సాక్షి, హైదరాబాద్: రైతులకు యూరియా అందించడంలో క్షణం కూడా వృథా కానివ్వబోమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎరువులను త్వరితగతిన రాష్ట్రానికి చేర్చేందుకు రోడ్డు, రైల్వే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రబీకి కూడా యూరియా నిల్వలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అన్ని పోర్టుల నుంచి 20,387 మెట్రిక్ టన్నులు, విశాఖ నుంచి 6,800 మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఏపీ లోని గంగవరం పోర్టులో అధికారులతో సమావేశమైన మంత్రి యూరియా సత్వర రవాణాపై చర్చించారు. తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు కారి్మకులు, రవాణాదారులు సహకరించాలని, అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు. మంత్రి వెంట వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment