telangana development
-
అభివృద్ధి.. అప్పులు.. ఆరోపణలు పయనం పదేళ్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి దశాబ్ద కాలం గడిచింది. అరవై ఏళ్ల పట్టుదలకు, పోరాటాలకు ప్రతిరూపంగా.. ముక్కోటి మంది మనోభావాలకు నిలువుటద్దంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ పదేళ్లలో బుడిబుడి అడుగులనుంచి సాధికారత వైపు పయనించింది. బాలారిష్టాలను దాటుకుని ప్రగతి నమూనాను ఆవిష్కరించే దిశగా ముందడుగు వేసింది. అనతి కాలంలోనే అగ్రరాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. అప్పులు పెరుగుతున్నాయనే ఆందోళన ఉన్నా.. కొన్ని అంశాల్లో వివాదాలు, ఆరోపణలు ఉన్నా.. ప్రగతిపథంలో దూసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న నేపథ్యంలో.. ఇన్నేళ్లలో మారిన ముఖచిత్రం, కీలక రంగాల్లో జరిగిన పరిణామాలపై ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్వెలుగు.. చీకట్లుతెలంగాణ ఏర్పడితే చీకట్లో బతకాల్సిందేనన్న కొందరు నేతల విమర్శలను తిప్పికొట్టేలా రాష్ట్ర విద్యుత్ రంగం ఎదిగింది. సంప్రదాయేతర విద్యుత్‌కు పెద్దపీట వేయడంతో వేల మెగావాట్ల సౌర విద్యుత్, పవన విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. అలాగే భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తెలంగాణ విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశలో పొరపాట్లు జరిగాయన్న విమర్శలు, ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులు పూర్తయి నీటిని అందించారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.వివాదాల మధ్య తనదైన ముద్రకీలక రంగాల్లోనే కాదు.. మరెన్నో అంశాల్లో తెలంగాణ తనదైన ముద్రను వేసింది. 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయ నిర్మాణం, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు, పోడు పట్టాల పంపిణీ, పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, మిషన్ భగీరథ, సమీకృత జిల్లా కలెక్టరేట్లు, నూతన జోనల్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ సెంటర్, భరోసా కేంద్రాలు, మోడల్ శ్మశాన వాటికలు, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా, పల్లె–పట్టణ ప్రగతి, యాదాద్రి ఆలయ అభివృద్ధి, బతుకమ్మ చీరలు, మెట్రో రైలు, హరితహారం లాంటి కార్యక్రమాలతో వేగంగా ముందుకు కదిలింది. రాజకీయాలు, వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ముందుకెళ్లాలని... సామాజిక, ఆర్థిక అసమానతలు లేని ‘సమున్నత తెలంగాణ’ అతి త్వరలోనే ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిద్దాం.అత్యధిక గురుకులాలుతెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలైంది. దేశంలోనే అత్యధిక గురుకులాలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. అన్ని రకాల విద్యా సంస్థలు, హాస్టళ్లకు సన్న బియ్యం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందుతున్నాయి. మన ఊరు– మన బడి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్య పట్ల ప్రజలను ఆకర్షితులను చేసే ప్రయత్నాలు జరిగాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నీచర్, కాంపౌండ్ వాల్స్, కిచెన్షెడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం గత పదేళ్లలో మంచి ప్రయత్నమే జరిగింది.‘ఐటీ’లో దాటేసి..తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో, అందులోనూ ప్రధానంగా ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును దాటేసి.. హైదరాబాద్ ఐటీ రంగం ముందుకు వెళ్తోంది. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిపోయిందని రికార్డులు చెప్తున్నాయి. ఐటీ ఎగుమతులకు సంబంధించి 2030 సంవత్సరానికి పెట్టుకున్న లక్ష్యాలు కూడా ఇప్పటికే దాటిపోవడం గమనార్హం. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని రానున్నాయి.‘ఆసరా’కు యత్నాలుతెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచీ ఆపన్నులకు మరింత ‘ఆసరా’ అందుతోంది. సంక్షేమ కార్యక్రమాల అమలు పెరిగింది. దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలు పెద్దగా విజయవంతం కాకపోయినా.. మిగతా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ ఖజానా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు.. ఇలా అవసరమున్న వారందరికీ ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ అందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వర్గాలకు ఆసరా పథకం కింద పింఛన్లు అందుతున్నాయి.ఇవి వారి ఆర్థిక అవసరాలకే కాకుండా సామాజిక భద్రతకు ఆలంబనగా నిలుస్తున్నాయి. ఆసరా పింఛన్ల కోసం ఏటా తెలంగాణ ఖజానా నుంచి దాదాపు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేద వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఇప్పటివరకు రూ.12వేల కోట్ల వరకు అందజేశారు.కులాంతర వివాహాలకు ప్రోత్సహకాలు, అంబేడ్కర్ భవనాలు, హాస్టళ్లు, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు, స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలలు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, అధికారికంగా ఆదివాసీల పండుగలు, గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ, నేతన్నలకు బీమా, సెలూన్లకు ఉచిత విద్యుత్, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, వేద పండితులకు గౌరవ భృతి, మౌజమ్, ఇమాంలకు గౌరవ వేతనం.. ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.2 కోట్ల ఎకరాలకు సాగుతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కనిపించిన అతి పెద్ద మార్పు భారీగా ధాన్యం ఉత్పత్తి. 2014లో తెలంగాణలో 99.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా.. పదేళ్ల తర్వాత అది 2.48 కోట్ల టన్నులకు చేరింది రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి.. 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు చేరింది. వరి సాగు విస్తీర్ణం 49.63 లక్షల ఎకరాల నుంచి 97.97 లక్షల ఎకరాలకు పెరిగింది. గతంలో నిర్మించిన ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 15లక్షల ఎకరాల్లో పెరిగిన భూగర్భజలాలు వంటివి ఇందుకు దోహదపడ్డాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. దేశంలో తెలంగాణ మార్క్‌ను చూపిన రైతుబంధు పథకం.. రైతులు పంటలు వేసేందుకు పెట్టుబడి సాయంగా ఇతోధికంగా దోహదపడుతోంది.ఇప్పటివరకు ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తుండగా.. కొత్త ప్రభుత్వం దాన్ని రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు రుణ మాఫీ, రైతు వేదికలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యం సేకరణ వంటివి కూడా వ్యవసాయానికి అండగా నిలిచాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్లలో తెచ్చిన మార్పులు, భూరికార్డుల నిర్వహణ కోసం అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్ పలు వివాదాలకు కారణమైనా.. వ్యవసాయ, రెవెన్యూ వర్గాలను అనుసంధానం చేసే దిశలో సాగాయని నిపుణులు అంటున్నారు.కంటి వెలుగులు.. ఫ్రీ డయాలసిస్లుతెలంగాణ ఏర్పాటయ్యాక వైద్య రంగం అభివృద్ధి వైపు పయనించింది. పల్లె దవాఖానాలు, పట్టణ దవాఖానాల ఏర్పాటుతో వైద్యం పేదల ముంగిటకు చేరింది. కంటి వెలుగు పథకం పేదల చూపునకు అండగా నిలిచింది. తెలంగాణ డయాగ్నస్టిక్స్ పేరుతో పేదలకు ఉచితంగా రక్త పరీక్షల కార్యక్రమం వివిధ వ్యాధుల బాధితులను గుర్తించింది. నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఆస్పత్రుల్లో 4 వేల పడకలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో 2 వేల పడకలు, కొత్త ఏరియా, జిల్లా ఆస్పత్రుల ఏర్పాటు, విస్తరణ, పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు రాష్ట్ర వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడ్డాయి.తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఒకటి ఉచిత డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 102కు చేరింది. ఇక పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు కూడా గత పదేళ్లలో అభివృద్ధికి సూచిక. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా.. ఇప్పుడు తెలంగాణలోని 33 జిల్లాల్లో కలిపి 34 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. 2014కు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,515 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. -
తెలంగాణ అభివృద్ధికి మెగా ప్లాన్
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్–2050 దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో పనిచేసిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు గత ప్రభుత్వాల నిర్ణయాలను మరింత పకడ్బందీ ప్రణాళికలతో అమలు చేయడం వల్లే ఔటర్‌రింగు రోడ్డు, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటివి అందుబాటులోకి వచ్చాయని అన్నారు. దేశమే కాకుండా ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ దేశంలోనే ఐదవ మెట్రోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. దీన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని, అందరి సలహాలు, సూచనలతో అందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. తొందరపాటు చర్యలతో మేడిగడ్డ తరహాలో కానివ్వబోమని అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఫార్మా సిటీ స్థలంలో కొత్త నగరం ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్, రీజనల్ రింగురోడ్డు మధ్య ఇటు, అటు ప్రాంతాలను ఎంపిక చేసి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజిస్తాం. చైనా తరహాలో 10 నుంచి 15 శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తాం. వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. ఫార్మాసిటీని రద్దు చేస్తామనే అపోహ ఉంది. అది నిజం కాదు. ఫార్మా సిటీకి కేటాయించిన స్థలంలో కొత్త నగరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఒకేచోట ఫార్మాసిటీ అని కాకుండా విభిన్న ప్రాంతాల్లో కాలుష్య రహిత ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తాం. ఆస్పత్రులు, స్కూళ్ళు, షాపింగ్‌మాల్స్, ఇతర అన్ని రకాల సదుపాయాలుండేలా చూస్తాం..’అని సీఎం తెలిపారు. ఆర్ఆర్ఆర్ చుట్టూ రైలు సౌకర్యం ‘మెట్రో రైలు సౌకర్యం మరింత మందికి చేరువలో ఉండేలా చేయాలనే సంకల్పంతో కొత్త మార్గాలను రూపొందించాం. మొదటగా ఎయిర్‌పోర్టుకు, మియాపూర్ నుంచి ఆర్ïసీ పురం వరకు, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి కూడలి మీదుగా అమెరికన్ కాన్సులేట్ భవనం వరకు మెట్రో ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఆర్ఆర్ఆర్ నిర్మాణ సమయంలో చుట్టూ రైలు సౌకర్యం ఏర్పాటు చేసేలా చూస్తాం..’అని రేవంత్ చెప్పారు. ఫైర్ విభాగంలో ఖాళీల భర్తీ ‘ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్ మార్క్‌లు నిర్మించేది బిల్డర్లు, కాంట్రాక్టర్లే. వారి సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరించేందుకు, వారికి అందుబాటులో ఉండేందుకు సిద్ధం. నగరాభివృద్ధిలో ఫైర్ విభాగం పాత్ర ఎంతో ఉంది. 50–60 అంతస్తుల భవనాలకు ఎన్ఓసీ ఇవ్వడంలో వారి పాత్ర కూడా ఉంటుంది. కానీ వారికి భవనం లేకపోవడం విడ్డూరం. క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య) ముందుకొచ్చి భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయం. క్రెడాయ్ వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధం. ఫైర్ విభాగంలో ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ విభాగం తరహాలో ఫైర్ సిబ్బంది అందరికీ న్యాయం చేసేలా చూస్తాం..’అని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఫైర్ విభాగం అదనపు డీసీ నాగిరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్
-
కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, నాగ్‌పూర్–విజయవాడ కారిడార్‌వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని.. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించామని ఆయన చెప్పారు. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీ ఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు.. ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయని ఆయన వివరించారు. ఇక దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని.. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పాలమూరు పర్యటనకు ఆదివారం వచ్చిన మోదీ.. తెలంగాణ రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. మరోవైపు.. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ఇక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుటుంబం కోసమే అన్నట్లుగా వాటి తీరు ఉందని పరోక్షంగా విమర్శించారు. అలాగే, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కేవలం అవినీతి కోసమే అన్నట్లుగా ఉన్నాయని.. తప్పుడు హామీలతో రైతులను మోసగిస్తున్నారని మోదీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
దశాబ్ధాల తరబడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్న గులాబీ బాస్
-
తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు హాస్యాస్పదం
-
మోదీ మాటలు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది: హరీశ్‌రావు
సిద్ధిపేట: రాఘవాపూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరంతో తమకు పండగని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్దఎత్తున పంటలు పండుతున్నాయని చెప్పారు. కానీ ప్రధాని మోదీకి ఎంతసేపూ తెలంగాణపై బురదజల్లడమే పని అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్ సభలో మోదీ మాట్లాడిన మాటలు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ఆపారని హరీశ్‌రావు ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని రూ.30వేల కోట్ల నిధులు ఆపారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. చదవండి: ఎన్నికల కోసమే ఆయుధంగా వాడుతున్నారా? -
మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ
కుత్బుల్లాపూర్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, నచ్చిన ప్రాపర్టీ కొనుక్కుని సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా సాధ్యమవుతోందని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కొంపల్లి అస్పిసియస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజులపాటు కొనసాగే ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నార్త్‘ను ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పక్కా అనుమతులు, కచ్చితమైన సౌకర్యాల కల్పనలో క్రెడాయ్పై ప్రజలకు గట్టి నమ్మకం ఉన్నదన్నారు. మేడ్చల్‌కు దాదాపు 22 లక్షల స్క్వేర్ ఫీట్ల గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిర్మాణ రంగం ఊపందుకుంటోందని తెలిపారు. ధరణి సమస్యలు పరిష్కరించండి: క్రెడాయ్ ప్రతినిధులు కాగా.. క్రెడాయ్ సభ్యులు నిర్మాణ సమయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ధరణి రికార్డుల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికే కనీసం 6 నెలలు సమయం పడుతోందని, ఇది నిర్మాణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. మురుగునీటి సమస్య, కనెక్టివిటీ రోడ్లు, ధరణి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రాపర్టీ షోలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డితో పాటు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు జి.ఆనంద్‌రెడ్డి, కె.రాజేశ్వర్, ఎన్.జైదీప్‌రెడ్డి, బి.జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌర, శివరాజ్ ఠాకూర్, కె.రాంబాబు, పలు ఆర్థిక సంస్ధలు, సందర్శకులు పాల్గొన్నారు. -
అన్నీ ఉన్నా దేశంలో దారిద్య్రం ఎందుకు?: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశానికి కావాల్సింది బీజేపీని గద్దె దించడమో, రాజకీయ ఎజెండానో కాదని.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హెచ్సీసీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జాడ్యాలు, అవాంఛితమైన, అనారోగ్యకరమైన, అవసరమైన పెడధోరణులు ప్రబలుతున్నాయన్నారు. ► భారత దేశం శాంతికి అలవమైన సమాజం. కానీ, అవసరమైన జాఢ్యాలు పెరిగిపోతున్నాయి. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇంత అద్భుతమైన దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు.. దేశ గరిమకు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నాయి. మంచి మార్గాలు కనిపించడం లేదు. అందుకే ఒక రాష్ట్రంగా ఏం చేయాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ అభ్యున్నత కోసం యధాశక్తిగా కృషి చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ► తెలిసిన దాని చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏం జరిగందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు. ► తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. ఈ మాట కాగ్, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయి. వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి. ► పరిష్కారాలు కనబర్చాల్సింది విపరీతంగా ఉన్న సమస్యల మీద. ప్రపంచంలోనే యువ జనాభా ఉన్న దేశం భారత్.. కానీ, దరిద్రమే తాండవిస్తోంది. ప్రతిభాపాటవాలను విదేశాల్లోనే ఖర్చు పెడుతున్నారు. అద్భుతంగా పురోగమించాల్సిన దేశం.. వెనుకబడి పోతోంది. మట్టిని కూడా సింగపూర్ పొరుగుదేశం నుంచి తెచ్చుకుంటుంది. నీళ్లు కూడా మలేషియాదే. కానీ, వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతుబద్ధమైన వాదం. స్వచ్ఛమైన కఠోరమైన వాస్తవం. కాదనుకుంటే నీతి ఆయోగే ఖండించేది కదా. ► అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి.. తెలిసిన వాళ్లను తెలియని వివరాలు అడిగి నేర్చుకోవాలి. అలా చేయబట్టే తెలంగాణ ప్రతీ రంగంలో అవార్డులు సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ► కొన్ని పార్టీల మిత్రులు మనమంతా ఏకం కావాలని, బీజేపీని గద్దె దించాలని కోరారు. చెత్త ఎజెండా తాను వెంట రాలేనని చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. గద్దె ఎక్కించాల్సింది ప్రజలనని, తెలియజేయాల్సింది ప్రజలకు, మారాల్సింది దేశ ప్రజల జీవితాలు, కావాల్సింది మౌలిక వసతులని సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ► అందరికీ రేషన్ బియ్యం ఇచ్చినందుకే ఓటేయాలని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కోరాడు. ఇదా పరిస్థితి?. ► దేశం తన లక్ష్యం కోల్పోయింది. లక్ష్యరహిత దేశంగా భారత్ ముందుకెళ్తోంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి ఏకతాటిగా భారత్ ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది? సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సీఎం కేసీఆర్. ► దేశంలో అనారోగ్యమైన వాతావరణం నెలకొంది. రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని, రాజకీయ పునరేకీరణ కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ► నూతన వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. ప్రతీ ఒక్కరికీ పని చేసే అవకాశం రావాలి. అద్భుతమైన దేశ నిర్మాణం జరగాలి. అంతేకానీ, సంకుచిత రాజకీయం కాదన్నారు సీఎం కేసీఆర్. -
కెనడా రోమియో..
-
16 దారుల్లో..ప్రగతి చక్రం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి పదహారు అంశాల ప్రాతిపదికన జరుగుతోందని, ప్రగతి చక్రం పయనిస్తున్న తీరు కూడా మంచి ఫలితాలే ఇస్తోందని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) వెల్లడించింది. వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటి ఫలితాలపై సెస్ ఇటీవలే ‘తెలంగాణ డెవలప్మెంట్ సిరీస్’పేరుతో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, నీటిపారుదల తదితర రంగాల పనితీరు, ఫలితాలను విశ్లేషించింది. అలాగే కొన్ని పథకాల అమల్లో జరుగుతున్న లోటు పాట్లను కూడా సవరించాలని సూచించింది. ఈ నివేదికపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి.. ప్రణాళిక, గణాంక, తదితర శాఖల అధికారులతో చర్చించారు. సెస్ తయారు చేసిన ఈ నివేదిక ఆధారంగా మరింత లోతుగా అధ్యయనం చేసి రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను కోరారు. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ►రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర స్థూల అభివృద్ధి (జీఎస్డీపీ)లో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నాం. ఏటా అభివృద్ధి సగటున 9 శాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే స్థూల అభివృద్ధిలో వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ అభివృద్ధి బాగా కనిపిస్తుండగా, జనగామ, సిరిసిల్ల, కుమ్రం భీం, వనపర్తి వెనుకబడ్డాయి. ►రాష్ట్రం దీర్ఘకాలంగా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడి ఉండటంతో అప్పుల రూపం లో నిధులు తెచ్చి ఆస్తుల కల్పనకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర నికర అప్పు రూ.1.41 కోట్లుగా ఉంది. ఆర్థిక చట్టాల నిబంధనలకు అనుగుణంగా వడ్డీలు చెల్లిస్తున్నారు. ►సాగునీటి రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని 46,531 చెరువుల్లో 60 శాతం చెరువులను రూ.2,500 కోట్లకు పైగా వెచ్చించి మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించారు. తద్వారా మొత్తం 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ►వ్యవసాయ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి వాటితో రైతుల ఆదాయం పెరగాల్సి ఉంది. ►గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రాన్ని మాంసం ఉత్పత్తి హబ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాంసం ఎగుమతి చేసే స్థాయికి వెళ్లడంతో పాటు రూ.25 వేల కోట్ల మార్కెట్ సృష్టించడం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ►చేపపిల్లల పెంపకం ద్వారా చేపల ఉత్పత్తి 3.2 లక్షల టన్నులకు చేరింది. చేపల ఉత్పత్తిలో కేరళను చేరుకోగలిగాం. ఇప్పటివరకు గుర్తించిన 4,530 చెరువుల్లో 50 కోట్ల వరకు చేపపిల్లలను వదిలారు. ►రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలి. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ తరహాలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఉద్యానపంటలు, చేపల పెంపకం వైపు రైతులను మళ్లించాలి. తెలంగాణ డెవలప్మెంట్ సిరీస్‌లోని 16 అంశాలివే.. 1) ఆర్థికాభివృద్ధి, 2) ఆర్థిక నిర్వహణ, వనరుల సమీకరణ, 3) వ్యవసాయ రంగం, 4) నీటిపారుదల, 5) పశుసంపద, మత్స్య సంపద, 6) భూ అంశాలు, 7) పారిశ్రామిక రంగం, 8) సేవారంగం, 9) నైపుణ్యాభివృద్ధి, 10) సామాజిక రంగాలు, 11) సామాజిక భద్రత, 12) సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలు, 13) పట్టణ ప్రాంతాలు,14) పంచాయతీరాజ్ సంస్థలు, 15) పాలనా వికేంద్రీకరణ, 16) మహిళా, శిశు సంక్షేమం. -
యాంత్రీకరణలో...వాహ్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వ్యవసాయ యాంత్రీకరణలో దూసుకుపోతోంది.ఒకవైపు సాగు నీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. వ్యవసాయ యంత్రాలు, పంట కోత యంత్రాలు, నిర్మాణ పరికరాల్లో వృద్ధి ఎంతో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషి ఆదివారం ట్వీట్ చేశారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వివిధ రకాల వాహన పరికరాలన్నీ కలిపి 1.22 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లు మొత్తం 2.87 లక్షలున్నాయని, అందులో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు అదనంగా 1.36 లక్షల ట్రాక్టర్లు ఇచ్చారు. అంటే 90.39% ట్రాక్టర్లు తెలంగాణ వచ్చాకే ఇచ్చినట్లు అర్థం అవుతోంది. ఇక పంట కోత యంత్రాలు మొత్తం రాష్ట్రంలో 26,856 ఉంటే, అందులో తెలంగాణ వచ్చాకే 12,736 ఇచ్చారు. అంటే 92.48% కొత్త రాష్ట్రంలోనే ఇచ్చారని స్పష్టమవుతోంది. మొత్తంగా వ్యవసాయ యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వాహన పరికరాల వృద్ది తెలంగాణ వచ్చాక 71.4%ఉండటం విశేషం. -
అభివృద్ధిలో తెలంగాణ దేశానికి దిక్సూచి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నా రు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు. ఆదివారం వరంగల్‌కు వచి్చ న హరీశ్‌రావు దుర్గాష్టమి సందర్భం గా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర మహాస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేందుకు, రైతాంగానికి ఎలాంటి కష్టా లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాజ్యసభ సభ్యుడు కెపె్టన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా: గవర్నర్
సాక్షి, చెన్నై: తెలుగు నేర్చుకుంటున్నానని, తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఆదివారం టీనగర్‌లోని సర్‌పిట్టి త్యాగరాయ హాల్ వేదికగా ఆమె సత్కార వేడుక జరిగింది. తమ రాష్ట్రానికి చెందిన మహిళా నాయకురాలికి ఇంత పెద్ద పదవి దక్కడంతో తమిళిసైని సత్కరించుకోవాలని చెన్నై పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి డీఎండీఎంకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్, పీఎంకే నేత జీకే మణి, తమిళ మానిల కాంగ్రెస్ నేత జ్ఞానదేశికన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమలత, శరత్‌కుమార్, జీకే మణి, జ్ఞానదేశికన్ మాట్లాడుతూ కఠిన శ్రమకు గుర్తింపుగా ఆమెను గవర్నర్ పదవి వరించినట్లు కొనియాడారు. ఆమెలోని ధైర్యం, వాక్ చాతుర్యాన్ని వారు గుర్తు చేశారు. అనంతరం తమిళిసై ప్రసంగిస్తూ తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లు సైతం ఇప్పుడు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తున్నారని, ఇది ప్రొటోకాల్ ధర్మంగా ఉన్నా, ఇది ఒకరకంగా ఇబ్బందికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా, తమిళి సై అని, ఇక్కడి వారి అభిమానం, ఆప్యాయతల మధ్య మెలిగానని, ఇది తన మీద చూపిస్తే మరింత ఆనందంగా ఉంటుందని అన్నారు. దేవుడు ఇచి్చన వరం, ప్రధాని నరేంద్ర మోదీ ఇచి్చన ఈ పదవితో, తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నానని వివరించారు. -
ప్రభుత్వ ఘనత దేశమంతా తెలియాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలిసేందుకే పొరుగు రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేవనెత్తిన అంశంపై మంత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఐదు సంవత్సరాల్లోనే అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనా విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు, రైతు బీమా పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలేగాక, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించినందుకే పలు రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోందని, దేశంలోని వివిధ రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తారని, ప్రగతిని అంచనా వేస్తారన్నారు. ప్రభుత్వమిచ్చే పత్రికా ప్రకటనలు కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయన్నారు. శాసనసభ్యులు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. అది పరిష్కారమైతే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. కానీ స్థానిక నాయకత్వం చొరవ తీసుకుంటే ఇబ్బంది లేదని, ఇప్పటికే పది జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు స్థల కేటాయింపు అధికారాలను పరిశీలిస్తామని చెప్పారు. దేశంలో ఏరాష్ట్రం కూడా జర్నలిస్టులకు అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనక్కు తగ్గదన్నారు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్లలో కూడా ఏమాత్రం తగ్గమని స్పష్టం చేశారు. ఐదేళ్లలో యాభై ఏళ్ల ప్రగతి ఐటీ రంగంలో యాభై ఏళ్లలో సాధిం చిన ప్రగతిని కేవలం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదేళ్లలోనే సాధించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు 1.90లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఐటీలో హైదరాబాద్ త్వరలోనే బెంగళూరును దాటిపోతుందని అన్నారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చా రు. ఫేస్బుక్, ఆపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు బెంగళూరును కాదని టీఆర్ఎస్ సర్కార్ సమర్థతతో హైదరాబాద్ కు తరలివచ్చాయన్నారు. ఈ రంగంలో కొత్త గా 2.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నయాపైసా ఇవ్వలేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించమని మోదీ సర్కార్ తేల్చిచెప్పిందని, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తమ పని తాము చేసుకు పోతున్నామన్నారు. అందుకే దేశంలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. -
అభివృద్ధి చేసేది కాంగ్రెస్సే
సాక్షి, పుల్కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు నుంచి పోచంపాడ్‌కు నీటిని విడుదల చేయాలనే నిబంధనలు లేకున్నా అక్రమంగా నీటిని తరలించి ఈ ప్రాతం రైతుల కడుపు కొట్టిన టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ కోరారు. మంగళవారం మండల పరిధిలోని ఎస్.ఇటిక్యాల్, లక్ష్మీసాగర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టులో ఉన్న 16 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించడంతో ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరిందన్నారు. ఫలితంగా సింగూర్ కాల్వలకు నీరు ఇవ్వకపోవడంతో పంట పొలాలు బీడుగా మారి వారి కడుపు మడిందన్నారు. అక్రమంగా నీటిని తరలించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దించాలని సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఇటిక్యాల్ నుంచి కొడెకల్ వరకు బీటీ రోడ్డుతో పాటు పంట పొలాలకు కాల్వల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు లింగం, దుర్గారెడ్డి, దశరథ్, ప్రదీప్, నాయకులు బొయిని శ్రీనివాస్, పోచయ్య, టీజేఎస్ కన్వీనర్ పోచయ్య, సీపీఐ నాయకుడు నర్సింలు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. -
దేశం అబ్బురపడేలా అభివృద్ధి: కేటీఆర్
సాక్షి, ఖమ్మం: దేశం అబ్బురపడేలా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో సోమవారం కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని చెప్పారు. పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే కేసీఆర్ ధ్యేయమని వెల్లడించారు. తెలంగాణలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని.. పింఛన్ల కోసం రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. ఇంటింటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామని అన్నారు. మరో వైపు జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా పలువురు నేతలనను ముందస్తు అరెస్టులు చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం టూటౌన్ కారదర్శి వై. విక్రమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అక్రమ అరెస్టును సీపీఎం నేతలు ఖండిస్తున్నారు. -
తెలంగాణ అభివృద్ధికి కాళ్లలో కట్టెలు
కాంగ్రెస్ తీరుపై మంత్రి ఈటల ధ్వజం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతుంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధికి కాళ్లలో కట్టెలు పెట్టినట్టుగా అడ్డు తగులుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. తమ పరిపాలనా దక్షతను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పదవే పరమావధిగా, అధికారమే ధ్యేయంగా బతికే పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏ పార్టీ దయా దాక్షిణ్యాల మీద రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘బరిగీసి కొట్లాడినం, బలిదానాలు చేసినం... రక్తం చిందించి రాష్ట్రం సాదించుకున్నం’’అని పేర్కొన్నారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శాసన మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జంకకుండా, వెరవకుండా, అవమానాలను దిగమింగుతూ చిత్తశుద్ధితో పోరాడి రాష్ట్రాన్ని సాధించామని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు అంతే బాధ్యతతో రాష్ట్రం గొప్పగా ఎదగాలని పని చేస్తున్నామన్నారు. ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు: 2004లో జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు మొదలు పెట్టిన కాంగ్రెస్...తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిందని మంత్రి ఈటల ప్రశ్నించారు. రూ. 400 కోట్ల అంచనాలతో రెండేళ్లలో పూర్తి చేస్తామన్న మిడ్ మానేరును పదేళ్ల పాలనలో పూర్తి చేయకుండా రైతుల కళ్లలో మట్టికొట్టిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలయాపన వల్ల రూ. 16 వేల కోట్లతో ప్రారంభమైన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 35 వేల కోట్లకు చేరుకుందన్నారు. కాంగ్రెస్ వాలకం, విధానాలు దేశమంతా తెలుసని, అందరూ ఛీ కొడుతున్నా పదవి వస్తుందన్న దింపుడు కల్లం ఆశతో ఉందని ఎద్దేవా చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొండ పోచమ్మ ప్రాజెక్టుకు 4,630 ఎకరాలు అవసరమైతే అందులో 4,507 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందని, కేవలం 123 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఆరుగురు కాంగ్రెస్ నేతలు కోర్టుకెళ్లి అడ్డుపడుతున్నారని విమర్శించారు. హిమాన్షు మోటర్స్‌లో 2007 నుంచి లావాదేవీలు జరగడం లేదని చెబుతున్నా షబ్బీర్ అలీ వంటి నేతలు పాత పాటే పాడుతున్నారని మండిపడ్డారు. -
'పునరేకీకరణ' తంత్రం
మూడేళ్ల పాలనలో అధికార టీఆర్ఎస్ కొత్త పంథా - తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలో చేరాలనుకునే నేతలకు ఎర్ర తివాచీ - అసెంబ్లీలో 63 నుంచి 90కి పెరిగిన పార్టీ సంఖ్యాబలం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ సాధనే ఎజెండాగా పద్నాలుగేళ్లు ఉద్యమించిన టీఆర్ఎస్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 63 స్థానాలను గెల్చుకొని అధికారం చేపట్టింది. ‘బంగారు తెలంగాణ’ దిశగా ప్రణాళికలు రచించింది. రాజకీయ సుస్థిరత ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యంకాదన్న ఆలోచనలతో రాజకీయ పునరేకీకరణ పేరిట ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టింది. తెలంగాణ అభివృద్ధి కోసం వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి రావాలనుకునే వారికి ఎర్ర తివాచీ పరిచింది. దీంతో మూడేళ్లు నిండే సరికి అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 63 నుంచి 90కి చేరింది. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలను అధికారిక లెక్కల్లో చూపకుండా 83 మంది సభ్యులను చూపుతున్నారు. వీరు కాకుండా టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీల నుంచి ముగ్గురు ఎంపీలు సైతం టీఆర్ఎస్లో చేరారు. తద్వారా పార్లమెంటులో టీఆర్ఎస్ బలం 11 నుంచి 14కి చేరింది. మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం వల్ల ఒక రాజ్యసభ సీటును దక్కించుకోవడంతో రాజ్యసభలో సంఖ్య ఇద్దరికి చేరింది. ‘పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో టీఆర్ఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. కుట్రలను చూసింది.. వెన్నుపోట్లను తట్టుకుంది. అధికారం చేపట్టాక కూడా తెలంగాణను ఓ విఫల ప్రయత్నంగా చూపేందుకు, ప్రభుత్వాన్ని అస్థిరతపాలు చేసేందుకు కుట్రలు చేశారు. అందుకే రాజకీ య సుస్థిరత కోసం, రాజకీయ పునరేకీకరణకు నడుం బిగించి విజయం సాధించాం..’ అని అధికార పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే మూడేళ్లలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలకు టీఆర్ఎస్ గులాబీ కండువాలు కప్పింది. సభ్యత్వ నమోదులో రికార్డు... మూడేళ్ల కిందట అధికారం చేపట్టిన టీఆర్ఎస్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. రెండేళ్లకోమారు జరిగే పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. మొదట 50 లక్షల మార్కును దాటిన టీఆర్ఎస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్లీనరీ జరిగే నాటికి ఏకంగా 75 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసింది. దీనిద్వారా దేశంలో ఒక పెద్ద పార్టీగా అవతరించామని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరుచుకుంటూ పాలన సాగించాల న్న సీఎం... పార్టీ నాయకత్వాన్ని కూడా ప్రభుత్వంలో భాగస్వాములను చేయగలిగారు. రెండేళ్ల పాలన పూర్తయ్యే వరకు ఏ కొందిరికో తప్ప దక్కని ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, మూడో ఏడాది పూర్తికావొచ్చేసరికి అత్యధికులకు లభించాయి. మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంతో ప్రభుత్వ ప్రచారకులను భారీగా పెంచుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీఆర్ఎస్ ఇప్పటివరకు మూడు ప్లీనరీలు నిర్వహించింది. పార్టీ ప్లీనరీలను సైతం ప్రభుత్వ పథకాల ప్రచారానికి వేదికగా వినియోగించుకుంది. ఏప్రిల్‌లో ముగిసిన 16వ ప్లీనరీకి భారీ జనసమీకరణతో బలప్రదర్శన చేసింది. ఈ వేదికను మూడేళ్ల పాలన విజయాలను చెప్పుకునేందుకు వినియోగించుకుంది. వలస నేతలకూ గుర్తింపు రాజకీయ పునరేకీకరణలో భాగంగా వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన నేతలకూ గుర్తింపు ఇవ్వడం ద్వారా మరిన్ని వలసలను ప్రోత్సహించేందుకు అధికార పార్టీ వ్యూహ రచన చేసింది. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర్రావులకు మంత్రివర్గంలో స్థానం కల్పించింది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉండి టీఆర్ఎస్లో చేరిన గుండు సుధారాణికి కార్పొరేషన్ పదవితోపాటు పార్టీ మహిళా విభాగం పగ్గాలూ అందించింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు వంటి వారికి తిరిగి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వడమే కాకుండా నేతికి మండలి డిప్యూటీ చైర్మన్, బోడకుంటికి మండలిలో ప్రభుత్వ విప్ పదవులు ఇచ్చింది. -
అభివృద్ది కోసం మోదీ కృషి చేస్తున్నారు
-
పల్లె ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే..
► కులవృత్తుల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి: కడియం ► ప్రజలను కులవృత్తులకే పరిమితం చేయాలనుకుంటే గురుకులాలెందుకు తెరుస్తామని ప్రశ్న ► మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి ► అవగాహన లేని విమర్శలను పట్టించుకోబోమని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘కుల వృత్తులు, వ్యవసా య ఉత్పత్తులపైనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ అంశాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కులవృత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వీటిపై ఆధాపడి ఉన్న కుటుంబాలను బాగు చేసేందుకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తున్నారు. వీటిని జీర్ణించుకోని కొందరు విమర్శలు చేస్తున్నారు. విమర్శలను మా ప్రభుత్వం పట్టించుకోదు. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల్ని ఎవరూ ఆపలేరు’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 191వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘సరైన అవగాహన లేకుండా, లక్ష్యాన్ని అర్థం చేసుకోకుండా కొందరు నాయకులు మాట్లాడు తున్నారు. కుల వృత్తుల చేసుకునే వారు ఆ పనులకే పరిమితంకావాలా అని ప్రశ్నిస్తు న్నారు. కుల వృత్తులకే పరిమితం చేయాలని భావిస్తే మూడేళ్ల కాలంలో విద్యపై రూ.వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 500లకు పైగా గురుకుల పాఠశాలలను ఎందుకు ప్రారంభిస్తాం’ అని ప్రశ్నించారు. బడుగు వర్గాలకు పవిత్ర మాసం.. ఏప్రిల్ నెల బడుగు బలహీన వర్గాలకు పవిత్ర మాసమని, జగ్జీవన్‌రామ్, జ్యోతిబాఫూలే, అంబేడ్కర్ వంటి మహానుభావులు జన్మించడంతో అన్ని వర్గాలు నెలంతా పండగ చేసుకుంటాయని కడియం చెప్పారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనేదే ఫూలే ఆశయమని, ఆయన ఆశయాలను అంబేడ్కర్ కొనసాగించారని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుతో అన్ని వర్గాలకు లబ్ధి కలుగుతోందని చెప్పారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమకార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు యువకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు గతంలో ఎన్నడూ లేనంతగా రూ.ఐదున్నర వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని, అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ గణేశాచారి, బీసీ సంఘం నాయకులు కాలప్ప, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫూలే ఆదర్శాల అమలు కోసం.. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న ఫూలే ఆదర్శాలను కేసీఆర్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని కడియం తెలిపారు. అందులో భాగంగా కేజీ టు పీజీ ఉచిత విద్య అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు విదేశీ విద్యా నిధి పథకాన్ని అమలు చేస్తున్నారని, ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వాలు చేయని పనులు కేసీఆర్ హయాంలో జరిగాయని, వసతి గృహాలు, హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు భారీగా పెంచామని, యూనివర్సిటీల్లో మెస్ బకాయిలు పూర్తిగా మాఫీ చేశామని తెలిపారు. -
కేసీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదనడానికి కలెక్టర్ల రివ్యూ మీటింగే నిదర్శనమని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కలెక్టర్లకు మన ఊరు మన ప్రణాళికా అనే పాత స్కీమ్ గురించి చెప్పడం అభివృద్ది అవుతుందా అని ప్రశ్నించారు. మన ఊరు మన ప్రణాళికను రెండేళ్లుగా నిర్వీర్యం చేసి మళ్లీ అమలు చేస్తామంటారా.. పేదల వివరాలు సేకరించాలంటూ కలెక్టర్లకు సూచించిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గురించి మరిచారా అన్నారు. ఆ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని, ఇళ్లు, ఉపాధి లేని వారి వివరాలు బయటకు వస్తే.. డబుల్ బెడ్ రూమ్ కోసం ఉద్యోగాల కోసం డిమాండ్లు పెరుగుతాయనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెల్లడించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇంట్లో సమీక్షలు నిర్వహిస్తూ ప్రెస్ నోట్ల ద్వారా పాలన సాగిస్తున్నారని ఎద్దేవ చేశారు. క్షేత్ర స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని పాలనలో జవాబుదారీ తనం లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందన్నారు. -
తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం
నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారథ్యంలో దీక్షాదివస్ పేరుతో టీఆర్ఎస్ యువత, విద్యార్థి సంఘాల 60 మంది ప్రతినిధుల టీంతో 10 రోజులుగా నియోజకవర్గవ్యాప్తంగా చేపట్టిన స్ఫూర్తి యాత్ర శుక్రవారం నకిరేకల్‌కు చేరుకుంది. స్థానిక మెరుున్ సెంటర్లో రాత్రి జరిగిన దీక్షాదివస్, స్ఫూర్తి యాత్ర ముగింపు బహిరంగ సభలో నేతి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ సమయంలో చావు అంచుల్లోకి వెళ్లి సాధించుకున్న స్వరాష్ట్రం అభివృద్ధికి అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాట పటిమను మరో సారి గుర్తు చేస్తూ దీక్షాదివస్ పేరుతో ఈప్రాంత ఎమ్మెల్యే వేముల వీరేశం ఒక వినూత్న పద్ధతుల్లో 10 రోజులు పాటు వివిధ వర్గాల ప్రజలతో కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారన్నారు. పోరాట స్ఫూర్తితో అభివృద్ధి : ఎమ్మెల్యే వేముల సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కేసీఆర్ పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం నాలుగు కోట్ల ప్రజానీకం ఎదురుచూస్తున్న సమయంలో కేసీఆర్ ప్రాణాలకు తెగించి దీక్షకు పూనుకున్నారన్నారు. బంగారు తెలంగాణ కోసం పార్టీలకతీతంగా అందరు భాగస్యామ్యం కావాలని కోరారు. కవి,గాయకుడు కోదారి శ్రీనివాస్ తాను రచించిన పాటలను పాడి సభికులను ఉత్తేజపరిచారు. ఈసభలో నకిరేకల్ మాజీఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, నార్కట్‌పల్లి, కేతేపల్లి ఎంపీపీలు రేగట్టే మల్లిఖార్జున రెడ్డి, గుత్తమంజుల, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమే ష్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్, నాయకులు మంగినపల్లి రాజు, సిలివేరు ప్రభాకర్, గాదగోని కొండయ్య, గున్నుడోరుున యాదగిరి, రాచకొండ వెంక న్న, పన్నాల అనసూర్యమ్మ, టీఆర్ఎస్వీ నాయకులు పెండెం సంతోష్, గాదె శివ, అరుులపాక శ్రవణ్, తోటకురి వంశీ, నరేం దర్‌రెడ్డి, జనార్దన్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్
తెలంగాణ ప్రజలు ఆశించినంత అభివృద్ధి రాష్ట్రంలో జరగడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. తాను ఈనెల 23వ తేదీన రైతుదీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఈ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో పలువురు జేఏసీ నేతలు, రైతు సంఘాల నేతలు కూడా పాల్గొంటారన్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కోదండరామ్ కలిశారు. కొత్త జిల్లాలు, మండలాల్లో ప్రజల డిమాండ్లపై ఆయనతో చర్చించారు. గట్టుప్పల్, నాగిరెడ్డిపేట మండలాల సమస్యను పరిష్కరించాలని రాజీవ్ శర్మను కోదండరామ్ కోరారు. -
కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రి : కోమటిరెడ్డి
నల్లగొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ...ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పుణ్యమా అని పైసా ఖర్చులేకుండా గెలిచి..పార్టీ ఫిరాయించారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎం కాగానే నాగార్జునసాగర్ ఎండిపోయిందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రిజర్వేషన్ల పేరుతో ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పాల్వాయి గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : బీజేపీ
సూర్యాపేట రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు నివాసంలో సోమవారం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా విరివిగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. సమావేశంలో నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, పార్టీ నాయకులు ఎండీ హబీద్, నలగుంట్ల అయోధ్య, చల్లమల్ల నర్సింహ, బండపల్లి పాండురంగాచారి, రంగరాజు రుక్మారావు, కొణతం సత్యనారాయణరెడ్డి, కర్నాటి కిషన్, వుప్పల సంపత్‌కుమార్, జటంగి వెంకటేశ్వర్లు, జీడి భిక్షం, మంచాల రంగయ్య, పొదిల రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. బహిరంగ సభను జయప్రదం చేయాలి నల్లగొండ టూటౌన్ :సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బీజేపీ నేత పల్లెబోయిన శ్యాంసుందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు అమిత్ షా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పోతెపాక సాంబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లెబోయిన శ్యాంసుందర్, పెరిక మునికుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
కెనడాలో ఘనంగా తెలంగాణ నైట్ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కెనడా(టీడీఎఫ్సీ) నిర్వహించిన తెలంగాణ నైట్-2016 ఉత్సవాలు కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఘనంగా జరిగాయి. గ్రేటర్ టొరంటోతో పాటు కెనడాలోని వివిధ నగరాల నుంచి 800 మందికి పైగా తెలంగాణ వాసులు హాజరై కార్యక్రమాన్ని విజయవం తం చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఒంటారియో ప్రావిన్స్ ఆరోగ్య శాఖ మంత్రి దీపిక దామెర్ల హాజరయ్యారు. వారితోపాటు టీడీఎఫ్ గ్లోబల్, యూఎస్ఏ ప్రతినిధులు, హైదరాబాద్ డక్కన్ ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర గురించి కోదండరాం చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రముఖ తెలుగు కళాకారుడు లోహిత్ మిమిక్రీ సభికులను రంజింపచేసింది. ప్రముఖ తెలంగాణ సాహితీవేత్త, కవి డాక్టర్ ఎం.కులశేఖర్రావుని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సమ్మక్క, సారలమ్మల నృత్యం విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు విదేశాల్లో నిర్వహించి తెలంగాణ సంస్కృతిని పటిష్ట పరుస్తామని నిర్వాహకులు తెలిపారు. -
'తెలంగాణలో అభివృద్ధికి పునాదే పడలేదు'
హైదరాబాద్: తెలంగాణలో అసలు అభివృద్ధికి పునాదే పడలేదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి విమర్శించారు. కానీ టీఆర్ఎస్ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజలను టీఆర్ఎస్ నేతలు మబ్బి పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్థానిక నేతలను బెదిరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జానా ధ్వజమెత్తారు. అయినా నల్లగొండ, మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు అడ్డుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతపక్షం ఉండకూడదన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తెలంగాణ వాదులు తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్ ఏకపక్ష వైఖరి వ్యవహరిస్తోందని జానారెడ్డి విమర్శించారు. -
ఎన్ఆర్ఐలు సహకరించాలి: సిడ్నీలో ఈటల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మంత్రి, సోమవారం సిడ్నీలో ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందన్నా రు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రపంచంలోనే ఉత్తమమైన విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, అన్ని మౌలిక వసతులున్నందున హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. -
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి
- ఇది సర్కారుకు సిగ్గుచేటు - సీపీఎం కార్యదర్శి తమ్మినేని సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది తప్ప మరేమీ లేదని, ప్రస్తుత పాలకవర్గానికి ఇది సిగ్గుచేటని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. మంగళవారం ఎంబీభవన్‌లో పార్టీనాయకులు డీజీ నరసింహారావు, ఎం.శ్రీనివాస్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపద పెరుగుతుందని, అందరి బతుకులు బాగుపడతాయని భావిస్తే ఆత్మహత్యల్లో అభివృద్ధి ఉంటోందని ఎద్దేవా చేశారు. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా రైతాంగ సమస్యలతోపాటు పట్టణప్రాంతాల్లోని ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు నిబంధనలు రూపొందించి, మైనారిటీలకు సబ్‌ప్లాన్, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మహత్యల పరంపర సాగుతుంటే పాలకపక్షంలో అసలు స్పందనే లేదని, వాస్తవానికి 1300 మందిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. వీటన్నింటిపై ప్రభుత్వపరంగా స్పందన లేకపోతే అసెంబ్లీలో, బయట కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీల విషయంలో తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శిస్తోందన్నారు. స్మార్ట్‌సిటీల పథకం గతంలో జేఎన్యూఆర్ఎంకు కొనసాగింపేనని ఎం.శ్రీనివాస్ తెలిపారు. రేపు వరంగల్ వామపక్ష అభ్యర్థి ప్రకటన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగే బహిరంగసభలో వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీచేసే వామపక్షాల అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో ప్రజాగాయకుడు గద్దర్ సానుకూలంగానే ఉన్నా ఇది ఇంకా ఖరారు కాలేదన్నారు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని మంగళవారం ఆయన మీడియాకు చెప్పారు. కిష్టారెడ్డి మృతి కార ణంగా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లోనూ వామపక్షాల తరఫున అభ్యర్థిని నిలపనున్నట్లు చెప్పారు. -
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుకండి
ఎన్నారైలకు రసమయి పిలుపు రాయికల్: బంగారు తెలంగాణ సాధనలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం కెనడాలోని టొరంటోలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ నైట్-2015 కార్యక్రమంలో రసమయి బాలకిషన్, పారిశ్రామికవేత్త వసంత్‌రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ యూకే అధ్యక్షుడు కాల్వల విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యూరు. ఇందులో రసమయి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నారైలంతా భాగస్వాములై అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు పవన్, వెంకట్, మహేశ్, జితేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అభివృద్ధి కోసం ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి
ఖమ్మం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అభివృద్ధికి పలు విజ్ఞప్తులు చేశారు. భద్రాచలంలో గోదావరి రెండవ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రిని పొంగులేటి కలిశారు. సత్తుపల్లి-కొత్తగూడెం మధ్య నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాలని కోరారు. సూర్యాపేట-దేవరపల్లి నాలుగు లైన్ల రోడ్డుని జాతీయ రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గిరిజన విశ్వవిద్యాలయం, కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శ్రీనివాస రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ ఒడిశా ద్వారా తెలంగాణకు సీపోర్టు నిర్మాణం చేయడానికి మంత్రి గడ్కరీ అంగీకరించినట్లు చెప్పారు. -
పారిశ్రామిక రాష్ట్రమే లక్ష్యం
దుబాయ్ పెట్టుబడిదారుల వార్షిక సమావేశంలో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికంగా విజయవంతమైన రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దుబాయ్‌లో ప్రారంభమైన పెట్టుబడిదారుల వార్షిక సమావేశానికి మంత్రి జూపల్లితోపాటుఅధికారులు హాజరయ్యారు. యూఏఈ ఆర్థిక మంత్రి సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సూరీతో జూపల్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానాన్ని యూఏఈ మంత్రికి జూపల్లి వివరించారు. బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి రామ్మూర్తి, ప్యూర్ గోల్డ్ గ్రూప్ చైర్మన్ ఫిరోజ్ మర్చంట్, వార్కే గ్రూప్ డెరైక్టర్ సి.ఎన్. రాధాకృష్ణ, కిమోహా గ్రూప్ ఎండీ వినేశ్ భిమానితో కూడా జూపల్లి సమావేశమై పెట్టుబడులను ఆహ్వానించారు. -
‘చంద్రబాబును తెలంగాణలో తిరగనీయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను గాలికి వదిలేసి, తెలంగాణ పర్యటనకు వస్తాననడం ఏమిటని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మా సీఎంకు తెలుసు. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి’ అని ఆయన హితవుపలికారు. తెలంగాణ భవ న్లో మంత్రి మంగళవారం ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలే యాదయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. అసలు పక్క రాష్ట్రం సీఎంకు తెలంగాణలో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది?.. ఇక్కడి టీడీపీ నేతలు చేతగాని డమ్మీలా అని మంత్రి సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆర్థిక భారం గురించి కూడా ఆలోచించకుండా సీ ఎం కేసీఆర్ పనిచేస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
నెలాఖరులో అమెరికాకు కేసీఆర్
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పిలుపు మేరకు వెళ్లనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ నెలాఖరులో అమెరికా వెళ్లనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆహ్వానం మేరకు సీఎం వెళుతున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్‌లో టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ అలుగు నేతృత్వంలో దాదాపు పదిహేను మందితో కూడిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ను అభినందించడంతో పాటు, ఆయనను అమెరికాకు ఆహ్వానించారు. ఈ మేరకు అమెరికా వెళుతున్న కేసీఆర్.. అక్కడ రెండు మూడు వారాలు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో అక్కడి పారిశ్రామికవేత్తలతో పాటు తెలంగాణకు చెందిన ఎన్నారైలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలిసింది. బంగారు తెలంగాణ కోసం ఎన్నారైల సహకారం కోరుతామని సీఎం ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాతృభూమిలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని తెలంగాణకు చెందిన ఎన్నారైలను ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం. అమెరికా వెళ్లడానికి గాను కేసీఆర్ గురువారం అమెరికా కాన్సులేట్ నుంచి వీసా తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సీఎంతోపాటు ఎవరెవరు వెళతారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ పర్యటన క్రిస్మస్కు ముందా? తరువాతా? అన్నదానిపైనా ఇంకా నిర్ణయం జరగలేదని సీఎం సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. -
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం: ఎల్అండ్టీ
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని ఎల్అండ్టీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఎల్అండ్టీ సంస్థ ఛైర్మన్ కేఎం నాయక్ ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్ల తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందనే ఆశిస్తున్నట్లు నాయక్ ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే అన్ని రకాలుగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సూరత్‌లో ఉన్న ఎల్అండ్టీ మాన్యుఫాక్చరింగ్‌ను సందర్శించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఈ సందర్భంగా కేఎం నాయక్ కోరారు. -
బంగారు తెలంగాణ కోసం కలసివస్తున్న ఎన్ఆర్ఐలు
-
'లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నాం'
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో కేసీఆర్ చర్చకు రావాలన్న నారా లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. భరోసాయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతి బయటపెడితే జైలుభరో యాత్ర చేయాల్సివుంటుందన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే తెలంగాణలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. గతంలో విద్యుత్ మంత్రిగా షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, దొంగే దొంగ అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. వ్యవసాయం దండగన్నారని, బషీర్‌బాగ్ లో కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. -
టీఆర్ఎస్తోనే అభివృద్ధి..
పటాన్చెరు రూరల్: టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. బుధవారం మండలంలోని ఇంద్రేశం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, యాదవరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలో గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎంపీపీలు, స్థానిక సర్పంచులు, అన్ని గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, సర్పంచ్ అనసూయమ్మ, వార్డు సభ్యులు బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. -
తెలంగాణ అభివృద్ధికే సింగపూర్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార, విద్యుత్, సాంకేతిక, పర్యాటక రంగాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ వెళ్లారని ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, భాను ప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ పదవి కోసం మాజీమంత్రి డీకే అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, దానిని దాచిపెట్టి కేసీఆర్‌పై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలపై బీజేపీ వైఖరిని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో ఎప్పటికీ భవిష్యత్తు ఉండదని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని పట్టించుకోరని చెప్పారు. -
ప్రజా ప్రయోజనాలకే కుటుంబ సర్వే
ప్రగతినగర్ : తెలంగాణ అభివృద్ధికి, అర్హులైన వారందరికీసంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సమగ్ర కుటుంబ సర్వేకు ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే రోజు ప్రజలందరూ ఆందుబాటులో ఉండాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి పొందే సంక్షేమ పథకాలు అందకుండా పోతాయన్నారు. మంగళవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎన్యూమరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో 6.25 లక్షల కుటుంబాల ను సర్వే చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో ఉద్యోగి సగటున 25 నుంచి 30 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు సహకరిం చాలని కోరారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఎన్నికల తరహాలో ఉంటుందన్నారు. ఎన్యూమరేటర్లకు ఏ గ్రామంలో ఏ కుటుంబాలను సర్వే చేసే విషయాన్ని చివరి నిమిషాం వరకు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేను నిర్వహించాలని ఆయన సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే ఫార్మట్‌లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్, ఓటర్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లు, మొబైల్ నెంబర్లు, విద్యార్హతలు, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, గతంలో పొందిన ప్రభుత్వ పథకాలు, ప్రస్తుతం పొందుతున్న పెన్షన్లు, ఇతర ఆదాయపన్ను వంటి అంశాలు, స్థిరాస్తులు, పశుసంపద వివరాలు పొందుపరచాలని ఆయన సూచించారు. జిల్లా కు 25 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరం అవుతున్నారని కలెక్టర్ తెలిపారు. బుధవారం తహశీల్దార్లందరూ, ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మండల కేంద్రంలో కనీసం 50 కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివరాలు పొందుపరిచిన తరువాత కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలని అది నిజమా లేదా అనే బాధ్యత అధికారులదేనన్నా రు. అధికారులు తప్పు చేశారని భావిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి డీఆర్ఓ యాదిరెడ్డి, బోధన్,కామారెడ్డి ఆర్డిఓలు, పీడీలు, అన్నిశాఖల అధికారులు ఎంఆర్వోలు, ఎండీవోలు పాల్గొన్నారు. -
తెలంగాణకు ‘మోడీ రైలు’ వచ్చేనా?
* రేపే రైల్వే బడ్జెట్.. ఎన్నో ఆశలతో ఎదురుచూపు * ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రాజెక్టులు పెండింగ్ సాక్షి, హైదరాబాద్: రైల్వే రవాణా సౌకర్యం విషయంలో బాగా వెనుకబడిన తెలంగాణకు.. ఈ సారి బడ్జెట్లోనైనా తగిన ప్రాధాన్యం లభిస్తుందా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం ఇంకా కొనసాగుతుందా? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రైల్వే రవాణా సదుపాయం సమకూరుతుందా? కొత్త ప్రాజెక్టులు మంజూరవుతాయా? కనీసం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులకైనా మోక్షం లభిస్తుందా?... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. రైల్వే రవాణా వసతిలో బాగా వెనుకబడిన తెలంగాణ.. మోడీ ప్రభుత్వం కేటాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావం కోసం సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తొలి రైల్వే బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. మరోవైపు రైల్వేబడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో... తెలంగాణ ప్రాంతానికి, దక్షిణ మధ్య రైల్వేకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా కోరారు. అయితే పక్షం రోజుల క్రితమే రైల్వేమంత్రి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించి రైల్వే బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీలు ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో చాలావాటిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీవ్రంగా ఒత్తిడి చేసిన పెద్దపల్లి-సిద్ధిపేట-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట జంక్షన్‌కు డివిజన్ హోదా కల్పించటం లాంటి కీలక ప్రతిపాదనల విషయంలో రైల్వేమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నారనేది బడ్జెట్లో తేలనుంది. ఆదాయం ఇస్తున్నా నిధులు అంతంతే.. కొంతకాలంగా రైల్వేకు దక్షిణ మధ్య రైల్వే భారీగా ఆదాయం సాధించిపెడుతోంది. కానీ ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు మాత్రం దక్కడం లేదు. గత 13 ఏళ్ల కాలంలో ఇక్కడ కేవలం 550 కిలోమీటర్ల మేర మాత్రమే డబ్లింగ్ పనులు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొత్త రైళ్ల ఊసే పట్టదు.. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-చెన్నై, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-వాస్కోడిగామా (గోవా), హైదరాబాద్-నాందేడ్, హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్-షిర్డీ లాంటి ముఖ్యమైన మార్గాల్లో కొత్త రైళ్లు కావాలని గత బడ్జెట్ సమయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని అసలు పట్టించుకోనేలేదు. ఇచ్చేదే కొంత.. అందులోనూ కోత.. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధులు రూ. 4,164 కోట్లు. ఇందులో ప్రణాళిక పద్దు కింద అభివృద్ధి పనులకు కేటాయించింది రూ. 2,175 కోట్లే. అంతకుముందు బడ్జెట్ కంటే ఇవి కేవలం రూ. 315 కోట్లు మాత్రమే ఎక్కువ. అయితే.. ఇందులోనూ నిధులు లేవంటూ దాదాపు రూ. వేయికోట్లకుపైగా కోత పెట్టారు. అంతమేర కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు.. * కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టు ఐదేళ్ల కింద ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి దాదాపు ఏడాదిన్నర కింద రైల్వేకు అప్పగించింది. అయినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. * కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైన్ పనులకు 2012 బడ్జెట్లో చోటు దక్కింది. రూ. 1,054 కోట్లతో జరగాల్సిన 200 కిలోమీటర్ల పని పెండింగ్‌లో ఉంది. * పెద్దపల్లి-నిజామాబాద్: 20 ఏళ్ల కింద మంజూరైన ప్రాజెక్టులో రూ. 925 కోట్ల వ్యయంతో 178 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణం చేపట్టగా.. ఇంకా 30 కి.మీ పని మిగిలే ఉంది. * గుల్బర్గా-బీదర్: 107 కిలోమీటర్ల మార్గంలో కొంతే పూర్తయింది. నిధులు లేక 50 కిలోమీటర్ల పని నిలిచిపోయింది. * మునీరాబాద్-మహబూబ్‌నగర్: 247 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను భరిస్తోంది. అయినా పనులు మాత్రం పూర్తికావటం లేదు. * మహబూబ్‌నగర్-గుత్తి, సికింద్రాబాద్-ముద్ఖేడ్-ఆదిలాబాద్, మంచిర్యాల-మందమర్రి డబ్లింగ్ పనులదీ అదే గతి. * గత బడ్జెట్లో సికింద్రాబాద్‌లో రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారుల శిక్షణ కేంద్రం (సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫైనాన్స్ ఆఫీసర్స్), కాజీపేటలో ఉద్యోగుల సామర్థ్యం పెంపు శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. కానీ పనుల ఊసేలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌ను పట్టించుకోరేం? రోజుకు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ప్రతి బడ్జెట్లో దీనిని ప్రస్తావిస్తున్నా నిధులు మాత్రం కేటాయించడం లేదు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదమున్న నేపథ్యంలోనూ ఇక్కడ కనీస భద్రతా చర్యలు లేవు. సీసీ కెమెరాలకూ కొరతే. చివరకు ప్రయాణికులకు సరిపడా మూత్రశాలలు, మంచినీటి వసతి కూడా సరిగా లేదు. పది ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉండటంతో అవి సరిపోక నగర శివారులో ఒక్కో రైలును అరగంట నుంచి గంటపాటు నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. -
చనిపోయినవారికి పెన్షన్లు అందుతున్నాయి: కేటీఆర్
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నితెలంగాణ అభివృద్ధి కోసం వాడుకుంటామని తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 25న 150 కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణ కుటుంబాల కంటే ఎక్కువగా రేషన్ కార్డులు ఉన్నాయని, చనిపోయినవారికి కూడా పెన్షన్లు అందుతున్నాయని కేటీఆర్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని అవకతవకలన్నింటిని అరికడదామని కేటీఆర్ తెలిపారు. -
జై కొట్టేదెవరికి
- రేపే పోలింగ్ పార్టీలకు అగ్ని పరీక్ష - అతిరథుల దృష్టి ఇక్కడే - అన్ని చోట్ల ఉత్కంఠ పోరు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రధాన పార్టీలన్నీ తెలంగాణ అభివృద్ధి.. రాష్ట్ర వికాసమే ఏకైక ఎజెండాగా ఎంచుకోవటంతో జిల్లా ఓటర్లు ఎవరిని విశ్వసిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచాయి. అన్ని పార్టీల అతిరథ నేతలు ప్రచారంలో భాగంగా తొలి అడుగు ఇక్కడే వేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యమ ఖిల్లాగా పేరొందిన జిల్లాలో ఫలితమెలా ఉంటుందనేది రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనత తమదేనని.. వికాసం కూడా తమ వల్లనే సాధ్యమవుతుందని ప్రచారం హోరెత్తించింది. స్వయానా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జిల్లా వేదికగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రులు జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్ రోడ్‌షోలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఛాంపియన్షిప్ తమదేనని.. ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ఆశలన్నీ నెరవేరాలంటే తమకే పట్టం కట్టాలని టీఆర్ఎస్ ప్రచారంలో ముందంజ వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ప్రచారసభలు నిర్వహించారు. తమ మద్దతుతోనేతెలంగాణ వచ్చిందని.. అభివృద్ధి చేసే బాధ్యతను తమకే అప్పగించాలని బీజేపీ సైతం ప్రచారంలో దూసుకెళ్లింది. ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భారత విజయయాత్రలో భాగంగా కరీంనగర్ సభలో పాల్గొన్నారు. జనసేన పార్టీ నేత పవన్‌కల్యాణ్ హుస్నాబాద్, కోరుట్లలో మిత్రపక్షాల తరఫున ప్రచారం చేపట్టారు.ఊగిసలాట అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు జగిత్యాల నియోజకవర్గంలో ప్రచారసభలో పాల్గొన్నారు. ఎండలు లెక్క చేయకుండా.. అన్ని పార్టీల అతిరథ నేతలు జిల్లాకు తరలిరావటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హోరెత్తిన ప్రచారం ప్రధానపార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించారు. సకుటుంబ సపరివారంగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. గతంతో పోలిస్తే ఎన్నికల ఖర్చులోనూ అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో ప్రధాన పార్టీల అతిరథ నేతల సభలకు జనం భారీగా తరలిరావటం... పల్లెపల్లెనా అభ్యర్థుల ప్రచారానికి స్పందన కనిపించింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగింది. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. కరీంనగర్ ఎంపీ సీటుకు పాత కాపును.. పెద్దపల్లిలో విద్యార్థి ఉద్యమ నేతను ప్రయోగించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం అన్నిచోట్ల పోటీకి నిలిచింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు సామాజిక న్యాయం ఎజెండాగా టిక్కెట్లు పంపిణీ చేసింది. ఫలితంగా ఎక్కువ చోట్ల బలహీనమైన అభ్యర్థులు పోటీకి దిగారు. రామగుండం, కోరుట్లలో టిక్కెట్లు రాని అభ్యర్థులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. రెండు ఎంపీ స్థానాల్లోనూ బలంగా ఉన్న సిట్టింగ్‌లకు కాంగ్రెస్ అవకాశమిచ్చింది. పొత్తు విషయంలోనే మల్లగుల్లాలు పడ్డ టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు జిల్లాలో 12 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపాయి. చెరిసమంగా ఆరు స్థానాల్లో బీజేపీ, ఆరుచోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. కేడర్ లేకపోవటం టీడీపీని వెంటాడుతుండగా.. కొత్త జోష్ బీజేపీ అభ్యర్థులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. నామినేషన్ల పర్వంలో దొర్లిన తప్పుతో హుస్నాబాద్‌లో మిత్రపక్షాలు పోటీకి దూరమయ్యాయి. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు, కరీంనగర్ ఎంపీ సీటుకు పోటీ పడుతోంది. మంథని, రామగుండం మినహా అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మహానేత వైఎస్ అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారులు.. ఆయన అభిమానులు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఉన్న జనాదరణను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రచారం హోరెత్తించారు. పొత్తులు.. సీట్ల సర్దుబాటులో భంగపడటంతో జిల్లాలో సీపీఐ పోటీకి దూరమైంది. కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించింది. ఎంఐఎం స్థానికంగా ఉన్న అవగాహన మేరకు అభ్యర్థులకు మద్దతు ప్రకటించి రెండు ఓట్ల విధానానికి తెరలేపింది. -
మోడీతోనే తెలంగాణ అభివృద్ధి : పవన్
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అ న్నారు. సోమవారం టీడీపీ, బీజేపీ పార్టీలు సంయుక్తంగా జిల్లాకేం ద్రంలోని మేకల అభి నవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి అవకా శాలు లభిస్తాయని చెప్పారు. బుధవారం జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి తేరచిన్నపరెడ్డి మాట్లాడుతూ తనను నల్లగొండ నుంచి గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే జిల్లా అభివృద్ధి కోసం నరేంద్రమోడీని ఒప్పించి ఎక్కువ నిధులను తీసుకువచ్చి సమగ్రాభివృద్ధి చేసి జిల్లా రూపురేఖలను మారుస్తానని అన్నారు. జిల్లాలో రైల్వేలైన్ విస్తరణ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తానని చెప్పారు. సోలార్ సిస్టమ్ ద్వారా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లా కేంద్రంలో బత్తాయి మార్కెట్, జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయిస్తామన్నారు. అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి కూతురు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మంచి ఆశయంతో ప్రజలకు సేవ చేయాలని, మోడీ, పవన్ కల్యాణ్‌లను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాలోకి వచ్చానన్నారు. సభలో టీడీపీ జిల్లా కార్యదర్శి ఆవుల రాములు, నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చిలువేరు కాశీనాథ్, బోయపల్లి కృష్ణారెడ్డి, రియాజ్అలీ, మారం శత్రఘ్నారెడ్డి,తుమ్మల మధుసూధన్‌రెడ్డి , ఎల్‌వీయాదవ్, బీజేపీ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, ఓరుగంటి రాములు, బాకి పాపయ్య, నూకల వెంకటనారాయణరెడ్డి, చింత ముత్యాల్రావు, పాదూరి కరుణ, పొతెపాక సాంబయ్య కూతురు లక్ష్మారెడ్డి, కూతురు సత్యవతి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
- తెలంగాణ క్రెడిట్ మాదే - ఫామ్‌హౌజ్‌లో కూర్చునేవారికి అధికారమా? - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. జాతీయపార్టీ, లౌకికత్వానికి మారుపేరైన కాంగ్రెస్‌తోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రాంతీయపార్టీలతో తెలంగాణ అభివృద్ధి అసాధ్యమన్నారు. ఫాంహౌజ్‌లో కూర్చుని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు పంపిణీ చేసే వ్యక్తుల చేతికి అధికారం అప్పగిస్తే... తర్వాత ఈ ప్రాంతానికి మంజూరయ్యే పరిశ్రమలు.. పవర్ ప్రాజెక్టులు.. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ మళ్లీ ఆయన కుటుంబసభ్యులకే దక్కుతాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే పురుడు పోసుకుందని, చంటిపిల్ల లాంటి ఈ తెలంగాణను ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని అన్నారు. బీజేపీది విభజించి పాలించే తీరు ప్రస్తుత ఎన్నికలు లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య పోరు అని ఆజాద్ అన్నారు. బీజేపీ మత రాజకీయాలను ప్రేరేపిస్తూ.. విభజించి పాలించే పాలసీతో పని చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఉన్న అన్ని కులాలు.. మతాలు.. వర్గాలను సంఘటితంగా ఉంచి.. వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం కాంగ్రెస్ సిద్ధాంతమని వెల్లడించారు. బీజేపీది నాధూరాంగాడ్సే మార్గమని.. కాంగ్రెస్‌ది అహింసామార్గమని అన్నారు. బీజేపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ అధికారంలో వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయాంలో 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు అందరికీ తెలిసిన విషయమేనని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
కేసీఆర్.. తేల్చుకుందాం రా!
- తెలంగాణ అభివృద్ధి ఎవరు చేశారో! - బోధన్, జగిత్యాల, కందుకూరు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బోధన్, కందుకూరు, న్యూస్‌లైన్/సాక్షి, కరీంనగర్: తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందాం రమ్మని టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బోధన్ వేదికగా ఇందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా జగిత్యాల, రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన బహిరంగ సభలలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేతపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి, మోసకారి, అబద్ధాలకోరు, తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం పాటు పడని ఆయనకు ఓట్లడిగే హక్కు లేదని విమర్శించారు. అబద్ధాలు మాట్లాడటం, పెద్ద, చిన్న తేడాలేకుండా, బండ మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అని, ఎప్పటికైనా అమ్ముడుపోయే సరుకని ధ్వజమెత్తారు. ఆపార్టీలో మంచోళ్లు ఉండరని, 420లే ఉంటారని పేర్కొన్నారు. దొంగ కేసీఆర్‌తో బతుకులు ఆగమవుతాయని, సమాజహితం కోసం మేం ఆలోచిస్తుంటే, కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడని విమర్శించారు. నన్నే జైలుకు పంపుతానంటావా? ‘‘నిజాం షుగర్స్ ప్రయివేటీకరణపై నన్నే జైలుకు పంపుతానంటావా... నా స్థాయి ఏమిటో తెలియకుండా అంటావా’’ అంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపినా తనను ఏమీ చేయలేక పోయిందన్నారు. ‘‘ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. నీవు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపి, నిన్ను నీ కుటుంబ సభ్యులందరినీ శాశ్వతంగా జైలులో పెడతా’’ అని హెచ్చరించారు. తన జోలికి వస్తే ఊరుకోబోనని, సైకిల్ జోరు పెంచి చక్రాల కింద తొక్కిస్తానన్నారు. ‘కేసీఆర్ తన ఫాం హౌజ్‌లో కూర్చొని అవినీతి పంట పండిస్తాడు.. ఎకరానికి రూ.కోటి చొప్పున పండిస్తాడు.. మాట్లాడితే ఎదురుదాడికి దిగుతాడు’ అని మండిపడ్డారు. ‘2004 ఎన్నికల్లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్, ఇప్పుడేమో మెదక్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నావ్. నువ్వో వలస పక్షివి’ అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సభలు ఆలస్యం...ప్రజల అసహనం ఉదయం 10.45గంటలకు బోధన్ రావలసిన చంద్రబాబు నాలుగు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.45కు వచ్చారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జిగ పంపిణీలో గందరగోళం ఏర్పడటంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. సభ అనంతరం నిర్వాహకులు మహిళలకు డబ్బులు పంపిణీ చేయడం కనిపించింది. -
వైఎస్సార్‌సీపీతోనే తెలంగాణ అభివృద్ధి
రామాయంపేట,న్యూస్‌లైన్: మహానేత వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం ఆయన రామాయంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్పర్థి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ దక్కాయన్నారు. ఆ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ప్రతి రైతును లక్షాధికారి చేయాలనే లక్ష్యంతోనే రాజశేఖర్‌రెడ్డి పాలన సాగించారన్నారు. వైఎస్సార్ లాగే ఇచ్చిన మాటకు కట్టుబడటం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమన్నారు. అందువల్లే వైఎస్సార్సీపీ తెలంగాణకోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించారని, పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అభివృద్ధికోసం కృషి చేస్తామన్నారు. అందువల్ల ఓటర్లంతా ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్‌గౌడ్, పరుశురాంరెడ్డి, కిరణ్‌కుమార్, కార్తీక్, రామాయంపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ మాసుల సిద్దరాంలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం పార్టీ అభివృద్ధికోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుగౌడ్ అన్నారు. ఇటీవల ప్రమాదాల్లో మృతి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా సాంసృ్కతిక విభాగం కన్వీనర్ నింగరబోయిన మహేష్, గొల్పర్థి గ్రామానికి చెందిన నడీల రాజయ్యల కుటుంబీకులను గురువారం ఆయన పరామర్శించారు. ఢి.ధర్మారం గ్రామానికి చెందిన నింగరబోయిన మహేష్ గత 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గొల్పర్థి గ్రామానికి చెందిన న డీల రాజయ్య విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. దీంతో గురువారం మృతుల కుటుంబీకులను పరామర్శించిన ప్రభుగౌడ్, పార్టీ అధ్యక్షునితో మాట్లాడి తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. రుద్రారంలో ఇంటింటి ప్రచారం మిరుదొడ్డి: జిల్లాలో ఎక్కడకు వెళ్లినా వైఎస్సార్సీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని వైఎస్సార్ సీపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో దుబ్బాక నియోజక వర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గుప్తతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు రుద్రారం గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ, వైఎస్సార్‌ను అభిమానించే వారంతా వైఎస్సార్సీపీని ఆదరిస్తున్నారనీ, వారి ఆదరాభీమానాలతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతోందన్నారు. అనంతరం రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడిన వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి శోభానాగిరెడ్డి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరి శంకర్, సురేష్, రఘుపతి, నర్సింలు, మహేష్, రాజేశం, జమీర్ పాల్గొన్నారు. -
ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు: కవిత
నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రలోభాలకు గురిచేసి, ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి కె. కవిత ఆరోపించారు. బుధవారం ఆమె నిజామాబాద్ మండలం బోర్గం గ్రామంలో ఎన్నికల ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. 20 యేళ్ళు రాష్ట్రా న్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తెలంగాణకు తీరని అన్యా యం చేశాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు తె లి పారు. తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. అనంతరంపార్టీ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నియోజక వర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్, ఈగ గంగారెడ్డి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే..
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి శూన్యం సింగరేణి కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు డిస్మిస్ కార్మికులందరికి ఉద్యోగాలిప్పిస్తాం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం 4వేల మెగావాట్ల బీపీఎల్ పవర్ ప్రాజెక్టు 50వేల మందికి ఉద్యోగావకాశాలు గోదావరిఖని సభలో కేసీఆర్ గోదావరిఖని, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంత అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ప్రజలందరూ టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన రామగుండం రణభేరి ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పద్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ కల సాకారమైందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలకు చారిత్రక ప్రాధాన్యత ఉందని అన్నారు. 1948లో హైదరాబాద్ నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత 1952లో ఎన్నికలు జరిగాయని, అయితే ఆ సమయంలో చేసిన చిన్న తప్పిదం వల్ల తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురయ్యారని కేసీఆర్ వివరించారు. నాగార్జునసాగర్‌గా పిలవబడుతున్న నందికొండ ప్రాజెక్టుకు మొదట 180 టీఎంసీల నీరు తెలంగాణకు, 60 టీఎంసీల నీరు ఆంధ్రకు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తే ఆనాడున్న తెలంగాణకు చెందిన కొందరు పెద్దలు చేసిన పొరపాటు వల్ల ఆంధ్రకు 132 టీఎంసీలు, తెలంగాణకు 132 టీఎంసీలు కేటాయింపులు చేశారన్నారు. కానీ నేడు చూస్తే అందులో తెలంగాణకు 50 నుంచి 55 టీఎంసీల నీరే వస్తోందని వివరించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సీమాంధ్రుల నుంచి మోసపోకుండా తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ఆయన కోరారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆగమైపోతామని, అనుకున్న పనులు జరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని, ఇది గత పదేళ్ల కాలంలో ప్రజలంతా చూశారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సకలజనుల సమ్మెలో కోల్పోయిన సమ్మె అడ్వాన్స్‌ను తిరిగి ఇప్పిస్తామని, తెలంగాణ ఉద్యోగులతో సమానంగా స్పెషల్ ఇంక్రిమెంట్లు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కొనసాగిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని, డిస్మిస్కు గురైన కార్మికులందరికి ఉద్యోగావకాశాలు తిరిగి కల్పిస్తామని అన్నారు. గోదావరిఖని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, ఎన్టీపీసీలో మాదిరిగా బీపీఎల్ ప్లాంట్‌ను ప్రారంభించి నాలుగు వేల మెగావాట్ల ఆల్ట్రా ప్లాంట్‌ను నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని అన్నారు. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి బాల్క సుమన్, రామగుండం అసెంబ్లీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనం హాజరుకావడంతో టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం కనిపించింది. -
దేశానికి మోడీ పాలన అవసరం
కుల్కచర్ల ,న్యూస్‌లైన్: దేశానికి మోడీ పాలన అవసరమని, ప్రజలు కూడా అతన్ని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీజేపీ పరిగి అసెంబ్లీ అభ్యర్థి కమతం రామిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం భ్రష్టుపట్టిపోయాయన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం కాంగ్రెస్ డబ్బుల పార్టీగా మారిందని, గాంధీ భవనం సీట్లు అమ్ముకునే దుకాణంగా మారిందని ఆరోపించారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, నేడు ఆపార్టీలో గౌరవం లేకనే పార్టీని వీడటం జరిగిందన్నారు. పరిగి నియెజకవర్గంలో తాను మంత్రిగా ఉనప్పుడు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరు దశాబ్దాల పాటు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే జాతీయ పార్టీ బీజేపీకే సాధ్యమన్నారు. 20 సంవత్సరాలుగా పరిగి ప్రజలను ప్రజాప్రతినిధులు మోసం చేస్తున్నారని, తనకు మోసం చేయడం చేతకాదన్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ పరిగి నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నానన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం కావడంలో బీజేపీ కీలకపాత్ర వహించిం దన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాద్‌రావు, నాయకులు వెంకటయ్యగౌడ్, అంజిలయ్య, కుల్కచర్ల సర్పంచ్ జానకీరాం, రవిచందర్, గణేష్, మహిపాల్, చంద్రలింగం, ప్రకాష్, సం తోష్, శ్రీను, రాములు తదితరలు పాల్గొన్నారు. -
మాట తప్పిన కేసీఆర్‌ను ప్రజలు నమ్మరు
ధారూరు, న్యూస్‌లైన్: మాట మీద నిలబడని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు... తెలంగాణ అభివృద్ధి తనతోనే సాధ్యమవుతుందంటే ప్రజలు ఎంతమాత్రం నమ్మరని మాజీ మంత్రి, కాంగ్రెస్ వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం ధారూరులోని రైస్‌మిల్లులో జరిగిన కాంగ్రెస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పి.కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ మాట తప్పడం కేసీఆర్‌కు అలవాటనీ, ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్‌లో విలీనాన్ని, పొత్తును వ్యతిరేకించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనీ, ప్రభుత్వం ఏర్పాటు కాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్తీక్‌ను గెలిపించి సబితారెడ్డి రుణం తీర్చుకుంటా... గతంలో తన గెలుపు కోసం కృషి చేసిన మాజీ హోం మంత్రి సబితారెడ్డి రుణం తీర్చుకునేందుకు ఈ ఎన్నికల్లో ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ రూపురేఖలు మారుస్తాం : కార్తీక్‌రెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రసాద్‌కుమార్‌ను, ఎంపీగా తనను గెలిపిస్తే ఇద్దరం కలిసి వికారాబాద్ నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామని కార్తీక్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తామని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, జూరాల ఎత్తిపోతల ద్వారా జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, ధారూరు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, అంజయ్య, ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్రావు, డీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర్, పీసీసీ నాయకుడు సత్యనారాయణ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కన్నె బిచ్చన్న, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దులూర్ మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి, ధారూరు టీడీపీ, జేఏసీలకు చెందిన 12మంది యువకులు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
చిన్నపరిశ్రమలకు వైఎస్ పెద్దపీట
గెస్ట్ కాలం: ‘సగటు అభివృద్ధి రేటు ప్రకారం చూస్తే పరిశ్రమల సంఖ్య, పెట్టుబడులు, ఉపాధి విషయూల్లో తెలంగాణే అగ్రస్థానంలో ఉన్న విషయుం అర్థవువుతుంది. అలాగే 2004-09 వుధ్యకాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉన్న సంగతి గవునించవచ్చు. తెలంగాణతో పోల్చితే కోస్తాంధ్రలో అభివృద్ధి ఆరుశాతం తక్కువ ఉంది.’ - వి.హనుమంతరావు ఆర్థిక విశ్లేషకులు తెలంగాణ అభివృద్ధిని నిరోధించిన నేతగా డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డిని చిత్రించి చూపడానికి కొందరు ప్రయుత్నించిన సంగతి తెలియునిది కాదు. వారి దృష్టిలో వైఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చిదిమివేసిన వ్యక్తి. ఇది గోబెల్స్ ప్రచారం తప్ప వురొకటి కాదు. దేశంలో చిన్న, లఘు పరిశ్రవుల రంగం ఉత్పత్తుల విలువ 2001- 02 ధరల ప్రకారం రూ.4,71,700 కోట్లు. ఆ పరిశ్రవుల సంఖ్య 130 లక్షలు. వాటిలో పని చేసే వారి సంఖ్య 420 లక్షలు. వాటి ఎగువుతుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.1,77,600 కోట్లు. తయూరీ రంగంలో జరిగే ఉత్పత్తుల్లో 45 శాతం, ఎగువుతుల్లో 40 శాతం చిన్న, లఘు పరిశ్రవులదే. పారిశ్రామికరంగాన్ని పరిశీలించేటపుడు పరి శ్రవుల సంఖ్య, పెట్టుబడి, వాటి ఉత్పత్తుల విలువ ఆధారంగా విశ్లేషిస్తారు. తెలంగాణ అనగానే హైదరా బాద్ నగరాన్ని మినహారుుస్తే మిగిలిన తెలంగాణ జిల్లాలన్నీ వెనుకబడే ఉన్నాయున్నది పలువురి నిశ్చితాభిప్రాయుం. అందుకే ఈ పరిశీలనను ఆంధ్ర, తెలంగాణ, సీవు అనే వుూడు ప్రాంతాలుగా కాకుండా హైదరాబాద్ నగరం ప్రభావం ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు రంగారెడ్డి, మెదక్, వుహబూ బ్‌నగర్ జిల్లాలను కలిపి ఈ ప్రాంతాన్ని హైదరా బాద్ నగర ప్రాంతంగా, మిగిలిన జిల్లాలు (ఆదిలాబాద్, నిజావూబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖవ్ముం) మిగిలిన తెలంగాణగా తీసుకోవడం జరిగింది. కోస్తా జిల్లాలను దక్షిణ కోస్తా గా, ఉత్తర కోస్తా ప్రాంతాలుగా, రాయులసీవు నాలుగు జిల్లాలను వురో ప్రాంతంగా పరిగణించి విశ్లేషించి, అభివృద్ధిని సగటు వార్షికాభివృద్ధి రేటు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం పరిశ్రవుల సంఖ్య, పెట్టుబడి, ఉద్యోగాల విష యూల్లో కోస్తాంధ్ర, రాయుల సీవుల కన్నా తెలంగాణ అగ్రస్థా నంలో ఉంది. (వుూడు ప్రాంతాల గ్రాఫ్ చూడండి... గణాంకాలు పరిశ్రవుల శాఖ ఇచ్చినవి). 2004-09 వుధ్య కాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉంది. కోస్తాంధ్రలో అభివృద్ధి తెలంగాణలో జరిగిన అభివృద్ధి కన్నా ఆరు శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో ఈ పెరుగుదల అంతా వైఎస్ వుుఖ్యవుంత్రిగా ఉన్న కాలంలోనే జరిగిందన్నది గవునార్హం. 2005లో సెజ్‌లు ఏర్పాటు చట్టం రూపొందింది. తరువాత 72 సెజ్‌లను రాష్ట్రంలో నోటిఫై చేయుగా, అందులో 44 సెజ్‌లు (61.1శాతం) తెలం గాణలోనే ఉన్నారుు. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నారుు. చిన్న, లఘు పరిశ్రవుల పనితీరును అధ్యయునం చేయుగా 1995-2009 వుధ్యకాలంలో 2007 - 08, 2008 - 09 సంవత్సరాల్లో ప్రశంసనీయుమైన అభివృద్ధి జరిగింది. 2007-08, 2008-09 సంవత్సరాల్లో హైదరాబాద్ ప్రాంతంలో 50.6, 41.9 శాతం, మొత్తం తెలంగాణ ప్రాంతంలో 44.8 శాతం, 38.3శాతం పెట్టుబడులు పెరిగారుు. ఆంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు ఇంతకన్నా తక్కువే. ఆ పరిశ్రమల్లో 1995-2004 వుధ్యకాలంలో (చంద్రబాబు హయూంలో) పెట్టుబడులు రూ. 163కోట్ల నుంచి రూ. 4,452 కోట్లకు పెరగగా, ఆ తరువాత 2009 వుధ్యకాలంలో రూ. 10,504 కోట్లకు పెరిగారుు. ఇందుగలరందు లేరనే...! రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 1.2 లక్షలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా ఎనభైవేలకు పైగా తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇక ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖ, టూరిజం వంటి ప్రభుత్వ సంస్థల్లో దాదాపు లక్షా ముఫ్పై వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు, పార్ట్‌టైం ఉద్యోగులు, కంటింజెంట్ ఉద్యోగులు, క్యాజువల్ ఉద్యోగులు మరో 30 వేల మందికిపైగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో కాలేజీల్లో 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక హమాలీలు, కూలీలూ అసంఘటిత రంగంలోనే.. అది కష్టాల ‘కుప్ప’ం అది కుప్పం. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ 25 వేల మంది అసంఘటిత కార్మికులు చలువరాళ్లు చెక్కుతారు. పిల్లా జెల్లా ముసలి ముతక కలిపి సుమారు లక్ష మంది జీవిస్తుంటారు. ఆ తెల్లరాయి ఎంతో కఠినమైంది. దాన్ని చెక్కే ఉలి మూణ్ణెళ్లలోనే సగం అవుతుందట. ఆ విరిగిన ఇనుప ముక్కలు కార్మికుల దేహాన్ని తూట్లు పొడుస్తాయి. కళ్లకు తగిలి చూపుపోయిన వారెందరో. వారికి వైద్యం చేయించుకునే దిక్కు లేదు. ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం మోసుకొచ్చి కుప్పంలో వ్యవసాయం అభి వృద్ధి చేశానని చెప్పే చంద్రబాబుకు అదే కుప్పంలో చలువరాతి కొండల్లోని ‘బండ’ బతుకులు కనబడలేదెందుకో? ఆ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సహా యం అందించాలని, కనీస వేతనాలు చెల్లించేలా చూడాలనే ఆలోచన ఏనాడూ రాలేదు... కారుచౌకగా కార్మిక శక్తి... అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులు దొరకడమే దుర్లభం. ఒకవేళ దొరికినా, వారిని నియమించుకుంటే వారికి చెల్లించాల్సిన జీతభత్యాలు తక్కువేమీ కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని కంపెనీ లు తమ పనులను కార్మికశక్తి కారుచౌకగా దొరికే దేశాలకు ‘ఔట్‌సోర్స్’ చేస్తున్నాయి. తృతీయ ప్రపంచ దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను ఒక్కొక్క కార్మికునికి గంటకు చెల్లించే వేతనం డాలరు (రూ.60) కంటే తక్కువే. కార్మికశక్తి కారుచౌకగా దొరికే తొలి పది దేశాలు... 1. మడగాస్కర్ (0.18 డాలర్లు-రూ.10.77), 2. బంగ్లాదేశ్ (0.23 డాలర్లు-రూ.13.77), 3. పాకిస్థాన్ (0.32 డాలర్లు-రూ.19.17), 4. ఘనా (0.32-రూ.19.17), 5. వియత్నాం (0.39 డాలర్లు-రూ.23.36), 6. భారత్ (0.48 డాలర్లు-రూ.28.75), 7. కెన్యా (0.50-రూ.29.96), 8. సెనెగల్ (0.52-రూ.31.16), 9. శ్రీలంక (0.62 డాలర్లు-రూ.37.14), 10. ఈజిప్టు (0.80 డాలర్లు-రూ.47.94). కళ్లు చెదిరే కనీస వేతనాలు... అభివృద్ధి చెందిన పలు దేశాలు కార్మికులకు కళ్లు చెదిరే కనీస వేతనాలను చెల్లిస్తున్నాయి. వారి కనీస వేతనాల ముందు మన దేశంలో కాస్త పెద్ద ఉద్యోగాలు చేసే వారి జీతాలూ దిగదుడుపే. కార్మికులకు గంటకు అత్యధిక కనీస వేతనాలు చెల్లించే తొలి పది దేశాలు... 1. నార్వే (57.53 డాలర్లు-రూ.3446), 2. స్విట్జర్లాండ్ (53.20 డాలర్లు-రూ.3186), 3. బెల్జియం (50.70 డాలర్లు-రూ.3032), 4. డెన్మార్క్ (45.48 డాలర్లు-రూ.2720), 5. స్వీడన్ (43.81 డాలర్లు- రూ.2620), 6. జర్మనీ (43.76 డాలర్లు-రూ.2617), 7. ఫిన్లాండ్ (42.30 డాలర్లు-రూ.2531), 8. ఆస్ట్రియా (41.07 డాలర్లు-రూ.2457), 9. నెదర్లాండ్స్ (40.92 డాలర్లు-రూ.2448), 10. ఆస్ట్రేలియా (40.60 డాలర్లు-రూ.2429). -
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్కే సాధ్యమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ తదితరులు హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్, పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 2లక్షల రుణం, స్వయం సంఘాల మహిళలకు, రైతులకు లక్ష వరకు ఉన్న బ్యాంకు రుణాల మాఫీ, కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు కృషిచేస్తామన్నారు. తమ పార్టీకి నాలుగున్నరకోట్ల ప్రజలే హైకమాండ్ అని హరీష్‌రావు పేర్కొన్నారు. తాము ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బందైపోయిందన్నారు. చివరి నిమిషం వరకు తెలంగాణను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రల చేశారన్నారు. ఆంధ్రావారి నాయకత్వంలో వారి మోచేతి నీళ్లు తాగాల్సిన అగత్యం తెలంగాణ ప్రజలకు లేదని, టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గజ్వేల్ నగర పంచాయతీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, నాయకులు గాడిపల్లి భాస్కర్, నారాయణరెడ్డి, సురేష్‌గౌడ్, చేతిరెడ్డి లింగారెడ్డి, ఆకుల దేవేందర్, మద్ది రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలోనూ అమలుపరిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం కేవలం వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఈసీ శేఖర్ గౌడ్ మోమిన్‌పేటకు వచ్చారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌పై ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని శేఖర్‌గౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ వికారాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి సంజీవరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు హబీబ్ సలాం, మోమిన్‌పేట, మర్పల్లి మండల కన్వీనర్లు అఫ్సర్, మురళీధర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, ఖాదర్, కృష్ణ తదితరులు ఉన్నారు.