరీ చేస్తామన్నారు. వ్యవసాయ అభివృద్ధికి రైతుబంధు మొదలు ఉచిత విద్యుత్ వరకు రాష్ట్రం అందిస్తుంటే కేంద్రం మాత్రం రివర్స్‌గేర్‌లో పనిచేస్తోందని మండిపడ్డారు. మూడు కొత్త చట్టాలతో వ్యవసాయాన్ని బడావ్యాపారుల చేతుల్లో పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో రైతులు నష్టపోవద్దనే రాష్ట్రం ఆ చట్టాలను వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రంలో బండోడు, గుండోడు, చెండోడు జమయ్యారని, తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ప్రధాని పీఠానికి విలువనిచ్చి మాట్లాడుతుంటే.. వాళ్లు మాత్రం సీఎం, మంత్రులను ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విమర్శిస్తున్న నేతలు కేంద్రంతో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. పది లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు కట్టారా..? పది లక్షల మందికి ఉపాధి ఇచ్చారా..? అన్ని ప్రశ్నించారు. రైతువేదికలకు నిధులిస్తున్నాం.. ఫొటోలను పెట్టాలని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే.. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలితరాష్ట్రాల్లో అమలు చేయాలని హితవు పలికారు. చదవండి: బిగ్‌బాస్: అతడికే ఓటు వేసిన హిమజ ఊళ్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల తర్వాత స్నానాల కోసం కాసేపు కరెంటు వేయండని బతిమాలిన రోజుల నుంచి.. మిగులు విద్యుత్ వరకు ఎదిగామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతుబంధు రానివారు ఈనెల 20 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, ఇప్పుడు రైతువేదికలు ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. చిట్యాలకు వచ్చేముందు బీజేపీ నాయకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతువేదికలపై ప్రధానమంత్రి, ఎంపీల ఫొటోలను పెట్టాలని నినాదాలు చేశారు. పోలీసుల అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో నిర్మల్ జెడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్ ముషరఫ్‌అలీ ఫారూఖి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ పాల్గొన్నారు. -
రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలి
సాక్షి, హైదరాబాద్: అధిక ఉత్పత్తి, సమీకృత మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధికి రైతుబంధు సమితులు క్రియాశీలకంగా వ్యవహరించి రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్, సహకార స్ఫూర్తి అమలుకాకపోవడంతో సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చారని చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నాలుగోరోజు పుణె సమీపంలోని బారామతి సోమేశ్వర రైతు సహకార చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన వ్యవసాయానికి శరద్ పవార్‌ను ఆద్యుడిగా రైతులు భావిస్తారని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర సహకార రంగంలో రైతుల పాత్ర అద్వితీయమని కొనియాడారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి లేకుండా రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి అనేక కర్మాగారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 27 వేల మంది రైతులు సమష్టిగా చెరుకు పండించి వారే తమ సహకార పరిశ్రమలో చక్కెర, ఇథనాల్, కరెంటు తయారు చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుండడంపై శరద్ పవార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, పంటల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తను, తన పార్టీ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేయడం సంతోషంగా ఉందన్నారు. -
కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కలిసిన తెలంగాణ మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇవాళ(మంగళవారం) కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కేంద్ర మంత్రిని కలిశానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ఎరువుల అవశ్యకత గురించి కేంద్రమంత్రికి వివరించినట్లు చెప్పారు. ఎపుడు లేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయం పండించామని, వర్షాలు కూడా విస్తారంగా కురువడంతో రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయన్నారు. ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది కోటి ఇరవై లక్షల ఎకరాలలో వివిధ పంటలు వేశామని, ఎనిమిది లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలిపాన్నారు. ఈ స్థాయిలో దేశంలో సాగు విస్తీర్ణం ఎప్పుడు లేదని సీఎం కేసీఆర్ వ్యవసాయ సానుకూల నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ఈ స్థాయిలో పంటలు వేసినట్లు కేంద్రమంత్రికి వివరించానని ఆయన పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఎరువులు ఎక్కువగా కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సింగిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, మిగతా ఎరువులు 11 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవసరం ఉన్నట్లు చెప్పామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున్న క్రమంలో ఎక్కడ ఏ మండలాల్లో, ఏ ఊరిలో ఎంత వర్షం పడుతుందో అధికారులు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. వర్షాలు కారణంగా రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టం జరగలేదన్నారు. వరి సాగుకి కానీ పత్తి పంటకు కానీ ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఎక్కడైన నీళ్లు మల్లుకుంటే కాపర్ కార్బోనేట్ స్ప్రే ద్వారా పత్తి పంటను కపడుకోవచ్చని సింగిరెడ్డి తెలిపారు -
అవి కేసీఆర్‌తోనే సాధ్యమైంది: సింగిరెడ్డి
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలో 60 ఏళ్లలో 50 సబ్ స్టేషన్లు కడితే ఆరేళ్లలో 58 సబ్ స్టేషన్లు కట్టామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత కరెంట్, తెలంగాణ రావడం, కేసీఆర్ నాయకత్వం మూలంగానే సాధ్యమయిందన్నారు. 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 60 ఏళ్లు ఏమీ చేయని వారు కూడా 24 గంటల కరెంట్ సరఫరాను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరులో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సీఎం కేసీఆర్ మూలంగానే సాధ్యమైందని మంత్రి వ్యాఖ్యానించారు. -
ఉత్పాదనలో ఈరెండింటినీ అధిమించాలి: మంత్రి
సాక్షి, హైదరాబాద్ : మానవ వనరులు, సాగు భూమి పుష్కలంగా ఉన్న మనం అమెరికా, చైనాలను అధిగమించలేకపోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉన్నతాధికారులు, శాస్త్రవేతలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... వ్యవసాయంలో చారిత్రక మార్పుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదనలలో చైనా, అమెరికాలను మనం అధిగమించాలన్నారు. అమెరికాలో వ్యవసాయం చేసేవారు 30 శాతం నుంచి 3 శాతానికి పడిపోయినా వారు అగ్రస్థానంలోనే ఉన్నారన్నారు. మన దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్ 6 ఏళ్లుగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. (రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్) కావునా రైతుబంధు సమితి అధ్యక్షులు, శాస్త్రవేత్తలు నూతన వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కాగా క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు ఎంతో ముఖ్యమని మన ఆహార అవసరాలకు అవసరమైన పంటలు పండిస్తున్నారన్నారు. కానీ ప్రపంచానికి అవసరమైన, ఆదాయాన్ని ఇచ్చే పంటలను మనం పండించాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతాంగానిది దిక్కుతోచని పరిస్థితి.. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ రైతు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారుని తెలిపారు. అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకున్న తెలంగాణ ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందన్నారు. కుదేలైన సేద్యాన్ని కుదుటపరిచి దీని మీద బతకగలం అన్న విశ్వాసాన్ని కేసీఆర్ రైతులకు కలిగించారిని పేర్కొన్నారు. 42 శాతం జీడీపీ వ్యవసాయరంగం నుండే వస్తుందని, అర్థికవేత్తలు 14.5 శాతం అంటారు కానీ వ్యవసాయ అనుబంధరంగాలు కలిపితే 42 శాతం ఉంటుందని చెప్పారు. (మంత్రులకు, ఎమ్మెల్యేలకు సజ్జల లేఖ) ఆర్థిక నిపుణులు ఎందుకు వ్యవసాయరంగంపై పెట్టే పెట్టుబడులను చిన్నచూపు చూస్తున్నారో అర్థం కాదన్నారు. 52 శాతం రైతులు అప్పుల్లో ఉంటారన్నది నిపుణుల నివేదిక సారాంశమని, వారు అప్పుల ఊబి నుంచి బయటకు రావాలనే సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మొగులు వైపు తెలంగాణ రైతు ఎదురు చూడొద్దని, సమయం వచ్చిందంటే అరక కట్టాలన్నారు. ఇక గోదావరి, కృష్ణ నదుల వల్ల రైతులు ఇబ్బందులు పడొద్దనే కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. రైతులు మార్చి చివరి నాటికి యాసంగి వరికోతలు పూర్తయ్యేలా సాగుచేస్తే అకాల వర్షాల మూలంగా నష్టపోయే పరిస్థితి తప్పుతుందని సూచించారు. తెలంగాణ ఆహార సెజ్‌లను ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయించారు.. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు భారీ ఎత్తున వస్తాయని తెలిపారు. దీనికి సంబంధించిన విధాన నిర్ణయం కేసీఆర్ త్వరలో ప్రకటిస్తారని వెల్లడించారు. (డబుల్ బెడ్రూం నిర్మాణాలపై కేటీఆర్ సమీక్ష) మార్కెట్లో ధర లేదని అమ్మితే లగేజీ ఛార్జీలు రావని కూరగాయల గంపలను రైతులు బస్సులోనే వదిలేసి పోయిన ఎన్నో సంఘటనలు ఉద్యమంలో తాము ప్రత్యక్ష్యంగా చూశామన్నారు. సన్నబియ్యం పండించి అందరికి అందించే రైతన్న దొడ్డు బియ్యం తినే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి రైతు బయటకు రావాలనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండాపట్టి రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఇప్పుడు రైతుల కోసం పని చేస్తున్నామని, ఇంతకుమించిన అదృష్టం ఏముంటుందని ఈ దేశం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ రంగంలో హరిత, శ్వేత, నీలి,పసుపు తదితర రకాల విప్లవాలు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. మనం మరో విప్లవం దిశగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదే నియంత్రిత సమగ్ర వ్యవసాయమన్నారు. కాగా ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వీసీ ప్రవీణ్ రావు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
కోహెడ బాధితులకు ప్రభుత్వం అండ: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోహెడ మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కల్పించటం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కోహెడ దుర్ఘటనపై స్పందించిన ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని చెప్పారు. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప అమ్మ, సన్ రైస్, షాడో, టైటాన్ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన చెప్పారు. సీరియస్ ఉన్న ఒకరిని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స అనంతరం 12 మందిని ఆసుపత్రి నుండి వైద్యులు డిశ్చార్జి చేశారని, మిగిలిన 18 మంది చికిత్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. నాలుగు ఆసుపత్రుల్లో పర్యవేక్షణకు నలుగురు అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కోహెడలో గంటకు 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి విచినట్లు వాతావరణ శాఖ నివేదిక తెలిపిందన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి రాజకీయాలు పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ రైతులకు భరోసా ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్కెట్ పునరుద్దరించే వరకు కొనుగోళ్ల కోసం రైతులకు, ట్రేడర్లకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇక సోమవారం కోహెడ మార్కెట్లో మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. -
రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్’
సాక్షి, హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఇంటి వద్దకే పండ్లను అందించే ప్రయోగం బాగుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. మూసాపేటలోని వాక్ ఫర్ వాటర్ పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. జంటనగరాలలో ఇప్పటివరకు 71 వేల కుటుంబాలకు రైతుల నుంచి 11 వందల 25 టన్నుల పండ్ల సరఫరా జరిగినట్లు తెలిపారు. మరిన్ని నాణ్యమైన సేవల కోసం తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. (ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది: బండి సంజయ్ ) వాక్ ఫర్ వాటర్, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ 5 కిలోల బత్తాయి, మామిడి పండ్లు తీసుకుంటే ఉత్పత్తిలో 50 శాతం ఇక్కడే వినియోగమవుతుందన్నారు. రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్ తో పాటు, రూ.300 కు 5 కిలోల పండ్లు, సేంద్రీయ, ప్రత్యేక రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు. 88753 51555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందతాయని మంత్రి తెలిపారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్) -
ఫోన్ కొట్టు..పండ్లు పట్టు
లక్డీకాపూల్ (హైదరాబాద్): లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్‌కి వెళ్లి కోరిన పండ్లు కొనుక్కోలేని వారికి వాటిని ఇంటివద్దకే అందించే సదుపాయాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటివద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియకు వినియోగదారుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. జంటనగరాల్లో కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్‌లు చొప్పున 7330733212 కాల్ సెంటర్‌కు ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు..కోరిన పండ్లు నేరుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరహా సరఫరాలో పండ్ల ధరలు ఇలా ఉన్నాయి..రూ.300కు మామిడి పండ్లు..1.5 కిలోలు, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కిలో, బత్తాయి 2.5 కిలోలు, డజన్ నిమ్మకాయల ప్యాక్, కలంగిరి 4 కిలోలు చొప్పున సరఫరా చేస్తున్నారు. ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మొబైల్ రైతు బజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలను సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవి కుమార్, జేడీ శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంటి వద్దకే పండ్ల సరఫరా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వారానికి నగరంలోని 3,500పై చిలుకు ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల నుంచి కొనుగోలు చేసిన పండ్లను సేకరిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు వివరిస్తున్నారు. -
‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలంలో ఉన్న సారళాసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరగడంతో మంగళవారం గండిపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్ కరకట్టకు గండిపడటంపై సాంకేతిక నిపుణులతో విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. కరకట్టకు గండిపడటం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. రబీలో సాగుకు సన్నద్దమైన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 4, 200 ఎకరాలకు నీరందిస్తామని.. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి -
‘ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది’
సాక్షి, హైదరాబాద్: రైతాంగానికి ఉపయోగపడే ఎన్నో పనులను ప్రభుత్వం చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే సాగునీటి కోసం సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. సోమవారం ఆయన హాకా భవన్లో మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది కూడా కాలేదన్నారు. పది నెలల కాలంలో తన శక్తి మేర పనిచేస్తున్నానన్నారు. ఎంత పని చేసినా ఇంకా మిగిలే ఉంటుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 7 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని నిర్ణయించామన్నారు. ఖరీఫ్‌లోగా దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే దీనికోసం స్థానిక రైతులు క్షేత్ర స్థాయి పర్యటన చేశారని, వారు దీనికి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. నూనె గింజల ఉత్పత్తి పెంచడం కోసం రానున్న రోజుల్లో ప్రకటన కూడా రావచ్చని వ్యాఖ్యానించారు. రైతుబంధు 94 శాతం మంది రైతులకు అందిందని స్పష్టం చేశారు. మిగతా వాళ్లకు రబీ సీజన్ వరకు అందజేస్తామని పేర్కొన్నారు. కాగా పసుపు బోర్డు, పసుపు మద్దతు ధరలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
అవసరానికి తగ్గట్టు సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్తమ వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. గురువారం హాకా భవన్లో వ్యవసాయ విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో చర్చించిన.. తీసుకున్న నిర్ణయాలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటన విడు దల చేశారు. సమావేశంలో ప్రజల ఆహార అవసరాలు, ఉత్పత్తులు, ప్రాసెసింగ్, విత్తన పంపిణీ, ఎరువులు, మద్దతు ధర, కొనుగోళ్ల అంశాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు పంటల సాగును ప్రోత్సహించాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారన్నారు. ఈ సమావేశంలో ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్‌పై ఉత్తమ విధానం రూపొందించేలా సూచనలు వచ్చాయన్నారు. ఉల్లి విషయంలో రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రోత్సహిస్తే ప్రస్తుత పరిస్థితి రాదన్నది మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ఆలోచనగా ఉందన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్‌కు నివేదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉల్లి విత్తనాలను రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. కాగా, 10 రోజుల తర్వాత తదుపరి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను చూసి కేంద్రం కాపీ కొట్టింది: మంత్రి నిరంజన్
సాక్షి, కామారెడ్డి : వచ్చే డిసెంబర్ నాటికి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం నీటిని ఈ రెండు నియోజక వర్గాలకు అందించి భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. మార్కెట్ అవసరాలను బట్టి కొత్త సొసైటీల ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను 332 పూర్తి చేశామని తెలిపారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంట ఉచిత విద్యుత్ అందడం లేదని, కేవలం తెలంగాణలోనే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్కరే రైతులకు రైతు బంధు అందించారన్నారు. కేసీఆర్‌ను చూసి కేంద్రం ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. రైతుబంధు విషయంపై మిగతా రాష్ట్రాలు కూడా సానుకూలంగా ఉన్నాయని, ఈ పథకం అమలుకు టీఆర్ఎస్ భూరికార్డుల ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. రైతు సంక్షేమానికి ఏ రాష్ట్రం కూడా ఇంత ఖర్చు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం తానే ఇంజనీర్‌లాగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని ప్రశంసించారు. రైతు సంక్షేమానికి ఏ రాష్ట్రం కూడా ఇంత ఖర్చు చేయడం లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌మత్స్యకారులకు గత అయిదేళ్లుగా చేప పిల్లలు ఉచితంగా ఇస్తున్నారని, నిజామాబాద్ జిల్లాలో రూ. 3 కోట్ల 75 లక్షలు చేప పిల్లల కోసం కేటాయించారన్నారు. 63 లక్షల రొయ్య పిల్లలను శ్రారం సాగర్ ప్రాజెక్టులో వదిలామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, మత్స్యకారుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. -
వారి వల్లే మంత్రి అయ్యాను : నిరంజన్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట : వరి, పత్తి పంటలే కాకుండా అన్ని పంటలు పండించే విధంగా రైతులు ఆలోచన చేయాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జతో కలిసి రైతుమిత్రా మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వారికోసం ఏ ప్రభుత్వం చేయని పనులను చేస్తున్నామన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్ల రూపాయలను కేటాయించారని గుర్తించారు. రైతులే తెలంగాణకు ముఖచిత్రమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల యువత కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని ప్రశంసించారు. గ్రామంలోనే మార్కెట్ కేంద్రాలు ఉన్నాయని, వాటి వల్ల ప్రతి గ్రామంలో 100 మంది అమాలీలకు ఉపాధి దొరికిందన్నారు. రైతు సమన్వయ సమితి ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇక హరీశ్‌రావు గురించి మాట్లాడుతూ.. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకొని మెదిలే గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు కృషి వల్లే తాను మంత్రి అయ్యానని పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రిని కలిసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయానాల శాఖ మంత్రి సదానందగౌడను బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా యాసంగికి ఎరువులను కేటాయించాలని, ఇంపోర్టెడ్ యూరియా కాకుండా స్థానికంగా ఉత్పత్తి చేసిన యూరియానూ సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము గతంలోనే 7.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. కాగా, ఈసారి ఖరీఫ్ సీజన్ ఆలస్యం అయినా తరువాత వర్షాలు సమృద్దిగా కురవడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండి సాగు విస్తీర్ణం పెరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి పది లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యాయని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రానున్న రబీలో సాధారణ విస్తీర్ణం కన్నా 8.5లక్షల ఎకరాలు పెరిగి సుమారుగా 42 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు తాము గతంలో విజ్ఞప్తి చేసిన 7.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని, అక్టోబరు మాసానికి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని 20వ తేదిలోపు పంపించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు. మార్చి 2020 వరకు రామగుండం ఎరువుల కర్మాగారం ట్రయల్ రన్ మొదలవుతుందని, ఆ తరువాత వచ్చే ఖరీఫ్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు అక్కడి నుండే ఎరువులు సరఫరా చేస్తామనిఘీ సందర్భంగా కేంద్ర మంత్రి సదానందగౌడ హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో మంత్రితో పాటు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘యూరియా పంపిణీలో క్షణం వృథా కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: రైతులకు యూరియా అందించడంలో క్షణం కూడా వృథా కానివ్వబోమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎరువులను త్వరితగతిన రాష్ట్రానికి చేర్చేందుకు రోడ్డు, రైల్వే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రబీకి కూడా యూరియా నిల్వలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అన్ని పోర్టుల నుంచి 20,387 మెట్రిక్ టన్నులు, విశాఖ నుంచి 6,800 మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఏపీ లోని గంగవరం పోర్టులో అధికారులతో సమావేశమైన మంత్రి యూరియా సత్వర రవాణాపై చర్చించారు. తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు కారి్మకులు, రవాణాదారులు సహకరించాలని, అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు. మంత్రి వెంట వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులున్నారు. -
సీఎం జగన్ పాలనపై తెలంగాణ మంత్రి ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. అతి తక్కువ కాలంలోనే కమిట్మెంట్తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఏపీ అభివృద్ధి కోసం కసితో, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా 100 రోజుల పాలన పూర్తైన సందర్భంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. -
రైతుల అభ్యున్నతికి సీఎం కృషి
సాక్షి, భూత్పూర్ (దేవరకద్ర): రైతుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ సీఎం చేపట్టని అభివృద్ధి పథకాలను కేసీఆర్ చేపట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్లోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతులు భూమి కొనుగోలు చేస్తే పట్టా చేసే వారికి ఇతరులకు తెలియకుండా ఉండేదని, ఇష్టానుసారంగా సాదాబైనామ అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ భూప్రక్షాళన చేపట్టడం, కుటుంబంలో రైతు మృతిచెందితే వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు పట్టా అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 500 పాసు çపుస్తకాలు అందిస్తున్నామని, మరో 600 పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి రైతులకు అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బస్వరాజ్‌గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూత్పూర్ (దేవరకద్ర): రైతుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ సీఎం చేపట్టని అభివృద్ధి పథకాలను కేసీఆర్ చేపట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్లోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతులు భూమి కొనుగోలు చేస్తే పట్టా చేసే వారికి ఇతరులకు తెలియకుండా ఉండేదని, ఇష్టానుసారంగా సాదాబైనామ అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ భూప్రక్షాళన చేపట్టడం, కుటుంబంలో రైతు మృతిచెందితే వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు పట్టా అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 500 పాసు పుస్తకాలు అందిస్తున్నామని, మరో 600 పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసి రైతులకు అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బస్వరాజ్‌గౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వలస కార్మికులు తిరిగొస్తారు బిజినేపల్లి (నాగర్‌కర్నూల్): అప్పట్లో పాలమూరు పేరు చెబితేనే వలసలు, కరువు కాటకాలకు నిలయంగా ఉన్న పాలమూరు జిల్లా రాబోయే రోజుల్లో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ప్రతి ఎకరా మాగాణిగా మారి పచ్చదనంతో శోభిల్లుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాడు బీళ్లుగా ఉన్న పొలాలు సీఎం చలువతో రేపు పచ్చదనం సంతరించుకోనున్నాయని దాంతో పట్నం వలస పోయిన రైతన్న తిరిగి పాలమూరు బాట పట్టే రోజులు ముందరనే ఉన్నాయన్నారు. ఇప్పటికే మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరందిస్తూ సాగు పండగ జరుగుతుందన్నారు. మత్స్యకారులు, రైతుల జీవితాల్లో ఈ ప్రాజెక్టులు వెలుగులు నింపనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు ప్రాజెక్టుకు ఊపిరిపోసి పెండింగ్‌లో ఉన్న పనులకు బకాయిలు చెల్లించి వేగవంతం చేయనున్నారన్నారు. వచ్చే వేసవి నాటికి పనులను పూర్తి చేసి 2020 ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలనే లక్ష్యంలో ముందుకు సాగుతున్నారన్నారు. వట్టెంలోని వెంకటాద్రి రిజర్వాయర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, నాయకులు రఘునందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు విజయ్, అమృత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పులేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో ఉండటం వల్లే కొంత ఆలస్యం : మంత్రి
సాక్షి, నాగర్‌కర్నూల్ : త్వరలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా శరవేగంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం పూర్తితో కేసీఆర్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. అడవిలో ఉండడంతో నార్లాపూర్ పంపు హౌస్ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరందించడం కేసీఆర్ లక్ష్యమని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. -
మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం
వనపర్తి/పాన్‌గల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ (105) సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. మంత్రి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. వందేళ్ల వయస్సు దాటిన ఆమె వనపర్తిలోని మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలోనే ఇన్నాళ్లు ఉన్నారు. రోజూలానే ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించగా.. సోమవారం తెల్లవారుజామున ఆయాస పడుతూ కనిపించింది. మంత్రి ఆస్పత్రికి తరలిద్దామని ప్రయత్నిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. మంత్రితోపాటు వారి చెల్లెళ్లు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రముఖుల పరామర్శ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మంత్రిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితోపాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అబ్రహం, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లా కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, శ్వేతామహంతి, శ్రీధర్, శంశాంక్, వనపర్తి ఎస్పీ కె. అపూర్వరావు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, స్వర్ణసుధాకర్‌రెడ్డి, పద్మావతి, టీడీపీ, బీజేపీ నాయకులు, ఆయా జిల్లాల జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. అలాగే, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టులు మంత్రి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాయినిపల్లి శివారులో అంత్యక్రియలు సింగిరెడ్డి తారకమ్మ అంత్యక్రియలు పాన్‌గల్ మండలం రాయినిపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసం నుంచి రాయినిపల్లి శివారు వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు బంధువులు తరలివచ్చారు. తన వ్యవసాయక్షేత్రంలో మంత్రి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి తలకొరివి పెట్టారు. తల్లి తారకమ్మకు కన్నీటితో తుదివీడ్కోలు పలికారు. -
మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం
సాక్షి, వనపర్తి : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు వనపర్తిలోని ఆమె స్వగృహానికి చేరుకున్నారు. కాగా, తారకమ్మ అంత్యక్రియలు నేడు సాయంత్రం స్వగ్రామంలో జరగనున్నట్టుగా సమాచారం. -
రేపటి నుంచి అంతర్జాతీయ విత్తన సదస్సు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి జూలై 3 వరకు 32వ అంతర్జాతీయ విత్తన సదస్సును (32 ఇస్టా కాంగ్రెస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా చూడాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ వినూత్న మార్పులతో దేశంలో రాష్ట్రాన్ని విత్తన కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు. హైటెక్స్‌లో జరిగే ఈ ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా వెలుగొందడం ఖాయమన్నారు. ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి ఈనెల 28న జరిగే ముగింపు సదస్సుకు రావాలని మంత్రి ఆహ్వానించారు. -
విద్యావంతులకు భరోసా కల్పించేలా!
సాక్షి, హైదరాబాద్: ‘చదువుకున్న వారికి ఉద్యోగం ఎలా భరోసా ఇస్తుందో.. వ్యవసాయం కూడా అలాంటి భరోసానే ఇవ్వాలి. అప్పుడే చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తారు. అప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగా ల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య అనేదే ఉండదు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో సరిపెట్టకుండా గిట్టుబాటు ధర అందిస్తేనే ఇదిసాధ్యమవుతుంది. ఇందు కు కేంద్రమే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి’అని తెలంగాణ కొత్త వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. నా ఆసక్తిని గుర్తించే! నాకు వ్యవసాయమంటే ఎంతో మక్కువ. సీఎం కేసీఆర్ ఈ శాఖ ఇస్తానని నాకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే వ్యవసాయరంగంపై నాకున్న ఇష్టాన్ని గుర్తించే ఈ బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నాను. వ్యవసాయశాఖను అప్పగించడం సంతోషంగా ఉంది. రైతులకు నేరుగా సాయం చేయడానికి వీలున్న శాఖ కావడం అదృష్టం. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయాయి. ఏవైనా వ్యక్తిగత కారణాలతో అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు.. కానీ వ్యవసాయానికి వాటితో సంబంధం లేదు. రాష్ట్రంలో రైతు ధీమాతో ఉన్నాడు. జీవితానికి ఢోకా లేదన్న భావన రైతులందరిలో నెలకొని ఉంది. ఉద్యోగులకు డీఏ.. మరి రైతులకు? ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తారు. రెండు మూడేళ్లకోసారి ద్రవ్యోల్బణాన్ని లెక్కగట్టి ధరల పెరుగుదలను బట్టి జీతాన్ని పెంచుతారు. కానీ రైతులకు ఇలాంటి వెసులుబాటేదీ? అంటే డీఏ ఇవ్వాలని నా ఉద్దేశం కాదు. వ్యవసాయం రోజురోజుకు భారంగా మారుతోంది. సాగు ఖర్చు పెరుగుతుంది. కానీ ఆ మేరకు రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావడంలేదు. కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే ఇస్తుంది. సాగు ఖర్చును లెక్కలోకి తీసుకొని గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఈ బాధ్యత కేంద్రానిదే. ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. రైతును పట్టించుకోవాలి. రైతుబంధుతో కేంద్రంలో కదలిక తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 70 ఏళ్ల తర్వాత రైతు గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అయితే కేంద్రం ఐదెకరాలలోపు రైతులకు ఏడాదికి కేవలం రూ.6 వేలు ప్రకటించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇస్తుంది. వచ్చే ఖరీఫ్ నుంచి రూ.10 వేలు ఇవ్వనుంది. ఆ ప్రకారం ఎకరా భూమి కలిగిన వృద్ధ రైతులుం టే, వారికి వృద్ధాప్య పింఛన్ కూడా వస్తుంది. అంటే ఒక రైతుకు నెలకు రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.24 వేల పింఛ న్ సహా ఇవి రెండూ కలిపితే ఏడాదికి రూ.34 వేలు వస్తుంది. తెలంగాణలో 90% మం ది రైతులకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఐదెకరాల భూమి కలిగి ఉండి వృద్ధాప్య పింఛన్ అందుకునే వారికి ఏడాదికి రూ.74 వేలు వస్తాయి. రైతుకు మన రాష్ట్రం చేస్తున్న సాయం దేశంలో ఇప్పటివరకు ఎక్కడా చేయలేదు. ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. రైతును ఆదుకోవాలి. రైతు సమన్వయ సమితులతో విప్లవం రైతు సమన్వయ సమితి సభ్యులు ఒక రైతు సైన్యం లాంటిది. దీని ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన చర్య. వ్యవసాయ ఉద్యోగులు కొంతమేరకే రైతులతో మమేకం కాగలరు. వారు సాంకేతికంగా చేదోడు వాదోడుగా ఉండగలరు. రైతు సమన్వయ సమితులు మాత్రం రైతులను సంఘటితం చేసి వారికి గిట్టుబాటు ధర ఇవ్వడం మొదలు అనేక రకాలుగా సాయపడగలరు. రైతు సమన్వయ సమితులను మరింత పకడ్బందీగా ఉపయోగించుకునేలా మార్గదర్శకాలు తయారు చేయాల్సిన అవసరముంది. వారికి కేసీఆర్ గౌరవ వేతనం ఇస్తానన్న విషయం తెలిసిందే. వీటన్నింటిపై మార్గదర్శకాలు రూపొందిం చాక స్పష్టత వస్తుంది. వారి విధులు, బాధ్యత, శిక్షణ ఇచ్చి రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా చూడాలి. ఇదో ఉద్యమంలాగా జరగాలి. వ్యవసాయంతో..ఉద్యోగం ఇచ్చే భరోసా ఉద్యోగం కోసం యువతీ యువకులు నానాపాట్లు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ భరోసా ఉంది. కానీ వ్యవసాయంలో ఎవరికీ భరోసా రావడంలేదు. ఆహారశుద్ది పరిశ్రమలతోపాటు ఇంకా అనేక అవకాశాలపై దృష్టిసారించాలి. అందుకోసం మేధోమథనం చేయాల్సి ఉంది. ఈ విషయంలో నా ఆలోచనను సీఎంకు వెల్లడిస్తాను. తెలంగాణలో సాగునీటి వనరులు సమకూరుతున్నకొద్దీ.. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సాగునీటి వనరులు సమకూరినచోట రైతులు వ్యవసాయం మొదలుపెట్టారు. దీంతో ట్రాక్టర్ల అవసరం ఏర్పడింది. ట్రాక్టర్ షోరూంలు ఏర్పడ్డాయి. సాంకేతిక సిబ్బంది అవసరమైంది. ఇలా వ్యవసాయానికి తోడుగా అనేక ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నా యి. అలా యువకులు వ్యవసాయంపై భరోసాతో ముందుకు రావాలి. రైతుకోసం దేశంలో ఒక నూతన అధ్యాయం మొదలుకావాలంటే తెలంగాణ రాష్ట్రమే దారి చూపించాల్సి ఉంది. అందుకోసం సీఎం నిరంతరం ఆలోచిస్తున్నారు. -
ఉత్కంఠ వీడింది!
ఒకరు టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచిన నేత.. ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకుడు కావడంతో తొలిసారి కేబినెట్ హోదా పదవి దక్కింది.. ఈసారి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రివర్గంలో చోటు సాధించగలిగారు.. ఇక మరొకరు ఉద్యోగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యమ నేతగా ఎదిగి... స్వరాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక తెలంగాణ ఏర్పడగానే అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు టీఆర్ఎస్లో చేరారు.. ఆ వెంటనే తొలిసారి.. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.. వీరిద్దరు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్.. వనపర్తి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన వీరిద్దరికీ రాష్ట్ర మంత్రివర్గంలో ఈసారి స్థానం దక్కింది. ఈ సందర్భంగా మంగళవారం వీరిద్దరూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో 13 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇద్దరికి మంత్రులుగా కేసీఆర్ అవకాశం కల్పించగా.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే ఆయనకు మలి విడతలోనైనా.. మరేదైనా కేబినెట్ ర్యాంకు పదవైనా కట్టబెట్టొచ్చని తెలుస్తోంది. సాక్షి, వనపర్తి: మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠ తొలిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు చోటు దక్కింది. సీఎం కేసీఆర్ వీరిద్దరికి సోమవారం సాయంత్రం స్వయంగా ఫోన్ చేసి మంగళవారం ఉదయం 11.30 గంటలకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటింది. సీఎంగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ 2018 డిసెంబర్ 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినా మిగతా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. దీంతో అప్పటి నుంచి నేడు, రేపు అంటూ ప్రచారం సాగుతుండగా ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, మంగళవారం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించడంతో పాటు ఉమ్మడి పాలమూరు నుంచి ఇద్దరికి స్థానం కల్పించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. 13 స్థానాల్లో గెలవడంతో... 2018 సెప్టెంబర్ 6వ తేదీన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డిసెంబర్ 7వ తేదిన ఎన్నికలు జరగగా అదే నెల 11 వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 స్థానాలను గెలుచుకుని టీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేసినా టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. కేవలం కొల్లాపూర్ స్థానంలో మాత్రం కాంగ్రెస్ గెలిచి కేవలం ఉనికిని కాపాడుకోగలిగింది. అత్యధికంగా 13 స్థానాలు గెలవడం, పార్టీ మరోసారి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులను ఆశించే వారు అధికమయ్యారు. లక్ష్మారెడ్డికి నిరాశే మొదటి నుంచి వనపర్తి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి. దీనిని నిజం చేస్తూ నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. కానీ సీఎం కేసీఆర్ తాజా కేబినెట్లో గత మంత్రివర్గంలో కొనసాగిన లక్ష్మారెడ్డికి స్థానం లభించలేదు. అయితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నా... ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి స్థానం కల్పించడంతో మరొకరికి చోటు ఉంటుందా, లేదా అన్న విషయమై వేచి చూడాల్సిందే. అయితే, లక్ష్మారెడ్డికి కేబినెట్ హోదాలో పదవి ఇస్తారని తెలుస్తోంది. కొత్త వారికే చోటు కేసీఆర్ రెండోసారి గెలిచాక ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరూ కొత్త వారికే మంత్రి పదవులు దక్కడం విశేషం. ఒకరు ఉద్యోగ సంఘాల నేతగా పేరొంది ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కాగా.. మరొకరు సీఎంకు నమ్మిన బంటు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. గతంలో వీరిద్దరికి కూడా మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం లేదు. కానీ వారి విధేయత, నమ్మకం, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ వీరిద్దరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కించుకున్న వీరికి రానున్న పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు. భారీ మెజార్టీ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీవోస్ అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగులరినీ సకల జనుల సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఆ సమయంలో చేసిన సమ్మె అప్పటి ప్రభుత్వాన్ని కదిలించింది. 2014 మార్చి నెలలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలవడంతో అప్పడే మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం దక్కింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 57,775 మెజార్టీతో గెలవడంతో శ్రీనివాస్‌గౌడ్ తప్పక మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించినట్లుగానే జరిగింది. మొదటి ప్రభుత్వంలోనే... వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పా ర్టీని స్థాపించాలనే ఆలోచన చేసిన నుంచి ఆయన వెంటే నడిచారు. 2014 లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. లేదంటే కేసీఆర్ మొదటి ప్రభుత్వంలోనే నిరంజన్ రెడ్డికి మంత్రి పదవి దక్కేది. ప్రస్తుత ఎన్నికల్లో 51,685 ఓట్ల మెజార్టీతో గెలవడంతో నిరంజన్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమైంది. మంత్రుల ప్రొఫైల్ -
ఏక్ ‘నిరంజన్’..!
సాక్షి, వనపర్తి: ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. దీంతో రెండు నెలలకు పైగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. సీఎం కేసీఆర్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించడంతో పాటు ఈనెల 19న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారో ఇంకా తేలకున్నా.. కేవలం 10 మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తుండగా జాబితాలో ఎవరి పేరు ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది. సింగిరెడ్డి ఖాయం !? వనపర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇదే ప్రచారం సాగుతుండగా.. తొలి విస్తరణలో పది మందికే స్థానం కల్పించనున్నట్లు తెలుస్తుండడంతో ఆయన ఒక్కరికే పదవి దక్కుతుందని చెప్పొచ్చు. ఇక గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి ప్రస్తుత కేబినెట్లో చోటు దక్కుతుందా, లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవగా కేసీఆర్ కేబినెట్లో కేవలం హోంమంత్రిగా మహమూద్ అలీ ఒక్కరికే అవకాశం కల్పించారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. మంత్రివర్గ విస్తరణపై రేపు, మాపంటూ ప్రచారం జరిగినా సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కేసీఆర్ గవర్నర్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించడంతో సస్పెన్స్ తొలిగిపోయినా మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆశావాహులు అధికం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రమే ఓడిపోయిన విషయం విదితమే. దీంతో మంత్రి పదవి రేసులో జూపల్లి లేనట్లయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ 50 వేల పైచిలుకు భారీ మెజార్టీ సాధించారు. దీంతో మంత్రి పదవుల ఆశించే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. విధేయుడికే అవకాశం 2001 సంవత్సరంలో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించిన నాటి నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయనకు విధేయుడిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ జెండాను ముందుగా భుజాన వేసుకుంది ఆయనే. పార్టీ బలోపేతం కోసం విశేష కృషి చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచిన ఆయన 2014 ఎన్నికల్లో స్వల్ఫ తేడాతో ఓడిపోయారు. లేదంటే టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలోనే నిరంజన్ రెడ్డికి చోటు దక్కేది. అయితే, కేసీఆర్‌కు విధేయుడు కావడంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించి కేబీనేట్ హోదా కల్పించాడు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల నియోజకవర్గాలకు ఏ మాత్రం తగ్గకుండా నిధులను రాబట్టి పలు అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. దీంతో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 51 వేల మెజార్టీతో ఆయన గెలుపొందారు. దీంతో ఈసారి ఆయనను మంత్రి పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మరొకరికి.. ఈసారి మంత్రివర్గ విస్తరణలో కేవలం పది మందికే అవకాశం కల్పించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే మలి విడత మంత్రివర్గ విస్తరణలో ఇంకొందరికి స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాత్రమే మంత్రిగా అవకాశం కల్పిస్తారని సమాచారం. ఆ తర్వాత మరో విడతలో మాజీ మంత్రి లక్షారెడ్డితో పాటు ఇతరుల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
ఓటర్లకు గాలం.. లాబీయింగ్ షురూ..
సాక్షి వనపర్తి: ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఈనెల 5వ తేదీతో గడువు ముగిస్తుండటం, 7న పోలింగ్ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గడిచిన కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో కార్యకర్తలు, కులసంఘాలు, యువజన సంఘాలను కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఎంత గొప్పగా ప్రచారం చేసినప్పటికీ పోలింగ్ సమయంలో మేనేజ్మెంట్ చేయకపోతే దాన్ని ఓట్లుగా మార్చడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఓటర్ను పోలింగ్ కేంద్రం వరకు రప్పించి, ఓటు వేయించడంతో పోల్ మేనేజ్మెంట్ ముగుస్తుంది. బూత్‌స్థాయిలో బలమైన క్యాడర్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ కి గట్టి పట్టుంది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైనే దృష్టి సారించిన నాయకులు అధికారంలోకి వచ్చాక జరిగిన రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలలో బలమైన ప్రజాప్రతినిధులు, నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు చాలామంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ బూత్ స్థాయిలో పటిష్టంగా మారింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో పాతుకుపోయి పేరుమోపిన నాయకులంతా టీఆర్ఎస్లో చేరడంతో ఇతర పార్టీలకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవమున్న నాయకులు టీఆర్ఎస్లో ఉండడంతో వారంతా ఈ ఎన్నికల్లో ఓటర్ను పోలింగ్ కేంద్రానికి రప్పించడానికి కృషి చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండటం, గత ప్రభుత్వాల హయాంలో కంటే ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలు చేశాము కాబట్టి క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు తమకే ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రాజకీయ అనుభవం ఉన్న వారితో.. కాంగ్రెస్, టీడీపీలు 2014 ఎన్నికల వరకు ఉప్పు, నిప్పులా ఉన్న మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు పార్టీలు ఒక్కటై కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలుచున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలలో చాలాఏళ్లపాటు పనిచేసిన నాయకులు, పార్టీ మారినా రాజకీయంగా అనుభవమున్న వారితో పోల్ మేనేజ్మెంట్ చేయించే పనిలో కూటమి అభ్యర్థులు ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్లో మొదటి నుంచి పట్టున్న టీడీపీ జతకట్టడంతో అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి చర్యలు చేపట్టింది. మూడు దశాబ్దాలుగా వనపర్తి రాజకీయాల్లో ఉంటూ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి మద్దతు కూడా చిన్నారెడ్డికి ఉండటంతో అది పోలింగ్‌లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇద్దరిదీ సుదీర్ఘ రాజకీయ అనుభవం వనపర్తి నియోజవర్గం బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి 8వ సారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. 9వ సారి బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో ఓటర్లను ఆకర్శించడం, పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడంలో ఆయన దిట్ట. ఆయనకు తోడుగా ఎన్నికల సమయంలో అనుచరులు అధిక సంఖ్యలో రంగంలోకి దిగుతారు. టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2001 నుంచి కేసీఆర్ వెంట ఉద్యమంలో పాల్గొన్న అనుభవం, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా పని చేయడంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకున్నాడు. 2001కి ముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఖాదీబోర్డు చైర్మన్‌గా పనిచేశారు. మొత్తానికి నిరంజన్‌రెడ్డికి మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉండడంతో ఆయన కూడా ఓటర్ల నాడిని పసిగట్టడంలో ముందుంటాడు. -
నామినేషన్ ఫైట్.. నేతల బల ప్రదర్శన..!
సాక్షి, వనపర్తి: నామినేషన్ దాఖలు చేసిన రోజే తమ జనబలాన్ని ప్రదర్శిస్తే ఇక గెలిచినట్లేనని రాజకీయ పరిభాషలో చెబుతుంటారు. అలాంటి సందర్భం కోసమే ప్రస్తుతం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా ఇదే సంస్కృతి కొనసాగుతోంది. అదే తరహాలో మహాకూటమి అభ్యర్థి, వనపర్తి తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ రోజున రావాలని శ్రేణులను కోరినట్లు తెలిసింది. ఐదోరోజు శుక్రవారం వరకు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అ«ధికారపార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రెండుసెట్ల నామినేషన్లు, స్వతం త్ర అభ్యర్థులు మూడుసెట్ల నామిషన్లు, సమాజ్‌వాది పార్టీ నుంచి అక్కల బాబుగౌడ్ నామినేషన్ వేశారు. ఆరో రోజు తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థి కొత్త అమరేందర్‌రెడ్డితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. రోజు మూడురోజులుగా భారీ సంఖ్యలో జనసమీకరణలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లలో నాయకులు 2014 ఎన్నికల సమయంలో చిన్నారెడ్డి స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసమీకరణ చేసి అక్కడి నుంచి ర్యాలీగా ఆర్ఓ కార్యాలయం వరకు వెళ్లారు. ప్రధాన కూడళ్ల గుండా ర్యాలీలు, నృత్యాలు చేస్తూ డప్పులు కొడుతూ ఒంటెలు, ఎద్దుల ప్రదర్శనలతో నియోజకవర్గంలో తన బలాన్ని ప్రదర్శిస్తూ నామినేషన్‌కు బయలుదేరారు. అదే తరహాలో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సైతం 2014లో నామినేషన్ వేశారు. కానీ ఈసారి ఎన్నికల సందర్భంగా నిరంజన్‌రెడ్డి ట్రెండ్ మార్చి అతి సాధారణంగా ఆలయాల్లో పూజలు చేసి నలుగురు వ్యక్తులతో కలిసి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి నామినేషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
టీఆర్ఎస్ గెలిస్తే..నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్..
సాక్షి, ఖిల్లాఘనపురం: డిసెంబర్ 11 తరువాత నీళ్ల నిరంజన్‌రెడ్డి.. కన్నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతా సిద్ధం చేసిన తరువాత వచ్చి నీళ్లు తెచ్చానని, నీళ్ల నిరంజన్‌రెడ్డి గా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. నిరంజన్‌రెడ్డి గెలిస్తే జీఎస్టీ తరహాలో ఎన్ఎస్టీ (నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్) వేస్తారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు రోజు రాత్రి రూ.12 కోట్ల అవినీతి సొమ్ముతో 29 కిలోల బంగారం కొన్న అవినీతి పరుడా వనపర్తిలో గెలిచేది? అని నిలదీశారు. ఇప్పటివరకు వనపర్తి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా తాను, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రజలకు సేవ చేశామన్నారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి కృష్ణుడిగా, తాను అర్జునుడిగా ఎన్నికల యుద్ధంలో దిగుతున్నామని చిన్నారెడ్డి అభివర్ణించుకుంటూ ఎన్నికల బరిలో తమను తట్టుకునేవారు ఉండబోరని చెప్పారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరిస్తాన్న వారు కొత్తగా 12వేల ఎకరాలకే ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్‌విండో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ నిరంజన్‌రెడ్డికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చూపుతామని ప్రతినబూనారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, శివసేనారెడ్డి, నాగం తిరుపతిరెడ్డి, సతీష్, డాక్టర్ నరేందర్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, కొండారెడ్డి, కృష్ణయ్యయాదవ్, బాల్‌రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్- యూఎస్ఏ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనని సంక్షేమ పథకాలు తెలంగాణ లో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సస్యమలంగా మార్చేందుకు సీఎం ప్రాజెక్టులను రూపకల్పన చేశారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు విడుదల చేశామన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కుల వృత్తులను పోత్సహిస్తుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించమని తెలిపారు. పేదింటి ఆడపడుచుల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. ఆసరా పథకం ద్వారా వృదులకు, వికలాంగులకు, వితంతువులకు, వంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కలిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో నెంబర్ వన్ చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు పెట్టుబడి కోసం వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.4000 అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. అమరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం అన్నారు. అమరులు కళలు కన్నా బంగారు తెలంగాణ సాకరం అవుతుందన్నారు. అందుకు తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీన్ జలగం స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఫ్రీమాంట్ మేయర్ లిలీ మీ ని రజనీకాంత్ ఖొసనం పుష్ప గుచంతో స్టేజి మీదకి ఆహ్వానించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రొఫెసర్ జయశంకర్, జల వనరుల నిపుణులు విద్య సాగర్రావుకి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో నవీన్ జలగం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామలే కాకుండా తెలంగాణ ప్రజల కోసం వాటర్ గ్రిడ్, నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలని చేపట్టారని అన్నారు. ఫ్రీమాంట్ మేయర్ లిలీ మీ మాట్లాడుతూ నగరంలో వివిధ రకాల కల్చర్స్ ని పోత్సహిస్తున్నమని వెల్లడించారు.తనను ఆహ్వానించినందుకు తెలుగుతో ధన్యవాదాలు తెలిపారు. భాస్కర్ మద్ది ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్మయి ప్రదర్శించిన తెలంగాణ నృత్యం రూపకం పేరిణి అందరిని ఆకట్టుకుంది. జానపద గేయాలను ప్రసాద్ ఊటుకూరు, భాస్కర్ కాల్వ, కృష్ణ వేముల పాడారు. ఆనంతరం చిన్నారుల నృత్యాలతో కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనిత్ ఎర్రబెల్లి మాట్లాడుతూ సంక్షేమం పథకాల గురించి వివరించారు. రిషేకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాల వాళ్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంపోందుతుందని వెల్లడించారు. అభిలాష్ రంగినేని మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి ఉద్యమ సమయంలో, ప్రస్తుతం చేస్తున్న సేవలను కొనియాడారు. బే ఏరియాలో తెలంగాణ రాష్ట్ర అవతరాణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు శ్రీనివాస్ పొన్నాల, తేజస్విని వడ్డెరాజ్, వంశీ కొండపాక, ఉదయ్ జొన్నల, కరునకర్, సాగర్, రాజ్, రామ్, షషాంక్, శశి, క్రిష్ణ, హరింధర్, సంతోష్, రవి, నవీత్ విజయ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.