jagadeeshwar reddy
-
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రైతులంటే రేవంత్‌రెడ్డికి ఎందుకంత ద్వేషం అంటూ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందన్నారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీనే.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు ఏడుపెందుకు? అంటూ జగదీశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు వెళ్లిపోయిన ఆయన వారసత్వం కొనసాగుతోంది. బాబు పీడకలలు ఇక్కడ ఇంకా కనబడుతున్నాయి. తెలంగాణ వచ్చాక కరెంట్ కోతలు తప్పాయి.. రైతులు ఆనందంగా ఉన్నారు. కానీ రేవంత్‌రెడ్డి మాటలతో మళ్లీ పిడుగులు పడ్డాయి. రేవంత్‌రెడ్డి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు.. ఆనాడు కరెంట్ కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఇవ్వటం లేదని రేవంత్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నాడని మంత్రి గుర్తు చేశారు. చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
తెలంగాణ హుజూరాబాద్ అయితది
సంస్థాన్ నారాయణపురం: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితం వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ సర్వే చేయిస్తే.. రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని తేలిందని, అందుకే మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతున్నాడన్నారు. రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకునిరా.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పించు.. పింఛన్లు లేని వారి ఫింఛన్లు ఇప్పించు.. రేషన్ కార్డులు ఇవ్వు అని ఆయన మంత్రిని డిమాండ్ చేశారు. అవి నెరవేరిస్తే మంత్రిని గౌరవిస్తాం,. సన్మానం చేస్తామన్నారు. అభివృద్ధికి రూపాయి తీసుకురాకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రి రావాలా? అని ఆయన ప్రశ్నించారు. -
నాయిని.. గరీబోళ్ల లీడర్
కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జీవితాంతం పేదలు, కార్మికుల పక్షాన పోరాడి గరీబోళ్ల లీడర్‌గా చెరగని ముద్ర వేశారని మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. నాయిని ప్రథమ వర్ధంతిని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సుభాష్‌రెడ్డి, సాయన్న, ఎమ్మెల్సీ ప్రభాకర్, ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్, నాయిని కుటుంబసభ్యులు, బంధువులు, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు పేదలకు విద్య, వైద్యసేవలు అందించేందుకుగాను నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్‌ను ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ లోగోను మహమూద్ అలీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 45 అంగన్వాడీ సెంటర్లకు కార్పెట్ల ను అందజేశారు. ఫౌండర్‌గా సమతారెడ్డి, వైస్ చైర్మన్‌గా నాయిని దేవేందర్‌రెడ్డి కొనసాగుతారు. -
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న జిల్లా వాసి
సాక్షి, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ వీరనేని జగదీశ్వర్‌రావు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ జిల్లాకు పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తున్నారు. నార్కెట్‌పల్లి మండలం షేర్బావిగూడెం గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రావు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా, చైనా, సింగపూర్, హాంకాంగ్, మకావ్, థాయ్‌లాండ్ దేశాల్లో పర్యటించి దూరవిద్య విధానానికి సంబంధించిన పీజీ స్థాయిలో కోర్సు రైటర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయం కోసం తెలంగాణ అనే ఇతివృత్తంతో డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను ఆంగ్లం, తెలుగు భాషల్లో రూపొందించారు. ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులకు రీసెర్చ్ గైడెన్స్ ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఎంఏ సోషియాలజీని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1989లో పొందారు. అదే సమయంలో ఆర్ట్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తించి విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ ఎంబటీ విశ్వవిద్యాలయంలో అకడమిక్ డిసిప్టెన్స్ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రాచీన కాలం నుంచి నేటి వరకు విద్యావిధానంలో వస్తున్న మార్పులు చేర్పులు అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్చించి, 50 దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రసంగించి మన్ననలు పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన లీడర్షిప్ కోర్సులో పాల్గొనేందుకు ఆయనకు యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులైన వారికి లీడర్షిప్ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 ఏళ్లకు పైగా సంబంధిత రంగంలో అనుభవం ఆధారంగా కోర్సులో పాల్గొనడానికి ఎంపిక చేస్తారు. ఈ లీడర్షిప్ కోర్సులో పాల్గొనడానికి ఎంపికైన వీరనేని జగదీశ్వర్‌రావు ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 21న హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ కోర్సులో ఆయన పాల్గొననున్నారు. -
అరాచకం.. అక్రమం
అనంతపురం రూరల్ : తాడిపత్రిలో జేసీ ముఠా అరాచకం.. అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయని తాడిపత్రి మునిసిపల్ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తూ జేసీ బ్రదర్స్ రూ.200 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమను టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాడిపత్రిలో జేసీ సోదరులు ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారన్నారు. గతంలో జేసీ బ్రదర్స్ తమపై అనేక అక్రమ కేసులు బనాయించారని, అవన్నీ భరించి తెలుగుదేశం పార్టీ కోసం తాము పనిచేశామన్నారు. 2014లో తన రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్‌కు సహకరించాలని అధిష్టానం చెప్పడంతో సర్దుకుపోయి జేసీ ప్రభాకర్‌రెడ్డి గెలుపునకు కృషి చేశామని చెప్పారు. అయితే జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీని నమ్ముకొన్న వారికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారి అనుచరులకే పదవులు కట్టబెట్టారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోతే ఆయనా పట్టించుకోలేదన్నారు. తమను టీడీపీ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తలను జగ్జీబ్రదర్స్ ఖండించారు. సస్పెన్షన్ ప్రచారం హాస్యాస్పదం తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో జేసీ కుటుంబం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీకి కొన్ని రోజుల కిందటే తాము రాజీనామా చేశామన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీ నుంచి తమను సస్పెండ్ చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జేసీ కుటంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీంతో ఆ కుటుంబం మరింతగా రెచ్చిపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. పార్టీ పరువును బజారుకీడుస్తున్నా అధినేత చంద్రబాబు మౌనంగా ఎందుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.. జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యం జేసీ దివాకర్‌రెడ్డి గతంలో తాడిపత్రిలో నామినేషన్ వేయయడానికి కూడా భయపడి పారిపోతే అప్పుడు ఎవరు అండగా ఉన్నారో తాడిపత్రి ప్రజలకు తెలుసని జగ్గీ బ్రదర్స్ అన్నారు. ఆ రోజుల్లో వందకు రెండొందలకు అడుక్కున్న మీకు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తాడిపత్రిలో గ్రానైట్ యాజమానులు, లారీల ఓనర్లను భయపెడుతూ నెలనెలా మామూళ్లు వసూలు చేస్తుంది మీరు కాదా అని నిలదీశారు. జేసీపీఆర్ పేరుతో లారీల్లో అక్రమంగా గ్రానైట్ తరలిస్తుంది ఎవరో ప్రజలకు తెలుసని, లారీలను పట్టుకొని కేసులు నమోదు చేసిన అదికారులను చంపుతామని బెదిరించిందీ నిజం కాదా అని అన్నారు. తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని ఓడించే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. జేసీ బ్రదర్స్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి తాడిపత్రిలో మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. వారి పతనమే లక్ష్యంగా పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే దానికి జేసీ కుటుంబ సభ్యులే బాధ్యులని అన్నారు. -
'కేసీఆర్‌కు ఇండియా బుల్స్‌పై ఎందుకంత ప్రేమ?'
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 24 గంటల విద్యుత్ వెలుగుల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీకటి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. రైతుల కోసం ఎంతైనా విద్యుత్ కొనుగోలు చేస్తామనే హామీ వెనుక రైతులపై ప్రేమ లేదని, కమీషన్‌పై మాత్రమే ప్రేమ ఉందన్నారు. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని కేంద్రం చెబుతున్నా ప్రభుత్వం మాత్రం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకుందని, అవన్నీ కూడా కమీషన్ కోసమేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన, ప్రారంభించబోతున్న విద్యుత్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏం అన్నారంటే.. 'ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు వెనుక అంతర్యం ఏమిటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యుత్ తక్కువ ధరకు అందించడానికి అనేక సంస్థలు ఉన్న ఎందుకు అధిక ధరలకు కొంటున్నారు. విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్లను బయటపెట్టాలి. అఖిలపక్షం నిర్వహించి విద్యుత్ కొనుగోళ్ల విషయం బయటకు చెప్పాలి. 24 గంటల విద్యుత్ కొనుగోళ్ల వెనుక అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలనే పక్కనబెట్టారు. 24 గంటలు నిరంతర కరెంటు ఇస్తామని ముఖ్యమంత్రి డబ్బాలు కొడుతున్నారు. కానీ, కొడంగల్ నియోజకవర్గంలో 18 తండాలకు నేటికి కరెంటు లేదు. సొంత శాఖలో పరిస్థితులను కూడా తెలియకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై బహిరంగ చర్చుకు కాంగ్రెస్ సిద్ధం. విద్యుత్ మంత్రి బహిరంగ చర్చకు రావాలి. తెలంగాణకు చెందిన రాజస్తాన్ క్యాడర్ ఐఏఎస్ రమేష్ సేవచేయడానికి వస్తే ఆయనను తిరిగి పంపించారు. తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం సరిగా లేదన్నందుకు ఆయన్ను శంకరిగిరి మాన్యాలకు పంపించారు. ఇండియా బుల్స్ కంపెనీని కాపాడటానికి రోజువారీ కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇండియా బుల్స్‌పై కేసీఆర్‌కు ప్రేమేందుకు పుట్టిందో చెప్పాలి. గుజరాత్ చెందిన కంపెనీపై ఎందుకు జాలి చూపిస్తున్నారో వెల్లడించాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఇంకా సందిగ్ధంలోనే ఇంటర్ వివాదం!
* పరీక్షలపై సమావేశానికి వస్తానని చెప్పి రాని తెలంగాణ మంత్రి * మధ్యాహ్నం 12కు జరగాల్సిన భేటీ సాయంత్రానికి వాయిదా * అప్పటికీ రాకపోవడంతో వెనుదిరిగిన ఏపీ మంత్రి గంటా * అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేకపోయానన్న జగదీశ్ * రెండు మూడు రోజుల్లో మళ్లీ భేటీ ఉండే అవకాశం! సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు ఇంకా సందిగ్ధంలోనే కొనసాగుతోంది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఫుల్స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన రెండు రాష్ట్రాల విద్యామంత్రుల భేటీకి తెలంగాణ మంత్రి హాజరుకాకపోవడంతో సమావేశం వాయిదాపడింది. పరీక్షల షెడ్యూల్, ఉమ్మడి ప్రశ్నపత్రాలకు సంబంధించి ఇద్దరు మంత్రు లు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో సమావేశం కావలసి ఉంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున సాయంత్రం నాలుగు గంటలకు భేటీకి వస్తారని సమాచారం రావడంతో మంత్రి గంటా బోర్డుకు వెళ్లకుండా ఆగిపోయారు. తిరిగి నాలుగు గంటలకు గంటా ఇంటర్ బోర్డుకు చేరుకుని దాదాపు గంటసేపు జగదీశ్వర్‌రెడ్డి కోసం ఎదురుచూశారు. అయితే తాను ఎస్ఎల్బీసీ సమావేశంలో ఉన్నందున రాలేనని తెలంగాణ మంత్రి నుంచి ఫోన్ రావడంతో గంటా ఒకింత నిరాశకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం భేటీ?: గంటా ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి వెళ్లిపోతూ విలేకరులతో మాట్లాడారు. తమకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, ఉమ్మడి పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వమూ సహకరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. పరీక్షల తేదీల విషయంలోనూ తెలంగాణకు అనుగుణంగా షెడ్యూల్ మార్చుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని వివరించారు. కాగా, మంత్రుల భేటీ తిరిగి సోమవారం జరగవచ్చని అధికారవర్గాలు వివరించాయి. ఈలోపున మంత్రులు ఫోన్లో చర్చలు సాగిస్తే సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని, లేకపోతే సోమవారం వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. బోర్డు అధికారాల గురించి కాదు: గవర్నర్ దగ్గర బుధవారం ఇద్దరు మంత్రుల భేటీలో కేవలం ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే అంశంపైనే చర్చ జరిగిందని అంతకు ముందు మంత్రి గంటా సచివాలయంలో మీడియాతో పేర్కొన్నారు. బోర్డు అధికారాలను తెలంగాణకు కట్టబెట్టేందుకు కాదని స్పష్టంచేశారు. పదో షెడ్యూల్లోని సంస్థలు ఎవరి పరిధిలో ఉండాలో, ఏ విధంగా అవి కొనసాగాలో విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని తాము కోరుతున్నామని వివరించారు. -
హేతుబుద్ధీకరణ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టెయ్యండి’ అనే వానాకాలం చదువులకు కేసీఆర్ సర్కార్ ఫుల్స్టాప్ పెడుతోంది. పక్కా ప్రణాళికతో అందుబాటులో ఉన్న విద్యా వనరులను హేతుబద్ధీకరణతో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ శుక్రవారం అసెంబ్లీలోనూ ఓ ప్రకటన చేసింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు విద్యార్థులు లేని పాఠశాలలను కిలోమీటర్ దూరంలోని మరో పాఠశాలలో కలిపి మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. దీంతో విద్యాశాఖ అధికారులు జిల్లాలో విద్యార్థులు లేని పాఠశాలలను గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్లేని ప్రాథమిక పాఠశాలలు 69 ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే ఈ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 1,974 ప్రాథమిక పాఠశాలలు, 423 ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 2.75 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు పాఠశాలలకు ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల కేటాయింపు చేశారు. సచివాలయంలో పని చేసే ఆంధ్రప్రాంత అధికారులు వారి పలుకుబడిని ఉపయోగించుకుని తమ భార్యలకు, బంధువులకు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పటాన్చెరు, రామచంద్రాపురం, తూప్రాన్, గజ్వేల్ మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఫలితంగా కొన్ని పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉంటే 10 మంది టీచర్లు, ఇంకొన్ని పాఠశాలల్లో 5 మంది విద్యార్థులు లేకున్నా ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆ మేరకు లేరు. మరి కొన్ని పాఠశాలలకు పక్కా భవనాలు లేకపోగా, ఇంకొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా భవనాలు ఉన్నాయి. ఎస్ఎస్ఏ ఏం చెబుతోందంటే... సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిబంధనల ప్రకారం పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 21 నుంచి 60 లోపు విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 లోపు విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు, 91 నుంచి 120 లోపు విద్యార్థులు నలుగురు ఉపాధ్యాయులు, 120 నుంచి 150 లోపు విద్యార్థులుంటే 5 మంది టీచర్లు, హెడ్మాస్టర్ కూడా ఉండాలి. కానీ జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అందువల్లే ప్రభుత్వం ఇపుడు హేతుబద్ధీకరణ ద్వారా విద్యావనరులపై అధ్యయనం చేసి మెరుగైన వసతులతో ప్రైవేటు బడుల కంటే మెరుగ్గా విద్యాబోధన జరిగేలా చర్యలు చేపట్టింది. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 225 ప్రాథమిక పాఠశాలు ఉన్నట్లు అంచనా. ఇక కిలోమీటర్ దూరాన్ని పరిగణలోకి తీసుకొని విలీనం చేస్తే మరికొన్ని పాఠశాలలు కూడా పోయే అవకాశం ఉంది. అయితే దీన్ని అంతసులువుగా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించే అవకాశం లేదు కాబట్టి క్రమంగా హేతుబద్ధీకరించే అవకాశం ఉంది. -
ఉన్నత ప్రమాణాలతో ‘కేజీ టు పీజీ’
గజ్వేల్: అత్యున్నత ప్రమాణాలతో ఉచిత ‘కేజీ టు పీజీ’ విద్యావిధానాన్ని అమలుచేయడానికి సర్కార్ కసరత్తు చేస్తోందని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం గజ్వేల్‌లోని కోలా అభిరామ్ గార్డెన్స్‌లో రోటరీ క్లబ్ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన 1,500 విద్యార్థులకు షూలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం ప్రాతిని థ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచే ఉచిత విద్యను అమలు చేయనున్నట్లు తెలిపారు. వివిధ దేశాల్లో అమలవుతున్న విద్యాప్రమాణాలను అధ్యయనం చేసి వాటికంటే మెరుగైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గజ్వేల్ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఇక్కడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తేనే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, అందువల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని పిలుపునిచ్చారు. సీఎం ప్రాతినిథ్యం వహించడం గజ్వేల్ ప్రజల అదృష్టం గజ్వేల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ ఎర్రవల్లి వద్ద ఫాంహౌస్ నిర్మించారో, అప్పుడే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కిందన్నారు. కేసీఆర్ కూడా తన సొంత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారనీ, ప్రత్యేకంగాసాగునీటి వసతి కల్పించి కరువును శాశ్వతంగా తరిమివేయడానికి నిర్ణయించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆ దిశగా కృషి జరుగుతోందని వివరించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు చేయూతనిచ్చే దిశలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయవన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ప్రముఖ మెజీషియన్ సామల వేణు, జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిటపే ఆర్డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పొన్నాల రఘుపతిరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ ఎంపీపీ చిన్నమల్లయ్య, గజ్వేల్, ములుగు జెడ్పీటీసీలు జేజాల వెంకటేశ్‌గౌడ్, సింగం సత్తయ్య, రోటరీ క్లబ్ నాయకులు డాక్టర్ పురుషోత్తం, వేణు, చంటి, విద్యాకుమార్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, నాయకులు పండరి రవీందర్రావు, దేవేందర్, మద్దిరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీపురు పట్టిన మంత్రి, ఎంపీ గజ్వేల్‌లో నగర పంచాయతీ అధ్వర్యంలో చేపట్టిన ‘చెత్తపై సమరం’ కార్యక్రమాన్ని మంగళవారం విద్యాశాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురు పట్టుకొని కొద్దిసేపు ఊడ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రజలంతా ‘చెత్తపై సమరం’ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని నగర పంచాయతీని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ర్యాలీ తహశీల్దార్ కార్యాలయం నుంచి కోలా అభిరామ్ గార్డెన్స్ వరకు కొనసాగింది. అభివృద్ధే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయం ములుగు: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ములుగు మండల కేంద్రంలో రూ.75 లక్షల నిధులతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. -
ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి
పటాన్చెరు రూరల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ సహిత మరుగుదొడ్లు నిర్మిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలి పారు. మంగళవారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మండలంలోని ఇస్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో, గీతం విశ్వవిద్యాలయం సహకారంతో రుద్రారం గ్రామంలో నిర్మించిన పర్యావరణ సహిత మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం 70 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవనీ, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్ల రానున్న రోజుల్లో తక్కువ ఖర్చుతోనే నిర్మించే పర్యావరణ సహిత మరుగుదొడ్ల నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. పర్యావరణ సహిత మరుగుదొడ్ల నిర్మాణంలో గీతం విద్యార్థులు చేస్తున్న పరిశోధనలను అభినందించారు. మంత్రి వెంట ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారి వేణుగోపాలాచారి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, ఈఈ చెన్నారెడ్డి, డిప్యూటీ ఈఈ రామకష్ణ, ఏఈ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు, తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ అనంతరెడ్డి, ఇస్నాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి, రుద్రారం సర్పంచ్ నవసుకుమారి, గీతం విశ్వవిద్యాలయం డెరైక్టర్ వర్మ ఉన్నారు. -
'లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాం'
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో కేసీఆర్ చర్చకు రావాలన్న నారా లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. భరోసాయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతి బయటపెడితే జైలుభరో యాత్ర చేయాల్సివుంటుందన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే తెలంగాణలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. గతంలో విద్యుత్ మంత్రిగా షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, దొంగే దొంగ అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. వ్యవసాయం దండగన్నారని, బషీర్‌బాగ్ లో కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. -
'మనం పోరాడిందే మన హక్కుల కోసం!'