Free electricity
-
దళిత, గిరిజనుల ఇళ్లకు వెలుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెల రోజులుగా చీకట్లో మగ్గుతున్న దళిత, గిరిజనుల ఇళ్లలో మళ్లీ విద్యుత్ వెలుగులు వచ్చాయి. ఉచిత విద్యుత్ (200 యూనిట్ల వరకు)కు తూట్లు పొడుస్తూ పాత బకాయిల పేరుతో దళిత, గిరిజనుల ఇళ్లకు తొలగించిన కరెంట్ మీటర్లను గురువారం నుంచి అధికారులు గుట్టుచప్పడు కాకుండా తిరిగి బిగిస్తున్నారు. ‘ఎస్సీ, ఎస్టీలకు షాక్.. ఉచిత విద్యుత్ కట్’ అనే శీర్షికన ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ‘సాక్షి’లో ప్రస్తావించిన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామానికి చెందిన బర్ల ప్రశాంతి, నేమవరపు సీత, కొల్లి విమల, బల్లి రమాదేవి, కొల్లి బుచ్చమ్మ ఇండిబిగింజ లక్ష్మి తదితరుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు బిగించారు. తమ ఇళ్లకు తిరిగి విద్యుత్ వెలుగులు వచ్చేలా చేసిన ‘సాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు విద్యుత్ మీటర్లు తొలగించలేదని, ‘సాక్షి’లో తప్పు రాశారని చెప్పాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేయగా... ‘సాక్షి’లో వాస్తవాలు రాశారని, అందువల్లే తమకు తిరిగి కరెంటు వచ్చిందని బాధితులు బదులివ్వడం గమనార్హం. రెడ్డిగణపవరం పంచాయతీకి చెందిన గిరిజన మహిళ కాక వెంకమ్మ ఇంటికి గురువారం విద్యుత్ అధికారులు వచ్చి ‘బకాయిలు రూ.40వేలు కట్టినట్టు సాక్షికి చెప్పావు... అంత ఎప్పుడు కట్టావు..’ అని ప్రశ్నించగా... ఆమె అన్ని లెక్కలను బిల్లులతో సహా చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. దీంతో మీటరు బిగించి విద్యుత్ అధికారులు వెళ్లిపోయారు. అదేవిధంగా గత ప్రభుత్వం 2019లో జీవో ఇచ్చి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఏలూరు జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ తెలిపారు. దానిని కూటమి ప్రభుత్వం కొనసాగించకపోగా, ఇప్పుడు రూ.15వేల నుంచి రూ.40 వేల వరకు బకాయిలు ఉన్నట్టు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేసిందని పేర్కొన్నారు. ఎట్టకేలకు ‘సాక్షి’ చొరవతో నెల రోజులుగా చీకట్లో మగ్గిపోతున్న దళిత, గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్’ ఉచిత విద్యుత్ కట్
నెల రోజులుగా చీకట్లోనే.. 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని, పాత బకాయిలు రూ.22 వేలు చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. నెల రోజులకుపైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకీ దుస్థితి దాపురించింది. – కొల్లి విమల, రెడ్డిగణపవరంఅన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలీ బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి రూ.35 వేలు కరెంట్ బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే ఐదారొందలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు.ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ, మారెయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు రాలేదు. రూ.40 వేలు పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వారి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి నాలుగు రోజులపాటు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్తు సిబ్బంది మరో రూ.22 వేలు బకాయిలున్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్‌పై కూటమి సర్కారు మోసంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. పుట్లగట్లగూడెం, మైసన్నగూడెం, రెడ్డిగణపవరం, పాలకుంట, వీరభద్రపురం లాంటి గిరిజన గూడేలు, దళితపేటలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు నిరసనకు దిగారు. పలువురికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు బిల్లులు జారీ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ పేదలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో గత నెలాఖరున విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు రెండు రోజులపాటు అంధకారంలో మగ్గిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవ చూపడంతో దళితవాడలో విద్యుత్తు వెలుగులు వచ్చాయి. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన జగన్ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు. మీటర్ల తొలగింపు... దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్‌ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్లు లోపు వినియోగించుకున్న వారికి సైతం రూ.వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఒత్తిడి చేస్తున్నారు.. కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసి కట్టాల్సిందేనని దురుసుగా మాట్లాడారు. మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – డోలా కాశమ్మ, రాఘవరాజపురం దళితవాడ, అన్నమయ్య జిల్లా గత ఐదేళ్లు అడగలేదు.. గత ఐదేళ్ల పాటు మాకు ఉచిత విద్యుత్తు అందింది. ఎప్పుడూ బిల్లు కట్టమని అడగలేదు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ బిల్లు కట్టాలంటూ విద్యుత్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. – కన్నేపల్లి కుమారి, గాందీగ్రామం, చోడవరం, అనకాపల్లి జిల్లా బకాయిలు కడితేనే కనెక్షన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉచిత విద్యుత్ అందించింది. గతంలో వినియోగించుకున్న ఉచిత విద్యుత్‌ను కూడా ఇప్పుడు బకాయిలుగా చూపిస్తూ బిల్లులు కట్టమంటున్నారు. అక్టోబర్ నెలాఖరున విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రూ.15 వేల బకాయిలు కడితేనే కనెక్షన్ ఇస్తామంటూ మీటర్ తీసుకెళ్లిపోయారు. – బల్లే రమాదేవి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం. అంధకారంలో అవస్థలు.. పాత బకాయిల పేరుతో కరెంట్ కనెక్షన్లు తొలగించడం దారుణం. బుట్టాయగూడెం, మైసన్నగూడెం, రెడ్డి గణపవరం, వీరభద్రపురం లాంటి ఆరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో కరెంట్ కనెక్షన్లు తొలగించారు. ఒక్కొక్కరు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారు. డబ్బులు కట్టలేక నెల రోజులకు పైగా చీకట్లో అవస్థ పడుతున్నారు. దీనిపై డీఈ, విజయవాడలోని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడే లేడు. – అందుగుల ఫ్రాన్సిస్, బుట్టాయగూడెం మండల దళిత నేత స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ అందించింది. కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా పాత బకాయిలు చెల్లించాలంటూ దళితులు, గిరిజనులను బెదిరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ను కట్ చేసింది. దీనిపై విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు వినతిపత్రం అందించాం. ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్రజల దృష్టి మళ్లించాలనే జగన్‌పై దుష్ప్రచారం
నెల్లూరు (బారకాసు): ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం కేంద్ర ప్రభుత్వం సహా అందరి ప్రశంసలందుకుందని, ఇది చూసి ఓర్వలేకే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్ సెకీ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు.ఈ వాస్తవాన్ని దాచిపెట్టి అదానీతో వైఎస్ జగన్ రహస్య ఒప్పందం అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సెకీకి, అదానికి మధ్య జరిగిన వ్యవహారాన్ని జగన్‌పై నెట్టేస్తున్నారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించారని, మళ్లీ ఇప్పుడు అవే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2014–19 మధ్య యూనిట్ రూ.6.90 చంద్రబాబు కొన్నారని, కానీ వైఎస్ జగన్ రూ.2.49కే సెకీతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని చెప్పారు. బాబు హయాంలో రూ.8,848 కోట్లు బకాయిలు పెట్టి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారన్నారు. ఈనాడు వార్తలన్నీ టీడీపీ ఆఫీసు నుంచే వస్తున్నట్టున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ వల్లే మంత్రి అయిన బాలినేని నేడు చంద్రబాబు, పవన్ మెప్పు కోసం అబద్ధాలాడుతున్నారని చెప్పారు. -
ఓ కరపత్రం ‘ఏడు’పు కథ!
సాక్షి, అమరావతి: వక్రీకరణలే పరమావధిగా పచ్చి అబద్ధాలను కుమ్మరిస్తున్న ఈనాడు.. గత సర్కారు ఏడు గంటల్లోనే సెకీతో ఒప్పందాన్ని క్యాబినెట్ భేటీలో ఆమోదించుకుందంటూ మరోసారి బుకాయించింది. రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా ప్రయోజనం జరుగుతోంటే రూ.లక్ష కోట్లకుపైగా భారం అంటూ అసత్య ఆరోపణలు చేసింది. ఈ ఒప్పందానికి ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవని తెలిసినా పదేపదే విషం చిమ్ముతూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. నిజానికి రెండున్నర నెలల పాటు సుదీర్ఘ కసరత్తు.. లాభనష్టాల బేరీజు.. నిపుణుల కమిటీ పరిశీలన.. మంత్రివర్గంలో చర్చ.. చివరిగా విద్యుత్తు నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్.. ఇన్ని దశలు దాటి ప్రక్రియలన్నీ పక్కాగా పాటించాకే సెకీతో ఒప్పందం కార్యరూపం దాల్చింది.వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా పాతికేళ్ల పాటు అత్యంత చౌకగా సౌర విద్యుత్‌ను అందిస్తామని, అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి సైతం మినహాయింపు కల్పిస్తామని 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ స్వయంగా ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సెకీ కోరడంతో 2021 సెప్టెంబర్ 16న (అప్పటికి వారం ముందే కేబినెట్ భేటీ తేదీని నిర్ణయించారు) కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టారు. అంతేగానీ సెకీ లేఖపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం కోసంగానీ.. ఆమోదించడం గానీ జరగలేదు. ముఖ్యమైన విషయాలు అత్యవసరంగా క్యాబినెట్ దృష్టికి వచ్చినప్పుడు టేబుల్ ఐటమ్ కింద ప్రవేశపెట్టడం పరిపాటి, ఆనవాయితీ. అందులో ఏం తప్పు ఉంది? ఈ క్రమంలో దీనిపై లోతైన అధ్యయనానికి కమిటీని నియమించి క్యాబినెట్‌కు నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ దశలన్నీ పూర్తయ్యాకే 2021 అక్టోబర్ 28న క్యాబినెట్ సమావేశంలో ఒప్పందానికి ఆమోదం లభించింది. ఏపీఈఆర్సీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని డిస్కమ్‌లను నిర్దేశించారు. అంతేగానీ ఈనాడు చెబుతున్నట్లుగా హడావుడిగా ఒప్పందాన్ని ఆమోదించాలనుకుంటే అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించి ఉండాలి కదా? నెలల తరబడి ఎందుకు ఆగుతారు? ఇలా సుదీర్ఘంగా చర్చలు, పలు ప్రక్రియలు ముగిశాకే 2021 డిసెంబర్ 1న సెకీతో ఒప్పందం జరిగింది. అర్థ రహిత ఆరోపణలు..2021 సెప్టెంబర్ 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పింది. నిజానికి ఈ ధర అప్పటి వరకు ఇతర మార్గాల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వస్తున్న విద్యుత్ ధరల కంటే చాలా తక్కువ. పైగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహం కింద ‘అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు’ కూడా ఈ ఒప్పందానికి వర్తింపజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ లేఖ రాసింది.అయితే సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 గంటల వ్యవధిలోనే అంగీకరించిందని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలేమిటి? అంత విద్యుత్ వినియోగించగలమా? లాంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని ఈనాడు మొదటి ఆరోపణ చేసింది. సెకీ ప్రతిపాదన వల్ల ప్రజలపై రూ.1,10,000 కోట్ల మేర ఆర్ధిక భారం పడుతుందని ఆలోచించలేదనేది రెండో ఆరోపణ. కానీ ఈ రెండూ పచ్చి అబద్ధాలే. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అల్లుకున్న కట్టుకథలు మినహా ఇందులో ఏ ఒక్కటీ వాస్తవం కాదు. రెండున్నర నెలలు.. విశ్లేషించాకే అనుమతి..సౌర విద్యుత్తుకు సంబంధించి పలు ప్రయోజనాలను కల్పిస్తూ 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య విద్యుత్ విక్రయ ఒప్పందం (పవర్ సేల్ అగ్రిమెంట్) 2021 డిసెంబర్ 1న జరిగింది. అంటే ప్రతిపాదనకు – ఒప్పందానికి మధ్య రెండున్నర నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ రెండున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సెకీ మధ్య పలు పర్యాయాలు సంప్రదింపులు జరిగాయి. సెకీ ప్రతిపాదనలో లోటుపాట్లను, ఒప్పందం వల్ల కలిగే లాభనష్టాలను లోతుగా విశ్లేషించారు. అంతేకాకుండా ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆమోదాన్ని 2021 నవంబర్ 8న కోరారు. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ నుంచి దీనికి ఆమోదం లభించింది. సెకీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు, అందుకోసం తీసుకున్న సమయం రెండున్నర నెలలకంటే ఎక్కువ ఉన్నట్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు మాత్రం 7 గంటల్లోనే ఆమోదం తెలిపేశారంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది.క్షుణ్నంగా సుదీర్ఘ కసరత్తు..సెకీ ఒప్పందాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మంత్రి మండలి సెప్టెంబర్ 16వ తేదీన తీసుకుందని ఈనాడు మరో ఆరోపణ చేసింది. వాస్తవం ఏమిటంటే మంత్రి మండలి సమావేశాన్ని అప్పటికప్పుడు నిర్ణయించలేదు. అంతకుముందు వారం రోజుల క్రితమే ఆ సమావేశం షెడ్యూల్ ఖరారైంది. అంటే.. కేబినెట్ సమావేశం తేదీపై నిర్ణయం తీసుకునే నాటికి సెకీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. సమావేశానికి ఒక రోజు ముందు మాత్రమే సెకీ లేఖ అందింది. తమ లేఖపై వీలైనంత త్వరగా స్పందన తెలియజేయాలని ఆ లేఖలో సెకీ కోరింది. అయితే మొత్తం ప్రక్రియకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందనే వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సెకీ కోరినట్లుగా ప్రక్రియను ఆలస్యం చేయకూడదని భావించి తగిన మార్గదర్శకాల కోసం 2021 సెప్టెంబర్ 16న మంత్రి మండలి సమావేశంలో ఈ అంశాన్ని టేబుల్ ఐటమ్‌గా ఉంచింది. ఈ ప్రతిపాదనపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ఇంధన శాఖను నాటి సమావేశంలో మంత్రి మండలి ఆదేశించింది. సెకీ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(ఏపీపీసీసీ) చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు పలుదఫాలు సెకీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం 2021 అక్టోబర్ 25న సెకీ ప్రతిపాదనకు అనుకూలంగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.దీంతో అక్టోబర్ 28న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ సిఫార్సులను మంత్రి మండలి ముందు ఉంచారు. ఏపీఈఆర్సీ అనుమతికి లోబడి సెకీతో పీఎస్ఏ అమలును ఆమోదించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 2021 నవంబర్ 8న ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు దరఖాస్తు చేశాయి. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదం పొందిన తర్వాతే 2021 డిసెంబర్ 1న ఒప్పందం జరిగింది. కాబట్టి టీడీపీ, ఈనాడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేస్తున్నవని స్పష్టం అవుతోంది.కరపత్రమా... కళ్లు తెరువు⇒ ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు ⇒పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ‘సెకీ’ ‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..⇒ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ⇒ ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.⇒ ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,750 కోట్లు చొప్పున 25 ఏళ్ల పాటు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది.⇒ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది.⇒ రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ⇒ ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?⇒ టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది. -
వాస్తవాలు దాచి.. అడ్డగోలు రాతలా?
మరి ధరలెందుకు తగ్గలేదు..?ఎల్ఈడీ టీవీ ధర 2016లో రూ.రెండు లక్షలు ఉంటే ఇప్పుడు ఇంకా మెరుగైన సదుపాయాలతో అవే కంపెనీ టీవీలు ఇప్పుడు రూ.55 వేలకే దొరుకుతున్నాయంటూ ఈనాడు తన కథనంలో రాసుకొచ్చింది. అలాంటప్పుడు కరెంట్ ధరలు మాత్రం ఎందుకు తగ్గవనే సందేహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఈనాడు చేస్తున్న వాదనే గనుక నిజమైతే 2020లో రూ.1.99 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కాకుండా)గా ఉన్న యూనిట్ విద్యుత్తు ధర 2024 నాటికి రూ.1.50 లేదా అంతకంటే తక్కువకు పడిపోవాలి. కానీ అలా జరగలేదు. రూ.2.70 కంటే ఎక్కువకు పెరిగింది. అయిన్పటికీ గత ప్రభుత్వం యూనిట్ రూ.2.49 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కలిపి)కే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదీగాక భారత ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని కేంద్రం ప్రభుత్వం చెప్పడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది.సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందించేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తాపత్రయపడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్తు అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనంతట తానే ముందుకొచ్చి స్వయంగా రాష్ట్రానికి లేఖ రాసింది. చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక ఒప్పందం. దేశంలో మరే రాష్ట్రానికీ దక్కని అరుదైన అవకాశం. అంతేకాదు.. ఆత్మ నిర్భర్‌లో భాగంగా ప్రత్యేక ప్రోత్సాహంగా అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు సైతం సెకీ కల్పించింది. అత్యంత చౌక ధరకు విద్యుత్తు అందించే గొప్ప కార్యక్రమం అది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా, డిస్కమ్‌ల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్తు పొందేలా ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం అది. అలాంటి కార్యక్రమాన్ని ప్రశంసించాల్సింది పోయి ‘ఈనాడు’ బురద చల్లేందుకు తెగబడింది. చౌకగా విద్యుత్తు ఇస్తామని సెకీ స్వయంగా లేఖ రాసినప్పుడు గత ప్రభుత్వం స్పందించకుంటే ఇదే ఎల్లో మీడియా నిందించేది కాదా? అయినా ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వానికి – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన ఒప్పందం. మధ్యలో లంచాలెక్కడ? కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలిస్తాయా? అసలు మూడో వ్యక్తికి తావెక్కడ? ఇందులో అదానీతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అమెరికాకు చెందిన సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే వైఎస్ జగన్‌పై విషం చిమ్మడం ఏమిటి? అంతా అసంబద్ధ వాదనలు.. పసలేని ఆరోపణలు!! సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా రూ.3,750 కోట్ల విద్యుత్తు భారం తగ్గుతుంది. 25 ఏళ్లలో రాష్ట్రంపై రూ.లక్ష కోట్ల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం అది. రాష్ట్ర విద్యుత్తు రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే చర్యగా భావించవచ్చు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్తు అందించే ఒప్పందం కుదిరిందంటూ ఈనాడు ఓ పసలేని వాదన తెరపైకి తెచ్చింది. సరఫరా చార్జీల కింద వాటిపై మరో రూ.రెండు అదనంగా భారం పడుతుందనే విషయాన్ని దాచిపెట్టింది. మన రాష్ట్రానికి ఆ విద్యుత్తు చేరవేసేందుకు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలతో కలిపితే అది రూ.3.98 నుంచి రూ.4 వరకు అవుతుంది. అంటే ఒక మెగావాట్కే నెలకు రూ.4 లక్షలు చొప్పున సరఫరా చార్జీల భారం అదనంగా పడుతుంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ మభ్యపెట్టేందుకు యత్నించడం ఈనాడు మార్కు జర్నలిజానికి నిదర్శనం. ఐఎస్టీఎస్ చార్జీల భారం పడుతోందంటూ ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేసింది. ప్రత్యేక ప్రోత్సాహకంగా దాని నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు సెకీ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ నిలువెల్లా విషం చిమ్ముతోంది. ఇక అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చంద్రబాబును వెనకేసుకొస్తూ ఈనాడు ఆదివారం ఓ కట్టుకథ అల్లింది. తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనడం తప్పన్నట్లు అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఉత్పత్తి వ్యయం తక్కువ కాబట్టే.. గుజరాత్లో నెలకొల్పే ప్లాంట్ల నుంచి మధ్య గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్‌లోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 2020 డిసెంబర్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్‌ఎల్) 2020 సెపె్టంబర్ 28న ఫేజ్ 11లో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు జారీ చేసింది. ఈ టెండర్లో యూనిట్ రూ.1.99కి ఇచ్చేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చారు. విషయం ఏమిటంటే గుజరాత్, రాజస్థాన్‌లోని ప్రదేశాలు ఎడారి భూభాగం కారణంగా అధిక సూర్యరశ్మి తీవ్రత(వికిరణం) ఉన్న ప్రాంతాలు. మన రాష్ట్రంలో పీఎల్ఎఫ్ 17 శాతం నుంచి 18 శాతం ఉంటే అక్కడ 23.5 శాతం ఉంటుంది. అంటే అక్కడ ఒక యూనిట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మన రాష్ట్రంలో కంటే దాదాపు 60 నుంచి 70 పైసలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం అంత తక్కువగా ఉన్నప్పుడు అక్కడ తక్కువ ధరకు సౌర విద్యుత్ లభించడంలో విశేషమేముంది. అదే విధంగా 1,070 మెగావాట్ల విద్యుత్‌కు సెకీ టెండర్లు పిలవగా టారిఫ్ యూనిట్‌కి రూ.2కి ఒప్పందం కుదిరింది. అయితే ఆ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటయ్యేది కూడా రాజస్థాన్‌లోనే కాబట్టే ఆ రేటు! 2020లో ఆంధ్రప్రదేశ్‌లో 6,400 మెగావాట్ల పీవీ సోలార్ ప్రాజెక్టుల స్థాపనకు టెండర్ జారీ చేసినప్పుడు యూనిట్ రూ.2.49, రూ.2.58 చొప్పున ఇచ్చేందుకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ టెండరింగ్ ప్రక్రియలో ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ రెన్యూవబుల్, హెచ్ఇఎస్ ఇన్ఫ్రా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పాల్గొన్నాయి. ప్రసార చార్జీలు లేనందున తక్కువే కదా..మరో అంశాన్ని కూడా ఈనాడు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చింది. ఒకవేళ యూనిట్ రూ.1.99 లేదా రూ.2.01, రూ.2.36కి ఇస్తామని చెప్పినా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) లేని కారణంగా ఆ ప్రాజెక్ట్‌లకు ఛార్జీల మినహాయింపు వర్తించదు. ఈ విద్యుత్‌ను గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే అత్యధిక ప్రసార చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఆ విద్యుత్ ఖరీదు యూనిట్‌కు రూ.3.98 (యూనిట్ రూ.1.99కి కొంటే మరో రూ.1.99) చెల్లించాలి. అదే యూనిట్ రూ.2.01కి కొంటే దానికి ఐఎస్టీఎస్ చార్జీ రూ.1.99 కలిపి యూనిట్‌కు మొత్తం రూ.4.00 కట్టాలి. ఇక యూనిట్ రూ.2.36కు తీసుకుంటే దానికి రూ.1.99 జోడిస్తే యూనిట్ ధర రూ.4.35 పడుతుంది. అంటే నెలకు ఒక మెగావాట్‌కు రూ.4 లక్షలు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలకే చెల్లించాల్సి వస్తుంది. అదే సెకీ నుంచి తీసుకుంటే ఈ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ఈ లెక్కన సెకీ అందిస్తామన్న యూనిట్ ధర రూ.2.49 తక్కువే కదా. కోవిడ్ తర్వాత పెరిగిన సోలార్ ప్యానల్స్ ధరలు.. జీయూవీఎన్‌ఎల్ ఫేజ్ 9 టెండర్ గుజరాత్ ప్రభుత్వం చేపట్టే నాటికి కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా సోలార్ ప్యానెళ్ల ధరలు భారీగా పడిపోయాయి. భవిష్యత్తులోనూ ధరలు అదే స్థాయిలో కొనసాగుతాయని ఆ ప్రభుత్వం భావించింది. కానీ కోవిడ్∙తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్యానెల్ ధరలు పెరిగాయి. దీంతో తర్వాత టెండర్లలో సోలార్ టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు జీయూవీఎన్‌ఎల్ 2024 మార్చి 15న గుజరాత్‌లోని ఖవ్డా ప్రాంతంలో అధిక సూర్యరశ్మి తీవ్రత, అధిక పీఎల్ఎఫ్ ఉన్న ప్రాంతాల్లో టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్లో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు వచ్చిన టారిఫ్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...టీడీపీ హయాంలో అత్యధిక ధరలతో పీపీఏలు.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందానికి భిన్నంగా ఉన్నాయి. అధిక ధరలకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు టీడీపీ హయాంలో పీపీఏలు కుదుర్చుకున్నారు. 2019–20 నాటి ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం సౌర విద్యుత్ సగటు ధర రూ.5.90కి పెరిగింది. అంత ఖరీదైన దీర్ఘకాలిక పీపీఏలను డిస్కంలు హడావుడిగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు కారణమయ్యారని ఈనాడు పత్రిక ఏనాడైనా ప్రశ్నించిందా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆందోళన చెంది ఉంటే చంద్రబాబును దీనిపై ఎందుకు నిగ్గదీయలేదు?ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అని చెప్పిన కేంద్రం 2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్‌లో భాగంగా సెకీ టెండర్ ద్వారా ఏర్పాటయ్యే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆరీ్పఓ)తో సంబంధం లేకుండా అది ఉన్న సంస్థలకు కూడా ఈ ప్రయోజనం అందుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రానికి ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహంతో సెకీ టెండర్ ద్వారా స్థాపించే ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా అందుతుంది. అదే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల మన రాష్ట్రంపై ఈ భారం యూనిట్‌కు రూ.1.99 నుంచి రూ.2 వరకూ పడుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు గత ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈ విషయాలను కథనంలో ప్రస్తావించకుండా వదిలేసింది. -
ఏది నిజం?: సౌర విద్యుత్ మేమే ఇస్తాం
‘‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ధరలకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పటికి మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేశారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకోవడంలో ఆంతర్యమేమిటి? అది కదా అసలు సిసలైన కుంభకోణం..! దీన్ని ప్రశ్నించే సాహసం ఈనాడు ఏనాడైనా చేసిందా?’’‘‘అసలు అదానీతో ఒప్పందం చేసుకోవాలనిగానీ, భారీగా లంచాలు పొందాలనిగానీ అప్పటి ప్రభుత్వం అనుకుంటే సంస్థలతోనే నేరుగా చేసుకునేవారు గానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఎందుకు చేసుకుంటారు? ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేట్ సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా?’’రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే టెండర్లు పిలిచినా వాటిపై చట్టపరంగా సమస్యలు వచ్చాయి. ఆ తరుణంలో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌పై ముందుచూపు, రైతులకు 25 ఏళ్ల పాటు మంచి చేయాలనే జగన్ సర్కారు సంకల్పాన్ని అభినందిస్తూ నాడు సెకీ లేఖ రాసింది. డిస్కమ్‌లపై ఆర్థిక భారం పడకుండా, రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. అదే సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. అప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తక్కువకు ఇస్తామన్నా సెకీ విద్యుత్‌ను ఎందుకు తీసుకోలేదని బురద చల్లేవి కాదా?సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ తామే పాతికేళ్లపాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానే ముందుగా ప్రతిపాదించింది. అందుకు 2021 సెపె్టంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెపె్టంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! చంద్రబాబు కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల డిస్కమ్‌లపై తీవ్ర ఆర్ధిక భారం పడింది. దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో సోలార్ పార్క్‌లను అభివృద్ధి చేయాలని 2020లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) టెండర్లు పిలిచింది. చదవండి: నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలు అయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అదే సమయంలో అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆరి్థకంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా?తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి. ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. చదవండి: చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీతో ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల ఆమోదం కూడా లభించింది. ఈ ఒప్పందాల్లో ఎక్కడా అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోగానీ అనుబంధ కంపెనీలతోగానీ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇక అవినీతి ఎక్కడుంది? అసలు లంచాలకు ఆస్కారం ఏముంది? -
నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!
‘‘రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?’’సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికి యూనిట్ రూ.5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా రూ.3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానీతో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతిచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా? అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్‌కు ముడిపెట్టి విషప్రచారం చేస్తూ.. టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖాను పుంఖాలుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని బెంబేలెత్తుతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థ..సెకీ ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులా ఏ ప్రైవేట్ కంపెనీలతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో! గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది. దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టిన ఈనాడు... గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానీతో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్‌కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ.. దానికి అహర్నిశం పాటుపడిన జగన్‌పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను ఏమనుకోవాలి? తప్పయితే ‘సీఈఆర్సీ, ఏపీఈఆర్సీ’ ఎందుకు అనుమతిస్తాయి?2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీతో ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విద్యుత్ కొనుగోలు మొదలు కావాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. సెకీ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు ఉండవని ఈ ఏడాది ఆగస్టు 13న ఏపీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంతకు ముందే అంటే 2021 జనవరి 15నే వెల్లడించింది. మరి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ సంస్థలు అనుమతించిన ఒప్పందం తప్పంటారా? ఏదైనా అవినీతి జరిగి ఉంటే అక్కడే తేలిపోయేది కదా?చదవండి: సౌర విద్యుత్ ఇస్తామని చెప్పింది సెకీనేఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంటే నష్టమంటారా? ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 చొప్పున అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్ల మేరకు ఆదా అవుతోంది. కానీ ఈనాడు మాత్రం పాతికేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు నష్టమంటూ నోటికొచ్చిన లెక్కలు రాసుకొచ్చింది. ఆ తప్పుడు లెక్కల వెనుక అసలు ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించలేరనుకుంటోంది.ప్రయోజనాలు ఎక్కువ గనుకే ఒప్పందం..సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలను చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయం అవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెకీ ధర కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయంటూ ఈనాడు రాసుకొచ్చింది. రాజస్థాన్‌లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. కానీ అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 23.5 శాతం. ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా?యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదిటీడీపీ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ ఛార్జీలతో కలిసి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది! అయినా సరే ఈనాడుకు అది ఏనాడూ కనపడకపోవడం విచిత్రం! ఇక పవన విద్యుత్తుకైతే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో పీపీఏలు చేసుకున్నారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 17,731 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అందులో 12,190 మెగావాట్లు థర్మల్, 275.78 మెగావాట్లు ఇతర విద్యుత్ కాగా మిగిలింది పునరుత్పాదక విద్యుత్. 2014 జూన్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి మొత్తం గరిష్ట డిమాండ్ 13,404 మెగావాట్లు మాత్రమే. అయినా సరే టీడీపీ ప్రభుత్వం నాడు హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకుంది. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటం చిత్రమే! చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అది కూడా దశాబ్దాల పాటు భరించాలి. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కంలు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ప్రత్యక్షంగా, ప్రజలపై పరోక్షంగా ఇంత పెద్ద భారాన్ని మోపడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే దాన్ని మించిన కుంభకోణం ఇంకేముంటుంది? -
Arvind Kejriwal: ఉచిత విద్యుతిస్తే బీజేపీకి ప్రచారం చేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలోని 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానన్నారు. పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఆప్ బహిరంగ సభలో బీజేపీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ‘‘వచ్చే ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75ఏళ్లు వస్తాయి. రిటైరవుతారు. ప్రధానిగా ఆయనకు మరో ఏడాది సమయమే ఉంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింట్లోనూవిద్యుత్తు ఉచితంగా ఇవ్వండి. బడులు, ఆసుపత్రులు బాగు చేయండి. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లోపు ఆ పని చేసి చూపిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తా’’ అన్నారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వమటే ‘డబుల్ దోపిడీ, నిరుద్యోగం, అధిక ధరలు’. హరియాణాలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ దిగిపోనుంది. జార్ఖండ్, మహారాష్ట్రల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పోతాయి’’ అన్నారు. తన జేబులో ఆరు స్వీట్లున్న ప్యాకెట్ ఉందని కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్ర, ఆరోగ్య వసతులు, విద్య... ఇవే ఆ ఆరు స్వీట్లు’’ అని చెప్పారు. ఢిల్లీలో పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ ఆరు స్వీట్లు ప్రజలకు అందకుండా పోతాయన్నారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్
-
కరెంటుపై బాబు కథ తప్పే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ అందించడంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం బయటపడింది. ఉచిత విద్యుత్‌ను ఆపాలన్న దురాలోచనతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో వైఎస్ జగన్ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందంపై దుష్ప్రచారానికి తెరతీసింది. సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో సెకీ ఒప్పందాన్ని తప్పుబడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. సెకీ విద్యుత్ తీసుకుంటే జనరల్ నెట్వర్క్ యాక్సెస్ (జీఎన్ఏ) నిబంధనల ప్రకారం రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకూ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్టీఎస్) చెల్లించాల్సి వస్తుందని నమ్మించాలనుకున్నారు. కానీ ఆయన చెప్పినదంతా అబద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీ ద్వారా అంతర్రాష్ట్ర చార్జీలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం స్పష్టంగా చెప్పింది.వంద శాతం మినహాయింపుసెకీతో ఒప్పందమే పెద్ద భారమైనట్టు, ఓ నేరమైనట్టు సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకొచ్చారు. ఐఎస్టీఎస్ చార్జీలపై అపోహల నేపథ్యంలో ఈ నెల 2న కర్నూలులో జరిగిన సదరన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఫోరం (ఎస్ఈఆర్ఎఫ్) సమావేశంలో, ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన వర్కింగ్ గ్రూప్ భేటీలోనూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జున రెడ్డి చర్చించారు. నిపుణుల అభిప్రాయాలు, చట్టాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం సెకీ విద్యుత్‌పై ఐఎస్టీఎస్ చార్జీల నుంచి వంద శాతం మినహాయింపు పొందవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. తద్వారా 25 సంవత్సరాల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. దీని విలువ చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే దాదాపు రూ.3,500 కోట్లు.తక్కువ ధరతోనూ రూ.3,750 కోట్లు ఆదాసెకీ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉండగా, సెకీ విద్యుత్ యూనిట్ రూ.2.49 కే వస్తోంది. ఎన్టీపీసీ సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 కన్నా కూడా ఇది తక్కువ. దీనిద్వారా ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది.చీకటి రోజుల నుంచి రైతులకు విముక్తిగతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పంటలకు నీరు పెట్టుకోవడం కోసం మీటర్లు వేసుకొనేందుకు రైతులు అర్ధరాత్రివేళ పొలాలకు వెళ్లి, విద్యుత్ షాక్‌కు, పాము కాట్లకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం విముక్తి కలిగించింది. వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించింది. దాంతోపాటు రానున్న 30 ఏళ్లలో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా సౌర విద్యుత్ సమకూర్చే చర్యలు చేపట్టింది. అది కూడా ప్రైవేటు నుంచి కాకుండా, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని రైతులకు ఉచితంగా అందించాలని సంకల్పించింది. సెకీతో ఒప్పందం అనంతరం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం అన్ని రకాల విద్యుత్‌ను కొనేందుకు అనుమతి ఉన్న డిస్కంలు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు పొందలేవు. దీనిని ముందే గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీని ఏర్పాటు చేసింది.నష్టం తెచ్చిందే టీడీపీవాస్తవంగా విద్యుత్ రంగాన్ని నష్టాలపాలు చేసిందే గత చంద్రబాబు ప్రభుత్వం. అప్పట్లో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54), బాబు ప్రభుత్వం ఏకంగా యూనిట్ రూ.6.99కు కొనేలా ఒప్పందాలు చేసుకుంది. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి ఒప్పందాలు చేసుకుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యం మేరకు పవన విద్యుత్ ఒప్పందాలు నామినేషన్ ప్రాతిపదికనే జరిగాయి. పోటీ బిడ్డింగ్ ద్వారా కాదు. దీనివల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో దుబారా, దోపిడీని అరికట్టి కరెంటు కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. సెకీతో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. -
వాస్తవ ఖర్చులే ట్రూ అప్ చార్జీలు
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినవే.ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్‌కు ఎంత వసూలు చేయాలని ఈఆర్సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రతి రోజూ కొనే విద్యుత్‌కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్‌ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.ఖర్చు చేసినంతా కాదుడిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది. అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
‘సెకీ’ విద్యుత్ చౌక
సాక్షి, అమరావతి: కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ, రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది.ఇందుకోసం ప్రైవేటు రంగం నుంచి కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవసాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ అత్యంత చౌకగా వస్తోందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదు2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీ ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం ఏడాదికి 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండటం వల్ల చెల్లింపులకు ఎటువంటి ఆటంకం కలగదు. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంది. సెకీ విద్యుత్ అతి తక్కువకు యూనిట్ రూ.2.49 కు వస్తోంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) యూనిట్ రూ.2.79 కన్నా ఇది తక్కువ. ఈ లెక్కన సెకీ ఒప్పందంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌విుషన్ చార్జీల నుంచి కూడా రాష్ట్రానికి మినహాయింపు వస్తుంది.అదే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌కు పాతికేళ్ల పాటు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. దీనికి కూడా కేంద్రం మినహాయింపునిచ్చింది. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు కట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా తీసుకున్నప్పుడు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది. టీడీపీ వల్లనే నష్టంచంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు అసలు పొంతనే లేదు. చంద్రబాబు హయాంలో సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44 కు లభిస్తుంటే (బాక్డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) చంద్రబాబు ఏకంగా యూనిట్‌కు రూ.8.90 వెచ్చించారు. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు కుదుర్చుకున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం, ఇదే సెకీ నుంచి యూనిట్‌కు రూ.4.57తో గాలివీడులో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్‌కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లను కొనుగోలు చేసింది. ఇలా చంద్రబాబు హయాంలో మొత్తం దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే గత ఐదేళ్లుగా సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ‘సెకీ’తో ఒప్పందం కారణంగా బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12 కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.49 కొనవచ్చు. ఫలితంగా డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్‌షిప్‌ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
Fact Check: ‘ఓట్లాటమీ ఓటి కుండదే’
సాక్షి, అమరావతి: ‘ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అంటూ ఎద్దేవా చేసి..తాను అధికారంలో ఉన్నన్నాళ్లూ కనీసం రోజుకి మూడు,నాలుగు గంటలు కూడా వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వకుండా..రైతులను అష్టకష్టాలు పెట్టారు చంద్రబాబు. అలాంటి నయవంచకుడిని భుజానకెత్తుకుని..ఆయన ప్రాపకం కోసం భజన వార్తలు రాస్తూ రామోజీ రోజురోజుకీ దిగజారిపోతున్నారు. ప్రతి రోజూ అవాస్తవాలను అచ్చేస్తూ అడుగడుగునా అబద్దాలు చెప్పుకొస్తూ నిస్సిగ్గుగా ప్రస్తుత ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్‌పైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘జగన్ ఓట్లాటలో ఓడిన రైతు!’ శీర్షికతో ఓ నిరాధార వార్తా కథనాన్ని గురువారం అచ్చేశారు డ్రామోజీ. ఆ కథనం వెనుక వాస్తవాలను పరిశీలిస్తే..అసలు నిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ: అనంతపురం జిల్లా కణేకల్ మండలం ఉద్దేహాళ్ గ్రామంలో లోకన్న అనే రైతు విద్యుత్ సమస్య కారణంగా మూడెకరాల్లో పైరు పశువుల మేత కింద వదిలేశారు. ఇదే గ్రామంలో మరో రైతు ఎర్రిస్వామికి చెందిన పదెకరాల్లో నాలుగెకరాల పైరు ఎండిపోయింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో 1200 ఎకరాల్లో వివిధ పంటలు ఎండిపోయాయని అంచనా. వాస్తవం: లోకన్న, అనే రైతుకు ఆరెకరాల పొలం ఉంటే దానికి నీరందించడానికి ఒకే బోరు ఉంది. కానీ ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం వల్ల ఆ బోరు నుంచి నీరు సరిగ్గా రావడం లేదు. దీని వల్ల అన్ని ఎకరాలకు సరిపడా నీరు అందించలేకపోతున్నారు. ఇదే పరిస్ధితి ఎర్రిస్వామిది కూడా. ఈ కారణంగానే కొంత పొలాన్ని వారు వదిలేయాల్సి వచ్చింది. అంతే తప్ప కరెంటు అందక కాదు. కానీ ఈనాడు మాత్రం వాస్తవాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా అచ్చేసుకుంది. అలాగే 1,200 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అధికారిక ధృవీకరణలేమీ లేకుండా కాకి లెక్కలు రాసేసుకుంది. ఆరోపణ: కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన కౌలు రైతు గుండాల ఆంజనేయులు సాగునీరు పూర్తిగా అందదని ముందే గ్రహించి నాలుగెకరాల్లో రెండెకరాలు బీడుపెట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు, ఉదయం పది గంటలకు రెండు విడతల్లో విద్యుత్ ఇవ్వడం వల్ల నీరు చాలక దిగుబడి దెబ్బతిందని ఆయన వాపోతున్నారు. వాస్తవం: నాలుగెకరాలు కౌలుకి తీసుకున్న రైతుకి రెండెకరాలకే నీరందుతుందని ముందే తెలిసిందంటే దానికి కారణం బోరు నుంచి వచ్చే తక్కువ నీరని ఏ రైతుకైనా ఇట్టే అర్ధం అవుతుంది. ఇక రెండు విడతల్లో విద్యుత్ కూడా రైతుల విజ్ఞప్తి మేరకే అధికారులు ఇస్తున్నారు. అయినా ఈనాడు చెప్పినట్లు తెల్లవారు జామున నాలుగు గంటలకు, ఉదయం పది గంటలకు విద్యుత్ ఇవ్వడం అంటే రైతులకు అనుకూలంగా ఉండే సమయాల్లో ఇస్తున్నట్టే. గ్రామాల్లో ఏ రైతైనా నాలుగు గంటలకే నిద్రలేచి పొలానికెళ్లి పశువులను, పంట పనులను చూసుకోవడం పరిపాటి. చంద్రబాబు హయాంలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల మధ్య ఇచ్చేవారు.అది కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పడు పోతుందో తెలిసేది కాదు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఈ రాతలతో ఈనాడే ఒప్పుకుంది. కాదంటారా డ్రామోజీ. ఆరోపణ: థర్మల్ ప్లాంట్లు పరిగెత్తుతూనే ఉన్నాయి. ఒత్తిడి పెట్టి ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏముంది. వాస్తవం:రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు గతంతో పోల్చితే అత్యంత భారీగా సామరŠాధ్యన్ని పెంచుకున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది మార్చిలో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఎన్టీటీపీఎస్లో ఎనిమిదో యూనిట్ సీఓడీ డిసెంబర్లో జరిగింది. దీంతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. అలాగే డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే, 2023–24లో 75.83 శాతానికి పెరిగింది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ స్టేజ్–4 యూనిట్ హీట్ రేట్ 2,517 కిలో వాట్ అవర్ నుంచి 2,436 తగ్గింది. అదే విధంగా డాక్టర్ ఎంవీర్ ఆర్టీపీపీ స్టేషన్ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. ఫలితంగా సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో ఏపీ మొత్తం విద్యుత్ డిమాండులో ఏపీజెన్కో 45 నుంచి 50 శాతం వరకూ సమకూర్చుతోంది. ఆరోపణ: ఎన్నికల ఏడాది కావడంతో గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుందని సీఎం ఆలోచన. పీక్ డిమాండ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనాలన్నా దొరికే పరిస్థితి లేదు.ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్‌లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. వ్యవసాయ విద్యుత్ కోసం రూ.10058 కోట్లు వెచ్చించినా ఫలితం లేదు. వాస్తవం: మధ్యాహ్నం పీక్ డిమాండ్ 12476 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 10643 మెగావాట్లు మాత్రమే ఉండేది. అంటే 17.22 శాతం పెరిగింది. సాయంత్రం పీక్ డిమాండ్ కూడా 8965 మెగావాట్లుగా ఉంది. దీనికి తగ్గట్లు రోజుకి 39.687 మిలియన్ యూనిట్లను యూనిట్ సుమారు రూ.9 చొప్పున వెచ్చించి రూ.34.116 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్ దొరకడం లేదు.. కొనడం లేదనడం అవాస్తవమని ఇక్కడే తేలిపోయింది కదా రామోజీ. అలాగే రాష్ట్రంలో ఎక్కడా సేద్యానికి విద్యుత్ కోత లేదు. నిజానికి ఇది గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు విద్యుత్ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయ ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం రూ.10058 కోట్లు వెచ్చించడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, లో, హై ఓల్టేజీతో మోటార్లు దెబ్బతినడం వంటి సమస్యలు తగ్గాయి. రైతుల బాగుకోసం, వ్యవసాయాన్ని పండుగ చేయడం కోసం అలోచించే నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ఆరోపణ: కృత్రిమ మేధనూ ఏమార్చిన ప్రభుత్వం.. డిమాండ్ తగ్గిందని తప్పుడు లెక్కలు. వాస్తవం: విద్యుత్ డిమాండ్, సరఫరాకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలను విద్యుత్ సంస్థలు ఏ రోజుకారోజు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రస్తుతం (గురువారం నాటి బులిటెన్ ప్రకారం) రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 234.406 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 218.322 కంటే 7.37 శాతం ఎక్కువ. దాచాలనుకుంటే గతేడాది కంటే డిమాండ్ ఇప్పుడు ఇంత ఎక్కువగా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు రోజువారీ పవర్ బులిటెన్‌లో స్పష్టంగా ఇస్తున్నారంటే అంతకన్నా పారదర్శకత ఇంకేముంది. మరోవైపు ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. కృత్రిమ మేధను ఉపయోగించి పవర్ ఫోర్కాస్ట్ ద్వారా డిమాండ్‌ను అంచనా వేసి షార్ట్‌టెర్మ్ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనివల్లనే ప్రతిరోజూ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయగలుగుతోంది. -
ఉచిత కరెంటు.. కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలు ఇవే..
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు తన ఆరు వాగ్దానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ముందుంచారు. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వంటివి వీటిలో ఉన్నాయి. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ప్రతిపక్షాల మెగా ర్యాలీలో ఎన్నికల వాగ్దానాలతో కూడిన కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు ఇవే.. అంతరాయం లేని విద్యుత్ ఉచిత కరెంటు విప్లవాత్మక విద్య యూనివర్సల్ హెల్త్‌కేర్ రైతులకు గిట్టుబాటు ధరలు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా “ప్రియమైన భారతీయులారా, మీరందరికీ నా శుభాకాంక్షలు. నేను ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎవరినీ ఓడించడం గురించి మాట్లాడడం లేదు. దేశాన్ని నవభారతంగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను. మన దేశానికి అన్నీ ఉన్నాయి. నేను జైల్లో ఉన్నాను. దేశం గురించి ఆలోచించడానికి ఇక్కడ నాకు చాలా సమయం దొరికింది. భారతమాత బాధలో ఉంది. పిల్లలకు మంచి చదువులు ఉండడం లేదు. ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. కరెంటు కోతలు, అధ్వాన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. -
200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, రూ.500కు సిలిండర్ షురూ.. 'పథకాలు ఆగవు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయంలో అభయహస్తం కింద ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ, దుబారా ఖర్చులు తగ్గించుకుని సంక్షేమ పథకాలను ఆర్థిక వెసులు బాటు మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులతో కలిసి సీఎం ప్రారంభించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఆపం ‘డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన విధంగానే, 2023 సెపె్టంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారంటీల వల్లే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అందువల్ల ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ ప్రధాని అయ్యాక రూ.1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్‌పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు లక్ష మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అపం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: భట్టి ‘గత ప్రభుత్వానికి అధికారం అప్పగించే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. కానీ గత పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారు. ఉద్యోగులకు వేతనాలు కూడా అప్పులు తెచ్చి చెల్లించేవారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్ హమీలు అమలు సాధ్యం కానివంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ మేం హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లు జీరో (200 యూనిట్లలోపు వినియోగిస్తే) బిల్లుగా వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలూ లేవు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 కే సిలిండర్: ఉత్తమ్ ‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తారని తెలిపారు. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్‌ను రూ.500కు ఇస్తామని వివరించారు. త్వరలోనే కేవలం రూ.500 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్ అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి రూ.500కే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉండాలి. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా రూ.500కు సిలిండర్లు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిట ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా (కనెక్షన్ వినియోగంలో ఉండాలి) ఉండాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సర్వీస్ కనెక్షన్‌కే వర్తింపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు కలిగి, ఆధార్‌కార్డు విద్యుత్ సర్వీసు కనెక్షన్‌తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. రేషన్‌కార్డులోని యజమాని పేరు ఉన్న విధంగా ఈ పథకం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ పేరును డిస్కమ్‌లు మార్చవు. అలాంటి సర్వీసు ఉన్న వారికి యథావిధిగా బిల్లులు వస్తాయి. ఈ పథకం కింద విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలున్నా.. ప్రస్తుత పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే..ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీసు నంబర్ (యూనిక్ సర్వీస్ కనెక్షన్)తో అనుసంధానమైన ఆధార్ కార్డును జోడించి దరఖాస్తు ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ను చూపిస్తే చాలు..వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్ తొలి సంతకానికి తొలి సాక్షి
నిలువెత్తు నిజాయితీ, నిబద్ధత, నిపు ణతకు మారు పేరుగా 32 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మరణం అత్యంత విషాదకరం. ఆయన మృతి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజ లకూ తీరని లోటు. పరిపాలనాధికారిగా ప్రజల సమస్యలు ఆయనకు కరతలామ లకం. జన చైతన్యానికీ, నాగరికతకూ, అభివృద్ధికీ ప్రజా జీవన ప్రమాణాల శీఘ్ర పురోగతికీ కేంద్రాలయిన నెల్లూరు, గుంటూరు జిల్లా లకు ఒకప్పుడు కలెక్టర్‌గా పనిచేసిన ఆయనఆ యా జిల్లాల పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వ్యవ సాయ శాఖ కమిషనర్‌గా, ఎక్సైజ్ శాఖ కమిష నర్గా ఆయన తన అసమాన ప్రతిభను కన పర్చారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పనిచేసే రోజుల్లో జిల్లాల వారిగా మద్యం వ్యాపారాన్ని రాజకీయ మాఫీయా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో సవివరమైన నివేదికను రూపొందించి, అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆయన రూపొందించిన నివేదిక అక్షర సత్యం అనేది నేటికీ రుజువవుతున్నది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ఆయన రూపొందించిన వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది. 2002 – 03లో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర దుర్భిక్షం, కరువులను కేంద్ర పరిశీలక బృందానికి అత్యంత ప్రతిభావంతంగా వివ రించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టగలిగారు. ఎవరికైనా జన్నత్ హుస్సేన్ పేరు స్ఫురణకు రాగానే ఆయనలోని సౌమ్యత, ముఖంలో ఉట్టిపడే సౌహార్ద్రత కళ్లల్లో మెదలు తాయి. వినయ విధేయతలకు మారు పేరు అయిన హుస్సేన్ దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి మన్నన పొందారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే అధికార గణం నుంచి తొలి ఎంపికగా జన్నత్ హుస్సేన్‌ను తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యావత్ రాష్ట్ర రైతులందరికీ ఉచిత విద్యుత్ వరాన్ని ప్రసాదిస్తూ జన్నత్ హుస్సేన్ రూపొందించిన ఫైల్‌పై తన తొలి సంతకాన్ని చేశారు. హుస్సేన్ ఉచిత విద్యు త్ను గట్టిగా సమర్థించేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతులకు నేటికీ ఉచిత విద్యుత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆనాడు ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్ఆర్ తొలి సంతకం చేసే చారిత్రక సన్ని వేశానికి తొలి ప్రత్యక్ష సాక్షిగా జన్నత్ హుస్సేన్ ఎప్పటికీ చరిత్ర పుటలలో మిగిలిపోతారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా... చిత్తశుద్ధిగా పనిచేసే యువ ఐఎఎస్ అధికార్లను ప్రొత్స హించారు. అపోహలతో వారిని బదిలీ చేసినప్పుడు వారికి అండగా నిలిచి వారి బదిలీలను నిలిపి వేశారు. ఇంధన కార్యదర్శిగా ఆరంగం అభివృద్ధికి పాటు పడ్డారు. పదవీ విరమణ అనంతరం ప్రధాన సమా చార కమిషనర్‌గా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో తీర్పులు ఇచ్చారు. ఇలాంటి మహో న్నతమైన వ్యక్తిత్వం కల జన్నత్ హుస్సేన్‌తో నాకు దశాబ్దాల అనుబంధం ఉన్నందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప పాలనా దక్షుడికి అశ్రు నివాళి అర్పిస్తున్నాను. - వ్యాసకర్త ‘బీఈఈ’ మీడియా ఎడ్వైజర్, నాటి సీఎం వైఎస్ ప్రెస్ సెక్రటరీ - ఎ. చంద్రశేఖర రెడ్డి -
27 లేదా 29 నుంచి.. మరో రెండు గ్యారంటీలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు మరో రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందించే పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆరు గ్యారంటీల అమలుకోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా రెండు పథకాల అమలు, విధివిధానాలపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. జీరో బిల్లింగ్.. ఏజెన్సీలకు సబ్సిడీ సొమ్ము మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి.. 200యూనిట్లలోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు వీలుగా విధివిధానాలను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిందని.. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని సీఎం గుర్తు చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సూచించారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించే పథకంలో.. ‘ప్రభుత్వ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? లేక ఏజెన్సీలకు చెల్లించాలా? ఈ క్రమంలో వచ్చే అడ్డంకులు, ఇబ్బందులేమిట’న్న అంశాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎలాగైనా సరే లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సిలిండర్ అందించేలా చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని సూచించారు. దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చించాలన్నారు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీ నిధులను వెంటవెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చే ‘గృహజ్యోతి’ పథకాన్ని అనుమానాలు, అపోహలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. తెల్లరేషన్ కార్డు ఉండి, 200యూనిట్లలోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. తప్పుల సవరణకు అవకాశం ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, విద్యుత్ కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. విద్యుత్ బిల్లుల కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలందరికీ తెలిసేలా ప్రతి గ్రామంలో విద్యుత్ శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలని సూచించారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి పథకం వర్తింపజేయాలన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడు కూడా ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునేలా.. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు గుడ్ న్యూస్..ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన
-
సగానికిపైగా అప్పులు తీర్చాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకే అప్పులు తెచ్చినట్లు మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెచ్చిన అప్పుల్లోనూ సగానికిపైగా తీర్చేశామని చెప్పారు. శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం కింద గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సైతం స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలకు అరకొరగా అందుతున్న విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని... అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇవ్వలేమని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుందా లేక అప్పుల సాకుతో కోతలు పెడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆస్తుల విలువ పెంచాం... 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44,438 కోట్లు ఉండగా అప్పులు రూ. 22,423 కోట్లు ఉండేవని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు రూ. 81,016 కోట్లకు పెరగ్గా ఆస్తుల విలువ రూ. 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని చెప్పారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్ , క్యాండిల్స్ కొనుక్కురావాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. బోరుబావుల్లో నీళ్లు లేకపోతే ఇంట్లో ఎసరు పెట్టే పరిస్థితి లేదని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు. బండెడ్లు అమ్ముకునే స్థితి నుంచి... బండెడ్లు అమ్మడం నుంచి పుస్తెలు అమ్ముకునే దాకా... ఏ బోరు వేశారో ఆ భూమి అమ్ముకొనే దాకా పరిస్థితి అప్పట్లో ఉండేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రైతులు దేశమంతా వలసలు వెళ్లేవారని గుర్తుచేశారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్ ద్వారా విద్యుత్ ఇచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. 133 కేవీ, 220 కేవీ, 400 కేవీ అందుబాటులో లేక, బ్యాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదు.. జెన్కో ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలకే అప్పగించామని, ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగంపై వాస్తవాలు చెబితే కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్... తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక వెంటనే విద్యుదుత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గ్రిడ్‌ను అనుసంధానించి విద్యుత్ సరఫ రా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని తెలిపారు. మొదట అందుబాటులో ఉన్న వ్యవ స్థతో గృహ, వాణిజ్య రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చి ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు తెలిపారు. ఒక సంవత్సరంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యవసాయానికి 6 గంటల కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తరువాత 9 గంటల కరెంటు ఇవ్వగలిగామని, రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను రెట్టింపు నిర్మించామని తెలిపారు. -
మీ ‘బాబు’దే నయవంచన
సాక్షి, అమరావతి: ప్రజలు ఉతికి ఆరేసిన పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం కోసం ఈనాడు రాస్తున్న ఉన్మాద రాతలకు పరాకాష్టే రైతులకు ఉచిత విద్యుత్‌పై రాసిన కథనం. ప్రజలను తప్పుదోవ పట్టించి, దాని అనుకూల పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో అచ్చేసిన ఆ అబద్ధపు రాతల్లో అసలు నిజాలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సోమవారం వెల్లడించాయి. ఆ వివరాలిలా ఉన్నాయి. ఇదీ నయవంచన అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనను పరిశీలిస్తే.. రైతులను నిలువునా వంచించిన చంద్రబాబు అసలు స్వరూపం కళ్ల ముందు కదలాడుతుంది. రైతు రుణ మాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా దగా చేయడంతో పాటు కనీసం పంట పండించుకోవడానికి కరెంటు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి కనిపిస్తుంది. కరెంటు ఫ్రీగా ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్య ఒక్కటి చాలు ఆయన నిజ స్వరూపానికి తార్కాణం. అటువంటి చంద్రబాబు కోసం రైతులకు ఉచిత విద్యుత్ వద్దని, దీనివల్ల విద్యుత్ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయంటూ ఆనాడు పరోక్షంగా కథనాలు రాసింది ఈనాడు పత్రిక. టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు పూర్తిగా మద్దతు పలికింది. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనన్న చంద్రబాబు మాటలను గొప్పగా కీర్తించి, రైతుల ప్రయోజనాలను పూర్తిగా మంటగలిపేందుకు తన వంతు సాయం చేసింది. చంద్రబాబు హయాంలో పగటిపూట దేవుడెరుగు.. రాత్రి పూట కూడా కనీసం నాలుగు గంటలు నిరంతరాయంగా కరెంటు ఇచ్చిన పాపానపోలేదు. రాత్రి వేళ నీటి తడులు పెట్టడానికి పొలాలకు వెళ్లి అనేక మంది రైతులు పాము కాట్లకు, విద్యుదాఘాతాలకు మరణించిన ఘటనలు అనేకం. 2014లో చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పే లేదు. రైతులకు సరఫరా చేసిన విద్యుత్తు అరకొరే. అదికూడా రాత్రిపూటే. పైగా ఉచిత విద్యుత్ కోసం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.12వేల కోట్లు చెల్లించకపోవడంతో రైతులకు ఉచిత విద్యుత్ పథకం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. రాష్ట్ర విభజన నాటికి మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు దాదాపు 29,700 కోట్లు ఉంటే చంద్రబాబు పదవి ముగిసిన 2019 మార్చి నాటికి 68,600 కోట్లకు (131 శాతం పెరుగుదల) చేరాయి. 2023 మార్చి నాటికి రూ.97,500 కోట్లకు (42 శాతం పెరుగుదల) చేరాయి. విద్యుత్ సంస్థల అప్పుల భారం చంద్రబాబు హయాంలో 2014 – 2019 మధ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. వీటి గురించి ఈనాడు ఎక్కడా ప్రస్తావించదు.విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంల నికర విలువ 2014లో సుమారుగా మైనస్ 4,315 కోట్లు ఉంటే, 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి డిస్కంల నికర విలువ దారుణంగా క్షీణించి మైనస్ 20 వేల కోట్లకు చేరింది. ఈ విషయాలు ఈనాడు చెప్పదు. చంద్రబాబు ఘనకార్యాల కారణంగా రైతు అన్నవాడు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుపోయాడు. చంద్రబాబే నయవంచకుడని, ఆయన పాలన మరో చీకటి అధ్యాయమని రైతులే చెబుతున్నారు. రైతులకు మేలు చేసిందే సీఎం వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాత ప్రభుత్వంగా అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఉచిత్ విద్యుత్ పథకం దీర్ఘకాలంగా, స్థిరంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందడానికి గట్టి చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ప్రారంభించారు. సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి రోజుకి తొమ్మిది గంటలపాటు అదీ పగటిపూటే ఏ ఇబ్బందీ లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇప్పుడు రైతులు రాత్రి వేళ ప్రాణాలకు తెగించి పొలాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.1,760 కోట్లు ఖర్చు చేసి 6,663 ఫీడర్లకు అదనపు సామర్ధ్యం కల్పించి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గాన్ని సుగమం చేసింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం పంపిణీ వ్యవస్థపై ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదే. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాల్సిన రూ.12 వేల కోట్లు డిస్కంలకు ఎగ్గొట్టింది. దీంతో డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయలేక మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని సంక్షోభంలో పడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతోపాటు, ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ.46 వేల కోట్లు ఖర్చు చేసింది. దీంతో డిస్కంలు జెన్కోలకు సకాలంలో చెల్లింపులు చేస్తూ విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందించగలుగుతున్నాయి. కచ్చితంగా 9 గంటలు సరఫరా రాష్ట్రంలో ఇచ్చేదే ఏడు గంటలని, అందులోనూ సగటున 2 గంటలు కోతలేనని, లోడ్ రిలీఫ్ ఇతరత్రా పేరిట ఇష్టారాజ్యంగా నిలిపేస్తున్నారంటూ ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో అన్ని రంగాలకు మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోటు లేదు. వచ్చే వేసవి పూర్తయ్యేవరకు ఏ ఇబ్బందీ లేకుండా అందుబాటులో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు స్వల్పకాలిక మార్కెట్ నుండి కొనుగోళ్లు ఖరారు చేసినట్లు డిస్కంలు తెలిపాయి. గ్రిడ్ నిర్వహణ నిమిత్తం ఎప్పుడైనా డిమాండ్‌కు సరిపడినంత విద్యుత్ అందుబాటులో లేనప్పుడు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పరిమితికి మించి అదుపులో లేనప్పుడు, పగటి పూట సౌర విద్యుత్ ఉత్పత్తి ఉన్న ప్రాంతాల్లో మేఘాలు కమ్మినప్పుడు మాత్రమే కొద్దిసేపు సరఫరా నియంత్రణ ఉంటుంది. అలాగే దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌లో సరఫరాకు తీవ్ర కొరత ఏర్పడినప్పుడు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ తీవ్ర ఒడిదొడుకులకు లోనయినప్పుడు, దక్షిణ రీజియన్ లోడ్ డిస్పాచ్ – బెంగళూరు కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుండి వచ్చే విద్యుత్‌ను రాష్ట్రాల వాటా ప్రకారం నియంత్రణ చేసే క్రమంలో ఒక్కోసారి కేంద్ర గ్రిడ్ కు అనుసంధానమైన అధిక కెపాసిటీ గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్లను ట్రిప్ చెయ్యడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో కూడా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ చేతుల్లో ఉండదు. ఇలా చాలా అరుదుగా జరుగుతుందని డిస్కంలు తెలిపాయి. ఇలా ఎప్పుడైనా వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతరాయం ఏర్పడితే... మళ్లీ అదే రోజు వేరొక సమయంలో ఇచ్చి 9 గంటల సరఫరా భర్తీ చేస్తున్నట్లు డిస్కంలు వివరించాయి. ఏ సమస్యా లేకుండా రైతులకు ఉచిత విద్యత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ, ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందని వివరించాయి. కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలన్న దురుద్దేశంతోనే ఈనాడు అవాస్తక కథనాలు ప్రచురిస్తోందని తెలిపాయి. వ్యవసాయ విద్యుత్‌కు ఢోకా లేదు సీఎం జగన్ సంకల్పంతో ఉచిత విద్యుత్ హామీకి అనుగుణంగా దీర్ఘకాలికంగా పగటి పూట వ్యవసాయ విద్యుత్ సరఫరా చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ కేవలం రూ.2.43 కే లభిస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబరు నాటికి మరో 3 వేల మెగావాట్లు, ఆ మరుసటి ఏడాది వెయ్యి మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. గత ప్రభుత్వం పీపీఏల రూపంలో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకుంటేం.. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. సెకీతో జరిగిన ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. దాని ప్రకారం ఈ ఒప్పందం నిమిత్తం అయ్యే విద్యుత్ కొనుగోలు వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రానున్న మూడు దశాబ్దాలపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ అందుతుంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2019–2023 మధ్య నాలుగున్నరేళ్లలో సుమారు 3.83 లక్షల వ్యవసాయ పంపు సెట్లు మంజూరు చేసింది. ఇదంతా రైతాంగం మేలు కోసమే. ఇటువంటివి ఒక్కటైనా చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటే ఒట్టు. అసలు చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే ఓ అడ్డగోలు వ్యవహారం. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అత్యధిక ప్రయోజనం కలిగించడం కోసం ప్రజలపై మోయలేని భారం వేయడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సంకోచించలేదు. అదే ఉద్దేశంతో అత్యధిక రేట్లు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంది. -
మెట్ట రైతుకు మంచి రోజులు
కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్ : ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో ఏమాత్రం లోటు రాకూడదు. రైతన్నలకు ఇచ్చే కరెంట్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్వీసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అని అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రత్యేకంగా పూర్తిగా బోరు నీటిపైనే ఆధారపడి సాగు చేసే మెట్ట ప్రాంత రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల్లో రైతుల వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా 2 విడతల్లో ఇచ్చేవారు. అది కూడా వేళకాని వేళల్లో వచ్చేది. గతంలో కరెంట్ కోసం రైతన్నలు రాత్రిపూట పొలాల్లో జాగారం చేయాల్సిన దుస్థితి. ఫీడర్లు సరిపడా లేకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోయేవి. ఏపీలో ఉన్న 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అందుబాటులో ఉండేవి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై నాలుగైదు సర్విసులు ఉండటం వల్ల ఏ సమస్య వచ్చినా అన్నిటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. మరమ్మతులకు నెలల తరబడి సమయం పట్టడంతో కళ్లెదుటే పంటలు ఎండిపోయేవి. పెట్టుబడులు కూడా వెనక్కి రాక అన్నదాతలు అఘాయిత్యాలకు పాల్పడ్డ దుస్థితి గతంలో నెలకొంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 6,605 ఫీడర్లు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. విద్యుత్ ప్రమాదాలు, సరఫరా నష్టాలకు ప్రధానంగా ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కారణం. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు, పవర్ కెపాసిటర్ల ఏర్పాటు, పాత లైన్ల మరమ్మతులతో సమస్యలు తొలగిపోయాయి. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి వ్యవసాయ సర్వీసుకీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంట్ అందిస్తున్నారు. ప్రభుత్వానిదే భారమంతా.. తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిధిలో వ్యవసాయ ఫీడర్లు ఏటా 15,700 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ఇది ఏపీలో ఏటా వినియోగించే 64 నుంచి 66 వేల మిలియన్ యూనిట్ల వినియోగంలో నాలుగింట ఒక వంతు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవిత కాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్థారించింది. కాల పరిమితి తీరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. లేదంటే యూనిట్‌కు రూ.8 చొప్పున నష్టాలు పెరుగుతాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి నాలుగైదు సర్విసులకు విద్యుత్ సరఫరా చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు త్వరగా పాడవుతున్నాయి. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి మరమ్మతులకు రూ.102 కోట్లు ఖర్చవుతోంది. దీన్ని అధిగమించేందుకు హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్), రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ద్వారా ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, ఫీడర్లను వేరు చేయడం లాంటి చర్యలు చేపట్టారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను సమకూరుస్తున్నారు. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్లర్లు, లైన్ల సామర్థ్యం పెంచుతున్నారు. ఈ ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్విసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతులకు ఏ కష్టం రాకుండా.. వ్యవసాయ రంగం అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారు. ఏపీలో మొత్తం 2,12,517 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. వేలాది కి.మీ. పొడవున కొత్త లైన్లు నిర్మించాం. – కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తడిచిన పొలమే తడిచి.. మా ప్రాంతంలో అంతా కరెంట్‌పై ఆధారపడే వ్యవసాయం జరుగుతుంది. గతంలో హెచ్‌టీ, ఎల్టీ లైన్లు ఒకే స్థంభం మీద ఉండటంతో చిన్న గాలికే కలిసిపోయి ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోయేవి. రోజుకి 7 గంటలు అది కూడా 2,3 మూడు సార్లు కరెంట్ ఇవ్వడంతో తడిచిన పొలాలే తడిచి అవస్థలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం పగటిపూట 9 గంటలు కరెంటిస్తుంది. – రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం -
ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌దే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతులు బాగు పడాలని ఉచిత కరెంట్ ఆలోచన చేసినదే కాంగ్రెస్ పార్టీ అని, అసలు ఉచిత విద్యుత్ గురించి చెప్పుకొనే పేటెంట్ హక్కు తమ పార్టీకే ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 2004లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పైనే తొలి సంతకం చేశారని, రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిల ను రద్దు చేసి, రైతులపై ఉన్న అక్రమ కేసులను సైతం తొలగించారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్‌పై బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రైతులకు 24 గంటల కరెంట్ వద్దు.. 3, 5 గంటలు చాలని అన్నట్టు దుష్ప్రచారం చేస్తు న్నారని.. తాను అలా ఎక్కడ అన్నానో నిరూ పించాలని సవాల్ విసిరారు.ఉమ్మడి పాల మూ రు జిల్లాలోని అలంపూర్, గద్వాల, మక్తల్ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం నిర్వ హించిన ప్రజాగర్జన సభల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అలంపూర్ సాక్షిగా చెబుతున్నా.. ఏదైనా ఒక సబ్‌స్టేషన్‌కు వెళ్లి పరిశీలిద్దాం. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే నా నామినేషన్ వాపస్ తీసుకుంటా. లేకుంటే ఇదే నడిగడ్డ మీద సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలి. వస్తావా? లేక తీసేసిన అబ్రహమో, కొత్త అభ్యర్థి పేరు తెల్వదు గానీ దొరగారి గడీల బానిస వస్తాడా.. లేక కేటీ ఆర్‌ను పంపిస్తావా? కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది. మిత్రుడు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, సీఎం సిద్ధరామయ్యతో నేను, అలంపూర్ సంపత్‌కుమార్ కూర్చొని మాట్లాడి తుమ్మిళ్ల ప్రాజెక్టు సమస్యను పరిష్కరిస్తాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా రూ.100 కోట్లతో జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? ముదిరాజ్‌లు అక్కర్లేదా? తెలంగాణలో 11 శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క టికెట్ ఇవ్వలేదు. ఇవాళ ముదిరాజ్‌ల ఓట్లు అక్కర్లేకుండా పోయాయా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. హేమాహేమీలు పోటీపడ్డా ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించేందుకే వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. మక్తల్‌లో వాకిటి శ్రీహరి, రాజేంద్రనగర్‌లో నరేందర్, గోషామహల్లో సునీతారావు, పటాన్చెరులో నీలం మధుకు టికెట్ ఇచ్చాం. ధరణి కంటే మెరుగైన విధానం తెస్తాం సీఎం కేసీఆర్ కుటుంబం ధరణిని దోపిడీకి వాడుకుంటోంది. ధరణి వారికి ఏటీఎంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొకొచ్చి భూములను కాపాడుతాం. ఎక్కడైతే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడ బీఆర్ఎస్ ఓట్లు అడగాలి. ఎక్కడైతే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో అక్కడ కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటుంది. ధరణి రద్దు చేస్తే రైతుబంధు పోతుందని అబద్ధాలు మాట్లాతున్నారు. ధరణి లాంటిది లేకుండానే వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ, బీమా సౌకర్యం, ఎరువుల సబ్సిడీ ఇవ్వలేదా? లక్ష కోట్ల దోపిడీ జరిగింది ఎవరో పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగలగానే కూలిపోయిందట. కాళేశ్వరం పరిస్థితి అట్లా ఉంది. మేడిగడ్డ కడితే భూమిలోకి కుంగిపోయింది. అన్నారం కడితే ఫక్కున పగిలిపోయింది. సుందిళ్ల రేపోమాపో కూలేటట్టు ఉంది. ఇక మీ పాపం పండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పటికే తప్పుడు వాగ్దానాలతో కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. పది వేల ఎకరాల భూములను అక్రమంగా సంపాదించుకున్నారు. ఆయన ఇంట్లో అల్లుడు, బిడ్డ, కొడుక్కు పదవులు ఇచ్చారు. మూడోసారి గెలిస్తే మనవడికి కూడా పదవి ఇచ్చేలా ఉన్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే కృష్ణా నదిలో ముంచేస్తారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా.. ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి..’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సంపత్‌కుమార్, సరిత తిరుపతయ్య, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
-
కాంగ్రెస్, బీజేపీలను పాతర పెట్టాలి
గజ్వేల్: ‘పీసీసీ అంటేనే పేమెంట్ కలెక్షన్ సెంటర్. బీజేపీని నమ్ముకుంటే అధోగతే. ఈ రెండు పార్టీలను పాతాళంలో పాతర పెట్టాలి. ఉచిత కరెంటు, మూడు పంటలు, ధాన్యపు రాశులు కావాలంటే కేసీఆర్ వెంటే నడవాలి..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రూ.540 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల తీరుపై మండిపడ్డారు. గత కాంగ్రెస్ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులతో క్యూలు కట్టిన రోజులు రైతులు నేటికీ మరిచిపోలేదన్నారు. కరెంట్ సక్రమంగా రాక పంటలు ఎండిపోయి అన్నదాతలు అప్పుల పాలయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. తప్పుదారి కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఆగమైతదని రైతులు గుర్తించారని చెప్పారు. బీజేపీ వల్ల కూడా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ రైతే రాజు అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు సాగటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, ఆయన గజ్వేల్‌లోనే ఉండాలనుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ కానుకగా అందించే బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ గృహలక్ష్మి పథకం కింద 10 వేల ఇళ్లను మంజూరు చేశారని ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌కు పలు సంఘాల మద్దతు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలు సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం, కుమ్మరి సంఘం, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, పద్మశాలి సంఘాలు ఈ మేరకు చేసిన తీర్మానాలను మంత్రి హరీశ్‌రావుకు అందించాయి. -
24 గంటల కరెంటు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడని, ఆయన హామీ నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే ఎండిపోతున్నాయని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి 14 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తాను సవాల్ విసురుతున్నానని, ఏ సబ్‌స్టేషన్ వద్దకు రమ్మంటారో చెపితే వస్తానని, అక్కడ 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండే ఈ నెలరోజుల పాటైనా రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్ని స్కీములు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ కాంగ్రెస్ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూసేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తానంటే ప్రత్యేక విమానం పెట్టి తీసుకెళ్తామని, మంత్రివర్గం వచి్చనా ఫర్వాలేదన్నారు. పథకాల అమలును వివరించేందుకు సీఎం కేసీఆర్ రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహా్వ నించాలని కోరుతానని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ.60 కోట్లు దళిత బంధు పథకానికి సంబంధించిన ఒక్క తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ. 60 కోట్లు వెళ్లాయని కోమటిరెడ్డి ఆరోపించారు. దళితబంధులో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ముతోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. అధికారంలోకి వచి్చన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తామనీ, అమలు చేయలేకపోతే దిగిపోతామన్నారు. బాబు అరెస్టు ఎపిసోడ్ ఫాలో కావడం లేదు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్‌ను తాను ఫాలో కావడం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యా నించారు. టీవీ చూస్తున్నప్పుడు ఆ వార్తలు వస్తు న్నా చానల్ మారుస్తున్నానని, తమ బాధలు తమకున్నాయని, తెలంగాణలో అధికారం దక్కించుకోవడమెలా అనే దానిపైనే దృష్టి పెట్టినట్లు చెప్పా రు. తాను 30 స్థానాల్లో గెలిపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఎలా తీసుకురావాలన్న దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లోకి చేరికలపై మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట మాట్లాడబోనని, వచ్చే నెల 1న ఢిల్లీలో జరిగే సమావేశంలోనే అన్ని విషయాలను మాట్లాడుతానని వెల్లడించారు. -
ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి..
రాయ్‌పూర్: త్వరలో జరుగనున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశం పేరు మార్పు విషయమై సొంత నిర్ణయాలేంటని ప్రశ్నిస్తూనే ఇటీవల అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా దళాలు మృతిచెందినా స్పందించకపోవడంపై ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే పేరు మార్చండి.. ఛత్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇండియా మీ నాన్నగారిది అనుకుంటున్నారా? ఇండియా 140 కోట్ల భారతీయులది. ఇండియా భారతీయుల గుండెల్లో ఉంది. హిందుస్థాన్ భారతీయుల గుండెల్లో ఉందని ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడమని సవాల్ విసిరారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం గతేడాది ఇండియా పేరుమీద అనేక కార్యక్రమాలను జరిపిందని గుర్తుచేశారు. ये 140 करोड़ लोगों का INDIA🇮🇳 है हम सबका INDIA है भारत, इंडिया, हिंदुस्तान - किसी की हिम्मत नहीं कि हमारे देश का नाम बदले। pic.twitter.com/c2gtVTgOJU — Arvind Kejriwal (@ArvindKejriwal) September 16, 2023 నోరు విప్పరేం? ఇక అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత సైనికులు మృతిచెందారు. వారి కుటుంబాన్ని చూసి యావత్ దేశమంతా తల్లడిల్లింది కానీ భారత ప్రధానికి కొంచెమైనా బాధ కలగలేదా అని ప్రశ్నించారు. వారు చనిపోయి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు నోరువిప్పలేదే అని ప్రశ్నించారు. शर्मनाक ‼️ ◆ जब हमारे Army Officers शहीद हुए तब PM, गृहमंत्री और रक्षा मंत्री जश्न मना रहे थे ◆ उनको शहीद हुए 4 दिन हो गए लेकिन PM ने उनके दुख में 2 शब्द नहीं बोले ◆ हर बात पर ट्वीट करने वाले PM और गृह मंत्री इस पर चुप क्यों हैं? क्या आपको दुख नहीं होता?@ArvindKejriwal pic.twitter.com/eOn69skBbT — Ghanendra Bhardwaj🇮🇳 (@GhanendraB) September 16, 2023 విద్యకే ప్రాధాన్యత.. ఛత్తీస్‌గఢ్‌లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యమని చెబుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా విద్య గురించి మాట్లాడింది లేదు. కానీ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించి పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పమని అన్నారు. VIDEO | "Since 75 years of independence, no party or government has ever come and asked for votes to build schools and hospitals. Even after the AAP came into existence, they still don't say this. They have a bad intent," says Delhi CM @ArvindKejriwal addressing a rally in… pic.twitter.com/Z49xoqpqHd — Press Trust of India (@PTI_News) September 13, 2023 300 యూనిట్లు ఫ్రీ.. అంతకుముందు రాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ఛత్తీస్‌గఢ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నగరాల్లోనూ గ్రామాల్లోనూ 24 గంటలూ విద్యుత్ అందిస్తామని హామీనిచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఇది కూడా చదవండి: 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్! -
స్మార్ట్ మీటర్లతో రైతు సాధికారత
సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్ వాడుకునే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, వారి సాధికారతకు దోహద పడుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నంబర్ 22, తేదీ: 01 – 09 – 2020) ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై ‘సాక్షి’ ప్రతినిధికి విజయానంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ♦ ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా అయ్యే మొత్తం విద్యుత్‌లో 18 నుంచి 20 శాతం వ్యవసాయ రంగం వినియోగించుకుంటోంది. ఈ విద్యుత్‌ను లెక్కించడం కష్టమవుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు మెరుగుదలకు, ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతోందో తెలుసుకోవడానికి, నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత చెల్లించాలనే లెక్కకు వ్యవసాయ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. ♦ స్మార్ట్ మీటర్లు బిగించడానికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ సంస్థలపైగానీ, రైతులపైగానీ ఒక్క రూపాయి భారం పడదు. ప్రతి నెలా వ్యవసాయ విద్యుత్ వినియోగదారుడు కూడా అందరిలాగే విద్యుత్ బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో రైతుకు నాణ్యమైన, నమ్మకమైన అంతరాయాలు లేని విద్యుత్‌ను డిమాండ్ చేసే హక్కు లభిస్తుంది. డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. ఇది రైతు సాధికారతకు దోహద పడుతుంది. ♦ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలను అనుసరించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం. స్మార్ట్ మీటర్ ధరను కేంద్రం ప్రాథమికంగా రూ.6 వేలుగా అంచనా వేసింది. అనుబంధ పరికరాలను అందులో కలపలేదు. స్మార్ట్ మీటరు సక్రమంగా పనిచేయడానికి సాంకేతికంగా అనుబంధ పరికరాలు అవసరం. ♦ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్త్ వైరు, ఎర్త్ పైపు, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తారు. మోటార్లను బాగా నడపడంలో, వోల్టేజి సమస్య రాకుండా చూడటంలో కెపాసిటర్లది కీలక పాత్ర. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు సరైన ఎర్తింగ్ ఉండాలి. ఎంసీబీ ద్వారా ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలను తగ్గించడంతోపాటు విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. ♦ స్మార్ట్ మీటర్ల ధర, అనుబంధ పరికరాల ధర వేర్వేరు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్విసుకు అనుబంధ పరికరాలకు రూ.12128.71, పన్నులతో కలిపి రూ.14,455ల ఖర్చవుతుంది. దీనిలో దాదాపు 60 శాతం కేంద్రం నుంచి గ్రాంటుగా పొందడానికి ప్రయతి్నస్తున్నాం. ♦ స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల డిస్కంలకు ప్రయోజనం ఏమీ లేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఈ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయడం కోసం సూచనలు చేశాం. ♦ మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. అనుబంధ పరికరాలు లేకుండా ఉత్తరప్రదేశ్ మినహా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ వ్యవసాయ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంలేదు. ♦ ఆర్డీఎస్ఎస్ పథకంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో గృహ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో ఏపీలోనూ గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. - ‘సాక్షి’తో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ -
ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ మాట్లాడితే.. వైఎస్సార్ ఫొటో చూపించండి
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని, ఉచిత విద్యుత్ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైలుపై మొట్ట మొదటి సంతకం పెడుతున్న ఫొటో చూపించాల ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ నేత లు, కార్యకర్తలకు సూచించారు. ఆ రోజు చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ తదితరులతో కలిసి ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్’కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్సార్ మొదటి సంతకం చేస్తున్న ఫొటో వద్ద సెల్పీ దిగారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అభివృద్ధి పనుల ముందు సెల్ఫీలు ఉచిత కరెంటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పుడు, ఎప్పుడూ, ఎల్లప్పు డూ దీనిని కొనసాగిస్తామని, అధికారంలోకి రాగానే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని భట్టి చెప్పారు. ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వారి త ప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పడానికి ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్’కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల ముందు సెల్ఫీ దిగి, వాటి గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రతి అభివృద్ధి పని గురించిప్రజలకు వివరిస్తాం ‘మెట్రో రైలు మేమే తెచ్చాం.. మెట్రో ఎక్కి సెల్ఫీ తీసి ఇది కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందంటాం. అలాగే కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇలా ప్రతి అభివృద్ధిని ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్’పేరిట ప్రజలకు వివరిస్తాం. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంటారు. వాట్సాప్ డీపీలో సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్టెంట్ ఫొటోలు పెట్టి విస్తృత ప్రచారం కల్పిస్తాం..’అని భట్టి తెలిపారు. సీఎంకు సోయి లేక కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్ఆర్ఎస్పీ ప్రారంభించి 60 ఏళ్లు అవుతోందని, ఈ సందర్భంగా నిజామాబాద్ లో ప్రాజెక్టు వద్ద సంబరాలు నిర్వహిస్తామని మధుయాష్కీ తెలిపారు. -
ఉచిత విద్యుత్ మా పాలసీ
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా ప్రభుత్వ పాలసీ. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. వాటిని నేను పట్టించుకోను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతులు బాధలు తొలగిపోయి వంద శాతం బాగుండాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణిని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ధరణితో భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందని చెప్పారు. ఈ అధికారాన్ని మీ వద్దే పెట్టుకుంటారా? లేక వదిలేసుకుంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. అనిల్‌కుమార్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన అనుచరులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోతుగా ఆలోచించిన తర్వాతే.. ‘తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర సాధనను ఒక టాస్క్‌గా తీసుకుని పనిచేశాం. మాకు రాజకీయం ఒక టాస్క్ లాంటిది. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా పనిచేసిన నాటి నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కరెంటు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అధికారులతో జరిపిన చర్చల ద్వారా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక వసతుల్లో సమతుల్యత సాధించాం. ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటే 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందనే అధికారుల వాదనకు కట్టుబడి, పూర్తిస్థాయిలో అండగా నిలిచి ఏడెనిమిది నెలల్లోనే విద్యుత్ సరఫరా లేక ఏర్పడిన దుష్పరిణామాలను సరిదిద్దాం.ఏడు గంటల పాటు ఒకేమారు వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకునే 24 గంటల కరెంటుకు మొగ్గు చూపాం. గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైన సమయంలో విద్యుత్ కొనుగోలుకు అవసరమైన విచక్షణాధికారం అధికారులకు ఇవ్వడంతో పాటు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో ట్రాన్స్‌కో, జెన్కో తదితర సంస్థల నుంచి ఐఏఎస్ అధికారులను తొలగించాం. విద్యుత్ అంశంపై ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్నాం. మూడు గంటల కరెంటు అంటే రైతులు తిడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు అంశంపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలు కుదుటపడే వరకు కొనసాగిస్తాం. దీంతో ఆర్థికాభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుతుంది. ధాన్యం ప్రాసెసింగ్.. జపాన్ కంపెనీతో చర్చలు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు తదితరాలతో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి పెరిగింది. తెలంగాణలో ఇసుక పండినట్లు 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుండటంతో గిర్నీల సామర్ధ్యం కూడా సరిపోవడం లేదు. 2.5 కోట్ల టన్నుల ధాన్యం ప్రాసెసింగ్ కోసం జపాన్ సటాకా కంపెనీతో మాట్లాడుతున్నాం. నేను రైతుబిడ్డగా సిద్దిపేట మార్కెట్లో పడిగాపులు పడిన రోజులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తున్నాం..’అని సీఎం చెప్పారు. భూములపై సర్వాధికారాలు యజమానులకు.. ‘వీఆర్వోలు భూముల వివరాలు గందరగోళం చేశారు. ధరణి ద్వారా భూముల డిజిటలైజేషన్‌తో వాటిపై సర్వాధికారాలు యజమానుల చేతికి వచ్చాయి. రాష్ట్రంలోని 2.76 కోట్ల ఎకరాల్లో 1.56 కోట్ల భూమి ఇప్పటికే ధరణిలోకి వచ్చింది. ధరణి మూలంగా రైతుబంధు, భూమికి రక్షణ, ధాన్యం కొనుగోలు వంటివి సులభంగా సాధ్యమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ ఎంతో పెరిగింది. ధరణి లేకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి. కొందరు చెప్తున్నట్లు ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు మొదలవుతాయి..’అని కేసీఆర్ అన్నారు. జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లండి ‘భువనగిరిలో ఇద్దరూ పోటీ పడి డబ్బులు తగలేయొద్దు. చెరి ఒక పదవి తీసుకుని జోడెడ్ల బండిలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లండి.. అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డికి చెప్పా. కోడె లేగల మాదిరిగా వెలపల, దాపల సమానంగా ఉంటే కచ్చురంగా బాగా ముందుకు పోతుంది. అనిల్‌కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. నాకు ఫిబ్రవరిలో 70 ఏళ్లు వస్తాయి. రేపటి తెలంగాణను పాలించేది మీరే. దారి చూపించి వెళతా..’అని కేసీఆర్ అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభు త్వ విప్‌లు బాల్క సుమన్, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో రెండేళ్లలో ఉచిత విద్యుత్: కేసీఆర్ మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు కూడా సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పారు. మహారాష్ట్రలో కూడా రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాల్సిందిగా సర్పంచ్‌లకు సూచించారు. వారిని తెలంగాణ గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆదేశించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహారాష్ట్ర అమరావతి డివిజన్ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు రైతు సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెట్కారీ సంఘటనతో పాటు వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మహారాష్ట్ర మీడియా యూనియన్ ప్రతినిధులు ఉన్నారు. -
చంద్రబాబు వారసుడు రేవంత్
సాక్షి, సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డుకునిజమైన వారసుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సిద్దిపేట లోని రాఘవపూర్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలి పోయే మోటార్లు ఉండేవని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని, కరెంట్ చార్జీలు తగ్గించమని పోరాడిన రైతులను కాల్చి చంపాడని మండిపడ్డారు. శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నాడని విమర్శించారు. ‘ఓ కాంగ్రెస్ నాయకుడు ఉచిత కరెంట్ వద్దంటాడు, ఒకరు మూడు గంటలు చాలు, మరొకరు ఎనిమిది గంటలు చాలంటాడు. వారంతా సోయి లేకుండా మాట్లాడుతున్నారు’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నాయ కులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంట్ అందించే పార్టీ కావాలా.. మూడు పంటలకు 24 గంటల ఉచిత కరెంట్ అందించే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలో రైతులు ఆలోచించాలని మంత్రి కోరారు. సమ్మె వీడి.. విధుల్లో చేరండి.. గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని హరీశ్‌రావు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే రూ.వెయ్యి వేతనాన్ని పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికీ సీఎం కేసీఆర్ పరిశీలనలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భరోసా ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్మికులతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. -
విద్యుత్ ప్లాంట్లలో రూ.15 వేల కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే 20 వేల మిలియన్ యూనిట్లు కావాలి. ఈ మేరకు విద్యుత్ కొనేందుకు ఏటా రూ.16,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపెడుతోంది. కానీ రైతులకు ఇస్తున్నది 8–10 గంటలే. ఇందుకు అయ్యే ఖర్చు రూ.8వేల కోట్లు మాత్రమే. మరి మిగతా రూ.8,500 కోట్లు ఎక్కడికి వెళుతున్నాయి? దానిపై బీఆర్ఎస్ సర్కారు విచారణకు సిద్ధమా?’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ అంచనాలను పెంచేసి కమీషన్లు తీసుకున్నారని, ఈ వ్యవహారంలో రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పేరుతో జరుగుతున్న దుర్వినియోగాన్ని తాను ప్రస్తావిస్తే బీఆర్ఎస్ నేత లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మంత్రి కేటీఆర్ గంతులు వేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ అంశంపై సిరిసిల్ల, సిద్ధిపేట, చింతమడక, గజ్వేల్‌లలో రైతు వేదికలు సహా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే రావాలని కేటీఆర్‌కు సవాల్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించ తలపెట్టిన మూడు పవర్ ప్రాజెక్టులకు రూ.45,730 కోట్లతో టెండర్లు పిలిస్తే అందులో రూ.15వేల కోట్లు అవినీతి జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వం 30% కమీషన్లు తీసుకుందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న రుణాలతో జెన్కో, ట్రాన్స్‌కో అప్పుల పాలయ్యాయని.. ఆ భారం విద్యుత్ వినియోగదారులపై పడుతోందని చెప్పారు. బందిపోటు దొంగలు, దండుపాళ్యం ముఠాలు కూడా బీఆర్ఎస్లా దోపిడీకి పాల్పడ లేవని విమర్శించారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే మహిళల మెడలోని తాళిబొట్లనూ అమ్మేస్తుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలను నిలదీయండి విద్యుత్ రంగంలో ప్రభుత్వ అవినీతి, రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని, వారు రైతు వేదికల వద్దకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. రుణమాఫీ చేసే వరకు రైతు వేదికలకు తాళాలు వేయాలని, పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చే వరకు నేతలను నిర్బంధించాలని సూచించారు. ఎమ్మెల్యే లను కూడా చెట్లకు కట్టేయాలని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు ఆ స్థాయి ఉందా? ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని రేవంత్ మండిపడ్డారు. ఏది కావాలనుకున్నా తన ముందుకు తెచ్చుకోగలిగిన స్థాయి ఉన్న, చదువుకున్న రాహుల్ వంటి నేత.. పేదలు, రైతుల కష్టాలను తెలుసు కునేందుకు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కేటీఆర్‌కు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా, దుక్కి దున్నడం, సాలు కొట్టడ మంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. వ్యవసాయం అంటే అంట్లు తోమడం కాదు కేటీఆర్‌పై రేవంత్ ట్వీట్ ఎడ్లు, వడ్ల గురించి రాహుల్ గాంధీకి తెలియదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. వ్యవసాయమంటే అమెరికాలో అంట్లు తోమడం కాదని, ఎడ్లు, వడ్లు అని ప్రాస కోసం పాకులాడే గాడిదలకు గంధపు చెక్కల వాసన ఏం తెలుస్తుందని సోమవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘ఎవుసం అంటే గెస్ట్‌హౌస్‌లలో సేదతీరడం కాదు. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ’ అని పేర్కొన్నారు. తన ట్వీట్‌కు రాహుల్ దుక్కి దున్ని నాట్లు పెడుతున్న ఫొటోలను జత చేశారు. -
ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజల అవసరాలే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే తీసుకువస్తామని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పి) నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా తన పాదయాత్ర అనుభవాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి జూలై 2వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పి రి గ్రామం నుంచి ఖమ్మం నగరం వరకు నిర్వహించిన ‘పీపుల్స్ మార్చ్’అనుభవాలను శనివారం గాందీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. తన పాదయాత్ర సందర్భంగా అనేక విషయాలను తాను ప్రత్యక్షంగా చూశానని, కొన్ని పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్ఎస్ మసిపూసి మారేడు కాయ చేస్తోందని విమర్శించారు. గోబెల్స్ ప్రచారంతో అద్భుతాలు జరిగినట్టు, బంగారు కుటుంబాలు తయారయినట్టు కట్టుకథలతో నెట్టుకొస్తోందని భట్టి నిందించారు. ఆ రూ.5లక్షల కోట్లు ఎటుపోయాయో? ‘‘రాష్ట్రంలో రైతులు బాగుపడలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. దళితులకు భూమి ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ అమలు కావడం లేదు. గిరిజనులకు పోడు హక్కులు క ల్పించలేదు. ఐటీడీఏలను నిర్వీ ర్యం చేశారు.. యూనివర్శిటీల్లో నియామకాలు లేవు. మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెట్టిన తొమ్మిది బడ్జెట్ల నిధులు ఏమయ్యాయో తెలీదు. అప్పుగా తెచ్చిన రూ.5లక్షల కోట్లు ఎటుపోయాయో అర్థం కాదు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.’అని వ్యాఖ్యానించారు. త్వరలో ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం సాగునీటిలో రాష్ట్రానికి గుండు సున్నా అని, గోదావరి, కృష్ణా నదులపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచి నీరివ్వకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పేందుకు, వాస్తవ పరిస్థితులను వివరించేందుకు త్వరలోనే ప్రాజెక్టుల వద్దకు వెళ్తామని, అక్కడ çపరిస్థితులను ప్రజలకు వివరించి సెల్ఫీలు దిగి చూపెడతామని వెల్లడించారు. ఇక్కడ ఫ్యూడల్.. అక్కడ బహుళజాతి సర్కారు తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని భట్టి వ్యాఖ్యానించారు. ఎవరు ఏం మాట్లాడాలన్నా భయపడుతున్నారని, ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారో అనే భయంతో బతికే పోలీసు రాజ్యాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఫ్యూడల్ ప్రభుత్వం, దేశంలో బహుళ జాతి ప్రభుత్వం కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ 2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పా ర్టీదని, ఉచిత విద్యుత్‌పై పేటెంట్ తమకే ఉందని భట్టి స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరూ ఆలోచించనప్పుడే 1999లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రైతులకు ఉచిత విద్యుత్‌ను మేనిఫెస్టోలో చేర్చామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పేముందు కాంగ్రెస్ పా ర్టీకి దండం పెట్టాలని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఫామ్‌హౌస్ సంస్కృతిని తీసుకువచ్చారని ఆరోపించారు. జర్నలిస్టులకు ఎప్పుడు ఇండ్ల స్థలాలు ఇచ్చినా కాంగ్రెస్ పా ర్టీనే ఇచ్చిందని, మళ్లీ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పా ర్టీనేనని వ్యాఖ్యానించారు. సీఎం కురీ్చలో ఎవరు కూర్చుంటారన్నది ఇప్పుడు అప్రస్తుతమని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్టి స్పష్టం చేశారు. గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు నాంపల్లి: 1440 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలతో కలిసి భట్టి విక్రమార్క తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతలు చల్ల నరసింహారెడ్డి, జగదీష్ రావు, బల్మూరి వెంకట్, అజ్మతుల్లా హుస్సేని, ప్రేమ సాగర్, సిరిసిల్ల రాజయ్య, కుంభం అనీల్‌కుమార్ రెడ్డి, నూతి శ్రీకాంత్, పల్లవి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది మొదటి నుంచీ ద్రోహపూరిత పాత్రనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల కాంగ్రెస్ మొదటి నుంచీ ద్రోహపూరిత పాత్రనే పోషించిందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణను నిర్లక్ష్యమే చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అనేది ప్రజల హక్కు తప్ప కాంగ్రెస్ ఇచ్చుడు, తీసుకునుడు అనే వాదన అర్థరహితమన్నారు. శనివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు తెలంగాణ అంటే ఎప్పుడూ పట్టదని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. చరిత్రను అర్థం చేసుకోని అజ్ఞానులే కేసీఆర్‌ను బషీర్‌బాగ్ కాల్పులకు కారణమంటారని, తెలంగాణ మలి ఉద్యమానికి కరెంటు, వ్యవసాయ రంగ సమస్యలే కారణమని చెప్పారు. బషీర్‌బాగ్ కాల్పుల తర్వాత కేసీఆర్ రాసిన లేఖనే తెలంగాణ ఉద్యమానికి మలుపని పేర్కొన్నారు. గత తొమిదేళ్లలో కరెంటు పోయి దెబ్బతిన్న రంగం ఏమీలేదన్నారు. 15 నిమి షాలో, అరగంటో కరెంటు పోతే 24 గంటల కరెంటు లేన ట్టా అని ప్రశ్నించారు. కొన్ని సాంకేతిక కారణాల తో కరెంటు పోతే లాగ్ బుక్కులు అంటూ రాజకీయం చేస్తున్నారని, అజ్ఞానులే కరెంటు కొనుగోలుపై ఆరోపణలు చేస్తారన్నారు. రేవంత్ ముందే బయటపెట్టారు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వొద్దు అనే కాంగ్రెస్ హైకమాండ్ విధానాన్ని రేవంత్ ముందే బయటపెట్టారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గతంలో కూ డా రేవంత్ ఓటుకు నోటు కేసులో తొందర పడి చంద్రబాబును తట్టా బుట్టా సర్దుకుని వెళ్లేలా చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పేటెంట్ అని, ఉచిత విద్యుత్‌కు కాదని ఎద్దేవా చేశారు. కోమటి రెడ్డి గతంలో అనేక సవాళ్లు విసిరి పారిపోయారని, అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవ సరం లేదన్నారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో చంద్రబాబు అభిమానులు పెట్టిన మీటింగ్‌లో రేవంత్.. చంద్రబాబు ఎజెండానే మాట్లాడారని ఆరోపించారు. కరెంటు కొనుగోలు ఎలా జరుగుతుందో తెలియని అజ్ఞాని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమానికి భూమిక కరెంటే అని తెలియక బెదిరింపులకు దిగుతున్నారన్నారు. -
'ఫ్రీ' ఫైట్.. హై వోల్టేజ్.. చల్లారని ఉచిత విద్యుత్ మంటలు..
ఉచిత విద్యుత్ మంటలు చల్లారడం లేదు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మరింత రాజుకుంటున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా రైతులకు ఉచిత విద్యుత్ చుట్టూనే తిరుగుతోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పరస్పరం విరుచుకుపడుతున్నారు. మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇటీవలి అమెరికా పర్యటనలో రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. ‘ఒక ఎకరానికి నీరు పారించాలంటే గంట చాలు. మూడెకరాలకు ఫుల్లుగా నీరు పారాలంటే మూడు గంటలు... టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్ తీసుకొచ్చిండు..’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ దీన్ని అందిపుచ్చుకొని.. ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ మండిపడింది. ఆత్మరక్షణలో పడిన ప్రతిపక్ష పార్టీ నష్ట నివారణకు దిగింది. ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందే తామని, దానికి కట్టుబడి ఉన్నామంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌పైనే ఎన్నికలకు వెళదామని, ఎవరు విద్యుత్ ఇచ్చారో, ఇవ్వలేదో ప్రజలే నిర్ణయిస్తారని, రెఫరెండంకు కాంగ్రెస్ సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. దీనిపై రేవంత్‌రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. అదేదో సబ్స్టేషన్ల వద్దే తేల్చుకుందామన్నారు. మరోవైపు ఉచిత విద్యుత్‌పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా క్షేత్రస్థాయిలో 10 రోజుల కార్యాచరణకు పిలుపునివ్వడం ద్వారా ఈ అంశాన్ని ఇంతటితో వదలబోమనే సంకేతాలను బీఆర్ఎస్ ఇచ్చింది. -
3 పంటలా.. 3 గంటలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 95 శాతం ఉన్న రైతన్నలను అవమానపరిచేలా మూడు గంటల విద్యుత్ సరఫరా చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్న మాటను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. శనివారం ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే మూడు పంటలు కావాలాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలా’అన్న నినాదంతో ముందుకు సాగాలంటూ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మూడు గంటల కరెంటు చాలు అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ప్రతి గ్రామంలో, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరిగేలా చూడాలన్నారు. రేవంత్‌ది కూడా చంద్రబాబు విధానమే.. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంటే.. రైతుల పట్ల, వ్యవసాయ రంగంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు అనుచితమంటూ మాట్లాడిందని కేటీఆర్ విమర్శించారు. 2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు తరహాలోనే ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడారని, ఈ విషయాన్ని రాష్ట్రంలోని ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు రైతు, వ్యవసాయ వ్యతిరేక ఆలోచన విధానంతోనే రేవంత్ కూడా ఉచిత విద్యుత్తుపై అడ్డగోలుగా మాట్లాడారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియ జెప్పాలన్నారు. ఉచిత విద్యుత్తు వద్దు – కేవలం మూడు గంటల విద్యుత్ చాలు అంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని, అందుకే తెలంగాణలో రైతులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్పందించారని పేర్కొన్నారు. 17 నుంచి రైతు సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈనెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1,000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కష్టాలను, బీఆర్ఎస్ పాలనలో అందుతున్న కరెంటు గురించి రైతులకు వివరించాలని కోరారు. ఉచిత విద్యుత్తుపై చేసిన కాంగ్రెస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రైతాంగానికి ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయాలని సూచించారు. -
సబ్ స్టేషన్ల వద్దే తేల్చుకుందాం
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌పై రాజుకున్న మంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరింత ఆజ్యం పోశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి శనివారం ఆయన కొత్త ట్విస్ట్ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ ఉచిత విద్యుత్‌పై రెఫరెండానికి సిద్ధమని చెపుతూనే మెలిక పెట్టారు. ‘రాష్ట్రంలో 3,500 సబ్స్టేషన్లు ఉన్నాయి. ప్రతి సబ్‌స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాం. ఆయా సబ్స్టేషన్లలోని లాగ్‌బుక్‌లు, లైన్ ఆఫ్ కరెంటు రికార్డులు పరిశీలిద్దాం. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చి ఉంటే.. అలా ఇచ్చిన సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలను ఓట్లు అడగం. ఇవ్వలేదని తేలితే బీఆర్ఎస్ వాళ్లు ఓట్లు అడగొద్దు. ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ విధమైన రెఫరెండానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలమంతా సిద్ధంగా ఉన్నాం.’అంటూ ప్రతి సవాల్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. శనివారం గాందీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే నల్లగొండలో నిరూపించాం.. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలు ఇప్పటికే నిరూపించారని రేవంత్ అన్నారు. నల్లగొండ జిల్లాలోని 350 సబ్స్టేషన్లలోని లాగ్‌బుక్‌లను ఆ జిల్లా ఎస్ఈ దగ్గర సీజ్ చేయించారని చెప్పారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము 2014కు ముందు ఇచ్చిన 9 గంటల విద్యుత్‌నే కొనసాగించారని, అదీ 36 సార్లు కోతలు విధించి ఇచ్చారని విమర్శించారు. 2018 వరకు ఈ తొమ్మిది గంటల కరెంటే కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సబ్స్టేషన్ల వద్దనే రచ్చబండ పెట్టి ప్రజాక్షేత్రంలో తీర్పు అడుగుదామని, దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి రెఫరెండానికి సిద్ధం కావాలని రేవంత్ సవాల్ విసిరారు. చంద్రబాబుతో అంటకాగి కేసీఆర్ మనుగడ సాధించాడు ‘అప్పటి టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆర్థిక సహకారంతోనే కేసీఆర్ పార్టీ పెట్టాడు. 2009లో తెలుగుదేశం పారీ్టతో పొత్తు పెట్టుకుని, చంద్రబాబుతో అంటకాగి టీడీపీ దయాదాక్షిణ్యాలతో మళ్లీ రాజకీయాల్లో మనుగడ సాధించాడు. మంత్రి హరీశ్ వార్డు మెంబర్‌గా గెలవనప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చింది. ఆ పారీ్టల మీద బతికి, పెరిగి వారినే తిట్టే నీచమైన సంస్కృతి కేసీఆర్‌ది. ఇప్పటికైనా ఇలాంటి సంస్కృతిని వదిలి నిజాలు మాట్లాడితే ప్రజలు గౌరవిస్తారు..’అని రేవంత్ వ్యాఖ్యానించారు. గుత్తా, పోచారంను బర్తరఫ్ చేయాలి.. ‘స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు మాట్లాడవచ్చా? రాజకీయ విమర్శలు చేయవచ్చా?..’అని రేవంత్ ప్రశ్నించారు. గవర్నర్ తక్షణమే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మళ్లీ గజ్వేల్ నుంచే పోటీ చేయాలి.. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ వెలుగులు విరజిమ్మాయని, కాంగ్రెస్ పాలనలో కారు చీకట్లు కమ్ముకున్నాయని చెపుతున్న బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే రెండు పనులు చేయాలని, అలా చేస్తే తాను వ్యక్తిగతంగా ఏ శిక్షకైనా సిద్ధమేనని రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు నిజంగా దమ్ముంటే మళ్లీ గజ్వేల్ నుంచే పోటీ చేయాలని సవాల్ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సిట్టింగులుగా ఉన్న ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించాలని అన్నారు. గజ్వేల్ కాకుండా ఆలేరు, కామారెడ్డిల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కేసీఆర్ సర్వేలు చేయించుకుంటున్నారని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకున్నట్టేనని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘ఈ రెండేళ్లలో ఎప్పుడైనా కేసీఆర్ నా పేరు తీసిండా? నా కళ్లలోకి చూసిండా? ఆయనకు భయం. దమ్ముంటే కేసీఆర్‌ను బయటకు బయటకు వచ్చి మాట్లాడమనండి..’అంటూ సవాల్ విసిరారు. -
‘ఫ్రీ’ ఫైర్.. అగ్గేసిన కాంగ్రెస్.. అందుకున్న బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. తెలంగాణ రైతాంగానికి టోటల్‌గా ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వేడి రాజేశాయి. అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంది. తాము అమలు చేస్తోన్న రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని, అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడింది. పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ధరణి ఎత్తివేస్తామని, ఉచిత విద్యుత్ తీసేస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీకి కరెంటు షాకులు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు నిరసనగా బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లెక్కారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమంటూ లేదని, ఎవరికి తోచింది వారు చెబుతూ ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నారని విమర్శించింది. రేవంత్ వ్యాఖ్యలు ఊహించని విధంగా వివాదాన్ని సృష్టించడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. పేటెంట్ మాదే.. బీఆర్ఎస్, బీజేపీల విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రేవంత్ వ్యాఖ్యలు వైరల్ కావడం, బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించడంతో ఎదురుదాడికి దిగింది. నష్ట నివారణకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, మల్లురవి, అద్దంకి దయాకర్, షబ్బీర్‌అలీ, రైతు విభాగం నేతలు కోదండరెడ్డి, సుంకేట అన్వేష్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ తదితరులు రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే రైతులని, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, రేవంత్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మంత్రులు ఊరకుక్కల్లా మాట్లాడుతున్నారంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపేందుకే రేవంత్ అలా మాట్లాడారని, విద్యుత్ రంగంలో అవినీతిపై బహిరంగ చర్చకు మంత్రులు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక ఉచిత విద్యుత్‌పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించగా, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమపై బురద జల్లుతున్నారని మాజీ ఎంపీ మల్లురవి విమర్శించారు. బీజేపీ తెచి్చన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ విధాన నిర్ణయాన్ని రేవంత్ ప్రకటించలేదంటూ, రైతులకు ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర: రేవంత్ బీఆర్ఎస్ విమర్శల పర్వం, కార్యాచరణపై అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి తాజాగా స్పందించారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన బీజేపీ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకు బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఒక ప్రకటనలో విమర్శించారు. గాంధీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్న సమయంలో అసత్య, అసందర్భ అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ చిల్లర హడావుడి చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న విషయం తేలడంతోనే బీఆర్ఎస్ మంత్రులు, నేతలు దు్రష్పచారం చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో 12 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్ల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించిందని, అందుకే తాను అమెరికాలో మాట్లాడిన మాటలు అవకాశంగా తీసుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ స్కీం అని, ఆ విషయంలో కాంగ్రెస్‌ను వేలెత్తి చూపే అర్హత బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. అసలు రేవంత్ ఏమన్నారు..? అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన గ్రీట్ అండ్ మీట్లో ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ సమావేశంలోనే ఉచిత విద్యుత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ రైతాంగానికి నిరంతరాయంగా ఇస్తున్న కరెంటును కొనసాగిస్తారా లేక రద్దు చేస్తారా? రైతుబంధు కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని ఓ ఎన్ఆర్ఐ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన రేవంత్.. ‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులు. మూడెకరాలలోపు ఉంటే ఒక ఎకరానికి నీరు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాలకు ఫుల్లుగా నీరు పారాలంటే మూడు గంటలు సరిపోతుంది. టోటల్‌గా ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్ తీసుకొచి్చండు. ఉచిత కరెంటు అని కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఇలాంటి ఉచితాలను అనుచితంగా స్వార్థానికి వాడుకోవద్దు. ఉచిత విద్యుత్ గురించి రైతు డిక్లరేషన్‌లో స్పష్టంగా చెప్పాం..’ అని అన్నారు. -
రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మంచి జోష్‌తో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక సొంత పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం..అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. మొత్తం మీద రేవంత్ వ్యాఖ్యల పర్యవసానం తీవ్రంగానే ఉంటుందని, 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే నిలదీసి ప్రభుత్వం చేత ఇప్పించాల్సిన బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. అసలు 24 గంటల విద్యుత్తే అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రెస్మీట్లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్టానం దృష్టికి..! అమెరికా వేదికగా ఉచిత విద్యుత్‌పైనా, అవసరమైతే సీఎంగా సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘రేవంత్ అమెరికా వెళ్లేంతవరకు బాగానే ఉన్నాడు. అక్కడకు వెళ్లిన తర్వాత బాలకృష్ణ, ఎర్రబెల్లి ప్రభావం పడి అలా మాట్లాడుతున్నాడేమో’ అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ విషయమై కొందరు సీనియర్లు అనధికారికంగా మాట్లాడుతూ.. ‘రేవంత్ పప్పులో కాలేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యాధృచ్చికంగా ఒక్క పదం అన్నందుకే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వ్యవసాయం దండుగ అన్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు 7–9 గంటల విద్యుత్ ఇచ్చాం. అసలు ఉచిత విద్యుత్ గురించి ఎందుకు మాట్లాడాలి? 24 గంటలు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ను విమర్శించాలి కానీ ఇస్తామంటే వద్దనడమెందుకు? దీంతో పాటు కాంగ్రెస్సే రేవంత్, రేవంతే కాంగ్రెస్ అని ఆయన అంటున్నారు. సీతక్కను సీఎం చేస్తామంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్, సీడబ్ల్యూసీ, సీఎం పదవులన్నీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికేనా? అసలైన కాంగ్రెస్ వాదులకు ఏం పదవులు లేవా? ఇలాంటి విషయాలన్నీ రాహుల్‌గాంధీతోనే మాట్లా డుతాం.’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఉచిత విద్యుత్ వద్దంటే.. ఊరి పొలిమేర దాకా ఉరికించండి
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌కు ఉరివేసేందుకు గాంధీభవన్ కేంద్రంగా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ వద్దంటున్న వారిని ఊరి పొలిమేర దాకా ఉరికించాలని, మూడు గంటల కరెంట్ చాలంటున్న వారి మాడు పగిలేలా జవాబు చెప్పాలన్నారు. రైతులకు ఊపిరి లాంటి ఉచిత విద్యుత్‌ను నిలిపివేసి అన్నదాతల ఉసురు తీస్తా మని కాంగ్రెస్ చెప్పడం ఆ పార్టీ రాక్షస బుద్ధికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు. రైతులను పొడుచుకు తినేందుకు కాచుకు కూర్చున్న కాంగ్రెస్ రాబందుల్ని తరిమికొట్టి రైతు బంధువులకు అండగా నిలవాలని చెప్పారు. రైతాంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాం తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి రైతాంగాన్ని రక్షించేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయతోపాటు అనేక సాగునీటి పథకాలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ట అని, ధరణి రద్దు, రైతుబంధు వద్దు అంటూ ఇప్పటికే వరుసగా రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఎదురైన కష్టాలను రైతులు మరిచిపోరని, నాసిరకం విద్యుత్ సరఫరాతో ట్రాన్ఫ్‌ఫార్మర్లు, మోటార్లు కాలి రైతులు నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంటుతో రైతులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారని, ఎరువులు, విత్తనాల కొరత, కల్తీ విత్తనాలు, పురుగు మందులు కూడా రైతులను కాటేశాయని చెప్పారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తేసి మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మెడపై కత్తి పెట్టినా రైతులను కాపాడుకునేందుకు రూ.30 వేల కోట్లు వదులుకున్నామని కేటీఆర్ అన్నారు. రైతులు బాగుపడటాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని, గతంలో మాదిరిగా బ్రోకర్లు, దళారులను తిరిగి తెచ్చేందుకు ధరణి పోర్టల్ రద్దు చేస్తామంటూ ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాం నాటి చీకటి యుగాన్ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతామని, తమ మేనిఫెస్టోలో కూడా పెడతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాడు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా 24 గంటలు ఇస్తానని ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పట్లో చంద్రబాబు రైతులను కాల్చి చంపారు. రైతులకు అండగా నిలిచి వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇచ్చారు’’ అని కోమటిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావు. సీతక్కను సీఎం చేస్తానన్న వ్యాఖ్యలు కూడా సరికావు. రేవంత్‌రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఏవీ ఫైనల్ కావు. పీసీసీ అధ్యక్షుడి పదవి చాలా చిన్న పోస్ట్. ఉచిత విద్యుత్‌పై నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్‌కు లేదన్న కోమటిరెడ్డి.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలి’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు.. 3 గంటలు ఇస్తే చాలు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ‘‘రేవంత్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేతతో చర్చించాను. అవసరమైతే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తాం. అమెరికా వెళ్లిన రెండురోజుల్లో రేవంత్ ఎందుకింత గందరగోళంగా మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డిపై బాలకృష్ణ ప్రభావం పడిందా?’’ అంటూ కోమటిరెడ్డి వ్యంగంగా మాట్లాడారు. -
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రైతులంటే రేవంత్‌రెడ్డికి ఎందుకంత ద్వేషం అంటూ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందన్నారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీనే.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు ఏడుపెందుకు? అంటూ జగదీశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు వెళ్లిపోయిన ఆయన వారసత్వం కొనసాగుతోంది. బాబు పీడకలలు ఇక్కడ ఇంకా కనబడుతున్నాయి. తెలంగాణ వచ్చాక కరెంట్ కోతలు తప్పాయి.. రైతులు ఆనందంగా ఉన్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాటలతో మళ్లీ పిడుగులు పడ్డాయి. రేవంత్‌రెడ్డి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు.. ఆనాడు కరెంట్ కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఇవ్వటం లేదని రేవంత్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నాడని మంత్రి గుర్తు చేశారు. చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం
-
విద్యుత్ బిల్లుల మొత్తం నెల ముందే రైతుల ఖాతాల్లో జమ
సాక్షి, అమరావతి: అసత్య కథనాలతో సర్కారుపై బురద చల్లడమే ఈనాడు, పచ్చపత్రికల పనైపోయింది. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఆ పత్రికలు ప్రచురించిన అవాస్తవాలతో కూడిన కథనాలను ఇంధన శాఖ ఖండించింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేసింది. స్మార్ట్ మీటర్ల కారణంగా రైతులపై ఒక్క పైసా భారం పడదని తేటతెల్లం చేసింది. విద్యుత్ బిల్లులు రైతులు ముందుగా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, బిల్లుల మొత్తం నెల ముందుగానే రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది. ఆ తర్వాత రైతు ఖాతా నుంచి డిస్కంలకు వెళ్తాయని వెల్లడించింది. ఇందులో రైతులు ముందస్తుగా చెల్లించడం లేదా సొంత డబ్బు చెల్లించడం వంటివి ఉండవని స్పష్టం చేసింది. మొత్తం ఖర్చంతా ప్రభత్వమే భరిస్తుందని తెలిపింది. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ రాయితీలు యథాతథంగా అమలవుతాయని తెలిపింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వాస్తవాలను వెల్లడించారు. నిజాలను మరుగనపెట్టి పేదలు, రైతుల్లో అపోహలు కలి్పంచేలా కథనాలు ప్రచురించవద్దని ఆ పత్రికలను హెచ్చరించారు. అంశాలవారీగా ఆయన వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి... ఆరోపణ: ఇకపై నేరుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందదు వాస్తవం: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఉచిత విద్యుత్ ఉండదని ఎవరూ అపోహ పడాల్సిన పనిలేదు. రానున్న 30 ఏళ్ల పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుమార్లు విస్పష్టంగా చెప్పారు. ఆరోపణ: రైతులు ముందుగానే బిల్లులు చెల్లించాలి వాస్తవం: రైతులు ముందస్తుగా బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. వ్యవసాయానికి విద్యుత్ వినియోగించుకున్నందుకు రైతులు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దాని నుంచే డిస్కంలకు వెళుతుంది. అంతేకాదు.. ఈ నగదును ప్రభుత్వం ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అందువల్ల రైతులు డిస్కంలకు ముందుగా బిల్లులు చెల్లించాల్సిన అగత్యం ఉండదు. రైతులకు అందించే విద్యుత్ అంతా ఉచితమే. రైతులు జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోపణ: వ్యవసాయ రంగంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్న అన్ని వర్గాలకు సంబంధించిన బిల్లులకు ఇకపై ఇదే విధానం అవలంబించాలి వాస్తవం: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు అయ్యే మొత్తంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల మొత్తాన్ని కూడా ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుంది. ఆయా వర్గాల సబ్సిడీలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆరోపణ: కేంద్రం చెప్పిన వాటిని అంగీకరిస్తే రాష్ట్రానికి మరో రూ.7 వేల కోట్ల అదనపు అప్పు తీసుకోవడానికి ఆస్కారం లభిస్తుంది వాస్తవం: విద్యుత్ రంగం బలోపేతానికి సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితమే నిర్ణయం జరిగింది. అప్పటి నుంచి వీటిని దశలవారీగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాల ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభు త్వం రుణాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఆరోపణ: ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి. వాస్తవం: ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు ఎంత విద్యుత్ వినియోగించుకుంటాయో ఆ మేరకు బిల్లులను అవి చెల్లిస్తాయి. స్థానిక సంస్థలు వాటి నిధులతోనే బిల్లులు చెల్లిస్తాయి. ఆరోపణ: పంపిణీ నష్టాలు తగ్గించుకోవాలి. వాస్తవం: ఇందులో తప్పేముంది? విద్యుత్ వృథాను తగ్గించుకోవద్దా? వృథా చేయాలా? ఏయే రంగాలు ఎంతెంత విద్యుత్ వాడుకుంటున్నాయో కచ్చితమైన లెక్కలు తేలితేనే పంపిణీ నష్టాల లెక్కలు తేలతాయి. సంస్కరణల ద్వారా పంపిణీ నష్టాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది. పంపిణీ నష్టాలను తగ్గించేందుకు డిస్కంలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. పంపిణీ నష్టాలు తగ్గించడమంటే విద్యుత్ వృథాను తగ్గించడమనే అర్థం. ఆరోపణ: విద్యుత్ సరఫరాకు, వస్తున్న ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. వాస్తవం: పంపిణీ నష్టాలను (విద్యుత్ వృ«థా/లైన్ లాసెస్) తగ్గించడం ద్వారా చాలా వరకు ఇది సాధ్యమవుతుంది. ఆదాయ, వ్యయాల మధ్య అంతరం లేకుండా చేయడమంటే నష్టాలు లేకుండా చేయడమే. డిస్కంల లక్ష్యం కూడా ఇదే. ఆరోపణ: ఒకే లబ్దిదారు విద్యుత్ రంగంలో రెండు రకాల సబ్సిడీలు పొందకుండా చూడాలి. వాస్తవం: సబ్సిడీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నందున దీనివల్ల డిస్కంలపై ఎలాంటి ప్రభావం ఉండదు. సబ్సిడీలు ఎలా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఆరోపణ: విద్యుత్ రంగంలో ఆర్థిక అంశాలన్నీ పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు ఎంత సబ్సిడీ భరిస్తున్నాయి? డిస్క ంలకు ఎంత బాకీ పడ్డాయనేది స్పష్టంగా వెల్లడించాలన్నవి కేంద్ర ప్రభుత్వ షరతులు వాస్తవం: ఇవి మంచివే కదా. వీటిని అమలు చేయడంలో తప్పేముంది? పూర్తి పారదర్శకంగా ఉంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పక్కాగా సబ్సిడీ మొత్తాలను డిస్కంలకు విడుదల చేస్తోంది. ఆరోపణ: వ్యవసాయ రంగంతోపాటు ఏయే రంగాలు ఎక్కడెక్కడ ఎంతెంత విద్యుత్ వినియోగిస్తున్నాయో మీ టర్ల ద్వారా స్పష్టంగా లెక్కలు తేల్చాలి. మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతానికి మీటర్ల వ్యవస్థ ఏర్పాటైందో కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఏయే రంగాలు ఎంతెంత విద్యుత్ వినియోగిస్తున్నాయో స్పష్టమైన లెక్కలు తేల్చాలనే ఉద్దేశంతోనే అన్ని చోట్లా స్మార్ట్ మీటర్లు అమర్చాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నిర్ణయించాయి. ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు మీటరు ఉంటుంది. ఎన్నో ఉపయోగాలు స్మార్ట్ మీటర్లతో అనేక లాభాలు ఉన్నాయని, అందువల్లే వీటి ఏర్పాటుకు అంగీకరించామని విజయానంద్ వివరించారు. ‘ఈ మీటర్లతో ఏ సమయంలో ఎక్కడ ఎంత విద్యుత్ వినియోగం అవుతోందో తెలుస్తుంది. తద్వారా ఎంత లోడ్ అవసరమో కచ్చితమైన లెక్క ఉంటుంది. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. లోడ్‌కి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, సబ్స్టేషన్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు. ఎంత విద్యుత్ అవసరమో అంత సరఫరా కావడం వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. లోవోల్టేజి, హైవోల్టేజి, ఇతర అంతరాయాలు ఉండవు. మీటర్లు, స్విచ్, ఎర్త్ వైరు వంటి వస్తువులన్నీ నాణ్యమైన వాటినే విద్యుత్ కంపెనీనే అమరుస్తుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలూ ఉండవు. వీటన్నిటి ద్వారా నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందుతుంది. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, నాణ్యత లోపించినా వెంటనే సంబంధిత శాఖలను నిలదీసే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ సంస్థల్లో జవాబుదారీ తనం కూడా మెరుగవుతుంది’ అని వివరించారు. -
ఏపీలో వ్యవసాయానికి విద్యుత్ పూర్తిగా ఉచితం
-
వ్యవసాయానికి విద్యుత్తు పూర్తిగా ఉచితం
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలని, 30 ఏళ్లయినా వ్యవసాయానికి ఎలాంటి కొరత లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఇందుకోసం ఖర్చుకు కూడా వెనుకాడకుండా రాష్ట్ర రైతాంగం కోసం ఏర్పాటు చేసిన పథకమే వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. ఈ పథకం కింద వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు ఉచితంగా అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. వాడిన విద్యుత్‌కు రైతులు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇంత మంచి పని చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు కొందరు. రైతుల హక్కును అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను, రైతులను అయోమయానికి గురిచేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలని నమ్మి ఆందోళనకు గురికావద్దని ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు పృధ్వీతేజ్, పద్మాజనార్దనరెడ్డి, సంతోషరావు స్పష్టం చేశారు. వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. ♦ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి వ్యవసాయదారులందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. నగదు బదిలీ పథకంలో చేరేందుకు రైతులందరూ అంగీకరించి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకానికి వ్యవసాయ విద్యుత్ బిల్లులను ప్రామాణికంగా తీసుకోవడంలేదు. మీటర్ల వల్ల సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారనే భయాందోళనలు రైతులకు అవసరం లేదు. ♦రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, సేవలు అందుతున్నాయి. రైతులకు అత్యంత తక్కువ సమయంలో వ్యవసాయ సర్విసులు విడుదలవుతున్నాయి. కాల్ సెంటర్లను ఆధునీకరించడంతో వినియోగదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తోంది. దీంతో ఫిర్యాదులు కూడా గణనీయంగా తగ్గాయి. డిస్కంలు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బలోపేతం అవుతున్నాయి. దీంతో రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా, వ్యవసాయ, గృహ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ కొరత లేకుండా అందిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదు. ♦ వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు ఎలాంటి విద్యుత్ బిల్లుల భారం పడదు. పూర్తిగా ఉచితం. నగదు బదిలీ ద్వారా (డీబీటీ) రైతుకు చెందిన ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఆ బిల్లు మొత్తాన్ని ప్రతినెలా ప్రభుత్వమే వేస్తుంది. అది తిరిగి రైతుల ద్వారా విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరుగుతుంది. రైతులు వారి జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, ఇక మీదట కూడా అలాగే పొందుతారు. ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ♦ ఉచిత విద్యుత్తుకు తూట్లు పొడిచేందుకే ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతోందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. వచ్చే 30 ఏళ్ళ పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా జరుగుతుంది. దీని కోసమే రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకుంది. అన్ని వ్యవసాయ సర్విసులకు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు కట్టుబడి ఉన్నాయి. ♦ స్మార్ట్ మీటర్ల వల్ల మొత్తం మోటారు లోడు తెలుస్తుంది. ఏ సమయంలో ఏ ప్రాంతాల్లో ఎంతెంత విద్యుత్ సరఫరా చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. దీనివల్ల లోడుకి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, సబ్స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు. అధిక లోడు కారణంగా మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉండదు. వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్ నాణ్యత (ఓల్టేజి, అంతరాయాలు) మెరుగుపడుతుంది. ట్రాన్స్ఫార్మర్లకి రక్షణ ఏర్పడుతుంది. మీటర్లు, వాటికి కావాల్సిన స్విచ్, ఎర్త్ వైరు వంటి నాణ్యమైన వస్తువులను విద్యుత్ కంపెనీనే అమరుస్తుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలను నివారించొచ్చు. -
కర్ణాటకలో "గృహ జ్యోతి" ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ జ్యోతి కూడా ఒకటి. ఈ పథకం కింద లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సబ్సీడీ అందించనుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు పథకానికి అర్హులైనవారిని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్ లైన్లోనూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆహారం, విద్య, ఆరోగ్యం తోపాటు ఇతర నిత్యావసరాల ధరలు మిన్నంటుతున్న నేపథ్యంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్ సబ్సీడీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా నాలుగు వాగ్దానాలతో పాటు ఉచిత విద్యుత్ సబ్సీడీ పాచిక కూడా పారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకుంది. ఎన్నికల్లో చెప్పినట్లుగానే కర్ణాటక ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించనుంది. జూన్ 18 న మొదలైన దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికే 51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సగటు నెలవారీ వినియోగం కంటే విద్యుత్తు వినియోగం తక్కువగా ఉన్న వినియోగదారులు అందరూ ఈ పథకానికి అర్హులేనని.. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకునే వారికందరికీ ఈ సబ్సీడీ లభిస్తుందని.. 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించుకునేవారు మాత్రం పూర్తి బిల్లును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకోవడమెలా? కర్ణాటక సేవాసంధు పోర్టల్ లోకి వెళ్లి కరెంటు బిల్లులో ఉన్నట్లుగా ఆధార్ కార్డు, కస్టమర్ ఐడి స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చెయ్యాలి. ఆఫ్‌లైన్‌లో కూడా గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. "బెంగుళూరు వన్", "గ్రామ వన్", "కర్ణాటక వన్" సెంటర్లకు వెళ్లి అక్కడ కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. ఇది కూడా చదవండి: డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు -
కర్ణాటకలో సక్సెస్, సేమ్ ఫార్ములా ఫాలో అవుతూ..!
జైపూర్: కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక విజయం నయా జోష్‌ను నింపింది. ఇదే ఊపుతో రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం దిశగా అడుగులు వేయాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. వర్గపోరుకు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సైతం అక్కడి ఫార్ములానే అన్వయింపజేస్తోంది. తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య నెలకొన్న రాజకీయ వైరాన్ని చెరిపేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసింది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మరో కీలకమైన ఎన్నికల హామీని ప్రకటించింది గెహ్లట్ సర్కార్. అదే ఉచిత విద్యుత్. రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్‌ను సిబ్సిడీ కింద అందిస్తామని సీఎం గెహ్లాట్ కిందటి ఏడాది డిసెంబర్లో ప్రకటించారు. ఇక ఇప్పుడు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. అంతేకాదు.. వంద యూనిట్ల తర్వాత స్లాబ్‌ల వారీగా ఫిక్స్డ్ రేటు ఉంటుందని బుధవారం సాయంత్రం గెహ్లట్ ప్రకటన చేశారు. ఈ హామీలకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులపై శాశ్వత ఛార్జీలు, ఇంధన సర్చార్జిని మాఫీ చేస్తుందని ఆయన ప్రకటించారు. महंगाई राहत शिविरों के अवलोकन व जनता से बात करने पर फीडबैक आया कि बिजली बिलों में मिलने वाली स्लैबवार छूट में थोड़ा बदलाव किया जाए. - मई महीने में बिजली बिलों में आए फ्यूल सरचार्ज को लेकर भी जनता से फीडबैक मिला जिसके आधार पर बड़ा फैसला किया है. - - 100 यूनिट प्रतिमाह तक बिजली… pic.twitter.com/z27tJRuyaf — Ashok Gehlot (@ashokgehlot51) May 31, 2023 కర్ణాటక విజయంలో ఉచిత విద్యుత్ హామీ కూడా కీలక పాత్ర పోషించింది. అందుకే దీనిని హైలైట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని గెహ్లట్ సర్కార్ భావిస్తోంది. అంతకు ముందు ఢిల్లీ, పంజాబ్‌లోనూ ఆప్ ఇలా ఫ్రీ ఎలక్ట్రిసిటీ హామీతోనే అధికారాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో బీజేపీ సైతం ఎన్నికల సమరానికి కసరత్తులు ప్రారంభించింది. తాజాగా అజ్మీర్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. గెహ్లట్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు సంధించారు. అవినీతి, గ్రూపు రాజకీయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదీ చదవండి: యావత్ దేశం మనోభావాల్ని కాంగ్రెస్ కించపరిచిందా? -
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మహారాష్ట్రలో ప్రతి ఇంటికి నీళ్లు
-
AP: రైతులకు 25 ఏళ్లు ఉచిత విద్యుత్
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో రానున్న 25ఏళ్లపాటు రైతులకు నమ్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాపై అధికారులతో మంత్రి సోమవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.2.49 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో మొదటి విడత 3వేల మెగావాట్లు, 2025లో రెండవ విడత 3 వేల మెగావాట్లు, 2026లో మూడో విడత వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ విద్యుత్ సరఫరా చేస్తుందని వివరించారు. ఆక్వా కల్చర్‌కు సబ్సిడీ ధరపై విద్యుత్ సరఫరా చేయడంతోపాటు వారికి ఆర్థికంగా మరింత మేలు కలిగేలా రైతు భరోసా వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చెల్లింపులు ఆలస్యమైనా సరఫరా ఆగదు: విజయానంద్ డిస్కంల పనితీరును మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తోందని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తెలిపారు. ప్రస్తుతానికి డిస్కంలు వ్యవసాయానికి సంవత్సరానికి 12 వేల మిలియన్ యూనిట్లను సరఫరా చేస్తున్నాయని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని భరిస్తోందని వివరించారు. డీబీటీ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నామని, 28,684 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను అమర్చామని చెప్పారు. అక్కడ వ్యవసాయ వినియోగానికి సంబంధించిన నెలవారీ బిల్లింగ్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోందని, ఒకవేళ చెల్లింపులు సకాలంలో అందకపోయినా డిస్కంలు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగిస్తాయని విజయానంద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీ తేజ్, డిస్కంల సీఎండీలు జె.పద్మ జనార్దనరెడ్డి, కె.సంతోష్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అర్హులెవరికీ ఆగలేదు.. వాస్తవాలు దాచి పచ్చ పత్రిక మరో ఏడుపుగొట్టు కథనం
సాక్షి, అమరావతి: ఏడుపుగొట్టు వాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. ఏ కారణం లేకపోయినా, ఏదో ఒకటి చెప్పి ఏడుస్తుంటాడు. తన మెదడులో మెదిలింది బయటకు వెళ్లగక్కి మరీ ఏడుస్తాడు. అందులో నిజం లేదన్న విషయం పట్టదు. ఇందుకు ప్రతీకలే పచ్చ పత్రికలు. విషతుల్యమైన వాటి మెదడు విషమే కక్కుతుంది. అబద్ధాలు వండి వారిస్తుంది. ఇటువంటి మరో కథనమే ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తుపై అవాస్తవ కథనాలు. వాస్తవాలు మాత్రం వేరు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడానికి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. కేవలం మాటిచ్చి ఊరుకోవడం అలవాటు లేని సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయడానికి 2019 జూలై 25న ప్రభుత్వం జీవో నంబర్ 91 జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొంది. దీనికి అనుగుణంగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆ కాలనీల్లో అర్హులైన అందరికీ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజలు సీఎం జగన్‌కు గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. తమ ఇంట విద్యుత్ కాంతులు నింపిన దేవుడని చేయెత్తి మొక్కుతున్నారు. ఇదంతా చూసి పచ్చపత్రిక తట్టుకోలేకపోతోంది. ఓ అబద్ధాన్ని బలవంతంగా ప్రజల మెదళ్లలోకి చొప్పించాలని కుట్రలు పన్నుతోంది. అనర్హులను తొలగిస్తే ’ఎస్సీ, ఎస్టీలకు షాక్’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆ తప్పుడు కథనాన్ని ఇంధన శాఖ ఖండించింది. అసలు నిజాలను వెల్లడించింది. ఆరోపణ: ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారుల సంఖ్యలో ప్రభుత్వం కోత పెట్టింది. వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకంలో ఇచ్చింది నెలకు 100 యూనిట్లు కాగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 200 యూనిట్లకు పెంచింది. ఇలా పెంచడం వలన ఏర్పడ్డ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందడానికి ఈ ఏడాది నవంబర్ వరకు 22.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు అర్హత పొందారు. గత ప్రభుత్వం ఈ పథకానికి 2018–19 లో సుమారు రూ. 230 కోట్లు ఖర్చు పెట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం 2021–22లో రూ.700 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: సర్వేలో డొల్లతనం వల్ల ఉచిత విద్యుత్ జాబితా నుంచి అర్హుల కనెక్షన్లు తొలగించారు వాస్తవం: ఇది కూడా అబద్ధమే. ఉచిత విద్యుత్ పథకానికి 200 యూనిట్లకు మించి వినియోగించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఆధార్ అనుసంధానం చేసినప్పుడు కుల ధ్రువీకరణ బీసీ, ఓసీగా నమోదైన వారిని మాత్రమే అనర్హులుగా నిర్ధారించారు. అర్హుల సర్వీసులేవీ తొలగించలేదు. ఒకవేళ అర్హత ఉండి ఈ పథకం రాకపోతే ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో విద్యుత్ అధికారులను, గ్రామ సచివాలయ అధికారులను సంప్రదించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరుతున్నాయి. అనర్హులకూ ఇమ్మంటారా అర్హులైన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీల్లోని నిరు పేదలకు అందాల్సిన ఈ పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డిస్కంలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు సైతం భార్య, ఇతరుల పేరు మీద ఉచిత విద్యుత్ సర్వీసులు తీసుకున్నట్లు తెలిపాయి. ఇలాంటి వారిని గుర్తించి అనర్హుల జాబితాలో చేరుస్తున్నట్లు తెలిపాయి. విద్యుత్ వృథాను, అక్రమ కనెక్షన్లను తగ్గించడం ద్వారా వాస్తవ అర్హులకు లబ్ధి చేకూర్చాలనేది తమ ధ్యేయమని, అర్హులెవరూ ఆందోళన చెందవద్దని డిస్కంలు చెబుతున్నాయి. ఎస్సీ ఎస్టీ విద్యుత్ కనెక్షన్‌తో ఆధార్ నంబరు అనుసంధానం చేయడం ద్వారా రెండో కనెక్షన్‌కు ఉచిత విద్యుత్ పథకం అమలు కాకుండా నియంత్రణ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని డిస్కంలు ఖండించాయి. అది వాస్తవం కాదని, పచ్చ పత్రిక రాతలు అనర్హులకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలంటున్నట్టుగా ఉన్నాయని డిస్కంలు మండిపడ్డాయి. -
స్మార్ట్ మీటర్లతో నాణ్యమైన విద్యుత్
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు ఎలాంటి నష్టం కలగదన్నారు. ఇంధన శాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లలో 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేశామన్నారు. త్వరలో మరో 77 వేల కొత్త కనెక్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు సంబంధించిన భారాన్ని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి.. పరిశీలించినట్లు తెలిపారు. ఈ జిల్లాలో సాధారణంగా ఉచిత విద్యుత్ వినియోగానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం కన్నా.. 30 శాతం తక్కువగానే రైతులు వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. 2023 మార్చి నాటికి రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు డీబీటీ ఖాతాలు తెరిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 70 శాతానికి పైగా రైతులు బ్యాంకు ఖాతాలను తెరిచారని.. అక్టోబర్ 15 నాటికి నూరు శాతం పూర్తవుతుందన్నారు. పోస్టాఫీస్‌లలో కూడా రైతులు ఖాతాలు తెరవచ్చన్నారు. రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తోక పార్టీలైన జనసేన, వామపక్షాలు రాజకీయ స్వార్థంతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి చేతులు, వేళ్లు నరకాలని పిలుపునిస్తున్న విపక్ష నేతలు.. తమ చేతులనే నరుక్కుంటున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుందంటున్న విపక్ష నేతలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి.. అక్కడి రైతులతో మాట్లాడాలని హితవు పలికారు. స్మార్ట్‌మీటర్ల వల్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రైతులు తమ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే సబ్సిడీ మొత్తాన్ని వారే స్వయంగా డిస్కంలకు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌పై ప్రశ్నించే హక్కును పొందుతారన్నారు. -
మీటర్లతో మిగులుతున్న విద్యుత్
సాక్షి, అమరావతి: ‘రైతులు, ప్రజా సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండడుగులు వేశారు. నేను నాలుగడుగులు వేస్తాను..’ అని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా ఉచిత విద్యుత్తు పథకం పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించారు. ఉచిత విద్యుత్ పథకం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని, దాన్ని రైతుల హక్కుగా మార్చాలని సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రైతులపై ఒక్క రూపాయి భారం పడకుండా.. వారికి శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. భారీగా విద్యుత్‌ను ఆదా చేస్తోంది. సర్వీసులు పెరిగినా మిగిలిన విద్యుత్ రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో 2021–22 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ మీటర్లు అమర్చకముందు.. అంటే 2020–21లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాయి. 2021 మార్చి నాటికి జిల్లాలో 26,063 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2021–22లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులు 67.76 మిలియన్ యూనిట్లే వినియోగించాయి. 2022 మార్చి నాటికి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 28,393కు చేరింది. జిల్లాలో ఏడాదిలో 2,330 సర్వీసులు పెరిగినా.. మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. ఇదే విధంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే భారీగా విద్యుత్ ఆదా అవుతుందని పైలెట్ ప్రాజెక్ట్ నిరూపించింది. రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూట 9 గంటలు ఉచితంగా రానున్న 30 ఏళ్ల పాటు సరఫరా చేయాలనేది సీఎం జగన్ ధ్యేయం. డీబీటీ పథకం ద్వారా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా రైతులు తమ హక్కుగా విద్యుత్ పొందుతారని, విద్యుత్ వృధా తగ్గి ఆదా అవుతుందని సీఎం స్పష్టంగా చెప్పారు. దీంతో పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, కంపెనీ, ప్రభుత్వ కమిటీలంటూ క్షేత్రస్థాయి నుంచి, ప్రభుత్వస్థాయి వరకు వివిధ కమిటీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనలు, సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. –కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ శ్రీకాకుళం జిల్లాలో మోటార్లకు మీటర్లు అమర్చే పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఇక్కడి రైతులంతా మీటర్లకు తమ సంపూర్ణ మద్దతు తెలిపి, అంగీకారపత్రాలు కూడ ఇచ్చారు. మీటర్ల వల్ల విద్యుత్తు లోడ్‌ను ఎప్పటికప్పుడు సరిచూసి ఆమేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చు. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ డిస్కంలకు జవాబుదారీ తనం మీటర్ల ఏర్పాటు కోసం రూ. 1,200 కోట్ల వ్యయం అవుతుందనేది ప్రాథమిక అంచనా. ఈ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. నగదు బదిలీ విధానంలో రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు. వ్యవసాయ విద్యుత్‌కు వచ్చిన బిల్లు మొత్తాన్ని రైతుల బ్యాంకు ప్రత్యేక ఖాతాల్లో ప్రభుత్వమే జమచేస్తుంది. దాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. దీనివల్ల డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. – జె.పద్మజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ -
జగనన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ సర్వీసు
సాక్షి, అమరావతి: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుండగా 17 వేల జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కాలనీలకు డిస్కమ్‌ల ద్వారా మొదటిదశలో 14,49,133 సర్వీసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనికి అవసరమైన నిధులను గృహ నిర్మాణ శాఖకు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణ దాతలకు హామీ ఇస్తోంది. రూ.4,600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్(ఆర్ఈసీ) ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మొదటి దశ పనులు మొదలు పేదలందరికీ ఇళ్లు పథకం మొదటి దశకి సంబంధించి ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 3,951 లే అవుట్లు ఉండగా 3,28,383 ఇళ్లకు విద్యుత్ సర్వీసులు అందించనున్నారు. దీని కోసం రూ.1,217.17 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,813 లే అవుట్లు ఉండగా 5,16,188 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను రూ.2,519.73 కోట్లతో అందించనున్నారు. ఏపీసీపీడీసీఎల్‌లోని మూడు జిల్లాలతోపాటు సీఆర్డీఏ పరిధిలో 3,977 లే అవుట్లు ఉన్నాయి. వీటిలో 6,04,562 ఇళ్లకు విద్యుత్ సర్వీసులను రూ.1,805.04 కోట్లతో ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి ఇప్పటికే పనులు ప్రారంభించారు. వాటర్ వర్క్స్‌కు సంబంధించి బోర్లకు విద్యుత్ సర్వీసులు అందిస్తున్నారు. లైన్లు మారుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సహకారం రాష్ట్రంలో 15,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ఇప్పటికే ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)–2017ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సహకారంతో ఒక్కో ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లను అందించనున్నారు. లబ్ధిదారుల అంగీకారంతో ఇంటి నిర్మాణానికి విద్యుత్ పొదుపు డిజైన్లను అనుసరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ 152 మిలియన్ యూరోలు అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యున్నత ప్రమాణాలు.. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో 42 శాతం బిల్డింగ్ సెక్టార్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన సామర్థ్య సాంకేతికత పరిజ్ఞానం కలిగిన గృహాల నిర్మాణాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జగనన్న ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో స్విస్ బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీనివల్ల బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్లలో 3 నుంచి 5 డిగ్రీలు తగ్గుతుంది. సహజ సిద్ధమైన గాలి, వెలుతురు ఉండటం వల్ల విద్యుత్ వినియోగం 20 శాతం తగ్గి కరెంటు బిల్లులు ఆదా కానున్నట్లు ఇంధన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. వ్యవసాయానికి 7 గంటలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటలకు కుదించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజులో 7గంటలు మాత్రమే త్రీఫేజ్ విద్యు త్ సరఫరా జరుగుతోంది. ముఖ్యంగా రోజూ రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని తాజాగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) క్షేత్రస్థాయి అధికారులకు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల వారీగా 7 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సాధారణంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు కోత పెడుతుంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళల్లో త్రీఫేజ్ విద్యుత్‌కు కోతలు విధిస్తుండటం గమనార్హం. 1,500 మెగావాట్ల వరకు కొరత రాష్ట్రంలో నెలరోజులుగా 1,000 నుంచి 1,500 మెగావాట్ల వరకు విద్యుత్ కొరత ఉంటోంది. గత నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేనట్టుగా 14,200 మెగావాట్లకు చేరి రికార్డు సృష్టించింది. యాసంగి పంటలు కోతకు రావడంతో రోజువారీ డిమాండ్ 12,500 మెగావాట్లకు తగ్గింది. ఇంకా కొరత నెలకొనడంతో.. మూడురోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరాను 7 గంటలకు కుదించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే కోతలు తాత్కాలికమేనని, వారం, పదిరోజుల్లో విద్యుత్ డిమాండ్ తగ్గి పరిస్థితి చక్కబడుతుందని తెలిపారు. కొందామన్నా దొరక్క.. ఎండలు తీవ్రం కావడంతో గత నెల చివరివారం నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీనికితోడు ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల అమ్మోనియం నైట్రేట్ (పేలుడు పదార్థం) కొరత ఏర్పడి బొగ్గు ఉత్పత్తి తగ్గింది. బొగ్గు కొరతతో ఓవైపు అకస్మాత్తుగా ధరలు పెరగడం, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో మరింత ప్రభావం పడింది. విద్యుత్ కొరతను తీర్చుకోవడానికి రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీని ఆశ్రయించడంతో.. ధరలు యూనిట్‌కు రూ.20 వరకు పెరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) రంగంలో దిగి యూనిట్ రేటు రూ.12కు మించకుండా నియంత్రణ విధించింది. పవర్ ఎక్సే్ఛంజీ నుంచి గతనెలలో రాష్ట్రం రూ.1,800 కోట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం రోజుకు రూ.30కోట్ల నుం చి రూ.40కోట్ల మేర విద్యుత్ కొంటోంది. అదికూడా 1,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు బిడ్ వేస్తే.. 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభిస్తోందని అధికారు లు చెప్తున్నారు. అందువల్ల కోతలు విధించడం తప్పడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆలస్యంగా వేసిన పంటలకు కటకట యాసంగిలో బోర్లు, బావుల కింద ఆలస్యంగా వేసిన పంటలు ఇంకా చేతికి అందలేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను అకస్మాత్తుగా 7 గంటలకు తగ్గించిన నేపథ్యంలో సదరు రైతులు ఆందోళనలో పడ్డారు. ఆ పంటలకు నెలాఖరు వరకు విద్యుత్ అవసరమని అంటున్నారు. మరోవైపు యాసంగి పంటలన్నీ దాదాపు కోతకు వచ్చాయని, ప్రస్తుతమున్న పంటల్లో చాలావరకు కూరగాయలు, ఇతర మెట్ట పంటలు మాత్రమేనని అధికారులు అంటున్నారు. అందుకే వ్యవసాయ విద్యుత్‌ను 7గంటలకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు. ఈ కోతల అంశంపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. వారు స్పందించలేదు. -
ఉచిత విద్యుత్‌కు పూర్తి భరోసా
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగనున్న దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌లను ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.7,714 కోట్ల సబ్సిడీని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 6,663 ఫీడర్ల ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు కృషి చేస్తూనే వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట కరెంట్ సరఫరాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాగా, వ్యవసాయం, అనుబంధ రంగాలకు 2021–22లో 19,096 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 2022–23లో 19,819 ఎంయూలకు చేరుకునే వీలుందని అంచనా వేస్తున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది 3.7% మేర విద్యుత్ వినియోగం పెరగనుందని చెప్పారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ డిమాండ్‌ను తీర్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్దనరెడ్డి, సంతోషరావు చెప్పారు. విద్యుత్ లోడ్, కచ్చితమైన వినియోగాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడాదిలోగా మీటర్లు అమర్చేలా కృషి చేస్తున్నట్లు సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్ మోటార్లు కాలిపోవడం, లోవోల్టేజీ లాంటి సమస్యలను అరికట్టి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. -
‘అధికారంలోకి వస్తే.. విద్యుత్ ఉచితంగా ఇస్తాం’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దూకుడు పెంచారు. అందులో భాగంగానే సామాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామరని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల డొమెస్టిక్ విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రైతులకు వ్యవసాయంలో ఇబ్బంది కలగకుండా ఉచితం విద్యుత్ అదిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలవలేదని, అది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. వలస కార్మికులు వందల కీలోమీటర్లు రోడ్లపై నడుస్తూ రాష్ట్రానికి చేరుకున్నారని, వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులను నమోదు చేస్తోందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అఖిలేష్ యాదవ్ సంతాపం వ్యక్తంచేశారు. -
రైతుల ప్రయోజనాలకే నూతన డిస్కం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి రానున్న 25 ఏళ్లపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు పగటిపూటే 9 గంటలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చరల్ సప్లై కంపెనీ’ పేరుతో నూతన డిస్కంని ఏర్పాటు చేస్తోందని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా ఉచితంగానే విద్యుత్తుని సరఫరా చేస్తుందని, రైతులపై ఎలాంటి భారం పడనీయదని తెలిపారు. రైతుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు, గందరగోళం సృష్టించేందుకు కొందరు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ చేసిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని, ఇందుకోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8,559 కోట్లు కేటాయించిందని తెలిపారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకం వల్ల ప్రతి రైతు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాచేసే సామర్థ్యంగల వ్యవసాయ ఫీడర్లను రూ.1,700 కోట్లతో అప్‌గ్రేడ్ చేయించామని, గత రబీ సీజన్ నుంచి నూరుశాతం వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వత పథకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంటున్నట్టు చెప్పారు. దీనివల్ల యూనిట్ రూ.2.49 చొప్పున ఏడాదికి 7 వేల మెగా వాట్ల విద్యుత్తును పాతికేళ్ల పాటు కొనుగోలు చేసేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. -
మోదీ గుజరాత్లో ఉచిత కరెంట్ ఇస్తున్నారా?
జమ్మికుంట (హుజూరాబాద్): ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్లో, బీజేపీ పాలిస్తున్న 18 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారా? అని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని దుబ్బ మల్లన్న దేవాలయం సమీపంలో విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రం కోసం నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజచేశారు. అనంతరం పాడి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ జమ్మికుంటలో పాడి రైతులను ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4 ప్రోత్సాహం త్వరలోనే విడుదల చేస్తామని హామీఇచ్చారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తుంటే.. సీఎం కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తూ రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తే.. రైతులకు ఆర్థికంగా నష్టం చేసేది బీజేపీ ప్రభుత్వమని స్పష్టంచేశారు. దొడ్డు వడ్లు కొనేది లేదంటూ బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం అంటేనే రైతులు ఆలోచించుకోవాలన్నారు. పాడి పశువులను 50 శా తం సబ్సిడీతో రైతులకిచ్చేందుకు సీఎం యోచిస్తున్నారని వెల్లడించారు. -
నగదు బదిలీతో.. హక్కుగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ పథకానికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకానికి నగదు బదిలీ అమలు పురోగతిపై ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదివారం విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరాలు తెలియచేశారు. నగదు బదిలీ పథకం కింద రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా విద్యుత్తు బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారి ఖాతాలకు జమ చేయనుంది. ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని రైతులే నేరుగా విద్యుత్తు సంస్థలకు బిల్లుల రూపంలో ల్లించనున్నారు. రైతులే బిల్లులు చెల్లించి విద్యుత్తు తీసుకుంటారు కాబట్టి నాణ్యమైన కరెంట్ సరఫరాను తమ హక్కుగా ప్రశ్నించే వీలుంది. మరోవైపు తమకు బిల్లులు చెల్లిస్తున్న అన్నదాతల పట్ల విద్యుత్తు పంపిణీ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాయి. వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను బిగించడం వల్ల లోడ్ ఎంతనేది ముందే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. తగినంత విద్యుత్తు సరఫరా జరుగుతుంది కాబట్టి మోటార్లు కాలిపోవు. లో వోల్జేజీ సమస్య అనేది ఎక్కడా ఉండదు. తద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందుతుంది. పైసా కూడా భారం పడకుండా.. రైతన్నల అనుమతితోనే నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది. పథకం అమలుకు అంగీకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 92 శాతం మంది రైతులు విద్యుత్ సంస్థలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ విద్యుత్ ధరను యూనిట్ సరాసరి రూ.5.73గా ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించినప్పటికీ రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఆ వ్యయాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న ఈ పథకానికి 98.6 శాతం మంది రైతులు అంగీకారం తెలిపారు. సామర్థ్యం పెంపు... లో ఓల్టేజీ పరిష్కారం మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్ లోడు ఎక్కడ ఎక్కువ ఉంది? ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్ధ్యం ఎక్కడ, ఎంత పెంచాలి? అనే అంశాలను డిస్కమ్‌లు కచ్చితంగా తెలుసుకునే వీలుంది. లో ఓల్టేజి సమస్యలను గుర్తించి పరిష్కరించవచ్చు. ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ పగటి పూటే 9 గంటల పాటు సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడ్‌ను కచ్చితంగా లెక్కించవచ్చు. ఇప్పటివరకూ ఈ విధానం లేదు. మరో 30 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా.. నాణ్యమైన కరెంట్ కోసం విద్యుత్ సంస్థలను ప్రశ్నించే హక్కు రైతులకు కల్పిస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శికి మంత్రి బాలినేని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకం అమలులో రాష్ట్ర్రంలోని ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్‌కు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులంతా నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరాటంకంగా పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. -
‘నాకు కరెంట్ వద్దు.. ఎమ్మెల్యే కావాలి’ మహిళా ట్వీట్ వైరల్
అమృత్సర్: కొన్ని నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటినుంచే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అయితే ఈసారి అధికారమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో కాంగ్రెస్‌కు గట్టిపోనిచ్చిన ఆప్ ఈసారి అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో అప్పుడే హామీల వర్షం మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రధాన హామీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై ఆప్ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఉచిత విద్యుత్ వద్దు.. నాకు ఎమ్మెల్యే రాఘవ్ కావాలి’ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌ను చూసిన ఆ ఎమ్మెల్యే స్పందించి ‘నేను మేనిఫెస్టోలో లేను’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సంభాషణ ట్విటర్లో వైరల్‌గా మారింది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను చూసిన కృతి ఠాకూర్ స్పందిస్తూ ‘కరెంట్ వద్దు.. రాఘవ్ కావాలి’ అని కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించింది. ఈ కామెంట్‌ను చూసిన రాఘవ్ చద్దా స్పందించారు. ‘మేనిఫెస్టోలో నేను లేను.. ఉచిత విద్యుత్ ఉంది’ అని రిప్లయ్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు ఓటేయండి. 24 గంటలు ఉచిత విద్యుత్ మీకు ఇస్తామని నేను హామీ ఇస్తున్నా. నా విషయంలో మాత్రం హామీ ఇవ్వలేను’ అంటూ రాఘవ్ కామెంట్ చేశారు. వీరి సంభాషణ ట్విటర్లో వైరలయ్యింది. 32 ఏళ్ల రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజేందర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన అతి చిన్న వయస్కుడు. ఆ ట్వీట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నాడు. ‘కేజ్రీవాల్ గ్యారంటీ’ అంటూ చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను రిఫర్ చేశారు. ఢిల్లీ జల్ బోర్డు అధ్యక్షుడిగా కూడా రాఘవ్ కొనసాగుతున్నారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆప్‌కు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఎలాగైనా 55 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఆప్ వ్యూహం రచిస్తోంది. -
విత్తుకు ముందే.. విద్యుత్ సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరు శాతం ఫీడర్ల పరిధిలో ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయ అవసరాలకు పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీజన్ ప్రారంభం కాకముందే విద్యుత్ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నమ్మకమైన, నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఇంధనశాఖ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 2021–22లో 12,232 మిలియన్ యూనిట్ల మేర వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉండవచ్చని అంచనా వేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా సరఫరాకు ఆటంకం కలగకుండా మిగులు విద్యుత్‌నూ సిద్ధం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్లో కొనుగోలు చేసి రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. వంద శాతం ఫీడర్లు రెడీ రాష్ట్రంలో 6,616 వ్యవసాయ ఫీడర్లు ఉండగా పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని 2019లో భావించినప్పుడు 58 శాతం ఫీడర్లకు అందుకు తగ్గ సామర్థ్యం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు రూ.1,700 కోట్లు మంజూరు చేయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లైన్లు, సబ్ స్టేషన్ల శక్తి పెంచారు. 515 ఫీడర్ల స్థాయిని సమూలంగా మార్చారు. ఫలితంగా వంద శాతం ఫీడర్ల పరిధిలో రైతులు వినియోగించే ఉచిత విద్యుత్ సామర్థ్యాన్ని తట్టుకునే వ్యవస్థ అందుబాటులోకొచ్చింది. ప్రతి రైతుకు రూ.35 వేలపైనే ఉచితం కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కృత్రిమ మేధోశక్తి (ఏఐ) ద్వారా 2021–22లో వ్యవసాయ విద్యుత్ వాడకం ఏ సీజన్లో ఎంత ఉంటుందనేది శాస్త్రీయంగా అంచనా వేశారు. ప్రతి హెచ్‌పీకి వార్షిక విద్యుత్ వినియోగం 1,059 యూనిట్లు ఉంటుందని అంచనా. అంటే ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో 5 హెచ్‌పీ మోటార్ అమర్చుకుంటే ఏడాదికి 5,295 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ ధర రూ.6.65 చొప్పున ఐదు హెచ్‌పీ మోటార్ ఉన్న ప్రతీ రైతు కోసం ఉచిత విద్యుత్ కింద ప్రభుత్వం కనిష్టంగా రూ. 35,212 దాకా చెల్లిస్తోంది. కొంతమంది రైతులు గరిష్టంగా 10 హెచ్పీపైనే వాడుతున్నారు. వారికి రెట్టింపు మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏటా రూ.8 వేల కోట్లకుపైనే సబ్సిడీ.. రాష్ట్రంలో ప్రస్తుతం 17.55 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా వీటి మొత్తం సామర్థ్యం 116 లక్షల హెచ్‌పీ ఉంటుంది. ఇవి ఏటా దాదాపు 12,232 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా రైతుల ఉచిత విద్యుత్ కోసం వెచ్చిస్తోంది. సీజన్ల వారీగా విద్యుత్ వాడకం ఇలా ఖరీఫ్ (జూన్ నుంచి అక్టోబర్).. 4,744.44 మిలియన్ యూనిట్ల (39 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ సీజన్లో రైతులు సగటున 2.20 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. రబీ (నవంబర్ నుంచి మార్చి).. 6,192 మిలియన్ యూనిట్ల (51 శాతం) విద్యుత్ వినియోగం ఉంటోంది. రైతులు సగటున రోజుకు 4.30 గంటల పాటు పంపుసెట్ వినియోగిస్తున్నారు. అన్ సీజన్ (ఏప్రిల్ నుంచి మే).. 1,296 మిలియన్ యూనిట్ల (11 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉన్నట్టు లెక్క తేలింది. ఈ సీజన్లో రైతులు సగటున 1.80 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం విద్యుత్ లభ్యతపై అధికారులు దృష్టి పెట్టారు. ఒక్క పంప్సెట్కూ ఇబ్బంది లేకుండా... ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. నాణ్యమైన సరఫరా కోసం పంపిణీ సంస్థలను నిలదీసే అధికారం కల్పించేలా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రైతుల ఖాతాల్లోనే వేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది పొడవునా ఏ ఒక్క రోజూ ఏ ఒక్క పంపుసెట్కూ విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాం. అన్ని స్థాయిల్లో విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈ ఏడాది మరింత మెరుగ్గా రైతులకు ఉచిత విద్యుత్ అందబోతోంది. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
Andhra Pradesh: రైతుకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ విధానం, స్మార్ట్ మీటర్లు అమర్చడం ద్వారా కనిపిస్తున్న ఫలితాలపై రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రతి నెలా నేరుగా రైతుల ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. తమ చేతుల మీదుగా విద్యుత్తు సంస్థలకు బిల్లులు చెల్లిస్తూ ధీమాగా నాణ్యమైన కరెంట్ ఉచితంగా పొందుతున్నారు. తమ ఖాతాల్లోనే నేరుగా ప్రభుత్వం నుంచి విద్యుత్తు సబ్సిడీ మొత్తం జమ అవుతుండటం, వారే నేరుగా బిల్లులు చెల్లిస్తుండటంతో నాణ్యమైన విద్యుత్తు సేవల కోసం ప్రశ్నించే హక్కు లభించిందని రైతులు పేర్కొంటున్నారు. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులున్నా, ఎక్కడైనా లో వోల్టేజీ సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే నిలదీసే వీలుంది. మరోవైపు విద్యుత్తు సంస్థల్లోనూ జవాబుదారీతనం పెరిగింది. డిజిటల్ మీటర్లు అమర్చడం వల్ల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పర్యవేక్షించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధమవుతున్నారు. 26 వేల పంపుసెట్లకు మీటర్లు.. వైఎస్సార్ వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత జవాబుదారీతనంతో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. వ్యవసాయ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేసే విధానాన్ని ఖరీఫ్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడాదిగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం మంచి ఫలితాలనిచ్చింది. ప్రతి నెలా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్మును జమ చేసింది. ఆ తర్వాత ఈ మొత్తం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఖాతాకు అందింది. ఈ విధానంలో మరింత జవాబుదారీతనంతో విద్యుత్ సరఫరా జరిగినట్టు పరిశీలనలో తేలింది. జిల్లాలో మొత్తం 26 వేల పంపుసెట్లకు మీటర్లు అమర్చారు. శ్రీకాకుళం డివిజనలో 10, టెక్కలి, పాలకొండ డివిజన్లలో 8 వేల చొప్పున పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. నాణ్యమైన మీటర్లు.. విద్యుత్ వినియోగాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన డివైజ్ లాంగ్వేజ్ మెసేజ్ స్పెసిఫికేషన్ (డీఎల్ఎంఎస్) మీటర్ల వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్తు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. దేశీయంగా తయారైన ఈ మీటర్లను టెండర్ ప్రక్రియ ద్వారా ముందే సమకూర్చుకున్నారు. టెస్టింగ్ లేబొరేటరీల్లో వీటిని పరీక్షించారు. నాణ్యమైన పాలీ కార్బొనేట్ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల ఇవి అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకున్నాయి. వర్షాకాలంలోనూ ఎలాంటి విద్యుత్ షాక్‌లు, షార్క్ సర్క్యూట్ లాంటివి నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇక స్మార్ట్ మీటర్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ క్షేతాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు డిస్కమ్‌లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచాయి. జూలైలో ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకునే వీలుంది. ఈ మీటర్ల ద్వారా లోడ్ తెలుసుకుని తగిన సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం స్మార్ట్ మీటర్ ద్వారా ప్రధాన కార్యాలయం పర్యవేక్షించే వీలుంటుంది. దీంతో జవాబుదారీ తనం పెరుగుతుంది. 32 యాంప్స్ సామర్థ్యం గల ఫ్యూజ్లను అమరుస్తారు. వీటి ద్వారా 20 అశ్వశక్తి సామర్థ్యం (హెచ్‌పీ) విద్యుత్ లోడ్ వాడుకోవచ్చు. అంటే రైతు 20 హెచ్‌పీ మోటార్ అమర్చుకున్నా అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే ఉండదు. స్మార్ట్ మీటర్ వీలుకాని చోట ఇన్ఫ్రారెడ్ రీడింగ్ (ఐఆర్ పోర్ట్) పద్ధతిలో రీడింగ్ తీస్తారు. ఈ క్రమంలో డీఎల్ఎంఎస్ మీటర్ విద్యుత్ ప్రసరణ తీరుతెన్నులను అర్థమయ్యే భాషలోకి మార్చి ఐఆర్ విధానానికి తెలియచేస్తుంది. లో వోల్టేజీ ఉంటే పసిగట్టి హెచ్చరిస్తుంది. 300 ఎంఎం వెడల్పు, 700 ఎంఎం పొడవుతో మైల్డ్ స్టీల్‌తో తయారయ్యే మీటర్‌కు గాల్వనైజ్డ్ ఎర్త్ కూడా ఇస్తారు. అందువల్ల ఎలాంటి షాక్‌లకు అవకాశం లేకుండా పూర్తి భద్రతతో ఉంటుందని అధికారులు వివరించారు. -
చేతి వృత్తికి చేయూత
రామభద్రపురం: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఏటా చేతి వృత్తిదారులకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిందో.. అదే విధంగా అర్హులైన పేద చేతివృత్తిదారులకు కూడా అందివ్వాలని నిర్ణయించింది. లాండ్రీ, బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులు, సెలూన్లు, చేనేత కార్మికులకు ఈ అవకాశం కల్పించింది. కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు జెరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డు జెరాక్స్, మొబైల్ నంబర్, అద్దెకు ఉంటున్నట్లైతే యజమాని ఆధార్ కార్డు జెరాక్స్, మొబైల్ నంబర్ వంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రాయితీ విద్యుత్ ఇలా... లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకూ, బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులకు 100 యూనిట్ల వరకూ, సెలూన్ షాపులులకు 150 యూనిట్ల వరకూ, బట్టలు నేసే చేనేతలకు 100 యూనిట్ల వరకూ ఉచితంగా అందించనుంది. జిల్లాలో ఈ వృత్తిపై ఆధారపడిన దాదాపు 25 వేల మందికి లబ్ధి కలగనుంది. చేతి వృత్తిదారులకు ఊరట.. కరోనా కష్టకాలంలో పనులు లేక అల్లాడుతున్న ఎంతోమందికి ఈ ఉచిత విద్యుత్ ఆదుకోనుంది. జిల్లాలో అత్యధిక బీసీలు చేతి వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది కోవిడ్ ఆంక్షలతో వృత్తి సజావుగా సాగక అనేక ఇబ్బందులు పడ్డారు. మళ్లీ సెకండ్ వేవ్‌తో మరింత కుంగిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించడంతో వారందరికీ ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి వై,ఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో గతేడాది రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిపొందారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు... సెలూన్లు, లాండ్రీ, దోబీ ఘాట్లు ఇలా చేతి వృత్తిదారులకు ఉచిత విద్యుత్ అందివ్వడం అభినందనీయం. ఇప్పటికే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – కల్లూరు త్రినాథరావు, చేనేత కార్మికల సంఘం చైర్మన్, కొట్టక్కి తండ్రి హామీ నెరవేరుస్తున్న తనయుడు దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తానని చెప్పారు. దీనిపై అప్పట్లో దుకాణాల సర్వే కూడా చేయించారు. దురదృష్ట వశాత్తూ తాయన మరణించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చుతున్నారు. – చీపురుపల్లి శ్రీను, మండల నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, రామభద్రపురం బంగారు పనిచేస్తున్న కళాకారుడు సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ సదుపాయంతో దుకాణాలు నిర్వహించే సెలూన్లు, లాండ్రి, బంగారం పని చేసే దుకాణాలు, మగ్గం పనిచేసేవారికి ప్రభుత్వం విద్యుత్ రాయితీలు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. అర్హులైన లబ్ధిదారులు మండల విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి వెళ్లి ఆయా ఏఈల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. – వై.విష్ణు, ఎస్ఈ, విద్యుత్ శాఖ -
సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. 250 యూనిట్ల కరెంట్ ఫ్రీ
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ షాపులు, లాండ్రీలు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఆదివారం జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నది. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయినుంచి జీహెచ్ఎంసీ వరకు ఉన్న కటింగు షాపులు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు. కులవృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
సెలూన్లు, లాండ్రీలకు 100 యూనిట్లు ఫ్రీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ప్రతి నెలా 100 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్ భావిస్తోంది. సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీ షాపులకు గత డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యుత్ పంపిణీ సంస్థలు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి వివరాలను సేకరించాయి. ఇందులో ఏసీ సెలూన్లు, స్పాలు, వాషింగ్ మెషీన్లు వంటి యంత్రాలు వినియోగించే డ్రైక్లీనింగ్ షాపులు, లాండ్రీలకు మినహాయింపు ఇచ్చాయి. మిగిలిన సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లలో 85 శాతం వరకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నట్టు సర్వేలో తేలింది. రాష్ట్రంలో 10,800 సెలూన్లు.. రాష్ట్రవ్యాప్తంగా 10,800 నాన్ ఏసీ సెలూన్లు ఉండగా, వీటికి ప్రతి నెలా రూ.90 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఎలాంటి యంత్రాలు వినియోగించని ధోబీ ఘాట్లు, లాండ్రీలు రాష్ట్రం మొత్తం మీద కేవలం 900లోపు మాత్రమే ఉన్నట్టు సర్వేలో తేలింది. వీటన్నింటికి కలిపి నెలకు రూ.30 లక్షల లోపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. నాన్ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఏటా రూ.14.4 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నట్టు డిస్కంల పరిశీలనలో తేలింది. సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ సరఫరాపై ఇటీవల సీఎం కేసీఆర్‌కు పంపించిన నివేదికలో డిస్కంలు ఈ వివరాలను పొందుపర్చాయి. 85 శాతం నాన్ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయని ఈ నివేదికలో పొందుపర్చాయి. ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు కలిపి మొత్తం 12 వేల విద్యుత్ కనెక్షన్లను గుర్తించినట్టు నివేదించాయి. ఈ కేటగిరీల వినియోగదారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ.15 కోట్లను డిస్కంలకు సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుంది. సీఎంతో సీఎండీల సమావేశంలో తుది నిర్ణయం.. విద్యుత్ సంస్థల సీఎండీలతో త్వరలో సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమీక్షలో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇటు గత డిసెంబర్ నుంచి చెల్లించిన విద్యుత్ బిల్లుల మాఫీ అంశంపై సైతం ప్రకటన వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఉన్నికలు, మలి విడత మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి 2021–22 సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపా దనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను సమర్పించే అవకాశముంది. టారిఫ్‌లో సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలను పొందుపర్చనున్నారు. -
అన్నదాతకు నాణ్యమైన విద్యుత్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న మెగా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణ టెండర్ల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. అత్యంత పారదర్శకంగా చేపట్టిన యీ ప్రక్రియ ఫిబ్రవరి నాటికి ముగియనుంది. 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నవంబర్ 30న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. తుది గడువు ముగిసిన డిసెంబర్ 28 నాటికి ఐదు సంస్థలు 24 బిడ్లు దాఖలు చేశాయి. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఏ విధమైన అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా టెండర్ డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్షకు పంపారు. మరోవైపు ప్రజల నుంచి అందిన 150 సలహాలు, సూచనలనూ పరిగణనలోనికి తీసుకున్నారు. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారమే టెండర్ నిబంధనలు పొందుపర్చారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత చౌకగా టెండర్ ఖరారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఢోకాలేని విద్యుత్ సరఫరా దిశగా సర్కారు అడుగులు రైతన్నకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే ఫీడర్లను బలోపేతం చేశారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వాడకం క్రమంగా పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఏటా 12,221 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఎక్కువవుతోంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అరకొరగానే ఉండేది. 2015–16లో రూ.3,186 కోట్లు ఉంటే, 2018–19 నాటికి రూ.4 వేల కోట్లకు చేరింది. అయితే కేటాయించిన సబ్సిడీని కూడా గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కమ్‌లు అప్పుల పాలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020–21లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రూ.8,354 కోట్లకు పెంచడమే కాదు... పాత బకాయిలూ చెల్లించి డిస్కమ్‌లను ఆదుకుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లు ఏడాదికి 50 వేలు చొప్పున పెరుగుతున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్‌కు తగిన సరఫరా చేయాలంటే సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటే ఏకైక మార్గమని భావించిన ప్రభుత్వం ఈ దిశగా అడుగులేసింది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా .. తక్కువ ధరకే సౌర విద్యుత్ ఈ ప్లాంట్ల ఏర్పాటును రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ సోలార్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా చేపట్టే ఈ ప్రాజెక్టు 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో సొంతమవుతుంది. ప్లాంట్ నిర్మాణం చేపట్టే సంస్థలతో డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుతం యూనిట్ రూ.4.68 చొప్పున సౌర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ ఒప్పందాల వల్ల ఈ ధర చెల్లించడం అనివార్యమవుతోంది. నిజానికి ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో సోలార్ విద్యుత్ ధరలు కనిష్టంగా యూనిట్ రూ.1.99, గరిష్టంగా రూ. 2.43 మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే మెగా సోలార్ ప్రాజెక్టు నుంచి తీసుకునే విద్యుత్ కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రస్తుత ధరలతో పోలిస్తే 30 ఏళ్లలో రూ.48,800 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని పేర్కొంటున్నాయి. భవిష్యత్‌లో ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ సబ్సిడీ భారమూ తగ్గుతుందని చెబుతున్నాయి. ప్రభుత్వ, బీడు భూముల్లో ప్లాంట్లు అనంతపురం, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఉన్న బంజరు భూములు సోలార్ ప్రాజెక్టులకు అత్యంత అనుకూలమైనవిగా గుర్తించారు. అందులోనూ 50 శాతం ప్రభుత్వ భూములే ఉండటం మరింత కలిసొచ్చే అంశం. మిగిలిన 50 శాతం పంటలు పండని ప్రైవేట్, అసైన్డ్ భూములను సేకరించారు. వీటికి ఏడాదికి ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు చెల్లిస్తారు. సాగులేని భూములను వినియోగంలోకి తేవడం, 30 ఏళ్ల పాటు ప్రైవేట్ భూములకు ఆదాయం చెల్లించడం ద్వారా ఆర్థిక, పర్యావరణ, సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. సోలార్ విద్యుత్ వల్ల థర్మల్ విద్యుత్ వాడకం తగి, 14 మిలియన్ టన్నుల మేర కార్బన్ డై ఆక్సైడ్ గాలిలో కలిసే అవకాశం ఉండదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటికే 10 సోలార్ పార్కులకు ఏర్పాట్లు జరిగాయి. వైఎస్సార్, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే ఇవి ఏర్పాటు కానున్నాయి. -
మంచి మనిషి;16 ఏళ్లుగా రైతులకు సాయం
సాక్షి, అమరావతి బ్యూరో: కరువు సీమలో కరెంటు బిల్లులు చెల్లించడానికే కటకటలాడే రైతు పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు. ‘ఎలాగోలా కడతాం.. కరెంట్ తీసేయకండి బాబూ’ అంటూ ప్రాధేయపడే వారి గోడునూ విన్నారు. అన్నదాత ఆవేదన ఆయనను కదిలించింది. వారికి తన వంతుగా ఏదైనా చేయాలి.. అన్న ఆలోచన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకంతో కార్యరూపం దాల్చింది. అప్పట్నుంచి రైతుకు మేలు చేసే ఆ పథకంలో తానూ పాలుపంచుకుంటున్నారు. నెలనెలా తన జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆ పథకం కోసం వెచ్చిస్తున్నారు. రైతుల కష్టాలు చూసి.. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన ఊటుకూరి గోపాలకృష్ణమూర్తి.. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో తొలుత అనంతపురం జిల్లా ధర్మవరంలో జూనియర్ అకౌంట్స్ అధికారి (జేఏవో)గా 1986లో చేరారు. విధి నిర్వహణలో భాగంగా రైతుల వ్యవసాయ విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లేవారు. అప్పట్లో 5హెచ్‌పీ మోటారుకు నెలకు వచ్చే రూ.37 బిల్లును కూడా నాగసముద్రంగేటు, రామగిరి, వంటి వెనకబడ్డ ప్రాంతాల్లో కొంతమంది రైతులు చెల్లించలేక పోయేవారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఏవోగా బదిలీ అయిన ఆయనకు ఓజిలి, పెళ్లకూరుల్లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఇలాంటి రైతులకు తనవంతు సహాయం అందించాలనే తపన అప్పట్నుంచీ ప్రారంభమయ్యింది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా రైతుల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి రాగానే.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్ పథకం ఫైలుపై ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. ఆ పథకంతో గోపాలకృష్ణమూర్తికి ఒక మార్గం దొరికింది. నెలనెలా ఇలా.. ఒక రైతుకు సుమారుగా ఏడాదికయ్యే విద్యుత్ బిల్లును ప్రభుత్వం ద్వారా తాను చెల్లించాలని మూర్తి నిర్ణయించుకున్నారు. అలా 2004 మే నుంచి మొదలుకుని నెల నెలా తన జీతం నుంచి తొలుత రూ.500 చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి చెల్లించడం మొదలు పెట్టారు. ఏటా మార్చిలో ఆ మొత్తాన్ని పెంచుతూ వచ్చారు. అలా ఇప్పుడు నెలకు రూ.6,500 చెల్లిస్తున్నారు. ప్రతి నెలా తన జీతం నుంచే ఆ సొమ్ము సీఎంఆర్ఎఫ్కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇలా 16 ఏళ్లుగా చెల్లింపులను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మూర్తి స్ఫూర్తితో మరికొందరు.. గోపాలకృష్ణమూర్తిని సాటి ఉద్యోగులూ ఆదర్శంగా తీసుకున్నారు. అప్పట్లో విద్యుత్‌శాఖ ‘పవర్‌లైన్’ పేరిట నడిపే మ్యాగజైన్లో మూర్తి గురించి ప్రచురించారు. దీంతో స్ఫూర్తి పొందిన మరికొందరు విద్యుత్ శాఖ ఉద్యోగులు తమకు తోచినంత సీఎంఆర్ఎఫ్కు నెలనెలా పంపించడం మొదలుపెట్టారు. తుదిశ్వాస వరకు ఇస్తా.. రైతులకు సాయపడే విషయంలో నా ఆనందం మాటల్లో చెప్పలేను. మరో ఏడాదిన్నరలో పదవీ విరమణ చేస్తున్నాను. అయినా ఇది ఆపను. నాకొచ్చే పెన్షన్ సొమ్ములోనూ కొంత కేటాయిస్తా. ఏటా పెంచకపోయినా, ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తాన్ని మాత్రం తగ్గించను. ఇలా నా ప్రాణం ఉన్నంత వరకు కొనసాగిస్తా. నన్ను నా కుటుంబసభ్యులూ ప్రోత్సహిస్తున్నారు. తండ్రి పేరిట రూ.కోటిన్నర విలువైన భూమి ప్రభుత్వానికి అప్పగింత తాళ్లరేవు (ముమ్మిడివరం): పుట్టిన ఊరి కోసం ఆ తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడితే.. ఆయన వారసులు ఆ తండ్రి పేరిట భారీ భూదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఇంజరం గ్రామానికి చెందిన దివంగత నృసింహదేవర సత్యనారాయణ మూర్తి (దత్తుడు) పలుమార్లు సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. నిరుపేదలకు గృహ నిర్మాణాల నుంచి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఆరోగ్య ఉప కేంద్రాన్ని తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేని పరిస్థితుల్లో ఆయన తన సొంత భూమిని ఆయా భవనాలకు కేటాయించి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం దేశానికే తలమానికంగా మారిన గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి ఆయన కుమారులు రూ.కోటిన్నరకు పైగా విలువైన భూమిని దానం చేశారు. దత్తుడు మరణానంతరం కూడా ఆయన సేవా వారసత్వాన్ని కుమారులు కొనసాగిస్తూ ఊరి అవసరాల కోసం ప్రభుత్వానికి భూమిని అందించారు. -
ఉచిత విద్యుత్ కోసం మెగా సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, అమరావతి: రాబోయే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం మేరకే 10 వేల మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్ల దశకు చేరిందని తెలిపారు. మెగా సోలార్ ప్రాజెక్టు పురోగతిని గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ చైర్మన్ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్‌పై చేసే సబ్సిడీ 2015–16లో రూ.3,156 కోట్లు ఉంటే, 2020–21 నాటికి ఇది రూ.8,354 కోట్లకు చేరిందని ఇంధన శాఖ పేర్కొంది. ప్రస్తుతం డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు రూ.4.68 చెల్లిస్తున్నాయని, అదే సమయంలో సౌర విద్యుత్ ధర రూ.2.43 నుంచి రూ.3.02 వరకు ఉందని తెలిపింది. రాష్ట్రంలో మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే రానున్న 30 ఏళ్ల కాలంలో రాష్ట్రం రూ.48,800 కోట్లకు పైగా ఆదా చేయవచ్చునని ఏపీజీఈసీఎల్ అధికారులు అంచనా వేసినట్టు పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు యూనిట్లను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. సాంకేతిక ప్రమాణాల ఆధారంగా సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. -
‘జగ్జీవన్ జ్యోతి’కి రూ.390.92 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు జగ్జీవన్ జ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.390.92 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తరువాత ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తోంది. బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా ఇస్తున్న విద్యుత్‌తో వారి ఇళ్లల్లో వెలుగు కనిపిస్తోంది. 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ను ఇస్తామని 2019 జూలై 24న ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15.63 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఈ పథకం ద్వారా లబ్ధికలుగుతోంది. వీటిలో 10.87 లక్షల ఎస్సీల ఇళ్లు, 4.76 లక్షల ఎస్టీల ఇళ్లు ఉన్నాయి. 2020–21లో ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.390.92 కోట్లు (ఎస్సీలకు రూ.305.92 కోట్లు, ఎస్టీలకు రూ.85 కోట్లు) కేటాయించింది. ఇంకా అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలవారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఈ పథకం అమలు చేయనుంది. మాకు ఉచిత గృహవిద్యుత్ వరం మా ఇళ్లకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇచ్చిన వరం. ఒకప్పుడు కిరోసిన్ దీపాల వెలుగులో ఉండాల్సి వచ్చేది. కరెంటు బిల్లులు ప్రభుత్వం కట్టకపోతే ఇప్పుడు కూడా కిరోసిన్ బుడ్లు పెట్టుకుని బతకాల్సిందే. ఏపూటకు ఆపూట తెచ్చుకుని తినే మా ఇళ్లకు ఉచితంగా విద్యుత్ వెలుగులు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎప్పటికీ మరువలేం. – ఆరిక సూర్యనారాయణ, అధ్యక్షుడు, ఏపీ ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ దళితుల ఇంటి వెలుగు దళిత కుటుంబాలు ఏరోజు కారోజు కూలికెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. అటువంటి వారి ఇళ్లల్లో చీకటి ఉండకూడదని భావించిన ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. లక్షల కుటుంబాల వారు ఫ్యాను, లైటు వేసుకుని ఎంతోహాయిగా ఇతర పథకాల సాయంతో జీవిస్తున్నారు. – కల్లూరి చంగయ్య, అధ్యక్షుడు, ఐక్యదళిత మహానాడు -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లను అమ్మేస్తున్నారనేది కేవలం కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారమేనన్నారు. రైతన్నకు మరో 30 ఏళ్లదాకా పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై బుధవారం ఆయా సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారనేది వదంతులు మాత్రమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో చేరిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడంపై కూడా సీఎంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కోవిడ్ సంక్షోభంలోని మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సగం జీతాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల వేతనాలు నేరుగా సంస్థల ద్వారా ఇవ్వాలనే డిమాండ్‌నూ పరిశీలిస్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారని, అయితే రైతన్నపై పైసా భారం పడకుండా, మరింత జవాబుదారీతనంతో విద్యుత్ సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని బాలినేని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, జెన్కో ఎండీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు పద్మాజనార్థన్ రెడ్డి, హరినాథ్‌రావు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రి తమ సమస్యలు సానుకూలంగా విన్నారని ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్, వేదవ్యాస్ పేర్కొన్నారు. -
నేడే ‘వైఎస్సార్ బీమా’
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖాతాలకు చేరుతుందని తెలిపారు. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలని స్పష్టం చేశారు. ‘జగనన్న తోడు’ పథకాన్ని నవంబరు 6న ప్రారంభిస్తామని, బ్యాంకర్లతో మాట్లాడి దరఖాస్తు దారులందరికీ రుణాలు మంజూరు చేయించాలని కలెక్టర్లు, జేసీలను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల అమలు తేదీలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్ అన్నింటిలోనూ కలెక్టర్లు, జేసీలు కీలకపాత్ర పోషించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ, సకాలంలో సేవలు, స్కూళ్లలో నాడు–నేడు, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ ఉచిత విద్యుత్ తదితరాలపై స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్ష వివరాలివీ.. సచివాలయాల తనిఖీ తప్పనిసరి.. ఒక ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు తరచూ తనిఖీ చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపొద్దు. కలెక్టర్లు వెళితే జేసీలు కూడా వెళ్తారు. వారు వెళితే ఇతర అధికారులు కూడా తనిఖీలు చేస్తారు. ప్రాజెక్టు ఆఫీసర్, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, జిల్లాలో ప్రతి ఐఏఎస్ అధికారి తప్పనిసరిగా సచివాలయాలను తనిఖీ చేయాలి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. అదే నా సంకల్పం. అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టి ప్రతి అధికారి తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలి. 100 శాతం సకాలంలో సేవలు... నిర్దేశిత గడువులో సేవలు (ఎస్ఎల్ఏ) ఇప్పుడు 96.6 శాతం అందుతున్నాయి. ఇది నూటికి నూరు శాతం కావాలి. దరఖాస్తు తర్వాత 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామన్నాం. అది కచ్చితంగా జరిగి తీరాలి. పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపు.. ఈ నాలుగింటికి ఎస్ఎల్ఏ ఉండగా కొత్తగా 15 రెవెన్యూ సర్వీసులను కూడా చేర్చాం. సకాలంలో పూర్తి చేస్తే అదనంగా ‘ఉపాధి’ ఉపాధి హామీ కింద గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి కావాలి. ప్రతి నియోజక వర్గానికి రూ.10 కోట్ల విలువైన ఉపాధి పనులు కల్పించాం. సకాలంలో అన్ని పూర్తి చేస్తే అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు కల్పిస్తాం. వేగంగా స్కూళ్లలో నాడు–నేడు నాడు–నేడు తొలిదశ కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులన్నీ నవంబరు 15 నాటికల్లా పూర్తి చేయాలి. తల్లిదండ్రుల కమిటీలపైనే పూర్తి భారం మోపకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలతో పెనుమార్పులు గ్రామీణ వైద్యంలో వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు భవిష్యత్తులో పెను మార్పులు తీసుకు రానున్నాయి. వీటిల్లో ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటూ 55 రకాల ఔషధాలను సిద్ధంగా ఉంచుతారు. 355 అర్బన్ ఆరోగ్య కేంద్రాల కోసం భూమి గుర్తించాం. ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వేగంగా జరగాలి. వైద్య కాలేజీలకు భూ సమస్య పరిష్కరించాలి కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలకు (అదోని, పిడుగురాళ్ల) ఇంకా భూ సేకరణ జరగాల్సి ఉంది. పాత వైద్య కళాశాలలకు సంబంధించి కాకినాడ, ఒంగోలు, అనంతపురంలో భూ సేకరణ /భూమి అప్పగింతలో సమస్యలను కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కళాశాల ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం. నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు.. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ సరఫరాలో మరింత నాణ్యత ఉంటుందన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించాలి. మీటర్లు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయాన్ని స్పష్టం చేయాలి. విద్యుత్ బిల్లుల మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. వారు ఆ మొత్తాన్ని డిస్కమ్‌లకు చెల్లిస్తారు. తద్వారా నాణ్యమైన విద్యుత్తు కోసం రైతులు ప్రశ్నించవచ్చు. అది.. రైతుల హక్కు.. రైతులకు ఉచిత విద్యుత్ ఒక హక్కు లాంటిది. అందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.50కే వస్తుంది. ఆ విధంగా రైతులకు 30 ఏళ్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వవచ్చు. గత ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి 14 నెలలకు ఏకంగా రూ.8,700 కోట్లు బకాయి పెట్టిపోయింది. వీటన్నింటిపై రైతులకు అవగాహన కల్పించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇందుకోసం సచివాలయాల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఈ పథకం సక్సెస్ కాకూడదని కొందరు కోరుకుంటున్నారు. కాబట్టి మనం అంకిత భావంతో పని చేయాలి. 1.41 కోట్ల కుటుంబాలకు.. నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేలా మరో పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బియ్యం కార్డులున్న కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని తెచ్చింది. సీఎం వైఎస్ జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కుటుంబ పెద్ద సాధారణంగా లేక ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేలా ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని రూపొందించింది. లబ్ధిదారుల తరఫున బీమా సంస్థలకు రూ.510 కోట్లకు పైగా ప్రీమియం చెల్లిస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల్లో కుటుంబ పెద్ద హఠాత్తుగా మరణించడం లేదా అంగ వైకల్యానికి గురైతే ఆ కుటుంబం పడే అవస్థలను ప్రజా సంకల్ప పాదయాత్రలో సీఎం జగన్ స్వయంగా చూశారు. అధికారంలోకి రాగానే ఆ కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా నిలబడాలన్న లక్ష్యంతో వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రకటించారు. బీమా ప్రయోజనాలు.. ► బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలు వైఎస్సార్ బీమా పథకానికి అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. ► 18 – 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు. లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు. ► 51 – 70 ఏళ్ల మధ్య వయసు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది. 18 – 70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక/ శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు. ప్రీమియాన్ని భరించనున్న ప్రభుత్వం.. వైఎస్సార్ బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. -
ఉచిత విద్యుత్‌కు కొత్త ఎనర్జీ
రాష్ట్రంలో రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 2019 నాటి ఈ ఫీడర్లలో 58 శాతమే 9 గంటల విద్యుత్‌ను అందించే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఫీడర్ల వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం రూ.1,700 కోట్లతో పనులు మొదలుపెట్టింది. కోవిడ్ ఇబ్బందుల మధ్యనే ఇప్పటికి 97.5 శాతం పనులు పూర్తయ్యాయి. రబీ నాటికి వంద శాతం పూర్తవుతాయి. ఇక మీటర్లు బిగిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎంత విద్యుత్ వాడుతున్నారనే వివరాలు తెలుస్తాయి. తద్వారా సరఫరాలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తద్వారా రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదని చెప్పారు. ఈ విషయంపై విస్తృత ప్రచారంతో రైతుల్లో అవగాహన కల్పించాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఇంధన శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఇంధన శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి బాలినేని, అధికారులు నాణ్యత–ఐఎస్ఐ ప్రమాణాలు ► ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ (ఈఈఎస్ఎల్– ఎనర్జీ ఎఫిషియన్షీ సర్వీసెస్ లిమిటెడ్)తో మాట్లాడండి. రైతులు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన మోటార్లు వినియోగించేలా అవగాహన కల్పించాలి. ► కెపాసిటర్లు కూడా ఐఎస్ఐ ప్రమాణాలతో ఉండాలి. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలి. ► మరోవైపు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ► మీటర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడబోదన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే 14,354 లైన్మెన్లకు శిక్షణ ఇచ్చామని అధికారులు వెల్లడించారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 97.5 శాతం ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి నవంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. ► ఈ సమీక్షలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు. -
దొనకొండలో సోలార్ 'వెలుగులు'
దొనకొండ: రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో 1,000 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెవెన్యూ సిబ్బంది సుమారు 5,000 ఎకరాల భూమిని సర్వేచేసి నివేదిక తయారుచేశారు. మండలంలోని రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని గుర్తించారు. రూ.4,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తి చేసి మరో ఏడాది నాటికి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. నేరుగా రైతుల అకౌంట్లలోకి నగదు సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం ఒకే చోట లేనందున ప్రభుత్వం రైతుల నుంచి 2,000 ఎకరాల దాకా లీజుకు తీసుకోవాల్సి ఉంది. అలా 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని ఎకరాకు రూ.25,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే రెండేళ్లకోసారి ఐదు శాతం అధికంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కలెక్టర్ పోల భాస్కర్‌తో కలసి నెట్ క్యాప్ బృందం ఈ భూములను పరిశీలించింది. నివేదిక తయారు చేశాం.. సర్వేయర్లు, వీఆర్వోలు రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి గ్రామాల్లోని పొలాలను సర్వే చేసి ప్రభుత్వ, అసైన్మెంట్, పట్టా భూములను గుర్తించారు. నివేదిక పూర్తి చేశాం. ప్రభుత్వం అడిగిన వెంటనే అందజేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది. – తహసీల్దార్ కాలే వెంకటేశ్వరరావు -
‘శాశ్వత ఉచిత విద్యుత్’లో మరో కీలక అడుగు
సాక్షి, అమరావతి : పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించే ‘వైఎస్సార్ ఉచిత విద్యుత్’ పథకాన్ని మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ పథకం కోసమే ప్రత్యేకంగా చేపట్టిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది. తొలిదశలో.. అనంతపురం, వైఎస్సార్ కడప, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలుస్తున్నట్లు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్ష (జ్యూడీషియల్ ప్రివ్యూ)కు పంపింది. (కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్ సిగ్నల్) ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరిగే టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జ్యూడీషియల్ ప్రీవ్యూ అధికారిక వెబ్సైట్ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జ్యూడీషియల్ ప్రివ్యూ.ఏపీ.జీవోవీ.ఇన్’లో పొందుపర్చింది. వీటిని పరిశీలించి ప్రజలు, కాంట్రాక్టు సంస్థలు, నిపుణులు అవసరమైన సలహాలు, సూచనలు ఈనెల 25లోగా ‘ఏపీజ్యూడీషియల్‌ప్రీవ్యూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ లేదా ‘జడ్జి–జేపీపీ ఎట్ ది రేట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్‌కు పంపవచ్చని ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. పీఎంయు డాట్ ఏపీజీఈసీఎల్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్’కు కూడా సూచనలు పంపవచ్చని తెలిపింది. జ్యూడీషియల్ ప్రివ్యూ తర్వాతే పనులకు సంబంధించిన టెండర్లు పిలుస్తారని పేర్కొంది. (కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా) -
35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌కు ఢోకాలేదు
సాక్షి, గుంటూరు: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ పొందడం రైతుల హక్కు అని మాజీమంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. వచ్చే 35ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. శనివారం స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన విలేకరుల సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడారు. ఉచితవిద్యుత్ పథకానికి నగదు బదిలీ చేయడంతో ప్రభుత్వానికి బాధ్యత, రైతుకు జవాబు దారీతనం వస్తుందన్నారు. పగటిపూట నాణ్యమైన విద్యుత్ పొందడం వ్యవసాయం చేసే రైతుకు హక్కుగా ఉండాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగదుబదిలీ నిర్ణయానికి శ్రీకారం చుట్టారని వివరించారు. (దేవుళ్ల రథాలపై మరింత నిఘా.. ) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి మొట్టమొదటి ఫైలుపై సంతకం చేసి అమలు చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చాయన్నారు. టీడీపీ సర్కార్ హయాంలో పగటి పూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవన్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి, ఫీడర్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ పనుల కోసం వైఎసార్ ప్రభుత్వం రూ.1,700 కోట్లు కేటాయించిందని.. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 89 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తి చేసి రబీ నాటికి పూర్తి స్థాయిలో 9 గంటలపాటు పగటి పూటే కరెంటు ఇస్తారని వివరించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు ఉచిత విద్యుత్ పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8 వేల కోట్లు బకాయిపెట్టారని..వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించిందని చెప్పారు. ఈ డబ్బులు చెల్లించడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. తద్వారా యూనిట్ కరెంటు రూ.2.5 కే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుందని.. ఉచిత విద్యుత్ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగడానికి ఇది దోహదం చేస్తుందని లక్ష్మణరెడ్డి స్పష్టంచేశారు. (ఎన్ని గుళ్లు తిరిగినా ఆయన పాపాలు పోవు) రైతులపై ఒక్క పైసా భారం పడదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మనసున్న, రైతుల పక్షపాత ప్రభుత్వమని.. రైతులకు ఒక్క పైసాకూడా నష్టం జరగదని పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ ఏడి సురేష్ బాబు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ వంటి కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్ రూపేణా ఎంత వాడుతున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారని వివరించారు.నాణ్యమైన కరెంట్ పగటి పూట 9 గంటల పాటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చని.. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చున్నారు. దీని వల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయని..అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ప్రతినెలా రైతులకు ఖాతాల్లో డబ్బులు పడతాయని.. ఆ డబ్బులు డిస్కంలకు వెళతాయన్నారు. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయని సురేష్ బాబు వివరించారు. విలేకరుల సమావేశంలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, ఏపీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు శాంతమూర్తి, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నగదు బదిలీతో అన్నదాతకే అధికారం
సాక్షి, అమరావతి: నగదు బదిలీతో సరికొత్తగా అమలు కానున్న వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం అన్నదాతలకు నిజమైన అధికారాన్ని కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సౌరబ్ కుమార్ పేర్కొన్నారు. ఇది డిస్కమ్‌లను బలోపేతం చేసి రైతులకు సాధికారత తెస్తుందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో సమావేశం సందర్భంగా సౌరబ్ కుమార్ ఈ మేరకు అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని అంశాల్లో సహకారం అందిస్తాం.. ► పంపుసెట్లకు మీటర్లు లేకపోవడం వల్ల వ్యవసాయ వినియోగంపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేక రైతులకు నాణ్యమైన సేవలు అందడం లేదని సౌరబ్ కుమార్ పేర్కొన్నారు. డిస్కమ్‌ల సాంకేతిక, వాణిజ్య నష్టాలను వాస్తవంగా చూపించకుండా కొంత మొత్తాన్ని వ్యవసాయ విద్యుత్ వినియోగంలో కలుపుతున్నారన్నారు. నగదు బదిలీ పథకం అమలుతో విద్యుత్ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్, స్మార్ట్ మీటరింగ్‌తో పాటు అన్ని అంశాల్లోనూ ఈఈఎస్ఎల్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉచితానికి రూ.8 వేల కోట్లు ► రైతులపై పైసా భారం లేకుండా, లోవోల్టేజీ లేకుండా ఉచిత విద్యుత్ అందించే ప్రణాళికను ఇంధనశాఖ అధికారులు సౌరబ్ కుమార్‌కు వివరించారు. బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. మీటర్లు అమర్చటం వల్ల విద్యుత్ లోడు నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.8 వేల కోట్లు కేటాయించిందన్నారు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, మరో 30 ఏళ్లు ఈ పథకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడు వ్యవసాయ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. రూ.1,700 కోట్లతో ఫీడర్ల బలోపేతం ► పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల బలోపేతానికి ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసిందని సౌరబ్కుమార్కు ఇంధనశాఖ కార్యదర్శి వివరించారు. 2019 మార్చి 31 నాటికి డిస్కమ్‌లకు పెండింగ్‌లో ఉన్న రూ.8,655 కోట్ల సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని, అప్పటివరకు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.14,036 కోట్లను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. -
తొమ్మిది గంటలు ఎంత వాడినా ఫ్రీనే
-
తొమ్మిది గంటలు ఎంత వాడినా ఫ్రీనే
సాక్షి, విజయవాడ: వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం గురించి అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడానికి తాను మీడియా ముందుకు వచ్చాను అన్నారు సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్య ఉద్దేశ్యం పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం. ఇందుకు సంబంధించిన బిల్లును రైతుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ప్రభుత్వమే నగదు చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్‌ని అందిస్తున్న నేపథ్యంలో రైతుకు ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం 16,371 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయి ఉంది. ప్రతి మోటార్‌కు మీటర్ అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్‌ని అందిస్తాం’ అన్నారు. (చదవండి: సాగుకు ‘పవర్’) అంతేకాక ‘రైతు 9 గంటలు ఎంత విద్యుత్ వినియోగించినా అంతా ఉచితమే. విద్యుత్ మీటర్ రీడింగ్ అంతా ప్రభుత్వం చూస్తుంది. అనధికారికంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం. రైతులు కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తాం. దీనిపై బ్యాంకులు, విద్యుత్ అధికారులు మద్య ఒప్పందం జరగనుంది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది రాదు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, చిత్తశుద్ధితో 7 వేలకు పైగా జూనియర్ లైన్ మెన్లను ఏర్పాటు చేశాం. 2018-19 కంటే 2019-20లో విద్యుత్ సరఫరాలో 38శాతం అవాంతరాలు తొలగిపోయాయి. రైతుకు అదనపు కనెక్షన్లు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పథకం కార్పొరేట్ పరిధిలోకి రాదు. 1250 రూపాయలు అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ కనెక్షన్ల మార్పులకు సంబంధించిన వివరాలను విలేజ్ సెక్రటరీలకు ఇస్తే సరిపోతుంది. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ నగదు బదిలీ అమలు చేస్తాం. 17 లక్షలు పైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా ఉన్న కనెక్షన్లు ఒక లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. వాటిని క్రమబద్దీకరిస్తాం’ అన్నారు అజేయ కల్లాం. -
రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది
సాక్షి, తాడేపల్లి : ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన..కరెంట్ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని, ఆయన అబద్ధాలకు అంతే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ ఇస్తామని ఆనాడు రాజశేఖర్ రెడ్డి అంటే కరెంట్ తీగలు మీద బట్టలు అరేసుకోవలని అవహేళనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది కాదా అని నిలదీశారు. (నూతన్ నాయుడు అరెస్టు: విశాఖకు తరలింపు) రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం రెండవ స్థానంలో ఉందన్నది అబద్ధమని తెలిపారు. ఉచిత విద్యుత్‌పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని, టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని కన్నబాబు సవాల్ విసిరారు. మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకం ఉచిత విద్యుత్. రైతుల కోసం రైతులు కోసం రాజశేఖర్ రెడ్డి ఒకడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేశారు. ఉచిత విద్యుత్ కోసం రైతు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అని కన్నబాబు పేర్కొన్నారు. (కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు) -
‘విద్యుత్’పై పేటెంట్ వైఎస్సార్‌దే
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మ వద్దని, రైతులకు ఉచిత విద్యుత్‌పై శాశ్వత హక్కు కల్పించేందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గట్టి పునాది వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్ అభిమతమని, ఉచిత విద్యుత్ విషయంలో ఆయన వెనుకడుగు వేయరన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ నిర్ణయం పట్ల అందరూ సానుకూలంగా స్పందించి, స్వీకరించాలి. ఈ సంస్కరణలపై దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను నమ్మకూడదు. ప్రజలు, మేధావులు అందరూ ఆలోచించాలి. ► రైతులకు శాశ్వతంగా ఒక నమ్మకమైన, నాణ్యమైన, గ్యారెంటీ టైంతో కూడిన ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు జీవో తెస్తే.. టీడీపీ, కొన్ని ఆర్కెస్ట్రా పార్టీలు రైతుల్లో అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నాయి. అందుకే ప్రజల ముందు వాస్తవాలను ఉంచుతున్నాం. దమ్మున్న నాయకుడిగా జగన్ ముందడుగు ► ఇప్పటి వరకు విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పులబారిన పడి వేల కోట్ల రూపాయల బకాయిలు మోయలేక కునారిల్లుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా తీసుకొస్తున్న సవరణలు మనమీద పడే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగిన విధంగా మనం సమాయత్తం కావాలనే ఉద్దేశంతో దమ్ము ఉన్న నాయకుడిగా జగన్ మేలి సంస్కరణల దిశగా ముందడుగు వేశారు. ► నిజానికి ఉచిత విద్యుత్ ఎవరో పోరాడి సాధించుకున్నది కాదు. అది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేటెంట్. ఎడాపెడా కరెంట్ చార్జీలు పెంచి నిరసనగా రోడ్డెక్కిన వారి ప్రాణాలు తీసిన వ్యక్తి చంద్రబాబు. ► వైఎస్సార్ ఆలోచనలే పునాదిగా, విధానాలుగా వచ్చిన వైఎస్సార్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకానికి భంగం కలుగనీయదు. చంద్రబాబు పేటెంట్లు ఏవైనా ఉంటే అవి బెల్ట్‌షాపులు, ఊరూరా మద్యం అమ్మించడం. ► వచ్చే 30, 35 ఏళ్లు ఇబ్బంది లేకుండా పది వేల మెగావాట్ల సోలార్ పవర్‌ను నిబద్ధతతో, తక్కువ ఖర్చుతో రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు ఉంచి పోయిన విద్యుత్ బకాయిలు రూ.8,000 కోట్లు కట్టాం. ► విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయినా, రమేష్ హాస్పిటల్లో 10 మంది చనిపోయినా మాట్లాడకుండా.. అవినీతి కేసులో అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడు, హత్య కేసులో ఉన్న కొల్లు రవీంద్రను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఆలోచనా శక్తి లేదనుకుంటున్నారు. -
‘ఉచితం’ శాశ్వతానికే
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీపై ఎలాంటి అనుమానాలకు తావులేదని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని రాష్ట్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడటం, ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. నగదు బదిలీపై వ్యక్తమవుతున్న సందేహాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం సమగ్రంగా నివృత్తి చేశారు. ఏడాదిగా రైతుకు ఎంతో మేలు.. ► ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతోంది. 2019 వరకు కేవలం 58 శాతం ఫీడర్లే 9 గంటల విద్యుత్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండేవి. వీటి బలోపేతం కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లోనే 89 శాతం ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందుతోంది. రబీ నాటికి అన్ని ఫీడర్లు సిద్ధమవుతాయి. ► ఉచిత విద్యుత్‌కు మరో 30 ఏళ్లు ఢోకా లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపడుతోంది. ► 31.3.2019 నాటికి ఉన్న బకాయిల్లో రూ. 8655 కోట్లు, 2019–20లో ప్రభుత్వం చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బకాయిలు మొత్తం రూ.7,172 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ► వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు 7,523 మంది జూనియర్ లైన్మెన్లను ప్రభుత్వం నియమించింది. సాగు అవసరాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఫీడర్లలో అంతరాయాలు 2018–19తో పోలిస్తే 2019–20లో 38.4 శాతం మేర తగ్గాయి. నగదు బదిలీ ఎవరికి వర్తిస్తుంది? ► ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ ఇది వర్తిస్తుంది. ఏ ఒక్క రైతు తన జేబు నుంచి పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. మీటర్లు ఎందుకు? ► మీటర్లు అమరిస్తే ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో అర్థమవుతుంది. రైతులే డిస్కమ్‌లకు చెల్లిస్తారు కాబట్టి నిలదీసి మెరుగైన సేవలు పొందవచ్చు. ► డిస్కమ్‌లు ఇప్పటివరకు వార్షిక నష్టాలన్నీ రైతుల ఖాతాలో వేస్తున్నాయి. మీటర్లు అమరిస్తే వినియోగం, వృధా తెలుస్తుంది. వీటికయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరమ్మతుల ఖర్చు డిస్కమ్‌లే చూసుకుంటాయి. పరిమితులుంటాయా? ► ఉచిత విద్యుత్తు కనెక్షన్లు తగ్గిస్తారని, పరిమితులు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించరు. ► నగదు బదిలీ ఆలస్యమైతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారన్న ప్రచారంలోనూ నిజం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా ఆపవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ► అనధికార కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అదనపు లోడ్ కనెక్షన్ల్ల క్రమబద్ధీకరణ కూడా చేస్తున్నాం. కౌలు రైతులు ఎలా సాగు చేస్తున్నారో అలాగే ఇకపై కూడా ఉచిత విద్యుత్ పొందుతూ సాగు చేసుకోవచ్చు. -
రైతులకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమే
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీ అమలు ఫైలుపై తొలి సంతకం చేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు రైతులకున్న విద్యుత్ చార్జీల బకాయిలు రూ.1,100 కోట్లను కూడా మాఫీ చేశారన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ‘ఉచిత విద్యుత్– నగదు బదిలీ’ అంశంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మంత్రులతో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నీరుగార్చాయి. టీడీపీ సర్కార్ హయాంలో పగటి పూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు పరిశీలిస్తే.. దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవు. ఈ పరిస్థితులను మార్చడానికి, ఫీడర్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ పనుల కోసం రూ.1,700 కోట్లు కేటాయించాం. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 89 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తి చేసి రబీ నాటికి పూర్తి స్థాయిలో 9 గంటలపాటు పగటి పూటే కరెంటు ఇస్తాం. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు ఉచిత విద్యుత్ పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8 వేల కోట్లు బకాయిపెట్టారు. మనం అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించాం. ఈ డబ్బులు కట్టడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకున్నాం. స్థిరంగా నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ► రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. ► తద్వారా యూనిట్ కరెంటు రూ.2.5 కే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఉచిత విద్యుత్ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగడానికి ఇది దోహదం చేస్తుంది. రైతుల కోసమే ఈ సోలార్ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాం. రైతులపై ఒక్క పైసా భారం పడదు ► కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్ రూపేణా ఎంత వాడుతున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారు. ► నాణ్యమైన కరెంట్ పగటి పూట 9 గంటల పాటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చు. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు. దీని వల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయి. అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది. దీని వల్ల చంద్రబాబు ప్రభుత్వంలా బకాయి పెట్టే పరిస్థితులు ఉండవు. స్కీంను నిర్వీర్యం చేసే పరిస్థితులూ రావు. ► ప్రతినెలా రైతులకు డబ్బులు పడతాయి. ఆ డబ్బులు డిస్కంలకు వెళతాయి. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి. ఎఫ్ఆర్బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు ఒకటి. మనది మనసున్న, రైతుల పక్షపాత ప్రభుత్వం. రైతులకు ఒక్క పైసాకూడా నష్టం జరగదు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్ మహానేతదే ► రైతులకు ఉచిత విద్యుత్ పథకం మీద ఎవరికైనా పేటెంట్ ఉందంటే.. అది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అందుకనే దీనికి వైస్సార్ ఉచిత విద్యుత్ పథకంగా పేరు పెడుతున్నాం. ► మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం మరో రెండు, మూడు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందిస్తున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాం. ఆ డబ్బును బ్యాంకులు మినహాయించుకోవు ► విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కాల్ సెంటర్ కూడా పెడతాం. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. రైతులు ఎన్ని యూనిట్లు కాలిస్తే.. అన్ని యూనిట్లకూ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ► ఉచిత విద్యుత్ పథకం కింద ప్రభుత్వం బదిలీ చేసే నగదును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించుకోలేవు. మీటర్లకయ్యే ఖర్చును డిస్కంలు, ప్రభుత్వం భరిస్తాయి. రైతులకు ఎలాంటి భారం ఉండదు. ► ఏడాదికి దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్ కోసం ఖర్చు అవుతుంది. దీనికయ్యే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఏటా ఒక్కో రైతుకు దాదాపు రూ.49,600కు పైగా ఉచిత విద్యుత్ కింద ఖర్చు అవుతుంది. ► ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాం. గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచాలని చెప్పాం. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ► రైతులకు ఇప్పుడున్న కనెక్షన్లలో ఒక్కటి కూడా తొలగించం. రైతులకు ఎవరికైనా వర్తించకపోతే వారి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం. ఒక్క కనెక్షన్ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాం. మనం మేనిఫెస్టోలో 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటి పూట ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ మాటను అక్షరాల అమలు చేస్తాం. -
రైతులపై ఒక్క పైసా భారం పడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కేబినేట్ గురువారం సమావేశమైంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ‘‘కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించనున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదు’’ అని స్పష్టం చేశారు. (చదవండి: రైతులు పైసా కట్టక్కర్లేదు) ‘‘చంద్రబాబు ఉచిత విద్యుత్తు సాధ్యం కాదన్నారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది. సుమారు 8వేల కోట్ల మేర ఉచిత విద్యుత్తు బకాయిలు పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చాం. రూ. 1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేశాం. నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. పగటిపూట 9 గంటల కరెంటు, ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు అవుతోంది. రబీ సీజన్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింత గొప్పగా దీర్చిదిద్దుతాం. ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా ప్రణాళికలు రచిస్తున్నాం. ఉచిత విద్యుత్‌పై పేటెంట్ ఒక్క వైఎస్సార్‌కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు’’ అని సీఎం జగన్ తెలిపారు.(చదవండి:మహానేత స్ఫూర్తితోనే వైఎస్ జగన్ పరిపాలన) శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
రైతు శ్రేయస్సే ధ్యేయం
-
రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా
ఒంగోలు: ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులా రైతులపై కాల్పులకు ఆదేశించి కన్నీరు కార్చడం తమకు చేతకాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. (రైతులు పైసా కట్టక్కర్లేదు) ► కేంద్ర ప్రభుత్వం నాలుగు రంగాల్లో నగదు బదిలీని తెచ్చింది. అందులో భాగంగానే విద్యుత్ శాఖలోనూ నగదు బదిలీ అమలు చేయాల్సి వస్తోంది. ► రైతులపై రూపాయి కూడా భారం పడకుండా కరెంటు బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి ముందుగానే జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్నదాతలు తమ ఖాతాల్లో నగదు జమ అయిన తరువాతే బిల్లు మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తారు. ► రైతులు నేరుగా బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన కరెంట్ సరఫరాకోసం విద్యుత్తు శాఖ సిబ్బందిని ప్రశ్నించే వీలుంటుంది. ► ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతి. పంటలకు గిట్టుబాటు ధరలకోసం ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.70 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశారు. రైతులకు పగటిపూట 9 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు నిధులు కావాలని అధికారులు అడిగిన వెంటనే రూ.1,700 కోట్లు మంజూరు చేశారు. ► దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం. బషీర్‌బాగ్ కాల్పులు గుర్తున్నాయ్ బాబూ.. ► ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్‌ను అవహేళన చేయడమే కాకుండా హైదరాబాద్‌లో రైతులపై కాల్పులకు ఆదేశించిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుంది. ఆయన నిర్వాకాలను ఎవరూ మరచిపోలేదు. -
రైతులు పైసా కట్టక్కర్లేదు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తు కోసం రైతులు పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని, మీటర్లకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. బిల్లు చెల్లిస్తారు కనుక విద్యుత్తు నాణ్యతపై రైతులకు అధికారులను నిలదీసే హక్కు ఉంటుందని చెప్పారు. అధికారులు కూడా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్తుపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని తెలిపారు. కనికరం లేకుండా కాల్పులు జరిపించారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా నాటి చంద్రబాబు సర్కారు కనికరించలేదు. కరవు వెంటాడుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవసాయ విద్యుత్ ధర హార్స్పవర్ రూ. 50 నుంచి రూ. 650కి పెంచింది. విద్యుత్తు బిల్లులు కట్టలేదని రైతులపై కాల్పులు జరపడంతోపాటు జైళ్లలో పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదే. వైఎస్సార్ ఆశయాల దిశగానే... – ఈ పరిస్థితిని చూసి చలించిన దివంగత వైఎస్సార్ అధికారం చేపట్టగానే దేశానికే ఆదర్శమైన ఉచిత విద్యుత్పథకాన్ని తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, ఉచిత విద్యుత్తు రైతు ఇంట ఆనందాన్ని నింపాయి. రూ. 50 వేల కోట్లతో రైతుల కోసం జలయజ్ఞం చేపట్టిన ఘనత వైఎస్సార్‌దే. – వైఎస్సార్ చేపట్టిన ప్రతీ పథకాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకేసీఎం జగన్ శ్రమిస్తున్నారు. బాబు మాటలు బూటకం.. మిగులు విద్యుత్తు అంటూ చంద్రబాబు చెప్పే మాటలు బూటకం. రాష్ట్ర విభజన నాటికే ఏపీలో 55 శాతం విద్యుత్‌ఉత్పత్తి ఉండగా తెలంగాణాలో 45 శాతం ఉంది. వినియోగం తెలంగాణలో 57 శాతం, ఏపీలో 43 శాతం ఉంది. ఏపీలో 12 శాతం అదనపు ఉత్పత్తి ఉంది. ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు థర్మల్ విద్యుత్తు పీఎల్ఎఫ్ తగ్గించడమే చంద్రబాబు ఘనత. ఆ బకాయిలన్నీ సీఎం జగన్తీరుస్తున్నారు – వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా కష్టమైనా సీఎం జగన్ సాహసంతో అమలు చేస్తున్నారు. ఫీడర్ల బలోపేతం కోసం రూ. 1,700 కోట్లు మంజూరు చేశారు. – గత సర్కారు రూ.34 వేల కోట్ల మేర విద్యుత్తు బకాయిలు పెట్టి వెళ్లిపోతే సీఎం జగన్ వాటిని తీరుస్తున్నారు. విద్యుత్సబ్సిడీలకు సంబంధించి రూ.17,904 కోట్లు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇందులో సగం కూడా ఇవ్వలేదు. – ఈ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్సబ్సిడీ కోసం రూ.7 ,171 కోట్లు ఇచ్చింది. అక్వాసాగుదారులకు రూ.700 కోట్లు ఇచ్చింది. అన్ని రకాల ఉచిత విద్యుత్తు సబ్సిడీలు కలిపి రూ.11,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం తెచ్చిన సంస్కరణలతో.. –సంస్కరణల దిశగా కేంద్రం వేస్తున్న అడుగులను అన్ని రాష్ట్రాలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదనపు నిధులపై కొన్ని షరతులు విధించింది. విద్యుత్సబ్సిడీని రైతుల ఖాతాలకు బదిలీ చేయాలనేది ఇందులో ప్రధానమైనది. డిసెంబర్‌లోగా ఒక్క జిల్లాలో అయినా ప్రయోగాత్మకంగా నగదు బదిలీ అమలు చేసి వచ్చే సంవత్సరం రాష్ట్రమంతా విస్తరిస్తామని చెబితేనే అప్పులపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తుంది. -
అలా జరిగితే పదవి వదులుకుంటా: బాలినేని
సాక్షి, ఒంగోలు : విద్యుత్ సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ,లేనిపోని అపోహలు సృష్టించవద్దని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఉచిత విద్యుత్‌కి ఎటువంటి విఘాతం కలగదని అన్నారు. ఎట్టి పరిస్థితిలో రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం చేశారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వస్తే తన మంత్రి పదవి వదులుకుంటానని తెలిపారు. (రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ) మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పధకం ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ గురించి వైఎస్సార్ మాట్లాడితే ..తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందే అని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తుచేశారు. విద్యుత్ గురించి మాట్లాడితే బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా రైతులకు ,ఉచిత విద్యుత్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని తెలిపారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమచేసి ఆ బిల్లు డబ్బును డిస్కం ఖాతాలో జమచేయడం ద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేదని మంత్రి బాలినేని పేర్కొన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. -
రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ వినియోగదారులకే నగదు బదిలీ చేసే ఈ పథకం 2021 – 22 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. రైతుల జేబు నుంచి ఒక్క పైసా ఖర్చు కాకుండా, నాణ్యమైన విద్యుత్‌ను హక్కులా సాధించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వడానికి కేంద్రం కొన్ని సంస్కరణలను తప్పనిసరి చేసిందని, ఇందులో భాగంగా వ్యవసాయ సబ్సిడీని ’నగదు బదిలీ’గా మార్చాలని సూచించిందని వివరించారు. అయితే ఈ నిర్ణయం రైతన్నకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, వారిపై ఒక్క పైసా కూడా భారం పడకుండా కట్టుదిట్టమైన విధాన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జవాబుదారీతనం పెంపు... ► దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్పథకాన్ని ఆ తర్వాత ప్రభుత్వాలు మొక్కుబడిగా మార్చాయి. అరకొరగా తక్కువ వోల్టేజీతో అందిస్తూ రైతు నిలదీయలేని దుస్థితిని గత సర్కారు కల్పించింది. ఈ పరిస్థితిని మార్చేసి నాణ్యమైన విద్యుత్తుతోపాటు రైతులకే నగదు అందచేసి వారి ద్వారా డిస్కమ్‌లు బిల్లులు అందుకోవడం, జవాబుదారీతనంతో వ్యవహరించేలా తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► ఈ విధానం వల్ల రైతులకు తమకు వ్యవసాయ సబ్సిడీ ఎంత వస్తుందనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిస్కమ్‌లకు తానే బిల్లు చెల్లిస్తాడు కాబట్టి నాణ్యమైన విద్యుత్ కోసం నిలదీసే అధికారం ఉంటుంది. ఫలితంగా విద్యుత్ సంస్థల్లో పారదర్శకత పెరుగుతుంది. ► రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులున్నారు. ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల వ్యవసాయ విద్యుత్ వాడుతున్నట్లు అంచనా. గత సర్కారు ఏటా రూ. 4 వేల కోట్ల సబ్సిడీ మాత్రమే ఇవ్వగా ఇప్పుడు ఏకంగా ఏటా రూ. 8,400 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అందచేస్తూ 9 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ముందే రైతు ఖాతాలోకి... ► వ్యవసాయ పంపుసెట్‌కు మీటర్ అమర్చి నెల నెలా వాడిన విద్యుత్‌ను లెక్కిస్తారు. అందుకయ్యే మొత్తాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలో ముందుగానే జమ చేస్తుంది. ఆ తర్వాత డిస్కమ్‌లకు రైతే తన బ్యాంకు ఖాతా ద్వారా చెల్లిస్తారు. ► ఈ క్రమంలో రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదు. ఈ ప్రక్రియ ఆలస్యమైనాఅన్నదాతలకు విద్యుత్ సరఫరా నిలిపివేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతే కాదు మీటర్ అమర్చినప్పటికీ ఎంత విద్యుత్ వాడినా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రైతు ఖాతాలో వేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి నియంత్రణ ఉండదు. అమలుకు కమిటీలు ► రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర విద్యుత్ సంస్థల పరిధిలో ప్రత్యేకంగా కమిటీల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు. ► వ్యవసాయ విద్యుత్ వినియోగదారులందరినీ పథకంలోకి తెస్తారు. అక్రమ కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పునఃసమీక్షించనున్నారు. -
సాగుకు ‘పవర్’
గతంలో వ్యవసాయ కరెంట్ ఎప్పుడొస్తుందో తమకే తెలియదన్న అధికారులు ఇప్పుడు కచ్చితమైన సమాచారం ఇస్తున్నారని అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండకి చెందిన చిన్న రంగన్న ఆనందంగా చెప్పాడు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఏటా నీళ్లు లేక ఎండిపోయే ఆయన మామిడి తోట ఈసారి విరగ కాసింది. కర్నూలు జిల్లా చేబోలుకు చెందిన రైతు బంగారు రెడ్డి గతంలో లో వోల్టేజీతో తరచూ మోటార్లు కాలిపోయి కరెంటోళ్ల చుట్టూ తిరిగి విసిగిపోయేవాడు. ట్రాన్స్ఫార్మర్ మార్చేసరికి పంట సీజన్ పూర్తై నష్టం జరిగేది. ఇప్పుడు పగలే 9 గంటలు నాణ్యమైన కరెంట్‌తో సమస్యలు తీరాయి. కరెంట్ 9 గంటలు పగలే ఇస్తామని తమ ఊళ్లోకొచ్చి మరీ అధికారులు చెప్పారని, ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే ఒక్క ఫోన్ కాల్ చేస్తే వస్తామన్నారని తుని ప్రాంతానికి చెందిన రైతు వీరేశ్వర్ తెలిపారు. అయితే ఆయనకు ఇంతవరకు ఆ అవసరమే రాలేదు. గతంలో రోజూ ట్రిప్ అయ్యేదని, ఇప్పుడు ఒక్కసారి కూడా సమస్య తలెత్తలేదు. సాక్షి, అమరావతి: ఐదేళ్ల క్రితం నాటి మాట.. భూమిలో కావాల్సినన్ని నీళ్లు, పొలంలో మోటర్ ఉన్నా కరెంట్ మాత్రం ఉండేది కాదు. రోజుకు ఏడు గంటల మాట దేవుడెరుగు అసలు ఎప్పుడొస్తుందో తెలియక పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇప్పుడా దురవస్థ లేదు. ఏ పల్లెకెళ్లినా రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతోంది. వరుణుడు దోబూచులాడినా 9 గంటలు పగటిపూట విద్యుత్‌పై భరోసాతో అన్నదాతలు ధైర్యంగా పొలం పనులు ప్రారంభిస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియని చీకటి రోజులకు ప్రభుత్వం చరమగీతం పాడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చడంతో వ్యవసాయదారుల్లో నమ్మకం పెరిగింది. వారి మాటల్లోనే అది స్పష్టమవుతోంది. రూ.1,700 కోట్లతో ఫీడర్లు బలోపేతం.. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని నవరత్నాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చీ రావడంతోనే దీనిపై సమీక్షించింది. ఆనాటికి రాష్ట్రంలో విస్తుబోయే పరిస్థితి ఉంది. గత సర్కారు హయాంలో వ్యవసాయానికి వేళాపాళా లేకుండా 7 గంటలే విద్యుత్తు ఇవ్వడంతో పంట పొలాలు ఎండిపోవడం, తరచూ మోటార్లు కాలిపోవడం, రైతులు విష పురుగుల కాటుకు బలి కావడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వంద శాతం ఫీడర్లను బలోపేతం చేయాలంటే భారీగా వ్యయం చేయాలి. గత సర్కార్ ఉన్నకాడికి అప్పులు చేయడంతో కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితీ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగుదారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అప్పటికప్పుడు రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఫీడర్ల బలోపేతాన్ని చేపట్టారు. ఖరీఫ్ సీజన్లో సమర్థత ఉన్న ఫీడర్లలో 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రబీ నాటికి వంద శాతం ఫీడర్లు సరఫరాకు సిద్ధమవుతాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 32 ప్రాజెక్టులు చేపట్టగా ఇవన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఏడాదిలో 65 వేల కొత్త కనెక్షన్లు జారీ... రైతుల పొలానికి కరెంట్ ఉచితంగా రావాలంటే ఆ భారాన్ని ప్రభుత్వమే మోయాలి. లేదంటే డిస్కమ్‌లు దివాలా తీస్తాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గతంలో అదే జరిగింది. టీడీపీ హయాంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పూర్తిగా చెల్లించలేదు. పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలో చాలా వరకూ ఈ ప్రభుత్వం తీర్చేసింది. పైగా వ్యవసాయ సబ్సిడీ కింద ఈ ఏడాది రూ. 8,255 కోట్లు కేటాయించింది. డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కేలా రుణాలు ఇప్పించింది. సాగును పండుగ చేయాలన్న సంకల్పంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 65 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చి రికార్డు సృష్టించింది. ఉచిత విద్యుత్‌ను రైతన్నకు శాశ్వత వరంగా నిలపాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆశయం. ఇందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 10 వేల మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు ఆమోదం తెలిపింది. ఇది అమలులోకి రాగానే రైతన్న ఇక ఏనాడూ బోరుబావి దగ్గర కంటతడి పెట్టే పరిస్థితి ఉత్పన్నం కాదు. ►వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 60 శాతం ఫీడర్ల ద్వారా మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతుండగా అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఫీడర్ల సామర్థ్యాన్ని 83 శాతానికి పెంచి పగలే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందచేస్తోంది. ► రాష్ట్రంలో 6,663 వ్యవసాయ ఫీడర్లుండగా 5,547 ఫీడర్లు (83 శాతం) 9 గంటల ఉచిత విద్యుత్ అందించే సమర్థత కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోమిగతా 17 శాతం ఫీడర్లను కూడా అదనపు లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ద్వారా బలోపేతం చేసి మొత్తం 100 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలు విద్యుత్తును రబీ నాటికి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ... పగటి పూటే 9 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అది కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం చేయాలనిపిస్తోంది. – భాస్కర్‌రెడ్డి, గూబనపల్లి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా పాముకాటుతో ప్రాణాలు విడిచారు.. ఆ బాధలు గుర్తొస్తేనే ఏడుపొస్తోంది. టీడీపీ పాలనలో అర్ధరాత్రో, అపరాత్రో కరెంట్ ఇచ్చేవాళ్లు. నీళ్ల కోసం వెళ్లి పాముకాటుతో చనిపోయిన వాళ్లున్నారు. ఈ బాధలు పడలేకే చాలామంది పొలాల్ని బీళ్లుగా పెట్టారు.ఇప్పుడు పగలే 9 గంటల విద్యుత్ ఇస్తున్నారు. మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. – రవి, చింతలవారిపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా రైతుల నుంచి మంచి స్పందన... ప్రభుత్వ లక్ష్యం మేరకు పగటిపూటే 9 గంటల పాటు వ్యవసాయ విద్యుత్ ఇవ్వడంలో అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. దీనిపై రైతుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో రికార్డు
-
కోరినన్ని కనెక్షన్లు
సాక్షి, అమరావతి: రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఏడాది కాలంలోనే 63,068 కొత్త కనెక్షన్లు జారీ చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి ఆన్లైన్లోనే మంజూరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఫలితంగా రైతులు వ్యవసాయ కనెక్షన్ కోసం రోజులు తరబడి అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి తప్పింది. 2019 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 18,07,100 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 18,70,168కి పెరిగింది. వీటన్నింటికీ నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రబీ కల్లా అన్నీ ఫీడర్లలో... రాష్ట్రంలో ప్రస్తుతం 6,663 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లున్నాయి. వీటిల్లో 5,383 ఫీడర్లు మాత్రమే (81 శాతం) 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగే స్థాయిలో ఉన్నాయి. మిగతా ఫీడర్లను కూడా బలోపేతం చేసి విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం అదనంగా రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 426.88 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 64 కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. రబీ నాటికల్లా వందశాతం ఫీడర్లలో 9 గంటల వ్యవసాయ విద్యుత్ అందించాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. మరికొన్ని కనెక్షన్లు! నాణ్యమైన విద్యుత్ అందుతుండడంతో వ్యవసాయ కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లపై అనధికారిక కనెక్షన్లు తొలగించి కొత్తవి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు లైన్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు సాధ్యమైనంత వరకు కనెక్షన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంధనశాఖ అధికారులు వివరించారు. రైతుల కోసం ఎంతైనా ‘రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్త కనెక్షన్ల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
చౌక విద్యుత్ వల్ల రూ.700 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో స్వీయ నియంత్రణ పాటించడం వల్ల ఏడాది కాలంలోనే డిస్కమ్‌లు రూ.700 కోట్లు ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డుగా పేర్కొంది. ఏడాది కాలంలో సాధించిన పురోగతిని వివరిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సబ్సిడీ బకాయిలు చెల్లింపుతో. ► గత ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,391 కోట్లు ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019–20లో రూ.8,655 కోట్లను డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించింది. ► విద్యుత్ సబ్సిడీ కింద మరో రూ.9,249 కోట్లను (మొత్తం రూ.17,904 కోట్లు) చెల్లించింది. ► విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం 2019–20లో రూ.20,384 కోట్లు విడుదల చేసింది. డిస్కమ్‌లు మరో రూ.14 వేల కోట్లను ఉత్పత్తిదారులకు చెల్లించాయి. రైతులకు ఉచిత విద్యుత్ ► రాష్ట్రంలోని 18.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు వచ్చే రబీ సీజన్ ప్రారంభం నాటికల్లా పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలని విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ► ఇప్పటికే 81 శాతం ఫీడర్ల పరిధిలో ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. మిగిలిన ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఆధునికీకరణ నిమిత్తం ప్రభుత్వం రూ.1,700 కోట్లు విడుదల చేసింది. ► విద్యుత్ సంస్థల పురోగతిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. వ్యవసాయానికి పగటి పూటే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం విప్లవాత్మకమైందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.8,353.58 కోట్లు కేటాయించిందన్నారు. -
లాక్‌డౌన్‌లోనూ ఉచిత విద్యుత్‌కు పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని.. ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించాలని చెప్పినట్లు ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రాష్టంలో విద్యుత్ డిమాండ్‌పై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నివేదికలను శుక్రవారం పరిశీలించారు. అందులో తేలిన అంశాలేమిటంటే.. - ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు 154 మిలియన్ యూనిట్లు. ఇందులో వ్యవసాయ విద్యుత్ వినియోగం 42 మిలియన్ యూనిట్లు ఉంటోంది. అంటే.. సాధారణ రోజుల్లో మాదిరిగానే ఇప్పుడూ వ్యవసాయ విద్యుత్ వినియోగం కొనసాగుతోంది. - మార్చి చివరి వారం.. ఏప్రిల్ మొదటి వారంలో పంటలకు నీళ్లు ఎక్కువగా అవసరం. ఈ కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకోసం స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు చేయాలని మొదట్లో భావించారు. - రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సగటున రోజుకు 33 మిలియన్ యూనిట్లు ఉచిత విద్యుత్ వాడకమే ఉంటుంది. మార్చి, ఏప్రిల్‌లో ఇది ఇంకా పెరుగుతుంది. ఈ లెక్కన ఈ రెండు నెలల్లో విద్యుత్ డిమాండ్ రోజుకు 204 మిలియన్ యూనిట్లు ఉండొచ్చని అంచనా వేశారు. - లాక్డౌన్ కారణంగా వాణిజ్య విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గింది. అందరూ ఇళ్లకే పరిమితం కావడంవల్ల గృహ విద్యుత్ వినియోగం కొంచెం పెరిగింది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే కొత్తగా అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని లెక్కతేల్చారు. - కానీ, వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉదయం 7–11 గంటల మధ్య ఎక్కువగా ఉంటోందని పంపిణీ సంస్థల ఉన్నతాధికారులు తెలిపారు. 10 గంటల వరకూ గృహ వినియోగం సాధారణంగానే ఉంటుంది. 10–11 మధ్య ఏసీల వాడకం పెరగడంతో, అదే సమయంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉండటంతో స్వల్పంగా డిమాండ్ ఏర్పడుతోంది. - దీంతో ట్రాన్స్ఫార్మర్లపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా ఉందని ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రోజుకు కనీసం 70 వరకూ ట్రాన్స్ఫార్మర్లకు ఏదో ఒక రకంగా ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 500 ట్రాన్స్ఫార్మర్లను తక్షణమే మార్చాలని అధికారులు అనుకున్నారు. కానీ, లాక్డౌన్ కారణంతో అవి అందుబాటులోకి రాలేదు. - అయినా.. ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దని విద్యుత్ సౌధ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఫోన్ చేసిన 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేసి ఉపయోగంలోకి తెస్తున్నామని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. -
దొనకొండలో మెగా సౌర విద్యుత్ ప్లాంట్!
దొనకొండ: ప్రకాశం జిల్లా దొనకొండలో వెయ్యి మెగావాట్ల మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దొనకొండలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు ఐదువేల ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెడ్‌క్యాప్ సంస్థ బృందం ఈ ప్రాంతంలో భూముల పరిశీలన చేపట్టింది. దొనకొండలో 25,086 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు రెవెన్యూ శాఖ సర్వే ద్వారా గుర్తించారు. ఇందులో వద్దిపాడులోని సర్వే నంబర్ 52, 54, 58, పోచమక్కపల్లి సర్వే నంబర్ 71, 72, రుద్రసముద్రంలో సర్వే నంబర్ 262–64లో సుమారు ఐదువేల ఎకరాల ప్రభుత్వ భూములను నెడ్‌క్యాప్ బృందం పరిశీలించింది. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని బృందం అభిప్రాయపడింది. నెడ్‌క్యాప్ డీజీఎం సీబీ జగదీశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా మేనేజర్ జి.బుచ్చిరాజు గతవారం ఈ భూములపై హైలెవెల్ టెక్నికల్ సర్వే నిర్వహించారు. సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను చేపట్టి ఏడాదిలో పూర్తి చేసి.. ఆ తరువాత ఏడాదికల్లా విద్యుత్ ఉత్పత్తి చేపట్టవచ్చని వారు తెలిపారు. ఈ ప్లాంటు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. దీనిపై నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ బుచ్చిబాబు మాట్లాడుతూ గురువారం ఒంగోలు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ షన్మోహన్తో నెడ్‌క్యాప్ బృందం, దొనకొండ తహసీల్దార్, సర్వేయర్లు సమావేశం కానున్నారని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. దొనకొండ తహసీల్దార్ కాలే వెంకటేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. -
రైతన్నకు సౌరశక్తి!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న విద్యుత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సౌర విద్యుదుత్పత్తి చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఈ దిశగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించే పథకం చిరస్థాయిగా నిలవాలన్నారు. ఐదేళ్ల సబ్సిడీనే పెట్టుబడి.. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటి సామర్థ్యం 120 లక్షల హార్స్పవర్ (హెచ్‌పీ) ఉంటుంది. ఒక హెచ్‌పీకి 1,240 యూనిట్ల విద్యుత్ ఏటా ఖర్చవుతోంది. ఈ లెక్కన ఏటా 13 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వ్యవసాయానికి అవసరమవుతుంది. దీనికోసం ప్రభుత్వం ఏటా డిస్కమ్‌లకు రూ.8 వేల కోట్ల సబ్సిడీ చెల్లిస్తోంది. ఇలా కాకుండా ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రూ. 32 వేల కోట్లు ఖర్చవుతుంది. ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌ను సరఫరా చేయడానికి మరో రూ.4 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లు వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల సబ్సిడీనే పెట్టుబడిగా భావిస్తే ఆ తర్వాత ఉచితంగానే డిస్కమ్‌లకు విద్యుత్ అందినట్టే కదా? అని ముఖ్యమంత్రి జగన్ అధికారులతో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 50 వేల ఎకరాల లభ్యత రాయలసీమలో సౌర విద్యుదుత్పత్తికి విస్తృత అవకాశాలున్నాయని నెడ్‌క్యాప్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భూమి లభ్యత కూడా తగినంత ఉందన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. ప్రకాశం జిల్లాలో 6 వేల ప్రభుత్వ భూమి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైందని తేల్చారు. మిగతా ప్రైవేటు భూమిని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో సేకరించే వీలుందని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు. అక్కడ భూమి కూడా చౌకగా లభిస్తుందని చెప్పారు. ఇలా మొత్తం 50 వేల ఎకరాలు సోలార్ ప్లాంట్ల కోసం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు బ్రహ్మంసాగర్, గండి, మైలవరం రిజర్వాయర్లలో నీటిపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించామని జెన్కో అధికారి తెలిపారు. చౌకగా విద్యుత్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే వీలుందని జెన్కో డైరెక్టర్ ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 32 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకు ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడిస్తున్న విద్యుత్ ఖరీదు యూనిట్ రూ. 5.40 వరకు ఉంటోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా డిస్కమ్‌లకు అందిస్తోంది. సోలార్ విద్యుదుత్పత్తి ధర యూనిట్ రూ. 4.20 మాత్రమే ఉంటుందని అధికారులు చెప్పారు. పదేళ్లలో పెట్టుబడి మొత్తం రాబట్టే వీలుందని, మరో 15 ఏళ్లు చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అధ్యయనం పూర్తి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్), ఏపీ జెన్కో నివేదిక రూపకల్పనపై కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ రెండు విభాగాలు ఇప్పటికే అనేక ప్రాంతాలను పరిశీలించి సానుకూల అంశాలను గుర్తించాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇంధనశాఖ ఉన్నతాధికారి తెలిపారు. దీనిద్వారా ప్రాజెక్టు కోసం రుణాన్ని పొందే వీలుందని వివరించారు. అయితే పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వం సమకూర్చే ఆలోచన కూడా పరిశీలనలో ఉందన్నారు. సౌరశక్తి రైతులకు వరం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించింది. వారం రోజుల్లో ఈ పథకంపై పూర్తి స్పష్టత వస్తుంది. సోలార్ ద్వారా రైతులకు పగటిపూట విద్యుత్ ఇబ్బంది లేకుండా అందించవచ్చు. సౌర విద్యుత్తు రైతులకు వరం లాంటిది. – శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి మంచి ఫలితాలిస్తుంది సౌర విద్యుదుత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి మంచి అవకాశాలున్నాయి. వ్యవసాయానికి అనుకూలం కాని ప్రాంతాల్లో భూమిని సోలార్ విద్యుదుత్పత్తి కోసం ఇవ్వడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. లీజుకు తీసుకున్నా, కొనుగోలు చేసినా సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణ వ్యయం పెద్దగా పెరగదు. – రమణారెడ్డి నెడ్‌క్యాప్ ఎండీ -
డిమాండ్‌కు సరిపడా విద్యుత్
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) అంచనా వేస్తోంది. ఈ మేరకు ముందస్తు ప్రణాళిక(ఫోర్కాస్ట్)ను విద్యుత్ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నివేదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఏసీల వినియోగం లక్షకుపైగా పెరిగినట్టు గుర్తించారు. మరోవైపు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను ఏడు నుంచి తొమ్మిది గంటలకు పెంచారు. ఫలితంగా వేసవిలోనూ కొన్ని రకాల ఉద్యాన పంటలకు విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ, గృహ, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను త్వరలో అనుమతించే వీలుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్‌పై ఎస్ఎల్డీసీ అంచనా వేసింది. ఏటా గరిష్టంగా రోజుకు 175 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే, వచ్చే మే నెలలో 210 మిలియన్ యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. - ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య కాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలి. - ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో పరిధిలోని ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను డిసెంబర్ నాటికి 3 లక్షల టన్నులు, వచ్చే ఏడాది జనవరి చివరకు 6 లక్షల టన్నులు, మార్చి చివరకు 9 లక్షల టన్నులకు పెంచాలి. - రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ స్టేషన్లలో రోజుకు 80 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు నెలకు 17 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో విదేశాల నుండి కూడా జెన్కో తక్కువ ధరకు బొగ్గు దిగుమతి చేసుకోవాలి. - ఫిబ్రవరి, జూలై మధ్యలో దశల వారీగా నెలకు 2 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం. - ఏపీ డిస్కమ్‌లతో పీపీఏలున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలుకు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఇటీవల కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (విద్యుత్ కొనుగోలుకు ముందే బ్యాంకులో డబ్బులు చెల్లించడం)కు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. (కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,184 కోట్లు ఎల్సీ కింద చెల్లించారు). దీంతో వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్ కొనుగోలుకు ఇబ్బందులు ఉండవు. - ఈసారి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వేసవి నాటికి 300 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా. - ఈ ఏడాది జలాశయాలు పుష్కలంగా నిండాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. దేనికైనా సిద్ధమే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరలోనే సరఫరా చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. వేసవిలోనూ ప్రజల అంచనాలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తాయి. - బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాలలో విద్యుత్తు ఎల్లప్పుడూ కీలకాంశంగానే ఉంటోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చారిత్రక విజయం లభించడం వెనుక కూడా ‘బిజ్లీ హాఫ్’ హామీ ముఖ్యపాత్ర పోషించింది. సబ్సిడీ రేట్లకు విద్యుత్తు ఇస్తామన్న తమ ïహామీ తమ విజయానికి ముఖ్య కారణాలలో ఒకటన్న విషయాన్ని ఆప్ కూడా మరచిపోలేదు. అందుకే గత నాలుగున్నర సంవత్సరాలలో విద్యుత్తు చార్జీలు పెరగకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమీçపిస్తున్న తరుణంలో 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ఓటర్లపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ సమ్మోహనాస్త్రం అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌కు ఓట్ల జల్లు కురిపించే అవకాశం ఉంది. చదవండి: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి. ఆప్ ప్రయోగించిన ఈ మాస్టర్ స్ట్రోక్ తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలో పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలు గత కొద్ది నెలలుగా ఫిక్స్డ్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఫిక్స్డ్ చార్జీలను 84 శాతం తగ్గించడమే కాక 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు. షీలాదీక్షిత్ సర్కారు పరాజయం వెనుక పెరిగిన విద్యుత్తు చార్జీల ప్రభావం ఉందన్నది కాదనలేని అంశం. కేజ్రీవాల్ 2013 నుంచే పెరిగిన విద్యుత్తు చార్జీలను ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఈ విషయమై ఆయన అప్పట్లో 15 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు.ఆ తరువాత బిజ్లీ హాఫ్ పానీ మాఫ్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈ హామీని అమలు చేశారు. ఇప్పుడు ఆప్ సర్కారు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసిç ³హలే హాఫ్ అబ్ మాఫ్ నినాదంతో ఓట్లు రాబట్టాలనుకుంటోంది. -
ప్రభుత్వ సొంత ప్రచారానికి ఈపీడీసీఎల్ నిధులు?
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా ఈపీడీసీఎల్ స్పాట్ బిల్లింగ్ రీడర్లు, కాంట్రాక్టర్ల పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓటర్లకు గాలం వేసేందుకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ పేరిట ప్రచారం చేస్తోంది. దీనికయ్యే ఖర్చు మొత్తం ఈపీడీసీఎల్ నిధుల నుంచి మళ్లించడంతో వీరికి జీతాలు నిలిచిపోయాయి. దీంతో ఉగాది పండగ పూట సైతం ఆనందం లేకుండా పోతోందని వాపోతున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఈ మీటర్ల నుంచి సుమారు రెండు వేల మంది స్పాట్ బిల్లింగ్ రీడర్లు విద్యుత్ రీడింగ్‌ను నమోదు చేస్తుంటారు. వీరికి ప్రతినెలా పీస్ రేటు కింద, ఈ కాంట్రాక్టర్లకు సూపర్వైజింగ్ చార్జీలు కింద ప్రతినెలా ఒకట్రెండు తేదీల్లో చెల్లింపులు చేస్తోంది. స్పాట్ బిల్లింగ్ రీడర్లకు మీటరుకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐలతో కలుపుకుని దాదాపు రూ.3, కాంట్రాక్టర్లకు రూపాయి చొప్పున ఇస్తోంది. ఇలా నెలకు రీడర్లకు రూ.కోటిన్నర, కాంట్రాక్టర్లకు రూ.55 లక్షలు వెరసి రూ.2 కోట్ల వరకు చెల్లిస్తోంది. అయితే వీరికి మార్చి నెలకు సంబంధించి చెల్లింపులు ఇప్పటివరకు చేయలేదు. ఈపీడీసీఎల్‌లో నిధుల కొరత వల్లే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, నష్టాల్లో ఉన్న ఈపీడీసీఎల్ చెల్లింపులకు అవస్థలు పడుతోంది. గత నెలలో ఒక భారీ పేమెంట్ జరగడంతో ఆ నెల చెల్లింపుల బెడద నుంచి గట్టెక్కినట్టు చెబుతున్నారు. నిధులు మళ్లించారా? రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ముఖ్యమంత్రి దీనిని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వం వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపే రేడియం స్టిక్కర్లను ముద్రించి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదార్ల ఇళ్లకు అంటించే ప్రక్రియను చేపట్టారు. ఈపీడీసీఎల్ పరిధిలో దాదాపు 10 లక్షల ఎస్సీ, ఎస్టీ కనెక్షన్లున్నాయి. వీటికయిన ఖర్చుకు ఈపీడీసీఎల్ నిధులు మళ్లించినట్టు చెబుతున్నారు. దీంతో స్పాట్ బిల్లింగ్ రీడర్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులకు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈపీడీసీఎల్ సీజీఎం (ఎక్స్పెండిచర్) జీ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా గురువారం చెల్లింపులకు అవసరమైన చర్యలు చేపట్టామని, లెటరాఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లు ఇచ్చామని, నిధులకు ఇబ్బంది లేదని తెలిపారు. అయితే దీనిని కాంట్రాక్టర్లు, స్పాట్ బిల్లింగ్ రీడర్లు ఖండిస్తున్నారు. ఇప్పటికీ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎల్వోసీలు విడుదల కాలేదని, శుక్ర, శని, ఆదివారాలు బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో సోమ, మంగళవారాల వరకు చెల్లింపుల ప్రక్రియ చేసే అవకాశం లేదని వాపోతున్నారు. -
చేనేతకు ఆ'ధార'మేదీ..?
నిర్వీర్యమైన చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చేనేత రంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన చేనేత రుణమాఫీ సక్రమంగా నేటికీ చాలామందికి అమలు చేయకపోగా చివరకు ఆప్కోకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా దగాకోరు విధానాన్ని అవలంబిస్తోంది. టీడీపీ ప్రభుత్వ తీరుతో చేనేతల పరిస్థితి దయనీయంగా మారింది. సాక్షి, చీరాల(ప్రకాశం): చేనేతల స్థితిగతులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేతల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24 వేల చేనేత కుటుంబాల వారు ఉన్నారు. చేనేత రంగంపై లక్షా అరవై వేల మంది చేనేతలు పరోక్షంగా ఆధారపడ్డారు. జిల్లాలో 70కి పైగా ఆప్కో సొసైటీలు ఉండగా ఒక్క చీరాలలోనే 50 వరకు ఈ సంఘాలు పని చేస్తున్నాయి. జిల్లాలో చేనేత వస్త్రాల ఉత్పత్తి నెలకు రూ.7 కోట్ల వరకు ఉన్నప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో మాస్టర్ వీవర్ల వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో మాస్టర్‌వీవర్ వద్ద పది నుంచి ఇరవై లక్షలు విలువ చేసే చేనేత వస్త్రాలు నిల్వ ఉన్నాయని సమాచారం. వస్త్రాల ఉత్పత్తి పెరిగిపోతుండటం, కొనుగోళ్లు లేకపోవడం, ఆప్కో చేయూత అందించకపోవడంతో మాస్టర్‌వీవర్లు తమ వద్ద పనిచేసే చేనేత కార్మికులకు పని కూడా కల్పించక పూట గడుపుకోవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాలో తయారయ్యే జరీకోట, గద్వాల్, అస్సాంపట్టు, కుప్పటం వంటి చేనేత వస్త్రాలకు రాష్ట్రంలోని విజయవాడ, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అందమైన చీరలను నేసేందుకు వినియోగించే పట్టు, జరీ తదితర నూలును ముంబాయి, సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటారు. పెట్టుబడులు పెట్టి వస్త్రాలు తయారు చేయిస్తున్నప్పటికీ కొనుగోళ్లు లేక, ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వకపోవడం, ఆప్కో మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడంతో నేతన్నల పరిస్థితి కడు దయనీయంగా మారింది. చేనేతలను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల ముడిసరుకులు, రంగు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేసి చేనేత వస్త్రాలను అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వ హామీలు బుట్ట దాఖలయ్యాయి. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన ఆప్కో కనీసం ప్రత్యేక చర్యలను, కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి సూచనలు తీసుకోకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోతూనే ఉన్నాయి. కనీస వేతన చట్టానికీ కరువే... కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. అయితే చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. చేనేత “రిజర్వేషన్’కు చెల్లుచీటి: పరిశ్రమల ధాటికి ఈ రంగం కొట్టుకుపోయి, కార్మికులు రోడ్డున పడుతారన్న ఉద్దేశంతో 22 రకాల వస్త్రాలను చేనేత రంగానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. పవర్లూమ్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం దానిని 1985లో 22 రకాలను కాస్త 11 రకాలకు కుదించింది. అయితే ఈ 11 రకాల వస్త్రాలు తయారు చేస్తే పూట గడుస్తుందని భావించిన కార్మికులు అందుకు అంగీకరించారు. చీరలు, లుంగీలు, పంచెలు, చేతిరూమాలు వంటివి తయారు చేస్తూ లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారు. అయితే ప్రస్తుతం చేనేత రిజర్వేషన్ చట్టానికి పూర్తిగా తూట్లు పడటంతో మగ్గాలు మూలనపడుతున్నాయి. చేనేత రంగానికి కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లను మరమగ్గాలపైనే తయారవుతున్నాయి. చేనేత వస్త్రాల మాటున జరుగుతున్న ఈ అక్రమ దందాను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఊహల్లోనే..ఉచిత విద్యుత్ హామీ టీడీపీ ప్రభత్వుం ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ అమలైతే ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు 100 యూనిట్లలోపు బిల్లు రూ.300 మినహాయింపు కలుగుతుంది. గృహ అవసరాలు, చేనేతలకు ఒకే శ్లాబు అమలులో ఉండగా వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తుల వారికి మరొక శ్లాబు ప్రకారం రేట్లను విద్యుత్‌శాఖ నిర్ణయించింది. అయితే జిల్లాలో కేవలం 7500 కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యుత్ అర్హులుగా చేసేలా చేనేతశాఖ అధికారులు సర్వే పూర్తిచేసి నివేదికలను ప్రభుత్వానికి అందించారు. కానీ పథకం మాత్రం అమలుకాకపోవడంపై నేతన్నలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చెయ్యిచ్చిన బాబు..చేయూత నిచ్చిన మహానేత వైఎస్ఆర్ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న చేనేత రంగానికి 9 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు చేయూతనివ్వకపోగా చేతివృత్తులకు కాలం చెల్లిందని, ఆ వృత్తిని వదలి మరమగ్గాలవైపు వెళ్లండని ఉచిత సలహా ఒకటి పడేశారు. రాష్ట్రంలో ఉన్న నూలు మిల్లులు అన్నీ మూసివేశారు. కార్మికులకు ఉపాధి దెబ్బతినడంతో పాటు, చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి నూలు కొనుగోలు చేయాల్సిరావడం ప్రస్తుతం పెను భారంగా మారింది. చంద్రబాబు పాలనలో వందల సంఖ్యలో చేనేత ఆత్మహత్యలు జరిగాయంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏస్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అదే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత రంగానికి చేయూతనిచ్చారు. రైతులకు మాదిరిగా చేనేతలకు రూ.312 కోట్లు రుణమాఫీ చేశారు. అప్పటి వరకు చిలపనూలుపై ఉన్న 9.25 ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి కార్మికులపై భారాన్ని తగ్గించారు. రంగు, రసాయనాలు, చిలపనూలుపై 10 శాతం సబ్సిడీ అవకాశం కల్పించారు. ఏరాష్ట్రంలో లేని విధంగా చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పించారు. బలహీనంగా ఉన్న ఆప్కోకు నిధులు కేటాయించి పటిష్టపరిచారు. ఇదిలా ఉంటే మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పాలించిన కిరణ్ చేనేతలకు ప్రత్యేక పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకుండానే పదవి నుంచి దిగివెళ్లారు. రుణాలకు మొండికేస్తున్న బ్యాంకర్లు చేనేతలకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. చీరాల ప్రాంతంలో కార్మికులకు ప్రభుత్వం ఎనిమిది వందల మందికి పైగా అర్టిజన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేసింది. కానీ వాటి ద్వారా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదు. వ్యక్తిగత రుణాలు తిరిగి చెల్లించరనే ఉద్దేశంతో బ్యాంకర్లు కార్మికులకు రుణాలు ఇవ్వడంలేదు. ఈ కార్డుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం నాలుగు శాతం రాయితీ ఇస్తుంది. బ్యాంకర్ల మొండి వైఖరి కారణంగా చేనేత రుణాలు అందని ద్రాక్షపండులా మారాయి. చేనేతలను ఆదుకోవాలి జిల్లాలో రోజురోజుకూ పేరుకుపోతున్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయల చేనేత వస్త్రాల నిల్వలను దశల వారీగానైనా ఆప్కో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే నేతన్నల అభివృద్ధి. - పడవల లక్ష్మణస్వామి, చేనేత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అదనం కలిపినా నాలుగు గంటలే!
సాక్షి, అమరావతి: వ్యవసాయదారులకు అందించే ఉచిత విద్యుత్‌ను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఎలా సమకూరుస్తారనే ప్రణాళిక లేకుండా ఎన్నికలకు ముందు హడావుడి ప్రచారానికి దిగటాన్ని విద్యుత్ వర్గాలే విమర్శిస్తున్నాయి. టీడీపీ సర్కారు దీన్ని కేవలం ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంటున్నారు. తొమ్మిది గంటల పాటు సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్తు ఎంత? ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది? తదితర విషయాలను ప్రభుత్వం ఎక్కడా వివరించలేదని గుర్తు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రైతులకు రోజూ ఏడు గంటల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సర్కార్ చెబుతున్నా వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే సగం సమయం కూడా సరఫరా చేయడం లేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు అదనంగా ఇస్తామంటున్న కరెంట్‌ను కలిపినా కూడా ఉచిత విద్యుత్తు సరఫరా నాలుగు గంటలకు మించదని భావిస్తున్నారు. ప్రణాళిక లేకుండా ప్రకటనలు.. వ్యవసాయ విద్యుత్ ఖర్చంతా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు అందచేయాలి. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ఇటీవల సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఏఆర్ఆర్) ప్రకారం 2019–20లో కనీసం రూ. 8 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు డిస్కమ్‌లు పేర్కొన్నాయి. వ్యవసాయ సబ్సిడీనే రూ. 7 వేల కోట్లకుపైగా ఉంది. ఈ మొత్తంలో ప్రభుత్వం ఎంత ఇస్తుందో లెక్క తేల్చలేదు. 2019–20లో రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా కమిషన్ ఆమోదం కోసం పంపలేదు. ఇవేవీ పట్టించుకోకుండా నోటిమాటగా 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇస్తోంది మూడున్నర గంటలే.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో పంపుసెట్ (5 హెచ్‌పీ) గంట పాటు పనిచేస్తే 5 యూనిట్ల చొప్పున విద్యుత్ ఖర్చవుతుంది. ప్రభుత్వం ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు చెబుతోంది. అంటే రోజుకు ఒక్కో పంపుసెట్‌కు 35 యూనిట్లు విద్యుత్ ఖర్చవుతుంది. ఈ లెక్కన 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 59 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ 10,831.44 మిలియన్ యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే రోజుకు కేవలం 29.67 మిలియన్ యూనిట్లే ఇస్తోందన్నమాట. ఒక్కో పంపుసెట్ ఏడు గంటల పాటు పనిచేసేందుకు రోజుకు 35 యూనిట్లు అవసరం కాగా ప్రభుత్వం ఇచ్చేది 17 యూనిట్లు మాత్రమే. అంటే గంటకు ఒక్కో పంపుసెట్‌కు 5 యూనిట్ల చొప్పున లెక్కేస్తే కేవలం మూడున్నర గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. కానీ రోజుకు ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నాలుగున్నరేళ్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అదనపు విద్యుత్తు కలిపినా నాలుగు గంటలే! రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలంటూ ఒక్కో పంపుసెట్‌కు రోజుకు 45 యూనిట్ల చొప్పున విద్యుత్ ఇవ్వాలి. అంటే 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 76 మిలియన్ యూనిట్లు అందించాలి. ఈ లెక్కన ఏడాదికి 27,922.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా ఇస్తున్న 10,831.44 మిలియన్ యూనిట్లతో పాటు మరో 1,200 మిలియన్ యూనిట్లు మాత్రమే అదనంగా సరఫరా చేస్తానంటోంది. దీంతో మొత్తం కలిపినా ఉచిత విద్యుత్‌కు ఇచ్చేది 12,031.44 మిలియన్ యూనిట్లు మాత్రమేనని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో పెంచే విద్యుత్‌ను కలిపినా రోజుకు నాలుగు గంటల పాటు కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవ విద్యుత్ వినియోగం, ప్రభుత్వం ఇస్తామనే అదనపు విద్యుత్ సరఫరాకు మధ్య 15,831.06 మిలియన్ యూనిట్ల తేడా ఉంది. ఇంత తేడా ఉంటే 9 గంటల సాగుకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విద్యుత్ వర్గాలే విమర్శిస్తున్నాయి. -
ఉచితం.. గగనం!
ముద్దనూరు మండలానికి చెందిన బాలవెంకటన్న కొత్తగా బోరు తవ్వించుకున్నాడు. ఏడాది కిందట వ్యవసాయ ఉచిత విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్‌శాఖ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బోరు బావిలో నీరుండి పంటలు పండించుకోలేని స్థితిలో ఉన్నానని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఈ పరిస్థితి ఒక్క బాలవెంకటన్నదే కాదు.. వ్యవసాయ సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సర కాలంగా వేచి చూస్తున్న రైతులు జిల్లాలో ఎందరో ఉన్నారు. కడప అగ్రికల్చర్: రైతులకు మేం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదని పదే పదే వేదికలెక్కి సీఎం, వ్యవసాయ, విద్యుత్‌శాఖామంత్రి చెబుతున్నారు.అయితే క్షేత్రస్థాయిలో పథకాలు సరిగా అందడంలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయంతో ప్రవేశపెట్టి రైతుల కళ్లలో వెలుగు నింపారు. అలాంటి పథకానికి టీడీపీ ప్రభుత్వం మంగళం పాడేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతుల దరఖాస్తులకు మాత్రమే ఈ ఏడాది కనెక్షన్లు ఇస్తున్నారు.అదే ఏడాదిలో దరఖాస్తులు చేసుకున్న ఇతర వర్గాల రైతులకు ఎప్పుడు కనెక్షన్లు ఇస్తారని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 11,044 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్‌ప్లాన్‌లో 7,223 సర్వీసులకు కనెక్షన్లు ఇచ్చారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 3,821 పెండింగ్‌లో ఉన్నాయి. పెరిగిన విద్యుత్ వినియోగం జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉన్న ఉద్యాన పంటల సాగు నేటికి 1.10 లక్షల ఎకరాలకు చేరుకుంది. పండ్లతోటలు, కూరగాయల సాగు పెరిగింది. బోరుబావుల కింద వ్యవసాయ పంటల సాగు కూడా పెరుగుతోంది. గతంలో జిల్లాలో వ్యవసాయానికిగాను 80 వేల ట్రాన్స్ఫార్మర్లు ఉండగా వీటి కింద 95,674 కనెక్షన్లు ఉండేవి.వీటి పరిధిలో రోజుకు 8.15 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండేది. ఇప్పుడు జిల్లాలో మొత్తం 97 వేల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1,53,443 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి గాను రోజుకు 11.17 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటోంది. దాదాపు రోజు జిల్లాకు సరఫరా చేసే దాంట్లో 38 శాతం వ్యవసాయానికి గతంలో అవసరం ఉండేది. ఇప్పుడు పెరిగిన సాగు విస్తీర్ణం దృష్ట్యా వినియోగం 43 శాతానికి చేరుకుంది. అంటే ఒక రోజుకు 4.3 మిలియన్ యూనిట్లు పైబడి అవసరమవుతోంది. ఇంత మొత్తంలో సరఫరా చేయడం కష్టం గా ఉందని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. 3821 వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్ జిల్లాలో ఆరు విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో కొత్త సర్వీసుల కోసం 11,044 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 7223 దరఖాస్తులకు అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 3821 దరఖాస్తులకు ఇవ్వాల్సి ఉంది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం నేపథ్యంలో కనెక్షన్లు ఇవ్వకపోతే నీరుండి పంటలు పండించుకోలేకపోతున్నామని దరఖాస్తుదారులు పలుసార్లు అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నిధుల కొరత వేదిస్తున్నట్లు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ పోయిందని, కనీసం రబీ సీజన్లోనైనా కనెక్షన్లు ఇస్తే నగదు పంటలు పండించుకుంటామని అన్నదాతలు అంటున్నారు. నిధుల కొరతే ప్రధాన కారణం.. ఒక సర్వీసు ఇవ్వాలంటే 3 స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, 180 మీటర్లు వైర్లు, ఇతర సామగ్రి కలిపి రూ. 80 వేలు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉచిత విద్యుత్ నేపథ్యంలో ఈ ఖర్చును విద్యుత్‌శాఖ భరిస్తోంది. ఈ లెక్కన 11,044 కనెక్షన్లు ఇవ్వాలంటే రూ.88.35 కోట్లు పైగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇంత మొత్తం భరించడం డిస్కంకు తలకు మించిన భారం అవుతోంది. ప్రభుత్వం విద్యుత్ సంస్థకు గతంలో ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇవ్వకపోవడంతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. నిధులు ఇస్తేనే పెండింగ్ కనెక్షన్లకు మోక్షం కలుగుతుంది. ప్రభుత్వం ఇవ్వకపోతే ఇప్పట్లో ఇచ్చే సమస్యలేదని విద్యుత్‌శాఖ అ«ధికారులు రైతుల వద్ద తెగేసి చెబుతున్నారు. ఉచిత విద్యుత్ మంగళానికి రంగం సిద్ధం జిల్లాలో వ్యవసాయానికి ఉచిత çసర్వీసులకు సంబంధించి కడప డివిజన్లో 9,800 సర్వీసులు, పులివెందుల డివిజన్లో 22,985 సర్వీసులు, ప్రొద్దుటూరు డివిజన్లో 20,450 సర్వీసులు, మైదుకూరు డివిజన్లో 37879 సర్వీసులు, రాజంపేట డివిజన్లో 36348 సర్వీసులు, రాయచోటి డివిజ న్ 25981 సర్వీసులున్నాయి. 2004లో ఈ సర్వీసులన్నింటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పధకాన్ని అందించారు. అప్పటి నుంచి ఇప్పటì వరకు సర్వీసు చార్జీల కింద ఒక్కో సర్వీసుకు రూ.40లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్వీసులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందని, దీన్ని భరించడం సాధ్యం కాదని తెలుగుదేశం ప్రభుత్వం మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రైతులకు ఎంత మేలు చేసినా తక్కువేనని, రైతులేనిది రాజ్యం లేదని, మా పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను మరింత సరళతరం చేస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల సభల్లో చెప్పారని, ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉచిత విద్యుత్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
ఉచిత విద్యుత్ సరికాదు..
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ లాంటి హామీల కంటే నిరంతర విద్యుత్ ఇవ్వడం ప్రయోజనకరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) సంస్థ హైదరాబాద్‌లో ‘క్లీన్ అండ్ సేఫ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్’ అంశంపై తలపెట్టిన మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సును వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర విద్యుదుత్పత్తిపై కాకుండా, ఉచిత విద్యుత్ మీద దృష్టి పెడుతున్నాయని, అది మంచిది కాదన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌తోనే ప్రజలకు మేలు అని వెంకయ్య అన్నారు. అభివృద్ధికి విద్యుత్ అవసరం దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోం దని వెంకయ్య తెలిపారు. వేగంగా సాగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దృష్ట్యా స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు, సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, అంతర్జాతీయ సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అణుశక్తిని పెంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ఖర్చుతో లభించే అణుశక్తిని సమర్థమైన శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అణుశక్తి కర్మాగారాలు చౌకగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కూడంకులం అణువిద్యుత్ యూనిట్–1 ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ ధర యూనిట్‌కి రూ.3 ఉంటుందని తెలిపారు. భారత్‌లో అణుశక్తి అభివృద్ధిలో డాక్టర్ హోమి జే బాబా కృషి ఎంతో ఉందన్నారు. ఆయన నిర్దేశించిన విధానంలో దేశం బలమైన 3 దశల అణు విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన పురోగతి సాధించిందని, తక్కువ ధర లో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్.. ప్రస్తుతం దేశంలో స్వచ్ఛభారత్ ప్రభుత్వ కార్యక్రమం స్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మారిందని వెంకయ్య చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహనను పెంపొందిచడంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన భారత్ ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలంలో మనమంతా ప్రకృతితో ఆడుకున్నామని, ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు ఆర్.చిదంబరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శిశిర్ కుమార్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యలకు రుణమాఫీ పరిష్కారం కాదు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ, ఉచిత విద్యుత్ రైతు ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారాలు కావని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని, ప్రస్తుతం అమలు చేస్తున్నవి తాత్కాలిక ఉపశమనాలేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయంచేస్తూ పాడి పశువులు, నాటు కోళ్లు పెంచే రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదన్నారు. మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలో (సీఆర్ఐడీఏ)లో తెలంగాణ, అనుబంధ ప్రాంతాలలో రైతుల ఆదాయం రెట్టింపుపై సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ఎన్నో పథకాలు తీసుకువచ్చారన్నారు. ఏటా రూ.11 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదిస్తుందని, అయితే సకాలంలో రుణాలు అందడం లేదన్నారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీరు, మేలైన విత్తనాలు ఇస్తేనే రైతుకు భరోసా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎస్ఆర్ఎం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అలసుందరం, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
24 గంటల విద్యుత్‌కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి.. రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాపై నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు చేసిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ అందించేలా విద్యుత్ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. మొత్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో తెలంగాణ దేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించబోతోంది. డిమాండ్‌కు తగినట్లుగా.. ప్రయోగాత్మక సరఫరా సమయంలో 24 గంటల కరెంటుపై విద్యుత్ సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. ఒక దశలో రోజువారీ డిమాండ్ 9,500 మెగావాట్ల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వ్యవసాయంతో పాటు ఇతర వర్గాలకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ డిమాండ్ అంచనాలను సిద్ధం చేశాయి. డిమాండ్ 11 వేల మెగావాట్ల వరకు చేరే అవకాశముందని నిర్ధారించుకుని.. అందుకు తగినట్లుగా రూ. 12,610 కోట్ల వ్యయంతో సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంపు పనులు చేపట్టాయి. జూన్ నుంచి ఎత్తిపోతలకు కూడా.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే గడువు సమీపించడంతో జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు గురువారం హైదరాబాద్‌లో ఈ అంశంపై సమీక్షించారు. సాగుకు 24 గంటల కరెంటుతో విద్యుత్ సరఫరా గ్రిడ్‌పై ఒత్తిడి క్రమంగా పెరుగుతుందని.. మార్చి నాటికి డిమాండ్ 11 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వేశారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని.. పంపిణీ, సరఫరా వ్యవస్థలు సక్రమంగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ నుంచి ఎత్తిపోతల పథకాలు కూడా ప్రారంభమవుతుండడంతో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరుగుతుందని చెప్పారు. అందుకు తగినట్లుగా వ్యూహం తయారు చేసుకోవాలని ఆదేశించారు. కరెంటు గోస తీరడం సంతోషకరం: కేసీఆర్ దశాబ్దాల తరబడి రైతులు అనుభవిం చిన కరెంట్ గోస తీరుతుండడం సంతోషకర మని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులకు మేలు చేయడంకన్నా తృప్తి మరొకటి ఉండదన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ కష్టాలు కొనసాగడం అర్థ రహితమని భావించాం. విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్య మిచ్చాం. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడాన్ని గొప్ప అవకా శంగా భావిస్తున్నాం. రైతులతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ నిర్ణయానికి అను గుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పని చేశారు. ఫలితంగానే అన్ని వర్గాలకు నాణ్యమైన నిరంతరా య విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించు కున్నాం. విద్యు త్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు తరలివస్తాయి. పారిశ్రామికాభివృద్ధి సాధ్యం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుంది. విద్యుత్‌తోనే అభివృద్ధి, మెరుగైన జీవితం ఆధారపడి ఉంది. ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ కరెంట్ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మారింది..’’అని పేర్కొన్నారు. -
వచ్చే రబీ నుంచి సాగుకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. 2018 రబీ సీజన్ నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వనున్నట్లు తెలిపారు. సరఫరాలో ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ప్రయోగాత్మకంగా నిరవధికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. సోమవారం శాసనమండలిలో విద్యుత్‌పై జరిగిన చర్చలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. వ్యవసాయానికి నిరంతరం కరెంటు సరఫరా వల్ల ఇబ్బందులు ఉంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ.. వ్యవసాయంతో పాటు అన్ని రకాల అవసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతులను టీడీపీ ప్రభుత్వం జైల్లో పెట్టిందని, వైఎస్ రూ.1,200 కోట్ల బకాయిలను రద్దు చేశారని చెప్పారు. ప్రస్తుతం 14,133 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి సామర్థ్యముందని, 2024 వరకు దీన్ని 27,158 మెగావాట్లకు పెంచనున్నట్లు తెలిపారు. -
ప్రీ పెయిడ్ విద్యుత్ ‘సౌభాగ్య’o!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సదుపాయం లేని గృహాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకం కింద ఉచిత విద్యుత్ కనెక్షన్లు జారీ చేయడంతోపాటు ప్రీ పెయిడ్/స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో తొలిసారిగా గృహాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రతి నెల ముందస్తుగా బిల్లులు చెల్లించి విద్యుత్ వినియోగించుకునే కొత్త విధానం అమల్లోకి రానుంది. సౌభాగ్య పథకానికి సంబంధించి తాజాగా రాష్ట్రాలకు పంపిన ప్రాథమిక విధివిధానాల్లో కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విద్యుత్ సదుపాయం లేని గృహాలకు ఈ పథకం కింద 2019 మార్చి 31లోగా ఉచిత కనెక్షన్లు జారీ చేయాలని రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు గడువు సైతం నిర్దేశించింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం గ్రాంట్‌గా ఇవ్వనుండగా, కనీసం 10 శాతాన్ని రాష్ట్రాల డిస్కంలు, మిగిలిన 30 శాతం వరకు వ్యయాన్ని డిస్కంలు రుణాలు సమీకరించి ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంటుంది. 2018 డిసెంబర్‌లోగా 100 శాతం గృహాలకు విద్యుత్ కనెక్షన్లు జారీ చేసిన రాష్ట్రాలకు కేంద్రం అదనంగా మరో 15 శాతం గ్రాంట్ అందించనుంది. ఈ అదనపు గ్రాంట్‌కు అర్హత సాధించిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి 75 శాతం గ్రాంట్లు రానుండటంతో ప్రాజెక్టు అమలుకు మొత్తం వ్యయంలో 15 శాతం రుణాలు తీసుకుంటే సరిపోనుంది. ఈ మేరకు సౌభాగ్య పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాల డిస్కంలకు పంపింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు లేవని కేంద్రం అంచనా వేసింది. వాటికి కనెక్షన్లు జారీ చేసేందుకు రూ.16,320 కోట్ల వ్యయం కానుండగా, రాష్ట్రాలకు రూ.12,320 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. కేంద్రం సూచనలివీ.. - సౌభాగ్య పథకం కింద ఉచిత విద్యుత్ కనెక్షన్‌కు అర్హత సాధించని గృహాలకు కేవలం రూ.500 రుసుముతో కనెక్షన్లు జారీ చేయాలి. మిగిలిన వ్యయాన్ని నెలవారీ విద్యుత్ బిల్లుతో కలిపి 10 వాయిదాల్లో వసూలు చేయాలి. - బిల్లులు చెల్లించక విద్యుత్ కనెక్షన్లు కోల్పోయిన ఎగవేతదారులకు సౌభాగ్య పథకం కింద ఉచిత కనెక్షన్లు జారీ చేయరాదు. - గ్రామ పంచాయతీలు, ఇతర ప్రభుత్వ సం స్థల ద్వారా విద్యుత్ కనెక్షన్ల జారీకి దరఖాస్తుల స్వీకరణ, విద్యుత్ బిల్లుల పంపిణీ, బిల్లుల వసూళ్లు జరపాలి. - వినియోగదారులకు సంబంధించిన ఆధార్ నంబర్/మొబైల్ నంబర్/బ్యాంక్ ఖాతా నంబర్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ ఐడీ తదితర వివరాలను దరఖాస్తుతోపాటు సేకరించాలి. - విద్యుత్ సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతా ల్లోని గృహాలకు సౌర విద్యుత్ ఫలకాలు బిగించడం ద్వారా విద్యుత్ అందించాలి. ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ నిల్వ కోసం 200–300 వాట్స్ బ్యాటరీతోపాటు ఇంటికి 5 ఎల్ఈడీ దీపాలు, ఒక ఫ్యాన్, ఒక పవర్ ప్లగ్‌ను ఉచితంగా ఇవ్వాలి. ఇళ్లకు ఏర్పాటు చేసే సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లపాటు మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది. -
మీరా.. రైతుల గురించి మాట్లాడేది?
⇒ ఉత్తమ్, జానాలపై మంత్రి హరీశ్ ధ్వజం ♦ మీ పాలనలో గోస పెట్టినందుకు ధర్నాలు చేస్తున్నారా? ♦ మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు సాక్షి, నల్లగొండ: రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురు వారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియో జకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రు లు జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డిలు దేనికోసం ధర్నాలు చేస్తున్నా రని ప్రశ్నించారు.‘‘కాంగ్రెస్ హయాంలో ఎరువులు ఇవ్వక రైతులను గోస పెట్టారనా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేనందుకు ధర్నా చేస్తారా? మీ హయాంలో విత్తనాలు దొరకక పోలీసు స్టేషన్ల ముందు రైతులు నిలబడినందుకా..? లేక చాలీచాలని, రాత్రిపూట కరెంట్ ఇచ్చినందుకు, మోటార్లు, స్టార్టర్లు కాలలేదని ధర్నా చేస్తారా? అని నిలదీశారు. యాసంగిలో ప్రతి గింజా కొనుగోలు యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజా కొనుగోలు చేసి రూ.6,500 కోట్లు ఇచ్చామ న్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో లోలెవల్ కెనాల్, మహ బూబ్‌నగర్‌లో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కరీంనగర్లో ఎల్లపల్లి, ఖమ్మంలో భక్తరామదాసు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నీళ్లిచ్చామన్నా రు. వచ్చే ఏడాది నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. డిండితో సస్యశ్యామలం డిండి ఎత్తిపోతల కింద నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాలను సస్య శ్యామలం చేసేందుకు రూ.6 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని హరీశ్ అన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2తో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కాళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేస్తామన్నారు. గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్లు నిర్మించి భువన గిరి, ఆలేరు నియోజకవర్గాల భూములకు నీళ్లిస్తామని చెప్పారు. ఉత్తమ్ పిట్టల దొర: జగదీశ్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిట్టల దొరలా అబద్ధాలు మాట్లాడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో సబ్స్టేషన్ల నిర్మాణం చేశామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సంక్షోభంలో ఉన్నారని, రైతులు సంక్షోభంలో ఉన్నట్లు మాట్లాడుతు న్నారన్నారు. -
‘తొలి’ వెలుగు
ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకానికి 13 ఏళ్లు పూర్తి - సాగుకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు మాఫీ - దశాబ్దం దాటినా జనం మదిలో చెక్కుచెదరని చరిత్రాత్మక సంతకం - ‘ఉచితం’తో ఏపీ, తెలంగాణలో 43 లక్షల మంది రైతులకు లబ్ధి ‘తొలి సంతకం’ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఉచిత విద్యుత్ ఫైల్‌పై ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన సంతకమే. విద్యుత్ బిల్లుల భారంతో వెన్ను విరుగుతున్న రైతన్నకు ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ ప్రజల సాక్షిగా మహానేత చేసిన చరిత్రాత్మక సంతకానికి 13 ఏళ్లు నిండాయి. సంతకం చేసి దశాబ్దం దాటినా జనం మదిలో ని ఆ జ్ఞాపకం చెక్కుచెదరలేదు. ఉచిత విద్యుత్ తో రైతన్న పచ్చగా ఉండాలని రాజన్న సంక ల్పించారు. ఆ సంకల్పం గొప్పది కాబట్టే ఉమ్మ డి రాష్ట్రంలో ప్రారంభమైన ఉచిత విద్యుత్ పథకం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ నిర్వి ఘ్నంగా సాగుతోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోయినా వైఎస్ ఒప్పించారు. – సాక్షి, అమరావతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 మే 14వ తేదీన హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. దీంతోపాటు 2004 మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో రైతుల విద్యుత్ చార్జీల బకాయిలు రూ.1,259 కోట్లను మాఫీ చేస్తూ మరో సంతకం పెట్టారు. అన్నదాతలకు విద్యుత్ చార్జీల భారం నుంచి విముక్తి కలిగించారు. సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి బతుకుపై భరోసా కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ పాలనలో 2009 నాటికి 30 లక్షల మంది రైతులు ఉచిత్ విద్యుత్‌తో ప్రయోజనం పొందారు. ప్రస్తుతం 13 జిల్లాల ఏపీలో 16 లక్షలు, తెలంగాణలో 27 లక్షల మంది అన్నదాతలు ఉచిత్ విద్యుత్‌ను పొందుతు న్నారు. అంటే వైఎస్ కృషితో 43 లక్షల మంది రైతులకు కరెంటు ఉచితంగా అందుతోంది. బాబు హయాంలో రైతులపై రాక్షసత్వం 2004 మే నెల ముందువరకు తొమ్మిదేళ్ల చంద్ర బాబు పాలనలో రైతులు అన్ని విధాలా చితికి పోయారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా సక్రమంగా లేక, విద్యుత్ చార్జీల భారం భరించలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకు న్నారు. అయినా చంద్రబాబు రైతుల పట్ల రాక్షసంగా వ్యవహరించారు. విద్యుత్ చార్జీల ను చెల్లించని రైతుల మోటార్లు, స్టార్టర్లను నిర్దాక్షిణ్యంగా లాక్కుపోయారు. అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులను జైళ్లలో పెట్టారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ఆందోళన చేసిన వారిపై హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించారు. అన్నదాతల ప్రాణాలను బలితీ సుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబు పాలనలో రైతులు జీవచ్ఛవాలుగా మారారు. ఈ దుస్థితిని చూసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తల్లడిల్లిపోయారు. తాము అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని, రైతుల విద్యుత్ చార్జీల బకాయిల న్నీ బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేశారు. హామీని అమలు చేసి చూపించారు. రైతుల గుండెల్లో నిలిచిపోయారు. ‘ఉచితం’తో అదనంగా 70 లక్షల ఎకరాలు సాగు వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌తోపాటు రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేని రైతుపై చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి పెట్టిన 1.10 లక్షల విద్యుత్ చౌర్యం కేసులను వైఎస్ ఎత్తివేశారు. వ్యవసాయ విద్యుత్‌కు అప్పటివరకూ ఉన్న రూ.2 వేల కోట్ల సబ్సిడీని రూ.7 వేల కోట్లకు పెంచారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి లేకున్నా, బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు మండిపోతున్నా రైతన్న కోసం కొనుగోలు చేయడానికి ఏనాడూ వెనుకడుగు వేయలేదు. వైఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 124 మిలియన్ యూనిట్లు మాత్రమే. వైఎస్ పాలనలో సాగుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల వినియోగం రోజుకు 195 మిలియన్ యూనిట్లకు పెరిగింది. 2004 నాటికి 23.5 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2009 నాటికి 26.5 లక్షలు దాటాయి. అనధికారంగా మరో 3.5 లక్షలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరు తత్కాల్ కింద ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చని వైఎస్ ప్రభుత్వం భరోసానిచ్చింది. ఉచిత విద్యుత్ కారణంగా బోర్లు, బావుల కింద అదనంగా 70 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. చంద్రబాబు ఐదు సంతకాలు మహానేత వైఎస్ చేసిన తొలి సంతకానికి 13 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎంచంద్రబాబు చేసిన తొలి సంతకాల అమలు తీరును ప్రజలు చర్చించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే రైతు రుణాల మాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ, మద్యం బెల్టు దుకాణాల రద్దు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు, ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల ‘ఎన్టీఆర్ సుజల’ నీరు అనే ఐదు హామీలను నెరవేరుస్తానంటూ ఐదు సంతకాలు చేశారు. ► చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, వడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ కింద కేవలం రూ.11,413 కోట్లు విడుదల చేశారు. రుణమాఫీకి లెక్కలేనన్ని షరతులు విధించారు. ► 2014 మార్చి నెలాఖరు నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉండగా, అందులో ఇప్పటిదాకా ఒక్క పైసా రుణాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు నుంచే డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం అమలు ఉండేది. ఈ పథకానికి టీడీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో డ్వాక్రా మహిళలు వడ్డీ డబ్బులను సైతం వారే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్వాక్రా సంఘాలపై వడ్డీ రూపంలో దాదాపు రూ.1,740 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా. ► చంద్రబాబు సంతకాన్ని వెక్కిరిస్తూ రాష్ట్రంలో మద్యం బెల్టుషాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారికంగా 4,380 మద్యం దుకాణాలుండగా, ఒక్కో దుకాణానికి అనుబంధంగా పది బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. ► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ పెంపును వర్తింపజేయలేదు. ► ‘ఎన్టీఆర్ సుజల’ పథకాన్ని 2014 అక్టోబరు 2న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దీనికి నిధులను విడుదల చేయకపోవడంతో సురక్షితమైన తాగునీరు అందడం లేదు. అమలవుతున్న వైఎస్ పథకాలు రైతుల రుణాలు మాఫీ, ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్‌లు, విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్మెంట్, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, అడిగిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు భూపంపిణీ, జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంటలకు గిట్టుబాటు ధరలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పథకాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ ప్రవేశపెట్టిన వినూత్నమైన పథకాలను ఇప్పటి ప్రభుత్వాలు కూడా కొనసాగించక తప్పని పరిస్థితి ఉందంటే ఆయన దార్శనికతను అర్థం చేసుకోవచ్చు. ఆయా పథకాల పేర్లను మారుస్తున్నప్పటికీ అందులో వైఎస్ సంకల్పమే కనిపిస్తోంది. -
ఉచిత విద్యుత్‌కు ఇలా కత్తెరేస్తున్నాం
ప్రపంచ బ్యాంకుకు నివేదించిన విద్యుత్ సంస్థలు సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌కు కత్తెరేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు ప్రపంచబ్యాంక్‌కు వివరించారు. ఈ ప్రక్రియలో ఇప్పటికే వేగం పెంచామని, త్వరలోనే లక్ష్యాలను చేరుకుంటామని కూడా పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ను ఎలా కట్టడి చేస్తున్నది వివరిస్తూ ఓ నివేదిక ఇచ్చారు. తమ పురోగతిని చూసి వీలైనంత త్వరగా రుణం మంజూరు చేయాలని ప్రాధేయపడ్డారు. ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు మణికురానా, అతుల్‌తో గురువారం ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ప్రాజెక్ట్స్ డెరైక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంధనశాఖ సలహా దారు రంగనాథం భేటీ అయ్యా రు. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం గతంలో వరల్డ్ బ్యాంక్ సుమారు రూ. 2,600 కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 2014 నుంచి ఈ రుణం మంజూరు కోసం ప్రపంచబ్యాంక్ సవాలక్ష షరతులు విధిస్తూ వస్తోంది. విద్యుత్ నష్టాలను తగ్గించాలని, ఉచిత విద్యుత్ పంపిణీని దశలవారీగా తగ్గించాలని ప్రపంచబ్యాంక్ షరతులు పెడుతోంది. 10 లక్షల స్మార్ట్ మీటర్లు మీటర్ రీడింగ్‌ను ఇళ్ల వద్దకు వెళ్లి తీసుకునే పద్ధతికి స్వస్తి చెబుతున్నామని, ఇందులో భాగంగా 10 లక్షల స్మార్ట్ మీటర్లు అమరుస్తామని ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు వివరించారు. దీనికి రుణం ఇవ్వాలని కోరారు. నెలకు 500 యూనిట్లు వాడే వినియోగదారులకు తొలుత ఈ విధానాన్ని వర్తింపజేయమని, తద్వారా వాణిజ్య విద్యుత్ ట్యాంపరింగ్‌ను అరికడతామని వివరించారు. అదే విధంగా సూపర్ వైజర్ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ విధానాన్ని గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో అమలు చేస్తామని, దీనిద్వారా విద్యుత్ వాడకాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, వీటన్నింటికీ రుణం ఇవ్వాలని కోరారు. రూ. 2600 కోట్లు ప్రపంచబ్యాంక్ రుణంగా ఇస్తే, మిగిలిన రూ. 1050 కోట్లు తాము భరిస్తామని తెలిపారు. రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ షరతులన్నీ దాదాపు అంగీకరించేందుకు రాష్ట్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. రైతులకు ఉచిత విద్యుత్‌పై వేటు! ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే.. రాష్ట్రంలో 15.8 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. అత్యధిక విద్యుత్ సరఫరా పథకం (హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) అమలుకు ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రెండు కన్నా ఎక్కువ వ్యవసాయ మోటార్లు లేకుండా కట్టడి చేయడం ఈ పథకం ఉద్దేశం. దీంతో పాటు 50 వేల పంపుసెట్లను ఇంధన సామర్థ్యం ఉన్న వాటితో మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వీటికి మీటర్లు బిగించే యోచనలో ఉన్నారు. ఇదే జరిగితే ఉచిత విద్యుత్‌కు పరిమితి విధించే వీలుంది. -
చీకటి సాగు
అర్ధరాత్రి వేళ సరఫరాతో ప్రమాదకర స్థితిలో రైతుల పాట్లు విజయవాడ : వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ హామీని గాల్లో కలిపేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌నూ సక్రమంగా ఇవ్వటం లేదు. దీంతో రైతుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. జిల్లాలో అసలే సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది నవంబర్ ఐదు నాటికి విడుదల కావాల్సిన సాగునీరు నేటికీ విడుదల కాలేదు. దీంతో తూర్పు క ృష్ణాలో ఇప్పటికే సాగునీటి ఎద్దడి తీవ్రమైంది. జిల్లాలో ఎక్కువ శాతం సాగుకు బోర్లే ఆధారం. పశ్చిమ కృష్ణాలో మామిడితో పాటు ఇతర పంటలు బోరు నీటితోనే సాగవుతున్నాయి. విద్యుత్ సరఫరాలో గ్రామాల వారీగా రొటేషన్ పద్ధతి అమలు చేస్తున్నారు. దీంతో అర్ధరాత్రి వేళ ప్రమాదకర పరిస్థితుల్లో అన్నదాతలు పొలాల్లో పడిగాపులు పడుతున్నారు. రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా వారి దయనీయ స్థితి వెలుగుచూసింది. -
వాటర్ ప్లాంట్లకు ఉచిత విద్యుత్
లాభాపేక్ష లేని వాటికే: కేసీఆర్ ♦ వితంతువులకు కార్పొరేషన్! ♦ సేంద్రియ సాగుపైనా త్వరలో నిర్ణయం ♦ ప్రజలను సంఘటితం చేస్తున్న బాలవికాసకు సహకారం ♦ బాలవికాస రజతోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ♦ బంగ్లాదేశ్ యూనస్ స్ఫూర్తి గాథ చెప్పిన ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: లాభాపేక్ష లేకుండా నడిచే వాటర్ ప్లాంట్లకు ఉచిత విద్యుత్, వితంతువులకు ఆర్థిక చేయూత అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వీటిపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వితంతువులకు కార్పొరేషన్, సేంద్రియ సాగుకు మద్దతు, గుడుంబా నియంత్రణకు చర్యలు చేపట్టాలని బాలవికాస సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. సమాజానికి ఉపయుక్తమయ్యే అంశాలను ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన బాలవికాస రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల నుంచి 15 వేలకు మందిపైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఏ రంగంలోనైనా ప్రజలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చన్నారు. ఈ రుచిని వాళ్లకు తెలియజేసే బాధ్యతను బాలవికాస తీసుకోవడం అభినందనీయమన్నారు. ‘బంగ్లాదేశ్‌లో ఆరుగురు పేద మహిళలతో కూడిన ఓ బృందం రోజూ ఓ వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లి ఐదు రూపాయల వడ్డీతో రూ.100 తీసుకునేది. ఆ డబ్బుతో కూరగాయలు కొని గల్లీగల్లీ తిరుగుతూ అమ్మేవారు. వీరిని గమనించిన ప్రొఫెసర్ యూనస్ ఒకరోజు వారిని అనుసరించారు. వడ్డీ వ్యాపారి చేతిలో వీరు మోసపోతున్నారని గుర్తించారు. వీరిని ఆదుకునేందుకు ఏం చేయాలో రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే ఆ బృందం అటుగా వెళుతుంటే పిలిచారు. తాను రూ.మూడు వడ్డీకే డబ్బులు అప్పుగా ఇస్తానని చెప్పగా సరేనంటూ ఆ మహిళలు యూనస్ వద్ద ఆరు నెలలపాటు డబ్బులు తీసుకుంటూ వ్యాపారం కొనసాగించారు. వడ్డీ తగ్గడంతో కొంత లాభపడ్డారు. కొన్నిరోజుల తర్వాత యూనస్ వారిని కుటుంబంతో సహా తన ఇంటికి భోజనాలకు రమ్మని పిలిచారు. భోజనాల తర్వాత తన ఇంట్లో దాచిన రూ.30 వేలు తెచ్చాడు. ఇదంతా మీ సొమ్మే. నేనేం వ్యాపారిని కాదు. మీరిచ్చిన వడ్డీతో నేను ఆదా చేసిన ఈ డబ్బు మీకే దక్కుతుందంటూ.. రూ.5 వేల చొప్పున ఆరుగురికి పంచాడు. ఇకపై నెత్తిన కూరగాయల గంపలు వద్దు. ఈ డబ్బుతో తోపుడు బండ్లు కొనుక్కొని వ్యాపారం చేసుకోండి. కానీ.. ఒక చిన్న షరతు. నేను ఎలా చేశానో మీరు కూడా మరో గ్రూప్‌ను తయారుచేయాలని హితబోధ చేశాడు. యూనస్ పట్టుదలతోనే బంగ్లాదేశ్‌లో 17 వేల స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) తయారయ్యాయి. ప్రజలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చనే దానికిది ఉదాహరణ. ఇటువంటి బాధ్యతను బాలవికాస నెత్తికెత్తుకొని 25 ఏళ్ల నుంచి పాటుపడుతుండటం నిజంగా అభినందనీయం’ అని కేసీఆర్ అన్నారు. భవిష్యత్‌లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగించి బాలవికాస ఓ బ్రహ్మస్త్రంలా పనిచేయాలని, ప్రభుత్వపరంగా అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు. అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో బాలవికాస సేవలందిస్తోందని, వీరికి ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఆడబిడ్డల సాధికారతకు ఆ సంస్థ చేస్తున్న కృషి అనిర్వచనీయమని చెప్పారు. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న బాలవికాసకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా మద్దతు తెలిపినట్టు బాలవికాస ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శౌరిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, టి.రాజయ్య, సతీశ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు, బాలవికాస వ్యవస్థాపకురాలు బాల సెరెగ, ఆమె భర్త ఆండ్రి జంగ్రా పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్‌కు ఏపీసర్కర్ కత్తెర
-
పాడి రైతులకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వ్యవసాయ రంగానికిస్తున్నట్లే పాడి రైతులకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రోగ్రెసివ్ డెయిరీ ఫార్మర్స్ అసోసియేషన్ (పీడీఎఫ్‌ఏ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోలాగే రుణాలపై వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వైఎస్ హయాంలో పాడి రైతులకూ కొంత కాలం వడ్డీ సబ్సిడీ లభించిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలూ దీన్ని కొనసాగించి ఉంటే డెయిరీ రంగానికి ఊరటగా ఉండేదని పీడీఎఫ్‌ఏ తెలంగాణ జనరల్ సెక్రటరీ కె.బాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు డెయిరీ ఫార్మింగ్‌లోకి వస్తున్నారు. కానీ మార్కెటింగ్, తదితర సమస్యల కారణంగా గడిచిన రెండు మూడేళ్లలో అనేక డెయిరీ ఫామ్‌లు మూతపడ్డాయి. అందుకని 8-9 శాతం మేర వడ్డీ సబ్సిడీని ఇస్తే పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. త్వరలో జరగనున్న డెయిరీ ఎక్స్పో వివరాలు వెల్లడించడానికి బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతం లీటరుకు రూ. 4 చొప్పున ఇస్తున్న ప్రోత్సాహకాన్ని కూడా మరికాస్త పెంచి, తోడ్పాటు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డెయిరీ సంస్థలు స్థానికంగా సేకరణ జరిపితే నాణ్యమైన పాలను అందించడం సాధ్యపడుతుందని బాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో డెయిరీ రంగంలో దాదాపు 2.5 లక్షల మంది పైగా ఉపాధి పొందుతున్నారని, ఒక మోస్తరు పెద్ద స్థాయి ఫారమ్‌లు దాదాపు 350-400 పైచిలుకు ఉన్నాయని బాల్‌రెడ్డి తెలియజేశారు. రాజకీయ నాయకుల డెయిరీ వ్యాపారాల వల్ల సహకార సంఘాల ఆధ్వర్యంలో నడి చే సంస్థలు దెబ్బతిన్నాయని బాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరిన్ని పాల సంస్థలు వస్తూ, ధరల పరమైన పోటీ పెరుగుతూ ఉండటంతో కల్తీ ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పాల కల్తీకి పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా నాణ్యతను కాపాడటం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. పాడి రైతులక్కూడా వ్యవసాయ రైతులకు సమానంగా విలువ ఇవ్వాలని పీడీఎఫ్‌ఏ ప్రెసిడెంట్ ఎం.జితేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ధర నిర్ణయంలోనూ పాల ఉత్పత్తిదారులను సంప్రదించాల్సిన అవసరం ఉందన్నారు. 5 నుంచి డెయిరీ షో ఈ నెల 5 నుంచి 7 దాకా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 4వ డెయిరీ షో జరగనుంది. తెలంగాణ పశు సంవర్ధక శాఖ విభాగం, పీడీఎఫ్‌ఏ, ఏపీడీడీసీఎఫ్‌తో కలిసి యాక్టివ్ ఎగ్జిబిషన్స్ అండ్ కాన్ఫరెన్సెస్ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. కొత్త టెక్నాలజీలు, ట్రెండ్స్ గురించి పాడి రైతుల్లో అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యాక్టివ్ గ్రూప్ డెరైక్టర్ పీఎస్ఎల్ఎన్ రావు చెప్పారు. మేలు జాతి పాడి పశువులు, డెయిరీ రంగానికి అవసరమయ్యే యంత్రాలు, పరికరాలు వంటివి ఇందులో ప్రదర్శనకు ఉంచుతున్నట్లు తెలియజేశారు. 90 మందికి పైగా ఎగ్జిబిటర్స్ ఇందులో పాల్గొంటున్నారన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు డెయిరీ ఫార్మింగ్ మొదలైన వాటిపై అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ఫారమ్‌ల సందర్శన వంటివి ఈ షోలో భాగంగా ఉంటాయని రావు తెలిపారు. -
రైతు బాంధవుడు వైఎస్సార్
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి తిప్పర్తి : నిత్యం రైతుల శ్రేయస్సు కోసం తపిస్తూ వారి అభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతో రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందించి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని సీఎల్పీ ఉపనేత , ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా మండలంలోని సిలారిమియాగూడెం, చెరువుపల్లిలో గ్రామాల్లో బుధవారం నిర్వహించిన వైఎస్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా చెరువుపల్లిలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులకు రెండు పంటలకు నీరందించేలక్ష్యంతో శ్రీశైల సొరంగమార్గం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రూ.2వేల కోట్లను, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులకు రూ.700 కోట్లను ప్రకటించిన ఘనత వైఎస్ఆర్కే దక్కిందన్నారు. రూ.4వేల కోట్లతో సాగర్ ఆధునికీకరణ పనులు చేపట్టి రైతుల పట్ల ఉన్న ప్రేమను చూపించారన్నారు. ఏఎమ్మార్పీ ప్రాజె క్టు ద్వారా కాల్వలను తవ్వించి రైతులకు సాగునీరు అందించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పాశం రాంరెడ్డి, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, డీసీసీబీ డెరైక్టర్ పాశం సంపత్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, జూకూరు రమేష్, సంకు ధనలక్ష్మి, బాలరాజు, వెంకట్రామిరెడ్డి, పాదూరు శ్రీనివాస్‌రెడ్డి, దాసరి వెంకన్న, ఎంపీటీసీలు లొడంగి వెంకటేశ్వర్లు, కిన్నెర అంజి, భిక్షం, తల్లమల్ల యశోద, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, ఉప సర్పంచ్ జానకిరాములు, సుదర్శన్‌రెడ్డి, ఇంజ మూరు వెంకన్న, మర్రి యాదయ్య, సునందారెడ్డి, రాజిరెడ్డి, ప్ర శాంత్, రవి, ముత్తిలింగం, సాగర్ పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది నుంచి 9గంటల విద్యుత్తు
- నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మెదక్ రూరల్: వచ్చేయేడాది నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నిరంతరంగా ఉచిత విద్యుత్తును అందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్ మండల పరిధిలోని ఖాజిపల్లి, పిల్లికొటాల్, ఫరీద్పూర్, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, హవేళిఘణపూర్‌లో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. కేవలం రెండు నెలల్లోనే నియోజకవర్గంలో 8 సబ్స్టేషన్లు మంజూరు చేశామన్నారు. అలాగే జిల్లాలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు సింగూరు, దాని పరిధిలోని మహబూబ్‌నహర్ (ఎంఎన్) కెనాల్ ఫతేనహర్ (ఎఫ్ఎం)కెనాళ్ల సిమెంట్ లైనింగ్ కోసం రూ. 70 కోట్లు మంజూరు చేశామన్నారు. డిప్యూటీ స్పీకర్ కోరిక మేరకు ఇటీవలే మరో రూ.22 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే ప్రాజెక్టు ఎత్తుపెంపు తదితర అవసరాల నిమిత్తం మరో రూ.30 కోట్లు విడుదల చేశామన్నారు. గతంలో పింఛన్ల కోసం ప్రభుత్వం మెదక్ జిల్లాలో నెలకు రూ. 81 లక్షలు ఖర్చుపెడితే ప్రస్తుతం నెలకు రూ.4.83 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. అప్పట్లో జిల్లాలో 34వేల పింఛన్లు ఉండగా నేడు 48 వేల పింఛన్లు ఇస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం సీఎం పంచాయతీల అభివృద్ధికోసం ఒక్కో పంచాయతీకి రూ.15 లక్షలు మంజూరు చేశారని, వాటితో మురికి కాల్వలు, సీసీ రోడ్లు నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్య, ఎంపీపీ లక్ష్మి, నాయకులు అంజాగౌడ్, విశ్వం, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నర్సారెడ్డి, సునిత తదితరులు పాల్గొన్నారు. ప్రాణహిత చేవెళ్లతో మెదక్ సస్యశ్యామలం చిన్నశంకరంపేట: ప్రాణహిత చేవెళ్ల ద్వారా మెదక్ నియోజకవర్గాన్ని సస్యశామలం చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం చిన్నశంకరంపేటలోని ఐకేపీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజ్వేల్ నియోజవర్గంలోని పాములపర్తి రిజర్వాయర్ ద్వారా చిన్నశంకరంపేట, రామాయంపేట, మెదక్ మండలలకు సాగునీరందించనున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ కుమార్‌గౌడ్ కోరిక మేరకు గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.15లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే చేగుంట-మెదక్ రోడ్ అభివృద్ధికి రూ. 16 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. చిన్నశంకరంపేటలో త్వరలో 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తామన్నారు. చెరువులు చూసి పిల్లను ఇవ్వాలి శివ్వంపేట: గ్రామంలోని చెరువును చూసి ఆ ఊరికి ఆడపిల్లలను ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్లాండ్ ఫార్మా కళాశాల చైర్మన్ పీవీఎన్‌రాజు విరాళంగా ఇచ్చిన రూ. 50లక్షలతో అల్లీపూర్, కొత్తపేట చెరువు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అల్లీపూర్‌కు వచ్చిన మంత్రికి గ్రామస్తులు బోనాలు, పీర్ల ఊరేగింపుతో ఎడ్లబండిపై ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 6వేల చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గానికి 10 వేలు గ్యాస్కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 10వేల మెట్రిక్ టన్నుల గోదాంకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అనంతరం అల్లీపూర్ చెరువులో మత్స్యకారులు చేపలు పట్టడాన్ని చూసి మంత్రి హరీశ్‌రావు వారితో మాట్లాడారు. అనంతరం వలను చెరువులోకి వేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గ్లాండ్ఫార్మా చైర్మన్ పీవీఎన్‌రాజు, జేసీ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కాకతీయ’ అక్రమాలకు అధికారులదే బాధ్యత
రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే... అంతే పత్రికల్లో వచ్చే వార్తలకు వెంటనే స్పందించాల్సిందే అధికారులకు మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ కార్యక్రమంలో అక్రమాలు జరిగితే అధికారులనే బాధ్యులని చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధుల ఫోన్ల ఒత్తిడికి లొంగిపోయామని అధికారులు చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల అమలు తీరుపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఈటెల మాట్లాడారు. ఎంతో పవిత్ర ఆశయంతో రూపొందించిన మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో కరీంనగర్ జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. జూన్‌లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా చాలాచోట్ల పనులు ప్రారంభమే కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్ధం, బద్దకంతో వ్యవహరించే అధికారుల తీరుతోనే ఇలా జరుగుతోందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయకపోతే ఆశించిన ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ అక్రమాలకు సంబంధించి పత్రికల్లో వచ్చే వార్తలకు ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ అంచనాల్లో 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేయడం పట్ల సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ‘అధికారుల అంచనా కంటే 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేస్తే పనుల్లో నాణ్యతైనా లోపిస్తుంది... లేదంటే అధికారులే అంచనాలను అమాంతంగా పెంచి ఉండాలి. అంతే తప్ప పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయే ప్రసక్తే ఉండదు’ అని అన్నారు. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల్లోని మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున కాంట్రాక్టర్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికమంత్రి నియోజకవర్గంలోనే ఇది జరుగుతున్నట్లు పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయని చెప్పారు. తన నియోజకవర్గంలో మట్టిని అమ్ముకునే పరిస్థితి లేదని, ఇప్పటికే ఇదే అంశంపై పలుమార్లు సమీక్ష జరిపానని ఈటెల తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులెవరూ చెరువులవైపు ముఖం కూడా చూపడం లేదని, పనులు ప్రారంభించిన తాము మాత్రం ప్రజల దృష్టిలో చులకన అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి 9 గంటల విద్యుత్ వచ్చే ఏడాది నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కెపాసిటీ పెరిగే అవకాశమున్నందున అందుకు తగినట్లుగా సబ్స్టేషన్లు ఉన్నాయా? అనే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, నగర మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ నాగేంద్ర, అధికారులు పాల్గొన్నారు. -
‘ఉచితం’పై డిస్కంల తప్పుడు లెక్కలు
అధిక సబ్సిడీ కోసం వ్యవసాయ విద్యుత్ వాడకాన్ని పెంచి చూపే యత్నం 2015-16లో 13,431 మిలియన్ యూనిట్లు అవ సరమని అంచనా ఈ అంచనాలను తప్పుబట్టిన తెలంగాణ ఈఆర్సీ 20 శాతం వ్యవసాయ విద్యుత్‌కు కత్తెర 10,650 మిలియన్ యూనిట్లు చాలంటూ సర్దుబాటు హైదరాబాద్: ఉచిత విద్యుత్ విషయంలో డిస్కంలు సర్కారును తప్పుదోవ పట్టించాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులను ఎక్కువగా ఆశించి వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని పెంచి చూపేందుకు ప్రయత్నించాయి. అయితే కొత్త విద్యుత్ చార్జీలను ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని భారీగా నియంత్రించింది. డిస్కంలు కోరినంతగా అవసరం లేదని ఏకంగా 20 శాతం మేరకు కత్తిరించింది. డిస్కంల అంచనాలను తప్పుబట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 13,431 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయన్న అంచనాలతో తెలంగాణ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా కేవలం 10,650 మిలియన్ యూనిట్లు సరిపోతాయని ఈఆర్సీ కత్తెర వేయటంతో ఈ విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇబ్బడిముబ్బడిగా అంచనాలు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలంగాణ సదరన్ డిస్కం వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ను అధికంగా చూపిందన్న అభిప్రాయాలున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసి ఉన్నప్పుడు... 2013-14లో వ్యవసాయానికి 6,694.29 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు లెక్కలున్నాయి. ఆ రెండు జిల్లాలు మినహాయిస్తే ఈ వినియోగం కొంత మేరకైనా తగ్గుముఖం పట్టాల్సింది. కానీ 2014-15లో 7,238.26 మిలి యన్ యూనిట్లు, 2015-16లో 7,529.19 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి అవసరమని సదరన్ డిస్కం అంచనా వేసింది. రాజధాని చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో అర్బన్ ప్రాంతమే ఎక్కువగా ఉంది. దీంతో వ్యవసాయ విద్యుత్ అవసరం అంత భారీగా పెరగదని ఈఆర్సీ గుర్తించింది. అందుకే ఎస్పీడీసీఎల్కు 6,350 మిలియన్ యూనిట్ల మేరకు వ్యవసాయ కేటగిరీకింద సరిపోతుం దని నియంత్రించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్ ప్రస్తుత సంవత్సరంలో 4,715.21 మిలియన్ యూనిట్ల విద్యుత్, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,903.82 మిలియన్ యూనిట్లు అవసరమని అంచనా వేసింది. కానీ ఈఆర్సీ 4,300 మిలియన్ యూనిట్లకు సర్దుబాటు చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరిగిపోతున్నాయని.. అందుకే ఉచిత విద్యుత్ వాడకం పెరిగిపోతుందనేది డిస్కంల వాదన. గతంలో ఈఆర్సీ నిర్ధారించినదాని కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉచిత కేటగిరీకి సరఫరా చేసినట్లుగా డిస్కంలు తమ నివేదికల్లో స్పష్టం చేశాయి. వ్యవసాయానికి మీటర్లు లేకపోవటం, ఎంత విద్యుత్ సరఫరా అయిందో పక్కాగా లెక్కతేల్చే వ్యవస్థ లేకపోవటంతో ఈ వాదనకు బలం లేకుండా పోతోంది. పంపిణీ, సరఫరా నష్టాలు, భారీ విద్యుత్ చౌర్యంతో వచ్చే నష్టాలను పూడ్చుకునేందుకు.. డిస్కంలు ఉచిత విద్యుత్ కోటాలో ఎక్కువ విద్యుత్ వినియోగాన్ని చూపిస్తున్నాయనే విమర్శలున్నాయి. అందుకు భిన్నంగా ఉచిత విద్యుత్... నష్టాలు తెచ్చిపెడుతోందని.. ప్రభుత్వం సరిపడేంత సబ్సిడీ ఇవ్వకపోవటంతో ఆర్థికంగా భారంగా మారుతోందనేది డిస్కంల వాదన. టీ సర్కార్ తొలి ఏడాది నెలకు రూ. 300 కోట్ల చొప్పున ఉచిత విద్యుత్‌కు రూ.3,600 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌కు ఈఆర్సీ భారీ మొత్తంలోనే కత్తెర వేసినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్కారు రూ. 4,427 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించటం డిస్కంలకు ఊరటనిచ్చినట్లయింది. కాగ్ చెప్పింది కూడా ఇదే.. ఉచిత విద్యుత్ సరఫరాకు మీటర్లను అమర్చటం అత్యంత అవసరమని.. ఇటీవల కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా వేలెత్తి చూపింది. విద్యుత్ వినియోగంలో తప్పుడు అంచనాలు డిస్కం లకు నష్టాలు తెచ్చి పెడుతున్నాయని అభిప్రాయపడింది. ‘2004-05లో వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసేందుకు మీటర్లను అమర్చాలని ఏపీఈఆర్సీ సూచిం చింది. కానీ.. డిస్కంలు ఆ విధానాన్ని అమలు చేయలేదు. 2010 నుంచి 2014 వరకు ఉచిత విద్యుత్ వినియోగం ఆమోదిం చినదాని కంటే 4,986.93 మిలియన్ యూనిట్లు మించిపోయి రూ.1,861.44 కోట్ల అధిక వ్యయమైంది. ఈఆర్సీ ఆమోదించిన పరిమితికి లోబడి ఉచిత విద్యుత్ నియంత్రణకు డిస్కంలు ఏ చర్యలూ తీసుకోలేదు. డిస్కంలకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వటం ఆలస్యం కావటంతో రూ.76.83 కోట్ల వడ్డీ నష్టం వాటిల్లింది’ అని పేర్కొంది. -
పొదుపు కోసమట.. కోతకు వేళాయె!
వ్యవసాయానికి ‘కెపాసిటర్ల’ లంకె సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉచిత విద్యుత్‌కు, కెపాసిటర్లకు లంకె వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులు కెపాసిటర్లు బిగించుకోవాలని విద్యుత్‌శాఖ ఒత్తిడి తెస్తోంది. విద్యుత్ పొదుపు పేరిట ఉచిత విద్యుత్‌కు-కెపాసిటర్లకు లంకె వేసేందుకు జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కెపాసిటర్లను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందా? రైతులే భరించాలా? అనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కెపాసిటర్ల భారాన్ని రైతులే భరించక తప్పదని అధికారులే అనధికారికంగా పేర్కొంటున్నారు. మొత్తం మీద ఉచిత విద్యుత్ అని ఒకవైపు అంటూనే... మరోవైపు కెపాసిటర్ల రూపంలో పరోక్షంగా రైతులపై ప్రభుత్వం భారం మోపేందుకు సిద్ధమైందన్నమాట. ఒక్కో కనెక్షన్‌కు రూ.2 వేల భారం ప్రతీ రైతు కెపాసిటరు కొనాల్సి రానుండటంతో వారిపై భారీగా భారం పడనుంది. ఒక కెపాసిటర్‌ను కొనుగోలు చేయాలంటే సుమారు రూ.2 వేల మేరకు వెచ్చించాల్సి రానుంది. జిల్లాలో లక్షా 11వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్‌కు రూ.2వేల చొప్పున... రూ.22.20 కోట్ల మేర రైతులపై భారం పడనుంది. వాస్తవానికి కెపాసిటర్లను బిగించుకోవడం ద్వారా రైతులకు ఒరిగే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా విద్యుత్ పొదుపు అయితే ఆ మేరకు విద్యుత్ సంస్థలకు అదనపు విద్యుత్ కొనుగోలు భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా లాభం చేకూరనుంది. కెపాసిటర్ల భారాన్ని కూడా విద్యుత్ సంస్థలే భరించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందుకు భిన్నంగా రైతులపై మోపేందుకు సిద్ధపడటాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉచిత పథకానికి తూట్లు వాస్తవానికి గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో విద్యుత్ చార్జీలు చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మంది రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. పలువురు జైళ్లపాలు కూడా అయ్యారు. ఏకంగా రూ.1250 కోట్ల మేరకు రైతులు విద్యుత్ చార్జీల రూపంలో బకాయి పడ్డారు. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పాత బకాయిలను రద్దు చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులనూ రద్దు చేయడంతో పాటు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, కేవలం నెలకు రూ.20 చొప్పున సర్వీసు చార్జీలు చెల్లించాలని కోరారు. వాస్తవానికి నెలకు రూ.20 కూడా ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు వసూలు చేసిన సంఘటనలు లేవు. ఆయన మరణానంతరం రైతుల నుంచి బకాయిపడ్డ సర్వీసు చార్జీలను వసూలు చేశారు. అంతేకాకుండా క్రమంగా ఉచిత విద్యుత్‌కు పరి మితులు విధించడం ప్రారంభించారు. గతంలో ఒక రోజులో వ్యవసాయానికి 7 గంటలు సరఫరా కాకపోతే.. మరుసటి రోజు మిగిలిన సమయాన్ని భర్తీ చేసేవారు. అంటే ఒక రోజు వ్యవసాయానికి కేవలం 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయితే.. మిగిలిన 2 గంటల సమయా న్ని మరుసటి రోజు భర్తీ చేసేవారన్నమాట. అయితే, దీనిని ప్రస్తుతం రద్దు చేశారు. ఒక రోజు లో వ్యవసాయానికి 7 గంటల్లో కోత పడితే దీని ని భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా వ్యవసా య విద్యుత్ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లను బిగించే ప్రక్రియను సైతం తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా అయ్యే ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లను బిగించి.. ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో లెక్కించాలనేది ఆలోచనగా ఉంది. ఒకవేళ నిర్ణీత లక్ష్యం కంటే అధిక విద్యుత్ సరఫరా అయితే అలాంటి కనెక్షన్లపై ఓ కన్నేసి... విద్యుత్ సరఫరా సమయాన్ని తగ్గించాలనే ఎత్తుగడలో విద్యుత్‌శాఖ నిమగ్నమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉచిత విద్యుత్తు బకాయిలు కట్టాల్సిందే!
8 ఏళ్ల ఉచిత విద్యుత్ బకాయిలు కట్టాల్సిందే 8 లక్షల మంది రైతులకు సర్కారు నోటీసులు 2004 నుంచీ కట్టాలని ఒత్తిడి.. గ్రామాల్లో చాటింపుతో హెచ్చరికలు రెవెన్యూ చట్టాల ప్రయోగానికి, కేసుల నమోదుకూ సిద్ధం ఆధార్ ఆధారంగా ఇళ్ల సర్వీస్ నంబర్ల గుర్తింపు.. ఇంటి కనెక్షన్లకూ విద్యుత్ బంద్? రబీ దృష్ట్యా అన్నదాతల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: రుణమాఫీలో మోసపోయిన రైతన్నకు చంద్రబాబు సర్కారు మరో షాకిచ్చింది. ఉచిత విద్యుత్‌ను దొంగదెబ్బ తీసే క్రమంలో మరో అడుగు ముందుకేసింది. ఉన్నపళంగా ఎనిమిదేళ్ల విద్యుత్ బకాయిలూ కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2004 నాటి ఉచిత విద్యుత్ కనె క్షన్ జాబితాలో ఉంటే చాలు ఎనిమిదేళ్లుగా బకాయిలు ఉన్నట్టేనంటూ కొత్త లెక్కలు తెరమీదకు తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షల మంది రైతులకు డిమాండ్ నోటీసులు పంపింది. ‘బిల్లులు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం...’ అంటూ హెచ్చరిస్తోంది. విద్యుత్ వాడినా, వాడకున్నా ఈ బిల్లులు చెల్లించాల్సిందేనంటూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. అవసరమైతే ఇళ్లకూ విద్యుత్ సరఫరా నిలిపివేయాలనే యోచనలో ఉంది. బకాయిలు కట్టనివారిపై రెవెన్యూ చట్టాలను ప్రయోగించాలని నిర్ణయించింది. కేసులు పెట్టాలని ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగాలకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో విద్యుత్ వినియోగదారుల ఆధార్ నంబర్‌ను సేకరించిన పంపిణీ సంస్థలు, దీని ఆధారంగా రైతుల ఇళ్ళ సర్వీస్ నంబర్లు గుర్తించారు. వీటి ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాది రూ.360కి పెరిగిన సాధారణ చార్జీలు గత ఏడాది ప్రభుత్వం ఈ సాధారణ చార్జీలను రూ.120 పెంచి, ఏడాదికి రూ.360 వసూలు చేయాలని ఆదేశించింది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మోయలేని భారమనీ చెప్పింది. ఎన్నికల సమయంలో కూడా ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి రావడంతోనే నష్టాల పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా 2004-2011 వరకు ఉన్న బకాయి పడిన బిల్లులు చెల్లించాల్సిందిగా విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో రైతులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సర్కారు నోటీసులు అందిన రైతుల్లో ఉచిత విద్యుత్ వినియోగదారులు కాకుండా.. డీజిల్‌తో మోటార్లు నడిపించుకుంటున్న వాళ్ళూ ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 13.5 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటన్నిటికీ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పాత బకాయిల పేరుతో రైతుల్ని వేధించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీసిందని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. ఈ విషయమై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్‌ను ‘సాక్షి’ వివరణ కోరింది. ఎస్పీడీసీఎల్ సీఎండీకి ఫోన్ చేసి విషయం తెలుసుకున్న ఆయన.. ఇప్పటికిప్పుడు విద్యుత్ కనెక్షన్లు తొలగించవద్దని ఆదేశించారు. చట్ట సమ్మతమేనా? విద్యుత్ చట్టాల ప్రకారం ఇన్నేళ్ళ బకాయిలు వసూలు చేయడం చట్ట విరుద్ధమని నిపుణులు అంటున్నారు. బకాయిలు ఉంటే, ప్రతి ఆరు నెలలకూ ఒకసారి నోటీసులు ఇవ్వాలని, అవి అందినా వినియోగదారులు కట్టకపోతే రెవెన్యూ చట్టాలను ఆశ్రయించవచ్చని చెబుతున్నారు. గతించిన బకాయిలకు ఇప్పుడే నోటీసులు ఇవ్వడం, ఇప్పటికిప్పుడే రెవెన్యూ, ఇతర చట్టాలను అమలు చేస్తామనడం న్యాయ సమ్మతం కాదని స్పష్టం చేస్తున్నారు. ఒక్క పైసా వసూలు చేయని వైఎస్ 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో కోరిన ప్రతి రైతుకు కనెక్షన్ ఇచ్చారు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో వ్యవసాయ కనెక్షన్లను పెంచుకుంటూ వచ్చారు. ఈ కనెక్షన్లపై సాధారణ చార్జీలు వసూలు చేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల సిఫారసులను అప్పటి సర్కారు పట్టించుకోలేదు. రైతుల కనెక్షన్లను అధికారికంగా గుర్తించడానికి నెలకు రూ.20 సర్వీసు చార్జీ విధించినా, ఆరేళ్ళూ ఒక్కపైసా వసూలు చేయలేదు. దీనికోసం రైతులపై ఎలాంటి ఒత్తిడి తేవద్దని వైఎస్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు నిజమే.. డిమాండ్ నోటీసులు ఇచ్చిన మాట నిజమే. అయితే సాధారణ విద్యుత్ చార్జీలనే అడుగుతున్నాం. ప్రస్తుతం ప్రతి రైతు ఏటా రూ.360 చెల్లించాలి. ఇది కూడా ఆరు నెలలకోసారి రెండు విడతలుగా చెల్లించాలి. కానీ చెల్లించడం లేదు. అందుకే ఇప్పుడు కట్టాలని కోరుతున్నాం. - ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ .వై.దొర -
ఉచిత విద్యుత్‌కు మంగళమేనా?
వ్యవసాయ కనెక్షన్లకు ఆధార్ గండం సేకరణలో అధికారులు -ఆందోళనలో అన్నదాతలు నెల్లూరు (రవాణా): దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులేస్తుంది. కొద్దిరోజుల క్రితం గ్యాస్ కనెక్షన్లు, మొన్న రేషన్‌కార్డులు, నిన్న పింఛన్లు, నేడు ఉచిత విద్యుత్.. ఇలా ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించే దిశగా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత నెల రోజులుగా వ్యవసాయ పంపుసెట్లకు ఆధార్ నంబర్లను విద్యుత్ అధికారులు సేకరిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదంతా ఉచిత విద్యుత్‌కు మంగళం పాడటానికేనా? అనే సందేహాన్ని అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులందరూ తప్పని సరిగా ఆధార్ నంబర్‌ను అందజేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 90శాతంకుపైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,44,864 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 1,43,625 మంది రైతులు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధిపొందుతున్నారు. కేవలం 1,239 మంది రైతులు మాత్రమే వ్యవసాయానికి సంబంధించి బిల్లులు చెలిస్తున్నారు. అంటే దాదాపు 95శాతం పైగా రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది. అయితే కొద్దిరోజులుగా విద్యుత్ అధికారులు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలని రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈనెలాఖరు చివరి గడువుగా పెట్టారు. దీంతో వ్యవసాయ కనెక్షన్‌ను ఎక్కడ తొలగిస్తారోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం పింఛన్లు, రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లు తదితర వాటిలో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి భారీస్థాయిలో లబ్ధిదారులను తొలగించారు. ఆ మాదిరిగానే ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు కూడా తొలగించనున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో అన్నదాతలు అయోమయపరిస్థితిలో ఉన్నారు. రైతులపై అధిక భారం ఆధార్ లింకేజీ పేరుతో రాష్ట్రప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేస్తే రైతులపై అధిక భారం పడుతుంది. ఇప్పటికే ఎరువులు, కూలీరేట్లు, పురుగుమందుల ధరలు పెరిగి వ్యవసాయం చేయాలా వద్దా? అనే సందేహంలో రైతులున్నారు. ఇప్పటికే అరకొర విద్యుత్ సరఫరాతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 7 గంటలని చెబుతున్నా.. అది 5 గంటలకు మించడంలేదు. జిల్లాలో 5 హార్స్పవర్, 7 హార్స్పవర్, 10 హార్స్పవర్ మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్‌ను రూ.3.75 లకు కొనుగోలు చేస్తోంది. ఉదాహరణకు 5 హార్స్పవర్ మోటారుకు గంటకు 3.8 యూనిట్లు ఖర్చవుతుంది. ఈలెక్కన 5 గంటలకు రోజుకు 19 యూనిట్లు ఖర్చవుతుంది. అంటే రోజుకు రూ.71.25 అవుతుంది. ఈలెక్కన నెలకు రూ.2,137 బిల్లు రైతులు విద్యుత్‌శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అదే 7 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తే నెలకు రూ.2,993 బిల్లు వస్తుంది. అదే 7 హార్స్పవర్, 10 హార్స్పవర్ మోటార్లకు దాదాపు నెలకు రూ.5వేలు బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఈ రీతిలో నెలనెలా బిల్లు చెల్లించాల్సిన పరిస్థితే వస్తే వ్యవసాయం చేయడం కన్నా మానుకోవడం మేలన్న అభిప్రాయంలో రైతులు ఉన్నారు. ఇవేమి పట్టించుకోని విద్యుత్ అధికారులు మాత్రం ఆధార్ నంబర్‌ను సేకరించే ప్రయత్నాల్లో ముమ్మరంగా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే, ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే వ్యవసాయ పంపుసెట్లకు ఆధార్ నంబర్లును అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో సగానికిపైగానే కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేశాం. మిగిలినవి కూడా ఈనెలాఖరు లోపు పూర్తిచేస్తాం. - వెంకటేశ్వరరావు, టెక్నికల్ డీఈ -
కర్షకుడిపై కరెంటు జులూం
వికారాబాద్: ఉచిత కరెంటుకు సంబంధించి రైతులు రూ.30 సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2005 నుంచి దీని గురించి విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. గత తొమ్మిదేళ్లకు సంబంధించి ఈ బకాయిలు ఇప్పుడు రూ. వేలకు చేరుకున్నాయి. అయితే ఈ వేల రూపాయల బిల్లును ఒకేసారి చెల్లించాలంటూ ఇప్పుడు రైతులను అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే కనెక్షన్లు కట్ చేస్తూ నిర్దాక్షిణంగా స్టార్టర్లు, సర్వీసు వైర్లను సబ్స్టేషన్లలకు తీసుకెళుతున్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 12 వేల వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లను సబ్స్టేషన్లకు తీసుకెళ్లినట్లు సమాచారం. బిల్లు కడితేనే తిరిగి విద్యుత్ స్టాటర్ ఇచ్చి కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని లేకపోతే స్టాటర్ గురించి మరిచిపోండి అంటూ విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ విద్యుత్ డివిజన్ పరిధిలో 50 వేల వ్యవసాయ బావులకు ఉచిత కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే సర్వీసు బకాయిలు చెల్లించని రైతుల కనెక్షన్లు తొలగించడం ప్రారంభమైంది. బిల్లు కట్టనందుకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా బృందాలుగా వస్తున్న విద్యుత్ సిబ్బంది కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లు తీసుకెళుతున్నారు. అయితే విద్యుత్‌శాఖకు తామొక్కరమే బకాయిలు పడలేదని,ృగహ, పరిశ్రమ శాఖలు కూడా పెద్ద మొత్తంలో బకాయి పడ్డాయని రైతులుచెబుతున్నారు. వారి నుంచి మొదట బకాయిలు వసూలు చేసి తమకు కొంత వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు ప్రభావంతో తాము పంటల సాగులో తీవ్ర నష్టాలను చవిచూశామని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఒకేసారి బిల్లు మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కనెక్షన్ కట్ చేయవద్దని వేడుకుంటున్నా పట్టించుకోకుండా స్టాటర్లు, సర్వీస్ వైర్లను సిబ్బంది తీసుకెళుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలో గురువారం ఒక్క రోజే 100 బోరు మోటార్ల స్టాటర్లను విద్యుత్ సిబ్బంది రైతుల వద్ద నుంచి లాక్కురావడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సర్వీసు చార్జీల చెల్లింపులో కొంత వెసులుబాటు కల్పించాలని రైతన్నలు వేడుకుంటున్నారు. -
సౌరవిద్యుత్‌తో మేలెంత?
అధ్యయనానికి సీఎం ఆదేశం ప్రయోగాత్మకంగా పరిశీలన పదేళ్లలో అన్ని పంపు సెట్లు మారుస్తాం: కిర్లోస్కర్ కంపెనీ ప్రతిపాదన హైదరాబాద్: వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడం మేలా? లేక దాని స్థానంలో సౌర విద్యుత్ పంపుసెట్లను సమకూర్చడం మంచిదా అనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి సౌర విద్యుత్ పెంపుసెట్లను సమకూర్చే అంశంపై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ఇంధన, ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులతోపాటు, సౌర విద్యుత్ పంపుసెట్లు సమకూర్చేందుకు ముందుకు వచ్చిన కిర్లోస్కర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రస్తుతం ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల ప్రతీ రోజు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాకోసం ప్రభుత్వంపై రూ.15 కోట్ల భారం పడుతోందని అధికారులు అంచనా వేశారు. అయితే దీనికి బదులుగా సౌర విద్యుత్ పెంపుసెట్లు వాడితే ఈ భారం తగ్గుతుందా అన్న దానిపైనే లెక్క తేల్చాల్సి ఉంది. సౌర విద్యుత్ పంపుసెట్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ మొత్తం ఒకేసారి కాకుండా ప్రయోగాత్మకంగా వీటిని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. విద్యుత్ కోతలు, సరఫరాలో అనిశ్చితి, విద్యుత్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను అధిగమించేందుకు సౌర విద్యుత్‌తో నడిచే మోటారు పంపులు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తే, నిర్వహణ ఎంతవరకు ఆచరణ సాధ్యమన్న విషయం అనుభవంలోకి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న కిర్లోస్కర్ కంపెనీ అసోసియేట్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర వి.మహాజన్, జనరల్ మేనేజర్ అజయ్ శిరోడ్కర్లు మాట్లాడుతూ, ఏడాదిలో ప్రస్తుతం ఉన్న మోటార్లను తొలగించి లక్ష సౌర విద్యుత్ పంపుసెట్లను అమరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రానున్న పదేళ్ల కాలంలో మొత్తం పంపుసెట్లను సౌర విద్యుత్‌తో నడిచే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పంపుసెట్ల మార్పిడికి సంబంధించి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం, రైతుల ఎలాంటి నిధులు చెల్లించాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. పదేళ్లపాటు ఈ మోటార్ల నిర్వహణ బాధ్యత కూడా తామే స్వీకరిస్తామని, పదేళ్ల తరువాత మోటార్లకు సంబంధించి డబ్బు చెల్లిస్తే సరిపోతుందని వారు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారు బీవీ పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఇంధన, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అధ్యయనానికి కమిటీ సౌరశక్తితో నడిచే వ్యవసాయ మోటారు పంపుసెట్లకు సంబంధించి అన్ని విషయాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి నలుగురు కార్యదర్శులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్‌చంద్ర అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య సభ్యులుగా ఉంటారు. -
ఆధార్ లేకుంటే.. ఉచిత విద్యుత్ కట్..
ఆధార్ నంబర్ ఇవ్వని రైతుల వ్యవసాయ కనెక్షన్లు నేటి నుంచి కట్ చేసేందుకు రంగం సిద్ధం క్షేత్రస్థాయి సిబ్బందికి డిస్కమ్‌ల మౌఖిక ఆదేశాలు 7 నుంచి 9 గంటల ఉచిత విద్యుత్ హామీ హుళక్కి రాష్ట్రంలో 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సుమారు ఐదున్నర లక్షల కనెక్షన్లకు కోతే లక్ష్యం ఆధార్ సమర్పణకు నేటితో ముగియనున్న గడువు వివరాలివ్వని లక్షలాదిమంది రైతుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు వ్యవసాయ కనెక్షన్లకు, ఆధార్‌కు లింకు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు సిద్ధమైంది. ఆధార్ నంబర్ అందజేయని రైతుల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరాను గురువారం నుంచి నిలిపివేయనుంది. కనెక్షన్లు కట్ చేసే ప్రక్రియను గురువారం నుంచే ప్రారంభించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) క్షేత్ర స్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వివిధ కారణాల నేపథ్యంలో ఇప్పటివరకు ఆధార్ నంబర్‌ను సమర్పించని రైతులు ప్రభుత్వ వైఖరితో బెంబేలెత్తిపోతున్నారు. గడువు పొడిగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలకు, ఆధార్‌కు ముడిపెట్టరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అనేక పథకాలకు, కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన సర్కారు చివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను పరిహారం అందజేతకూ బాధితులకు ఆధార్ కార్డు ఉండితీరాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ పేరుతో పొదుపు చర్యలను చేపట్టిన ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్లపై కన్నేసింది. రోజుకు 25 నుంచి 35 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉచిత విద్యుత్‌కు వెచ్చించడాన్ని ఆర్థిక భారం కోణంలో చూస్తున్న ప్రభుత్వం వీలైనన్ని కనెక్షన్లకు కోత పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొదలు ఉచిత విద్యుత్ విషయంలో రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఫీడర్లను విడదీయడంతో పాటు, అన్ని కనెక్షన్లకూ మీటర్లు బిగించే ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇటీవల ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పరిధిలో కనెక్షన్లకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని కోరింది. దీంతో అధికారులు మొదలు లైన్మెన్ల వరకు వినియోగదారులపై ఒత్తిడి పెంచారు. మిగతా కనెక్షన్ల మాటెలా ఉన్నా ఉచిత కనెక్షన్లున్న రైతులు మాత్రం ముందుకు రాలేదు. 7 నుంచి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని అనేకసార్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. కనెక్షన్ల కుదింపు కార్యక్రమాన్ని మాత్రం ముమ్మరం చేసింది. డిస్కమ్‌లు తమ పరిధిలో టార్గెట్లు పెట్టుకుని మరీ ముందుకెళ్తున్నాయి. ఫీడర్ల వారీగా లెక్కలేసిన డిస్కమ్‌లు ఏ రైతు పరిధిలో ఎన్ని మోటార్లున్నాయి, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏమిటి? పండ్లతోటలు సాగుచేసే రైతుల్లో ఉచిత విద్యుత్ పరిధి నుంచి తప్పించాల్సిన వాళ్ళు ఎవరు? అనే వివరాలు సేకరించారు. రాష్ట్రంలో 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 11 లక్షల వరకు ఉండగా మిగతావి ఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చాయి. రెండు డిస్కమ్‌ల పరిధిలో.. రకరకాల వడపోతలతో కనీసం 40 శాతం పంపుసెట్లకు (సుమారు ఐదున్నర లక్షల కనెక్షన్లు) ఉచిత విద్యుత్ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎత్తుగడను అమలు చేసేందుకు తన ప్రధాన బ్రహ్మాస్త్రం ఆధార్‌ను తెరపైకి తె చ్చింది. ఆధార్ ఆధారంగా రైతుల ఆదాయం, కుటుంబంలో ఉన్న బహుళ కనెక్షన్లు తదితర వివరాలన్నీ సేకరించడం ద్వారా పరిమితులు విధించి కనెక్షన్లు కట్ చేయాలనేది ప్రభుత్వ యోచనగా అధికారులే చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన తాజా గడువు గురువారంతో ముగియనుంది. అయినా ప్రభుత్వం తమ కనెక్షన్లు కట్ చేస్తుందేమోనన్న ఆందోళనతోనే అధిక సంఖ్యలో రైతులు ఆధార్ లింకేజీకి ముందుకురాలేదు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 60 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో 74 శాతం మంది ఆధార్ సంఖ్యను అనుసంధానం చేశారు. మిగతా 26 శాతంలోని వారిలో ఎక్కువమంది రైతులే కావడం గమనార్హం. ఈపీడీసీఎల్ పరిధిలోనూ సింహభాగం రైతులు ఆధార్ సంఖ్య ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న అధికారులు.. గడువు ముగిసిన వెంటనే డిస్కమ్‌ల ఆదేశాల మేరకు గురువారం నుంచే వీరందరికీ ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అవును గడువు ముగిసింది: ఎస్పీడీసీఎల్ సీఎండీ అన్ని విభాగాల మాదిరిగానే తమ శాఖలోనూ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశామని, రైతులు దీన్ని అపార్థం చేసుకుంటున్నారని దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సీఎండీ హెచ్.వై.దొర ‘సాక్షి’తో అన్నారు. వాస్తవానికి గత నెలలోనే గడువు ముగిసిందని, హుద్‌హుద్ తుపాను కారణంగా ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆధార్ ఇవ్వనివారికి సరఫరా నిలిపివేయాల్సిందిగా తాము ఎవ్వరికీ అధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. గడువు పొడిగిస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. -
బంగారు కలలు కల్లలయ్యాయి
సాక్షి, ఖమ్మం: బంగారు తెలంగాణను చూడాలని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రజల కలలు కల్లలయ్యాయని, ఇందుకు పూర్తి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా ఎన్నికల ముందు ఇచ్చిన పలు హామీలను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదున్నర నెలల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. పంటలు ఎండిపోతూ ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు రాష్ట్రవ్యాప్తంగా 230 మంది ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఏజన్సీలో వైద్యం అందకపోవడంతో విషజ్వరాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నా అసలు డెంగీ మరణాలే లేవంటూ ప్రభుత్వం కొట్టివేయడం దారుణమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కేంద్రం ఇవ్వనందునే పాలన సాగడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, వారిని ఇస్తే ఆత్మహత్య చేసుకున్న రైతులు.. విషజ్వరాలతో మృతిచెందిన గిరిజనులను బతికిస్తారా..? ఎండిపోయిన పంటలను కాపాడతారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడే విద్యుత్‌కష్టాలు మూడేళ్లపాటు ఉంటాయని ప్రకటిస్తే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు పత్తి మద్దతుధర రూ.6వేలు ఇవ్వాలని, దళారీ వ్యవస్థకు మంగళం పాడితేనే కరువు పరిస్థితుల్లో రైతులకు ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని, రాష్ట్ర ప్రజల సమస్యలపై అసెంబ్లీలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని చెప్పారు. బడ్జెట్లో శాఖలవారీగా నిధుల కేటాయింపుపై అంశాల వారీగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతుందన్నారు. -
రేపు కలెక్టరేట్ ముట్టడి
జిల్లా కాంగ్రెస్ నేతల తీర్మానం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఈనెల 17న కలెక్టరేట్ కార్యాల యాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. పంటలకు 7గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలంతా సమాయత్తమయ్యారు. అందులో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశానికి కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, జెడ్పీ మాజీ చైర్మన్ ఎ.లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, కొమిరెడ్డి రాములుతోపాటు ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, కేతిరి సుదర్శన్‌రెడ్డి, బాబర్‌సలీంపాషా సహా జిల్లా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. సాధారణ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ నేతలంతా ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలనలో రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున వారి పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని నేతలంతా అభిప్రాయపడ్డారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కనీసం చొరవ కూడా చూపకపోవడాన్ని తప్పుపట్టారు. అదే సమయంలో ఆహార భద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీడియాలో వస్తున్నా మంత్రులు పట్టించుకోకపోవడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ డిమాండ్‌తో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్ నేతలు అందులో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించాలని తీర్మానించారు. కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు పెద్ద ఎత్తున రైతాంగాన్ని తరలించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. సమావేశానంతరం పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో కేసీఆర్ విద్యుత్ అంశంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో దృశ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆయా నేతలు ఏవరేమన్నారంటే.... రైతుల దీనస్థికి కేసీఆరే బాధ్యుడు : జీవన్‌రెడ్డి రైతుల దీనస్థితికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 54 శాతం వాటా తెలంగాణకు సరఫరా చేయాలని రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉన్నప్పటికీ దానిని పొందడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. రైతులను ఆదుకునేందుకు ఎంత ధర వెచ్చించైనా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తామనే వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. పంట, పండ్ల తోటల నష్టపరిహారం నిధులు విడుదలై నాలుగు నెలలైనా నేటికీ ఒక్కపైసా పంపిణీ చేయలేకపోయారు. ఇంతటి అసమర్ధ పాలనను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఏమైనా అంటే చంద్రబాబుపై నెపం మోపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. చంద్రబాబు కరెంటు రానీయకుండా అడ్డుపడితే కేసీఆర్ ఏం చేస్తున్నట్లు? ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఇంకా సీఎంగా కొనసాగడానికి అనర్హుడు. ప్రభుత్వం నిద్రపోతోంది : శ్రీధర్‌బాబు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడమే కారణం. మా హయాంలో విద్యుత్ సమస్య అనేకసార్లు ఎదురైనా కేంద్రం సహకారంతో అధికమించాం. పదేళ్ల పాలనలో ఒక్క ఎకరం పంట కూడా నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. 4 నెలలుగా ప్రభుత్వం నిద్రపోతోంది. తెలంగాణకు కరెంట్ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగలేదని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. చత్తీష్‌ఘడ్ నుంచి కరెంటు తెస్తానన్న కేసీఆర్ మాటలు ఏమైనట్లు? సామాజిక, ఆర్థిక భద్రత కల్పిస్తున్న రేషన్‌కార్డులను ఆహార భద్రతా కార్డుల పేరుతో సగానికి సగం కుదించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు చనిపోతుంటే తట్టుకోలేకపోతున్నాం : పొన్నం ప్రభాకర్ కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు జిల్లాలో 50 మంది రైతులు బలవన్మరణం చెందారు. కేసీఆర్ మాత్రం బతుకమ్మ పండుగలతో లండన్, సింగపూర్ పర్యటనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉండటం సరికాదని కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ముందుకొచ్చాం. రైతుల పక్షాన నిలబడేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించాం. తెలంగాణలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఓటమి నైరాశ్యం నుంచి కాంగ్రెస్ శ్రేణలంతా బయటకు వచ్చి రైతుల పక్షాన నిలబడాలని కోరుతున్నా. రైతులను కోటీశ్వరులను చేయడమంటే ఇదేనా? : జి.వివేక్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులందరినీ కోటీశ్వరులను చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తోందేమిటి. తెలంగాణకు 8 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంది. ఆ డబ్బుతో విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? తుగ ్లక్ పాలనపై బషీర్‌బాగ్ తరహాలోఉద్యమిస్తాం : కటకం మృత్యుంజయం రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది. కరెంట్ లేక రైతులు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతులు మాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నందున ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది తొలిదశ ఆందోళన మాత్రమే కరెంటు సమస్య పరిష్కరించని పక్షంలో బషీర్‌బాగ్ తరహా ఉద్యమాలు చేపడతాం. సమీప భవిష్యత్తుల్లో ఎన్నికలు కూడా లేనందున దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నా. -
ఫ్రీ కరెంట్ అంటే నో కరెంట్ : వెంకయ్యనాయుడు
హైదరాబాద్: ''నా ఉద్దేశంలో ఫ్రీ కరెంట్ అంటే నో కరెంట్'' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు కావాల్సింది రుణమాఫీ కాదు, గిట్టుబాటు ధర అని ఆయన చెప్పారు. త్వరలో వ్యవసాయ ఆదాయ బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. దిగుమతులు తగ్గి ఉత్పత్తి పెరిగినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ** -
కేసీఆర్ మాయల మరాఠీ
సంగారెడ్డి రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని మాజీ డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆరోపించారు. రైతు రుణమాఫీపైనే తొలి సంతకం పెడుతానన్న కేసీఆర్, హామీలు నెరవేర్చకుండా మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం సంగారెడ్డి మండలంలోని కంది, కాశీపూర్, కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ, జుల్కల్, ఇంద్రకరణ్, ఎద్దుమైలారం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జుల్కల్లో నిర్వహించిన బహిరంగ సభలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటు, రుణమాఫీపైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు అడిగిన రైతులపై లాఠీచార్జి చేయించారన్నారు. అందువల్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతాలకా్ష్మరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, తెల్ల రేషన్‌కార్డులు, బంగారుతల్లి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అయితే హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, మాయమాటలు చెబుతూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వంద రోజుల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. అందుకోసం చేతి గుర్తుకు ఓటువేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే రాంరెడ్డి, నాయకులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, ప్రకాశ్, మహబూబ్‌పాషా, చంద్రయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోటార్లు.. మీటర్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మున్ముందు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేస్తుందా..? అత్యధికంగా భూగర్భ జలాల వినియోగంపై ఆధారపడిన జిల్లా రైతుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నల్లగొండది రెండోస్థానం. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగంలో 40శాతం వాటా వ్యవసాయ రంగానిదే. ఇక్కడ 3,11,132 విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయి. అంటే, జిల్లా రైతాంగం ఎంతగా విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టును మినహాయిస్తే, పెద్దగా ఇరిగేషన్ సౌకర్యం లేదు. ఈ కారణంగానే బోర్లు, బావులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఏ రకంగా చూసినా, జిల్లా రైతులసాగు పూర్తిగా విద్యుత్‌తో ముడిపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళనకు కారణమవుతోంది. రాజాపేట మండలం రఘునాథపురంలో ఎనిమిది మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం వివాదాస్పదమవుతోంది. వర్షాభావ పరిస్థిలకు తోడు విద్యుత్ కోతలు ఇప్పటికే రైతులను వేధిస్తున్నాయి. లోఓల్టేజీ సమస్య సరేసరి. జిల్లాకు కేటాయించింది రోజుకు 17.62మిలియన్ యూనిట్లు కాగా, సోమవారం ఒక్క రోజే 18.72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడేశారు. కాగా, వ్యవసాయ పంపుసెట్లపై ఆధారపడి వేసిన మెట్ట పంటలు చేతికి వస్తాయా..? రావా అన్న ఆందోళనా ఉంది. ఇదే తరుణంలో విద్యుత్ అధికారులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెబుతున్న ఉచిత విద్యుత్‌కు అర్థం ఏం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్న రైతులు 3,06,588 మంది. కాగా, ఇదే కేటగిరీలో బిల్లులు చెలిస్తున్న రైతులు మరో 4,544 మంది ఉన్నారు. గత ఏడాది ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద రూ.290.78కోట్లు వెచ్చించారు. ఇంతగా ఉచిత విద్యుత్‌పై ఆధారపడిన రైతుల గురించి ఆలోచించకుండా ప్రయోగాత్మకంగానైనా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం విమర్శలపాలైంది. కాగా, ఇరవై నాలుగు గంటల ఫీడర్పై కనెక్షన్లుండి, ఎక్కువగా వినియోగిస్తున్నందునే మీట ర్ల బిగించామని విద్యుత్ అధికారులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులకే పరిమితం అవుతుందా..? మెల్లమెల్లగా ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ విస్తరిస్తుందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. బిల్లులు చెల్లించాల్సిందే ..! రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన గంగ లింగయ్య, టి.నర్సింహ, జి.నరహరి, శ్రీరాంరెడ్డి తదితర 8 మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు ఇటీవల ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ మీటర్లు బిగించారు. వీరిలో రైతుల్లో చాలా మంది పశుగ్రాసం వేశారు. మీటర్లు ఎక్కువ విద్యుత్ వినియోగించినట్లు నమోదు చేశాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్నామని.. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తామంటే ఉచిత విద్యుత్ అన్న పదానికి అర్థం ఎక్కడని వీరు ప్రశ్నిస్తున్నారు. -
ఖరారు కాని ఉచిత విద్యుత్ కోటా!
* కనెక్షన్ల కోసం రెండు రాష్ట్రాల్లో 2 లక్షల మంది రైతుల నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏ జిల్లాకు ఎన్ని కనెక్షన్లు మంజూరు చేయాలనే విషయంలో ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా కొత్త ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఇప్పటికే డీడీలు చెల్లించిన రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా 31 మార్చి 2014 నాటికి రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు లక్షా 70 వేల మంది రైతులు కొత్త కనెక్షన్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. మార్చి తర్వాత దరఖాస్తు చేసుకున్న వారినికూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఏకంగా 2 లక్షలకు చేరుకుందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొత్త కనెక్షన్లు మంజూరు కాకపోవడంతో రైతులు పక్కదార్లవైపు చూస్తున్నారు. రైతులు ఈ విధంగా కొక్కేల ద్వారా అనధికారికంగా కరెంటును వాడుకోవడంతో ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పదే పదే ట్రిప్ అవుతున్నాయి. అదేవిధంగా లో ఓల్టేజీ సమస్య కారణంగా మోటార్లు కూడా కాలిపోతున్నాయి. ఇది రైతులకు అదనపు భారంగా మారుతోంది. దీనిని నివారించేందుకు వ్యవసాయ సీజను కంటే ముందుగానే కోటా నిర్ణయిస్తే మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్ఆర్
చంద్రబాబు మోసకారి ప్రజల నుంచి గుణపాఠం తప్పదు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మాటకు కట్టుబడే వ్యక్తి అని, అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మండల పర్యటన చివరి రోజు బుధవారం ఆయన పూజగానిపల్లె గ్రా మంలో ప్రసంగించారు. వైఎస్ఆర్ను మాటకు కట్టుబడే వ్యక్తిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్‌పై సంతకం చేశారని, రూ.35 వేల కోట్ల కరెంటు బకాయిలు మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో నేటికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పేద ప్రజల కోసం చేపట్టిన పక్కాగృహాలు, పెన్షన్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్లు, పావలావడ్డీ రుణాలు, 108, 104 పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పడమటి మండలాల్లోని రైతుల కోసం హంద్రీ-నీవా కాలువను ప్రారంభించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఆయన ప్రారంభించిన కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10 శాతం పనుల కోసం నిధులు కేటాయించేందు కు చంద్రబాబు సుముఖత చూపకపోవడం బాధాకరమన్నారు. హంద్రీ-నీవా కాలువలో నీరు వస్తే 36 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాంటి పథకాలను వదిలివేసి, చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీపై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పుల్లారావు చేస్తున్న పొంతనలేని ప్రకటనలు ప్రజలను మోసగించడమేనన్నారు. టీడీపీలో కబ్జాదారులకు, మోసగాళ్లకు స్థానం కల్పించి, పేద ప్రజలను పీడిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ పేదల పక్షిపాతిగా ఉంటూ, రెండు రూపాయల బియ్యం, మద్యపానం నిషేధం అమలుపరచి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తికి అల్లుడైన చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి, అక్రమార్గాల్లో సీఎం అయి మూడు నెలల్లోనే మద్యనిషేధాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. రెండు రూపాయల బియ్యాని ఐదు రూపాయ లు చేసి పేదలను నిలువుదోపిడి చేసి చరిత్రహీనుడుగా మిగిలిపోయారని అన్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించి, ఆయన చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి పరిపాలన చేసే అర్హత లేదన్నారు. త్వరలోనే ప్రజలు చంద్రబాబు కళ్లు తెరిపిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు ద్వారకనాథరెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీటీసీ వెం కటరెడ్డియాదవ్, ఎంపీపీ నరసింహులు, ఏ ఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ ఎంపిటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉచితమనే ఉదాసీనత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ట్రాన్స్‌కో అధికారులు బడాబాబులకే కొమ్ముకాస్తున్నారు. ఆరుగాలం శ్రమించి దేశానికే అన్నం పెడుతున్న రైతన్నలతో కన్నీరు పెట్టిస్తున్నారు. నారుమళ్లు ఎండబెట్టి పరిశ్రమలకు విద్యుత్ మళ్లిస్తున్నారు. వ్యవసాయాన్ని, రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికారికంగానే కరెంటును పరిశ్రమలకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో కరెంటు కోతలు, రైతుల నిరసన సెగల నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు జిల్లాకు రోజుకు 18.8 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేటాయించారు. ఇందులో 6 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి, 9 నుంచి 10 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు టాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. ఇదీ వ్యత్యాసం జిల్లాలో 2.22 లక్షల ఉచిత విద్యుత్తు మోటారు కనెక్షన్లు ఉండగా, వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. ఈ విద్యుత్ మోటార్ల ద్వారా నెలకు 180 లక్షల మిలియన్ల విద్యుత్ ఖర్చవుతోంది. ఒక్కో బోరు మోటరుకుసర్వీస్ పన్ను రూపంలో రూ. 20 మాత్రమే ట్రాన్స్‌కో వసూలు చే స్తోంది. ఈ మొత్తం నెలకు రూ.20 కోట్లకు మించదు. ఇక జిల్లాలో 9 వేల భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, వీటికి రోజుకు 9 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పరిశ్రమలకు ఇస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ. 6 చార్జి వేస్తారు. ఈ లెక్కన పరిశ్రమల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. భారం అంతా వ్యవసాయం మీదే ఇటీవల రాష్ట్రం విడిపోవటం, విద్యుత్ డిస్కం పంపకాలలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోవడం తోడు, వర్షాలు కూడా కురవకపోవడంతో రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్తు కొరత ఏర్పడింది. దీంతో జిల్లాకు రావాల్సిన రోజువారీ వాటాలో 2 మిలియన్ యూనిట్లు కోత పెట్టారు. గత శుక్ర, శని, ఆది వారాల్లో ఈ కోతను మరింత పెంచారు. కేవలం 14 మిలియన్ యూనిట్లు మాత్రమే జిల్లాకు సరఫరా చేశారు. అంటే దాదాపు 4.8 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరాపై కోత పడింది. కోత పడిన మొత్తాన్ని విద్యుత్ అధికారులు అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి పంచి పంపిణీ చేస్తే సమస్య వచ్చేదే కాదు. కానీ ఇక్కడే విద్యుత్ అధికారులు చేతివాటం చూపించారు. వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్ కాబట్టి కోత పడిన మొత్తం లోడును వ్యవసాయంపైనే వేశారు. గృహ అవసరాలకు వినియోగపడే విద్యుత్‌లో కూడా కోతపెట్టి పరిశ్రమలకు పంపించారు. దీంతో వ్యవసాయానికి రోజుకు కనీసం 2 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఒకటి రెండు రోజుల పాటు ఓపిక పట్టిన రైతులకు మడి ఎండిపోయే పరిస్థితి రావడంతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. రోడ్ల మీదకు వచ్చి రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపారు. -
‘భారం’ మోపేందుకే ఆ బిగింపు!
తుని : వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రభుత్వం చెప్పి అడ్డదారిలో ఉచిత విద్యుత్‌కు మంగళం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంట రుణాల మాఫీ హామీ అమలులో మాట మార్చి రైతులను వంచించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉచిత విద్యుత్ కేటగిరీలో ఉన్న వ్యవసాయ బావులకు మీటర్లు ఏర్పాటు చేయజూస్తూ వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయ బావులకు మీటర్లు వేసేది ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకేనని అధికారులు చెబుతున్నా.. అన్నదాతలకు నమ్మకం కలగడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం వల్ల వేలాది మంది రైతులు ప్రయోజనం పొందారు. మెట్ట ప్రాంతంలో ఎక్కువ శాతం రైతులు బోరు బావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల పరిధిలో ఉచిత విద్యుత్ కేటగిరీలో 12,165 కనెక్షన్లు ఉన్నాయి. 2005 నుంచి ఇప్పటి వరకు రైతులు ఒక్క రూపాయి బిల్లు చెల్లించాల్సిన అవసరం రాలేదు. తత్కాల్, చెల్లింపు కేటగిరీలోని 3,630 కనెక్షన్ల ద్వారా వాడిన విద్యుత్‌కు మాత్రం బిల్లులు చెల్లించాలి. ఎప్పటికప్పుడు వసూలు చేయకపోవడంతో వీటి బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. జగ్గంపేట డివిజన్ పరిధిలో రూ.6.42 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని రైతుల నుంచి వసూలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ‘నూరురోజుల ప్రణాళిక’తో మళ్లీ పాతరోజులు..! మెట్ట ప్రాంతంలోని 12,165 ఉచిత విద్యుత్ కనెక్షన్లకు కొత్త మీటర్లను వేయడానికి ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీ రైతుల జాబితా తయారు చేసి మీటర్లు ఇవ్వనున్నారు. వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇవన్నీ పూర్తి చేయడానికి వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న బోరు బావుల మోటార్లను తనిఖీ చేసి, వాటి స్థానంలో విద్యుత్ ఆదాకు కొత్త మోటార్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మళ్లీ పాత రోజులు వస్తున్నాయని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు కొత్త మీటర్ల మాటున తిరిగి తమకు చేదును చవి చూపి స్తారని, మునుముందు ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టి, బిల్లులు గోళ్లూడగొట్టి వసూలు చేయడానికే ఇదంతా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఉచిత విద్యుత్ కేటగిరీలో ఉన్న వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపునకు ట్రాన్స్‌కో అధికారులు రాజానగరం మండలం నుంచి శ్రీకారం చుట్టినట్టు తె లిసింది. అధికారులు మాత్రం పాత కనెక్షన్లకు కాక.. కొత్త వాటికి మాత్రమే మీటర్లు అమర్చుతున్నట్టు చెపుతున్నారు. -
ఉచిత కరెంటుకు మంగళం!
ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌కోకు అందని నిధులు లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న ట్రాన్స్‌కో మూన్నాళ్ల ముచ్చటగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఎస్సీ, ఎస్టీలకు ఆసరాగా ఉండేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ఆరు నెలలు తిరక్కుండానే అభాసుపాలవుతోంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దీనిగురించి పట్టించుకోవడంలేదు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రాన్స్‌కో లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తోంది. పలమనేరు: ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడే లబ్ధిదారులకు ఉచిత కరెంటును అందజేసేలా గత ప్రభుత్వం ఉచి త విద్యుత్ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు రాకపోవడంతో ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ట్రాన్స్‌కో అధికారులు ఎస్సీ, ఎస్టీల నుంచి విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు. పథక ఉద్దేశమేమిటంటే... ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ఉచిత కరెంటును అందివ్వడమే ఈ పథక లక్ష్యం. ఇందుకోసం గత ఏడాది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా ఈ పథకానికి నిధులు సమకూర్చింది. కార్యక్రమ నిర్వహణను సాంఘిక సంక్షేమశాఖకు అప్పగించింది. పథకం ప్రారంభమైన తర్వాత రెండు నెలలు మాత్రం ట్రాన్స్‌కోకు నిధులు అందాయి. ఆపై దీని గురించి పట్టించుకోలేదు. ట్రాన్స్‌కోకు రూ.2.40 కోట్ల బకాయి తిరుపతి ట్రాన్స్‌కో సర్కిల్ పరిధిలోని రూరల్ డివిజన్లలో ఈ పథకం అమలవుతోంది. చిత్తూరురూరల్, మదనపల్లెరూరల్, తిరుపతి రూర ల్, పూతలపట్టు, పీలేరు డివిజన్ పరిధులతో పాటు కుప్పం రెస్కోతో కలిపి దాదాపు 44 వేల మంది ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులున్నారు. వీరికి సంబంధించి ఆరు నెలలుగా రూ.2.40 కోట్ల వరకు సాంఘిక సంక్షేమ శాఖ ట్రాన్స్‌కోకు బకాయిపడింది. ఇన్నాళ్లూ ఎదురుచూసినా డబ్బులు రాకపోవడంతో లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తోంది. రెండు నెలల నుంచి వసూలు రెండు నెలల నుంచి ట్రాన్స్‌కో అధికారులు లబ్ధిదారుల నుంచి కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు. కొందరు బిల్లులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఓ నెల వేచిచూసే ధోరణిలో ట్రాన్స్‌కో ఉం ది. వచ్చే నెల నుంచి కచ్చితంగా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి. కుదరదంటే ఇళ్లకు డీసీలు చేయాల్సి వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై చిత్తూరు ట్రాన్స్‌కో డీఈ రమణను వివరణ కోరగా పథకం ప్రారంభమయ్యాక రెండు నెలలు మాృతం బిల్లులందాయని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తమకు డబ్బు జమ కాలేదన్నారు. తమ శాఖకు ఈ బిల్లులు గుదిబండలా మారాయన్నారు. అందుకే ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నామన్నారు. -
రాజన్నకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన జయంతిని మంగళవారం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 65వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ విగ్రహానికి పార్టీ కేంద్రపాలకవర్గ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. పార్టీ పట్టణశాఖ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు దేశాయ్ తిప్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై వైఎస్ఆర్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. పుంగనూరులో జరిగిన జయంతి వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ పాల్గొన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో వరుణయాగం జరిపించారు. వర్షాలు విరివిగా కురిసి వ్యవసాయం అభివృద్ధి చెంది వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరాలని మొక్కుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజవర్గంలోని పలు మండ లాల్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి కొత్తకోట, మొలకలచెర్వు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. చిత్తూరు డీసీసీబీ కార్యాలయం ఆవరణలోని వైఎస్ఆర్ విగ్రహానికి జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అనాథలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనుప్పల్లెలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, స్థానిక బధిర పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూజలు చే సి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. బంగారుపాళెం, యాదమరి, త వణంపల్లెల్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గం ఇన్చార్జ్ ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. -
రాజన్నకు నివాళి
సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను, ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు, అనాథాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో అన్నదానం చేశారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అపర భగీరథుడు, పేదల పెన్నిధి వైఎస్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, గిరిజనులకు భూ పంపిణీ చేసి బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో రాష్ట్రం చిన్నాభిన్నమై పోయిందని, పేదలకు సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో..రాదోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగభూషణం, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు ఆకుల మూర్తి మాట్లాడుతూ వైఎస్ అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల బండితో రాష్ట్రాన్ని పాలించారన్నారు. అలాంటి మహానేత మరణంతో ప్రజలకు భరోసా ఇచ్చేవారు కరువయ్యారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మీ, ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్, నాయకులు షర్మిలాసంపత్, కాంపెల్లి బాలకృష్ణ, రఘుదారల కొండలరావు, దామోదర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు, మందడపు రామకృష్ణారెడ్డి, భాస్కర్‌నాయుడు, పత్తి శ్రీను, మైకా కృష్ణ, పొదిలి వెంకటేశ్వర్లు, కొంగర జ్యోతిర్మయి, ఆలస్యం సుధాకర్, చక్రపు సత్యనారాయణ, షకీనా, గడ్డం ఉపేందర్, వెంపటి నాగేశ్వరరావునాయుడు, కొణత ఉపేందర్, బాణాల లక్ష్మణ్, పెరుమాళ్ల లత, ఉపేంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ.. వైఎస్ జయంతి సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన కొత్తగూడెం మండలం పాత అంజనాపురం గ్రామానికి చెందిన చింత కూమారికి పండ్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి రాజశేఖర్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేశారు. అనంతరం దమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో 25 మంది పేదలకు వస్త్రదానం చేశారు. వైరా, కొణిజర్ల మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాణోత్ మద న్లాల్ పాల్గొన్నారు. వైరా బాలవెలుగు పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైరా క్రాస్‌రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. మణుగూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేక్‌కట్ చేసి వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పినపాకలోని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భద్రాచలం పాత మార్కెట్ సెంటర్లో ఉన్న వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎటపాకలోని సరోజనమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కూసుమంచి, నాయకన్గూడెంలలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం మూడు జిల్లాల కో ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి పాల్గొని వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఖమ్మం రూరల్ మండలం మద్దివారిగూడెంలో వైఎస్ విగ్రహానికి పార్టీ నాయకులు మందడి పుల్లారెడ్డి, కొత్తా శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు. ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, టేకులపల్లి మండల కేంద్రాల్లోనూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు పట్టణ కన్వీనర్ దొడ్డా డానియేల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెం పట్టణ కన్వీనర్ బీమా శ్రీధర్ ఆధ్వర్యంలో సెవెన్‌హిల్స్ సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాల్వంచలో జిల్లా పార్టీ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొత్వాల శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సత్తుపల్లిలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. మధిరలో మండల కన్వీనర్ ఎన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రభుత్వ ఆస్పత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
బాబు కాలం భయానకం
కరుణించని ప్రకృతి ఓ వైపు అతలాకుతలం చేయగా.. మరో వైపు ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపింది. అన్నదాతలు బాబు తొమ్మిదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు దిక్కులేని అనాథలుగా మారారు. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. రైతులకు నడిపొద్దున ఆకాశంలో చుక్కలు చూపిన ఆ భయానక రోజులను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. మళ్లీ ఆయన పాలనంటే ఎక్కడ ఉచిత విద్యుత్ ఎత్తేస్తాడోనని.. కరెంటోళ్లు స్టార్టర్లు ఎత్తుకెళ్తారేమోనని.. విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తారేమోనని జడుసుకుంటున్నారు. బుద్ధి ఉంటే మరోసారి ఓటేస్తామా అంటూ రైతులు తమ ఇక్కట్లను కళ్లకు కట్టినట్లు ఏకరువు పెడుతున్నారు. బాబంటే భయమేస్తాది తొమ్మిదేళ్లలో యానాడు పంటలు సరిగ పండల్యా. సేన్లు సేసుకోలేక పొట్ట సేతపట్టుకుని బెంగళూరు, గుంటూరుకు వెళ్లేటోల్లం. పంట అంతంతే వస్తుండె. తక్కువ ధరకు అమ్ముకుని నస్టపోతుంటిమి. బిల్లులు కట్టకపోతే కరెంటోళ్లు ఎంటబడుతుండ్రి. రేత్రిళ్లు వచ్చి కరెంటు పేకేసిపోతుంటే ఏమీ అనలేక ఏడుస్తుంటిమి. పంటలు ఎండిపోతెంటె ఎవరికి సెప్పుకోవాల్నో తెలకపోతుండె. వైఎస్ వచ్చినాక మా బతుకులు బాగుపడినాయి. - ఈరన్న, బసరకోడు, ఆదోని మండలం పంటలు ఆటికాడికే పదెకరాల పొలం.. ఒక బోరు ఉంది. నెలకు రూ.250 లెక్కన సంవత్సరానికి రూ.3 వేల బిల్లు వచ్చేది. పంటలు ఆటికాటికే పండుతుండె. కరువుతో కరెంటు బిల్లులు కట్టలేమని నెత్తినోరు మెత్తుకున్నా యా సామీ పట్టించుకుంటుండ్ల్యా. రైతులంటే చంద్రబాబుకు గిట్టదు. వైఎస్ వచ్చినాక ఉచిత విద్యుత్ ఇచ్చి నాలాంటి రైతులకు అండగా నిలిచినారు. ఆయన మేలు మరిచిపోలేం. కరెంటు కూడా బాగా ఇస్తుండ్రి. - పెద్దన్న, శిరివెళ్ల పోలీసులు వస్తుండ్రి కరెంటోళ్లు విద్యుత్ బకాయిల వసూళ్లకు పోలీసులను వెంటబెట్టుకుని వస్తుండ్రి. స్టార్టర్లు ఎత్తుకుపోతే ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటిమి. ఎకరా రూ.14 వేల మాదిరి ఆరు ఎకరాలు కౌలుకు తీసుకోయింటి. వరి పంట వేస్తే కరెంటు ఎప్పుడొస్తుందో తెలక రాత్రంతా ఎదురుచూడాల్సి వస్తుండె. బిల్లులు ఏమో వేలల్లో వస్తుంటే ఎట్టా కట్టాలో తెలక అల్లాడిపోతుంటిమి. బాబు పేరు వింటే ఇప్పటికీ భయమేస్తాది. - బాలవర్ధిరాజు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల మండలం పాలనంతా కేసుల భయమే చంద్రబాబు పాలనలో విద్యుత్ బిల్లులు చెల్లించలేని తమలాంటి రైతులంతా కేసుల బయంతో చచ్చిపోయేటోళ్లం. నాకున్న ఐదెకరాల్లో పత్తి, వరి, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తుంటి. నెల తిరిగేసరికి కరెంటు బిల్లు వేలల్లో వస్తుండె. ఆర్థిక స్థోమత లేక బిల్లు చెల్లించకపోతే అధికారులు వెంటబడుతుండ్రి. కరెంటు కట్ చేస్తూ.. స్టార్టర్లు ఎత్తుకపోతున్యారు. వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తుండె. - చాగంటి శ్రీనివాసరెడ్డి, చెన్నంపల్లె, అవుకు(మం ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తాడు తన పాలనలో రైతులను ఏపుకు తిన్న చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తాడు. నాకు ఏడెకరాల పొలం ఉంది. మరో ఐదెకరాలు గుత్తకు తీసుకున్నా. రెండు మోటార్లు ఉన్నాయి. నెలకు రూ.300 విద్యుత్ బిల్లు వచ్చేది. కరెంటోళ్లు బిల్లుల కోసం చంపుకుతింటుండ్రి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.2వేల విద్యుత్ బకాయి రద్దయింది. బాబు ఇప్పుడు ఏమి చెప్పినా రైతులు నమ్మే పరిస్థితి లేదు. - జి.సలాం, శిరివెళ్ల పారిపోయేటోళ్లం నాకున్న నాలుగున్నర ఎకరాల్లో అరటి, వరి సాగు చేసేందుకు విద్యుత్ బిల్లు రూ.8 వేల వరకు వచ్చేది. వర్షాలు కురవక.. కరెంటు సక్రమంగా సరఫరా కాక పంటలు చేతికందకపోవడంతో చంద్రబాబు పాలనలో ఐదారేళ్లు రూ.50వేల వరకు బిల్లు బకాయి పడింది. వారానికోసారి కరెంటోళ్లు వచ్చి నానా రభస చేసేటోళ్లు. పంట వచ్చే వరకు గడువివ్వమన్నా వినలేదు. జీపు శబ్ధం వినపడితే చాలు పారిపోవాల్సి వచ్చేది. - టంగుటూరు రామచంద్రుడు, ఆలమూరు కరెంటు కోసం ఎదురు సూస్తుంటిమి చంద్రబాబు పాలనలో కరెంటు కోసం ఎదురుచూడాల్సి వస్తుండె. ఎప్పుడొస్తాదో.. ఎప్పుడు పోతాదో తెలక శానా కష్టపడుతుంటిమి. కరెంటు బిల్లులు కూడా అట్టనే వస్తుండె. మాలెక్కటి రైతులకు వేలల్లో బిల్లులొస్తే ఎట్టా కట్టాల. ఆయనేమో అర్థం సేసుకోరు. కరెంటోళ్లు మీద పడుతుండ్రి. ఆళ్లు వస్తారని తెలిస్తే పారిపోతుంటిమి. కరెంటు లేక నీళ్లు పెట్టకపోతే పంట ఎండిపోతుండె. వైఎస్ వచ్చినాక కరెంటు ఇబ్బందులు లేవు. - లక్ష్మీనారాయణరావు, ఎడవలి పంటలు ఎండిపోతుండె నాకు మూడెకరాల తడి భూమి ఉంది. ఏటా రెండు కార్లు పండిస్తా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లు శానా వచ్చేది. నెలకు రూ.1000ల వరకు వస్తుండె. తినేకే కష్టమైతుంటే అంత డబ్బులు ఎట్టా కడతామని ఎవ్వరూ ఆలోచించకపోయిరి. పంటలు చేతికొస్తాయనంగ కనెచ్చన్లు కట్ సేసిపోతుండ్రి. నీళ్లు పారించుకోలేక నరకం కనిపిస్తుండె. అప్పుల పాలయితుంటిమి. వైఎస్ వచ్చిన ఉచిత విద్యుత్ ఇచ్చినారు. ఇప్పుడు బాగుంది. - పెద్దన్న, వెల్దుర్తి ఆయిల్ ఇంజన్లు పెట్టుకోయింటిమి నాలుగు ఎకరాల పొలం ఉంటే బోరు వేయించుకోయింటి. చంద్రబాబు యానాడు కరెంటు సక్కగా ఇయ్యల్యా. ఒక్క కారు పండించుకోవడం కూడా గగనమే. కరెంటు బిల్లులు చెల్లించుకోలేకపోతే నాలుగైదుసార్లు సారోళ్లు బోరు స్టాటర్లు పీక్కుపోయిండ్రి. దిక్కులేక ఆయిల్ ఇంజన్‌తో వక్కిలేరు నీటిని పారించుకుంటుంటి. వైఎస్ ముఖ్యమంత్రి అయినాక ఉచిత విద్యుత్ ఇచ్చినాడు. ఇప్పుడు రెండు కార్లు పంటించుకుంటున్నా. - ముల్లా అల్తాఫ్, కోటకందకూరు పంటలు ఎండిపోయేవి చంద్రబాబు పాలనలో కరెంటు కోతలు ఎక్కువుండేవి. ఇంటోళ్లంతా కరెంటు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. రాత్రి పూట కాపలా కాసినా అట్లొచ్చి ఇట్ట పోయే కరెంటుతో నరకం కనిపించేది. ఎకరా కౌలు రూ.5వేలు. పంట ఎండిపోతుంటే ఎడ్చేదొక్కటే తక్కువ. కరెంటోళ్లు బిల్లుల కోసం రాత్రి పగలు తేడా లేకుండా వచ్చిపోతుండ్రి. రాజన్న పాలనలో రెండు కార్లు మాగాణి పండిస్తున్నా. ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నా. - శ్రీను, మిట్టపల్లె -
ఉచిత విద్యుత్, టీవీలు వంద గజాల స్థలం
ఇదీ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో సాక్షి, హైదరాబాద్: గృహాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు... పేదలకు కలర్టీవీలు... ఇంటీర్మీడియెట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు... ఆడపిల్లలకు పుట్టిన వెంటనే వందగజాల ఇంటిస్థలం... ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంపు... శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ పీసీసీ రూపొందించిన మేనిఫెస్టోను కేంద్రమంత్రి జైరాం రమేష్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. కేంద్రమంత్రి చిరంజీవి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, ఏఐసీసీ ఎస్సీసెల్ ఛైర్మన్ కొప్పుల రాజు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, శైలజానాధ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను రఘువీరా వివరిస్తూ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి దశసూత్ర ప్రణాళికలను రచించినట్లు చెప్పారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నిరాటంకంగా విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. విత్తన వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు సమగ్ర విత్తన చట్టం తేస్తామని పేర్కొన్నారు. -
పగటిపూట.. 7 గంటలు
పస్తుతం వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్ అంటూ కేవలం 2-3 గంటలు మాత్రమే వస్తోందని పార్టీ విమర్శించింది. అది కూడా రాత్రి సమయాల్లో వస్తుండటంతో పొలాలకు వెళ్లిన రైతులు పాముకాటుకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రైతులకు పగటి పూట కచ్చితంగా 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీనిచ్చింది. తేకాకుండా 2019 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా... ప్రతి పల్లెకు కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటించింది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది. -
ఓటమి భయంతోనే సర్వేల జిమ్మిక్కులు
గారడీల బాబుకి ప్రజలే బుద్ధి చెబుతారు ఎల్లోమీడియా భజనను ప్రజలు చూడడం, వినడం మానేశారు జనం గుండెల్లో జగన్‌కే స్థానం తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: జనంలో ఆదరణ పూర్తిగా లేకుండా పోయింది.. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలన్న ఓటమి భయంతోనే ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని సర్వేల్లో టీడీపీకే బాగుంది.. అంటూ చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తున్నాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని జయనగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో పార్టీ నాయకుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను అనేక రకాలుగా కష్టాలు పెట్టి కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబుకు ఓట్లు వేయరనే భయంతో ఉత్తుత్తి సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఈ సర్వేల్లో తమ పార్టీకే బాగుందని సంకలు గుద్దుకుంటున్నాడన్నారు. ఇలాంటి గారడీలు, జిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. తొమ్మిదేళ్లపాటు ప్రజలను కష్టాలపాలు చేసిన పాపం ఊరికే పోదన్నారు. చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తేవాలన్న ఉద్దేశంతో ఎల్లోమీడియాలో రాస్తున్న రాతలను చదవడం, చూడడం ప్రజలు మానేశారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా జనం గుండెల్లో జగన్‌కు మాత్రమే స్థానముందని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరేళ్లపాటు పేదల సంక్షేమం కోసం అందించిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. జగనన్న అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల్లోని 20వేల కోట్ల మహిళా రుణాలను పూర్తిగా రద్దు చేస్తారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తారని తెలిపారు. అమ్మఒడి పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500 చొప్పున ప్రతినెలా వారి ఖాతాలో వేస్తామన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే జగన్మోహన్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపించి ప్రజలను కష్టపెడితే ప్రజలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపించాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్కె. బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, కొమ్ము చెంచయ్యయాదవ్, పోతిరెడ్డి వెంకటరెడ్డి, కె.అమరనాథ్‌రెడ్డి, తాల్లూరి ప్రసాద్, ఆమోస్‌బాబు, నల్లాని బాబు, నూరుల్లా, గౌస్‌బాషా, ఎర్రబెల్లి వెంకి, నరసింహారెడ్డి, చెలికం కుసుమారెడ్డి, పునీత, గీతాయాదవ్, శాంతారెడ్డి, సులోచన, కృష్ణవేణమ్మ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 6, 11వ తేదీల్లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ ఓటర్లను కోరారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు రాజన్న పథకాలు చేరాయని వివరించారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు లక్షలాది మందికి మేలు చేశాయన్నారు. రైతు ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో తగ్గడానికి రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలే కారణమన్నారు. మహానేత పథకాలను యథాతథంగా ప్రజలకు మరోసారి అందించేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందన్నారు. తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలు కోరారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అందోల్ మండలం నేరేడుగుంట ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మొగులయ్యను కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ప్రచారం చేయకుండా అడ్డుకోవడం, లేనిపోని కేసులు పెడతామని బె దిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలని కానీ ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడే వారికి ఓటర్లు పట్టం కడతారని ప్రభుగౌడ్ స్పష్టం చేశారు. అరాచకాలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఎంఆర్ఓ ఎల్లయ్య, యువజన సంఘం నాయకులు శివశంకర్ పాటిల్, అశోక్‌గౌడ్, జగదీష్, సురేష్, సుశాంత్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏకమవుతున్న తస్మదీయులు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కలసి ఎన్నికల వేళ ప్రజలను మరోసారి వంచి స్తున్నారుు. రాష్ట్రాన్ని నిరభ్యంతరంగా ముక్కలు చేసేసుకోవచ్చం టూ తెలుగుదేశం పార్టీ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం రాసిస్తే.. ఆఖరి బంతి మిగిలే ఉందంటూ చివరి వరకూ నమ్మబలికి జనానికి మొండిచేయి చూపించారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఆ రెండు పార్టీల నాయకులు ఓట్ల కోసం ఏకమవుతున్నారు. ఏమార్చడానికి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. జిల్లాలో సహకార ఎన్నికల నుంచీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయం కొనసాగుతోంది. వ్యవసాయం దండగ అని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన టీడీపీతో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు అనుకూలంగా లేని రైతుల ఓట్లను గల్లంతు చేసింది. అదే పొత్తు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగింది. గెలవడం కోసం ఎంతటికైనా తెగించే ఆ రెండు పార్టీలు తమ అభ్యర్థులకు మేలు చేసేందుకు అధికార దుర్వినియోగానికి కూడా వెనకాడలేదు. మునిసిపాలిటీల్లో పనులు మంజూరు చేయడం దానిలో భాగంగా జరిగిందే. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలచేశారు. తద్వారా గ్రామీణ నిరుద్యోగులకు గాలమేశారు. తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుండగా పాత మిత్రులకు ప్రలోభాలు ఎరవేసి టీడీపీ తనవైపు లాక్కొంటోంది. ఇన్నాళ్లూ చీకటి ఒప్పందాలు చేసుకుని తెరవెనుక మద్దతు తెలిపిన వారిని ప్రత్యక్షంగా తమ పార్టీలో చేర్చుకుంటోంది. తద్వారా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ఇందుకోసం సామాజిక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ మినహా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా ఓ సామాజిక వర్గానికి నష్టం వాటిల్లుతుందనే భయాన్ని సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేతలు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టి తామంతా ఒక్కటేనని బహిర్గతం చేస్తున్నారు. పదవే ముఖ్యమని చాటుతున్నారు. -
వస్తోంది స్వర్ణయుగం
ముదుసలి వయసులో నడవలేక.. చూపు సరిగా కానరాక.. కన్నబిడ్డల సహకారం అందక నిట్టూర్పులిడిచే వృద్ధులకు దిక్కెవరు? అందుకే ప్రభుత్వమే వారిని ఆదుకోవాలి. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితి అత్యంత దుర్భరం. వారికి నెలకు కేవలం రూ.70 పింఛన్ లభించేది. అది కూడా అతి తక్కువ మందికి. ఇక నడవలేని వికలాంగులు.. ఇతర వైకల్యంతో బాధపడేవారికి ఏమాత్రం భద్రత ఉండేది కాదు. ఈ పరిస్థితుల్ని వైఎస్ సమూలంగా మార్చారు. వృద్ధులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున ప్రతి నెలా సమర్థవంతంగా అందించారు. ప్రస్తుతం జిల్లాలో 2,84,154 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. 1,60,789 మంది వృద్ధులు.. చేనేతలు 6,636 మంది, వితంతువులు 70,023 మంది, అభయహస్తం కింద 17,659 మంది నెలకు రూ.200 చొప్పున పింఛన్ అందుకుంటున్నారు. వికలాంగులు రూ.500 తీసుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వీరందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని జగన్ హామీ ఇచ్చారు. వారికి ఆయన చేయదలచుకుంది... వికలాంగులకు రూ.1000, ఇతర సామాజిక పింఛనుదారులకు రూ.700 చొప్పున పింఛను మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల వంటివారు ఆయన్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. పడిగాపుల విధానం పోవాలి అందుకే వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అధిక ధర చెల్లించి కొనుక్కున్న విత్తనాలు.. ఆకాశాన్నంటిన ఎరువులు, పురుగుమందులు.. విపరీతంగా పెరిగిన కూలి రేట్లు.. అయినా అన్నదాత అప్పు చేసి మరీ వ్యవసాయానికి సిద్ధమవుతాడు. వరుణ దేవుడు కరుణించకపోయినా.. భూమాత అయినా కాపాడుతుందిలే అనుకొని నాట్లు వేస్తాడు. కానీ ఏం లాభం. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే పొలం దగ్గర కాపలా కాయాలి. వైఎస్ మరణానంతరం రైతులు అనుభవిస్తున్న వ్యధలివి. ప్రస్తుత పాలకులు వైఎస్ హామీని గాలికి వదిలేశారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నా.. కరెంటు తీగలు వేళ్లాడుతున్నా అధికారులు చలించలేదు. ఈ పరిస్థితులు మార్చేందుకు జగన్ నడుం బిగించారు. ప్రస్తుతం జిల్లాలో 115652 మంది రైతులు ఉచిత విద్యత్ లబ్ధిదారులుగా ఉన్నారు. కానీ వీరంతా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన.. ఎటువంటి ఆటంకాలు లేకుండా 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తామని జగన్ వెల్లడించారు. అందుకే తిరిగి రాజన్న రాజ్యం రాకపోదా అన్న ఆశాభావంతో రైతన్నలున్నారు. 108 సేవలు సరిపోతున్నాయా? ఎక్కడైనా ప్రమాదం జరిగితే.. వైఎస్‌కు పూర్వం పరిస్థితులు ఎలా ఉండేవో గుర్తున్నాయా? క్షతగాత్రులు బతికే అవకాశం ఉన్నా.. ప్రైవేటు వాహనాలు సకాలంలో దొరికేవి కాదు.. ఆస్పత్రుల్లో వెంటనే చేర్చుకొనేవారు కాదు.. ఫలితంగా విలుైవె న ప్రాణాలు అన్యాయంగా పోయేవి. ఈ విధానాన్ని మార్చేందుకు దివంగత నేత వైఎస్ 108 ప్రవేశపెట్టారు. దానివల్ల జరిగిన లాభం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అంబులెన్స్ సేవలు మసకబారుతున్నాయి. వాహనంలో వెంటిలీటర్లు లేక చాలా మంది చనిపోతున్నారు. ఈ విధానాన్ని మార్చేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. 108ని పూర్తిగా ఆధునీకరిస్తానన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రోల్‌మోడల్‌లా తీర్చిదిద్దుతామని స్పష్టం చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఆదిలోనే ఇక్కట్లు
కాసిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా యాభై యూనిట్లలోపు విద్యుత్ వాడుకుంటే ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ఆదివాసీ గిరిజనులకు కలగానే మిగలనుంది. ఉచిత విద్యుత్ అందించాలంటే సంబంధిత కులధ్రువీకరణ పత్రాలు అందించాలని అధికారులు స్పష్టం చేయడంతో గిరిజనులకు అవగహన లేక మీసేవ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా.. వారికి సర్టిఫికెట్లు అందడం లేదు. సర్టిఫికెట్లు అందించె గడువు ముగిసినా నేటికీ 50 శాతం మంది కూడా ధ్రువీకరణపత్రాలు ఇవ్వలేదు. కాసిపేట మండలంలో మొత్తం 3,100 కనెక్షన్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినవిగా నమోదయ్యాయి. వీరంతా ఉచిత విద్యుత్‌కు అర్హులు కాగా.. ఇప్పటి వరకు కేవలం 650 మంది (22శాతం) మాత్రమే కులధ్రువీకరణ పత్రాలు అందించారు. గిరిజనులకు అవగహన కల్పించాల్సి ఉన్నా.. అధికారుల సహకారం ఆ దిశగా కనిపించడం లేదు. విద్యుత్‌శాఖ అధికారులు గ్రామాల వారిగా మీటర్ల నంబర్ల ఆధారంగా లబ్ధిదారుల జాబితా తయారుచేసి రెవెన్యూ అధికారులతో ధ్రువీకరణ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. అయితే.. అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. ఒక్క బల్బు మాత్రమే వాడే మారుమూల ప్రాంతాల ఆదివాసీలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారు. కేవలం 22 శాతం మంది మాత్రమే పత్రాలు అందించడంపై ఎంత వెనకబడి పోయారో తెలుస్తోందని, ప్రభుత్వ పథకం గిరిజనులకు అందకుండా చేయడం దారుణమని, గడువుపెంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అన్నదాతలకు వైఎస్ జగన్ వరాలు
-
ఉచిత షాక్
వరంగల్, న్యూస్‌లైన్: రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ‘భస్మాసుర హస్తాన్ని’ ప్రయోగిస్తోంది. వారి చేతులను వారి నెత్తిపైనే పెట్టుకునేలా చేసి.. ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకుంటోంది. 2009కి ముందు సర్కారు భరించిన సర్వీస్ చార్జీలను రైతులపైనే వేయాలని కిరణ్ ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఆదేశాలిచ్చింది. రూ.20 ఉన్న సర్వీస్ చార్జీలను రూ.30కి పెంచడమే కాకుండా... చెల్లింపులపై దొంగాటకు తెరతీసింది. ముందుగా కోట్లాది రూపాయలు పెండింగ్‌లో పెట్టి వాటిని విడుదల చేయకుండా.... రైతుల నుంచి వసూలు చేసుకోకుండా ఫైల్‌ను తొక్కి పెట్టింది. ప్రభుత్వం చెల్లిస్తుందంటూ 2012 నవంబర్ వరకూ విద్యుత్ శాఖ అధికారులను మభ్యపెట్టింది. కానీ... అదే ఏడాది డిసెంబర్లో సర్వీస్ చార్జీలను రైతుల నుంచే వసూలు చేసుకోవాలని ఈఆర్సీ, డిస్కంలకు దొంగచాటున ఆదేశాలిచ్చింది. పాత పద్దులను కూడా వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. రైతులకు అనుమానం రాకుండా సేవాపన్నును వడ్డీతో సహా రాబట్టుకునే పన్నాగాన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా ఉచిత విద్యుత్‌ను విని యోగించుకుంటున్న జిల్లా రైతులపై వడ్డీ భారం సుమారు రూ.4,68,06,600 పడుతోంది. పన్నాగం ఇదే... నెలల వారీగా సర్వీస్ చార్జీలు చెల్లించడం రైతులకు ఇబ్బందిగా ఉంటుందని... పంట దిగుబడులు, సీజన్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆరునెలలకోసారి కట్టేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైతులకు వెసులుబాటు కల్పించినట్లు అనిపించినా... ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. సర్వీస్ చార్జీలకు వడ్డీ వేసి వారిని దొంగదెబ్బ తీసింది. భారం ఇలా... వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వినియోగించే రైతులు జిల్లాలో 2,60,037 మంది ఉన్నారు. ఉచిత విద్యుత్‌ను వినియోగించుకునే ప్రతి రైతు నెలకు రూ. 30 చొప్పున సర్వీసు చార్జీ చెల్లించాలి. ప్రభుత్వం అవకాశం కల్పించిన మేరకు ఒక్కో రైతు ఆరు నెలలకు చెల్లించాల్సింది రూ.180. సర్వీస్ చార్జీలపై నెలకు 0.5 పైసల చొప్పున వసూలు చేస్తున్న వడ్డీ నెలకు రూ.15 చొప్పున ఆరు నెలలకు రూ.90. ఇలా ప్రతి రైతుపై ఆరు నెలలకు రూ.270 భారం పడుతోంది. అంటే ఆరు నెలలకు 2,60,037 మంది రైతులు సర్వీస్ చార్జీల కింద రూ.4,68, 06,660 కాగా... వడ్డీ కింద రూ.2,34,03,330 చెల్లించా ల్సి వస్తోంది. ఇలా ఏడాదికి సర్వీస్ చార్జీల పేరిట రూ.9,36, 13,320... వడ్డీ కింద రూ.4,68,06,660 భారం పడుతోంది. కరెంటోళ్ల స్పెషల్ డ్రైవ్ రైతుల నుంచి సర్వీస్ చార్జీల వసూళ్లకు ఎన్పీడీసీఎల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రైతులను బెదిరిస్తున్నారు. చెల్లించని పక్షంలో రబీలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, మీటర్లు తీసుకెళతామని హెచ్చరిస్తుండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. -
ఉత్తుత్తి ఉచితం
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : పేరుకే ఉచితం.. రైతన్న విషయంలో స్పందన మాత్రం అనుచితం! ఉచిత విద్యుత్తు విషయంలో ప్రభుత్వం వైఖరి ఇదీ.. జిల్లా వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ బెంబేలెత్తించే విధంగా ప్రభుత్వం తీరు ఉంది. రెండు విడతలుగా ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్టు అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పగటి పూట ఇస్తున్న మూడున్నర గంటల్లో గంటన్నర పూర్తిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రి విషయానికొస్తే కరెంటు వచ్చే సమయానికి రైతులు వెళ్తున్నా, మధ్యలో కోతలు విధిస్తున్నారు. నాలుగైదు సార్లు ఇలా చేస్తుండటంతో విసుగు చెందుతున్న రైతులు, ఇళ్లకొచ్చి మళ్లీ పొలాలకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఏడుగంటల ఉచిత విద్యుత్తని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోపగపడేది మూడు గంటలే. ఇదేకాకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్న సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత్‌కు బిల్లులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఒక్కో కనెక్షనుకు సర్వీసు చార్జీ కింద నెలకు రూ. 20 మాత్రమే వసూలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఒక్కోదానికి లక్షల్లో బిల్లులు వస్తుంటే ఎలా చెల్లించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 28 వేల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి వినియోగానికి రోజుకు ఇరవై లక్షల యూనిట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. ప్రస్తుతం జిల్లాకు సరిపడా విద్యుత్ పంపిణీ లేక అన్ని రంగాలకు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బోర్లపై ఆధారపడి సాగు చేసిన భూముల్లో పెట్టుబడులైనా వస్తాయంటే అనుమానమేనని రైతులు లబోదిబో మంటున్నారు. -
నిధుల వరద..
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణ ంలో ఉన్నట్టుండి సంక్షేమ వసతి గృహాలపై ప్ర భుత్వానికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంతకాలం వీటి స్థితిగతులను పట్టించుకోని ప్రభుత్వం ఒక్కసారిగా భారీ ప్రణాళికను ముందుకు తె చ్చి ంది. బాలికలు, బాలుర కోసం వేర్వేరుగా కళాశాల వసతి గృహాలు, పాఠశాల విద్యార్థులకోసం వసతి గృహాలు, సమీకృత సంక్షేమ వసతి గృహాల కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాళ్లు, పాత వసతి గృహాల మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం, అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికోసం ‘ఇందిరమ్మ కలలు’ పథకం కింద ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి సుమారు రూ.60 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు గత జూన్ నుంచి పలు దఫాలుగా జీఓలు జారీ అయ్యాయి. ఆన్లైన్ టెండర్ల ద్వారా ఈ పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ అధికారులు తెలిపారు. ఈ పనులను సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షక ఇంజనీర్(ఎస్ఈ) హైదరాబాద్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. స్థలాల సేకరణ సైతం దాదాపు పూర్తికావడంతో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రణాళిక ఇలా.. జిల్లాకు కొత్తగా నాలుగు సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాలు మంజూరయ్యాయి. బాలుర కోసం సంగారెడ్డి, సిద్దిపేటలో, బాలికల కోసం మెదక్, అందోల్‌లో వసతి గృహాల నిర్మాణానికి రూ.8.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.2.20 కోట్ల చొప్పున కేటాయించారు. వీటితోపాటు మెదక్, జహీరాబాద్, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, సంగారెడ్డిలో ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం సమీకృత సంక్షేమ వసతి గృహాలు మంజూరు చేశారు. ఇందుకోసం రూ.18 కోట్లు కేటాయించారు. సదాశివపేట, పటాన్చెరు, కొండాపూర్, తడ్కల్‌లో రూ.3.20 కోట్లతో నాలుగు కొత్త భవనాల నిర్మించి శిథిలమైన, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలను ఇందులోకి మార్చనున్నారు. 72 వసతి గృహాల భవనాల మరమ్మతుల కోసం రూ.2 కోట్లు మంజూరయ్యాయి. 244 అదనపు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.61.75 లక్షలు, 313 అదనపు స్నానాల గదుల కోసం రూ.64.50 లక్షలు, 22 వసతి గృహాలకు ప్రహరీల నిర్మాణం కోసం రూ.2.20 కోట్లు కేటాయించారు. కొత్తగా 16 కమ్యూనిటీ హాళ్లు.. జిల్లాలో కొత్తగా 16 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను నిర్మించనున్నారు. అందోల్ మండలం చౌటకూర్, కొడెకల్, ఖాదీరాబాద్, జహీరాబాద్ పరిధిలోని తూంకుంట, మల్కన్పాడు, జీరపల్లి, నర్సాపూర్ పరిధిలోని మాచెర్టుల, పెద్దాపూర్, సంగారెడ్డి పరిధిలోని ఇరిగిపల్లి, నారాయణఖేడ్ పరిధిలోని మన్సూర్పూర్, పటాన్చెరు పరిధిలోని దాచారం, మెదక్ పరిధిలో కొరివిపల్లి, దుబ్బాక పరిధిలోని లింగంపల్లి, గజ్వేల్ పరిధిలోని క్యాసారం, సిద్దిపేట పరిధిలోని నారాయణరావుపేట్, బద్దిపడగలో కమ్యూనిటీ హాళ్లు నిర్మించడానికి నిధులు విడుదలయ్యాయి. ఒక్కో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.7.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను ఖర్చు చేయనున్నారు. 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ హౌసింగ్ కాలనీల్లో నివాసముండే ఎస్సీ కుటుంబాలు నెలకు 0-50 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తే ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకుగాను జిల్లాలో 29,114 విద్యుత్ కనెక్షన్లు కలిగిన ఎస్సీ వినియోగదారుల బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.23.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు గత నెల రెండున జీఓ జారీ చేసింది. -
‘ఉచితం’పై ఏకాభిప్రాయం!
సంపాదకీయం: చాలాకాలం తర్వాత సిద్ధాంతాలకూ, దృక్పథాలకూ అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ఒకే స్వరాన్ని వినిపించాయి. దేశ భద్రతకు ముప్పువాటిల్లే సందర్భాలు ఏర్పడినప్పుడు మినహా మిగిలిన సమయాల్లో దాదాపు మృగ్యమైపోయిన ఏకీభావం ఈ పార్టీలన్నిటిమధ్యా వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో పార్టీలు ఓటర్లకు చేసే ‘ఉచిత’ వాగ్దానాల విషయమై ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఒకటి, రెండు పార్టీలు మినహా అన్నీ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. ఏ పార్టీకైనా అలాంటి వాగ్దానాలు చేసే హక్కుంటుందని, అందులో ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మరే ఇతర సంస్థ జోక్యం అంగీకరించబోమని స్పష్టంచేశాయి. ఆరు జాతీయ పార్టీలూ, 24 ప్రాంతీయపార్టీలూ పాల్గొన్న ఈ సమావేశంలో జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఒక్కటే భిన్నంగా స్పందించగా, నాగా పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్ దానితో గొంతు కలిపాయి. కొన్ని పార్టీలు చేసే వాగ్దానాలు ఓటర్లను ప్రలోభపెట్టడం వాస్తవమేనని, ఈ పరిస్థితి ఎన్నికల క్షేత్రంలో పార్టీలకు ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీస్తున్నదని ఈ మూడు పార్టీలూ ఆరోపిస్తున్నాయి. ‘ఉచిత’ హామీలను నియంత్రించేలా మార్గదర్శకాలను రూపొందించాలని గత నెలలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇలాంటి హామీలవల్ల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తి దెబ్బతింటున్నదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీఎస్పీ ఒక్కటే భిన్న స్వరం వినిపించడానికి కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఇచ్చిన ఇలాంటి హామీల కారణంగానే తాను ఓడిపోయానని బీఎస్పీ భావిస్తోంది. మరి సమాజ్‌వాదీ చేసిన వాగ్దానాలు అలాంటివి! వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మద్దతు ధర వచ్చేలా చేయడం దగ్గరనుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌లు, మెట్రిక్ ఉత్తీర్ణులైనవారికి ట్యాబ్‌లు, అర్హులైన నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల భత్యం, రైతుల రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ వంటివెన్నో అందులో ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ అమలుచేస్తే ఒక్కోదానికి వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిరీత్యా ఇది మంచిదికాదని కొందరు ఆర్ధికవేత్తలు గుండెలు బాదుకున్నారు. మాయావతి కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయితే, ఆమె మరో దోవను ఎంచుకున్నారు. యూపీని నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని కోరుతూ అసెంబ్లీ చివరి సమావేశంలో తీర్మానం ఆమోదింపజేశారు. ప్రజల్లో ప్రాంతీయ ఆకాంక్షలను పెంచితే అది తనకు ఉపయోగపడుతుందని ఆమె విశ్వసించారు. కానీ, ఆమె కోరుకున్న స్పందన కరువైంది. ఓటర్లు సమాజ్వాదీవైపే మొగ్గుచూపారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం, ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించడం ఉత్తరప్రదేశ్కో, తమిళనాడుకో పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. అలాగే, వాగ్దానాలు చేసిన పార్టీలన్నీ గెలుస్తాయనిగానీ, గెలిచినవారంతా గద్దెనెక్కాక ఆ హామీలను నిలుపుకుంటారనిగానీ చెప్పడానికి లేదు. మద్యపాన నిషేధం, కిలో రెండు రూపాయల పథకంవంటి వాగ్దానాలతో 1995 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అధినేత ఎన్టీఆర్ వాటి అమలు ప్రారంభించిన కొన్నాళ్లకే చంద్రబాబువల్ల పదవి కోల్పోయారు. తాను గద్దెనెక్కాక చంద్రబాబు ఆ రెండు వాగ్దానాలకూ తిలోదకాలిచ్చారు. ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలే అన్నిటినీ శాసిస్తున్న తరుణంలో సామాన్య ప్రజల తక్షణ ప్రయోజనాలకూ, దీర్ఘకాలిక అభివృద్ధికీ మధ్య సమతూకాన్ని పాటిస్తూ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేసినవారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినప్పుడు అది ఆచరణ సాధ్యంకాదని కాంగ్రెస్‌లోనే ఎందరో వాదించారు. స్వయంగా ఆర్ధికవేత్త అయిన ప్రధాని మన్మోహన్సింగ్ ఈ పథకం అమలుపై ఎన్నో అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ, వైఎస్ దాన్ని అయిదేళ్లూ సమర్ధవంతంగా అమలుచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో విద్యుదుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు వేశారు. విద్యుత్ చార్జీలను పెంచబోమన్న హామీని కూడా ఆయన అదేవిధంగా నిలుపుకున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో లేని ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్వంటి పథకాలనెన్నిటినో ఆయన అమలు చేశారు. అందువల్లే 2009 ఎన్నికల్లో చంద్రబాబు నగదు బదిలీ పథకంనుంచి నిరుద్యోగ భృతివరకూ...ఉచిత బియ్యం పథకంనుంచి కలర్ టీవీల వరకూ ఎన్నో వాగ్దానాలు చేశారు. అయితే, ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించి, కొత్తగా ఒక్క వాగ్దానమూ చేయని వైఎస్వైపే మొగ్గుచూపారు. రాజకీయ పార్టీలు విధానాలు, కార్యక్రమాలు రూపొందించుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆ విధానాలైనా, కార్యక్రమాలైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే, వారిని మెప్పించలేకపోతే ఆ పార్టీలు తమ లక్ష్యసాధనలో విజయం సాధించలేవు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం, వాటి పరిష్కారానికి పథకాలు రూపకల్పన చేయడం, ప్రజల ఆదరణను పొందడం ఒక సృజనాత్మక ప్రక్రియ. హామీలివ్వడంలో పార్టీలు అప్పుడప్పుడు హద్దు మీరుతున్నాయనడంలో నిజం లేకపోలేదుగానీ...దానికి విరుగుడు ఈ సృజనాత్మక ప్రక్రియపై ఆంక్షలు విధించడం కాదు. ఎన్నికల ప్రచారంలో పార్టీల వాగ్దానాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. వాగ్దానాలకంటే ముందు అవి చేసిన వారెవరన్న అంశాన్ని ప్రజలు ప్రధానంగా చూస్తారు. వారి విశ్వసనీయత, సమర్ధత ఏపాటివో అంచనా వేసుకుంటారు. అనర్హులనుకున్నవారిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అంతేతప్ప ఆ వ్యామోహంలోపడి కొట్టుకుపోరు. పార్టీల వాగ్దానాలు కట్టుదాటుతున్నాయని ఆదుర్దా పడేవారు మన ఓటర్ల రాజకీయ పరిణతిని తక్కువ అంచనా వేస్తున్నామని మరిచిపోతున్నారు.