Telangana: Minister Guntakandla Jagadish Reddy Counter To Revanth Reddy Comments - Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ కౌంటర్‌

Published Tue, Jul 11 2023 12:30 PM | Last Updated on Tue, Jul 11 2023 1:09 PM

Minister Jagadeeshwar Reddy Counter To Revanth Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులంటే రేవంత్‌రెడ్డికి ఎందుకంత ద్వేషం అంటూ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దన్న రేవంత్‌ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అసలు రూపం బయటపడిందన్నారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీనే.. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్‌కు ఏడుపెందుకు? అంటూ జగదీశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

‘‘చంద్రబాబు వెళ్లిపోయిన ఆయన వారసత్వం కొనసాగుతోంది. బాబు పీడకలలు ఇక్కడ ఇంకా కనబడుతున్నాయి. తెలంగాణ వచ్చాక కరెంట్‌ కోతలు తప్పాయి.. రైతులు ఆనందంగా ఉన్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాటలతో మళ్లీ పిడుగులు పడ్డాయి. రేవంత్‌రెడ్డి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు.. ఆనాడు కరెంట్ కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఇవ్వటం లేదని రేవంత్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నాడని మంత్రి గుర్తు చేశారు.
చదవండి: రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వొద్దు..: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement