
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రెండోరోజు రూ.1255.42 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఒక్కరోజే 17,31,127 మంది రైతులకు సాయం అందించామన్నారు. మంగళ, బుధవారాల్లో మొత్తంగా 35,43,783 మంది రైతుల ఖాతాల్లో రూ.1799.99 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడులు పెరగడంతో పలు రంగాలకు ఉపాధి లభించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment