సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల కాంగ్రెస్ మొదటి నుంచీ ద్రోహపూరిత పాత్రనే పోషించిందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణను నిర్లక్ష్యమే చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అనేది ప్రజల హక్కు తప్ప కాంగ్రెస్ ఇచ్చుడు, తీసుకునుడు అనే వాదన అర్థరహితమన్నారు. శనివారం ఆయన బీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌కు తెలంగాణ అంటే ఎప్పుడూ పట్టదని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. చరిత్రను అర్థం చేసుకోని అజ్ఞానులే కేసీఆర్‌ను బషీర్‌బాగ్ కాల్పులకు కారణమంటారని, తెలంగాణ మలి ఉద్యమానికి కరెంటు, వ్యవసాయ రంగ సమస్యలే కారణమని చెప్పారు. బషీర్‌బాగ్ కాల్పుల తర్వాత కేసీఆర్ రాసిన లేఖనే తెలంగాణ ఉద్యమానికి మలుపని పేర్కొన్నారు.
గత తొమిదేళ్లలో కరెంటు పోయి దెబ్బతిన్న రంగం ఏమీలేదన్నారు. 15 నిమి షాలో, అరగంటో కరెంటు పోతే 24 గంటల కరెంటు లేన ట్టా అని ప్రశ్నించారు. కొన్ని సాంకేతిక కారణాల తో కరెంటు పోతే లాగ్ బుక్కులు అంటూ రాజకీయం చేస్తున్నారని, అజ్ఞానులే కరెంటు కొనుగోలుపై ఆరోపణలు చేస్తారన్నారు.
రేవంత్ ముందే బయటపెట్టారు
24 గంటల ఉచిత కరెంటు ఇవ్వొద్దు అనే కాంగ్రెస్ హైకమాండ్ విధానాన్ని రేవంత్ ముందే బయటపెట్టారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గతంలో కూ డా రేవంత్ ఓటుకు నోటు కేసులో తొందర పడి చంద్రబాబును తట్టా బుట్టా సర్దుకుని వెళ్లేలా చేశారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతికి పేటెంట్ అని, ఉచిత విద్యుత్‌కు కాదని ఎద్దేవా చేశారు. కోమటి రెడ్డి గతంలో అనేక సవాళ్లు విసిరి పారిపోయారని, అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవ సరం లేదన్నారు.
రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో చంద్రబాబు అభిమానులు పెట్టిన మీటింగ్‌లో రేవంత్.. చంద్రబాబు ఎజెండానే మాట్లాడారని ఆరోపించారు. కరెంటు కొనుగోలు ఎలా జరుగుతుందో తెలియని అజ్ఞాని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమానికి భూమిక కరెంటే అని తెలియక బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment