‘చంద్రబాబును తెలంగాణలో తిరగనీయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను గాలికి వదిలేసి, తెలంగాణ పర్యటనకు వస్తాననడం ఏమిటని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మా సీఎంకు తెలుసు. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి’ అని ఆయన హితవుపలికారు. తెలంగాణ భవ న్‌లో మంత్రి మంగళవారం ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలే యాదయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు.
అసలు పక్క రాష్ట్రం సీఎంకు తెలంగాణలో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది?.. ఇక్కడి టీడీపీ నేతలు చేతగాని డమ్మీలా అని మంత్రి సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆర్థిక భారం గురించి కూడా ఆలోచించకుండా సీ ఎం కేసీఆర్ పనిచేస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.