'లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాం' | Telangana Deputy CM Accept Nara Lokesh Challenge | Sakshi
Sakshi News home page

'లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాం'

Published Fri, Oct 10 2014 12:30 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

'లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాం' - Sakshi

'లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాం'

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో కేసీఆర్ చర్చకు రావాలన్న నారా లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. భరోసాయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతి బయటపెడితే జైలుభరో యాత్ర చేయాల్సివుంటుందన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే తెలంగాణలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. గతంలో విద్యుత్ మంత్రిగా షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు.

కాగా, దొంగే దొంగ అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య  ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. వ్యవసాయం దండగన్నారని, బషీర్బాగ్ లో కాల్పులు జరిపించారని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement