
ఎంపీ లక్ష్మీకాంతారావు నివాసంలో స్వాత్మానందేంద్ర మహాస్వామి ఆశీస్సులు తీసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నా రు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు. ఆదివారం వరంగల్‌కు వచి్చ న హరీశ్‌రావు దుర్గాష్టమి సందర్భం గా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర మహాస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేందుకు, రైతాంగానికి ఎలాంటి కష్టా లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాజ్యసభ సభ్యుడు కెపె్టన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.