సాక్షి, కామారెడ్డి : వచ్చే డిసెంబర్ నాటికి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం నీటిని ఈ రెండు నియోజక వర్గాలకు అందించి భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. మార్కెట్ అవసరాలను బట్టి కొత్త సొసైటీల ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను 332 పూర్తి చేశామని తెలిపారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంట ఉచిత విద్యుత్ అందడం లేదని, కేవలం తెలంగాణలోనే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
కేసీఆర్ ఒక్కరే రైతులకు రైతు బంధు అందించారన్నారు. కేసీఆర్‌ను చూసి కేంద్రం ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. రైతుబంధు విషయంపై మిగతా రాష్ట్రాలు కూడా సానుకూలంగా ఉన్నాయని, ఈ పథకం అమలుకు టీఆర్‌ఎస్ భూరికార్డుల ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. రైతు సంక్షేమానికి ఏ రాష్ట్రం కూడా ఇంత ఖర్చు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం తానే ఇంజనీర్‌లాగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని ప్రశంసించారు. రైతు సంక్షేమానికి ఏ రాష్ట్రం కూడా ఇంత ఖర్చు చేయడం లేదన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌మత్స్యకారులకు గత అయిదేళ్లుగా చేప పిల్లలు ఉచితంగా ఇస్తున్నారని, నిజామాబాద్ జిల్లాలో రూ. 3 కోట్ల 75 లక్షలు చేప పిల్లల కోసం కేటాయించారన్నారు. 63 లక్షల రొయ్య పిల్లలను శ్రారం సాగర్ ప్రాజెక్టులో వదిలామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, మత్స్యకారుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment