శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఐవీపీఏ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, ఐవీపీఏ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: రాబోయే ఐదేళ్లలో తెలంగా ణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఆయిల్ పామ్‌తో పాటు వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయాబీన్ తదితర నూనె గింజల సాగును ప్రోత్సహించడం ద్వారా వంట నూనెల తయారీకి అవసరమైన ముడి సరుకు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
వంట నూనెల దిగు మతిని తగ్గించడంతో పాటు దేశీయంగా వంట నూనెల త యారీని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళిక లు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో శుక్రవారం ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అసోసియేషన్ (ఐవీపీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే సదస్సు లో తొలి రోజు సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పది వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఫుడ్ ప్రాసె సింగ్ జోన్లలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులతో వచ్చే వారికి ఇతర రాష్ట్రాల తో పోలిస్తే మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వివి ధ రంగాల్లో సాధించిన విజయాలను వివరించడంతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 40 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుతో అటవీ విస్తీర్ణం తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయని, కానీ రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో పచ్చదనం విస్తీర్ణం 24 శాతం నుంచి 31.77 శాతానికి పెరిగిందని కేటీఆర్ వెల్లడించారు.
ఆయిల్ పామ్ సాగును పెంచుతాం: మంత్రి నిరంజన్‌రెడ్డి
ప్రపంచంలోని 800 కోట్ల జనాభాలో భారత్, చైనాది సింహభాగం కాగా, ఏటా ప్రపంచ జనాభాకు 220 మిలియన్ టన్నుల నూనె గింజలు అవసరమవుతున్నాయని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. భారత్‌లో నూనె గింజల వినియోగం ఏటా 20 నుంచి 22 మిలియన్ టన్నులు కాగా, వనరులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా నూనె గింజల ఉత్పత్తి 50 శాతం కూడా లేదన్నారు.
రూ.99 వేల కోట్లకు పైగా వెచ్చించి విదేశాల నుంచి వంట నూనె గింజలు దిగుమతి చేసుకుంటుండగా ఇందులో పామాయిల్ 65 శాతం ఉందని తెలిపారు. దేశంలో వేరు శన గ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమలు, ఆయి ల్ పామ్ సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్, ప్రతినిధులు బన్సల్, గుప్తాతో పాటు మలేసియా, థాయ్‌లాండ్, యూరోప్, యూకే ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment