బాబు పర్యటనతో ఒరిగేదేమీ లేదు:ఎంపీ కవిత | telangana won't get any benifit with babu's tour, says kavitha | Sakshi
Sakshi News home page

బాబు పర్యటనతో ఒరిగేదేమీ లేదు:ఎంపీ కవిత

Published Thu, Feb 12 2015 8:38 PM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM

బాబు పర్యటనతో ఒరిగేదేమీ లేదు:ఎంపీ కవిత - Sakshi

బాబు పర్యటనతో ఒరిగేదేమీ లేదు:ఎంపీ కవిత

అదిలాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్రంతో పనేంటని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా గురువారం ఆమె ఆదిలాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్ర సీఎం తెలంగాణలో పర్యటించడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎంపీ కవిత తెలిపారు. పక్క రాష్ట్ర సీఎం వస్తే ఎలా చూస్తామో బాబును కూడా అలాగే చూస్తామన్నారు. ఆయన వచ్చి పర్యటించినా.. ఆయనకు ఇక్కడ మిగిలింది ఇద్దరు ముగ్గురే అని.. మరి కొన్ని రోజుల్లో వారు కూడా ఉండరని ఎద్దేవా చేశారు.చంద్రబాబు తెలంగాణకు ఎందుకొస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 43 శాతం పీఆర్సీని ప్రకటించిన తర్వాత ఆ ముఖ్యమంత్రి అంతే శాతం పీఆర్సీని ప్రకటించారన్నారు. మన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. ఇక ముందు ఆయన వస్తే వెళ్లిపోయే వాళ్లు ఎవరూ ఉండరన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి తప్ప మరే పార్టీకి మనుగడ ఉండదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement