
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలి రోజు రూ.586.65 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సొమ్ము 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. మొదటిరోజు 11.73 లక్షల ఎకరాలకు సాయం అందినట్లు వెల్లడించారు.
దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కాగితాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ‘జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు ఉండవా ? రాష్ట్రానికో విధానం ఉంటుందా ?’ అని ప్రశ్నించారు. అధికార కాంక్ష తప్ప కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం మీద ప్రేమ లేదని, ఆ పార్టీల పిల్లిమొగ్గలను ప్రజలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే చూశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment