Transport Minister Mahender Reddy
-
రేపటి నుంచి లారీల నిరవధిక సమ్మె
రోజూ ఐదు వేల లారీలకు బ్రేక్! సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలని, తెలుగు రాష్ట్రాలకు వర్తించే సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లారీ యాజమాన్య సంఘాలు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నాయి. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డితో జరిపిన చర్చలు సైతం అసంపూర్తిగా ముగియడంతో సమ్మె దిశగా లారీ సంఘాలు కార్యాచరణకు సన్నద్ధమవుతు న్నాయి. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు లారీ లను రోడ్డెక్కించబోమని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘంతో కలసి ఈ సమ్మెలో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 30 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు రోజు రాకపోకలు సాగించే సుమారు 5వేల లారీలు స్తంభించనున్నాయి. అంతర్రాష్ట్ర లారీ యజమానులు చేపట్టనున్న ఈ సమ్మెకు స్థానిక లారీల యజమానులు కూడా మద్దతునిచ్చే అవకాశం ఉంది. లారీ సంఘాల ప్రధాన డిమాండ్లివి.. ► ప్రైవేట్ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్ పార్టీ బీమాను ఏప్రిల్ ఒకటి నుంచి 50 శాతం పెంచే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి. ► దేశ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలి. ► 15 ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలి. ► తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యేలా సింగిల్ పర్మిట్‌కు అవకాశం కల్పించాలి. ► ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్‌ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలి. ► లారీల్లో ఓవర్‌లోడ్‌కు లారీ యజమానులను కాకుండా వినియోగదారులు బాధ్యత వహించేలా చట్టాల్లో మార్పులు చేయాలి. -
హెల్మెట్ తప్పనిసరి చేద్దాం
ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే అంశం మరోసారి తెరపైకి వ చ్చింది. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని పోలీసు, రవాణా శాఖలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత చట్టం రూపొందిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది. తాజాగా పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఆగస్టు ఒకటి నుంచి దీనిని అమలులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా శిరస్త్రాణం ధరించడాన్ని తప్పనిసరి చేసే నిబంధనను అమలు చేయాలని తాజాగా పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సాధారణంగా హెల్మెట్ నిబంధన విషయంలో వాహనదారులు అయిష్టత చూపుతారు. హెల్మెట్ వాడకం అలవాటులేని వారు దాన్ని చిరాకుగా భావిస్తూ వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అందుకు సుముఖంగా ఉన్నట్టు కనిపించటం లేదు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. రోడ్డు భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవలే జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఈ సమయంలో హెల్మెట్ నిబంధనను రెండు శాఖలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయినా ఇప్పటి వర కు అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. - సాక్షి, హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి.. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి దాదాపు పదేళ్ల క్రితమే హెల్మెట్ ధారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ అధికారి ఒత్తిడితో దాన్ని తప్పనిసరి చేస్తూ అమలు మొదలైంది. కానీ, వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, హెల్మెట్ కంపెనీల కోసం పోలీసులు హడావుడి చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరగటం, దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై చర్చ జరుగుతున్న తరుణంలో పోలీసు, రవాణా శాఖలు మళ్లీ దీనిపై దృష్టి సారించాయి. కానీ త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నిబంధనపై వాహనదారుల్లో వ్యతిరేకత వస్తే.. అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనే దీనికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు దీనిని పట్టించుకోని పోలీసు శాఖ క్రమంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అలాగే గత కొన్ని రోజులుగా హెల్మెట్ నిబంధనకు సంబంధించి చలానాలు విధించటాన్ని తీవ్రం చేసినట్టు సమాచారం. సగటున నిత్యం 100కుపైగా చలానాలు విధిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ‘రోడ్డు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. వాహనదారుల రక్షణ దృష్ట్యా హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలి. దాన్ని అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అనుమతివ్వడమే తరువాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చిస్తాం రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ‘హెల్మెట్ ధారణను తప్పనిసరి చేసే విషయంలో తుదినిర్ణయం తీసుకోలేదు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తాం. అంతకుముందు పోలీసు, రవాణా శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.6.60కోట్లు
రంగారెడ్డి జిల్లా: జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.60 కోట్లు మంజూరు చేసింది. రెండు విభాగాల్లో పనులను ఎంచుకుని ఖర్చు చేయాలని సూచించింది. విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్) కింద రూ. 2.33 కోట్లు, విపత్తుయేతర సహాయ నిధి (నాన్ సీఆర్ఎఫ్) కింద రూ. 4.27 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 572 ఆవాసాల్లో గుర్తించిన 824 పనులు పూర్తిచేయనున్నారు. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఈ నిధులు అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిధులకు సంబంధించిన పనుల వివరాలను తెలుసుకున్నారు. గుర్తించిన పనులను సెప్టెంబరులోగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నీటి వినియోగంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని ఈయన సూచించారు. సమావేశంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబును తెలంగాణలో తిరగనీయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను గాలికి వదిలేసి, తెలంగాణ పర్యటనకు వస్తాననడం ఏమిటని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మా సీఎంకు తెలుసు. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి’ అని ఆయన హితవుపలికారు. తెలంగాణ భవ న్లో మంత్రి మంగళవారం ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలే యాదయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. అసలు పక్క రాష్ట్రం సీఎంకు తెలంగాణలో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది?.. ఇక్కడి టీడీపీ నేతలు చేతగాని డమ్మీలా అని మంత్రి సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆర్థిక భారం గురించి కూడా ఆలోచించకుండా సీ ఎం కేసీఆర్ పనిచేస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
►పంటలను కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది ►రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మొయినాబాద్ రూరల్: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అమ్డాపూర్ ఈసీవాగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఈసీ, కాగ్నా, మూసీవాగులతో పాటు కుంటలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పారు. వరదనీరు ప్రవహిస్తున్న తీరును గమనించి ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రయాణికులు చిన్నచిన్న కాలువలను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీవర్షాలతో వాగులు, కుంటలు నిండి చుట్టుపక్కల ఉన్న పంటపొలాలు నీట మునిగాయని చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా పలికారు. ఈసీవాగును సందర్శించిన వారిలో ఎమ్మెల్యే కాలెయాదయ్య, ఆర్ఐ రాజు, వీఆర్ఓ విష్ణుగౌడ్, సర్పంచ్ సిద్ధయ్య, ఎంపీటీసీ సామరాంరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహ్మరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, నర్సింహ్మచారి, శ్రీహరియాదవ్, సామ రవీందర్‌రెడ్డి, రవీందర్‌చారి, సంజీవరెడ్డి, కొండల్‌గౌడ్ తదితరులున్నారు. రాకపోకలు బంద్ పరిగి పరివాహక ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరదనీరు రావటంతో ఈసీవాగు ప్రవాహం జోరందుకుంది. ఈ వాగు మండల పరిధిలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, అమ్డాపూర్‌ల మీదుగా హిమాయత్‌సాగర్‌కు చేరుతుంది. వాగులోకి భారీగా వరదనీరు రావటంతో చుట్టపక్కల పంటపొలాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. అమ్డాపూర్ వద్ద ఉన్న ఈసీవాగు వంతెన సమీపంలో లోతట్టుగా ఉన్న కంచెమడుగు ప్రదేశం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. మొయినాబాద్, శంకర్పల్లి నుంచి శంషాబాద్‌కు ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాని వరదనీటితో రాకపోకలకు ఆటంకం కలిగింది.